Gunman
-
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహిత సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు. 39 ఏళ్ల కపడే తన సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జమ్నేర్ పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ షిండే పేర్కొన్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారుప్రాథమిక విచారణ ద్వారా వ్యక్తిగత కారణాల వల్ల జవాన్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కపడే మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య ఘటనపై జమ్మేర్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ కల్పిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్యక్తిగతంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నది.మరోవైపు, వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘటనపై SRPFస్వతంత్ర విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
సిద్దిపేట జిల్లాలో విషాదం
-
భార్య, పిల్లల్ని చంపేసి.. సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తొల్‌తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలై నరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఏమన్నారంటే.. 11గంటల 15 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది 2013బ్యాచ్ కి చెందిన నరేష్ సర్వీస్ రివాల్వర్‌తో కుటుంబ సభ్యులను కాల్చి, తనను తాను కాల్చుకొని మరణించాడు కొంత అప్పులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది ఆన్ డ్యూటీ లో ఉండగా ఈ ఘటన జరిగింది నరేష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కనుక్కుంటాం మృతుల వివరాలు ఆకుల నరేష్, కానిస్టేబుల్, వయస్సు 35 సంవత్సరాలు, ARPC 2735, ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆకుల చైతన్య, నరేష్ భార్య, వయస్సు 30 సంవత్సరాలు ఆకుల రేవంత్, వయస్సు 6 సంవత్సరాలు, 1st క్లాస్ విద్యార్థి ఆకుల రిషిత, వయస్సు 5 సంవత్సరాలు, UKG విద్యార్థిని ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మంత్రి సబిత గన్‌మెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్‌తో కాల్చుకుని ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని మంత్రి సబితా పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, ఫాజిల్ ఉదయం ఆరుగంటలకు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత పిస్తోల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
అమెరికా మరొకసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూమెక్సికోలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా, అందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సైతం ఉన్నారు. గాయపడ్డ పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ తన ఫేస్బుక్ అకౌంట్లో తెలిపింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో అనుమానితున్ని పోలీసులు హతమార్చారు. 18 ఏళ్ల యువకుడు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చర్చికి బయటే హతమార్చినట్లు పేర్కొన్నారు. అయితే మృతులు వివరాలను కానీ, గాయపడిన వారి వివరాలను కానీ పోలీసులు వెల్లడించలేదు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. కాల్పులకు కారణం తెలియరాలేదన్నారు. ఈ కాల్పుల ఘటనను కొంతమంది వీడియో రూపంలో చిత్రీకరించడమే కాకుండా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో వచ్చిన ఆ 18 ఏళ్ల యువకుడు చేతిలో గన్ పెట్టుకుని హల్చేశాడు. ఈ క్రమంలోనే న్యూ మెక్సికోలోని క్రిస్ట్ సైంటిస్ట్ ఫస్ట్ చర్చి బయట కాల్పులకు దిగాడు. అయితే వెంటనే తేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని హతమార్చడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు. కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. అగ్రరాజ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా వస్తారనే భరోసా లేకుండా ఉంది. ఏ క్షణంలో ఎవరు కాల్పులకు తెగబడతారో చెప్పలేని దుస్థితి నెలకొంది. -
హైస్కూల్‌తో తుపాకీతో రెచ్చిపోయిన యువకుడు.. భీకరంగా కాల్పులు..
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హైస్కూల్లో ఓ సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని షూట్ చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు సహా మరో ఇద్దరు బాధితులు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో ఓ మహిళ, ఓ టీనేజర్ ఉన్నారు. ఉదయం 9:10 గంటలకు తమకు కాల్పులు జరుగుతున్నట్లు ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. 2 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ లోపల పెద్ద తుపాకీతో ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు విద్యార్థులు తమకు తెలిపారని, వెంటనే అతడ్ని షూట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి వయసు 20 ఏళ్లు పైబడి ఉంటుందని, అతడి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని.. -
ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో...
కదిరి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన షేక్షావలీకి చెందిన పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్లో ఇటీవల జరిగిన రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షేక్షావలీ తన సమీప బంధువు ఇంతియాజ్‌తో కలిసి సుమారు రెండేళ్లుగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇందులోని రిసెప్షన్‌కు ఎదురుగా వెయిటింగ్ హాల్లో కొద్దిరోజుల క్రితం 18 ఏళ్లలోపు యువతితో 30 ఏళ్ల వయసున్న యువకుడు జరిపిన రాసలీలల వ్యవహారం కాస్త ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యం జన రద్దీ ఉండే బైపాస్‌రోడ్డులోని ఫ్యామిలీ రెస్టారెంట్లోనే ఈ వ్యవహారం జరగడంతో పట్టణంలోనే కాదు..ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. రంగంలోకి పోలీసులు.. అరబిక్ రెస్టారెంట్లో ఇలాంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ రెస్టారెంట్లోనే పని చేసే ఓ వ్యక్తి ఈ దృశ్యాలను బయట పెట్టినట్లు హోటల్ యాజమాన్యం భావిస్తోంది. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రెస్టారెంట్లో రద్దీ లేని సమయంలో ఇది జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. విషయం పట్టణ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యువతి కదిరి పట్టణానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణకు వచ్చారు. కందికుంటకు సన్నిహితుడు .. అరబిక్ రెస్టారెంట్ నిర్వహించే షేక్షావలీ అత్తార్ చాంద్‌బాషా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు గన్‌మెన్‌గా పనిచేశారు. షేక్షా వ్యవహారాలు నచ్చక అత్తార్ ఆయన్ను దూరం పెట్టారు. తర్వాత ఆయన విధులకు దీర్ఘకాలిక సెలవు పెట్టి కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చెంత చేరారు. 2019 ఎన్నికల సమయంలో కందికుంటకు అన్నివిధాలా సహకరించారు. అలాగే ఆయన పట్టణంలో రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం మా రెస్టారెంట్లో అది జరిగి చాలా రోజులైంది. దీనిపై ఈ మధ్యే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. మా హోటల్లో పని చేస్తూ ఇటీవల వెళ్లిపోయిన ఓ వ్యక్తి కారణంగానే ఇది బయటకొచ్చినట్లు అనుమానంగా ఉంది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా అది మా రెస్టారెంట్లోనే జరిగిందని ఒప్పుకుంటున్నాం. – ఇంతియాజ్, రెస్టారెంట్ ఓనర్ (చదవండి: హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్ల పట్టుకుని ఈడ్చుకెళ్లి...) -
టెక్సాస్ నరమేధం.. పిల్లలపై కిరాతకుడి కాల్పులకు కారణం ఇదే!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 19 మంది పిల్లలను, ఇద్దరు టీచర్లను!. పిల్లలని కూడా కనికరం లేకుండా కిరాతకంగా కాల్పులకు తెగబడ్డాడు సాల్వడోర్ రామోస్. ఎందరో కన్నతల్లులకు కడుపు కోత మిగిల్చాడు. కేవలం 18 ఏళ్ల కుర్రాడు.. ఇంత మారణహోమానికి పాల్పడడం సాధ్యమేనా? అసలు ఏ పరిస్థితులు అతనితో ఇంత దురాగతం చేయించాయి? ఘటనకు ముందు సోషల్ మీడియాలో అతను మెయింటెన్ చేసిన సస్పెన్స్ ఏంటంటే.. నార్త్ డకోటాలో పుట్టిన రామోస్.. యువాల్డేలో నివాసం ఉంటున్నాడు. యువాల్డే హైస్కూల్లో విద్యార్థి ఒకప్పుడు అతను. అయితే మధ్యలోనే చదువు మానేసి.. ఓ ఫుడ్‌కోర్టులో ఉద్యోగానికి కుదిరాడు. పని చేసే చోటా.. ఎవరితో పెద్దగా మాట్లాడని సాల్వడోర్.. పద్దెనిమిదేళ్లు నిండాకే దాడికి పాల్పడాలనే ఉద్దేశంతో గన్స్ కొనుక్కున్నాడని అతని స్నేహితుడొకరు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు.. పద్దెనిమిదేళ్లు దాటిన తర్వాత దాడి చేయాలని ముందుగానే సిద్దమై ఉన్నాడు సాల్వడోర్ రామోస్. టెక్సాస్ గత సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. 18-21 ఏళ్ల మధ్య వయస్కులు ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడొచ్చు. అందుకు.. కుటుంబ రక్షణ, ఆగంతకుల నుంచి రక్షణ, అత్యాచారం నుంచి రక్షణ.. వేశ్య గృహాలకు అమ్మేసే పరిస్థితులు ఎదురైనప్పుడు.. లాంటి బలమైన కారణాలు ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే తుపాకీని ఉపయోగించాలి. అదీ లైసెన్స్ లేకుండానే ఉపయోగించొచ్చని చేసిన చట్టం కొంప ముంచింది ఇప్పుడు. తన పద్దెనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రామోస్.. ఆ తుపాకులను కొనుక్కొచ్చాడు. అంతేకాదు సోషల్ మీడియా(ఇన్‌స్టా)లోనూ ఆ ఫొటోలను సరదాగా షేర్ చేశాడు. పైగా లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ యువతిని సైతం ట్యాగ్ చేసి.. ఆమెతో ఛాటింగ్ చేశాడు. ఆ తుపాకులు ఎందుకంటే.. అంటూ ఓ సస్పెన్స్ కూడా క్రియేట్ చేశాడు. అవే ఫొటోలను రామోస్ తన స్కూల్ ఫ్రెండ్‌కు కూడా పంపాడు. ఇప్పుడు తను చాలా మారిపోయానని, అసలు గుర్తుపట్టలేవంటూ ఆ స్నేహితుడితో ఛాట్ చేశాడట. అవమానాలే కారణం.. చింపిరి జుట్టు, దుస్తులు సరిగా లేకపోవడంతో.. స్కూల్లో స్నేహితులు సాల్వడోర్ రామోస్‌ను ఘోరంగా అవమానించేవాళ్లట. పైగా అతని మీద రాళ్లతో సైతం దాడులు చేసేవారని సదరు స్నేహితుడు వెల్లడించాడు. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం సాల్వడోర్ను మానసికంగా దిగజార్చిందని ఆ స్నేహితుడు చెబుతున్నాడు. ఇది భరించలేకే స్కూల్ మానేశాడు సాల్వడోర్ రామోస్. ఈ పరిణామాలతో సంఘం మీద విరక్తి చెంది(సోషియోపాత్).. ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని సదరు స్నేహితుడు చెప్తున్నాడు. జోకర్ సినిమాలో లీడ్ క్యారెక్టర్.. ఇలాంటి పరిస్థితులతో మారణహోమాలకు నెలవు అవుతుంది. ఇక పని చేసే ఫుడ్కోర్టులోనూ సాల్వడోర్ రామోస్.. ముభావంగా ఉండేవాడని, పని చేయడం, జీతం తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. కాల్పులకు రెండు గంటల ముందు వరకు లాస్ ఏంజెల్స్‌కు చెందిన యువతితో ఛాటింగ్ చేశాడు సాల్వడోర్. విశేషం ఏంటంటే.. ఆ యువతికి సాల్వడోర్‌కు అసలు పరిచయమే లేదు. నేరుగా ఇన్‌స్టాలో ఆమెకు తుపాకుల ఫొటోలను ట్యాగ్ చేశాడు. పైగా 11గంటల వరకు ఆగితే విషయం ఏంటో తెలుస్తుందని ఆమెకు మెసేజ్ కూడా చేశాడు. చెప్పిన టైంకి అరగంటల తర్వాత అంటే.. మంగళవారం ఉదయం 11.30గం. సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి తుపాకులతో ప్రవేశించి.. కాల్పులతో విరుచుకుపడ్డాడు. చిన్నారులను, ఇద్దరు టీచర్లను బలిగొన్నాడు. అంతకంటే ముందు.. తన బామ్మను సైతం కాల్చి చంపాడు దుండగుడు. చివరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో రక్తపు మడుగులో పడి ప్రాణం విడిచాడు కిరాతకుడు. -
ఆ భూమి మాది, నేను మంత్రి గన్‌మెన్‌ని.. తలుచుకుంటే..
సాక్షి,హసన్‌పర్తి(వరంగల్): భూతగాదాల్లో ఓవైపు నగర కమిషనర్ ఉక్కుపాదం మోపుతుంటే.. మరో వైపు పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూ కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతుండగా, వారికి గన్మెన్లు కూడా ఒక అడుగు ముందుకు వేశారు. తన భార్య, సంబంధీకుల భూమిగా చెబుతూ రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. తాము పోలీస్.. ఓ మంత్రి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నా అంటూ ఏదైనా చేయవచ్చని రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. నాలుగేళ్లుగా సమస్య సాగుతూనే ఉంది. చివరికి బాధిత రైతు కొంరయ్య ఇటీవల నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కమిషనర్ విచారణకు ఆదేశించారు. స్థానిక ఏఎస్సై ప్రకాష్‌రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. వివరాలు.. హసన్‌పర్తి మండలం వంగపహాడ్ శివారులోని సర్వే నంబర్ 527లో 2.30 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి సిలువేరు కొంరయ్య పట్టాదారుడిగా కొనసాగుతున్నాడు. పక్కనే సర్వే నంబర్ 529లో సుమారు 3.16 ఎకరాల భూమి పొలం ధర్మారెడ్డికి చెందినది. ఈ భూమిని ధర్మారెడ్డి విక్రయించాడు. ఇందులో మంత్రి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ భార్య, బావమరదులకు ఇంచు భూమి కూడా లేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పూర్వీకుల నుంచి వచ్చినదని బాధితుడు చెప్పాడు. వీరికి భూమి లేకున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో వివరించాడు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో కొంరయ్య విజ్ఞప్తి చేశాడు. చదవండి: వరంగల్‌లో పరువు హత్య.. అంజలి ప్రేమవ్యవహారం నచ్చక.. -
ధైర్యంగా ఉండండి..
కొణిజర్ల: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, కుమారుడు, తమ్ముడిని కోల్పోయిన గన్‌మన్ కుటుంబాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తన సతీమణి గౌతమితో కలసి పరామర్శించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ కలెక్టర్ వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న జెర్రిపోతుల నాగరాజు భార్య సంధ్య, కుమారుడు మహంత్, తమ్ముడు పుల్లారావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో నాగరాజు స్వగ్రామమైన కొణిజర్లకు శుక్రవారం రాత్రి భార్యతో కలసి వచ్చిన కలెక్టర్ గౌతమ్ వారి కుటుంబాన్ని ఊరడించారు. కలెక్టర్ సతీమణి గౌతమి.. నాగరాజు కుమార్తె, ఆయన తమ్ముడి కుమారుడిని ఎత్తుకుని ఊరడించడమే కాకుండా పుల్లారావు భార్యను ఓదార్చారు. పుల్లారావు భార్య పద్మను ఓదారుస్తున్న కలెక్టర్ సతీమణి గౌతమి -
కెనడాలో కాల్పుల మోత
టొరంటో: కెనడా చరిత్రలోనే అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో మహిళా పోలీసు అధికారి సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. ఈ దారుణం నొవాస్కోటియా ప్రావిన్స్ పొర్టాపిక్ పట్టణంలో ఆదివారం జరిగింది. గాబ్రియేల్ వర్ట్మన్(51) హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్‌మౌత్‌లో కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తుంటాడు. ఇతడికి పొర్టాపిక్లో సొంతిల్లు ఉంది. పోలీసు యూనిఫాం ధరించి, పెట్రోలింగ్ వాహనం మాదిరి ఎస్‌యూవీలో తనుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరోప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని ఇళ్లకు నిప్పుకూడా పెట్టాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా పోలీసు అధికారి చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనల్లో వర్ట్మన్తోపాటు సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రశాంతతకు మారుపేరైన తమ పట్టణంలో ఇంతటి ఘోరం జరుగుతుందని తాము ఎన్నడూ ఊహించలేదని స్థానికులు తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 1989లో మాంట్రియేల్లోని ఎకోల్ పాలిటెక్నిక్ కాలేజీలో మార్క్ లెపిన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో 14 మంది మహిళలు చనిపోయారు. -
కాల్పుల కలకలం.. 20 మంది మృతి
టెక్సాస్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా, మరో 26మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడు రోజుల వ్యవధిలో వాల్మర్ట్ స్టోర్‌లో కాల్పులు జరగడం ఇది రెండోసారి. కాల్పులు జరిపిన దుండగుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చింతమనేని గన్‌మెన్ హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అనుకుంటే అతని గన్మెన్లు కూడా ఏమాత్రం తీసి పోవడం లేదు. ఏలూరులో పోస్ట్‌ల బ్యాలెట్ వద్ద చింతమనేని ప్రభాకర్ మాజీ గన్‌మాన్ లక్ష్మణ్ హల్చల్ చేస్తూ.. ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేశాడు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం ఉదయం నుంచి యూనిఫామ్‌లోనే కాలేజీ ప్రాంగణం అంతా తిరుగుతూ.. చింతమనేని ప్రభాకర్‌కు ఓటేయ్యాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో లక్ష్మణ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే లక్ష్మణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. లక్ష్మణ్ దెందులూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికి.. చింతమనేని సేవలోనే తరిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కార్యక్రమల్లో పార్టీ కార్యకర్తగా సేవలు కూడా అందిస్తున్నారు. చింతమనేని అండదండలుండటంతో ఉద్యోగానికి హాజరు కానప్పటికి చర్యలు శూన్యం. ఈ క్రమంలో కానిస్టేబుల్‌గా ఉంటూ అధికారులను సైతం పేరు పెట్టి పిలుస్తూ.. వారిని కూడా బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అయితే లక్ష్మణ్ ఎన్ని వేషాలేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
గన్ .. బుల్లెట్ల బ్యాగు చోరీ
తిరుపతి క్రైం : గణపతి నగరం ఎమ్మెల్యే గన్‌మెన్ బ్యాగు తిరుపతి రైల్వే స్టేషన్లో బుధవారం చోరీకి గురైంది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా గణపతి నగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు గన్‌మెన్ శంకరరావు బందోబస్తు నిమిత్తం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. బ్యాగును రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉంచి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి దాన్ని చోరీ చేశాడు. దీంతో గన్‌మెన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో గన్, 20 రౌండ్ల బుల్లెట్లు, 20 రౌండ్ల మ్యాగ్జిన్, డబ్బులు ఉన్నట్టు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు సీఐ చంద్రబాబునాయుడు స్పెషల్ టీమ్‌తో తనిఖీ లు చేపట్టారు. ఈ క్రమంలో ఏడుకొండల బస్టాండులో బ్యాగు లభ్యమైంది. అందులో అన్నీ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
మహిళతో గన్‌మెన్ వివాహేతర సంబంధం
మొయినాబాద్(చేవెళ్ల): మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ గన్‌మెన్ అడ్డంగా దొరికిపోయాడు. మహిళ భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన గన్‌మెన్.. అతడిని కాలుస్తానని సర్వీస్ గన్ తీయ డం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు అడ్డుకుని నిందితున్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘ టన మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ లో సోమవారం రాత్రి జరిగింది. సింగప్పగూడ గ్రామానికి చెందిన చాకలి రమేష్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాచకొండ అడిషనల్ డీసీపీ శిల్పవల్లి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, నిజాంపేట్ మేడిపల్లి గ్రామానికి చెందిన రాజు తన కుటుంబంతో మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ గ్రామానికి వలస వచ్చాడు. రాజు భార్యది, రమేష్‌ది ఊరు ఒకటే కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రాజు తన భార్యతో రమేష్‌ను చూసి దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే రమేష్.. కాల్చిచంపుతానంటూ తన వద్ద ఉన్న సర్వీస్గన్ తీసి రాజును బెదిరించాడు. గొడవకు చుట్టుపక్కలవారు వచ్చి రమేష్‌ను పోలీసులకు అప్పగించారు. కాగా రమేష్‌ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎంపీ గన్‌మ్యాన్ భార్య ఆత్మహత్య
-
‘అమ్మతోడు.. కల్వకుంట్ల పాలన అంతు చూస్తా’
సాక్షి, హైదరాబాద్ : కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్‌లను ఓడించడానికి ఏమైనా చేయండి అని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవంటూ ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రకటించారు. రేవంత్ రెడ్డిపై జరిగిన దాడులను ఖండిస్తూ ఆయనకి అండగా నిలుస్తాన్నారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని తనకు ముందే సమాచారం అందిందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయడానికి టీఆర్ఎస్ ఇలా కక్ష్యా పూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఈ నెల 18, 19 తేదీల్లో ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ముఖ్యుల సమావేశం జరిగిందని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, రేవంత్, సంపత్‌లను ఓడించడానికి ఏమైనా చేయండి అని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారంటూ సంపత్ ఆరోపించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను ఖండిస్తుందని.. రేవంత్ రెడ్డికి అండగా ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ నేతల్లో అహంకారం పెరిగిపోయిందని. అడ్డు వస్తే దేవుడిని కూడా ఎదిరిస్తాం అనే స్థాయికి చేరారంటూ మండిడ్డారు. కానీ లిమిట్స్ క్రాస్ చేస్తే దేవుడు కూడా క్షమించడని గుర్తు చేశారు. ఇన్ని రోజులు గన్మెన్లను ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం ఇప్పుడు గన్మెన్లను ఇస్తామంటున్నారు. అంటే దీని వెనక ఉన్న మతలబు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కల్లకుంట్ల ప్రభుత్వం ఉన్నంత వరకూ ప్రభుత్వం నుంచి తాను ఏం తీసుకోనని తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ ‘మా అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. కల్వకుంట్ల ఖాన్ దాన్ పాలనను అంతం చేసే వరకూ పోరాడుతూనే ఉంటానం’టూ ప్రతిజ్ఞ చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పుల కలకలం
కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉత్తర కాలిఫోర్నియాలోని మారు మూల ప్రాంతమైన థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ట్రక్‌పై వచ్చిన దుండగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్ గేట్‌ను ఢీకొట్టి స్కూల్పైకి కాల్పులు జరిపాడు. బుల్లెట్ల శబ్ధాలతో స్కూల్ ఆవరణ మారుమోగిపోయింది. భయాందోళనలతో విద్యార్థులు, టీచర్లు తరగతి గదుల్లోని డెస్కులు, బెంచ్‌ల కింద తలదాచుకున్నారు. అనంతరం ఇష్టానుసారంగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, పదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత పోలీసులకు దుండగుడికి మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో దుండగుడిని మట్టుపెట్టారు. దుండగుడు కాల్పులు జరపడానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
మిస్ ఫైర్‌తో మంత్రి ‘ఆది’ గన్‌మ్యాన్ మృతి
కడప అర్బన్: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌గా (ఏఆర్ పీసీ 1245) బసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (45) గురువారం తన ఇంట్లో ‘పిస్టల్’ని శుభ్రపరుస్తుండగా పేలడంతో మృతి చెందారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా వున్నాయి. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం అంబవరానికి చెందిన బసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ‘పిస్టల్’ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా పేలి బుల్లెట్ అతని ఛాతీ కింది భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి కడపలోని హిమాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు రిమ్స్‌లో వైద్యులు నిర్ధారించారు. అతని మృతదేహాన్ని జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పిస్టల్’ను శుభ్రం చేస్తుండగా దురదృష్టవశాత్తు పేలడంతో ప్రమాదం జరిగిందన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేశవ్ రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
గన్‌మెన్‌ను సరెండర్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంశీ
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. టు ప్లస్ టు గన్మెన్లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు అయితే ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనకు అదనంగా సెక్యూరిటీ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కి తిప్పి పంపించివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ...‘నా గన్‌మెన్‌కు కేవలం ఒక పిస్టల్ ఇచ్చారు. కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదు. మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా లైసెన్స్డ్ ఆయుధాలు మూడింటిని రెన్యువల్ కోసం పోలీస్ స్టేషన్లో అప్పగించా. కనీసం వాటిని కూడా తిరిగి ఇవ్వలేదు’ అని అన్నారు. -
అమెరికాలో కాల్పుల మోత..!
ప్రజాప్రతినిధులపై పేలిన తూటా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్కు సమీపంలోని వర్జినీయా ప్రాంతంలో ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం బేస్‌బాల్ ఆట ఆడుతుండగా రైఫిల్ తో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రతినిధుల సభ మెజారిటీ విప్, రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ గాయపడ్డాడు. పలువురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సాయుధుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్వేతజాతీయుడైన ఓ సాయుధుడు రైఫిల్‌తో ప్రజాప్రతినిధులు బేస్‌బాల్ ఆడుతున్న మైదానానికి వచ్చి కాల్పులకు దిగాడని, దీంతో అక్కడ ఒక్కసారిగా 50 నుంచి వందరౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షి అయిన అలబామా ప్రజాప్రతినిధి మో బ్రూక్స్ తెలిపారు. ఈ కాల్పులతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని చెప్పాడు. రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ పిరుదు భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అదేవిధంగా ఈ కాల్పుల్లో చట్టసభ సిబ్బంది, పోలీసులు కూడా గాయపడ్డారని ఆయన సీఎన్ఎన్ చానెల్‌కు తెలిపారు. -
అమెరికాలో కాల్పుల కలకలం..
-
అమెరికాలో కాల్పుల కలకలం..
సిన్సినాటీ నైట్ క్లబ్లో కాల్పులు ⇒ ఒకరు మృతి.. మరో 15 మందికి గాయాలు ⇒ లాస్వేగాస్లో బస్సులో కాల్పులు.. ఒకరి మృతి సిన్సినాటీ(అమెరికా): అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి విజృంభించింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మరణించగా.. మరో 16 మంది గాయాలపాలయ్యారు. సిన్సినాటీ లోని కేమియో నైట్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయం లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వీకెండ్ కావడంతో కిక్కిరిసిన నైట్‌క్లబ్‌లో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు లేవని అసిస్టెంట్ పోలీస్ చీఫ్ పాల్ న్యూడిగేట్ చెప్పారు. కాల్పులకు గల కారణాలు తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నా మన్నారు. ఈ ఘటనకు సంబంధించి నింది తులెవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. కాల్పులకు పాల్పడింది ఒకే దుండగుడని సమాచారం అందిందని, ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. నైట్ క్లబ్లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెపుతున్నారు. బస్సులో ఘాతుకం.. అమెరికాలో టూరిస్ట్ స్పాట్ లాస్వేగాస్లో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో బస్సులోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. అనంతరం దుండగుడు పోలీసులకు లొంగిపోయాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో కాస్మోపాలిటన్ హోటల్ క్యాసినో సమీపంలో డబుల్ డెక్కర్ బస్సులోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. హైడ్రామా నడిచిన తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో దుండగుడు తన వద్ద ఉన్న హ్యాండ్ గన్‌తో పాటు లొంగిపోయాడని లాస్‌వెగాస్ పోలీస్ అధికారి ల్యారీ హాడ్ఫిల్డ్ చెప్పారు. ఒకే వ్యక్తి ఉండటంతో దీనికి ఉగ్రవాద సంబంధాలు ఉండే అవకాశాలు లేవని చెప్పారు. -
అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా సిన్సినాటీలోని ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. నైట్‌క్లబ్‌లో ఆనందంతో కేరింతలు కొడుతున్న వారిపై ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారని స్థానిక అమెరికా మీడియా తెలిపింది. సిన్సినాటీ నగరంలోని కెల్లోగ్ అవెన్యూలో ఉన్న కేమియో క్లబ్లో ఈ కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కబ్ల్ నుంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం
హుస్టన్: అమెరికాలోని మళ్లీ కాల్పుల మోత మోగింది. హుస్టన్‌లోని ఓ షాపింగ్ మాల్లో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానిత సాయుధుడిని హతమార్చారు. ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో నగరంలో ఎమర్జెన్సీ అలర్ట్ విధించారు. హుస్టన్ వాయవ్య నగరంలో ఓ స్ట్రిప్ షాపింగ్ మాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ఎవరైనా మృతిచెందారా? వంటి విషయాలు ఇంకా తెలియరాలేదు. కానీ పలువురిని సమీపంలోని ఆస్పత్రుల తరలించినట్టు హుస్టన్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. కాల్పుల ఘటన పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగరవాసులకు సూచించారు. అంతేకాకుండా కాల్పులు జరిగిన ప్రదేశంలో బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. -
సైనికుడే ఆ హంతకుడు!
న్యూయార్క్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోగల బాటన్ రూజ్ లో పోలీసు అధికారులపై కాల్పులు జరిపిన వ్యక్తి ఓ మాజీ సైనికుడని అమెరికా అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందట. అయితే, ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడంలేదు. ముగ్గురు పోలీసు అధికారులను కాల్చి చంపిన వ్యక్తి అమెరికా నావికా దళానికి చెందిన గేవిన్ లాంగ్ అని విచారణ అధికారులు గుర్తించారు. ఇతడు ముస్సోరిలోని కాన్సాస్ నగరానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. పోలీసులను చంపాలన్న కుట్రలో భాగంగానే అతడు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యవసర నెంబర్(911)కు కావాలని అతడే ఫోన్ చేసి పోలీసులను అక్కడికి రప్పించి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. -
భార్యతో పాటూ ఐదుగురిని కాల్చి చంపాడు
సెర్బియా: సెర్బియాలో ఓ వ్యక్తి తన భార్యతో పాటూ ఐదుగురిని కాల్చిచంపాడు. ఈ సంఘటన రెంజనిన్ నగరంలోరి మకిజటో కెఫేలో శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మకిజటో కెఫేకి వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితులతో ఉండటం చూశాడు. వెంటనే తిరిగి ఇంటికి వెళ్లి తన వెంట గన్ను తీసుకు వచ్చాడు. ఓ రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపి తొలుత తన భార్యను కాల్చిచంపాడు. అనంతరం మరో మహిళపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా పక్కన ఉన్న వారి పై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో కేఫేలో అంతా గందరగోళం నెలకొందని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. కేఫేలోని సభ్యులు ఘటన అనంతరం సదరు వ్యక్తిని పట్టుకొని గన్ను లాక్కున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లైసెన్స్ లేని గన్ని అక్రమంగా వాడాడని పోలీసులు తెలిపారు. -
తుపాకీ మిస్‌ఫైర్: గన్‌మెన్‌కు గాయం
నంద్యాల క్రైం: తుపాకీ జారి కిందపడి పేలిన ఘటనలో గన్‌మెన్ గాయపడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పెద్దబోదనం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచి మహేశ్వర్‌రెడ్డిపై మూడు హత్య కేసులున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో టీడీపీ నాయకుడిగా ఉన్న ఇతనికి ప్రభుత్వం గన్‌మన్ రక్షణ కల్పించింది. అలాగే మహేశ్వర్‌రెడ్డికి ఓ లెసైన్స్డ్ తుపాకీ కూడా ఉంది. అయితే ఆ తుపాకీ కూడా మహేశ్వర్‌రెడ్డి తన గన్‌మన్ సుబ్రహ్మణ్యం వద్ద ఉంచాడు. లోడ్ చేసి ఉన్న సదరు తుపాకీ గురువారం ఉదయం సుబ్రమణ్యం చేతిలో నుంచి కిందకి జారి పడి పేలింది. బుల్లెట్ సుబ్రమణ్యం కాలిలోకి దూసుకెళ్లి గాయమైంది. క్షతగాత్రుడిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి మృతి
వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ గన్ మెన్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అయితే, వారిని కాల్చిన తర్వాత తాను కూడా గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి అమెరికాలోని కన్సాస్ స్టేట్ లో ఓ ఉద్యోగి ఫ్యాక్టరీలో కాల్పులకు పాల్పడిన ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే బెల్ఫేర్ లో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రూరల్ వాషింగ్టన్ సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు.. అనంతరం ఆ దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని హవర్స్ లాంగ్ స్టాండోఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బెల్ఫేర్ స్టేట్ అధికారులు వివరించారు. -
డిన్నర్ చేస్తుండగా వచ్చి కాల్పులు జరిపాడు
