వేపనపల్లెలో వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునేందుకు యత్నం
అసభ్యపదజాలంతో దూషిస్తూ బెదిరింపులు
పోలీసుల రంగప్రవేశంతో ముందుకుసాగిన ప్రచారం
టీడీపీ శ్రేణుల రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతోంది. యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. బెదిరింపులతో వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టాలని యతి్నస్తోంది. ఎన్నికల ప్రచారం సైతం సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతోంది. చివరకు పోలీసుల పహరాలో ఓట్టు అభ్యర్థించునే పరిస్థితిని కల్పిస్తోంది.
కాణిపాకం: పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేతలపై సోమవారం టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక నానా రాద్ధాంతం సృష్టించారు. బడా నాయకుల డైరక్షన్‌లో గొడవకు యత్నంచారు. తమ ఊర్లో వైఎస్సార్‌సీపీ ప్రచారం జరగకూడదని, ఓట్లు అడిగేందుకు వీలులేదంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. పక్క గ్రామంలో పర్యటిస్తున్న సునీల్‌కుమార్ వద్దకు వెళ్లి వేపనపల్లెలో ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకోవడం తన హక్కని ఆయన స్పష్టం చేయడంతో చేసేది లేక భద్రత కలి ్పంచారు.
డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ సుదర్శనప్రసాద్, విశ్వనాథరెడ్డి అక్కడి చేరుకుని పటిష్ట బందోబస్తుతో వేపనపల్లెలో ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.45 గంటలకు వేపనపల్లె గ్రామానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ తదతరులు చేరుకున్నారు. ఇంతలో అక్కడ గుమికూడిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ నేతలపైకి దూసుకొచ్చారు. పచ్చిబూతులతో దూషించారు. పోలీసుల సమక్షంలోనే ఊర్లో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరించారు. వీరికి జనసేన కార్యకర్తలు సైతం వంతపాడారు. మొత్తం వ్యవహారం గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పచ్చమూకకు గట్టిగా వారి్నంగ్ ఇచ్చారు. ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థుల ప్రచారం అడ్డుకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసుల పహరా నడుమ సునీల్‌కుమార్ గ్రామంలో ప్రచారం సాగించారు. అయినప్పటికీ పచ్చబ్యాచ్ నినాదాలు చేస్తూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా గొడవకు కాలుదువ్వారు. అయితే వైఎస్సార్‌సీపీ ఎమ్మెలే9్య అభ్యర్థి ప్రచారాన్ని ప్రశాంతంగా ముగించారు. కాగా, ఆరు నెలలకు కిత్రం ఆ గ్రామంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో గొడవ చోటుచేసుకుంది. అప్పుడు కూడా కొందరు ఇలానే ప్రవర్తించారు. అప్పుడు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కక్షతోనే ఇప్పుడు మళ్లీ గొడవ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్య విరుద్ధం
వేపనపల్లెగ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ మండపడ్డారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాళ్ల దాడి చేసినప్పుడే ఓపికతో వ్యవహరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే అడ్డగించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment