బ్రిటన్‌లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్‌లో కలుసుకున్నారు.
ఎవరు ఎవరికి ఏమవుతారంటే..?
ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్‌కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్‌కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్‌లోనే ఉంచాలని నిర్ణయించారు.
తాత ఇంటి నుంచి లేఖ..
‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్‌కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్‌లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి
విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు.
ఆశ్చర్యపోయా..
‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్‌మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది.
బంధువులను కలవడం బాగుంది...
‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
ఉత్తరం కలిపింది వారిని...!
Published Sat, Aug 31 2024 6:35 AM | Last Updated on Sat, Aug 31 2024 6:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment