rowdyism
-
ప్రేమ వివాహం చేసుకున్నారంటూ వరుడి ఇంటిపై దాడి
-
మా పొలం కబ్జా చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు
-
మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు
-
కిరాయి రౌడీలకు మద్యం పట్టించి.. తునిలో రెచ్చిపోయిన టీడీపీ
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలపై మండిపడ్డ YSRCP నేతలు
-
ఏం సందేశం ఇస్తున్నావు అధ్యక్షా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు ఎమ్మెల్యే తీరు స్థానికులను విస్మయానికి, గందరగోళానికి దారితీస్తోంది. ఆయన పోలీసులతో రహస్య సమావేశాలు నిర్వహించి రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశిస్తున్నారు. సభలు సమావేశాల్లోనూ రౌడీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆపై రౌడీ షీటర్ల పుట్టిన రోజు వేడుకలు, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యక్రమాలకు వెళ్తూ వారిని మరింత ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమి చేయాలో దిక్కుతోచక రౌడీ షీటర్లతో సఖ్యతగా ఉంటున్నారు. వారికి ప్రతి పనిలోనూ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఐడీ కానిస్టేబుళ్లు అయితే రౌటీ షీటర్ల అనుచరులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశమైంది.పట్టించుకుంటే ఒట్టునియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా దానికి కేంద్ర బిందువుగా గూడూరులోని రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు విచారణలో తేలుతోంది. గూడూరుకు చెందిన ఓ రౌడీషీటర్ చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పబ్లిక్‌గా దాబా నడుపుతున్నారు. అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నా పోలీసులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో గూడూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో దాబాకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారంటూ డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు వ్యకిపై బెదింపులకు దిగి ఫిర్యాదును ఉప సంహరించుకునేలా చేశారు. అదే రౌడీ షీటర్ దాబా వద్ద తనతో పాటుగా తిరుగుతున్న ఓ యువకుడ్ని వారం రోజుల క్రితం తన అనుచరులతో కలసి హత్య చేశారు. ఆపై వాకాడు ప్రాంతంలో శవాన్ని పారేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజాప్రతినిధుల నుంచి వీరికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఇన్ని హత్యలు, రౌడీయిజం, అక్రమాలు లాంటి దారుణాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
పాత కేసులు తవ్వి తీస్తున్నారు.. ఏపీలో పచ్చ పైశాచికం..
-
రెచ్చిపోతున్న టీడీపీ గుండాలు.. మొద్దు నిద్రలో బాబు సర్కారు
-
కలెక్టర్ అయితే గొప్పా.. మార్కాపురం సబ్ కలెక్టర్ పై రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
-
అర్ధరాత్రి రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు
-
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
-
టీడీపీ రౌడీయిజంపై.. వైఎస్సార్సీపీ లీగల్ యాక్షన్
-
మోడీ వచ్చారు ఏం చెప్పారు ?.. టీడీపీ రౌడీయిజం ఆగుతుందా ?
-
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న TNSF నేతలు
-
చింతమనేని గూండాగిరి
-
రెచ్చిపోయిన జనసేన.. అర్ధరాత్రి విధ్వంసం..
-
అర్ధరాత్రి టీడీపీ విధ్వంసం..
-
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
రెచ్చిపోయిన పచ్చమూక
టీడీపీ శ్రేణుల రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతోంది. యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలని యతి్నస్తోంది. ఎన్నికల ప్రచారం సైతం సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతోంది. చివరకు పోలీసుల పహరాలో ఓట్టు అభ్యర్థించునే పరిస్థితిని కల్పిస్తోంది. కాణిపాకం: పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక నానా రాద్ధాంతం సృష్టించారు. బడా నాయకుల డైరక్షన్లో గొడవకు యత్నంచారు. తమ ఊర్లో వైఎస్సార్సీపీ ప్రచారం జరగకూడదని, ఓట్లు అడిగేందుకు వీలులేదంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. పక్క గ్రామంలో పర్యటిస్తున్న సునీల్‌కుమార్ వద్దకు వెళ్లి వేపనపల్లెలో ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకోవడం తన హక్కని ఆయన స్పష్టం చేయడంతో చేసేది లేక భద్రత కలి ్పంచారు. డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ సుదర్శనప్రసాద్, విశ్వనాథరెడ్డి అక్కడి చేరుకుని పటిష్ట బందోబస్తుతో వేపనపల్లెలో ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.45 గంటలకు వేపనపల్లె గ్రామానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ తదతరులు చేరుకున్నారు. ఇంతలో అక్కడ గుమికూడిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నేతలపైకి దూసుకొచ్చారు. పచ్చిబూతులతో దూషించారు. పోలీసుల సమక్షంలోనే ఊర్లో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరించారు. వీరికి జనసేన కార్యకర్తలు సైతం వంతపాడారు. మొత్తం వ్యవహారం గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పచ్చమూకకు గట్టిగా వారి్నంగ్ ఇచ్చారు. ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థుల ప్రచారం అడ్డుకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసుల పహరా నడుమ సునీల్‌కుమార్ గ్రామంలో ప్రచారం సాగించారు. అయినప్పటికీ పచ్చబ్యాచ్ నినాదాలు చేస్తూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా గొడవకు కాలుదువ్వారు. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెలే9్య అభ్యర్థి ప్రచారాన్ని ప్రశాంతంగా ముగించారు. కాగా, ఆరు నెలలకు కిత్రం ఆ గ్రామంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో గొడవ చోటుచేసుకుంది. అప్పుడు కూడా కొందరు ఇలానే ప్రవర్తించారు. అప్పుడు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కక్షతోనే ఇప్పుడు మళ్లీ గొడవ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య విరుద్ధం వేపనపల్లెగ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ మండపడ్డారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి చేసినప్పుడే ఓపికతో వ్యవహరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే అడ్డగించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. -
లోకేష్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ?
-
రెచ్చిపోయిన సీఎం రమేష్...ప్రభుత్వ అధికారులపై రౌడీయిజం
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు. ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డిని ఫోన్లో బెదిరించిన ప్రకాష్.. టీడీపీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు. ఆర్అండ్బి అతిథి గృహంలో జరిగిన ఇంజనీర్ల మీటింగ్ లో దౌర్జన్యానికి దిగిన ప్రకాశ్ నాయుడు కాళ్లతో డోర్‌ను తన్ని ఇంజనీర్లపై దాడికి యత్నించాడు. దౌర్జన్యం చేసి రివర్స్ కేసు పెట్టేందుకు టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. -
Kalyandurg: టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం చెలాయించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ- వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. -
MRO పై టీడీపీ నేత రౌడీయిజం
-
దాదాగిరికి తెర లేపిన వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి
-
బీటెక్ రవి తగాదాలు సృష్టిస్తున్నాడు : శ్రీధర్ రెడ్డి
-
జనసేన నేత గుండాయిజం భూకబ్జాలు, దాదాగిరి..
-
చంద్రబాబు సమక్షంలోనే పచ్చమూకల దాడులు
-
కుప్పం సాక్షిగా బాబు రౌడీ రాజకీయం
-
టీడీపీ జెండా తీయమన్నందుకు మహిళను చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
-
రాయపూడిలో టీడీపీ నాయకుడి రౌడీయిజం
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, అమరావతి మైనార్టీ జేఏసీ నేత షేక్ జానీ తన గ్యాంగ్‌తో హల్చల్ చేశాడు. పెదపరిమికి చెందిన దళిత యువకుడిని నిర్బంధించి కారులో తీసుకెళ్లి చితకబాదడంతో పాటు, కాళ్లు పట్టి క్షమాపణ కోరాలని బెదిరించిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పెదపరిమికి చెందిన పాటిబండ్ల శ్రీకాంత్ అనే యువకుడు తుళ్లూరుకు చెందిన తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి మోతడక నుంచి బైక్‌పై వస్తుండగా, వాహనంపై ఉన్న ఓ యువకుడికి జానీ గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్న సంభాషణను అపార్థం చేసుకున్న జానీ గ్యాంగ్ సభ్యులు.. తమ బాస్‌ను దుర్భాషలాడారంటూ వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా జానీకి చెందిన కారులో పెదపరిమి గ్రామానికి వచ్చి దళిత యువకుడు పాటిబండ్ల శ్రీకాంత్‌పై దాడిచేసి కారులో నిర్బంధించి అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని కారు సీజ్ చేశారు. -
కుప్పంలో పచ్చ నేతల బరితెగింపు
-
పీఎస్‌లో లొంగిపోయిన కూన రవికూమార్
-
లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పొందూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. తహసీల్దార్‌ను ఫోన్లో దుర్భాషలాడిన కూన రవికుమార్, మూడురోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసినందుకు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని కూన రవికుమార్ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం.. మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్లో హెచ్చరిక ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఇచ్చిన వార్నింగ్ చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. -
‘కూన’ కోసం గాలింపు
మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు.. నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్లో హెచ్చరిక ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు ఇచ్చిన వార్నింగ్ చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం.. ఇది టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూన రవికుమార్ ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. అంతం చేస్తానని భయపెడుతున్నారు. ‘ఏమవుతుంది.. మహా అయితే కేసు పెడతారు... బెయిల్‌పై వచ్చేస్తాను’ అన్న ధీమాతో నిర్భీతిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఘటన మరింత ఆశ్చర్యం కల్గిస్తుంది. అందితే జుత్తు లేకపోతే కాలు అన్నట్టుగా బెదిరింపులతో దారికొస్తే ఫర్వాలేదు... లేదంటే లంచం పేరుతో ఇరికించవచ్చన్న ధోరణి చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్ ఏకంగా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టయి బెయిల్‌పై వచ్చారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఉద్యోగులను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాను చెప్పినట్టు వినకపోతే దుర్భాషలాడి బెదిరించడం టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌కు అలవాటైపోయింది. కూన రవికుమార్ రౌడీయిజాన్ని చూసి ఉద్యోగులు వణికిపోతున్నారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన పడుతున్నారు. రౌడీషీట్ తెరవాలని ఉద్యోగుల డిమాండ్ కూన రవికుమార్ వ్యవహారం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన రాజకీయ నాయకుడా ? వీధి రౌడీయా అని పెదవి విరుస్తున్నారు. బాధ్యత గల నాయకుడెవరూ బెదిరింపులకు దిగరని, రౌడీయిజం చేద్దానుకునే వారే చంపుతాను, పాతేస్తాను, వెదవా అంటూ బెదిరిస్తారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులను బెదిరిస్తూ, భయాందోళనకు గురిచేస్తున్న కూన రవికుమార్ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. అజ్ఞాతంలో రవికుమార్.. కేసు నమోదు పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కూన రవికుమార్, ఆయన సోదరుడు కూన వెంకట సత్యారావు, చంద్రారెడ్డి మరో ఇద్దరిపైనా పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 353, 506 రెడ్‌విత్ 34సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కూన రవికుమార్ పట్టుకోవడానికి ఆమదాలవలస, శ్రీకాకుళంలో గాలింపు చేపట్టారు. కాకపోతే అప్పటికే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూన రవికుమార్ ఇళ్లల్లోనూ, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కానీ, రవికుమార్ ఆచూకీ దొరకలేదు. ఎవరో సన్నిహితుల ఇళ్లల్లోనే దాక్కుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ‘కూన’ కోసం గాలింపు ఆమదాలవలస: టీడీపీ నాయకుడు, మాజీ విప్ కూన రవికుమార్, అతని అనుచరులు తనను ఫోన్లో బెదిరించినట్టు పొందూరు పూర్వ తహసీల్దారు టి.రామకృష్ణ పొందూరు పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు ప్రారంభించారు. అరెస్టుకు రంగం సిద్ధమవడంతో రవికుమార్ సహా నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు, పొందూరు ఎస్ఐ డి.విజయ్‌కుమార్, పోలీసు సిబ్బంది ఆమదాలవలస పట్టణంలో దర్యాప్తు చేశారు. కేసులో అరెస్ట్ చేయాల్సిన చంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్త, కాంట్రాక్టర్ ఆమదాలవలస పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో నివాసముంటున్నాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వచ్చి తనిఖీ చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో సుమారు గంట సమయంపాటు ఇంటి వద్ద వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. ఆమదాలవలస సీఐ ప్రసాదరావు పట్టణంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను పిలిపించి విచారణ జరిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. తెల్లారేసరికే పరార్ శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన కేసులో అరెస్టు చేసేందుకు నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కూన రవికుమార్ ఇంటికి సోమవారం తెల్లవారుజామునే పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని పోలీసులు చెప్పి ఇల్లంతా వెతికారు. గతంలో ఓ ఎంపీడీవోను, మరికొందరిని దుర్భాషలాడినప్పుడు పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు ఆయని ఇంటికి వెళ్లిన సందర్భంగా జరిగిన తంతే సోమవారం కూడా జరిగింది. అప్పట్లో నెల రోజులకి పైగా పోలీసుల కళ్లుకప్పి రవికుమార్ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. -
అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
వెలగపూడి టీమ్ రౌడీయిజం
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు పెట్రేగిపోతున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై రౌడీయిజం చెలాయిస్తున్నారు. గతంలో మద్యం మాఫియా వేదికగా సాగిన వీరి రౌడీయిజం ప్రస్తుతం వీధులకు సైతం పాకింది. ఎంవీపీకాలనీ పరిధి 7వ వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్పై టీడీపీ నాయకుడు దాడికి దిగడంతో తెలుగు తమ్ముళ్ల రౌడీయిజం మరోసారి వెలుగుచూసింది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు, తన రౌడీ బ్యాచ్‌ను కాపాడేందుకు ఏకంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అటు శానిటరీ ఇన్స్పెక్టర్పైనా... ఇటు ఎంవీపీ పోలీసులపై ఒత్తిడి తెచ్చి తెలుగు తమ్ముళ్లను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. విచక్షణ లేకుండా దాడి ఎంవీపీకాలనీ పరిధిలోని 7వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్గా త్రినాథ్ వ్యవహరిస్తున్నారు. సౌమ్యుడిగా.. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. ఇటీవల 7వ వార్డులో జీవీఎంసీ జోన్–2 కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. సెక్టార్–9లో రోడ్డుపై విచ్చలవిడిగా గేదెలు కట్టి ఉండటాన్ని గమనించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. దీనిపై స్థానికులు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆవులు, గేదెలను కట్టిన వారికి పెద్ద మొత్తంలో అపరాధ రుసుం విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ త్రినాథ్‌ను ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల రుసుం విధించాలని, ఆ మొత్తం చెల్లించకుంటే ఆవులు, గేదెలను తరలించాలని సూచించారు. అయితే వారు గతంలో కూడా రుసుం చెల్లింపులో ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వేశారు. అందులో ఒకరు ఈ మొత్తం చెల్లించగా.. టీడీపీ నాయకులు ఎంవీ రమణ, పోలారావులు కట్టేది లేదంటూ ఆయనతో వాదనకు దిగారు. రుసుం కట్టకపోతే ఆవులను వ్యాన్ ఎక్కిస్తామని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంవీ రమణ శానిటరీ ఇన్స్పెక్టర్పై దాడి చేశాడు. దీంతో ఆ అధికారి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు ఎంవీ రమణ, పోలారావులను అదుపులోకి తీసుకున్నారు. రంగంలోకి వెలగపూడి ఇదిలా ఉండగా ఈ ఘటనపై సెక్టార్–9లోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించారు. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే.. అనుచరుడు ఎంవీ రమణను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రమణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఎంవీపీ పోలీసులపై ఎమ్మెల్యే ఉదయం నుంచి పలుమార్లు ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ శానిటరీ ఇన్స్పెక్టర్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత వహించారు. ఉదయం నుంచి ఎంవీపీ సీఐ షణ్ముఖరావు స్టేషన్లో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాత్రికి విషయం బయటకు పొక్కడంతో ఎమ్మెల్యే ఒత్తిళ్లను పక్కన పెట్టి ఎట్టకేలకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసినందుకు గానూ రాత్రి 9.30 తర్వాత ఎంవీ రమణ, పోలారావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు ధ్రువీకరించారు. -
మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసి బూ తులు తిట్టే ఈ నాయకుడి వైఖరి మరోసారి బట్టబయలైంది. ఓడిపోయానన్న బాధ ఇంకా పోలేదో.. అధికారంలో లేనన్న సంగతి గుర్తు లేదో గానీ ప్రభుత్వ అధికారిపై మరోసారి నోరుజారారు. రాయ లేని భాషలో బెదిరింపులకు దిగారు. ఆ మధ్య ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ జే ఈని బెదిరించగా, తాజాగా సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్డీకి ఫోన్ చేసి బూతులు తిట్టిన వైనం ఆదివారం బయటపడింది. ఇన్చార్జి ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడుతో కూన రవికుమార్ జరిపిన ఫోన్ సంభాషణ ఇది.. కూన రవి: హలో ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడు : సార్ నమస్తే సార్ కూన రవి: ఆ.. నమస్తే.. ఏమయ్యా నీవు బాగా పెద్దోడివయ్యినట్లు ఉన్నావ్ ఈఓపీఆర్డీ: లేదు.. లేదు సార్ కూన రవి: నీకు ఎంత ఒల్లు బలిసిందంటే నా కొడకా... నా నంబర్‌తో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవా ఈఓపీఆర్డీ: వీసీలో ఉన్నాను సార్.. ఫోన్లు తీయలేదు కూన రవి: ఆ తర్వాత ఏం చేశావ్...... ఈఓపీఆర్డీ: ఆ తర్వాత చూడలేదు సార్ కూన రవి: చూడకపోతే ఫోన్ చేయవా ఈఓపీఆర్డీ : ఫోన్ పక్కన పెట్టేసి మర్చిపోయా సార్.. కూన రవి: ఒరే నా కొడకా హస్కీలో ఉన్నా నిన్ను భూమిలోంచి తీసి నిన్ను పాతీకిపోతాను నా కొడకా... నీవు హస్కీలో ఉండు నా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమార్‌నే కాదు నా కొడకా.. నీ బతుకెంతరా నా కొడకా ఈఓపీఆర్డీ: విషయం.. విషయం ఏమిటి చెప్పండి సార్.. కూన రవి : దొంగనా కొడకా.. నీకు విషయం చెప్పాల్రా నేను ఈఓపీఆర్డీ : ఏమిటి చెప్పండి సార్ కూన రవి : దొంగనా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే.. నీవు ఈఓఆర్డీగా వచ్చావురా.. నీ ఉద్యోగం ఏమిటి అక్కడ? ఈఓపీఆర్డీ: ఈఓపీఆర్డీ చెప్పండి కూన రవి : ఆ... ఈఓఆర్డీ నీకెంత ధైర్యంరా మరల అక్కడకే వచ్చినావు ఈఓపీఆర్డీ : రాలేదు సార్ నేను ఎఫ్ఏసీ కూన రవి : ఏటి ఎఫ్ఏసీ నీకెవడురా ఇచ్చారు అక్కడ. జూనియర్ అసిస్టెంట్‌కు ఎఫ్ఏసీరా నీకు ఈఓపీఆర్డీ : సీనియర్ అసిస్టెంట్‌ని సార్ కూన రవి : రావివలస పంచాయతీ డబ్బులు ఆ రాయుడుకు ఎందుకురా ఇవ్వలేదు. ఈఓపీఆర్డీ : రావివలసది 30వేలు ఉంది సార్ అక్కడ. కూన రవి : రూ.30వేలు ఉంటే తీసి ఇవ్వలేవా ఈఓపీఆర్డీ : రూ.30వేలు అంటే రూ.70వేలు ఆయనది. కూన రవి : ఆ.. ఈఓపీఆర్డీ : రూ.20వేలు కొడుతుంటే ఆన్లైన్లో రిజెక్టెడ్ అని వస్తుంది సార్ అక్కడ కూన రవి : ఏంటి రిజెక్ట్ అని వస్తుంది ఈఓపీఆర్డీ : ఆ అమౌంట్ సరైన అమౌంట్ లేదని రిజెక్ట్ వస్తుంది, అది పెట్టమంటే మీకు రేపు పెడతా. కూన రవి : రేపు ఇమ్మీడియట్‌గా పెట్టు లేదా రూ.10లేదా రూ.15వేలు కొట్టు ఈఓపీఆర్డీ : పెడతా సార్ వాట్సాప్‌లో పెడతా సార్ కూన రవి : వాట్సాప్‌లో పెట్టు. ఈసారి లగాయత్తు.. న నంబర్ గానీ ఎత్తకపోయావో వైజాగ్‌లో ఉన్నా నీ ఇంటికి వచ్చి ఎత్తుకుపోతా నా కొడకా.. అంటూ ఫోన్ పెట్టేశారు. ఇలా సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీగా ఉన్న గూనపు వెంకట అప్పలనాయుడుపై బండ బూతులు తిట్టి విరుచుకుపడ్డారు. కూన రవికుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగారు. ‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. అలాగే, బూర్జలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ ని కూడా నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఇక పంచాయతీ కార్యదర్శులకైతే లెక్క లేదు. చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చొన్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే సరుబుజ్జిలి ఎంపీడీఓ, గత ఈఓపీఆర్డీని బెదిరించిన కేసులో బెయిల్‌పై ఉన్నారు. బయటికొచ్చినవి కొన్నే. కానీ నియోజకవర్గంలో ఆయన ఆగడాలు ఇంతా అంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని పురుగుల్లా చూస్తున్నారని నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఎన్నో ఉన్నాయి. కూనతో ప్రాణహాని ఉంది.. మాజీ విప్ కూన రవికుమార్ బెదిరింపులు తట్టుకోలేకపోతున్నాం. ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ప్రజాస్వామ్యంగా పనులు చేసుకోవాలే తప్ప. ఇలా బెదిరిస్తూ, తిడుతూ పనులు చేయించాలనుకోవడం సరికాదు. గతంలో కూడా నాతో దురుసుగా మాట్లాడారు. ఆయనకిది అలవాటైపోయింది. ఇలాగైతే పనిచేయలేం. తరుచూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. గతంలో కూడా వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. ప్రస్తుతం నేను వైజాగ్‌లో ఉన్నా తంతాను అని బెదిరించారు. నాకు ప్రాణహాని ఉంది. దీనిపై ఆమదాలవలస సీఐ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశాను. – గూనపు వెంకట పెద అప్పలనాయుడు -
‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకునేలా టీడీపీ చేస్తున్న కుయుక్తులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్లో.. టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా యాక్షన్ చేశారో తెలిపే వీడియో ఒకటి బయటికొచ్చింది. మండలిలో తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో టీడీపీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. వారు అలా చెబుతుంటే చంద్రబాబు చాలా బాగా చేశారని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు.. టీడీపీ సభ్యులు బెజవాడ రౌడీయిజం అని ఓ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడినా కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు విస్తుపోతున్నారు. హుందాగా ఉండాల్సిన పెద్దల సభలో టీడీపీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చున్నా.. చాలా బాగా చేశారు. నేను ఒకటి.. రెండు సార్లు వచ్చి చూశాను. మిగతావి స్క్రోలింగ్ చూస్తున్నా.. ఎప్పుడూ మాట్లాడినా గొడవ పడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు రావడం అంతా చూశాన’ని చెప్పారు. దీనికి బదులిచ్చిన తమ్ముళ్లు.. ‘అశోక్ బాబులో రౌడీని చూశామని.. మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్.. ఏయ్ అని బాగా అరిచారు. కొంచెం ఉంటే కొట్టేవాడు. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడ’ని చెప్పారు. టీడీపీ సభ్యులు అలా చెబుతుంటే చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా కనిపించారు. -
మీ అంతు తేలుస్తా!
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : ‘మీరు ఉన్నతాధికారులైతే ఏంటి.. నాకు పెద్ద మొత్తంలో సమర్పించాల్సిందే. లేదంటే మీ అంతు చూస్తా. ఏసీబీకి పట్టించి నలుగురిలో నవ్వులపాలు చేస్తా. కులం పేరుతో దూషించారని తప్పుడు కేసులు బనాయిస్తా.’ ఇదీ ఏ రౌడీనో, గూండానో మామూళ్ల కోసం బెదిరింపులకు దిగుతున్న సందర్భం కాదు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కుల సంఘానికి చెందిన నాయకుడు సాక్షాత్తూ జిల్లా ఉన్నతాధికారులే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న అంశం జిల్లాలో శుక్రవారం చర్చనీయాంశమైంది. తమపై బెదిరింపులకు పాల్ప డుతున్న మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ ఎస్ రత్నాకర్ వ్యవహార శైలిపై విసిగి వేసారిపోయిన 35 శాఖల అధికారులు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షురాలు, జేసీ–2 జి.రాజకుమారి ఆధ్వర్యంలో విషయాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయిం ఆస్మి వద్ద తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్, అతడి అనుచరులు జిల్లా ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మధ్యలో వాహనం ఆపి చెప్పిందేం చేశారని ప్రశ్నిస్తారు. ఇస్తే ఓకే లేదంటే తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారని జిల్లా ఎïస్పీకి ఫిర్యాదు చేశారు. ‘‘నీ అంతు తేలుస్తాం’ అని బరితెగింపు వ్యవహారం నడుపుతారు. అక్కడికీ లొంగకపోతే మరో అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించారని తప్పుడు కేసులు బనాయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కటికీ ఒప్పుకోని పక్షంలో ఉద్యోగులకు ఇబ్బందికరమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటి ప్రభావంతో అధికారులు మానసిక వేదనకు గురి కావాల్సివస్తోందని, ఇలాగేతే తాము ఉద్యోగాలు ఎలా చేయాలని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేధింపుల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని ఎస్పీ, కలెక్టర్‌ను కోరారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న రత్నాకర్‌పై చర్యలు తీసుకొని తమ విధులకు ఎలాంటి ఆటంకం, లేకుండా నిర్భయంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని 35 శాఖలకు చెందిన అధికారులు ఎస్పీ నయీం అస్మీని కలిసి వివరించారు. దీనిపై ఎస్పీ నయీం అస్మీ స్పందిస్తూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులందరూ కలెక్టర్ మురళీధర్‌రెడ్డిని కలిసి రత్నాకర్ చేస్తున్న బెదిరింపులు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. అయితే కలెక్టర్ మురళీధర్‌రెడ్డిని కూడా కించపరుస్తూ, బెదిరింపులకు దిగుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్టు, దీనిపై కూడా చర్యలు చేపట్టాలని అధికారుల సంఘం కోరింది. ఈ సందర్భంగా జెసీ–2 రాజకుమారి, పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రత్నాకర్, అతడి అనుచరులపై ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర డీజీపీకి, ఐజీ, డీఐజీకి వినతి పత్రాలు పంపించామన్నారు. జిల్లాలోని అధికారులెవ్వరూ ఇలాంటి బెదిరింపులకు భయపడే అవసరం లేదన్నారు. వినతి పత్రాలు అందించిన వారిలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు, డీఆర్డీఏ పీడీ మధుసూదనరావు, జెడ్పీ సీఈవో ఎం జ్యోతి, స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ సుఖజీవన్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత, పౌరసరఫరాల ఎండీ జయరాయలు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, పశుసంవర్థశాఖ జేడీ, తదితర శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. -
ఇంకా ’వెలగ’బెడుతున్న భూదందాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అడ్డగోలు భూదందాలు, కుంభకోణాలు, రౌడీయిజంతో నానాయాగీ చేసిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు ఇప్పుడు కూడా ఆయన్ని అడ్డుపెట్టుకుని విలువైన భూములు చెరపడుతున్నారు.మధురవాడలో సుమారు ఆరు కోట్ల విలువైన భూమికి టెండర్ పెట్టారు. పక్కా పత్రాలతో భూ హక్కుదారుడైన దళితునిపై దౌర్జన్యం చేసి... ఆ స్థలంలో అడుగుపెట్టకుండా దౌర్జన్యం చేస్తున్నారు.వాస్తవానికి ఏడు నెలల కితం నుంచి వివాదంలో ఉన్న భూ వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వస్తుందని ఆశించిన బాధితులకు తాజాగా కూడా వెలగపూడి వర్గీయుల నుంచి బెదిరింపులు రావడం, తాము కొనుగోలు చేసిన భూమిలోకి రాకుండా దందా చేయడం... వరుస పరిణామాలు ’తూర్పు’న వెలగపూడి మార్కు దారుణాలను, రౌడీయిజాన్ని స్పష్టం చేస్తున్నాయనే చెప్పాలి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రియల్ బూమ్ విపరీతంగా ఉండే మధురవాడలోని సర్వే నెం 2లో 2305 గజాల స్థలాన్ని పూసపాటి లక్ష్మీనరసింహరాజు నుంచి గుంటూరు జిల్లాకు చెందిన అవుతు రాజారెడ్డి కొనుగోలు చేశారు. రాజారెడ్డి నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వందాన వెంకటరావు గతేడాది 2018 నవంబర్ 4వ తేదీన సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ మేరకు అదే నెల 12వ తేదీన వెంకటరావు స్థలంలోకి ప్రవేశించి.. స్థలంలోని పిచ్చిమొక్కలను కూలీలతో తీయిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి అనుచరులు చేరుకున్నారు. వెలగపూడికి చెందిన వాహనంలోనే ఆయన సన్నిహితులు మండవ శివప్రసాద్ అలియాస్ సోనా ప్రసాద్, రామనాధబాబు తదితరులు పెద్దసంఖ్యలో అనుచరులతో వచ్చి హల్చల్ చేశారు. ఆ స్థలం మాది.. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటూ దౌర్జన్యానికి దిగారు. తాను అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశానని, పక్కా ఆధారాలున్నాయని వెంకటరావు మొత్తుకున్నా వినలేదు. ఆ స్థలం మాదేనని గదమాయించారు. ‘మీ వద్దనున్న ఆధారాలు చూపించాలని, సర్వే నెంబర్ 2లో మా పట్టా నెం 585 అని, ఒకవేళ పట్టా నెంబర్లలో తేడాలుంటే సరిచూసుకుందామని’ వెంకటరావు అభ్యర్థించినా లెక్క చేయలేదు. నీ స్థాయెంత.. నువ్వెంత... మేము నీకు భూ పత్రాలు చూపించాలా అని లెక్క లేకుండా మాట్లాడారు. మహిళా కూలీలపై దాడి మొక్కలు తొలగించే పని చేస్తున్న మహిళా కూలీలు రాగిణి, లక్ష్మిలపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలవడంతో బాధితులు అదే రోజు కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందారు. ఇక దాడి చేస్తుండగా అడ్డొచ్చిన భూ హక్కుదారుడైన వందాన వెంకటరావును కులం పేరుతో దూషించారు. ఈ మేరకు పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదనంతరం కేసు (ఎఫ్ఐఆర్ 558, 559)ను ఎస్సీ ఎస్టీ సెల్ ఏసీపీకి బదిలీ చేశారు. అంతే.. అక్కడితో కేసు అటకెక్కింది. ఎన్నిమార్లు తిరిగినా పోలీసులు కేసు విషయం తేల్చలేదు. ఇటు వెలగపూడి అనుచరులు వీరిని స్థలంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటూ వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు నివేదించగా, కమిషన్ సభ్యుడైన రాముడు వచ్చి... స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా ఎన్నికలు రావడం, టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. ఇటీవలే భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా మళ్లీ వెలగపూడి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో న్యాయం కోసం ‘స్పందన’లో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దళితుడిననే దౌర్జన్యం : వందాన వెంకటరావు వెలగపూడి రామకృష్ణబాబుకు అత్యంత సన్నిహితులైన సోనాబాబు, పరుచూరి రామనాధబాబు తదితరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిలోకి నన్ను అడుగుపెట్టకుండా చేస్తున్నారు. ఆ భూమి మార్కెట్ విలువ ఇప్పుడు సుమారు ఆరుకోట్ల వరకు ఉంది. నా వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయి. వాళ్ల వద్ద కూడా ఉన్నాయని అంటున్నారు. పోనీ సర్వే చేయించుకుందాం... అని ఎన్నిమార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. కేవలం నేను దళితుడనే వాళ్లు లెక్క చేయడం లేదని నేను అనుకుంటున్నాను. దళితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదా... విలువైన భూములు కొనుగోలు చేయకూడదా... వెలగపూడి అనుచరుల అహం, దౌర్జన్యం చూస్తుంటే అలానే ఉంది.. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలి. -
రౌడీయిజం పై పోలీసులు ఉక్కుపాదం
-
వీళ్లా మన నేతలు?
-
ఈయన ఎవరో గుర్తు పట్టారా?
సాక్షి, పశ్చిమ గోదావరి: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనదైన శైలిలో రౌడీయిజం ప్రదర్శించడం ఆయనకు అలవాటు. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే ఆయన ఎందుకు అలా కూర్చున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. మళ్లీ చింతమనేని ఎం ఘనకార్యం చేశారంటే.. శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం కావడంతో చింతమనేని రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారు వట్లూరు సీఆర్ రెడ్డి కళాశాలలో దెందులూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి తన అనుచరులతో కలిసి చేరుకున్న చింతమనేని ప్రలోభాలకు తెరతీశారు. టీడీపీ నేతల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో చింతమనేని తన రౌడీయిజం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేతలపై పలువురు టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ శ్రీధర్‌పై చింతమనేని దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరి దాడికి పాల్పడ్డారు. అయితే చింతమనేని చర్యలతో అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసకున్న వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతున్నప్పుడే చింతమనేని ఈ రకంగా వ్యవహరిస్తే.. ఇంకా ఏప్రిల్ 11వ తేదీన పరిస్థితి ఎంటని ప్రజలు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
MNS కార్యకర్తల గుండాయిజం
-
విశాఖలో బిల్డర్ రౌడీయిజం
-
నిర్వాసితులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
సాక్షి, గన్నవరం : విమానాశ్రయ భూనిర్వాసితులు శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పది రోజులుగా ఆందోళన చేస్తున్న తమను చర్చల పేరుతో ఎమ్మెల్యే ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని బయటకు గెంటివేయడంతోపాటు వ్యక్తిగత సిబ్బందితో దాడి చేయించారని మైనార్టీ వర్గానికి చెందిన బాధితులు ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. పెద్దఅవుటపల్లికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు షేక్ హైదర్‌సాహెబ్, మేడూరి తిరుపతయ్య, ఆయన కుమారుడు వినోదరావుకు 1974లో అప్పటి తహసీల్దార్ చిన్నఅవుటపల్లి గ్రామ పరిధిలో 1.10 ఎకరాల చొప్పున రెండు ఎకరాల ఇరవై సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల వారసులు ఆ భూమికి శిస్తు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం వీరి భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే ఎటువంటి పరిహారం చెల్లించకపోవడంతో గత పది రోజులుగా సదరు భూముల్లో పనులు జరగకుండా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటికి రావాల్సిందిగా నిర్వాసితులను కాంట్రాక్టర్ పిలిపించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిర్వాసితులు మల్లవల్లి, కొండపావులూరు, వీరపనేనిగూడెంలో ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం చెల్లించారని మాకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన వంశీ నిర్వాసితుల్లో ఒకరైన షేక్ అబ్దుల్లాను కాలర్ పట్టుకుని ఈడ్చుకువెళ్లి బయటకు నెట్టేశారని అక్కడే ఉన్న వీరి బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది దాడిచేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నిర్వాసితులు ఆయన ఇంటి ముందే గన్నవరం–పుట్టగుంట ఆర్ అండ్ బీ రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. రోడ్డుపై ధర్నాకు దిగినందుకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, చర్చల పేరుతో తమను ఇంటికి పిలిచి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు దుర్భాషలాడి, సిబ్బందితో కొట్టించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు. పోలీస్‌స్టేషన్ ముందు బాధితుల ధర్నా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి శనివారం రాత్రి ఆమె పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రాస్తారోకో చేసిన బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బాధితులను స్టేషన్లో నిర్బంధించి ఆహారం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. బాధితులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రౌడీల్లా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తలు, నేతలు
సాక్షి, పులివెందుల : అధికార అండతో పులివెందులలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రౌడీల్లా ప్రవర్తించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించలేక అక్రమాలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ప్రజల్లో అలజడి సృష్టించారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. -
పులివెందులలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
-
జేసీ ప్రభాకర్ గూండాగిరీ
- ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయం ఎదుట అనుచరులతో కలిసి హల్చల్ - బస్సు ప్రమాద ఘటనపై నిజాలు రాయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైనం - స్థాయి, సభ్యత, సంస్కారం మరచి దురుసు ప్రవర్తన - తాడిపత్రి ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్న అన్ని వర్గాల ప్రజలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) రాజకీయ కుటుంబం.. 60 ఏళ్లకు పైబడి వయస్సు..తొలిసారి ఎమ్మెల్యే.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు.. అలాంటి వ్యక్తి నోటి నుంచి వెలువడే ప్రతిమాట జాగ్రత్తగా, హుందాగా ఉండాలి. కానీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నీ మరచిపోయారు. విచక్షణ కోల్పోయారు. కాదు..కాదు..సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ నిజాలు రాయడాన్ని, బాధితుల తరఫున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం అనుచరులతో కలిసి వచ్చి అనంతపురంలోని ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తానో ప్రజాప్రతినిధి అనే విషయం మరచిపోయి దుందుడుకు ప్రవర్తనతో రెచ్చిపోయారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పత్రికల్లో రాయలేని, గౌరవప్రదమైన వ్యక్తులు చర్చించుకోలేని.. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అది నోరా...తాటిమట్టా?’ అనేలా మాట్లాడారు. తద్వారా తనను తాను దిగజార్చుకున్నారు. ఎమ్మెల్యే పదవి గౌరవాన్ని దిగజార్చేలా, రాజకీయవ్యవస్థ సిగ్గుపడేలా ప్రవర్తించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాజీవితంలో ఉన్నవారు తమపై వచ్చిన ఎలాంటి ఆరోపణలకైనా సమాధానం చెప్పాలి.. కానీ ఇలా స్థాయిని మరచి మాట్లాడం సంస్కారం కాదని తప్పుబడుతున్నారు. తోటి ప్రజాప్రతినిధులను గౌరవించాలనే విజ్ఞతను గుర్తురెగాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా తాను ఏం మాట్లాడారో ప్రభాకర్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. -
రౌడీయిజాన్ని పోషిస్తోంది టీడీపీ నాయకులే
శ్రీకాకుళం అర్బన్: నగరంలో రౌడీయిజాన్ని పెంచి పో షిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరపాలకసంస్థ అధికార ప్రతినిధి జె. ఎం.శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నోసార్లు ప్రకట నలు చేశారని, ఆచరణ మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నాయకులే ఇలాంటి నేరాలకు పాల్ప డుతున్నారని, అందుకే వారు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా నగరంలోని హోటళ్లు, వ్యాపారులు, ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హయాతినగరంలో రౌడీమూకలు దాడి చేసి ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, ఓ సాయంత్రం దినపత్రికపై టీడీపీ మనుషులు దౌర్జన్యం చేశారని తెలిపారు. ఇటీవల పాత 14వ వార్డు గాజులవీధిలో ఉన్న అంగన్వాడీ కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. అలాగే రెండు రోజుల కిం దట ఓ హోటల్‌పై దాడి జరిగిందన్నారు. ఈ రౌడీమూకలకు స్థానిక ఎమ్మెల్యే కొమ్ముకాయడం శోచనీయమన్నారు. నగరంలో రౌడీయిజాన్ని అణచివేయడం చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. అఖిలపక్షం నాయకులతో కమిటీ వేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నగర పాలక సంస్థకు ఎన్నికలు కూడా నిర్వహించలేని దుస్థితిలో ఆ పార్టీ ఉందని అన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ యువజన విభాగం నరగసంస్థ అధ్యక్షుడు కోరాడ రమేష్, పార్టీ నేతలు కర్నేని హరి, అలపాన అప్పోజీరెడ్డి, కె.రంగాజీదేవ్ తదితరులు ఉన్నారు. -
టీడీపీది గూండాగిరీ
► ఎన్ని దౌర్జన్యాలు చేసినా వైఎస్ వివేకా గెలుపు ఖాయం ► రౌడీయిజం,అధికార దుర్వినియోగంతో ప్రజల మన్ననలు పొందలేరు ► వైఎస్ వివేకా, ఆకేపాటి, ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ ధ్వజం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ గూండాగిరి చేస్తోందని, సీఎం నుంచి కిందిస్థాయి వరకు దౌర్జన్యానికి పాల్ప డుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవా రం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమ మా ర్గాల ద్వారా గెలుచుకోవాలని చూస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తామెప్పుడూ చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేక టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని అడ్డగోలుగా, అడ్డదారిలో ప్రతి పక్షపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను భయపెట్టి, ఆయా కుటుంబాలను చంపుతామంటూ భయోత్పాతం సృష్టిస్తుండడం సిగ్గుగా లేదా? అని సీఎంను ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తుపై గెలి చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడడం దారుణమన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అంజద్బాషానగర నడిబొడ్డున, పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయా ల సమీపంలోనే టీడీపీ నాయకులు తమ కార్పొరేటర్ పై దాడికి దిగడం తగునా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కడప నగరంలో ప్రశాంత వాతావరణం ఉంటోందని, అటువంటి వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఫ్యాక్షన్ సంఘటనలకు ఆలవాలంగా టీడీపీ నాయకులు మార్చడం విచారకరమన్నా రు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ప్రజాబలం ఉంటే తమ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల విశ్వాసం పొందితే అప్పుడు నిజమైన నాయకుడని ఒప్పుకుంటామన్నారు. మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్రభుత్వం దురాగతాలకు పాల్పడుతోందన్నారు. టీడీపీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లి అక్కడ లబ్ధిపొంది మళ్లీ టీడీపీలోకి వచ్చి ఇక్కడా లబ్ధి్దపొందుతూ ఇత ర పార్టీల నాయకులను విమర్శించడం తగదన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే ముందు అటు శ్రీనివాసులురెడ్డి, ఇటు ఆదినారాయణరెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని మా ట్లాడితే బాగుంటుందన్నారు. ఫ్యాక్షన్ వద్దు....ఫ్యాషన్ ముద్దు అన్న నాయకు లు ఇప్పుడు చేస్తున్న దురాగతాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసీని కలుస్తాం: వివేకా ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికను ఎదుర్కోలేక టీడీపీ నేతలు అక్రమ మార్గాలను ఎంచుకున్నారని ఆరోపించారు. ఎన్ని నీచ రాజకీయాలు చేసినా, బెదిరింపులకు దిగినా, దౌర్జన్యాలకు పాల్పడినా తమ పార్టీ ప్రజాప్రతినిధులు తమకు అండగా ఉంటున్నారన్నారు. ఎన్నికలో టీడీపీ దుర్మార్గ రాజకీయాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నందునా ఈ జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ను కలిసి విన్నవిస్తామన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను కలిసి ఇక్కడి విషయాలను తెలియజేస్తామన్నారు. -
విశాఖలో పచ్చనేతల ఇష్టారాజ్యం
-
బ్యాంక్ మేనేజర్‌పై రౌడీయిజం
రుణం చెల్లించమంటే రుబాబు పార్వతీపురం : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పార్వతీపురం పట్టణంలో ప్రస్తుతం రౌడీయిజం ఛాయలు కనిపిస్తున్నాయి. తీసుకున్న రుణం చెల్లించమన్నందుకు స్థానిక నవిరి కాలనీలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్‌ను కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్, అతని అనుచరులు బెదిరించారు. దీనికి సంబంధించి బ్రాంచి మేనేజర్ జె. బాలకృష్ణ, మెయిన్ బ్రాంచి మేనేజర్ ఎ. రవికుమార్ సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్ అనే వ్యక్తి పల్సర్ బైక్ కొనుగోలుకు 2015 మార్చిలో రూ.45 వేల రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించలేదు సరికదా...రుణం కూడా చెల్లించలేదు. ఈ విషయమై బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించాలని బీఎం బాలకృష్ణ కోరగా, సోమవారం సాయంత్రం పూటుగా మద్యం తాగిన మరో ఐదుగురు వ్యక్తులను బ్రాంచికి తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతనితో వచ్చిన వ్యక్తులు ఏ ఊరు నీది...ఎక్కడుంటున్నావ్...మీ ఇంటికి భోజనానికొస్తాం... బ్యాంకు ఎప్పుడు కడతావ్... బ్యాంకు కట్టి బయటికి రా...? నీ సంగతి చూస్తామంటూ...బెదిరించారు. ఈ విషయాన్ని ఎస్సై సురేంద్రనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. -
భూకబ్జాలు, రౌడీయిజం చేసే వారిపై పీడీ యూక్ట్
నేర సమీక్ష సమావేశంలో డీఐజీ మల్లారెడ్డి వరంగల్‌క్రైం : భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజం చెలాయించేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా వరంగల్ రూరల్, అర్బన్ పోలీసు అధికారులతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధికెక్కిన వరంగల్ జిల్లాలో విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, దేశంలోనే వరంగల్ జిల్లా పోలీ సులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గతంలో జిల్లాలో ఉన్న మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించి దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో రౌడీయిజాన్ని తరిమివేయాలంటే పీడీ యాక్ట్ ఉపయోగించక తప్పదని, ఇందుకోసం పోలీస్‌స్టేషన్లవారిగా ముఖ్యమైన రౌడీలను గుర్తించాలన్నారు. ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా మాట్లాడుతూ భూపాలపల్లి బ్యాంక్ దోపిడీ ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు తమ పరిధిలోని బ్యాంకుల భద్రతపై బ్యాంకు అధికారులతో సమీక్షించాలన్నారు. సమావేశంలో అర్బన్, రూరల్ పోలీస్స్టేషన్ల పనితీరుతోపాటు అధికారులు, సిబ్బంది పనితీరుపై సమీ క్ష జరిపారు. సమావేశంలో అర్బన్, రూర ల్ అదనపు ఎస్పీలు యాదయ్య, అనిల్ కుమార్, జాన్‌వెస్లీతోపాటు కాజీపేట, హన్మకొండ, వరంగల్, మామునూరు, ములుగు, పరకాల, మహబూబాబాద్, జనగామ, ట్రాఫిక్ డీఎస్పీ లు జనార్దన్, శోభన్‌కుమార్ , సురేంధ్రనాథ్, మహేందర్, రాజమహేంద్రనాయక్, సంజీవరావు, నాగరాజు, సురేందర్, వెంకటేశ్వర్రావుతోపాటు సీఐ, ఆర్ఐ, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఒక్క కార్డు రాయండి చాలు
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంతోపాటు జిల్లాలో రౌడీయిజం చేసే వారి సమాచారాన్ని పోస్టు కార్డు ద్వారా తెలియజేస్తే చాలు వారి భరతం పడతానని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రౌడీషీటర్లుగా నమోదైన వారంతా రౌడీయిజాన్ని పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కొందరు రౌడీలు రాజకీయ నాయకుల ముసుగులో పంచాయతీలు చేస్తున్నారని, వీరిపై ఆధారాలు అందిస్తే అణిచివేస్తామన్నారు. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచి తమదైన శైలిలో విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇటీవల కొంతమంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చానని, వారిలో మార్పు వస్తే సరేనని, లేకపోతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.