డిన్నర్ చేస్తుండగా వచ్చి కాల్పులు జరిపాడు
పెరూ: అది పెరూలోని హ్వారల్ అనే ప్రాంతంలోని ఓ చికెన్ రెస్టారెంటు. క్రిస్మస్ నేపథ్యంలో కస్టమర్లతో నిండుగా ఉంది. అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కటి విందు ఆరగిస్తూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి సాధారణ వ్యక్తిలా వచ్చాడు. నేరుగా జేబులో నుంచి తుపాకీ తీసి అతి సమీపం నుంచి గురిపెట్టాడు. టకటకా అలెగ్రీ రివేరా (32), రాఫెల్ త్రినిడాడ్ (37) అనే ఇద్దరు వ్యక్తులపై ఫైరింగ్ చేశాడు.
దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో అప్పటి వరకు సరదా నిండిన ఆ రెస్టారెంటును ఒక్కసారిగా భయం అలుముకుంది. తాను డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోవడంతోనే వారిపై అతడు కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు. పెరూలో దారుణం చోటుచేసుకుంది.