పెరూ: అది పెరూలోని హ్వారల్ అనే ప్రాంతంలోని ఓ చికెన్ రెస్టారెంటు. క్రిస్మస్ నేపథ్యంలో కస్టమర్లతో నిండుగా ఉంది. అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కటి విందు ఆరగిస్తూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి సాధారణ వ్యక్తిలా వచ్చాడు. నేరుగా జేబులో నుంచి తుపాకీ తీసి అతి సమీపం నుంచి గురిపెట్టాడు. టకటకా అలెగ్రీ రివేరా (32), రాఫెల్ త్రినిడాడ్ (37) అనే ఇద్దరు వ్యక్తులపై ఫైరింగ్ చేశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో అప్పటి వరకు సరదా నిండిన ఆ రెస్టారెంటును ఒక్కసారిగా భయం అలుముకుంది. తాను డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోవడంతోనే వారిపై అతడు కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు. పెరూలో దారుణం చోటుచేసుకుంది. -
సీటు కోసం గన్‌తో బెదిరించిన గన్‌మాన్
తిరుమల: ఇతను ఒక భాద్యత గల పోలీస్ కానిస్టేబుల్. అందులోను మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రికి గన్‌మాన్ కూడా. శ్రీవారి దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. బస్సులో సీటు కోసం తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. అడ్డు చెప్పిన వారిపై గన్(కార్బెన్గన్)తో బెదిరించాడు. శనివారం రాత్రి తిరుమలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనూప్ కుమార్ త్రివేది(35), ఓ మంత్రి వద్ద గన్‌మాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తమిళనాడు రామేశ్వరంలో మంత్రి పర్యటన ఉండటంతో ముందుగానే అనూప్ త్రివేది అక్కడికి వచ్చాడు. అయితే మంత్రి పర్యటన రద్దు అయింది. దీంతో తన వద్దనున్న కార్బన్గన్తో తిరుమలకు బయలుదేరాడు. టీటీడీ నిబంధనల ప్రకారం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద గన్ వివరాలు నమోదు చేసి తిరుమలకు చేరుకున్న తర్వాత వన్‌టౌన్ పీఎస్‌లో అప్పగించాడు. శ్రీవారిని దర్శించుకుని శనివారం రాత్రి 9 గంటలకు గన్‌తో తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఆర్టీసీబస్టాండ్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్లకోసం ఇబ్బంది ఎదురైంది. దీంతో తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. వారు ఎదురుచెప్పడంతో గన్‌తో కాలుస్తానని బెదిరించాడు. భయపడిన తోటిప్రయాణికులు అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్పీ అనూప్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
యాంకర్, గన్మన్లకు మంత్రిగారి కోటింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని ప్రసంగానికి అడ్డు తగిలిందెవరు? సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాలని గన్‌మన్ ద్వారా స్లిప్పు పంపించిన యాంకర్ వెనక ఉన్న వ్యక్తి ఎవరు ? గన్‌మన్ చేసిన పాపమేంటి? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అయోధ్య మైదానంలో గురువారం జరిగిన చంద్రన్న సంక్షేమ అవగాహన సభలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళినికి అవమాన కర పరిస్థితి ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తుండగా ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న మహిళ ముగింపు పలకాలంటూ గన్‌మెన్ ద్వారా స్లిప్పు పంపించారు. దీంతో మంత్రి అసహనానికి లోనై కాసేపు తర్వాత ప్రసంగాన్ని ముగించారు. ఇంకేముంది ఆ తర్వాత చిర్రెత్తిపోయారు. స్లిప్పు ఇచ్చిన గన్‌మన్‌పై విరుచుకుపడ్డారు. ఎవరిచ్చారని గన్‌మన్‌ను గట్టిగా నిలదీశారు. నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ ఇచ్చారని చెప్పినా గన్‌మన్ కు మందలింపు తప్పలేదు. ఆ తర్వాత యాంకర్‌కి కోటింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా సభ నిర్వాహకులైన సాంఘి క సంక్షేమ శాఖ డీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలీ యాంకర్ల సంస్కృతేంటి? పెట్టమన్నదెవరని కడిగి పారేశారు. మంత్రికిచ్చే గౌరవమిదేనా? మీ హద్దుల్లో ఉండకపోతే బదిలీ తప్పదని గట్టిగా హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ఇకపై యాంకర్లను పెడితే ఊరుకునేది లేదని గట్టిగా మందలించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మంత్రి ప్రసంగాన్నే ఆపాలంటూ స్లిప్పు పంపించడం వెనక ఎవరున్నారన్నదానిపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రూపుల పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేతలెవరో చెప్పడం వల్లే అధికారులు ఈ సాహసం చేశారని, ఆ క్రమంలో యాంకర్ ద్వారా స్లిప్పు పంపించి ఉండొచ్చన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే, వెనుకున్న వ్యక్తులెవరో ప్రస్తుతానికి బయటికి రాకపోయినా ఏదో ఒక రోజు అధికారులు బయటపెట్టక మానరని చర్చించుకుంటున్నారు. అంత సులువుగా మంత్రి వదిలేయరని గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉండగా స్లిప్పు మాటెలా ఉన్నా మంత్రి సుదీర్ఘ ప్రసంగాలు కాసింత విసుగు తెప్పిస్తున్నాయన్నది వాస్తవమని కూడా చర్చించుకుంటున్నారు. -
యూఎస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి
వాషింగ్టన్: అట్లాంటా నగర శివారు ప్రాంతంలోని డగ్లస్వెల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన మాజీ భార్య ఇంట్లోకి ప్రవేశించి... విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించగా... ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. అనంతరం కాల్పుల జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు డగ్లస్ కౌంటీ ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. అయితే గాయపడిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతి చెందిన వారిని గుర్తించ వలసి ఉందన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తికి, మరణించిన ఆమెకు విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియలేదని.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడు గురించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కాల్పుల ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో... ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. -
మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చేశాడు
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. విలియం స్టోన్ అనే సాయుధుడు తన మాజీ భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిందితుడిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చిరించారు. అయితే విలియం స్టోన్ పోలీసుల కళ్ళుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. మరోవైపు ప్రశాంతంగా ఉండే పెన్సిల్వేనియా పట్టణంలో కాల్పులు కలకలం రేపాయి. -
బక్కచిక్కిన భద్రత
ఒంగోలు క్రైం : ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రజాప్రతినిధులకు గన్మెన్ల ద్వారా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్‌శాఖపై ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, తాజామాజీ ప్రజాప్రతినిధులకు మొత్తం గన్మెన్ల సంఖ్యను సగానికి కుదించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల గన్మెన్ల సంఖ్య కూడా సగానికి తగ్గిపోయింది. అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులతో పాటు తాజామాజీ ప్రజాప్రతినిధులకు సైతం గన్మెన్లను తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గన్మెన్ల తగ్గింపు ఇలా... జిల్లాలోని పశ్చిమ ప్రకాశం నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకూ 2+2 అంచెల భద్రత ఉండేది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి ఎమ్మెల్యేలకు ఆ స్థాయిలో భద్రత కల్పించేవారు. అయితే, ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం జిల్లాలో లేదని పోలీసు ఉన్నతాధికారులు భావించడంతో పాటు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పశ్చిమ ప్రకాశం ఎమ్మెల్యేలకు గన్మెన్లను 1+1కు కుదించారు. ఆయా ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మాజీ, తాజామాజీ ప్రజాప్రతినిధులకు గన్మెన్లను పూర్తిగా తొలగించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం గన్మెన్లను తొలగించారు. దీంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి మినహా ఎమ్మెల్యేలందరికీ 1+1 భద్రత... జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి శిద్దా రాఘవరావుకు 2+2 గన్మెన్లను ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయించారు. అందులో ఒక ఏఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులు కూడా ఉంటారు. మంత్రికి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరికీ 1+1 భద్రతను మాత్రమే కల్పించారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి జిల్లా పోలీసు యంత్రాంగం ఇద్దరు గన్మెన్లను కేటాయించగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరో ఇద్దరిని ఏర్పాటు చేసింది. నెల్లూరు, బాపట్ల ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రిలకు కూడా అదేస్థాయిలో భద్రత కల్పించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుకు కూడా గన్మెన్లను కేటాయించారు. నూకసానికి భద్రత కోసం ప్రభుత్వానికి లేఖ... జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీకి భద్రత కల్పించే విషయమై జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సాధారణంగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా నేరుగా ఎన్నికైన వారికి ప్రొటోకాల్‌లో భాగంగా వెంటనే గన్మెన్లను కేటాయిస్తారు. అయితే, చైర్మన్‌గా ఉన్న ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడటంతో వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని చైర్మన్ హోదాకు వెళ్లారు. దీంతో ఆయన తనకు గన్మెన్లను కేటాయించాలని జిల్లా పోలీసు అధికారులకు లేఖ రాయాల్సి ఉంది. అందులో భాగంగా ఇటీవల ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌కు నూకసాని లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయనకు గన్మెన్లను కేటాయించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. -
నో సెక్యూరిటీ..
ఆదిలాబాద్ క్రైం : ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలైన.. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. వారి భద్రత కోసం నియమించిన గన్మెన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితోపాటు రాజకీయాలతో సంబంధం ఉన్న కొంతమంది ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులకు ఉన్న భద్రతను కూడా తొలగించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 63 మంది గన్మెన్లను తొలగించారు. వారికి ఎలాంటి ముప్పులేనందునే గన్మెన్లను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, పలువురు ప్రజాప్రతినిధుల రక్షణకు 79 మంది గన్మెన్లను కేటాయించారు. రాష్ట్ర మంత్రి జోగురామన్నకు ఆరుగురు గన్మెన్లతోపాటు, ముగ్గురు ఎస్కార్డ్‌లను నియమించారు. ఎమ్మెల్యేలకు 2+2 గన్మెన్లు పనిచేస్తున్నారు. ఓడిపోయిన వారికి నో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన జిల్లా మాజీలకు కొత్త తలనొప్పే వచ్చి పడింది. భద్రతను తొలగించిన వారిలో అధికార పార్టీకి చెందిన మాజీల తోపాటు, తాజా వాళ్లు, గతంలో గెలుపొంది.. ఓడిపోయిన నేతలు సైతం ఉన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్నప్పుడు గత మాజీ నేతలకు గన్మెన్లను కేటాయించింది. కొన్నేళ్లుగా జిల్లాలో నక్సల్స్ ప్రభావం లేకపోయినా.. పలుకుబడితో గన్మెన్లను తమవద్దే ఉంచుకున్నారు. అయితే.. ప్రభుత్వం తాజా నిర్ణయం తో వీరంతా ఇప్పుడు తమ భద్రతను పునరుద్ధరించుకు నే పనిలో పడ్డారు. భద్రత కొనసాగించాలంటూ ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భద్రత తొలగించిన ఎంపీ, ఎమ్మెల్యేల వివరాలు సైతం వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. గన్మెన్లు తొలగించినట్లు తెలిస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించడం లేదని చెబుతున్నారు. 96 వ్యక్తిగత ఆయుధాలు.. వ్యక్తిగత భద్రత కోసం గతంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు లెసైన్సు ఆయుధాలను పొందారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని కొంత మంది ఈ ఆయుధాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో నక్సల్స్ ప్రభావం లేకున్నా.. వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. అవసరమున్నా.. లేకున్నా.. గత ప్రభుత్వం రాష్ట్ర నేతల సిఫార్సుతో చాలా మందికి ఆయుధాల లెసైన్సు ఇచ్చింది. జిల్లాలో మొత్తం 96 మందికి వ్యక్తిగత ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో మాత్రమే వ్యక్తిగత ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారివారికి ఇచ్చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు.. పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ పలుకుబడితో తమ వద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అవసరం లేని వారి వద్ద కూడా లెసైన్సు ఆయుధాలు ఉండడంతో వారి స్వప్రయోజనాల కోసం వాటిని అక్రమ దందాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ముప్పు ఉన్న వారికి తప్ప మిగతా వారి నుంచి ఆయుధాలు వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భద్రత తగ్గిస్తున్నాం.. - గజరావు భూపాల్, ఎస్పీ జిల్లాలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారికి ఉన్న భద్రతను తగిస్తున్నం. అయితే.. ఎవరెవరికి భద్రత తొలగించామన్న వివరాలు గోప్యంగా ఉంటాయి. భవిష్యత్తులో భద్రత దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే భద్రత తొలగించిన నేతల వివరాలు చెప్పడం లేదు. -
కక్ష సాధింపులు
మాజీ ఎమ్మెల్యేలు భూమన, సీకే బాబుకుభద్రత ఉపసంహరణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రత కుదింపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ, గల్లా అరుణకుమారికి భద్రత కల్పించిన సర్కారు టీడీపీకి ఓట్లేయలేదనే నెపంతో ప్రజలను వేధిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న తెలుగుతమ్ముళ్లతో ఆపార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పోటీపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు తెరతీసి, భద్రత కుదించారు. ప్రజాప్రతినిధులు కానివారికి భద్రత కల్పించి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను ఉపసంహరించారు. ఎవరి హిట్ లిస్ట్‌లోనూ లేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడుకు భద్రత కల్పించారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఏడు సార్లు దాడులనుంచి బయటపడిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రతను పూర్తిగా ఉపసంహరించడం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా పోలీసువర్గాలు అభివర్ణిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించగానే ఆపార్టీ శ్రేణులు దమనకాండకు తెరతీశాయి. టీడీపీకి ఓట్లేయని ప్రజలను వేధింపులకు గురిచేశాయి. తాగునీటి సౌకర్యం నుంచి కరెంట్ సరఫరా వరకూ అంతరాయం కల్పించి వేధించాయి. ప్రత్యర్థి పార్టీలకు ఓట్లేశారనే నెపంతో గ్రామాలపై తెలుగుతమ్ముళ్లు పడి బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే టీడీపీ శ్రేణుల దాడులు మరింత పెరిగిపోయాయి. వైఎస్సార్సీపీ నేతలు లక్ష్యంగా దాడులను టీడీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దూకుడును సీఎం చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. విపక్ష నేతలు.. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రతరం చేశారు. అందులో భాగంగా కొందరికి భద్రతను కుదిస్తే.. మరికొందరికి భద్రతను పూర్తిగా ఉపసంహరించారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రాణ హాని ఉన్న నేతలకు రక్షణ కల్పించడం సర్కారు బాధ్యత. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా నేతలకు భద్రత కల్పించాలి. కానీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి.. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా భద్రతను ఉపసంహరిస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి 2005లో మావోయిస్టులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. చర్చలు ముగిశాక.. ‘ఈ చర్చలు విఫలమైతే మా తొలి టార్గెట్ మీరే అవుతారు’ అంటూ మావోయిస్టు అగ్రనేత ఒకరు భూమన కరుణాకరరెడ్డిని హెచ్చరించారు. ఇది చర్చల్లో పాల్గొన్న అప్పటి హోం మంత్రి జానారెడ్డి, డీజీపీ స్వరణ్‌జిత్ సేన్ తదితరుల దృష్టికి వెళ్లింది. గతంలో భూమన కరుణాకరరెడ్డి విప్లవోద్యమాల్లో పాల్గొన్నారు.. ఎమర్జెన్సీలో ఆయనను అప్పటి ప్రభుత్వం నిర్బంధించింది కూడా. విప్లవోద్యమాల్లో పాల్గొని.. జనజీవన స్రవంతిలో కలిసిన వారిపై తరచుగా మావోయిస్టులు దాడులు చేస్తోండటం మనం చూస్తూనే ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకునే 2005లో భూమన కరుణాకరరెడ్డికి 4+4 భద్రత(ఏకే-47) కల్పించారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్రాలు ఆ భద్రతను 2+2కు కుదించాయే తప్ప.. ఉపసంహరించలేదు. భూమనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.. సీఎం ఒత్తిడి మేరకు భూమనకు భద్రతను ఉపసంహరించారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై ఇప్పటికే ఏడు సార్లు హత్యాయత్నం చేశారు. ఈ దాడుల వెనక టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఆ దాడుల నుంచి సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణహాని ఉన్న సీకే బాబుకు రోశయ్య, కిరణ్ సర్కారు 4+4 భద్రత కల్పించారు. ఇప్పటికీ సీకే బాబుకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. కానీ.. ఆ నివేదికను సీఎం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తుంగలో తొక్కి భద్రతను ఉపసంహరించారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ నేత. సంఘ విద్రోహక శక్తుల నుంచి ఆయనకు ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికను చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఆయన భద్రతను 1+1కు కుదించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు అనేక సందర్భాల్లో దాడులకు దిగారు. ఆ నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లర్ల అవతారం ఎత్తిన టీడీపీ నేతల నుంచి బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 2+2 భద్రతను కొనసాగించాలన్న ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికను బుట్టదాఖలు చేశారు. ఆయనకు భద్రతను 1+1కు కుదించారు. దీన్నేమంటారు బాబూ... మాజీ ఎమ్మెల్యేకు భద్రత కల్పించకూడదని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. గతంలో జిల్లాలో 48 మందికి భద్రత కల్పిస్తే.. ఇప్పుడు 21 మందికే కల్పిస్తున్నామని సమర్థించుకుంటోంది. కానీ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారిలకు 1+1 భద్రత కల్పించారు. అటు గాలికిగానీ.. ఇటు గల్లాకుగానీ ఎవరి నుంచి ముప్పు లేదు. వారిద్దరికీ భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా నివేదిక కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. ఆ ఇద్దరూ టీడీపీ నేతలు కావడంతో భద్రత కల్పించారు. ఇక డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డికి కూడా భద్రతను ఉపసంహరించడం గమనార్హం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందో విశదం చేసుకోవచ్చు. -
మాజీలకు గన్మెన్ల తొలగింపు
కర్నూలు: జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గన్మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం జిల్లా పోలీస్ అధికారులకు చేరాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి 3+3, రాష్ట్ర మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, మీనాక్షి నాయుడు, నీరజారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులకు 2 + 2, కోట్ల సుజాతమ్మకు 1+1 గన్మెన్లను కేటాయించి భద్రత కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 36 మంది నేతలకు 160 మందికి పైగా గన్మెన్లతో భద్రత కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మినహా మాజీలందరికీ గన్మెన్లను తొలగించాలని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తితో పాటు శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి యాదవ్ ప్రస్తుతం అత్యధిక గన్మెన్లతో భద్రతను పొందుతున్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు గతంలో 2+2 గన్మెన్లు ఉండగా 1+1కు తగ్గించారు. ప్రత్యర్థుల నుంచి తనకు హాని ఉందని పోలీస్ శాఖకు విన్నవించుకున్న నేపథ్యంలో గన్మెన్లను కొనసాగించేందుకు పై స్థాయి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మాజీలందరికీ గన్మెన్లను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వుల మేరకు 1, 2 రోజుల్లో నోటీసులు జారీ చేసి భద్రతను తొలగించనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో నంద్యాల శాసనసభ నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డికి మాత్రం కోర్టు ఆదేశాల మేరకు 3+2 గన్మెన్లతో భద్రత కొనసాగిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలకు 1+1, ఎంపీలకు 2+2 గన్మెన్లతో భద్రతను కొనసాగించనున్నారు. అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకుని పెయిడ్ గన్మెన్లను పొందిన వారికి కూడా తొలగించాలని హోంశాఖ నుంచి ఉత్తర్వులు అందడంతో ఆ మేరకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది.