సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంతోపాటు జిల్లాలో రౌడీయిజం చేసే వారి సమాచారాన్ని పోస్టు కార్డు ద్వారా తెలియజేస్తే చాలు వారి భరతం పడతానని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రౌడీషీటర్లుగా నమోదైన వారంతా రౌడీయిజాన్ని పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.
కొందరు రౌడీలు రాజకీయ నాయకుల ముసుగులో పంచాయతీలు చేస్తున్నారని, వీరిపై ఆధారాలు అందిస్తే అణిచివేస్తామన్నారు. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచి తమదైన శైలిలో విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇటీవల కొంతమంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చానని, వారిలో మార్పు వస్తే సరేనని, లేకపోతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.
ఒక్క కార్డు రాయండి చాలు
Published Tue, Sep 23 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement