‘మాయగాడి’ కేసు దర్యాప్తు ముమ్మరం | Case investigation has been started | Sakshi
Sakshi News home page

‘మాయగాడి’ కేసు దర్యాప్తు ముమ్మరం

Published Sun, Oct 25 2015 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

‘మాయగాడి’ కేసు దర్యాప్తు ముమ్మరం

‘మాయగాడి’ కేసు దర్యాప్తు ముమ్మరం

-  సిమ్‌కార్డు ఏజెంట్ల కోసం పోలీసుల గాలింపు
-  సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాయాలని నిర్ణయం
-  బాధితులు ముందుకు రావాలని సూచన
-  వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ

 
 సాక్షి, హైదరాబాద్: పోస్టుకార్డుతో మొదలుపెట్టి, కెరియర్ కౌన్సెలింగ్ పేరుతో ఐదు వేల మంది యువతులకు వల వేసి మూడు వందల మందిని వంచించిన మహా మాయగాడు కలకంద మధు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇతడు యువతులతో సంప్రదింపులు జరపడానికి వినియోగించిన బోగస్ సిమ్‌కార్డుల దర్యాప్తును జటి లం చేశాయి. మధుకు 14 సిమ్‌కార్డులు, నకిలీ ధ్రువీకరణలు, ఫొటోలు అందించిన ఏజెంట్ల కోసం సైబర్ క్రైమ్ అధికారులు వేట సాగిస్తున్నారు.
 
చైతన్యపురిలో టెంట్ వేసి సిమ్ కార్డులు విక్రయించే ఏజెంట్ నుంచి బి.మహేశ్వరి అనే మహిళ ఆధార్‌కార్డు, ఫొటోను మధు తీసుకున్నాడు. అలాగే పంజాగుట్ట చౌరస్తాలో మరో ఏజెంట్ నుంచి జి.సతీష్ పేర్లతో ఉన్న రేషన్‌కార్డు, ఫొటో సేకరించాడు. వీటినే పదుల సంఖ్యలో జిరాక్సు చేయించి మరిన్ని సిమ్ కార్డులు పొందాడు. టెలికం నిబంధనల ప్రకారం వ్యక్తిగత, నివాస ధ్రువీకరణలు దాఖలు చేసిన వారికే సిమ్‌కార్డులు ఇవ్వాలి. అయితే టెంట్ల ద్వారా విక్రయించిన ఏజెంట్లు తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడం కోసం నిబంధనలను తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు ఏజెంట్ల కోసం సీసీఎస్ గాలిస్తోంది.
 
ఈ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ప్రాంతాలను మారుస్తుంటారు. దీంతో వీరి జాడ తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో ఆయా సిమ్‌కార్డు నంబర్ల ఆధారంగా.. వాటిని ఏ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఏ ఏజెంట్‌కు ఇచ్చి విక్రయించారో తెలపాలంటూ సర్వీసు ప్రొవైడర్లకు లేఖ రాయాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ మాయగాడు బాధితులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులకు సాంకేతిక ఆధారాలు సైతం దొరక్కుండా చేశాడు.
 
మధుపై ఫిర్యాదు అందిన తర్వాత 2 నెలల పాటు గాలించిన షీ-టీమ్స్ బృందం ఎట్టకేలకు గురువారం పట్టుకోగలిగింది. ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో  ‘వేస్ట్’, ‘డేంజర్’, ‘ఓవర్’ అంటూ రాసిన బాధితులను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితోపాటు మరికొందరు యువతులు, మహిళలు మోసపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మధు వినియోగించిన ఫోన్ నంబ ర్లను విడుదల చేసిన పోలీసులు.. వీటి ఆధారంగానైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు.

మధు వినియోగించిన ఫోన్ నంబర్లు ఇవే....
7075463017, 9154721308, 9154778049, 9618372501, 7794089157, 8187026075, 9154519527, 8019642075, 9849236478,  8019648205, 8179526248, 9063181156, 7396325864.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement