Post card
-
ఉత్తరం కలిపింది వారిని...!
బ్రిటన్‌లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్లో కలుసుకున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారంటే..? ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్‌కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్‌కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు. తాత ఇంటి నుంచి లేఖ.. ‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్‌లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆశ్చర్యపోయా.. ‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది. బంధువులను కలవడం బాగుంది... ‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ పోస్ట్‌కార్డు.. జీవితకాలం లేటు!
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్లైన్లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.లేఖలో ఏముందంటే..‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : పూర్వ వైభవాన్ని సాధించే క్రమంలో తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, సేవలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేకపోవడంతో, రెగ్యులర్‌గా పోస్టాఫీసులకు వెళ్లేవారికి తప్ప మిగతా వారికి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాఖ సిబ్బంది ప్రజలకు చేరువగా వెళుతున్నారు. బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఊరూరా, ఇంటింటా తిరుగుతున్నారు. పోస్టాఫీసును, వాటి ద్వారా అందుబాటులో ఉన్న సేవలను గుర్తు చేస్తున్నారు. తపాలాఫీసును ఉత్తరాల బట్వాడా కార్యాలయంగానే చూడకుండా.. వివిధ ప్రజోపయోగ సేవలకు కేంద్రంగా గుర్తించాలంటూ కరపత్రాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం, ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడం విశేషం. తోక లేని పిట్ట 90 ఆమడలు తిరిగిందట ..ఏంటది..? అంటూ..ఒకప్పుడు పోస్టు కార్డు గురించిన పొడుపు కథ విప్పమని అడిగేవారు.ఇప్పటితరానికి పోస్టు కార్డు తెలియదు.. పొడుపు కథ అంతకన్నా తెలియదు. కొందరికి తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) గురించి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటు కొరియర్ సంస్థలు, బ్యాంకులుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత తపాలా శాఖ ఒకప్పటి వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇక జనం తపాలా సేవలను మరిచిపోతున్నారా? అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో పోస్టల్డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తానే జనం బాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక మేళాలు నిర్వహించడంతో పాటు కరపత్రాలు, బ్యానర్లతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు అంతగా అందుబాటులో ఉండనందున, గ్రామాల్లో ప్రచారం చేస్తూ మైక్రో ఏటీఎంల ద్వారా తమ సిబ్బందే ఫోన్ చేస్తే ఇంటికి డబ్బు తెచ్చి అందిస్తారని, పోస్టాఫీసులకు వెళ్లినా డబ్బు చెల్లిస్తారని, రైతు బంధు లాంటివి కూడా ఇంటికే వచ్చి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల వారం రోజుల్లోనే 1,52,833 పొదుపు ఖాతాలను తెరిపించిన తెలంగాణ సర్కిల్ జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు ఖాతాల సంఖ్య 42,55,352కు చేరుకుంది. వీటిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6,76,975 ఖాతాలు తెరవడం గమనార్హం. ఆకర్షిస్తున్న వడ్డీ శాతాలు వృద్ధుల పేరుతో ఖాతాలు తెరిస్తే గరిష్టంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుండటం జనం తపాలా ఖాతాల వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఆడపిల్లల పేరుతో చేసే పొదుపు మొత్తంపై 7.6 వడ్డీ చెల్లిస్తున్న కారణంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల మేళాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన కేవలం మూడు రోజుల్లోనే కొత్తగా 34,384 ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 5,71,659కి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ తరహాలో 92,509 ఖాతాలు తెరుచుకోవడం విశేషం. ♦ ‘సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరిట పొదుపు ఖాతా తెరిస్తే 7.6 శాతం వడ్డీతో ఆ మొత్తం చూస్తుండగానే పెరుగుతూ పోతుంది. వారి చదువులకు, పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది..’అంటూ తపాలా శాఖ ప్రజల్లోకి వెళ్లింది. సిబ్బంది చేసిన కృషి ఫలించింది. తల్లిదండ్రులు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల ఖాతాలు తెరిచారు. ♦ ‘తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు తెరిస్తే మంచి వడ్డీతో పాటు మైక్రో ఏటీఎం ద్వారా పోస్ట్‌మాన్ ఇంటికి డబ్బు పట్టుకొస్తారు. ఏటీఎంకు దూరంగా ఉన్నామన్న బెంగ అవసరం లేదు..’అంటూ తపాలా శాఖ సిబ్బంది మహా మేళాల ద్వారా చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల కొత్త పొదుపు ఖాతాలు తెరుచుకున్నాయి. తపాలా శాఖ ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్నాం. వీటిల్లో చాలావరకు పోస్టాఫీసు వరకు రాకుండా పోస్ట్‌మాన్ ద్వారానే పొందవచ్చు. జనవరి నుంచి ఖాతాలపై వడ్డీని కూడా పెంచాం. కానీ ప్రజల్లో వీటిపై పెద్దగా అవగాహన లేదు. అందుకే మేమే వారి వద్దకు వెళ్తున్నాం. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది. –పీవీఎస్ రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ -
World Post Day 2021: జ్ఞాపకాల మూట
World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్. ‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్.వి.రంగారావు ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని టెలిగ్రామ్ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు. చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు. గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు. ‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్ ఏదిరా అని పోస్ట్మేన్ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు. 1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్ మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది. సౌదీ, అమెరికా, రంగూన్... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ? ఇంటర్వూకు కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి. ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా. కొందరు పోస్ట్‌బాక్స్ నంబర్ తీసుకుని ఆ నంబర్ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్’కు పాజిటివ్ ఇమేజ్ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే. సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు. ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్. ‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’ -
అప్పట్లో అయితే ఇలా ఉండేది కాదు!
ఇప్పుడంతా డిజిటల్ మయం.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచంలోని నలుమూలలా ఏం జరుగుతుందో ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. సమగ్ర సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చు... అందుకే చాలా మందికి మొబైల్ ఫోన్ ఓ నిత్యావసరంగా మారిపోయింది.. నిద్రాహారాలు మాని దానికే అతుక్కుపోయే ‘వ్యసనపరుల’ గురించి కాసేపు పక్కనపెడితే.. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు ఇలా ప్రతి ఒక్కరు ఫోన్ సహాయంతో ఆన్‌లైన్‌తో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇక వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్‌తో పాటు జీ- మెయిల్ వంటి యాప్‌లతో సందేశాలు పంపిస్తూ స్నేహితులకు చేరువగా ఉంటున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రతి నిమిషం అప్డేట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడుతున్నారు. గోప్యతకు భంగం కలిగించే కేటుగాళ్లు ఆర్థికంగా దెబ్బతీయడమే గాకుండా.. వారి ప్రవర్తనతో మానసిక వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు. కాబట్టి స్మార్ట్‌గా ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో.. అంతకు ఎక్కువ నష్టాలు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రైవసీ కాపాడుకోవడం ఈ డిజిటల్ యుగంలో కత్తిమీద సాములా తయారైంది.(చదవండి: ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం!) అప్పుడైతే ఇలాంటి బాధలు లేనేలేవు..! మిలినియల్స్‌కు తెలియదేమో గానీ.. 90వ దశకంలో జన్మించిన చాలా మందికి.. ఇంటి ముందు నుంచి పోస్ట్ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు ఇప్పటికీ గుర్తే. ఆ చిన్ని కాగితాన్ని ఇంటిల్లిపాది ఒకేచోట చేరి చదవడం, ఆప్తుల క్షేమసమాచారాలు తెలుసుకుని వాటి గురించి చర్చించుకునేవారు. బాధైనా, సంతోషమైనా అక్షరాలను పదే పదే తరచి చూస్తూ జ్ఞాపకాలు నెమరువేసుకునే వారు. చూడటానికి చిన్నగానే ఉన్నా మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరే వారధిగా పోస్టుకార్డుకు ప్రత్యేక స్థానం ఉండేది. ముఖ్యంగా ఇప్పటిలాకాకుండా.. పరస్పరం పంచుకున్న భావాలు, విషయాలు ఉత్తరం పంపిన వారికి, దానిని అందుకున్న వారికి మాత్రమే తెలిసేవి. ప్రైవసీకి భంగం కలిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటంతో.. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు ఇటీవలి కాలంలో డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ వివాదాస్పద మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం వీటికి ఆదరణ పెరుగుతోంది. అయితే.. ఏదో ఒకరోజు వీటి కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, టెక్నాలజీ రోజురోజుకూ మారుతుంది కాబట్టి అందుకు అనుగుణంగానే మార్పులు చోటుచేసుకుంటాయని, ఏదేమైనా ఉత్తరాల(పోస్టుకార్డు)కు అప్పట్లో ఉన్న క్రేజ్, ప్రైవసీ విధానంలో మరేదీ సాటి రాదని పోస్టుకార్డు ప్రేమికులు అంటున్నారు. -
కబురు తెచ్చే మనిషి
చూపులు గుమ్మం మీదే ఉండేవి. చెవులు సైకిల్ బెల్ కోసం రిక్కించేవి. ‘పోస్ట్’ అన్న పిలుపూ ఆ వెంటనే గేటు మీదుగా ఊపుగా వచ్చి పడే జాబు.. ఇవి ఎన్నో ఇళ్లను వెలిగించేవి. ఎన్నో ఇళ్లను ఓదార్చేవి. కొన్నింటిని విచారంలో ముంచేసేవి. పోస్ట్‌మేన్ వచ్చి పోతున్నాడంటే ఆ ఇల్లు సజీవంగా ఉన్నట్టు అర్థం. ప్రతి ఇంటి ఖాకీ బట్టల బంధువు పోస్ట్‌మేన్. ఆ జ్ఞాపకాలు, ఆ కథలు, అతడు ఉన్న సినిమాలు... మరపు రావు ఆ పాత రోజులు. ‘‘ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు... ఇన్ని కళ్లు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలికి చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిగా వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు’ అని రాశాడు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘తపాలా బంట్రోతు’ కవితలో. ప్రపంచంలో అతి పెద్ద తపాలా వ్యవస్థ మన దేశంలో ఉన్నా దాని వాహకుడు మాత్రం పోస్ట్‌మేనే. పోస్టాఫీసును, పోస్టు డబ్బాను, పోస్టు కోసం ఎదురు చూసే ఇంటిని పోస్ట్‌మేనే కలుపుతాడు. కబురు తెస్తాడు. కొలువు కాగితం తెస్తాడు. క్షేమ సమాచారం తెలుపుతాడు. కాని గుక్కెడు మంచినీళ్లు కూడా తాగే తీరిక లేకుండా సైకిల్ మీద పెడల్ తొక్కుతూ మరో గడపకు చేరుకుంటాడు. అక్టోబర్ 9 ‘ప్రపంచ తపాలా దినోత్సవం’. 1874లో అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ ఏర్పడిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇవాళ పోస్ట్‌మేన్ సేవలు మారవచ్చు. పోస్ట్‌మేన్ ప్రాధాన్యం మారవచ్చు. సెల్‌ఫోనే కలం, కాగితంగా మారాక, జనం రాయడం మర్చిపోయాక, ఉత్తరానికి ఉన్న ఆఘ్రాణింపు కరువైపోయాక పోస్ట్మేన్తో బంధం పలుచబడింది కాని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పోస్ట్‌మేన్ కబుర్ల రారాజు. ప్రతి ఇంటి దగ్గరి మనిషి. సంచినిండా జీవితాలను మోసుకుంటూ వచ్చే వాహకుడు. పది దాటాక... ఉదయం పది దాటాక ఎప్పుడైనా పోస్ట్‌మేన్ రావచ్చు. ఎండ కాయనీ, వాన కుమ్మరించనీ, చల్లగాలులు చిమ్ముకుంటూ తిరగనీ.. పోస్ట్‌మేన్ రావాల్సిందే. రాకపోతే ఏమవుతుంది? లోకం కదలదు. దూరాన సైన్యంలో ఉన్న కొడుకు క్షేమం తెలియదు. మెట్టినింట నెలలతో ఉన్న కూతురు ఎప్పుడు తనను తీసుకెళ్లమంటుందో తెలియదు, స్నేహితుడు పెట్టుకున్న కుమారుడి పెళ్లికబురు తెలియదు. దగ్గరి చుట్టం అవసరానికి ఏదో అడిగితే సాయం గురించి ఆలోచన చేయడం తెలియదు, మీ అమ్మాయి మాకు నచ్చింది... త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం అనే మాట ఉత్తరంలో కాకుండా ఇక దేనిలో తెలుస్తుంది. పరాయి దేశం వెళ్లిన భర్తకు భార్య గురించి భార్యకు భర్త గురించి ఉత్తరమే కదా తెలిపేది. అందుకే అందరూ వీధి గుమ్మం వైపు చూసేవారు. పనులకు మగవాళ్లు వెళ్లిపోగా చేటలో బియ్యం చెరుగుతూ, స్టౌ మీద కూరను గరిటెతో కలియబెడుతూ స్త్రీలు ఒక కన్ను వీధి వైపు వేసేవారు. పోస్ట్ అన్న కేక వినగానే పెట్టే పరుగు ప్రతి ఇంటి వీధి గుమ్మానికి తెలుసు. మని ఆర్డర్.. టెలిగ్రామ్ ఇప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే, ఆన్లైన్ బ్యాంకింగ్.. క్షణంలో డబ్బు ట్రాన్స్ఫర్. కాని ‘మనీఆర్డర్’లో ఉండే మజా ఇప్పుడు ఎక్కడా? దాని కోసం ఎదురు చూస్తూ... ఇవాళ రాలేదు మాష్టారు అని పోస్ట్‌మేన్ చెప్తే నిరాశ పడుతూ... తీరా వచ్చాక అందులో నుంచి ఒక రూపాయో ఐదో పోస్ట్‌మేన్ చేతిలో పెట్టి సంతోషపడుతూ... మధురం. ఇక అర్జెంట్ కబురుకు టెలిగ్రామ్ వచ్చిందంటే అందరి గుండే గుబగుబే. టెలిగ్రామ్ ఎందుకనో దుర్వార్తకే స్థిరపడింది కాని ‘ఉద్యోగం వచ్చిందనో’, ‘మనమరాలు పుట్టిందనో’ అది మాత్రం మంచి కబురు తేలేదా? చదువరి పోస్ట్‌మేన్ ఈ దేశంలో కేవలం ఉత్తరం అందించి ఊరుకోలేదు. దానిని చదివి కూడా పెట్టాడు. కోట్లాదిగా ఉండే నిరక్షరాస్య భారతీయులకు పోస్ట్‌మేనే చదువరి. ‘కాస్త చదివిపెట్టు నాయనా’ అంటే వచ్చిన ఉత్తరాన్ని చదివిపెట్టేవాడు. కాస్త రాసి పెట్టు నాయనా అంటే రాసిపెట్టేవాడు. అందరి కష్టసుఖాలు అతనికి తెలుసు. ఇందరు బంధువులు ఉండే భాగ్యం ఏ వృత్తిలోనూ మరొకరికి సాధ్యం కాదు. అందరూ అతని ద్వారా తమవారి క్షేమసమాచారాలు తెలుసుకునేవారే తప్ప అతని క్షేమం గురించి ఆలోచించేవారు కాదు. దసరా పండుగనాడు రెండు రూపాయల మామూలే పోస్ట్‌మేన్‌కు పెన్నిధి. కథలను నడిపించినవాడు అసలు పోస్ట్‌మేన్ లేకపోతే తెలుగులో చాలా కథలు మొదలై ఉండేవి కావు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే వాక్యంతో వందలాది కథలు మొదలవుతాయి. ఆర్.కె.నారాయణ్ ‘మాల్గుడి డేస్’లో ఆ ఇంటి ఆడపిల్లను కూతురికి మల్లే వాత్సల్యంగా చూసే పోస్ట్‌మేన్ ఆ పిల్ల పెళ్లికి రెండు రోజుల ముందు వచ్చిన బంధువు చావు వార్తను దాచేస్తాడు. పెళ్లయ్యాకే ఆ ఉత్తరం ఇచ్చి పెళ్లి మూడ్ పాడు కాకుండా చూస్తాడు. రవీంద్రనాథ్ టాగోర్ ‘ది పోస్ట్‌మాస్టర్’ కథ ప్రఖ్యాతం. అసలు పోస్ట్‌మేన్ ఉన్నాడని రాసింది తీసుకెళ్లి ఇస్తాడని ఎందరో పెద్దలు కార్డు ముక్కనో, ఇన్‌లేండ్ కవర్నో సాహితీ పత్రంగా మార్చేశారు. పోస్ట్‌మేన్ చేతుల మీదుగా నడిచిన ‘లేఖా సాహిత్యం’ అపూర్వం. కందుకూరి లేఖలు, గురజాడ లేఖలు, సి.ఆర్.రెడ్డి– రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మధ్య నడిచిన లేఖలు, త్రిపురనేని రామస్వామి చౌదరి అలనాడు ముట్నూరి కృష్ణారావుకు రాసిన లేఖలు, చలం ‘ప్రేమలేఖలు’, త్రిపురనేని గోపిచంద్ ‘పోస్ట్ చేయని ఉత్తరాలు’... ఎన్నని. ఇవాళ ఈ రాసే లేఖా సాహిత్యం అంతమైంది. పోస్ట్‌మేన్ రిక్తహస్తాలతో నిలబడ్డాడు. మనిషి స్పర్శ ఉత్తరం అంటే మనిషి స్పర్శ. మనిషి తాకిన లేఖను మరో మనిషి తాకుతాడు. మనిషి రాసిన రాతను మరొక మనిషి చదువుతాడు. ఈ మొత్తంలో స్పర్శ ఉంది. దగ్గరి తనం ఉంది. ఒక ఎస్.ఎం.ఎస్, ఒక వాట్సప్ మెసేజ్, ఒక ఈ మెయిల్ అందరిదీ అందరికీ ఒక్కలాగే కనిపిస్తుంది. కాని ఉత్తరం అలా కాదు. అది మనిషి మనిషికి మారుతుంది. ఆ స్పర్శ ఇవాళ మిగల్లేదు. దానికి ప్రత్యక్షసాక్షి అయిన పోస్ట్‌మేన్ ముఖం తెలియడం లేదు. ఇవాళ పోస్టాఫీసులు, పోస్ట్మేన్లు సామాన్యుల ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ సేవలు అందిస్తున్నారు. మిస్సవుతున్నదల్లా ‘ఉత్తరం వచ్చిందా’ అనే ప్రశ్న... ‘పోస్ట్’ అనే పిలుపు. – సాక్షి ఫ్యామిలీ -
పోస్ట్‌కార్డ్‌లో ప్రపంచం
‘పడయప్ప (నరసింహ) సినిమాలోని నీలాంబరి పడయప్పను సవాల్ చేస్తుంది. అలాగని ఆమె స్త్రీవాద ప్రతినిధేమీ కాదు. విలన్‌గా కనిపించిన మహిళ. సమాజంలో స్త్రీని చూసే కోణానికి ప్రతీక ఆ భూమిక. ఆడవాళ్లను చూసే విధానం మారినప్పుడే వాళ్లను చిత్రీకరించే తీరు మారుతుంది. చిత్రీకరించే తీరు మారినప్పుడే వాళ్ల పట్ల సమాజం దృష్టీ మారుతుంది’ ఒక పోస్ట్‌కార్డ్ మీద ప్రింట్ అయిన మ్యాటర్ అది. ఎవరికి పోస్ట్ చేశారు ఆ కార్డ్‌ను? ‘పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్’కు! ఇదొక ప్లాట్‌ఫామ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిల్పకారులు, ఆర్కిటెక్ట్స్, డాన్సర్స్, సంగీతకారులు, జర్నలిస్టులు, ఎన్జీవోల నుంచి ఈ పోస్ట్‌కార్డులను ఆహ్వానిస్తోంది ఆ ప్రాజెక్ట్. వాళ్లు ఆచరించే సిద్ధాంతాలు లేదా విశ్వాసాలు, వాళ్లు పాటించే సూత్రాలు, చేస్తున్న పని ఇలా దేనిగురించైనా నాలుగు మాటలు రాసిన ప్రతి, వాళ్ల ఫొటోగ్రాఫ్‌తో సహా. తర్వాత ఆ మాటలను పోస్ట్‌కార్డ్ మీద ప్రింట్ చేసి.. ఆ ఫొటోను దానికి జతపరుస్తోంది ఆ ప్రాజెక్ట్. ఎందుకు? ‘చేయడానికి చాలా పనులుంటాయి.. ప్రతి పని మానసిక వికాసాన్నిస్తుంది.. ఆరోగ్యంగా బతకడానికి అది చాలా అవసరం.. ఇవన్నీ ఇమిడి ఉన్న విశాల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయాలన్నదే ఈ పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్ వెనకున్న ఉద్దేశం. బహుముఖ ప్రజ్ఞను నమ్ముతాన్నేను. ఆ దిశగా ఈ తరం తర్ఫీదు కావాలనీ ఆశపడ్తున్నాను. దాన్ని సాధించడానికే ఈ పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్’ అంటోంది దీన్ని ప్రారంభించిన ప్రియాంక ఉలగనాథన్. ఎలా? ఈ పోస్ట్‌కార్డ్‌లన్నిటినీ పిల్లల దగ్గరకు తీసుకెళ్లి.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రంగాల్లో ఎంత మంది కృషి చేస్తున్నారు.. వాళ్ల పనివిధానం.. నైపుణ్యం.. జీవన శైలి.. సంస్కృతి.. కళారూపాలు .. ఇలా అన్నిటి గురించి వాళ్లకు చెప్తూ పిల్లల ఆలోచనా పరిధిని పెంచే ప్రయత్నం చేస్తోంది. రెండున్నర నెలల కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి పలురంగాలకు చెందిన యాభై మందికి పైగా నిపుణుల నుంచి పోస్ట్‌కార్డులు అందాయి. కొంతమంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆర్థికవేత్తల నుంచీ పోస్ట్‌కార్డ్స్ అందుతున్నాయట. ఈ ప్రాజెక్ట్‌లో మరో భాగస్వామి చెన్నైకి చెందిన శిల్పి.. దీపిక. పోస్ట్‌కార్డ్ మీద తన ముఖాన్ని చిత్రించి.. ఆ ముఖం మీద మెడలను వేలాడేసిన పక్షుల పెయింటింగ్ వేసింది. మనుషుల నిర్లక్ష్యం వల్ల పక్షిజాతి ఎంత ప్రమాదంలో పడిందో చెప్పే చిత్రం అది. తమిళనాడులోని కూడంకుళమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద పనిచేసిన ఫొటోగ్రాఫర్ అమృతారాజ్ స్టీఫెన్ ప్రస్తుతం ఆమ్స్టర్డ్యామ్లో ఉంటోంది. ఆమె ఈ పోస్ట్‌కార్డ్ ప్రాజెక్ట్‌కు ఒక పోస్ట్కార్డ్ను పంపారు. కూడంకుళమ్ న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌కు రష్యా అందిస్తున్న సాంకేతిక మద్దతును ఆపేయాలని విన్నవిస్తూ రష్యన్ అంబాసిడర్‌కు కుడంకుళం పిల్లలు రాసిన విన్నపాన్ని, కుడంకుళం మీద తాను తీసిన ఒక ఫొటోనూ జత చేస్తూ. ఇలా పర్యావరణం కోసం పోరాడుతున్న వాళ్ల నుంచీ పోస్ట్‌కార్డ్‌లు వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్‌కు. పిల్లల్లో సామాజిక స్పృహను కల్పించేందుకూ పోస్ట్‌కార్డ్ ఉద్యమం ఓ మాధ్యమంగా పనిచేస్తోంది. -
పోస్టుకార్డుకు 141 ఏళ్లు
ఇంటి ముందు నుంచి పోస్ట్ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు పాతకాలంలో కనిపించేవి. ఆ చిన్ని ఉత్తరం రాగానే ఇంటిల్లిపాది ఒకచోట చేరి దానిని చదివి ఎంతో ఆనందించేవారు. అదే పోస్టుకార్డు. చిన్నగా ఉండే ఆ పోస్టు కార్డు ఎన్నో పెద్దపెద్ద విషయాలను మోసుకొచ్చేది. ఆ చిట్టి పోస్టుకార్డే కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచేది. మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పర్చేది. అంతటి ఘన కీర్తి కలిగిన ఆ పోస్టుకార్డుకు ప్రస్తుతం ఆదరణ లేదు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆ పోస్టుకార్డుకు స్థానం లేదు. తమ భావాలను పంచుకునేందుకు, విషయాలను వివరించేందుకు ఆ పోస్టుకార్డు ఉనికి లేదు. సర్వం మొబైల్ మయం. నేడు పోస్టుకార్డు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, పాల్వంచరూరల్(ఖమ్మం) : నాడు ఎంతో ఆదరణ పొందిన పోస్టుకార్డుకు మారుతున్న ఆధునిక సమాజంలో ఆదరణ కరువైంది. సాంకేతిక విప్లవంతో అధునాతమైన మొబైళ్లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ యుగం రాకెట్ స్పీడుతో దూసుకుపోతుండటంతో 14 దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన, మంచిచెడుల సమాచారాన్ని చేరవేసే తోకలేని పిట్ట పోస్టుకార్డు నిరాదరణకు గురై కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది. భారతదేశంలో నాడు పాలించిన అంగ్లేయుల పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసినట్లు చెబుతున్న పోస్టుకార్డు 1879 జూలై 1న ఆవిర్భవించింది. నాడు ఈ కార్డును అణాపైసకు విక్రయించేవారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పోస్టుకార్డును వినియోగించుకునేవారు. సూదూర ప్రాంతాల్లోని బంధువుల యోగ క్షేమాల సమాచారం కార్డు ద్వారానే తెలుసుకునే అవకాశం ఉండేది. గతంలో ప్రభుత్వాలు కూడా పోస్టు కార్డు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముద్రించి ప్రచారం చేసేవి. కానీ, గతంతో పరీశీలించి చూస్తే ప్రస్తుతం కార్డు ప్రభావం గణనీయంగా తగ్గింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల ప్రవేశంతో పోస్టుకార్డు నేడు ఉనికిని కోల్పోయే దశకు చేరింది. ప్రజలకు ఈ కార్డు ఆవసరం లేకుండా పోయింది. తొలి తెలంగాణ ఉద్యమంలో పోస్టుకార్డు కూడా కీలక భూమిక పోషించిందని నాటి స్వాతంత్య్ర సమరయోధులు అంటున్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను వివరించడానికి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రులకు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందు నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజలు పోస్టుకార్డు ద్వారా అభిప్రాయాలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పోస్టుకార్డుల వినియోగాన్ని ప్రజలు మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం అర్ధ రూపాయి ధర కలిగిన పోస్టుకార్డును పోస్టు ఆఫీస్‌లోకి వెళ్లి కొనుగోలు చేసే దిక్కులేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కనుమరుగవుతున్న పోస్టుకార్డుకు భవిష్యత్లోలైనా పూర్వవైభవం రావాలని అశిద్దాం. అదరణలేక పోవడం బాధాకరం మారుతున్న కాలంలో పోస్టుకార్డులకు ఆదరణ లేకపోవడం బాధాకరంగా ఉంది. నాకు ఉద్యోగం రాకముందు గొళ్లపూడిలో 1983 నుంచి 87 వరకు పోస్టుమాస్టర్‌గా పనిచేశాను. సంక్రాంతి పండగ, రాఖీ, నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు భారీగా పోస్టుకార్డులు వచ్చేవి. వాటిని పంపిణీ చేయించడానికి రెండురోజులు పట్టేది. పోటీ పడి వాటిని తీసుకునేవారు. అంతటి ఆదరణ కలిగిన పోస్టుకార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. -రామశాస్త్రి, ఈఓఆర్డీ, పాల్వంచ నేటి ప్రజలు మరిచిపోయారు.. తక్కువ ఖర్చుతో పోస్టుకార్డు ద్వారా ఎక్కువ సమాచారం అందించవచ్చు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్‌కు గానీ, కళాశాలల్లోగానీ పోస్టుకార్డు వస్తే నోటీస్ బోర్డులోకి వెళ్లి చూసుకునేది. కార్డుపై రాస్తే అందరికీ కనిపిస్తుందని భయమేసేది. అందరూ చదువుకునేవాళ్లు. అప్పట్లో ఎంతో అదరణ పొందిన పోస్టుకార్డును నేటి ప్రజలు మరిచిపోయారు. డాక్టర్ వై.చిన్నప్ప, ప్రిన్సిపాల్, జీడీసీ పాల్వంచ పోస్టుమెన్ కోసం ఎదురుచూసే వాళ్లం.. సెల్ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఈమెయిళ్లు లేని రోజుల్లో కేవలం పోస్టుకార్డులపై ఆధారపడ్డాం. పోస్టుమెన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ నిరీక్షించేవాళ్లం. పొరుగు ఊరు నుంచి బంధువులు పోస్టుకార్డుపై యోగ క్షేమాలు రాసి పంపేవారు. కార్డులు చదువుకుని తిరిగి మళ్లీకార్డుపై రాసి పంపించాం. డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం.. దూర ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను కేవలం పోస్టుకార్డుపై రాసి తెలుసుకునేవాళ్లం. నాటికి నేటికి ఎంతో తేడా ఉంది. వెంకటేశ్వర్లు, వ్యాపారి, కొత్తగూడెం -
పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు గ్రూపుల ఖాతాల్లో వెంటనే రూ. 7 వేలు వేయాలని నగరంలోని 47వ వార్డు మహిళలు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక హెడ్ పోస్టాఫీసు ఆవరణలో వారు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు సుమలత, జరీనాబీ మాట్లాడుతూ పొదుపు మహిళల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేస్తానని చెప్పి రూ. 3 వేలతోనే సరిపెట్టుకోవడం విచారకరమన్నారు. అలాగే ప్రధాని జన్‌ధన్ ఖాతాల్లో రూ. పది వేలు జమ చేయాలని కోరారు. సీఎం పొదుపు మహిళలకు తక్షణమే రూ. 7 వేలు వేయకపోతే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఆందోళనలో ఫరీదా, జంబావతి, ఈశ్వరమ్మ, సుమతి, శేషమ్మ, లలితమ్మ, రామలక్ష్మి, చిట్టెమ్మ, సుబ్బలక్షమమ్మ, 47వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
పోస్ట్‌కార్డుతో ఫిర్యాదు చేసినా స్పందిస్తాం
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ కె.కృష్ణయ్య డోర్నకల్ : విద్యుత్ సమస్యలపై వినియోగదారులు పోస్ట్‌కార్డు ద్వారా ఫిర్యాదు చేసినా స్పందిస్తామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ కె.కృష్ణయ్య తెలిపారు. స్థానిక 33/11 కేవీ సబ్‌స్టేçÙన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలిపి ఒక ఫోరం ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాలో నెలకు రెండుచోట్ల ఫోరం చేసి విద్యుత్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమస్య తీవ్రత మేరకు ఫిర్యాదు చేసిన రోజు నుంచి పది రోజుల్లో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు తమ సమస్యలను పోస్ట్‌కార్డుపై రాసి ఫోరం చిరునామాకు పంపినా పరిష్కరిస్తామన్నారు. ఫోరం టోల్‌ఫ్రీ నంబర్ 18004250028కు ఫోన్ చేసి పిర్యాదు నంబర్ తీసుకుంటే తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఫోరం టెక్నికల్ మెంబర్ కె.ఈశ్వరయ్య, ఫైనాన్స్ మెంబర్ ఆర్.చరణ్‌దాస్, ఇండిపెండెంట్ మెంబర్ ఏ.ఆనందరావు, డీఈ బిక్షపతి, ఏడీఈ ప్రసాద్‌బాబు, ఏఏఓ కాళిదాస్మూర్తి, డోర్నకల్, కురవి, మరిపెడ ఏఈలు సూర్యభగవాన్, వెంకటరమణ, పాండు, కమర్శియల్ ఏఈ జగదీశ్వర్‌రెడ్డి, టెక్నికల్ ఏఈ ప్రణీత్ పాల్గొన్నారు. -
‘మాయగాడి’ కేసు దర్యాప్తు ముమ్మరం
- సిమ్‌కార్డు ఏజెంట్ల కోసం పోలీసుల గాలింపు - సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాయాలని నిర్ణయం - బాధితులు ముందుకు రావాలని సూచన - వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ సాక్షి, హైదరాబాద్: పోస్టుకార్డుతో మొదలుపెట్టి, కెరియర్ కౌన్సెలింగ్ పేరుతో ఐదు వేల మంది యువతులకు వల వేసి మూడు వందల మందిని వంచించిన మహా మాయగాడు కలకంద మధు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇతడు యువతులతో సంప్రదింపులు జరపడానికి వినియోగించిన బోగస్ సిమ్‌కార్డుల దర్యాప్తును జటి లం చేశాయి. మధుకు 14 సిమ్‌కార్డులు, నకిలీ ధ్రువీకరణలు, ఫొటోలు అందించిన ఏజెంట్ల కోసం సైబర్ క్రైమ్ అధికారులు వేట సాగిస్తున్నారు. చైతన్యపురిలో టెంట్ వేసి సిమ్ కార్డులు విక్రయించే ఏజెంట్ నుంచి బి.మహేశ్వరి అనే మహిళ ఆధార్‌కార్డు, ఫొటోను మధు తీసుకున్నాడు. అలాగే పంజాగుట్ట చౌరస్తాలో మరో ఏజెంట్ నుంచి జి.సతీష్ పేర్లతో ఉన్న రేషన్‌కార్డు, ఫొటో సేకరించాడు. వీటినే పదుల సంఖ్యలో జిరాక్సు చేయించి మరిన్ని సిమ్ కార్డులు పొందాడు. టెలికం నిబంధనల ప్రకారం వ్యక్తిగత, నివాస ధ్రువీకరణలు దాఖలు చేసిన వారికే సిమ్‌కార్డులు ఇవ్వాలి. అయితే టెంట్ల ద్వారా విక్రయించిన ఏజెంట్లు తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడం కోసం నిబంధనలను తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు ఏజెంట్ల కోసం సీసీఎస్ గాలిస్తోంది. ఈ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ప్రాంతాలను మారుస్తుంటారు. దీంతో వీరి జాడ తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో ఆయా సిమ్‌కార్డు నంబర్ల ఆధారంగా.. వాటిని ఏ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఏ ఏజెంట్‌కు ఇచ్చి విక్రయించారో తెలపాలంటూ సర్వీసు ప్రొవైడర్లకు లేఖ రాయాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ మాయగాడు బాధితులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులకు సాంకేతిక ఆధారాలు సైతం దొరక్కుండా చేశాడు. మధుపై ఫిర్యాదు అందిన తర్వాత 2 నెలల పాటు గాలించిన షీ-టీమ్స్ బృందం ఎట్టకేలకు గురువారం పట్టుకోగలిగింది. ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో ‘వేస్ట్’, ‘డేంజర్’, ‘ఓవర్’ అంటూ రాసిన బాధితులను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితోపాటు మరికొందరు యువతులు, మహిళలు మోసపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మధు వినియోగించిన ఫోన్ నంబ ర్లను విడుదల చేసిన పోలీసులు.. వీటి ఆధారంగానైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. మధు వినియోగించిన ఫోన్ నంబర్లు ఇవే.... 7075463017, 9154721308, 9154778049, 9618372501, 7794089157, 8187026075, 9154519527, 8019642075, 9849236478, 8019648205, 8179526248, 9063181156, 7396325864. -
ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోస్ట్ కార్డుల ఉద్యమం
-
‘తపాలా’ శరాఘాతం
బ్యాంకులతో సహా ఎన్నో కేంద్ర ప్రభుత్వశాఖల విధివిధా నాలు మారుతున్నా తపాలాశాఖ మాత్రం తన తీరును మార్చు కోవటం లేదు. తపాలా కార్యాలయాల్లో బీమాతో కూడిన చిన్న మొత్తాల పొదుపు చేసుకునే మదుపుదారులపై విచిత్రంగా సేవా పన్ను విధిస్తోంది. ఉద్యోగస్తుల తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలపై (ఏడాదిలోపు ఖాతాలపై 3.5 శాతం, ఏడాది దాటితే 1.75 శాతం) రుసుమును సేవా పన్ను రూపంలో జూన్ 2015 నుండి నెల నెలా వసూలు చేస్తున్నారు. నెల నెలా పొదుపు చేసుకునేది పేద, మధ్యతరగతి ప్రజానీకమే. అలాంటి పొదుపుదారులపై సేవాపన్ను వసూలు చేయాల నుకోవడం ఎందుకో కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి. పొదుప రులను ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన తపాలాశాఖ విధానాలు వారిని నిరుత్సాహపరచేవిగా ఉంటున్నాయి. ఇప్ప టికే ప్రైవేటు బ్యాంకులతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకులు పోటా పోటీగా అనేక పొదుపు పథకాలతో ప్రజల ముంగిటకు వస్తున్నాయి. కనుక తపాలాశాఖ సేవాపన్నును రద్దు చేసి ప్రజల నుండి మరింత పొదుపు సేకరించడానికి సరళమైన పొదుపు పథకాలు ప్రవేశపెట్టాలి. పసునూరి శ్రీనివాస్ మెట్పల్లి, కరీంనగర్ జిల్లా -
‘పోస్ట్’ పోయే.. ఫోన్ వచ్చే..
అనంతపురం కల్చరల్: ‘‘పోస్ట్... అంటూ వినిపించే మధుర కంఠం గురించి ఆసక్తిగా ఎదురు చూసే కాలం దాదాపుగా మరుగున పడిపోయింది. మారుతున్న కాలగమనంలో అందంగా ప్రవేశించిన మొబైల్ ఫోన్ మానవుని జీవితాన్ని సుఖమయం చేసింది. క్రమంగా తపాలా వ్యవస్థలోని పోస్టుకార్డుల వ్యవస్థ అంతర్థానమయ్యే స్థితికి చేరుకుంది. సమాచారాన్నందించడంలో అమోఘమైన పాత్ర పోషించిన పోస్ట్ కార్డు చిన్నబోతూ క్రమంగా పక్కకు తప్పుకుంటుంటే ఆ స్థానాన్ని మొబైల్ ఫోన్ భర్తీ చేస్తోంది. 150 ఏళ్ల పోస్టు కార్డు కుదేలు ఆంగ్లేయులు తపాలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే పోస్ట్‌కార్డు పుట్టింది. అణా నుంచి 50 పైసల వరకు సాగిన కార్డు ప్రస్థానం 150 ఏళ్లు దాటిన తరుణంలో, ‘సెల్’ దెబ్బకు కుదేలైంది. ఒకనాడు బంధువులను, స్నేహితులను పలకరిం చాలన్నా, ఉద్యోగాలకు ఇంట ర్వ్యూ లేఖలు పంపాలన్నా పోస్టు కార్డే వారధిగా ఉండేది. మధురమైన భావాలు మరిం త అందంగా చెప్పించడానికి కార్డు అవకాశం కల్పించేది. తిరిగి కార్డు వచ్చే వరకు ఎదురు చూడడమనేది అందమైన అనుభూతిగా మిగిలిపోయేది. ఫోన్ల రాకతో తపాలా ప్రాధాన్యత తగ్గిపోయింది. సెల్ వెంటనే అనారోగ్యం ప్రస్తుతం బిక్షగాడి నుంచి ధనికుల వరకు విద్యార్థుల నుంచి ఉన్నతోద్యోగుల వరకు అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారి చేతిలో మొబైల్ ఉంటుంది. దీంతో ఇప్పుడు వారు ఒక గంట సెల్‌ఫోన్ విడిచి ఉండలేని పరిస్థితి నెలకొంది. సెల్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో.... అంత అనారోగ్యం దాని వెంటనే పొంచి ఉంది. ఈనాటి మొబైల్ ఫోన్లు పోస్టల్ జీవి తాన్ని కబళిస్తున్నా... ఆనాటి పోస్ట్‌కార్డు అందించే మధుర స్మృతులు ఇన్ని అన్ని గావు. దాచుకున్న ఆనాటి కార్డులను వీలున్నప్పుడు చదువుతుంటే పాత జ్ఞాపకాలు ఆనంద డో లికల్లో ముంచెత్తుతాయి. సెల్ ధ్వనులు లేని ప్రపం చం రావాలని చాలామం ది కోరుకుంటున్నారు. ‘సెల్’ ప్రపంచం 80వ దశకంలో అడుగుపెట్టి సెల్ ప్రస్థానం, ఇప్పుడు విశ్వ వ్యాప్తమై సార్వజనీయమైంది. ఇప్పుడు సమాచారం పంపడం ఎంత తేలికంటే అనంతలో ఉన్నా అమెరికాలో ఉన్నా క్షణాల్లోనే. సెల్‌తో పాటు నెట్, ఇంటర్నెట్, వాట్సాప్, మెయిల్స్ చేస్తున్న వింతలు ఎన్నో ఎన్నెన్నో. విలాస వస్తువుగా ప్రారంభమై, అవసరంగా మారిపోయిన సెల్ఫోన్లు ఆకర్షణీయమైన రూపాల్లో అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ రోజుల్లో సమాచార వ్యవస్థకు పునాది అయిన తపాలాను అసలు వాడని వారున్నారు. ఇది వేగంగా మారుతున్న కాలానికి దర్పణం పడుతుంది. ఈతరం విద్యార్థులు పాఠాలలో మినహా పోస్టుకార్డులు వాడే, లేఖలు రాసే సంస్కృతికి దాదాపు దూరంగా ఉన్నారు. -
జాబు ఏది బాబూ?
విజయనగరంఫోర్ట్: అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి జాబు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబూ జాబు ఏదంంటూ లఘు చిత్ర దర్శికుడు బీఏ.నారాయణ ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టుకార్డు ఉద్యమాన్ని మంగళవారం జొన్న వలసగ్రామంలో చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక నిరుద్యోగి ముఖ్యమంత్రికి బాబు జాబు ఏదంటూ పోస్టు కార్డు పంపించాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఒక ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి నిరుద్యోగుల వయోపరిమితిని 33 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం నియమాకాలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగులు రమేష్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సేవ్ ఎన్టీఆర్ స్టేడియం..సేవ్ ఇందిరాపార్క్
మారేడ్‌పల్లి (హైదరాబాద్) : సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్‌సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈస్ట్‌మారేడుపల్లిలోని తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు మిస్డ్‌కాల్, పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కుల స్థానంలో తెలంగాణ భవన్, వినాయక్సాగర్ను నిర్మించాలని తలపెట్టటం సరికాదని అన్నారు. వాటిని వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు తమతో కలసి పాల్గొనదలచిన వారు 8688047100 నంబర్‌కు మిస్ట్ కాల్ చేయాలని, లేదంటే పోస్టు కార్డు ద్వారా కేసీఆర్‌కు నిరసన లేఖలు రాయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన మిస్డ్ కాల్ బ్యానర్ ఆవిష్కరించి, పోస్టు కార్డు రాస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. -
పోస్టు కార్డుపై రూ.7 నష్టం
ఇన్లాండ్ లెటర్‌పై రూ.5 న్యూఢిల్లీ: పోస్టల్ శాఖకు నష్టాలు పెరుగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం ఒక్కో పోస్టు కార్డుపై 7 రూపాయలు, ఇన్లాండ్ లెటర్‌పై రూ.5 నష్టాన్ని ఆ శాఖ భరిస్తోంది. కార్డు సగటు ఖర్చు రూ. 7.54 కాగా 50 పైసలకు, ఇన్లాండ్ లెటర్ ఖర్చు రూ. 7.49 కాగా రూ.2.50 కు అమ్ముతున్నారు. పోస్టు కార్డులు, లెటర్లు, బుక్‌పోస్టుల వల్లే అధిక నష్టాలు వస్తున్నాయి. పార్సిల్స్, రిజిస్టర్‌పోస్టు, స్పీడ్‌పోస్టు, ఇన్సూరెన్స్, మనియార్డర్ల ద్వారా వచ్చిన ఆదాయమూ సగటు కంటే తక్కువగానే ఉంటోంది. 2013-14లో తమకు రూ.5,473.10 కోట్లు నష్టం వచ్చిందని పోస్టల్‌శాఖ తన వార్షిక నివేదికలో తెలిపింది. వివిధ డిపార్ట్మెంట్లు, మంత్రిత్వశాఖలనుంచి వసూలు చేసిన ఆదాయం రూ. 593 కోట్లు పోగా రూ. 5,473 కోట్లు నికర నష్టం వచ్చిందని తెలిపింది. -
ఒక్క కార్డు రాయండి చాలు
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంతోపాటు జిల్లాలో రౌడీయిజం చేసే వారి సమాచారాన్ని పోస్టు కార్డు ద్వారా తెలియజేస్తే చాలు వారి భరతం పడతానని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రౌడీషీటర్లుగా నమోదైన వారంతా రౌడీయిజాన్ని పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కొందరు రౌడీలు రాజకీయ నాయకుల ముసుగులో పంచాయతీలు చేస్తున్నారని, వీరిపై ఆధారాలు అందిస్తే అణిచివేస్తామన్నారు. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచి తమదైన శైలిలో విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇటీవల కొంతమంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చానని, వారిలో మార్పు వస్తే సరేనని, లేకపోతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.