30 ఏళ​ క్రితం పోయిన బ్యాగ్‌ మళ్లీ యజమాని చెంతకు..! | Girl Reunites UK Woman With Her Purse Stolen 30 Years Ago | Sakshi
Sakshi News home page

30 ఏళ​ క్రితం పోయిన బ్యాగ్‌ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..

Published Sun, Jan 7 2024 5:12 PM | Last Updated on Sun, Jan 7 2024 5:33 PM

Girl Reunites UK Woman With Her Purse Stolen 30 Years Ago - Sakshi

కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్‌ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్‌ప్రైజ్‌ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. 
ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్‌ బ్యాగ్‌ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్‌ని  ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్‌ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా  చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్‌ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్‌ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్‌ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్‌పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్‌ కావాలా అంటూ కౌట్స్‌ ఆ బ్యాగ్‌ని అందుకుంది.

అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్‌స్టిక్‌, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్‌లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్‌ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్‌కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్‌ గురించి వివరాలన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్‌ని తన ఆఫీస్‌ డెస్క్‌ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్‌ కంప్లైయింట్‌ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్‌ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది.  ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్‌ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్‌ని యజమానికి అందించిన కిమ్‌ సోషల్‌ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్‌.  

(చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement