
సాక్షి, పశ్చిమ గోదావరి: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనదైన శైలిలో రౌడీయిజం ప్రదర్శించడం ఆయనకు అలవాటు. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే ఆయన ఎందుకు అలా కూర్చున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. మళ్లీ చింతమనేని ఎం ఘనకార్యం చేశారంటే.. శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం కావడంతో చింతమనేని రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారు వట్లూరు సీఆర్ రెడ్డి కళాశాలలో దెందులూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి తన అనుచరులతో కలిసి చేరుకున్న చింతమనేని ప్రలోభాలకు తెరతీశారు. టీడీపీ నేతల ప్రలోభాలపై వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో చింతమనేని తన రౌడీయిజం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేతలపై పలువురు టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ శ్రీధర్‌పై చింతమనేని దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరి దాడికి పాల్పడ్డారు. అయితే చింతమనేని చర్యలతో అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసకున్న వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతున్నప్పుడే చింతమనేని ఈ రకంగా వ్యవహరిస్తే.. ఇంకా ఏప్రిల్ 11వ తేదీన పరిస్థితి ఎంటని ప్రజలు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment