లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు వైరల్‌గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్‌ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.
చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్‌లో ఒక రీల్స్ చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్న సంప్రదించారు.
అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్‌మీడియానే కలిపిందని రాజ్‌కుమారి ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment