reunite
-
ఉత్తరం కలిపింది వారిని...!
బ్రిటన్‌లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్లో కలుసుకున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారంటే..? ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్‌కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్‌కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు. తాత ఇంటి నుంచి లేఖ.. ‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్‌లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆశ్చర్యపోయా.. ‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది. బంధువులను కలవడం బాగుంది... ‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
18 ఏళ్ల తర్వాత తప్పిపోయిన సోదరుడిని కలిపిన ఇన్‌స్టా రీల్!
లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు వైరల్‌గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్‌ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్లో ఒక రీల్స్ చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్న సంప్రదించారు. అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్‌మీడియానే కలిపిందని రాజ్‌కుమారి ఆనందం వ్యక్తం చేశారు. -
ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..
పుట్టుగానే కవలలు అనుకోని విపత్కర పరిస్థితుల్లో వేరయ్యారు. ఇద్దరు తమకు తెలియకుండానే ఒకే చోట నివశించారు. అయినా ఒకరికొకరు ఎదురవ్వలేదు. అనూహ్యంగా 19 ఏళ్ల తర్వాత ఒక వైరల్ టిక్‌టాక్ వీడియో, టీవీ షోలు వారిద్దరిని ఆశ్చర్యకర రీతీలో కలిపాయి. అచ్చం ఓ సినిమా మాదిరిగా ఆధ్యాంతం ట్విస్ట్‌లతో సాగిన గాథ వారిది. అసలేం జరిగిందంటే..యూరోపియన్ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ ఇద్దరూ పుట్టగానే వేరయ్యారు. తెలియకుండానే ఒకే నగరం వేర్వేరుగా నివశించారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో నిమగ్నమైన అమీకి తన పోలికతో డ్యాన్స్ చేస్తున్న మరొకొ అమ్మాయిని చూసి ఒక్కసారిగా తడబడింది. తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు తెలియదు. మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలానే ఉండే మరో అమ్మాయికి సంబంధిచిన టిక్‌టాక్ వీడియో ఆమెకు చేరింది. వీడియోలో ఉన్న అమ్మాయి తన కవల అమీ అని నిర్థారించుకుంది. దీంతో ఒకరినొకరు తామెవ్వరో తెలసుకుని షాక్‌కి గురయ్యారు. ఆ ఇద్దరూ కలిసి తాము వీడిపోవడానికి గల కారణాలు కనుగొని దిగ్బ్రాంతి చెందుతారు. ఎందుకు వేరయ్యారంటే.. అజా షోని అనే మహిళ ఈ ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. 2002లో ఆ ఇద్దరికి జన్మనివ్వగానే అజా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో అతడి తండ్రి గోచా గఖారియా దారుణ దుశ్చర్యకు పూనుకున్నడు. ఈ కవలలను వేర్వేరు కుటుంబాలకి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరు కవలలు వేర్వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది. ఈ ఘటన జార్జియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య వెలుగెత్తి చూపింది. చాన్నాళ్లుగా ఆస్పత్రులో అపహరణకు గురవ్వుత్ను శిశువుల ఘటనలు ఇంతవరకు పరిష్కృతం కాలేదు. జార్జియన్ ఆసుపత్రుల నుంచి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారిద్దరి గురించి మాత్రమే తెలిసింది. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 వరకు జార్జియాలో ఆ తాలుకా కేసులు చాలా నమోదయ్యాయి. అవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోవడం భాధకరం. ఈ కవలల గాథ 1972 నాటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సీతా ఔర్ గీతా'ను తలిపించేలా జరగడం విశేషం. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..!
కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్ప్రైజ్ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్ బ్యాగ్‌ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్‌ని ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్‌పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్ కావాలా అంటూ కౌట్స్ ఆ బ్యాగ్‌ని అందుకుంది. అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్‌స్టిక్, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్‌కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్‌ని తన ఆఫీస్ డెస్క్ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్ కంప్లైయింట్ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్‌ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది. ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్‌ని యజమానికి అందించిన కిమ్ సోషల్ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్. (చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?) -
బందీల విడుదలపై ఐర్లాండ్ ప్రధాని ట్వీట్.. ఇజ్రాయెల్ ఫైర్
టెల్ అవీవ్: హమాస్ రెండో విడత 17 మంది బందీలను ఆదివారం విడుదల చేసింది. వీరిలో ఐర్లాండ్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. తమ దేశ బాలిక విడుదలపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. తమ దేశ బాలిక ఎమిలి హ్యాండ్ విడుదల కావడంపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ హర్షం వ్యక్తం చేశారు. తప్పిపోయిందుకున్న బాలిక తిరిగిరావడం ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. బాలిక కుటుంబంతో కలిసినందుకు ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. తమకు ఇది ఎంతో ఊరటను కలిగించిందని అన్నారు. అయితే.. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ట్వీట్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. బాలిక తప్పిపోయిందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దళాల ఒత్తిడితోనే బందీలను హమాస్ విడుదల చేసిందని స్పష్టం చేసింది. ఎమిలిని హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి బందీగా అపహరించుకుపోయారని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా కాల్పులకు విరమణ ప్రకటించారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేయాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం 24 మందిని హమాస్ విడుదల చేసింది. రెండో విడతగా 17 మందిని వదిలిపెట్టింది. ఇదీ చదవండి: Uttarakashi Tunnel Operation: ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ -
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
దేశ విభజనతో విడిపోయిన కుటుంబాన్ని.. 75 ఏళ్లకు ఫేస్బుక్ ఒక్కటి చేసింది..!
లాహోర్: 1947లో దేశ విభజనతో వేరు పడిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా సాయంతో ఎట్టకేలకు కలుసుకున్నాయి. కర్తార్‌పూర్ కారిడార్ వద్ద వీరి కుటుంబసభ్యులు ఆనందంతో పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. గురువారం గురుదేవ్ సింగ్, దయాసింగ్ కుటుంబాల కలయికతో గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తార్‌పూర్ సాహిబ్ల వద్ద ఉద్విగ్నపూరిత వాతావరణం ఏర్పడింది. హరియాణా రాష్ట్రం మహేద్రగఢ్ జిల్లా గోమ్లా గ్రామానికి చెందిన ఈ సోదరులు తమ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజనతో కరీం బక్ష్ వీరిలో గురుదేవ్‌ను తన వెంట పాకిస్తాన్‌కు తీసుకెళ్లగా గోమ్లాలోనే మేనమామ వద్దే దయాసింగ్ ఉండిపోయారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్న కరీంబక్ష్ గురుదేవ్ పేరును గులాం మహ్మద్‌గా మార్చాడు. గురుదేవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తన సోదరుడు దయాసింగ్ ఎక్కడున్నారో జాడ తెలపాలంటూ గురుదేవ్ భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారని ఆయన కొడుకు మహ్మద్ షరీఫ్ తెలిపారు. ఎట్టకేలకు ఫేస్బుక్ ద్వారా ఆరు నెలల క్రితం తమ అంకుల్ దయాసింగ్ జాడ కనుక్కోగలిగామన్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ వద్ద ఇరువురు కుటుంబాలు కలుసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. వీసా మంజూరు చేసి హరియాణాలోని తమ పూర్వీకుల నివాసాన్ని చూసుకునే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన కర్తార్‌పూర్ కారిడార్‌తో భారతీయ సిక్కు యాత్రికులు పాక్ వైపు ఉన్న పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను వీసాతో అవసరం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా సాయంతో భారత్, పాక్ల్లో ఉంటున్న సిద్దిక్(80), హబీబ్(78) అనే సోదరులు కూడా గత ఏడాది జనవరిలో కర్తార్‌పూర్ కారిడార్‌లో కలుసుకున్న విషయం తెలిసిందే. -
పసిప్రాయంలో కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత..
వాషింగ్టన్: ఊహ కూడా తెలియని పసిప్రాయంలోనే ఆ బాలిక కిడ్నాపైంది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుకుండా పరాయి ఇంట్లోనే పెరిగింది. అయితే విధి ఆమెను మళ్లీ కుటుంబంతో కలిసేలా చేసింది. 51 ఏళ్ల తర్వాత ఆ మహిళ తన ఇంటికి చేరుకుంది. అమెరికా టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్టా అపంటెంకో అనే మహిళకు ఓ పాప ఉండేది. ఉద్యోగం వల్ల తీరక లేకపోవడంతో చిన్నారి ఆలనా పాలనా చూసుకునేందుకు ఓ ఆయాను నియమించాలనుకుంది. ఆమె రూమ్ మేట్ ఓ మహిళ ఉందని చెప్పడంతో వివరాలేవి తెలుసుకోకుండానే పనిలో పెట్టుకుంది. అయితే వచ్చిన ఆయా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పాపను కిడ్నాప్ చేసింది. 1971 ఆగస్టు 23న ఈ ఘటన జరిగింది. చిన్నారి కన్పించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎంత వెతికినా పాప ఆచూకీ లభించలేదు. తల్లిమాత్రం తన బిడ్డ కోసం అప్పటినుంచి వెతుకుతూనే ఉంది. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ బిడ్డ ఫోర్ట్ వర్త్‌కు 1100 మైళ్ల దూరంలో ఉందనే విషయం బంధువుల ద్వారా అల్టాకు తెలిసింది. వెంటనే వాళ్లు అధికారులను సంప్రదించి డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని చెప్పారు. పాప పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, డీఎన్ఏ ఫలితాల ఆధారంగా 51 ఏళ్ల క్రితం కిడ్నాపైంది ఈమే అని అధికారులు నిర్ధరించారు. దీంతో బాల్యంలో తప్పిపోయిన మెలిస్సా హై స్మిత్ ఐదు దశాబ్దాల తర్వాత కుటుంబం చెంతకు చేరింది. తన వాళ్లతో కలిసి చర్చిలో నిర్వహించిన వేడుకలో పాల్గొంది. ఇన్నేళ్ల తర్వాత తమబిడ్డను చూసి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. బిడ్డను చంపిందనే అపవాదు.. అయితే దర్యాప్తు అధికారులు ఈ కేసును చాలా సార్ల తప్పుదోవ పట్టించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గైనకాలజిస్ట్ సాయంతోనే తమబిడ్డ దక్కినట్లు పేర్కొంది. పాప కిడ్నాపై చాలా సంవత్సరాలు కన్పించకపోవడంతో తల్లే ఆమెను హత్య చేసి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు ఆ దుష్ప్రచారానికి తెరపడింది. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! -
ఎడింబర్గ్‌కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌కు తరలిస్తారు. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
వీల్‌ఛైర్‌లో ఎదురుచూపులు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం
ఛండీగఢ్: అనాథలా రోడ్ల వెంట తిరుగుతూ ఆ చిన్నారి.. ఆ భార్యభర్తల కంటపడ్డాడు. పిల్లలు లేని ఆ జంట.. భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి పెంచుకున్నారు. కడుపున పుట్టకున్నా.. సొంత బిడ్డగా ప్రేమను పంచింది ఆ తల్లి. విధివశాత్తూ 75 ఏళ్ల తర్వాత తనకంటూ రక్తసంబంధీకులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని.. కలుసుకుని కన్నీరుమున్నీరు అయ్యాడు ఆ వ్యక్తి. 1947.. దేశ విభజన సమయంలో అమర్జిత్ సింగ్(అప్పటి పేరు తెలియదు) కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. ఆ సమయంలో కొంత మందినే బృందాల వారీగా అనుమతించడంతో.. పసికందులను వెంటపెట్టుకుని, మిగిలిన ఒక్క కొడుకును మాత్రం జలంధర్‌లోని పబ్వాన్ గ్రామంలో ఉన్న తన అన్న దగ్గర వదిలేసి వెళ్లింది ఆ తల్లీ. తన అన్న కుటుంబంతో కలిసి తన బిడ్డ పాక్‌కు వస్తాడని, తనను చేరుకుంటాడని అనుకుంది. కానీ.. పరిస్థితుల ప్రభావంతో.. ఆ అన్న భారత్ దాటలేకపోయాడు. ఆపై అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో అతని కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. పబ్వాన్‌లోనే తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు ఆ వ్యక్తి. దీంతో ఆ పసికందు అనాథలా రోడ్డునపడ్డాడు. అయితే నూర్మహల్ ప్రాంతంలో ఉండే ఓ సిక్కు కుటుంబం అతన్ని అక్కున చేర్చుకుంది. పిల్లలు లేకపోవడంతో అమర్జిత్ సింగ్ అని పేరు పెట్టి.. పెంచుకుంది. అలా.. ఆ ఇంటి బిడ్డగానే పెరుగుతూ వచ్చాడు ఆ వ్యక్తి. అయితే.. మమకారంతో పెంచి పెద్ద చేసిన తల్లి చనిపోయే ముందు సొంత కొడుకు కాదనే అసలు విషయం చెప్పింది. దీంతో తనవారెవరో తెలియక.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పబ్వాన్‌లో ఆరా తీయడం మొదలుపెట్టాడు అమర్జిత్ సింగ్. చనిపోయిన తన మేనమామ గురించి వివరాలు తెలిసినా.. ఆ కుటుంబ సభ్యులు ఏమైపోయారనే విషయం మాత్రం తెలీయకుండా పోయింది. ఈ లోపు.. వయసు పైబడి వీల్‌చైర్‌కు అంకితమైపోయాడు అమర్జిత్. తన పూర్వీకుల కోసం ఆ పెద్దాయన చేస్తున్న ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు తోడైనా కూడా లాభం లేకుండా పోయింది. ఈలోపు.. పాక్ నుంచి ఓ జర్నలిస్ట్.. పబ్వాన్‌లో ఉంటున్న ఉద్యమకారుడు హాన్స్ రాజ్‌కు ట్విటర్ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చాడు. ఫలానా వ్యక్తి అంటూ అమర్జిత్ మేనమామ గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలో అమర్జిత్ కాంటాక్ట్‌ను సంపాదించడంతో.. అవతల ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బుధవారం కార్తార్‌పూర్ గురుద్వార దగ్గర అమర్జిత్ సింగ్ పాక్ నుంచి వచ్చిన ఓ మహిళను కలిశాడు. ఆమె ఎవరో కాదు.. ఆయన సోదరి(చెల్లి) కుల్సుం. తాను పాక్‌కు వలస వెళ్లాక పుట్టానని, తల్లి ఏనాడో చనిపోయిందని.. అక్క కూడా ఆమధ్య చనిపోతూ సోదరుడి విషయం చెప్పిందని, అలా తన బంధం కోసం వెతుకుంటూ వచ్చానని ఖుల్సుం వివరించింది. పాక్‌కు చేరుకున్న అమర్జిత్ తల్లి.. తన భర్త స్నేహితుడైన దారా సింగ్ అనే వ్యక్తి ద్వారా ఆ చిన్నారి కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందట. దీంతో ఆమె కొడుకు ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంటాడని ఆశిస్తూ ఇన్నేళ్లు గడిపింది. ఏదేమైతేనేం మొత్తానికి.. రక్తసంబంధం కలిసింది.. ఈ కథ పలువురిని కదిలించింది కూడా. ఇదీ చదవండి: అసాధ్యం అనుకుంటే.. సుసాధ్యం చేసిందామె! -
అద్భుతం చేసిన ఫేస్బుక్.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత
లండన్: గత కొన్నేళ్లుగా దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా వినియోగం కూడా బాగా ఎక్కువ అయ్యింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది సోషల్ మీడియాలోనే విహరిస్తుంటారు. ఫలితంగా కొంత కాలంగా సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న నేరాలు కూడా బాగానే పెరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియా వల్ల పూర్తిగా నష్టమేనా అంటే.. కాదు. దేని ఉపయోగాలు దానికి ఉంటాయి. మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీదనే వాటి లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్బుక్ గతంలో ఎందరో విడిపోయిన వ్యక్తులను కలిపిన వార్తల గురించి చదివే ఉన్నాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో వార్త వెలుగు చూసింది. ఫేస్బుక్ వల్ల ఓ మహిళ ఏకంగా 58 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. ఆమె సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదు. (చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది!) ఆ వివరాలు.. ఇంగ్లండ్, లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్(59) అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి నుంచి దూరమయ్యింది. అప్పట్లో ఇంత సాంకేతిక లేకపోవడం వల్ల తండ్రిని వెతకడం కష్టం అయ్యింది. కానీ చనిపోయేలోపు తండ్రిని చూడాలని బలంగా నిర్ణయించుకుంది జూలీ. ఆమె ప్రయత్నాలకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి వెనకడుగు వేయలేదు. తెలిసిన అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించేది. ఈ క్రమంలో ఓ రోజు జూలీకి ఓ ఐడియా వచ్చింది. తాను ఒక్కర్తే ఇలా ఒంటరిగా ప్రయత్నించడం కంటే.. సోషల్‌మీడియా సాయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. దానిలో భాగంగా ఆమె తండ్రి ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేసింది. దయచేసి తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాల్సిందిగా నెటిజనులు కోరింది. (చదవండి: ఫేస్బుక్, ట్విటర్ రెడీనా.. ట్రంప్ వచ్చేస్తున్నాడు) తండ్రి సమాచారం ఆత్రుతగా ఎదురుచూసింది. సరిగా నాలుగు రోజుల తర్వాత అద్భుతం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ఆచూకీ తెలుపుతూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ ప్రత్యక్షం అయ్యింది. అందులో ఉన్న అడ్రస్‌కు వెళ్లి.. తండ్రిని కలుసుకుంది. ఇక జూలీ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు లేవు. గత నాలుగు రోజులుగా వెస్ట్ యార్క్‌షైర్‌లోని డ్యూస్‌బరీలో తండ్రితో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా జూలీ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను అద్భుతాలను నమ్మను. కానీ ఫేస్బుక్ నాకు చేసిన మేలు చూస్తే నమ్మక తప్పడం లేదు’’ అన్నది. చదవండి: 'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో? -
అదృష్టం అవకాశం ఇస్తే.. మొహమాటంతో 45 ఏళ్లు ఒంటరిగా
తిరువనంతపురం: 1976లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన ఓ వ్యక్తి.. 45 ఏళ్ల తర్వాత.. తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ప్రమాదం జరిగిన రోజు అతడు విమానంలో లేడు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి.. ఇంటికి వెళ్లడానికి.. బతికి ఉన్నానని చెప్పడానికి సిగ్గుపడి.. ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని రెండేళ్ల క్రితం పాత మిత్రుడు ఒకరు గుర్తించి స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమంలో చేర్చాడు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అదృష్టం కొద్ది మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికి.. మోహమాటంతో దాదాపు 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా.. ఒంటరిగా మిగిలిన ఆ వ్యక్తి వివరాలు.. కేరళ, కొట్టాయంకు చెందిన సాజిద్ థుంగల్ తన 22వ ఏట అనగా 1974లో జీవనోపాధి కోసం నలుగురు అక్కలు, ముగ్గురు సోదరులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి గల్ఫ్ వెళ్లాడు. అక్కడ మలయాళ సినిమాలు ప్రదర్శిస్తూ.. భారత్ నుంచి సింగర్లు, డ్యాన్సర్లును పిలిపించి సాంస్కృతిక కార్యక్రమాలు ననిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో 1976లో సాజిద్ 10 రోజుల పాటు భారత్ నుంచి వచ్చిన ప్రదర్శనకారుల బృందంతో కలిసి ఉన్నాడు. ఈ క్రమంలో ఇండియా నుంచి వచ్చిన బృందం, సిబ్బందితో కలిసి మొత్తం 95 మంది ప్రయాణీకులున్న విమానం అక్టోబర్ 12, 1976న ప్రమాదానికి గురైంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ 171 విమానం చెన్నైకి (అప్పటి మద్రాస్) ప్రయాణిస్తుండగా.. ఇంజన్లో మంటలు చేలరేగడంతో.. బొంబాయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విమానం కూలిపోయిందని తెలిసింది. ఇదే ప్రమాదంలో ప్రముఖ మళయాళ నటి రాణి చంద్రా కూడా ప్రాణాలు కోల్పోయారు. సాజిద్ కూడా ఇదే ప్రమాదంలో మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు భావించారు. కాకపోతే ఆ రోజు అదృష్టం కొద్ది సాజిద్ ఆ విమానం ఎక్కలేదు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. బతికి ఉన్నప్పటికి సాజిద్.. తన కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారంతా తనను చనిపోయారని భావిస్తున్నారు.. ఇలాంటప్పుడు వారిని కలవాలంటే సాజిద్ సిగ్గు పడ్డాడు. దాంతో తన గురించి ఎవరికి చెప్పలేదు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత ముంబై వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. జీవనం సాగించాడు. 2019 లో అత్యంత దుర్బర స్థితిలో ఉన్న సాజిద్‌ను అతడి స్నేహితుడు గుర్తించాడు. అతను వెంటనే ముంబైలో పాస్టర్ కె.ఎమ్. ఫిలిప్ నడుపుతున్న ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ‘‘విమానం ప్రమాదంలో బృందం మరణించిన తరువాత సాజిద్ ‘‘నిరాశ, అపరాధం, మద్యపానం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి’’ పలు సమస్యలతో బాధపడుతున్నాడు’’ అని తెలిపాడు సాజిద్ స్నేహితుడు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్నప్పటికి సాజిద్ తన కుటుంబం గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు. కొన్ని వారాల క్రితం ఒక సీల్ సామాజిక కార్యకర్త కేరళను సందర్శించి, కొట్టాయంలోని ఒక స్థానిక మసీదులో సాజిద్ గురించి ఆరా తీయడంతో అతడి కుటుంబం గురించి తెలిసింది. మసీదు ఇమామ్ సాజిద్ కుటుంబానికి తెలుసు. అతడు సీల్ సామాజిక కార్యకర్తను సాజిద్ ఇంటికి తీసుకువెళ్ళాడు. 45 సంవత్సరాల తర్వాత సాజిద్ తన కుటుంబాన్ని మొదటిసారి చూడటానికి వీడియో కాల్ చేశారు. వారితో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణియంచుకున్నాడు సాజిద్. "నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడి ప్రజలు నన్ను చూసుకోకపోతే, నా కుటుంబంతో తిరిగి కలవకుండానే.. నేను చనిపోయేవాడిని” అన్నాడు సాజిద్. -
కడుపు కోత తీర్చిన కరోనా.. 13 ఏళ్ల తర్వాత..
సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్డౌన్ కారణంగా తిరిగి అమ్మ చెంతకు చేరిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కొప్పళ జిల్లా కుషిగి తాలుకా జమలాపురం గ్రామానికి చెందిన గురుబసప్ప, పార్వతమ్మలు కుమారుడు దేవరాజ్ 13 సంవత్సరాల క్రితం పీయూసీ చదువుతుండగా.. కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పటి నుంచి అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే, దేవరాజ్ మాత్రం బెంగళూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపాడు. ఈ క్రమంలో లాక్డౌన్ ప్రకటించడంతో తల్లి కుటుంబ సభ్యలు గుర్తుకు వచ్చారు. దీంతో నేరుగా గ్రామానికి వచ్చాడు. ఊరి రూపురేఖలు మారిపోవడంతో ఓ ఆలయం ముందు ఉండగా చిన్ననాటి స్నేహితులకు ఈ సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో దేవరాజ్ తల్లికి కూడా విషయం తెలియడంతో అక్కడికి చేరుకుని కుమారుడిని చూసి ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి లోనైంది. ఇన్ని సంవత్సరాల తరువాత కుమారుడు ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆ తల్లి తెలిపింది. -
30 ఏళ్ల తర్వాత.. ఆ తల్లి పిల్లల్ని చేరింది!
సాక్షి, ఇల్లెందు: ముప్ఫై ఏళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లి తప్పిపోయిన ఓ తల్లి తిరిగి కుటుంబ సభ్యులందర్నీ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని నంబర్ 2 బస్తీలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ వద్ద నివాసం ఉండే పుప్పాల నారాయణకు ఇద్దరు భార్యలు లక్ష్మీ, పార్వతి. లక్ష్మీకి నలుగురు సంతానం కాగా.. ఇద్దరు కొడుకులు పుప్పాల రవీంద్రనాథ్, కృష్ణ , ఇద్దరు కుమార్తెలు సరళ, ఉమామహేశ్వరి. ఇక పార్వతికి ఇద్దరు కుమార్తెలు..విజయ, పద్మ ఉన్నారు. అయితే ఇంట్లో తలెత్తిన మనస్పర్థల కారణంగా పార్వతమ్మ హైదరాబాద్‌లో ఐటీఐ చదువుతున్న మారు తల్లి కుమారుడు రవీంద్రనాథ్ వద్దకు వెళ్లింది. అక్కడ రెండ్రోజులపాటు ఉంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తానని చెప్పి బస్సు ఎక్కింది. కానీ..తిరిగి ఇంటికి చేరుకోలేదు. హన్మకొండలో బస్సు దిగింది. ఎటు వెళ్లాలో తెలియక ఓ అనాథాశ్రమంలో చేరింది. అక్కడే ఏడేళ్లు గడిపింది. అక్కడ్నుంచి అనాథాశ్రమం నుంచి ఆమెను బయటకు పంపడంతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో లడ్డూలు తయారు చేసే పనికి కుదిరింది. కరోనా కారణంగా ఆలయాలు మూతపడటంతో ఆమెను మమత అనాథాశ్రమం వారు చేరదీశారు. వారం క్రితం అక్కడి అనాథాశ్రమం నిర్వాహకుల అనుమతి కోరి కొత్తగూడెం రాగా..అక్కడ తమ ఇంటి ఆనవాళ్లు గానీ..కుటుంబ సభ్యుల వివరాలు గానీ లభించకపోవడంతో పార్వతమ్మ ఇల్లెందులో తన బంధువులు ఇంటికి వెళ్లింది. ఇల్లెందులో దిగి నంబర్–2 బస్తీకి చేరుకుని తమ బంధువుల అడ్రస్ అడుగుతుండగా..ఆనాటి తరంవారు పార్వతమ్మన గుర్తు పట్టి ఆమెను బంధువుల ఇంటికి చేర్చారు. వారు పార్వతమ్మ బిడ్డలకు సమాచారం అందించడంతో బిడ్డలు వచ్చి తల్లిని కలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరడం..అందరినీ చూడటంతో తన జీవితం ధన్యమైందని పార్వతమ్మ చెప్పుకొచ్చింది. -
24 ఏళ్ల తర్వాత కొడుకును కలిశాడు!
బీజింగ్ : చైనాలో ఓ వ్యక్తి తప్పిపోయిన తన కుమారుడి కోసం ఏకంగా 24 ఏళ్లు అన్వేషించిన అనంతరం అతడ్ని కలుసుకున్నాడు. 1994, ఆగస్ట్ 8న మూడేళ్ల కుమారుడ్ని కోల్పోయిన తండ్రి చైనా అంతటా 1,80,000 అదృశ్య ప్రకటనలు ఇచ్చిన అనంతరం ఇటీవల కొడుకును కలుసుకోగలిగాడు. రెండు దశాబ్ధాల పాటు కుమారుడి ఆచూకీ లభ్యం కాకున్నా నిరాశకు లోనవని లీ షుంజీ తన ప్రయత్నాలు కొనసాగించారు. 24 సంవత్సరాల అనంతరం ప్రస్తుతం 27 ఏళ్లున్న లి లీ పోలీసులు చేపట్టిన డీఎన్ఏ పరీక్షల అనంతరం శుక్రవారం తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులను కలుసుకున్నాడు. స్ధానిక పోలీసులు నిర్వహిస్తున్న తప్పిపోయిన పిల్లల డీఎన్ఏ డేటాబేస్‌తో అతడిని గుర్తించినట్టు మెయిల్ ఆన్లైన్ పేర్కొంది. తల్లితండ్రుల నుంచి విడిపోయిన తర్వాత బాలుడిని చేరదీసిన ఓ జంట అతడిని వారికి అప్పగించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో వారే పెంచిపెద్దచేశారు. ఇక తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో లి షుంజీ తన వ్యాపారం మానివేసి మరీ చిన్నారి కోసం వెతుకులాట చేపట్టారు. చైనా అంతటా తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ పెద్ద ఎత్తున ప్రకటనలతో గాలించారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించి దాదాపు రెండున్నర దశాబ్ధాల అనంతరం కుమారుడ్ని కలుసుకోగలిగారు. -
ఇదొక బంగ్లాదేశీ భాయ్‌జాన్ కథ
న్యూఢిల్లీ: ఈ ఈద్ పండుగ ఓ ముస్లిం కుటుంబంలో మరింత సంతోషాన్ని తెస్తోంది. ఏడేళ్ల కిందట తప్పిపోయిన సోనూ అనే తమ కుమారుడు కళ్లముందుకొస్తుండటంతో ఆ ఇంట్లో పండుగవాతావరణం రెట్టింపయింది. ఇది కూడా ఓ రకంగా భజరంగీ భాయ్ జాన్లాంటి ఛాయలున్న కథే. కాకపోతే ఈసారి భాయ్‌జాన్ మాత్రం బంగ్లాదేశీయుడు. బాబు మాత్రం తప్పిపోవడం కాకుండా తప్పించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని న్యూ సెమాపురి అనే ప్రాంతంలో మహబూబ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఓ రెండుగదుల నివాసం ఉంది. మెకానిక్ గా పనిచేస్తున్న అతడి ఇంట్లోకి అద్దెకు వచ్చిన ఓ మహిళ ధీన పరిస్థితి చూసి ఆమెకు అద్దె లేకుండానే ఓ గది ఇచ్చాడు. తొలుత చిన్నాచితక పనిచేసుకుంటూ ఉంటున్న ఆమె 2009 ఆగస్టు నెలలో మహబూబ్ ఆరేళ్ల కుమారుడు సోనూను ఎత్తుకొని పారిపోయింది. ఆమె కోసం ఎంతగాలించినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. చాలా కాలంపాటు కేసును విచారించిన పోలీసులు ఇక చేసేది లేక కేసు మూసి వేశారు. తమ పిల్లాడు చనిపోయాడనుకొని బాధపడుతూ మహబూబ్ కుటుంబ సభ్యులు తమను తాము తమాయించుకున్నారు. ఆనందం నింపిన ఒక్క ఫోన్ కాల్.. ఇలా ఉండగా, ఒక రోజు బంగ్లాదేశ్ నుంచి జమాల్ ముసా అనే వ్యక్తి మహబూబాకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నా వద్దే భద్రంగా ఉన్నాడంటూ ఈ మధ్య ఫోన్ చేశాడు. దీంతో మహబూబ్ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది. ఇంతకీ జమాల్ ఎవరంటే అతనో మెకానిక్. ఒక రోజు తీవ్రంగా ఓ మహిళ చేతిలో హింసకు గురవుతున్న బాలుడిని చూశాడు. అతడికి జాలేసి దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడగా.. అసలు విషయం ఆ బాలుడు చెప్పాడు. తాను ఢిల్లీకి చెందిన వాడినని, తనను ఆ మహిళ ఎత్తుకొచ్చిందని చెప్పాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ముసా ఎలాగైనా ఆ బాలుడిని వారి కుటుంబం దరిచేర్చాలనుకున్నాడు. అధికారులను, మీడియాను సంప్రదించి ఒకసారి మహబూబా కుటుంబంతో కలిశాడు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. బాలుడి డీఎన్ఏ తన తల్లి డీఎన్ఏతో సరిపోలడంతో ఇక ఆ బాలుడిని తీసుకొచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ రోజు(గురువారం) ఆ బాలుడు తన కుటుంబాన్ని ఏడేళ్ల తర్వాత కలుసుకోనున్నాడు. అలా మహబూబా కుటుంబంలో ముసా సంతోషాన్ని నింపాడు. -
పదేళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు
బంజారాహిల్స్ : తల్లి ఎలా ఉంటుందో ఆ కూతుళ్లకు తెలియదు. చిన్నప్పుడే పిల్లలను వదిలేసిన ఆ తల్లికి.. వాళ్లేంచేస్తున్నారో, ఎలా ఉన్నారో తెలియదు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ తల్లీకూతుళ్లు కలిశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని జహీరానగర్‌లో నివసించే పద్మ, రమేష్ దంపతులకు ఒక కూతురు(6) ఉంది. రోడ్డు ప్రమాదంలో రమేష్ చనిపోగా పద్మ సమీపంలో ఉండే గోవిందు అనే వ్యక్తితో సహజీవనం సాగించింది. దీంతో ఆమె మరో ఆడపిల్లకి జన్మనిచ్చింది. పెద్ద కూతురికి ఆరేళ్లు, చిన్న కూతురికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడే మద్యానికి బానిసై పద్మ ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో గోవిందు.. లక్ష్మి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికే లక్ష్మికి ఓ కొడుకు ఉండగా గోవిందుతో పెళ్లి అనంతరం మరో కొడుకు,కూతురు పుట్టారు. ఈ క్రమంలోనే గోవిందు,లక్ష్మిల ప్రవర్తనలో మార్పు వచ్చింది. పద్మ కుమార్తెలపై కోపం పెంచుకుని వారిని హింసించటం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఐదేళ్ల క్రితం పెద్ద కుమార్తెను, ఇటీవలే చిన్న కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు. వారిద్దరూ ఎంతగా ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దీంతో పెద్ద కుమార్తె ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న అసలు తల్లి పద్మ శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తన కూతుళ్లను చూసి, వారి పరిస్థితిని తెలుసుకొని కుమిలిపోయింది. తల్లిదండ్రులు లేకుండా నరకాన్ని చవి చూసిన ఆ కూతుళ్లు తల్లిని చూసిన క్షణమే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. చిన్న కూతురిని చదివిస్తానని, పెద్ద కూతురికి వివాహం చేస్తానని పద్మ పోలీసులకు తెలిపింది. తన కూతుళ్లు బాగా చదువుకుంటున్నారని అనుకున్నానని.. తీరా చూస్తే ఇలా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు గోవిందుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
70 ఏళ్ల తర్వాత ప్రియురాలి చెంతకు..!
అడిలైడ్: ఆస్ట్రేలియాలో అపురూప సంఘటన జరగబోతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ పైలట్ 70 ఏళ్ల తర్వాత తన గర్ల్ ఫ్రెండ్‌ను కలుసుకోబోతున్నాడు. వచ్చే వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ఇందుకు వేదిక కాబోతోంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన పైలట్ నోర్వూద్ థామస్ (93) రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన జాయ్సే మోరిస్ పరిచయమైంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే యుద్ధానంతరం ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు థామస్ వయసు 93 ఏళ్లు కాగా, మోరిస్‌కు 88 ఏళ్లు. 70 ఏళ్ల విరామం తర్వాత థామస్‌కు మోరిస్‌ను చూడాలనిపించింది. ఆమె చిరునామా తెలుసుకుని ఇటీవల స్కైప్ ద్వారా మాట్లాడాడు. వీరిద్దరి లవ్ స్టోరీ ఆన్లైన్లో పాపులర్ అయింది. 300 మందికిపైగా నెటిజెన్లు స్పందించి ఈ జంటను కలిపేందుకు విరాళాలు పంపారు. దాదాపు 5 లక్షల రూపాయలు పోగయ్యాయి. ఇక థామస్, మోరిస్‌ను కలిపేందుకు ఎయిర్ న్యూజిలాండ్ ముందుకొచ్చింది. థామస్, ఆయన కొడుకును విమానంలో ఉచితంగా ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రేమికుల రోజున అలనాటి ఈ ప్రేమ జంట మళ్లీ కలుసుకోబోతోంది. -
39 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిశారు
సినిమా కథను తలపించేలాగా ఎప్పుడో 39 ఏళ్ల క్రితం విడిపోయిన మనవరాలిని.. బామ్మ మళ్లీ కలుసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని, తన మనవరాలు మళ్లీ తన దగ్గరకు వచ్చిందంటూ క్రిస్మస్ పండగరోజు అర్జెంటీనాకు చెందిన 92 ఏళ్ల మార్లా ఇసాబెల్ చిచా డి మరియాని చెప్పారు. 1976లో మిలటరీ అధికారులు.. మార్లా మనవరాలు క్లారా అనాహి మరియానిని తీసుకెళ్లారు. క్లారా మూణ్నెళ్ల పసిబిడ్డగా ఉన్నప్పుడు సైన్యం ఆ చిన్నారి తల్లిని చంపి ఎత్తుకెళ్లారు. క్లారా కోసం గాలిస్తూ ఆమె తండ్రి డానియల్ 1977లో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మార్లా తన మనవరాలి కోసం అన్వేషిస్తోంది. 'గ్రాండ్ మదర్స్ ఆఫ్ ద ప్లాజా డి మయో' అనే మానవహక్కుల సంస్థ విడిపోయిన కుటుంబ సభ్యులను కలిపేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసిన మార్లా 1980లో విడిపోయి మనవరాలి పేరుతో క్లారా అనాహి ఫౌండేషన్‌ను స్థాపించింది. ఎనిమిదేళ్ల క్రితం మార్లా తన మనవరాలికి బహిరంగం లేఖ రాసింది. 'సైన్యం దాడిలో మరణించావని నన్ను నమ్మించేందుకు ప్రయత్నించారు. నువ్వు బతికేఉన్నావని నాకు తెలుసు. నిన్ను చూసి, ఆప్యాయంగా కౌగిలించుకోవాలన్నదే నా కోరిక' అని లేఖలో పేర్కొంది. అంతేగాక క్లారా తల్లిదండ్రులు వివరాలు, వారి అభిరుచులను లేఖలో రాసింది. సుదీర్ఘ అన్వేషణ అనంతరం మార్లా తన మనవరాలు క్లారాను గుర్తించింది. వీరిద్దరికీ జన్యుపరీక్షలు నిర్వహించగా 99.9 శాతం సరిపోలాయి. -
నా చెల్లి నన్ను కలిసింది...
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... సుమారు నలభై సంవత్సరాల తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు... కలిసిన సన్నివేశం అందర్నీ అబ్బుర పరచింది. తొమ్మిదేళ్ళ వయసులో అమెరికాకు చెందిన దంపతులకు దత్తత వెళ్ళిన కొరియాకు చెందిన హోలీ ఓబ్రెయిన్... తన చిన్ననాటి సంఘటన గుర్తుకు రావడంతో ఆవేదనలో మునిగిపోయింది. తనను దత్తత ఇచ్చిన తర్వాత తన చెల్లిని సవతి తల్లి అనాథాశ్రమంలో చేర్చినట్లు ఆమెకు లీలగా గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం మెదడులో కదిలిన క్షణం నుంచీ.... ఓబ్రెయిన్ మనసాగలేదు. చెల్లిని చూడాలని పరితపించి పోయింది. ఎలాగైనా ఆమె జాడ తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తన సోదరి మేగాన్ హుఘ్స్ ను సవతి తల్లి కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేర్చినట్లుగా ఓబ్రెయిన్ కు అస్పష్టంగా గుర్తుకు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఓ బ్రెయిన్ ను పెంచుకున్న తండ్రి... వేగంగా వెడుతున్న రైలునుంచి పడి మరణించాడు. ఆమెను చూసినవారు గుర్తించి రక్షించడంతో ఆమె బతికి బయట పడింది. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేరింది. అయితే అప్పటినుంచీ ఆమె సవతి తల్లి తన సోదరిని తన నుంచీ దూరం చేసిన క్షణాలు జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి. ఓ రోజు అర్థరాత్రి నిద్రనుంచీ ఉన్నట్టుండి లేచిన ఓబ్రెయిన్ కు కళ్ళ నీళ్ళు ఆగలేదు. తన గతాన్ని తలచుకొని కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తన చెల్లిని కలుసుకోవాలన్న కోరిక ఆమెలో పెరిగిపోయింది. తనను పెంచిన తల్లిని అడిగింది. ఆమె అనాథాశ్రమంలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినా ఓబ్రెయిన్ కు ఎక్కడో ఆశ... తన చెల్లి ఎక్కడో బతికే ఉంది. తనకెప్పటికైనా కనిపిస్తుందన్న నమ్మకంతో ఆమె జాడకోసం ప్రయత్నాలు కొనసాగించింది. చెల్లిని.. అమ్మను అనాథాశ్రమం దగ్గరే చివర్లో చూశాను. ఎలాగైనా ఆమె వివరాలు తెలుసుకోవాలని వార్తా పత్రికలకు కూడ సమాచారం ఇచ్చింది. దీంతో కొరియాలోని అనాథాశ్రమాల్లో వివరాలు సేకరించిన ప్రతినిధులు.. హుఘ్స్ ను కూడా అనాథాశ్రమం నుంచీ ఓ అమెరికన్ దంపతులు పెంపకానికి తీసుకున్నారని, వారు న్యూయార్క్ లో ఉంటారని తెలిపారు. ఓబ్రెయిన్ ఈ సంవత్సర ప్రారంభంలో బే ఫ్రంట్ హెల్త్ పోర్ట్ ఛాలెట్ అనే వైద్య విభాగంలో ఉద్యోగానికి చేరింది.మరో మూడు నెలల తర్వాత హుఘ్స్ కూడా అక్కడే ఫిజికల్ థెరపీ అసిస్టెంట్ గా చేరింది. సుమారు నలభై ఏళ్ళ క్రితం కొరియాలో విడిపోయిన ఆ ఇద్దరు అనాధలు ఒకే ఆస్పత్రిలో... ఒకే ఫ్లోర్ లో ఉద్యోగానికి చేరారు. ఒకే షిఫ్టులో కూడ పనిచేస్తున్నారు. కానీ ఒకరికి ఒకరు పరిచయం లేదు. అక్కాచెల్లెళ్ళేనని అస్సలు తెలియదు. అయితే ఓ రోజు ..ఓ పేషెంట్ కొరియాకు చెందిన మరో నర్స్ ఇక్కడ పని చేస్తోందని... బహుశా మీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు అయి ఉండొచ్చని చెప్పింది. విషయం తెలిసిన వెంటనే ఓబ్రెయిన్ ఉత్సాహంగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించింది. వివరాలు సేకరించింది. తెలిసిన వివరాలను బట్టి అక్కాచెల్లెళ్ళేనని నిర్థారణ అయింది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళేనని డీఎన్ ఏ టెస్టులు కూడా ధృవీకరించాయి. అనుమానం తీర్చుకొనేందుకు మరోసారి ల్యాబ్ టెస్టులను చెక్ చేసుకుంది. ''దేవుడు ఇంతటి అదృష్టాన్నిస్తాడని అనుకోలేదు. నా చెల్లి నన్ను కలిసింది. నాకు జీవితంలో కావాల్సింది ఏముంది? ఇప్పుడు నాకు పిల్లలు లేకపోయినా... నా చెల్లికి ఇద్దరు పిల్లలున్నారు. మేమంతా సెలవుల్లో సంతోషంగా గడుపుతాం..'' అంటూ ఓ బ్రెయిన్ ఆనంద భాష్పాలను తుడుచుకూంటూ... చెల్లి హుఘ్స్ ను గట్టిగా హగ్ చేసుకుంది. -
'డేటింగ్‌తో విడిపోయి మరోసారి కలిసి..'
ముంబయి: అస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్ర నటులు, ఒకప్పటి ప్రేమికులు ఫ్రిదా పింటో, దేవ్ పటేలో మరోసారి కలిశారు. చెరొదిక్కుకూ వెళ్లిపోయి దాదాపు ఏడాదికాలం పాటు జంటగా కనిపించని వీరు ఓ స్వచ్ఛంద కార్యక్రమం కోసం మాత్రం మరోసారి పక్కపక్కనే నవ్వులు పూయిస్తూ కనిపించారు. చిన్నపిల్లలకు విద్యనందించి అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా దేశంలోని పేదరికాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ప్రధమ్ అనే చారిటబుల్ సంస్థ చేస్తున్న కార్యక్రమం ప్రచారానికి వీరిద్దరు హాజరయ్యారు. స్లమ్ డాగ్ మిలీయనీర్ చిత్రం అనంతరం ప్రేమికులుగా మారిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ 2009లో డేటింగ్ ప్రారంభించారు. అలా ఆరేళ్లు గడిచిన తర్వాత 2014లో తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. -
హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది
థానే: ఎట్టకేలకు ఓ పద్నాలుగేళ్ల బాలిక కిడ్నాపర్ల చెర నుంచి బయటపడింది. దాదాపు నెల రోజుల అనంతరం తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఉలన్ సాగర్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక గత మే 9నుంచి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తప్పిపోయినవారి జాబితాలో చేర్చి కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపులు మొదలు పెట్టారు. అయితే, పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నెల జూన్ 16న ఆ బాలిక బందీల చెరనుంచి తప్పించుకుని ముంబయిలోని దాదార్ ప్రాంతానికి చేరుకుంది. ఆమెను పోలీసులు చివరికి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం కిడ్నాపర్లు ఆమెను గుజరాత్ తీసుకెళ్లి అమ్మేశారు. ఇందులో పూజా షద్దార్ అలియాస్ రుమా, శోభా జాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆ బాలికను గుజరాత్‌లోని గోవింద్ మఖ్వానా (60) అనే వ్యక్తికి రూ.65 వేలకు అమ్మేసినట్లు వివరాలు వెల్లడించారు. దీంతో పోలీసులు మఖ్వానాను, రాజు వాజా అనే ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
జనతా పార్టీల విలీనం!
ఐక్య శక్తిగా అవతరించేందుకు 6 పార్టీల అంగీకారం న్యూఢిల్లీ: ‘జనతా పరివార్’ పార్టీల ఏకీకరణకు రంగం సిద్ధమైంది. గతంలో విడిపోయిన 6 పార్టీలు విలీనమై ఐక్య శక్తిగా అవతరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈమేరకు గురువారం ఢిల్లీలో సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో జనతాదళ్(లౌకిక), ఆర్జేడీ, జేడీయూ, ఐఎన్ఎల్డీ, సమాజ్‌వాదీ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. విలీనంపై విధి విధానాలు, కొత్త పార్టీ ఎజెండాను ఖరారు చేసే అధికారాన్ని ములాయంసింగ్ యాదవ్‌కు అప్పగించారు. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాం గోపాల్ యాదవ్, దేవెగౌడ, దుష్యంత్ చౌతాలా, కమల్ మొరాకా భేటీకి హాజరయ్యారు. లెఫ్ట్‌తో కలసి పనిచేస్తాం: నితీష్ పార్లమెంట్ బయట ఆరు పార్టీల ఐక్య పోరులో తొలి అడుగు పడింది. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఢిల్లీలో ఈనెల 22న ధర్నా చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగాన్ని అరికట్టటంపై కేంద్రం విఫలమైందని నేతలు ధ్వజమెత్తారు. విలీనంపై విధివిధానాల ఖరారు బాధ్యతను ములాయంకు అప్పగించినట్లు అనంతరం జేడీయూ నేత నితీష్‌కుమార్ విలేకరులకు తెలిపారు. తమ విధానాలు, సూత్రాలలో సారూప్యం ఉన్నందున ఒకే పార్టీగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని అంటే భయంతోనే జనతా పరివార్ పార్టీలు విలీనానికి సిద్ధమయ్యాయన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక వేదికను సిద్ధం చేయటమే తమ ఉద్దేశమన్నారు. -
ఐస్‌క్రీమ్-2 లో జెడి డిఫరెంట్ గెటప్
-
అమ్మాయి తప్పిపోయింది...గూగుల్ కలిపింది
పాట్నా: చిన్నప్పుడు తప్పిపోయిన ఓ అమ్మాయి 17 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుసుకుంది. ఓ అధికారిణి, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. ఆ అమ్మాయిని, కుటుంబ సభ్యులను కలిపారు. అచ్చం సినిమా కథను తలపించే ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. పాట్నాకు చెందిన గుడియా అనే అమ్మాయి ఆరేళ్ల వయసులో మేనమామతో కలసి తాతగారి ఊరు గౌహతి బయల్దేరింది. బీహార్‌లోని బరౌనీ రైల్వే స్టేషన్లో తినుబండారాలు కొనేందుకు దిగిన గుడియా మేనమామ మళ్లీ రైలును అందుకోలేకపోయాడు. దీంతో ఒంటరయిన గుడియా భయంభయంగా గౌహతి చేరింది. రైల్వే పోలీసులు విచారించగా గుడియా తన అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పలేకపోయింది. కాకపోతే పాట్నాలో తన ఇంటికి ఎదురుగా ఉన్న బిస్కట్ ఫ్యాక్టరీలో మేనమామ పనిచేస్తాడని మాత్రం గుర్తుంది. ఈ చిన్న జ్ఞాపకం ఆధారంతో అడ్రెస్ తెలుసుకోవడం కష్టమైంది. పోలీసులు ఆమెను చిల్డ్రన్స్ హోమ్‌లో చేర్చారు. గుడియా అసోంలోనే పెరిగి పెద్దయ్యింది. అక్కడే వివాహం చేసుకుంది. అయితే తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్లడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. తను తప్పిపోయినపుడు హింది మాత్రమే తెలుసు. అసోం వెళ్లాక హింది మరిచిపోయింది. ఇప్పుడు గుడియాకు అస్సామీ తప్ప మరే బాషా రాదు. గత నెలలో గుడియా భర్తను తోడుతీసుకుని తల్లిదండ్రుల వెదుక్కొంటూ పాట్నా వెళ్లింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. అసోం పిల్లల సంరక్షణ సొసైటీలో పనిచేసే నీలాక్షి శర్మ అనే అధికారి గుడియా అన్వేషణలో సాయపడ్డారు. నీలాక్షి.. గుడియా కుటుంబ సభ్యుల చిరునామా తెలుసుకునేందుకు గూగూల్లో శోధించడం మొదలుపెట్టారు. పాట్నాలో తన ఇంటి ముందున్న బిస్కట్ల ఫ్యాక్టరీలో మేనమామ పనిచేస్తున్న విషయం గుడియాకు గుర్తుకువచ్చింది. ఈ విషయం నీలాక్షి చెప్పగా నెట్లో అన్వేషించారు. ఎట్టకేలకు ఓ బలమైన ఆధారం దొరికింది. బిస్కట్ల ప్యాక్టరీ ఫోన్ నెంబర్ గూగుల్‌లో దొరికింది. ఈ ఫోన్ నెంబర్ ద్వారా గుడియా మేనమామను, ఆ తర్వాత తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. గత సోమవారం గుడియా తల్లిదండ్రులు గౌహతి వెళ్లి ఆమెను కలుసుకోవడంతో కథ సుఖాంతమైంది.