
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అనుకుంటే అతని గన్‌మెన్‌లు కూడా ఏమాత్రం తీసి పోవడం లేదు. ఏలూరులో పోస్ట్‌ల బ్యాలెట్ వద్ద చింతమనేని ప్రభాకర్ మాజీ గన్‌మాన్ లక్ష్మణ్ హల్‌చల్ చేస్తూ.. ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేశాడు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం ఉదయం నుంచి యూనిఫామ్‌లోనే కాలేజీ ప్రాంగణం అంతా తిరుగుతూ.. చింతమనేని ప్రభాకర్‌కు ఓటేయ్యాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో లక్ష్మణ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే లక్ష్మణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. లక్ష్మణ్ దెందులూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికి.. చింతమనేని సేవలోనే తరిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కార్యక్రమల్లో పార్టీ కార్యకర్తగా సేవలు కూడా అందిస్తున్నారు. చింతమనేని అండదండలుండటంతో ఉద్యోగానికి హాజరు కానప్పటికి చర్యలు శూన్యం. ఈ క్రమంలో కానిస్టేబుల్‌గా ఉంటూ అధికారులను సైతం పేరు పెట్టి పిలుస్తూ.. వారిని కూడా బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అయితే లక్ష్మణ్ ఎన్ని వేషాలేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment