bag
-
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
మెట్రోలో ‘పీత’లాటకం!
మహానగరాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్ఫోన్లు, చేతుల్లో స్మార్ట్ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలోంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి. దాంతో సదరు మహిళకు గాభరాతో మెట్రో రైలు తలుపు వైపు పరుగెత్తింది. సాయం కోసం అటు ఇటూ చూసింది. చిరిగిన సంచినే వాటిపై గట్టిగా అదిమిపెడుతూ ఆపసోపాలు పడింది. ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్దాయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు. ఎడమ చేత్తో ఫోను చూస్తూనే కుడి చేత్తో పీతల వేట మొదలు పెట్టాడు. ఆయనకు మరో ‘హెడ్‌ఫోన్’ ప్రయాణికుడు, మరో వ్యక్తి తోడయ్యారు. ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు. అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు. అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కరుస్తూ పారిపోయేందుకు ప్రయతి్నంచాయి. చివరికి అంతా కలిసి అన్ని పీతలనూ విజయవంతంగా సంచీలో వేశారు. మెట్రోలో ఈ పీతల హడావిడిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే ఏకంగా కోటీ 15 లక్షల మందికి పైగా చూశారు. లెక్కలేనన్నిసార్లు షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా లైక్‌లు, కామెంట్లూ వస్తున్నాయి. ‘సూటూ బూటు నీటుగాళ్లు తిరిగే మెట్రోలో జనం సాయానికి ఇంతగా జనం ముందుకురావడం గ్రేట్’ అని ఒకరు, ‘పీతలు భలే తాజాగా ఉన్నాయి. వండుకు తింటే నా సామిరంగా..’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందన్నది మాత్రం తెలియదు! View this post on Instagram A post shared by SubwayCreatures (@subwaycreatures) -
అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు..కోట్లలోనే..! (ఫొటోలు)
-
ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!
కొన్ని ప్రముఖ లగ్జరీయస్ ప్యాషన్ బ్రాండ్లు మార్కెట్లోకి రీలిజ్ చేసే కొత్త వస్తువులు చాలా విలక్షణంగా ఆకర్షణీయంగా ఉంటాయి.పైగా వాటికో స్పెషాలిటీ తప్పక ఉంటుంది. ఆ ఫేమస్ బ్రాండ్లు రిలీజ్ చేసే వస్తువులపై క్రేజ్ మాములుగా ఉంటుంది. అందరూ అటెన్షన్ ఆ వస్తువు పైనే ఉంటుంది. అంతలా ఫ్యాషన్ ప్రపంచంలో వాటికి క్రేజ్ ఉంటుంది. అయితే ఫ్యాషన్‌కే ఐకానిక్ సింబల్‌గా ఉన్న ఈ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్ చూస్తే మాత్రం ఇదేం బ్యాగ్ రా బాబు అంటూ ముఖం చిట్లించేస్తారు. ప్రస్తుతం నెట్టింట ఈ బ్యాగ్‌పై సర్వత్ర విమర్శలు, జోక్‌లు వినిపిస్తున్నాయి. ప్రాడ్ అనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ఈ మెటాలిక్ టోట్ బ్యాగ్‌ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ మరింత వినూత్నంగా ఈ బ్యాగ్‌ని రూపొందించింది. పురుషులకు ఇలా డిజైన్ చేయడం మరింత విస్మయానికి గురిచేసింది. ఇది మన బస్సుల్లోనూ, రైల్వే టాయిలెట్లలోనూ ఫ్లోర్ మాదిరిగా ఈ మెటాలిక్ బ్యాగ్ ఉంది. చూసిన వాళ్ల అంతా భయనాకంగా ఉందంటూ ఘెరంగా పోలికలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించే ప్లోర్ మాదిరిగా బ్యాగ్‌ని డిజైన్ చేయడం ఏమిటి. ఇది ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టేట్మెంట్ లేదా విచిత్రమైన డిజైన్ అని ప్రశ్నలు లేవెనెత్తారు. సర్వత్రా ఈ బ్యాగ్ డిజైన్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. ఇదేం డిజైన్ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఇంతలా విమర్శలు వస్తున్న ఈ బ్యాగ్ ధర వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఏకంగా రూ. 2.73 లక్షలు పలుకుతుందట. పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్యాగ్ డిజైన్ పరంగానే కాకుండా ధర పరంగానూ క్లిక్ అయ్యేలా లేదు కదూ..!.(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం స్వాధీనం చేసుకుంది. బ్యాగ్‌ను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్‌కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఎక్స్‌రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్‌కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్‌తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్‌కుమార్‌ను పోలీసులకు అప్పగించారు. మనోజ్‌కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!
మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్ రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్ అవ్వుతాడు. ఐదు జతల జీన్స్‌కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్‌లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ జీన్స్ పేరుతో స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్ వేల జతలు జీన్స్‌లు సేకరించాడు నిర్వాన్. వాటితో దాదాపు 900 స్లీపింగ్ బ్యాగ్‌లను రూపొందించాడు. అవి ఎవరికీ ఇస్తారంటే..ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్ బ్యాగ్‌లు అందిస్తున్నాడు నిర్వాన్. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్ బ్యాగ్‌లు రూపొందించాడు. అవి బెడ్ మాదిరిగా ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్ కమ్ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్. తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్‌లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్ బ్యాగ్‌లను అందజేశాడు నిర్వాన్. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్‌ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..) -
ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి ఐశ్వరరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తల్లి అయ్యాక కూడా ఆమె అదే గ్లామర్‌ని మెయింటెయిన్ చేస్తూ యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఆమె కూతురు ఆరాధ్య కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైయిలిష్ దుస్తులతో కెమెరాకి చిక్కి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల్ల ఏ వేడుకలోనైన ఈ క్యూట్ మామ్ అండ్ డాటర్స్ ఇద్దరు కలిసే సందడి చేస్తున్నారు. ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అయితే ఆమె చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్ బ్యాగ్‌ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్ డ్రెస్‌లతో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్ విట్టన్ ట్రెంట్ కోట్లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్షర్ట్లో ఉంది. ఇక్కడ ఐశ్వర్య గూచీ బ్లాక్ లెదర్ టోట్ బ్యాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్రాండ్ బ్యాగ్ ధరలు అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఐశ్వర్యరాయ్ బ్యాగ్ టోట్ ధర ఏకంగా రూ. 80, 000/ పలుకుతుందట. ఈ కేన్స్ ఈవెంట్లో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య రాయ్ నిలుస్తుంటుంది. ఆమెను భారతదేశంలోని కేన్స్ రాణి అని చెప్పొచ్చు. అంతేగాదు ఆమె అభిమానులు 2024 కేన్స్‌లో ఐశ్వర్యరాయ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు) -
భార్యాపిల్లలను చంపి బ్యాగులో కుక్కిన భర్త.. విస్తుపోయే విషయం వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదివారం(మార్చ్ 30) దారుణ ఘటన వెలుగు చూసింది. లక్నోలోని సర్వన్ నగర్లో నివాసం ఉంటున్న రామ్ లఖన్ తన భార్య ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కి వారి మృతదేహాలను రెండు రోజుల పాటు వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యల విషయం బయటపడింది. భార్యకు స్కార్ఫ్‌తో ఉరివేసి చంపి అనంతరం నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను రామ్‌లఖన్ హత్య చేశాడు. హత్యల తర్వాత రామ్‌లఖన్ పారిపోయాడు. సెల్‌ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే రామ్ లఖన్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య పిల్లలు తన పక్కనే నిద్రిస్తున్నారని అనుకోవడం కోసమే వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నానని రామ్‌లఖన్ విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. ఇదీ చదవండి.. ప్రాణం తీసిన బర్త్ డే కేక్ -
Rameshwaram Cafe Bomb Blast: రవ్వ ఇడ్లీ తీసుకుని, ‘బ్యాగు’ను వదిలి..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్‌ను రెస్టారెంట్లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు. రామేశ్వరం కేఫ్ వైట్‌ఫీల్డ్ అవుట్‌లెట్‌లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్ చేయగా, వారు రెస్టారెంట్లో పేలుడు జరిగిందని చెప్పారు. తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది. Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL — Stranger (@amarDgreat) March 2, 2024 అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్‌ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు. నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్లెట్కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు. -
"పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్" ఎలా చేస్తారో వింటే షాకవ్వుతారు!
ఇటీవల అందరికీ వంటకాల మీద ఆసక్తి ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఈ సోషల్ మీడియా పుణ్యమా! అని వాటికి క్రేజ్ మరింత పెరిగింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అక్కడ వండే వివిధ రకాల రెసీపీల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్న విధానన్ని మాత్రం అస్సలు చూసుండరు. కానీ అతను ఎలా చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. ఎలా చేశాడంటే..? సాధారణంగా చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసి మరీ డీప్ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. అది కామన్, అలా కాకుండా అల్లం వెల్లుల్లి , కొన్ని రకాల మసాల పొడులతో చికెన్‌ని మేరినేషన్ చేసి పేపర్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. అలా ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్‌లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్ బ్యాగ్ కాబట్టి చక్కగా చికెన్ ఆ పేపర్ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్ చేయగానే చికెన్‌లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. ఇలా మలేషియాలోని వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఫోకస్ అంతా అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. అయితే ఆ పేపర్ బ్యాగ్‌ని పిన్చేస్తున్నారు కదా! ఏం ప్రమాదం కాదా? అనేది డౌటు. తినే కంగారులో ఆ ఫ్రైడ్ పేపర్ బ్యాగ్ చికెన్‌ని అలానే తింటేనే ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ వ్లాగర్ వెరైటీగ్ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి చలా ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్‌లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Trevor James (@thefoodranger) (చదవండి: దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!) -
కుమారుని మృతదేహం పక్కన లేఖ.. వెలుగులోకి కీలక విషయాలు
భళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని మైండ్‌పుల్ ఏఐ సీఈఓ సుచనా సేథ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుని మృతదేహాన్ని ఉంచిన బ్యాగులో ఓ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విడిపోయిన భర్త తన కుమారున్ని కలవడానికి అనుమతించిన కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుచనా నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. టిష్యూ పేపర్‌పై ఐలైనర్ వాడి సుచనా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ' ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి. " అని ఆమె అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుని మృతదేహం వద్ద ఈ లేఖ పెట్టినట్లు తెలుస్తోంది. సుచనా మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు సుచనా సహకరించడం లేదని సమాచారం. కుమారున్ని చంపినందుకు ఆమెలో కొంచెం కూడా మానసిక పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య, మానసిక పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాగులో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. భార్య-భర్తల మధ్య విబేధాల కారణంగా కొడుడు కస్టడీ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు -
30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..!
కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్ప్రైజ్ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్ బ్యాగ్‌ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్‌ని ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్‌పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్ కావాలా అంటూ కౌట్స్ ఆ బ్యాగ్‌ని అందుకుంది. అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్‌స్టిక్, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్‌కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్‌ని తన ఆఫీస్ డెస్క్ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్ కంప్లైయింట్ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్‌ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది. ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్‌ని యజమానికి అందించిన కిమ్ సోషల్ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్. (చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?) -
చెత్త కుప్పలో బ్యాగ్...తీసి చూస్తే డాలర్ల కట్టలు
బెంగళూరు: చెత్త ఏరుకునే ఓ వ్యక్తి రోజూలాగే తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఓ చెత్తకుప్ప దగ్గర అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఆశతో ఆ బ్యాగులో ఏమున్నాయో అని చూసిన అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఆ బ్యాగులో అతనికి ఏకంగా 3 మిలియన్ డాలర్ల అమెరికన్ కరెన్సీ దొరికింది. మన రూపాయి విలువలో చెప్పాలంటే వాటి విలువ రూ.25 కోట్లు. అన్ని అమెరికన్ డాలర్లు చూసి ఎగిరి గంతేసిన ఆ చెత్త ఏరుకునే వ్యక్తి వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి విషయం తన బాస్‌కు చెప్పాడు. ఆ బాస్ ఓ సోషల్ యాక్టివిస్ట్ చెవిన ఈ విషయాన్నివేశాడు. ఆ సోషల్ యాక్టివిస్ట్ వెంటనే పోలీసులకు డాలర్ల కట్టల బ్యాగ్ దొరికినట్లు చెప్పాడు. దీంతో సీన్లోకి ఎంటరైన పోలీసులు డాలర్లు అసలువా కావా కన్ఫమ్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి వాటిని పంపారు. వాటిని పరిశీలించిన ఆర్బీఐ ఆ డాలర్లన్నీ ఫేక్ అని తేల్చింది. -
చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు
బనశంకరి: రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వేస్టేషన్ వద్ద పట్టాల పక్కన ఎస్కే సాల్మన్ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్ నేషన్స్ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్కే సాల్మన్ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండిళ్ల డాలర్లు కనిపించాయి. ఏం చేయాలో తెలియక గుజరీ వ్యాపారికి ఈ విషయం చెప్పాడు. తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరుకు వచ్చేవరకు మీ వద్ద పెట్టుకోవాలని సూచించాడు. కానీ భయపడ్డ సాల్మన్.. రెండురోజుల తర్వాత స్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్.కలీముల్లాను కలిసి విషయం చెప్పాడు. కలీముల్లా ఈ సంగతిని నగర పోలీస్ కమిషనర్ దయానందకు తెలిపారు. ఆయన సూచనతో సాల్మన్‌ను, నగదును తీసుకుని కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు. మరోవైపు నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు. తనిఖీ కోసం వాటిని నగరంలోని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందినదని పోలీసులు చెప్పారు. బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త అని ఒక పెద్ద లెటర్ కూడా అందులో ఉండటం విశేషం. అంత డబ్బును చూశాక తాను ఉద్వేగంతో ఒక రోజంతా నిద్రపోలేదని సాల్మన్ చెప్పాడు. -
ఏం టెక్నాలజీ గురూ.. సంచిలో పడేస్తే చల్లగా ఉంటాయట
కూల్‌డ్రింక్స్, వైన్, బీరు వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను, ఐస్‌మేకర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసినట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేషన్‌తో రూపొందించిన ఈ బ్యాగ్ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్ కూలర్ బ్యాగును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు రంగుల్లో దొరికే ఈ బ్యాగు ధర 50 డాలర్లు (రూ.4,131) మాత్రమే! -
మైక్రో బ్యాగు.. మైండ్ బ్లోయింగ్ బ్యాగు
ఈ చిత్రాల్లో ఒకదానిలో చేతి వేలిపై ఏదో ఇసుక రేణువు, మరో చిత్రంలో ఓ హ్యాండ్‌బ్యాగ్ కనిపిస్తున్నాయా? ఇసుక రేణువుకు, హ్యాండ్ బ్యాగ్‌కు సంబంధమేంటి అంటారా? సింపుల్.. రెండూ ఒకటే. ఇలాంటి విచిత్రమైన వస్తులకు పాపులర్ అయిన యూఎస్ ఆర్టిస్ట్ కలెక్టివ్ మిస్చీఫ్.. మరొక ఆఫ్‌బీట్ ప్రొడక్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు. కేవలం మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి సూక్క్ష్మ పర్స్ తయారు చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్ వస్తువుల కంపెనీ మిస్చీఫ్.. ఫొటోపాలిమర్ రెసిన్తో ఈ మైక్రోస్కోపిక్ హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేసింది. దీని పరిమాణం 700 మైక్రోమీటర్లు (అంటే మిల్లీమీటర్లో సగానికంటే ఎక్కువ). సూది రంధ్రం నుంచి సులువుగా దూరిపోగలదు. ఈ నెల 20 నుంచి దీనిని పారిస్‌లో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఆ తర్వాత జూపిటర్ వేలం శాలలో వేలం వేయనున్నారు. -
అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబానీ ఇంటికి కాబోయే కోడలు, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ అందరి దృష్టినీ ఆకర్షించారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసిన ఈ వేడుకల్లో రాధికా మర్చంట్ నల్ల చీరలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న వెండి రంగు హెర్మేస్ కెల్లీమార్ఫోస్ మినీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. bollywoodshaadis.com కథనం ప్రకారం.. ఫ్యాషన్స్టాలో ఈ చిన్న బ్యాగ్ ధర అక్షరాలా రూ.52,30,000. ఇంత ఖరీదైన బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రా, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) ఈ వేడుకలో రాధికా మర్చంట్ నలుపు రంగులో ఉన్న ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ చీరలో అద్భుతంగా కనిపించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి చిన్న కొడుకుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గత జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అంత్యక్రియల సమయంలో ఊపిరి పీల్చుకున్న మహిళ ..ఆ తర్వాత..
అంతక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది ఓ వృద్ధ మహిళ. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కంగుతిన్న అంత్యక్రియ నిర్వాహకులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ మహిళ ఆస్పత్రికి తరలించిన ఐదు రోజుల తర్వాత అనుహ్యంగా మరణించింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలో అయోవా రాష్ట్రంలో 66 ఏళ్ల మహిళను గ్లెన్ ఓక్స్ అల్జీమర్స్ స్పెషల్ కేర్‌లో చనిపోయినట్లు ధృవీకరించింది. దీంతో ఆమెను మృతదేహాలు ఉంచే బ్యాగ్‌లో ప్యాక్ చేసి శ్మశానానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా..అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది సదరు వృద్ధ మహిళ. దీంతో కంగారు పడిన కార్మికులు వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె సజీవంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ కేర్ హోమ్ సెంటర్‌కు దాదాపు రూ. 8 లక్షలు జరిమానా విధించారు అధికారులు. అయితే విచారణలో..ఆస్పత్రి సిబ్బంది ఆమె జనవరి 3 నుంచి మహిళ శ్వాస తీసుకోవడం లేదని, పల్స్ నమోదు కాలేదని చెప్పారు. ఆ రోజు రాత్రంత సదరు మహిళను నర్సు పర్యవేక్షణలో ఉంచారు. ఐతే వృద్ధురాలి పల్స్ రికార్డు కాకపోవడం, శ్వాస తీసుకోకపోవడతోనే ఆమె చనిపోయినట్లు ధృవీకరించినట్లు దర్యాప్తులో తేలింది. అది కూడా ఆమె హెల్త్ రిపోర్టు వచ్చిన 90 నిమిషాల తర్వాత మరణించినట్లు ఆస్పత్రి ప్రకటించింది. కానీ చనిపోయిందని ప్రకటించడానికి చేయాల్సిన తగిన సంరక్షణ సేవలను అందించడంలో సిబ్బంది విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ఆమె డిసెంబర్ 28 నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఐతే ఆమె శ్మాశన వాటికి నుంచి తీసుకువచ్చిన రెండు రోజుల అనంతరం జనవరి 5న ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కానీ ఆ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డ్రైరెక్టర్ లిసా ఈస్టమన్ తమ పేషెంట్లను బహు జాగ్రత్తగా పర్యవేక్షిస్తామని వాళ్ల ప్రాణ సంరక్షణకు కావల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిచడానికే తమ సిబ్బంది కట్టుబడి ఉంటారని చెప్పడం గమనార్హం. (చదవండి: దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..) -
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
ఎయిర్‌పోర్టులో పోయిన బ్యాగ్.. నాలుగేళ్ల తర్వాత ప్యాసెంజర్ దగ్గరకు.
వాషింగ్టన్: అమెరికాలో ఓ మహిళ ఎయిర్‌పోర్టులో నాలుగేళ్ల క్రితం పోగోట్టుకున్న బ్యాగ్ మళ్లీ దొరికింది. సదరు విమానయాన సంస్థ ఆమెకు ఫోన్ చేసి బ్యాగ్‌ను అప్పగించింది. అయితే బ్యాగ్ కొంత ధ్వంసమైంది. కానీ అందులోని వస్తువులు, దుస్తులు చెక్కుచెదరలేదు. 2018లో చికాగో నుంచి సెంట్రల్ అమెరికా వెళ్లింది గావిన్. అయితే ఆమె బ్యాగ్ మాత్రం ఎయిర్ పోర్టులోనే పోయింది. విమానయాన సంస్థకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. వాళ్లు అప్పుడు బ్యాగు కోసం వెతికినా దొరకలేదు. పరిహారంగా కొంత డబ్బు ఇచ్చారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఆ బ్యాగ్‌ను హాండురాస్ విమానాశ్రయంలో గుర్తించారు. వెంటనే ఆ మహిళకు ఫోన్ చేసి బ్యాగును హ్యూస్టన్‌కు పంపించారు. దీంతో ఆమె వెళ్లి దాన్ని తీసుకుంది. చికాగో విమానాశ్రయంలో బ్యాగును సరిగ్గా స్కాన్ చేయకపోవడం వల్లే పొరపాటు జరిగిందని, అది ఎక్కడుందో ఇన్ని రోజులు గుర్తించలేకపోయామని విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. చదవండి: ఆ పాస్‌పోర్టుకు పవరెక్కువ -
గుంటూరు పల్నాడు ఎక్స్ ప్రెస్ లో బ్యాగ్ లో పసికందు కలకలం
-
విద్యార్థిని బ్యాగ్‌లో పాము కలకలం.. జస్ట్ మిస్ లేదంటే...: వీడియో వైరల్
ఒక విద్యార్థిని బ్యాగ్‌లో పాము పెద్ద కలకలం సృష్టించింది. ఆమె తన బ్యాగ్‌లో ఏదో మెదలుతుందని గ్రహించకుండా ఉండి ఉంటే ఆ పాఠశాల్లోని విద్యార్థులు, టీచర్లు ఏమై ఉండేవారో ఊహించడానికే భయంగా ఉంది కదా!. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో షాజ్పూర్లోని బడోని స్కూల్లో చోటు చేసుకుంది. ఉమా రజాక్ అనే పదో తరగతి విద్యార్థి తన బ్యాగ్‌లో ఏదో మెదులుతున్నట్లు అనిపిస్తోందని టీచర్‌కి చెప్పింది. అతడు ఆ స్కూల్ బ్యాగ్‌ని పూర్తిగా క్లోజ్‌చేసి ఆరుబయటకు తీసుకువచ్చి నెమ్మదిగా జిప్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అందులో ఉన్న పుస్తకాలన్నీ తీసేశాడు. ఆ తర్వాత బ్యాగ్‌ని తలకిందులుగా చేసి దులపగానే ఒక్కసారిగా తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఒక్కసారిగా విద్యార్థులు, సదరు ఉపాధ్యాయుడు షాక్ అయ్యారు. ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి చెప్పినదాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఉండి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం సంభవించిందో చెప్పనవసరం లేదు. అదీగాక అదృష్టవశాత్తు ఆ పాము ఆ బ్యాగ్ నుంచి బయటపడ్డాక వారిపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీర కూడా ఓ లుక్కేయండి. कक्षा 10 की छात्रा कु. उमा रजक के बैग से, घर से स्कूल आकर जैसे ही बैग खोला तो छात्रा को कुछ आभाष हुआ तो शिक्षक से शिकायत की, कि बस्ते में अंदर कुछ है, छात्रा के बैग को स्कूल के बाहर ले जाकर खोला तो बैग के अंदर से एक नागिन बाहर निकली, यह घटना दतिया जिले के बड़ोनी स्कूल की है। pic.twitter.com/HWKB3nktza — Karan Vashistha BJP 🇮🇳 (@Karan4BJP) September 22, 2022 (చదవండి: వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా ) -
కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో
భూమ్మీద ఉన్న తెలివైన జంతువులలో కోతులు ఒకటి. కానీ వాటి చేష్టలు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు అవి చేసే పనులు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తాయి. దేవాలయాలు, పార్క్‌లు, బహిరంగ ప్రదేశాల్లో జనాల చేతుల్లో ఆహార పదార్థాలు, ఫోన్లు, పర్స్‌లు కనిపిస్తే చాలు తెలివిగా వాటిని ఎత్తుకెళ్లిపోతుంటాయి. ఇళ్లలోకి దూరి కిచెన్‌లోని వస్తువులను కూడా దొంగిలిస్తుంటాయి. చేతికి దొరికిన తీసుకొని పరారవుతుంటాయి. తాజాగా ఓ కోతి బ్యాగ్ నుంచి దొంగిలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో.. ఓ వ్యక్తి భుజానికి బ్యాగ్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఈ బ్యాగ్ అక్కడున్న రెండు కోతుల కంట పడింది. కానీ అక్కడ కోతులు ఉన్నాయని ఆ వ్యక్తి గమనించుకోలేదు. వెంటనే కోతులు వ్యక్తి తగిలించుకున్న బ్యాగ్ వద్దకు చేరుకున్నాయి. అందులో ఓ కోతి మెల్లగా బ్యాగ్ జిప్ తీసింది. మొదటి జిప్‌లో ఏం దొరకలేదు. దీంతో మరో జిప్ తెరిచింది. అందులో దానికి ఒక యాపిల్ దొరికింది. ఇంకేముంది దానిని తీసుకొని పరుగో పరుగు తీసింది. దీనిని రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్.. వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. దొంగ కోతి, అది చికాగో, న్యూయార్క్ నుంచి వచ్చినా సరే కోతులన్నీ దొంగవే. కోతి తెలివి మామూలుగా లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Waow Africa (@waowafrica) -
బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ రాణి వాడిపడేసి ఒక టీబ్యాగ్ గురించి ఒక కథనం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజ కుటుంబికులుకు సంబంధించిన వస్తువులు బయటకు రావడం అనేది అసాథ్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ వారు ఉపయోగించే వస్తువులు గురించి బయట వ్యక్తులకు తెలిసి ఉండే అవకాశమే అరుదు. అలాంటిది ఆమె వాడిపడేసి టీ బ్యాగ్ ఏంటీ? అది నిజంగా ఆమె ఉపయోగించినదేనా అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఔను! ఇది నిజం అని చెప్పే ఆధారాలను కూడా పొందుపరిచారు. అసలేం జరిగిందంటే....70 ఏళ్లు సుదీర్ఘ పాలనతో రికార్డు సృష్టించిన క్విన్ ఎలిజబెత్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్రిటన్ ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుంటూ ఆమె ఉపయోగించని వస్తువులను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీ బ్యాగ్ గురించి ఒక కథనం బయటపడింది. 1998లో విండ్సర్ కాజిల్ అనే వ్యక్తి దీన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఇది దివగంత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రెజీనా బ్రిటానియా టీ బ్యాగ్‌గా నివేదిక పేర్కొంది. ఇది ఇప్పుడు 'ఈబే' అనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆన్లైన్ విక్రయాల జాబితాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వస్తువు ఆన్లైన్లో సుమారు రూ. 9 లక్షలకు విక్రయించబడింది. ఈ టీ బ్యాగ్‌ని యూఎస్‌కి చెందిన జార్జియా కొనుగోలు చేశారు. ఈ టీబ్యాగ్కి 'రాయల్ ఆర్ట్ఫాక్ట్'తో పాటు 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ ఆఫ్ అథెంటిసిటీ' జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ ఉందని చెప్పారు. ఇది నిస్సందేహంగా బ్రిటన్ రాణి వినియోగించిన టీ బ్యాగేనని జార్జియా చెబుతున్నారు. అలానే గతంలో 1985లో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ సంతకాలతో కూడిన ఒక పుస్తకం దాదాపు రూ. 19 లక్షలకు విక్రయించబడినట్లు ఈబే కామర్స్ సంస్థ పేర్కొంది. (చదవండి: ఎలిజబెత్ 2 వివాహానికి ఖరీదైన్ డైమెండ్ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన నిజాం నవాబు) -
బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం
ముంబై: మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో 15 ఏళ్ల బాలిక మృతదేహంతో కూడిన బ్యాగ్‌ని గుర్తించారు పోలీసులు. ఆ బ్యాగ్ ముంబై అహ్మదాబాద్ హైవే పక్కనే ఉన్న నైగావ్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటలన సమయంలో కనుగొన్నారు. ఒక బాటసారి ఈ బ్యాగ్‌ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వాలివ్ పోలిస్టేషన్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఐతే మృతదేహం పై పలు చోట్ల కత్తిపోట్టు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితురాలు ముంబైలోని అంధేరి ప్రాంతాని చెందిన వాసిగా పేర్కొన్నారు. అదీగాక అంధేరి పోలీస్టేషన్లో ఒక కిడ్నాప్ కేసు నమోదైనట్లు గుర్తించామని చెప్పారు. దీంతో తాము ఈ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బాధితురాలి కుటుంబికులు కూడా ఆమె స్కూల్‌కి వెళ్లిందని పొద్దుపోయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసుతెలిపారు. (చదవండి: 12 ఏళ్లలో 339 చోరీలు.. పోలీసులకు ఏమాత్రం డౌట్ రాకుండా.. ఆ ఆలు మగలు ఎలా చిక్కారంటే!) -
అందరూ చూస్తుండగానే... మహిళ బ్యాగ్ కొట్టేసిన బైకర్!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌కి చెందిన షాహిదా బజాజ్ ఢ్లిలీకి వచ్చి ఒక చేదు అనుభవాన్ని ఎదర్కొంది. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఒక మార్కెట్‌కి వెళ్లింది. షాపింగ్ పూర్తి అయిన తదనంతరం వారు తిరిగి తాము ఉంటున్న హోటల్‌కి వెళ్తుండగా..ఆమె పక్క నుంచే బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. సదరు బైకర్లు ఆమెని గమనిస్తూ పక్క నుంచే వెళ్తూ..ఆమె బ్యాగ్‌ని గుంజుకుని పట్టుకుపోయాడు. ఐతే ఆ దొంగ బ్యాగ్‌ని ఆమె నుంచి లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త సాయంతో లేచింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ దొంగ రద్దీగా ఉండే మార్కెట్లో అదీ కూడా అందురూ చూస్తుండగానే చోరి చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. (చదవండి: ఒకే ఇంట్లో ఆరు డెడ్‌బాడీల కలకలం.. ఏం జరిగింది?) -
చెత్త బ్యాగ్ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్
అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్ పౌచ్’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్ చేసేందుకు బ్యాక్‌పాక్‌కు ఉన్నట్టుగా త్రెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్–22 కలెక్షన్లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్ యూజర్స్ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్ చేశాడో యూజర్. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్‌ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్‌తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్ బిన్’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ. -
హత్యకేసులో ఆధారాలు ఎత్తుకెళ్లిన కోతి!
జైపూర్: ఓ హత్య కేసులో కోర్టు ఎదుట హాజరైన పోలీసులు చెప్పిన సమాధానం విని జడ్జి బిత్తర పోయారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలన్నింటిని ఓ కోతి ఎత్తుకెళ్లిపోయిందట. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ హత్య కేసులో పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఇతర వస్తువులను ఓ బ్యాగ్‌లో ఉంచారట. అయితే ఆ సంచిని కోతి ఎత్తుకెళ్లిందని పోలీసులు, కోర్టు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. 2016, సెప్టెంబర్‌లో.. జైపూర్ చాంద్వాజీ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శశికాంత్ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం మృతదేహాంతో అతని కుటుంబం ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్భంధించింది కూడా. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఐదురోజుల తర్వాత రాహుల్, మోహన్‌లాల్ కండేరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే స్టేషన్లో జాగా లేకపోవడంతో.. ఈ కేసులో సేకరించిన పూర్తి ఆధారాలను ఓ బ్యాగులో ఉంచి.. స్టేషన్ బయట ఓ చెట్టుకింద పెట్టాడట డ్యూటీ కానిస్టేబుల్. ఆ టైంలో కోతి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకెళ్లిందట. ఈ కేసులో కోర్టు విచారణ.. ఏళ్ల తరబడి సాగింది. ఈమధ్యే ఈ కేసు విచారణకు రాగా.. ఆ సమయంలో ఎవిడెన్స్ ఏవని? జడ్జి ప్రశ్నించారు. దీంతో.. కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం ఇచ్చారు పోలీసులు. ఆ బ్యాగులో మొత్తం 15 వస్తువులు కేసుకు సంబంధించినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రాత పూర్వక స్టేట్మెంట్లో.. ఈ విషయాన్ని కింది న్యాయస్థానానికి తెలియజేశామని, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను ఘటన తర్వాత సస్పెండ్ చేశారట. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ కావడంతో పాటు మరణించాడని సదరు స్టేట్మెంట్లో కోర్టుకు వివరించారు పోలీసులు. ఇది కోతి కథతో పోలీసులు ఇచ్చిన వివరణ. -
ఇదేక్కడి పెంపుడు కుక్క రా బాబు.. రూ.1.50 లక్షల నగదు సంచితో..
దుగ్గొండి: యజమాని ఏదైనా పారేసుకుంటే పెంపుడు కుక్కలు తెచ్చిస్తాయి. కానీ.. ఈ కుక్క మాత్రం రివర్స్ చేసింది. తన యజమాని రూ.1.50 లక్షల నగదును దాచుకున్నజోలెను ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కాసు చేరాలు గొర్రెలకాపరి కావడంతో ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆయన సంపాదించిన డబ్బును ప్రత్యేకంగా కుట్టించుకున్న జోలె సంచిలో దాచుకుంటాడు. ఈ నెల 25న రాత్రి నడుముకు ఉన్న సంచి తీసి మంచంలో పెట్టి స్నానానికి వెళ్లాడు. ఇంతలో పెంపుడు కుక్క ఆ సంచిని నోట కరుచుకుని వెళ్లి ఎక్కడో పడేసింది. అది తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు గమనించినా, ఏదోలే అని పట్టించుకోలేదు. బయటికి వచ్చిన చేరాలుకు మంచంపై బ్యాగ్ కనిపించకపోవడంతో వెదకడం మొదలుపెట్టాడు. కుక్క ఏదో పట్టుకుపోవడం చూశామని కుటుంబసభ్యులు చెప్పారు. అది డబ్బు సంచి అని చెప్పి... రెండు రోజులపాటు వెతికినా దొరకలేదు.గ్రామ పంచాయతీ వారు చాటింపు వేయించినా ఫలితం కనిపంచలేదు. -
ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు
ప్రేయసితో తన గదిలో రాత్రంతా సరదాగా గడపాలన్న ఓ కుర్రాడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మాస్టర్ ప్లాన్ వేసి గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాస్తుంటే.. గదికి చేరుకునేవాడే. ఇంతలో.. కర్ణాటక మణిపాల్ హాస్టల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్ ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు అంకుల్.. అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.దాంతో ఆ వార్డెన్ అనుమానం మరింత బలపడింది. బ్యాగ్ ఓపెన్ చేయాలని కోరడంతో.. పగిలిపోయే ఐటెమ్స్ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్ బయటకు వచ్చింది. ఆపై గట్టిగా ప్రశ్నించడంతో హాస్టల్లో గడిపేందుకు తీసుకొచ్చానని నిజం ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో సస్పెండ్ చేసి..ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ టైంలో మంగళూరుకు చెందిన ఓ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌ను ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మణిపాల్‌కు సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది Manipal Academy of Higher Education. The funniest video I've seen today 😬 Apparently, a Manipal Univ. student was smuggling his gf out in a trolley bag. Someone's watching too much Netflix. pic.twitter.com/RQLkAfj9vB — 𝙋𝙧𝙚𝙧𝙣𝙖 𝙇𝙞𝙙𝙝𝙤𝙤 (@PLidhoo) February 2, 2022 -
నేత బ్యాగు.. మోత బాగు
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల శ్రావణ్ చేతిలో ఇమిడిపోయే సూక్ష్మ బ్యాగును సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి నాలుగు దశాబ్దాల కిందటే ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే నల్ల శ్రావణ్. వస్త్రోత్పత్తిలో వినియోగించే వార్పు నైలాన్ పోగులు, వెప్టు పీసీ ధారంతో ఈ సూక్ష్మ సంచిని తయారు చేశాడు. పొడవు 24 ఇంచులు, వెడల్పు 16 ఇంచులతో కేవలం 24 గ్రాముల బరువుతో చేతిలో ఇమిడి పోయేలా బ్యాగును రూపొం దించాడు. ఈ బ్యాగును ‘కీ’ చైన్‌తో ఉంచుకునే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లను సిరిసిల్లలో నిషేధించిన నేపథ్యంలో బట్టతో చేసిన సూక్ష్మ బ్యాగును ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేశాడు. 10 కిలోల బరువు గల వస్తువులను మోయగల సామర్థ్యంతో బ్యాగును రూపొందించినట్లు శ్రావణ్ తెలిపారు. చేతిలో ఇమిడి పోయే బ్యాగును తయారు చేసినందుకు శ్రావణ్‌ను పలువురు అభినందించారు. -
గోనె సంచిలో మహిళ మృత దేహం.. కుక్కలు పీక్కుతింటుండగా
లక్నో: యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్‌లోని పార్తాపూర్‌లో సమీపంలో.. ఒక గోనె సంచిలో ఉన్న మహిళ మృత దేహం కుక్కి ఉండటం కలకలంగా మారింది. కాగా, కాశీ గ్రామంలోని చెరువుకు ఒడ్డున మహిళ మృత దేహన్ని కుక్కలు పీక్కుతింటుండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే మృత దేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. చనిపోయిన మహిళ.. బురఖా వేసుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పాడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశృతి.. తలపై పడిన డ్రోన్.. ఇద్దరికి -
బిర్యానీకి వెళ్తే రూ.2 లక్షలు మాయం
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): హోటల్లో బిరియానీ తినేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. బ్యాడరహళ్ళిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఆటోడ్రైవర్ హనుమంతరాయ కుటుంబ అవసరాల కోసం బ్యాంక్‌లో బంగారు నగలు పెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిని బైక్ సైడ్ బాక్సులో పెట్టుకొని బావమరిదితో కలసి ఇంటికి వెళుతున్నాడు. దారిలో బిరియాని హోటల్ వద్ద బైక్ ఆపి ఇద్దరూ వెళ్లి ఆరగించారు. వచ్చి చూడగా బాక్సులోని నగదు మాయమైంది. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి డబ్బులు తీసుకెళ్లినట్లు రికార్డయింది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం గాలిస్తున్నారు. -
ఈ భామ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Nora Fatehi Hand Bag Cost: సెలెబ్రిటీలు ధరించే డ్రెస్ నుంచి వారు వేసుకునే చెప్పులు.. గాగుల్స్, వాచీలు ఇలా ప్రతీదీ పెద్ద విషయమే. వాళు కదిలినా.. మెదిలినా అంతా విశేషాల పరంపరలే. వాళ్లు ఏ లుక్‌లో కనిపించినా… కెమెరా కళ్లు క్లిక్కుమంటాయి. వారిని టాప్ టూ బాటమ్ వరకూ స్కాన్ చేస్తేకానీ కెమెరాల కళ్లు శాంతించవు. ఆ ఫోటోలో చిన్న విశేషం కనిపించినా అదో పెద్ద వార్త అయి కూర్చుంటుంది. తాజాగా బాలీవుడ్ భామ నోరా ఫతేహి విషయంలో అదే జరిగింది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ కనిపించి కుర్రకారు మదిని దోచింది. తాజాగా ఈ భామ రూ. 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది. ఆ సమయంలో లక్షల రూపాయాల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది. బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి వచ్చిన నోరా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది. ప్రస్తుతం నోరా హ్యాండ్ బ్యాగ్ పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. దాదాపుగా రూ.1.95లక్షల విలువైన మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్‌ను ధరించి ఆమె కనిపించింది. ఆ బ్యాగ్ ధరను తెలుసుకొని అభిమానులు షాకవుతున్నారు. ఇక నోరా సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈ భామ అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘‘ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ’’ సినిమాలో స్పై పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాకు అభిషేక్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆ చిత్రం విడుదలయింది. -
మరో 30 ఏళ్లలో సముద్రంలో చేపల కంటే ఇవే ఎక్కువట!
వెబ్‌డెస్క్: అణుయుద్ధాలు, కరోనా వైరస్ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్‌ను కంట్రోల్ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. జులై 12న పేపర్ బ్యాగులపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 12న పేపర్ బ్యాగ్ డే నిర్వహిస్తున్నాయి. పర్యవరణానికి హానీకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేపర్ బ్యాగులు వాడాటాన్ని ప్రోత్సహించడం పేపర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. 1952లో అమెరికాలో 1852లో తొలిసారి పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో పేపర్ బ్యాగులు ప్రపంచం మొత్తం విపరీతంగా అమ్ముడయ్యాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత వచ్చిన ప్లాస్టిక్ బ్యాగులు పేపర్ బ్యాగుల స్థానానికి ఎసరు పెట్టాయి ఇక 80వ దశకంలో వచ్చిన యూజ్ అండ్ త్రో బ్యాగులైతే పర్యవరనానికే ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్ భూతం 1950 నుంచి ఇప్పటి వరకు 830 బిలిమన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 60 శాతం ప్లాస్టిక్ అంటే 500 బిలియన్ టన్నులు రీసైకిల్ చేయడానికి అనువుగా లేదు. అంటే 70 ఏళ్లలో 500 బిలియన్ టన్నుల ప్టాస్టిక్ భూతాన్ని భూమిపై పడేశాం. మనకు ప్రమాదమే సముద్రంలో పోగవుతున్న చెత్తను చేపలు తినేస్తున్నాయి, ఆ చేపలు మనం ఆహారంగా తీసుకోవడం వల్ల హర్మోన్స్ సమతుల్యత దెబ్బ తింటోంది. వీటికి తోడు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా డ్రైనేజీలు మూసుకుపోయి వరద సమస్యలు కూడా తలెత్తున్నాయి. ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల కర్బణ ఉద్గారాలు పెరిగి భూతాపం సమస్య ఎదురువుతోంది. ఇలా ప్లాస్టిక్‌తో ఎలా ఉన్నా ఇబ్బందులే ఉన్నాయి. అందుకే పేపర్ బ్యాగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాల్సిందే ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ప్లాస్టిక్ కట్టడి విషయంలో చాలా దేశాలు ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నాయి. ప్లాస్టిక్ విషయలో కఠినంగా ఉన్న దేశాల వివరాలు కెనడా భూమ్మీద ఉన్న తాగునీటిలో నాలుగో వంతు స్వచ్ఛమైన నీరు కెనడాలో ఉంది. ప్లాస్టిక్ కారణంగా జలవనరులకు తలెత్తుతున్న ఇబ్బందులు గుర్తించిన కెనడా జాగ్రత్త పడుతోంది. 2030 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తయారీని నిషేధించింది. స్ట్రాలు, బ్యాగులు, కవర్లు, బాటిళ్లు, ఫుడ్ ప్లేట్స్, చెంచాలు ఇలా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించింది. రువాండ రువాండలో జరిగిన అంతర్యుద్ధం 1994లో ముగిసిన వెంటనే వ్యవసాయంపై ఆ దేశం దృష్టి సారించింది. అయితే అసలే వర్షాలు తక్కువగా ఉండే ఆ దేశంలో ప్లాస్టిక్ కారణంగా సాగు దిగుబడికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది. 2004లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండటం వారి జీవన విధానంలో ఓ భాగం అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్‌ను అతి తక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలిచింది. కెన్యా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్న దేశంగా కెన్యా చరిత్రలో నిలిచిపోయింది. ప్లాస్టిక్ తయారు చేసినా, అమ్మినా, ఉపయోగించినా సరే నాలుగేళ్ల జైలు శిక్ష లేదా 40,000 డాలర్లు జరిమానాగా విధిస్తూ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దెబ్బకు ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 80 శాతం మేరకు తగ్గిపోయింది. పేపర్ బ్యాగుల వినియోగం పెరిగింది. ఫ్రాన్స్ 2040 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అనుగుణంగా ఫ్రాన్స్ పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 2016లో టేక్ అవే, ఫుడ్ వేర్, కర్ట్లరీ ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 2020లో టేబుల్ వేర్కి ఉపయోగించే ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని 50 శాతంలోపు పరిమితం చేసి, వాటి స్థానంలో భూమిలో కలిసిపోయే మెటీరియల్‌తో తయారైన వస్తువులు ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఇలా ఒక క్రమపద్దతిలో ప్లాస్టిక్‌కి చెక్ ఫ్రాన్స్ పెడుతోంది. ఇండియా 2022 నాటికి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. మన దగ్గర మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్‌లో 80 శాతం తిరిగి సముద్రంలోకి చేరుతుంది. ప్లాస్టిక్ నియంత్రణ, డిస్పోజల్‌కు సరైన పద్దతులు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. -
గుండెను బ్యాగులో పెట్టుకొని తిరుగుతోంది!
లండన్: సాధారణంగా మీరేప్పుడైనా బయటకు వెళ్తే.. బ్యాగులో ఏం పెట్టుకుంటారు? మహా అయితే.. ఏ చిన్నవస్తువులో లేదా ల్యాప్‌టాప్‌లో ఉంటాయి. అయితే, యూకేకు చెందిన ఈ మహిళ మాత్రం బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఆమెతో ఒక బ్యాగు, దానిలో ఆమె గుండె ఉంటుంది. ఏంటీ నమ్మట్లేదా.. అయితే చదివేయండి. ఆ మహిళ పేరు సెల్వా హుస్సెన్. ఆమె 2017లో కారు నడుపుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు గుండె ఫెయిలయ్యిందని, వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. అప్పుడు సెల్వాను హుటాహుటీనా హేర్ఫీల్డ్ గుండె ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు నాలుగు రోజులపాటు చికిత్స అందించారు. అప్పటికి ఆమె శ్వాసతీసుకోలేక పోయింది. ఇక చేసేదేమిలేక , కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెకు కృత్రిమ గుండెను అమర్చారు. ఇది పనిచేయడానికి ప్రత్యేక కంట్రోల్ యూనిట్‌ను ఆమె వెనుక ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, మరో యూనిట్‌ను ఆమె వెనుక బ్యాగ్‌లో కూడా అమర్చారు. ఇవి రెండు కూడా ఆమె గుండె సమర్థవంతంగా పనిచేయాడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా, మొదటి యూనిట్ పనిచేయకపోతే.. రెండో యూనిట్ దాని స్థానంలో పనిచేస్తుంది. ఆమె బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఒకరి తోడుండాల్సిందే. ఈ కృత్రిమ గుండె ఆమె శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతోంది. ఆమె కడుపు నుంచి ప్రత్యేక పైపులు.. బ్యాక్‌ప్యాక్‌లోని మొదటి యూనిట్‌కు, రెండో యూనిట్‌కు కలుపబడి ఉన్నాయి. దీనితో శరీరంలోనికి రక్తం పంపింగ్ చేయబడుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వ్యాధి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. దీన్ని వైద్యపరిభాషలో కార్డియోమయోపతి అంటారని తెలిపారు. కాగా, ఈ కృత్రిమ గుండె ఖరీదు 86 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.88.72 లక్షలు). దీన్ని ఓ అమెరికాకు చెందిన సంస్థ తయారు చేసింది. ఈ గుండెను అమర్చేందుకు హేర్ఫీల్డ్ ఆసుపత్రి వైద్యులు దాదాపు 6 గంటలపాటు శ్రమించారు. -
నిజామాబాద్: సంచి జారి పడటంతో బయటపడ్డ చిన్నారి
సాక్షి, నిజాబాబాద్: ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా పాపను సంచిలో మూట కట్టి తీసుకెళ్తుండగా.. పాప అదృష్టం కొద్ది ఆ సంచి జారి కింద పడింది. దాంతో ఆ చిట్టితల్లి పెద్ద ప్రమాదం నుంచి భయటపడింది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. జిల్లాలోని వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో దుండగుడు బుధవారం ఓ పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా పాపను సంచిలో మూట కట్టి సైకిల్‌పై పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. అయితే అదృష్టం కొద్ది సంచి జారి కిందపడటంతో పాప బయటకు వచ్చింది. జారిపడ్డ చిన్నారిని గమనించిన గ్రామస్తులు కిడ్నాపర్‌ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. చదవండి: కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు.. -
భళా.. పోలీస్!
కేపీహెచ్‌బీకాలనీ: ఓ మహిళ పోగొట్టుకున్న బ్యాగును గంట వ్యవధిలోనే బాధితురాలికి అప్పగించిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శంషీగూడ ప్రాంతంలో నివాసం ఉండే శ్రీలక్ష్మి శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌తో ద్విచక్ర వాహనంపై కొండాపూర్ నుంచి హెచ్ఎంటీ హిల్స్ మీదుగా శంషీగూడ తన నివాసానికి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత చూసుకోగా తన హ్యాండ్ బ్యాగ్ కనిపించకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టగా అడ్డగుట్ట సొసైటీ ప్రాంతంలో నివాసం ఉండే వాచ్మెన్ ఇరగవరపు సాగర్‌కు బ్యాగ్ దొరికినట్లు తెలుసుకొని అతడి నుంచి బ్యాగును శ్రీలక్ష్మికి అప్పగించారు. -
క్షణాల్లో 31.50 లక్షలు మాయం
కోటా : ఆనుపానూ చూసి, తమ చోర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే కేటుగాళ్లు నిరంతరం మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. క్షణం ఏమరుపాటు కారణంగా కిరాణా వ్యాపారి ఒకరు ఏకంగా 31.50 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆనక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన బారన్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు చార్ మూర్తి సర్కిల్ బ్రాంచ్‌లో సోమవారం జరిగింది. కోటాకు చెందిన కిరాణా వ్యాపారి మహావీర్ గోయల్ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడ పే-ఇన్-స్లిప్‌లో వివరాలు నింపి, దాన్ని పక్కనే ఉన్న కౌంటర్లో జమ చేయడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 31.50 లక్షల రూపాయలున్న బ్యాగును నగదు కౌంటర్ వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. అయితే ఈ అదును కోసమే ఎదురు చూస్తున్న మాయగాళ్లు బ్యాగు తీసుకొని ఉడాయించారు. ఇదంతా కొన్ని సెకన్ల సమయంలో జరిగిపోయిందని గోయల్ వాపోయారు. ఈ దొంగతనంలో ఒకటి కంటే ఎక్కువ మంది నిందితుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీస్ అధికారి మంగిలాల్ తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
బాంబు అనుకుని తెరిస్తే బంగారం..
శంషాబాద్: అనుమానిత వస్తువుగా భావించిన ఓ బ్యాగులో బంగారం బయటపడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని అంతర్జాతీయ అరైవల్‌లో బ్యాగులు తీసుకొచ్చే బెల్టుపై ఆదివారం రాత్రి ఓ బ్యాగు మిగిలిపోయింది. ప్రయాణికులు ఎవరూ దానిని తీసుకోకపోవడంతో సీసీ కెమెరాల్లో పరిశీలించిన అధికారులు వెంటనే సీఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో బాంబు ఉండవచ్చేమోనని అనుమానించిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించారు. స్కానింగ్ ద్వారా బ్యాగ్‌లో ఓ అనుమానిత వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మోటార్‌ను బయటికి తీశారు. దానిని బద్దలు చేసి చూడగా.. బంగారు ప్లేట్లకు ఇనుప పూతపూసి మోటారులో పెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ప్లేట్ల బరువు దాదాపు 1.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దీనిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలు గమనించిన ప్రయాణికుడే దానిని బెల్టుపై వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికుడు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్..
ముంబై : నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఇక తమ లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే బాలీవుడ్ హీరోయిన్లు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. స్టైలింగ్‌లో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ట్రెండీ లుక్‌తో అదరగొట్టారు. గ్రేకలర్ డ్రెస్, రెడ్ లెదర్ బెల్ట్, బ్లాక్ షూస్‌తో మెరిసిన సోనం లుక్‌లో ఆమె ధరించిన బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హెర్మెస్ బిర్కిన్ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్ ఖరీదు రూ 18 లక్షలు కావడం గమనార్హం. -
గన్ .. బుల్లెట్ల బ్యాగు చోరీ
తిరుపతి క్రైం : గణపతి నగరం ఎమ్మెల్యే గన్‌మెన్ బ్యాగు తిరుపతి రైల్వే స్టేషన్లో బుధవారం చోరీకి గురైంది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా గణపతి నగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు గన్‌మెన్ శంకరరావు బందోబస్తు నిమిత్తం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. బ్యాగును రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉంచి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి దాన్ని చోరీ చేశాడు. దీంతో గన్‌మెన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో గన్, 20 రౌండ్ల బుల్లెట్లు, 20 రౌండ్ల మ్యాగ్జిన్, డబ్బులు ఉన్నట్టు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు సీఐ చంద్రబాబునాయుడు స్పెషల్ టీమ్‌తో తనిఖీ లు చేపట్టారు. ఈ క్రమంలో ఏడుకొండల బస్టాండులో బ్యాగు లభ్యమైంది. అందులో అన్నీ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
దామన్నా... ‘బ్యాగుంది’
బ్యాగు భుజాన వేసుకుంటే చాలు.. అంతా బాగే!. ఇదీ మాజీ మంత్రి, పార్టీ సూర్యాపేట అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల సెంటిమెంట్. ఎన్నికల్లో పోటీచేసే ప్రతిసారీ ఆయన చంకన లెదర్బ్యాగ్ వేసుకొని కనిపిస్తుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు ఢిల్లీ నుంచి ఓ బ్యాగును పంపిస్తుంటారు. దానినే ఆయన ప్రచార సమయంలో వాడుతుంటారు. ఈసారి మాత్రం అమెరికాలో ఉండే ఆయన సోదరుడి కుమారుడు లెదర్ బ్యాగ్‌ను పంపించారు. మొన్న.. మొదటి దఫా నామినేషన్ దాఖలుకు సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయం వద్దకు వాహనంలో వచ్చిన దామోదర్‌రెడ్డి.. లెదర్ బ్యాగ్ భుజాన వేసుకొని కారులోంచి దిగారు. ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్ దాఖలుకు వెళ్లారు. ఓ లెటర్ ప్యాడ్, పెన్ను, టవల్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఆయన సెంటిమెంట్‌గా అందులో భద్రపరుచుకుంటారట. -
అలియా బ్యాగ్‌పైనే అందరి చూపు..
సాక్షి, ముంబై : సెలబ్రిటీలు వాడే దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఏమైనా అందరి చూపులూ వాటిపైనే కేంద్రీకృతమవుతుంటాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో బ్లూకలర్ బెల్ట్ బ్యాగ్‌తో సందడి చేశారు. అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్కైబ్లూ టీ షర్ట్‌పై అదే రంగు డెనిమ్స్ ధరించిన అలియా భట్ సింపుల్‌గా కనిపించినా, ట్రెండీ లుక్ మెయింటెయిన్ చేసింది.1890 అమెరికన్ డాలర్ల ఖరీదైన ఈ బ్యాగ్ మన కరెన్సీలో రూ 1,39,170లు పలుకుతుంది. బ్యాగ్ సైతం నీలం రంగులో ఉండేలా చూసుకున్న అలియా ఆల్ బ్లూ కలర్లో స్టన్నింగ్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. -
ఆ హీరోయిన్ బ్యాగ్ ధరతో ఒక కారు కొనొచ్చు..!
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ భామ, 'క్వాంటికో' నటి ప్రియాంకా చోప్రా పాప్ సింగర్, హాలివుడ్ యాక్టర్ నిక్ జోనాస్‌తో ప్రేమల మునిగితేలుతున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇటీవలే నిక్ బంధువుల పెళ్లి వేడుకలో ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ చెట్టాపట్టాలేసుకొని దర్శనమివ్వడం పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అదీ కాక రీసెంట్గా వీరిద్దరూ న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. ఇద్దరూ డిన్నర్ చేసి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది వీరిద్దరి ప్రేమాయణం నిజమేనని ఫ్యాన్స్ అంతా ఫిక్సయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి దృష్టి ఫోటోలో ఉన్న ప్రియాంక బ్యాగ్‌పై పడింది. వెరైటీ డిజైన్‌తో చూడడానికి కొత్తగా ఉన్న ఆ బ్యాగ్ అందరి దృష్టి ఆకర్షించింది. అయితే ఆ బ్యాగ్ ధర చూసి నెటిజన్లు అంతా షాకవుతున్నారు. ఆమె బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మీరు కూడా బ్యాగ్ సైడ్ ఓ లుక్ వేస్తారు మరీ. ఆ బ్యాగ్ ధర దాదాపు 4.6లక్షల రూపాయలు. ఆ ధరతో ఏకంగా ఓ కారే కొనొచ్చు. టియాగో కారు విలువ దాదాపు రూ.3.56 లక్షలు. అంటే ప్రియాంక బ్యాగ్ కంటే తక్కువే. దీంతో ఆ జంటతో పాటు ఆమె బ్యాగ్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
గూడ్స్ బోగీలో రక్తపు సంచి తీరా చూస్తే..
రైల్వేగేట్: ఓ గూడ్స్ రైలులోని ఖాళీ బోగీలో రక్తం కారుతున్న కట్టు కట్టి ఉన్న ఓ సంచి సిబ్బందికి కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీరా దానిని తెరచి చూస్తే చనిపోయిన కుక్క కనిపించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘనటన ఆదివారం మధ్యాహ్నం వరంగల్ గూడ్స్ షెడ్లోని రైలు బోగీలో జరిగింది. వరంగల్ జీఆర్పీ ఏఎస్సై పరశురాములు కథనం ప్రకారం.. పీడీఎస్ బియ్యం లోడ్ చేసుకుని తీసుకెళ్లేందుకు గద్వాల నుంచి హైదరబాద్ కాచిగూడ, అక్కడి నుంచి వరంగల్‌కు వచ్చిన గూడ్స్‌రైలులోని ఓ ఖాళీ బోగీలో సంచి కనిపించింది. అది కూడా రక్తం కారుతుండడంతో అనుమానం వచ్చిన గూడ్స్ షెడ్ సిబ్బంది స్టేషన్ డిప్యూటీ మేనేజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను జీఆర్పీ పోలీసులకు చెప్పారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సంచిని బయటకు తీయించి విప్పగా అందులో చనిపోయి ఉన్న కుక్క కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.. -
కలకలం రేపిన ‘సంచిలో శవం’
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ములకలచెరువు మండలం బురకాయలకోట గురుకుల పాఠశాల వద్ద ఉన్న చెన్నాయన చెరువులో ఓ సంచి శుక్రవారం కలకలం రేపింది. వ్యక్తిని హత్యచేసి సంచిలో పెట్టి చెరువులో పడేసినట్లు వదంతులు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు అలుముకుంది. స్థానికులు ఎస్ఐ ఈశ్వరయ్యకు సమాచారం అందించారు. విషయం తెలిసిన ఎస్ఐ హుటాహూటిన తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సంచిని విప్పారు. సంచి లోపల చనిపోయిన ఆవుదూడ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా 20 రోజుల కిందట ఇదే చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం ఆచూకి ఇంత వరకు తెలియ లేదని ఎస్ఐ చెప్పారు. -
బాలికను హత్య చేసి గోనే సంచిలో వేసి..
-
పరి పరిశోధన
బ్యాగ్ భుజాన వేసుకుంటే బల్బు వెలుగుతుంది... భుజాన బ్యాగ్ వేసుకుని వెళుతూంటే కాసేపట్లో చెమట్లు పట్టడం ఖాయం. ఇది కాస్తా మనల్ని చీకాకు పెడుతుంది గానీ.. ఛాల్మర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ వస్త్రం మాత్రం చెమటతోపాటు కొంత కరెంటూ పుట్టిస్తుంది. బరువు ఎంత ఎక్కువైతే స్వేదంతోపాటు విద్యుత్తు కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ఒత్తిడి ఎక్కువైనా... ఎక్కువగా లాగినాసరే... ఈ వస్త్రంతో విద్యుత్తు పుడుతుందన్నమాట. ప్రస్తుతానికైతే బ్యాగ్‌ను భుజానికి తగిలించుకునే స్ట్రాప్‌లో కొంతభాగంలో మాత్రమే ఈ వస్త్రాన్ని వాడారు. దీంతో ఒక ఎల్ఈడీ బల్బును వెలిగించేంత కరెంటు మాత్రమే పుడుతోందనీ, ఇది డిజిటల్ వాచీలూ, పాకెట్ కాలిక్యులేటర్, వంటి చిన్న చిన్న గాడ్జెట్లను నడిపేందుకు సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంజా తెలిపారు. పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే భౌతిక శాస్త్ర ధర్మం ఆధారంగా ఈ వస్త్రం పనిచేస్తుందని ఇందులోని పదార్థం రూపురేఖలు మారినప్పుడల్లా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వివరించారు. విద్యుత్తును ప్రసారం చేయగల నూలుపోగులు, పీజో ఎలక్ట్రిక్ పదార్థాలను కలిపి దీన్ని తయారు చేసినట్లు తెలిపారు. మూడు కిలోల బరువును బ్యాగ్‌లో ఉంచినప్పుడు నాలుగు మైక్రోవాట్ల విద్యుత్తు పుట్టిందన్నీ... బ్యాగ్ మొత్తాన్ని పీజో ఎలక్ట్రిక్ పదార్థాంతో తయారు చేస్తే వైర్లెస్ సిగ్నళ్లను ప్రసారం చేయగలిగేంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంజా తెలిపారు. మూలకణాలతో మళ్లీ చూపు! శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. బ్రిటిష్ వైద్యులు ఈ లక్షణం ఆధారంగా కండరాలు బలహీనమవడం వల్ల క్రమేపీ చూపు కోల్పోతున్న ఇద్దరు మళ్లీ చూడగలిగేలా చేశారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలోనే ఈ రకమైన చికిత్స ద్వారా వయసుతోపాటు వచ్చే దృష్టి లోపాలను సరిచేయగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ కళ్లలోని కండరాలు బలహీన పడుతుంటాయి. ఈ క్రమంలో ఒక పొర కణాలు నాశనమవుతాయి. రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియం అని పిలిచే ఈ పొర కళ్లను శుభ్రం చేసేందుకు, కంటి బయటి పొరకు పోషకాలను అందించేందుకూ ఉపయోగపడుతుంది. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న ఇద్దరికి బ్రిటిష్ వైద్యులు ఏడాది క్రితం శస్త్రచికిత్స చేసి మూలకణాలు ఎక్కించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో ఈ మూలకణాలు అక్కడే పెరగడంతోపాటు రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియం కణాలుగా ఎదిగినట్లు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థ ఈ కొత్త కణాలను తిరస్కరించే అవకాశం ఉందా? లేదా? మూలకణాలు కాస్తా కేన్సర్ కణాలుగా మారతాయా? వంటి విషయాలను మరిన్ని పరిశోధనల ద్వారా రూఢి చేసుకున్న తరువాత ఈ పద్ధతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
తరుగు..బస్తాకు 3 కిలోలు
పై చిత్రం పద్మాజీవాడి రేషన్ షాపులోనిది.. ఎల్ఎంఎస్ పాయింట్ నుంచి దుకాణానికి సరఫరా అయిన బియ్యం తూకం వేయగా.. 50 కిలోల బస్తాలో మూడు కిలోల తరుగు వచ్చింది. ప్రతి నెల ఇలాగే బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్ కిషన్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. సదాశివనగర్: ఆహార భద్రతాకార్డులు కలిగిన వారికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్ జరుగుతోంది. గోదాముల నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం సంచుల్లో.. బస్తాకు మూడు నాలుగు కిలోల తరుగు వస్తోంది. దీంతో రేషన్ డీలర్లు నష్టపోతున్నారు. నిబంధనల మేరకు ఒక్కో బస్తాలో 50 కిలోల బియ్యం ఉండాలి. హమాలీలు బస్తాలను లారీలలో ఎత్తేముందు ఒక్కో బస్తాను గోదాంలో తూకం వేస్తారు. తూకం తక్కువ ఉంటే బస్తాలో తిరిగి ఆ మేరకు బియ్యాన్ని కలిపి బస్తాలు కుట్టి పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో బస్తాలో ఒక్కో తీరుగా బియ్యం తూకం వస్తున్నాయని డీలర్లు పేర్కొంటున్నారు. బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు ఉంటోందంటున్నారు. యంత్రంతో లెక్కపక్కా.. ఒక్కో చౌకధరల దుకాణంలో లబ్ధిదారుల వివరాలను ముందుగానే యంత్రానికి అనుసంధానం చేయడంతో వారు చౌకధరల దుకాణంలో బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు నమోదు చేయగానే వారికి అందాల్సిన బియ్యం వివరాలను మిషన్ తెలియజేస్తుంది. బియ్యం తూకం వేసే సమయంలో ఏ మాత్రం తక్కువగా ఉన్నా వివరాలను చూపించదు. ఈ రకంగా తూకం వేస్తే ఒక్కో బస్తాకు మూడు కిలోలపైనే తక్కువగా వస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. నష్టపోతున్నాం.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లో తరుగు వస్తోంది. బస్తాకు మూడు నుంచి ఐదు కిలోలు తక్కువ వస్తున్నాయి. దీంతో నష్టపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – కిషన్‌రావు, రేషన్ డీలర్, పద్మాజీవాడి తరుగు లేకుండా చూస్తాం గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యంలో తరుగు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సరైన తూకంతో బియ్యం సరఫరా చేయాలని సూచించాం. గోదాంలో తూకం వేసిన తర్వాతే డీలర్లకు అందేలా చర్యలు తీసుకుంటాం. – అమీన్‌సింగ్, తహసీల్దార్, సదాశివనగర్ -
మాటలతో ఏమార్చి.. నగలతో ఉడాయించారు
రాయచోటిటౌన్: అమ్మా ఇదిగో ఈ చిల్లర నీదేనా అంటూ ఓ మహిళను మాటల్లో పెట్టి ఆమె బ్యాగులోని బంగారు ఆభరణాలున్న పర్సును దోచుకెళ్లిన సంఘటన రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకొంది. బాధితురాలు కొండూరు ఆషాబీ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మాసాపేటకు చెందిన ఆషాబీ కడపలో తన కుమార్తెకు వివాహం చేసింది. ఆమెకు సంబంధించిన 25 తులాల బంగారు ఆభరణాలు మొత్తం తన వద్దనే ఉండేవి. త్వరలో తన కుమార్తె ఇంటిలో శుభకార్యం జరగనుండటంతో వాటిని కుమార్తెకు ఇచ్చేందుకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీగా ఉండటంతో ఒక వ్యక్తి తన సీట్లో పక్కకు జరిగి కూర్చునేందుకు స్థలమిచ్చాడు. తాన టీచర్‌నని చెప్పి నమ్మించాడు. ఇంతలో మరో మహిళ అక్కడికి వచ్చి నిల్చుంది. కండక్టర్ వచ్చి టిక్కెట్లు తీసుకొనే క్రమంలో ఆషాబీ కాళ్ల కింద చిల్లర పడేసి అమ్మా ఈ చిల్లర డబ్బులు నీవేనా.. అంటూ చెప్పాడు. ఆమె కిందకు వంగి చిల్లర ఏరుకొనే క్రమంలో ఆమె బ్యాగ్‌లోని పర్సు దొంగిలించాడు. బస్సు సాయి థియేటర్ వద్దకు వెళ్లగానే ఈ బస్సు గాలివీడుకు వెళుతుందా అని వారు కండక్టర్‌ను అడిగారు. వెళ్లదని కండక్టర్ చెప్పడంతో వారు ఇద్దరు అక్కడే బస్సు దిగేశారు. బస్సు రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన తర్వాత ఆషాబీ తన బ్యాగ్‌ను పరిశీలించి చూసుకోగా అందులో బంగారు ఆభరణాలు లేకపోవడంతో లబోదిబో మంటూ ఏడుస్తూ బస్సు దిగి ఇంటికెళ్లింది. బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘సింహపురి’లో నగల బ్యాగ్ మాయం
సాక్షి, ఒంగోలు: సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులోలో ప్రయాణికురాలి నగల బ్యాగ్ మాయం అయింది. రూ.35 లక్షల విలువ చేసే నగలు ఉన్న బ్యాగ్ పోయిందని రావిపాటి సుశీల అనే ప్రయాణికురాలు ఒంగోలు రైల్వేపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు హైదరాబాద్ నుంచి ఇదే రైలులో ఒంగోలు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చేజారినది.. చేజిక్కింది
ప్రకాశం, చీరాల అర్బన్: కొద్ది సేపట్లో గమ్యం చేరుకోబోతున్న ప్రయాణికుడి బ్యాగు ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయింది. అందులో సుమారు 70 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే బ్యాగును గుర్తించి బాధితుడికి అప్పగించారు. ఈ సంఘటన చీరాలలో బుధవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడుకు చెందిన యార్లగడ్డ సురేష్‌కుమార్ నెల్లూరులోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళాడు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్నాడు. చీరాల సమీపిస్తుండటంతో వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో తన సామగ్రిని సర్దుకుంటున్నాడు. వాటిలో ఓ బ్యాగుకు చక్రాలు ఉండటంతో అది దొర్లుకుంటూ డోరు వద్దకు వెళ్లి కింద పడిపోయింది. ఆయన గమనించలేదు. కొద్దిసేపటికి బ్యాగు కనిపించకపోవడంతో చీరాల స్టేషన్లో దిగిన వెంటనే జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో 70 సవర్ల బంగారం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అవ్వారు శ్రీనివాసరావు, మరో ఆరుగురు సిబ్బంది టార్చిలైట్ల సాయంతో రైల్వే ట్రాక్ వెంబడి వెళ్లారు. వేటపాలెం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ట్రాక్ పక్కన పడి ఉన్న బ్యాగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి సమక్షంలో బ్యాగును తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకుని బాధితుడికి బ్యాగ్ అప్పగించారు. -
ఆర్మ్‌స్ట్రాంగ్ బ్యాగుకు రూ.11 కోట్లు
చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పట్లో వాడిన ఓ బ్యాగు గురువారం ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. సౌత్‌బే నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా దీన్ని కొనుగోలు చేశారు. 1969లో అపోలో–11 నౌక ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు చంద్రుడిపైకి చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక తిరిగొచ్చాక అందులోని వస్తువులన్నింటినీ స్మిత్సోనియన్ సంస్థకు ఇచ్చేశారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఒక తప్పిదం వల్ల చంద్రుడిపై నమూనాలు సేకరించేందుకు వాడిన ఓ బ్యాగు జాన్సన్ స్పేస్ సెంటర్లోనే ఉండిపోయింది. బ్యాగు ప్రాముఖ్యం తెలియని వారు కొందరు దీన్ని పారేయబోతూ కన్సాస్‌లోని ఓ ప్రైవేట్ మ్యూజియం యజమానికి చూపించారు. కొంత కాలం తర్వాత ఓ చోరీ కేసులో ఈ యజమానికి శిక్ష పడటంతో ఎఫ్‌బీఐ ఈ బ్యాగును స్వాధీనం చేసుకుని 2015లో అతి కష్టమ్మీద 995 డాలర్లకు అమ్మింది. ఇప్పుడు మళ్లీ రూ.11 కోట్ల 58 లక్షల 25 వేల 5 వందల యాభై రూపాయలకు అమ్ముడుబోయిందీబ్యాగు. -
కలకలం.. బ్యాగు నిండా తుపాకులు
కోల్‌కతా: రైల్వే స్టేషన్లో ఉన్న ఓ బ్యాగును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. బ్యాగు నిండా తుపాకులు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు. హౌరా రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు రోజువారి తనిఖీలు నిర్వర్తిస్తుండగా.. ఓ బ్యాగును గుర్తించారు. అనుమానంతో దానిని ఓపెన్ చూసి చూడగా.. 18 తుపాకులు ఉన్నాయి. ఈ బ్యాగును అక్కడకు ఎవరు తీసుకొచ్చారు, ఏదైనా ఉగ్రవాదుల కుట్ర ఉందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
ట్రంప్ టవర్‌లో బ్యాగ్ కలకలం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన 58 అంతస్తుల భవంతి (ట్రంప్ టవర్)లో ఒక అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. న్యూయార్క్ లోని ఈ భారీ భవంతి లాబీలో బుధవారం ఆ బ్యాగ్ కనుగొన్నతర్వాత.. హుటాహుటిన భవంతిని ఖాళీ చేయించారు. ఆ బ్యాగ్‌లో ఆటబొమ్మలు మాత్రమే ఉన్నాయని బాంబు నిర్వీర్య సిబ్బంది తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన కుటుంబంతో కలసి వచ్చిన ఒక బాలుడు ఆ బ్యాగ్ వదిలివెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. అనుమానాస్పద బ్యాగ్‌తో ఏర్పడ్డ కలకలం సర్దుకుంది అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. -
రైల్లో భారీగా పాత రూ.500 నోట్లు
బిహార్: డీమానిటైజేషన్ తరువాత రద్దయిన రూ.500, 1000 నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న సంఘటనలు ఇంకా నమోదవుతూనే వున్నాయి. తాజాగా బీహార్ లోని గయనలో ఇఒక రైలు బోగీలో 35 లక్షల విలువైన రద్దయిన రూ.500 సంచిని అధికారులు గుర్తించారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో గుర్తుతెలియని బ్యాగ్ నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ కస్టమ్స్ అధికారులు ఈ భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగ నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన ఈ చర్య సామాన్యలకు పలు కష్టాలను తెచ్చిపెట్టింది. నగదు కొరత సమస్యను అధిగమించేందుకు ఆర్థిక శాఖ, ఆర్ బీఐ ఎన్ని ఉపశమన చర్యల్ని చేపడుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి.ఏటీఎం, బ్యాంకు కేంద్రాల వద్ద జనం క్యూలు అంతకంతకూ పెరుగుతున్నాయి. -
తిప్పిరెడ్డిపల్లెలో అస్తిపంజరం లభ్యం
తిప్పిరెడ్డిపల్లె(చాపాడు): చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో మంగళవారం సాయంత్రం ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా ఓ మనిషికి చెందిన అస్తిపంజరం బయట పడింది. గ్రామస్తుల కథనం మేరకు.. పెన్నానది సమీపంలో ఓ పొలంలో ట్రాక్టర్‌తో చదును చేస్తుండగా కట్టిపెట్టిన గోనె సంచి బయట పడింది. ఈ సంచిలో మనిషికి చెందిన అస్తికలు ఉన్నాయి. రెండున్న రేళ్ల క్రితం తిప్పిరెడ్డిపల్లెలో కన్పించకుండా పోయిన అన్నారపు సుబ్బరాయుడుకు చెందిన అస్తిపంజరంగా స్థానికులు భావిస్తున్నారు. అప్పట్లో తన అన్న కన్పించడం లేదని తమ్ముడు చిన్న సుబ్బరాయుడు చాపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే సుబ్బరాయుడు భార్య లక్ష్మీదేవితో పాటు ఇంకా పలువురిపై అనుమానంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయినా ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలో మంగళవారం తిప్పిరెడ్డిపల్లె సమీపంలోనే గోనె సంచిలో అస్తికలు కన్పించటంతో అన్నారపు సుబ్బరాయుడును అప్పట్లో చంపి పాతిపెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే చాపాడు, కమలాపురం మండలాల సరిహద్దుల్లో ఈ పొలాలు ఉండటంతో స్థల సరిహద్దులను గుర్తించిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఎస్ఐ శివశంకర్ తెలిపారు. -
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ
ఆరు తులాల ఆభరణాలు అడ్రస్ కనుక్కొని అందజేసిన కండక్టర్ కామారెడ్డి: ఆర్టీసీ కండక్టర్ నిజాయతీని చాటుకున్నాడు. ప్రయాణికులు బస్సులో మర్చిపోయిన ఆరు తులాల బంగారం ఉన్న బ్యాగును వారికి అందజేసి అందరి మన్ననలు పొందాడు. అసలేం జరిగిందంటే.. కేఎల్ గౌడ్ కామారెడ్డి డిపోలో కండక్టర్. ఆయన కామారెడ్డి–హైదరాబాద్ (ఏపీ 29 జడ్ 1742)లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రామాయంపేటలో బస్సు ఎక్కిన మెదక్‌కు చెందిన ఉదయ్‌కుమార్ కుటుంబం కామారెడ్డిలో దిగిపోయింది. అయితే, వారు బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. ఇది గుర్తించిన కండక్టర్ బ్యాగ్‌ను తెరిచి చూడగా, ఆరు తులాల బంగారం, దుస్తులు కనిపించాయి. అందులో లభించిన మందుల చిట్టీ ఆధారంగా ఉదయ్‌కుమార్ ఫోన్‌నెంబర్‌ను తెలుసుకొని, ఆయనకు సమాచారమిచ్చాడు. దీంతో వారు కామారెడ్డికి చేరుకున్నారు. డిపో మేనేజర్ జనార్దన్ సమక్షంలో కండక్టర్ ఆరు తులాల బంగారంతో ఉన్న బ్యాగును వారికి అందజేశాడు. కండక్టర్‌ను డీఎం, ఆర్టీసీ అధికారులు, యూనియన్ నేతలు శివరాజవ్వ, దత్తు, ఎస్‌ఎస్‌గౌడ్, ఎస్కే మూర్తి అభినందించారు. -
పోగొట్టుకున్న బ్యాగ్ దొరికిందిలా..
బాధితులకు చేరిన రూ.1.50 లక్షల విలువైన వస్తువులు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు సత్తెనపల్లి : పుష్కరాలకు సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామానికి చెందిన నీలా స్రవంతి కుటుంబ సభ్యులు ఆదివారం అమరావతికి వెళ్ళారు. పుణ్య స్నానమాచరించి దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అమరాతి నుంచి పెదకూరపాడు వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి గర్నెపూడికి ఆటోలో వెళ్లారు. తీరా ఇంటికి వెళ్ళాక బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో పెదకూరపాడు బస్టాండ్ వద్దకు ఉరుకులు పరుగులు తీశారు. బ్యాగ్ కనిపించకపోవడంతో ఆవేదనకు లోనయ్యారు. అదే సమయంలో పుష్కర విధులు ముగించుకొని అమరావతి నుంచి సత్తెనపల్లి వస్తున్న పట్టణానికి చెందిన కానిస్టేబుళ్ళు కాకిరాల రవి కుమార్, నేలపాటి ప్రవీణ్‌బాబు బాధితులతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సులో బ్యాగ్ మరిచిపోయామని, అందులో రూ.1.50 లక్షలు విలువ గల బంగారం, నగదు, విలువైన ఎంకామ్ సర్టిఫికెట్లు, ఇతర లగేజీ ఉన్నట్లు చెప్పారు. దీంతో వారిని తమ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సత్తెనపల్లి చేరుకున్నారు. బస్సులను ఆపి తనిఖీ చేయడంతో బ్యాగ్ కనిపించింది. వస్తువులన్నీ భద్రంగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి బాధితులకు సాయపడిన కానిస్టేబుల్స్‌ను సీఐ ఎస్.సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు. -
కవర్‌పై పిన్ నంబర్ రాసి ఉండటంతో..
చెన్నూరు(వైఎస్ఆర్ జిల్లా): తన బ్యాగును దొంగలించి అందులోని ఏటీఎం కార్డు నుంచి రూ. 40 వేలు డ్రా చేశారని శాటిలైట్ సిటీలో నివసిస్తున్న వాసుదేవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8 న కడప నగర శివార్లలోని శాటిలైట్ సిటీ బ్లాక్–3లో నివసించే మాజీ సైనికుడు వాసుదేవుడు కడపకు వెళ్తూ ఇంటి గోడపై బ్యాగు పెట్టి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగును అపహరించారు. అందులోని బ్యాంకు ఏటీఎం కార్డు కవర్‌పై పిన్ నంబర్ రాసి ఉండటంతో కడపలోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి రూ. 40 వేలు అదే రోజు డ్రా చేశాడు. దీంతో ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వారు వివరించారు. -
బతుకు ‘బస్తా’
పాత బస్తాలు కుడుతూ పలుకుటుంబాల జీవనం పని దొరికితే కూలి..లేకుంటే పస్తులే మరి జిల్లాకేంద్రంలో మారని కార్మికుల ‘అతుకుల’ బతుకులు పాతబస్తాలే వారి పొట్ట నింపుతున్నాయి. చిరిగిన గోనెసంచులకు అతుకులేసి..కొత్త బస్తాలు తయారు చేసే పనిలో అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. పత్తి, మిరప, ధాన్యం, సరుకులు నింపుకునేందుకు..పలు రకాల సైజుల్లో తయారు చేసి అమ్ముకోవడం ద్వారా ఉపాధి చూసుకుంటున్నారు. ఏళ్లుగా ఇదే పని చేస్తున్నా..ఎలాంటి ఎదుగూబొదుగూ లేక..అన్‌సీజన్‌లో పని దొరకక..అప్పులు భారమై..ఇళ్లు గడవడం కష్టమై అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక, రాయితీ రుణాలు లభించక జిల్లా వ్యాప్తంగా వెయ్యికిపైగా కుటుంబాల వారు..‘అతుకుల’ బతుకులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రం ఖమ్మంతో పాటు, నియోజకవర్గ కేంద్రాలు, పలు మండలాల్లో పాత బస్తాలు కుడుతూ, వాటితో తిరిగి కొత్త బస్తాలు తయారు చేస్తూ వెయ్యికిపైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఖమ్మం నగరంలో 70 పాత బస్తాల తయారీ, విక్రయ దుకాణాలు ఉన్నాయి. కార్మికులే తయారు చేసుకుంటూ, వారే కొట్లు నిర్వహించుకుంటున్నారు. కిరాణ దుకాణాలు, దాల్, రైస్ మిల్లులు, రేషన్ షాపుల్లో చిరిగి, పనికిరాని వాటిని బస్తాకు రూ.7 లేదా రూ.8 పెట్టి కొంటారు. ఈ బస్తాలను పూర్తిగా విప్పేసి, అతుకులు వేసి, తిరిగి మిషన్‌పై కుడతారు. పత్తి, మిరప, ధాన్యం నింపుకునేందుకు వివిధ సైజుల్లో తయారు చేస్తారు. పత్తి బస్తా అయితే 40 నుంచి 50 కిలోలు పట్టేలా, మిర్చిబస్తా అయితే 30 నుంచి 40 కిలోలు పట్టేలా, మొక్కజొన్నకు 60 కిలోలు, ధాన్యం బస్తా అయితే 70 కిలోలు పట్టేలా..మూడు పాత బస్తాలతో ఒక కొత్త బస్తాను రూపొందిస్తారు. రోజుకు 30 నుంచి 40 బస్తాల వరకు తయారు చేస్తుంటారు. మొత్తంమీద పాత బస్తాల నుంచి కొత్తగా ఇంకో బస్తా తయారు చేసేందుకు రూ.15పైనే ఖర్చవుతుంది. పెట్టిన ఖర్చులు పోను సీజన్‌ను బట్టి ఒక్కో బస్తాకు రూ.3 రూపాయల వరకు లాభం వస్తుంది. చిత్తు కాగితాలు నింపే బస్తాలను, వాటర్ బాటిళ్లు, పాత ఇనుప సామాన్లు నింపుకునేలా ప్లాస్టిక్ పట్టాలతో బోరాలను తయారు చేస్తారు. సీజన్..అన్‌సీజన్ రైతులకు పంటల దిగుబడి చేతికొచ్చే కాలమే వీరికి సీజన్. అంటే అక్టోబర్ నుంచి వేసవికాలం వరకు గిరాకీ ఉంటుంది. పాత బస్తాల కోసం తిరగడం, వాటిని కొట్టుకు చేర్చడం, అతుకులు, కుట్లు వేసి కొత్త బస్తాలు తయారు చేయడం ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు కూలి లభిస్తుంది. పత్తి, మిర్చి, ధాన్యం దిగుబడులొస్తున్నప్పుడు బస్తాల విక్రయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఆ కాలంలో ఒక్కో మనిషి రోజుకు రూ.500 వరకు ఆదాయం పొందుతారు. ఆ తర్వాతి రోజుల్లో పాత బస్తాలను కుట్టి నిల్వ ఉంచుతారు. కొన్నింటిని దుకాణాలకు తిరిగి విక్రయిస్తారు. ఎక్కువ కొనుగోళ్లు లేక కూలి కూడా గిట్టుబాటు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏడాదిలో ఆరు నెలలే ఎక్కువగా పని ఉంటుంది. అన్ సీజన్ అయిన..వర్షాకాలంలో బస్తాలను నిల్వ చేస్తూ, అప్పులు చేసి కుటుంబాలను సాకుతారు. ఇతర పనులు రాక, చేయలేక, ఈ పని నుంచి దూర కాలేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. రుణం..భారం పాత బస్తాల కొనుగోలు, దుకాణానికి అడ్వాన్స్, కిరాయి, ఇంటి అద్దె భారమవుతోంది. పాత బస్తాల వ్యాపారానికి కనీసం రూ.50వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అన్ సీజన్లో విక్రయాలు లేక, అప్పులకు వడ్డీలు కట్టలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా కుటుంబాల్లో మహిళలు, పిల్లలు కూడా ఇదే పనిలో ఉన్నారు. చేతితో, మిషన్లతో కుడుతున్నారు. తమకు బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని వీరు వేడుకుంటున్నారు. -
మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం
హైదరాబాద్‌సిటీ: ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద గురువారం వేకువజామున ఓ బ్యాగు కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగును ఆలయ పరిసరాల్లో వదిలి వెళ్లారు. ఆ బ్యాగులో బాంబు ఉందేమోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయడంతో చత్రినాక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చి బ్యాగును పరిశీలించారు. బ్యాగులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా'
చెన్నై: బన్నీ మూవీ సరైనోడులో... సాంబారు చబ్బీ బ్యూటీ, రాజుగారి గది చిత్రంలో బుజ్జిమాగా ఆకట్టుకున్న తమిళ నటి విద్యుల్లేఖ రామన్ గుర్తుందా...డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న విద్యు విదేశంలో చిక్కుల్లో పడ్డారు. స్నేహితులతో కలసి ఇటీవల ఆస్ట్రియాలోని వియన్నా పర్యటనకు వెళ్లిన ఆమె బ్యాగ్ చోరీకి గురైంది. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రిత్వ శాఖను, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ట్విట్టర్ లో వేడుకున్నారు. వియన్నా సందర్శన తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనీ, డబ్బు, పాస్ పోర్ట్ , ఇంకా విలువైన వస్తువులను కోల్పోయానంటూ ట్విట్టర్ లో వాపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తనను ఆదుకోవాల్సిందిగా వరుస ట్వీట్ల ద్వారా అభ్యర్థించారు. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు .. వియన్నాలో తాను ఉన్నహోటల్ లాబీలో ఎవరో తన బ్యాగును దొంగిలించారని అందులో తన పాస్‌పోర్ట్, కార్డులు, డబ్బు.. తదితరాలు ఉన్నాయంటూ ట్విట్ చేశారు. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి అడ్రస్ ఏంటని అడుగుతూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడని ఈ లోపుగా మరో వ్యక్తి వచ్చి బ్యాగును దొంగిలించాడని చెప్పారు. హోటల్లోని సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించడానికి హోటల్ యాజమాన్యం సమ్మతించడంలేదని ఆరోపించారు. దీంతో చెన్నైలోని ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. ప్రభుత్వం సహకరించి తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కోరారు. కాగా తమిళ, తెలుగు చిత్రాల్లో ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారిన విద్యుల్లేఖా రామన్ 'ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా' భలే మంచి రోజు' తదితర చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించారు. అనంతం ఈ బొద్దుగుమ్మ రాజుగారి గది సినిమాలోని హాస్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. .@SushmaSwaraj My bag has been stolen with passport, cards & currency in my hotel lobby. Need to contact the Indian embassy asap in Vienna. — Vidyu (@VidyuRaman) 3 May 2016 .@PMOIndia My bag has been stolen with passport, cards & currency in my hotel lobby. Need to contact the Indian embassy asap in Vienna. Sos — Vidyu (@VidyuRaman) 3 May 2016 -
ఆటోడ్రైవర్ నిజాయితీ
► ఎస్పీ విశాల్ గున్నీ అభినందన ► రూ. 5 వేల నగదు బహుమతిగా అందజేత నెల్లూరు : ఆటోలో మరిచిపోయిన విలువైన ఆభరణాల బ్యాగును ప్రయాణికుడికి అందించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. చింతారెడ్డిపాళెం యల మవారిదిన్నెకు చెందిన ఆటోడ్రైవర్ కాయల రఘును ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం అభినందించారు. రఘు వీఆర్సీ సెంటర్లో ఆటో స్టాండ్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గూడూరు ఇందిరానగర్‌కు చెందిన గునపాటి మురహరిరెడ్డి తన పనిమనిషితో కలిసి ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం మినీబైపాస్‌లోని పీటీ రంగరాజన్ పెట్రోల్ బంకు వద్ద బస్సు దిగి చిల్డ్రన్స్‌పార్కు వద్దనున్న పుండరీ కాంక్షయ్య వీధిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు రఘు ఆటో ఎక్కారు. నాలుగు బ్యాగులను ఆటోలో తన వద్ద పెట్టుకున్న ఆయన నగల బ్యాగును మాత్రం వెనుక పెట్టాడు. స్నేహితుడి ఇంటి వద్ద దిగి తన వద్దనున్న నాలుగు బ్యాగులను తీసుకుని, నగల బ్యాగును పని మనిషి తెస్తుందని భావించి లోనికి వెళ్లాడు. ఆటోడ్రైవర్ వారిని దింపి వెళ్లిపోగా, పని మనిషి ఇంట్లోకి ఖాళీ చేతులతో రావడం గుర్తించిన మురహరిరెడ్డి నగల బ్యాగు ఎక్కడాని ప్రశ్నించాడు. ఆమె నివ్వెరపోవడంతో ఇంట్లో నుంచి పరుగులు తీసి ఆటో కోసం గాలించారు. జరిగిన విషయాన్ని బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ చెంచురామారావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాగులో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, డైమండ్ రింగ్‌లు, లాప్టాప్, సెల్‌ఫోన్, రూ.40 వేల నగదు ఉందని బాధితుడు పేర్కొనడంతో ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కాగా ప్రయాణికులను దించి కొద్దిదూరం వెళ్లిన రఘు వెనుక బ్యాగు ఉండటాన్ని గమనించి బాధితులకు ఇచ్చేందుకు వెనక్కి వచ్చాడు. గమనించిన బాధితుడు, పోలీసులు ఆటో వద్దకు రాగా బ్యాగు అప్పగించాడు. ఆటోడ్రైవర్, పోలీసుల సమక్షంలో బాధితుడు బ్యాగును తెరచి చూసి అందులో అన్ని వస్తువులు పక్కాగా ఉండటంతో ఆటోడ్రైవర్‌ను అభినందించాడు. నగర డీఎస్పీ వెంకటరాముడి ద్వారా తెలుసుకున్న ఎస్పీ విశాల్‌గున్నీ నిజాయితీ పరుడైన ఆటోడ్రైవర్‌ను తన చాంబర్లో అభినందించారు. రఘును సహచర ఆటోడ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మురహరిరెడ్డి ఆటోడ్రైవర్‌కు ఎస్పీ ద్వారా మీదుగా రూ.5 వేలు నగదును బహూకరించారు. -
ఎయిర్ లైన్స్ స్టీవార్డెస్ బ్యాగ్ లో 30 కిలోల కొకైన్
లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల కొకైన్ ను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా మహిళ తీసుకు వెడుతున్న క్యారీ బ్యాగ్ లో కొకైన్ ఉన్నట్లు గుర్తించామని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెల్లడించారు. విమాన సిబ్బందిగా భావిస్తున్న ఆమె... శుక్రవారం టర్మినల్ కు వచ్చి... అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని చూసి, తనతో తెచ్చిన బ్యాగ్ లు వదిలి తప్పించుకొని పారిపోయిందని స్పెషల్ ఏజెంట్ తిమోతి మాసినో తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఈఏ తెలిపింది. అయితే నిందితురాలి ఆచూకీకోసం దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సోమవారం సాయంత్రానికి ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆమె ఏ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తోంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఖంగారుగా ఓ ఫోన్ కాల్ చేసిన తర్వాత అక్కడినుంచీ పారిపోయిన ఆమె ఏ భాషలో మాట్లాడిందన్నది సరిగా గుర్తించలేకపోయామని, అయితే ఆమె ఎస్కలేటర్ నుంచి పారిపోయేప్పుడు ఓ జత డిజైనర్ షూ వదిలి వెళ్ళిపోయిందని ఓ వార్తా సంస్థ తమ వెబ్ సైట్ లో వెల్లడించినట్లు లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు పోలీసులు, ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ అధికారులు తెలిపారు. -
పాపను బ్యాగ్‌లో దాచి.. విమానంలో తీసుకెళ్లింది
నాలుగేళ్ల బాలికను టికెట్ లేకుండా విమానంలో తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించి ఓ మహిళ దొరికిపోయింది. ఆమె చిన్నారి కనబడకుండా బ్యాగ్‌లో దాచిపెట్టి ఇస్తాంబుల్ (టర్కీ) నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు విమానంలో తీసుకెళ్లింది. అయితే విమానంలో తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించారు. సంబంధిత మహిళను ఫ్రాన్స్ దేశస్థురాలిగా గుర్తించారు. హైతీకి చెందిన బాలికను దత్తత తీసుకునేందుకు తీసుకెళ్తోంది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టినా బ్యాగ్లోపల పాపను దాచిన విషయాన్ని గుర్తించలేకపోయారు. తనిఖీల నుంచి తప్పించుకున్న ఆ మహిళ విమానంలో పాపను తన కాళ్ల వద్ద ఉంచి దుప్పటి కప్పింది. కాగా ఆ బాలికను టాయ్‌లెట్‌కు తీసుకెళ్లే సమయంలో ఇతర ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి తెలియజేశారు. ఫ్రాన్స్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ఆ మహిళను, పాపను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దేశ రాజధానిలో మరో దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి అనంతరం ఒక బ్యాగులో కుక్కి పడేసిన కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందేహాస్పదంగా కనపించిన సంచిని పోలీసులు తనిఖీ చేసినపుడు విషయం బయటపడింది. పోలీసులు అందించిన వివరాల ఢిల్లీలో మయూర్ విహార్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఇ-రిక్షాలో పడి ఉన్న బ్యాగు పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. దాన్ని పరిశీలించినపుడు డీ కంపోజ్ అయిన యువతి మృతదేహాన్ని గొన్నారు. అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేసి వుంటారని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటలు దాటి వుంటుదని భావిస్తున్నారు. మరోవైపు జీన్ ప్యాంట్, కుర్తా, మెడచుట్టు స్కార్ఫ్ ధరించి వున్న యువతికి సంబంధించి మరే సమాచారం అందుబాటులో లేదన్నారు. అత్యాచారం, హత్యకేసు నమోదు చేసిన పోలీసులు రిక్షా డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నామన్నారు. అయితే ఈ హత్యకు తనకు ఏమీ సంబంధంలేదని ఇ-రిక్షా డ్రైవర్ చెబుతున్నాడు. ఒక వ్యక్తి మెట్రో రైల్వేస్టేషన్ కి వెళ్లాలని ఆటోను కిరాయికి మాట్లాడుకొన్నాడు. తాను వెనకాలే బైక్ మీద వస్తానని చెప్పి ఉడాయించాడని తెలిపాడు. అతని కోసం వెదుకుతున్న క్రమంలో పోలీసులు బ్యాగ్‌ను స్వాధీని చేసుకున్నారన్నాడు. -
తెరపైకొచ్చిన మరో బీఫ్ వివాదం
భోపాల్: 'బీఫ్' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఓ ముస్లింజంటపై గో రక్షణ సమతి సభ్యులు దాడికి దిగడం ఆందోళన రేపింది. బ్యాగులో బీఫ్ ఉందని ఆరోపిస్తూ రైల్లో ప్రయాణిస్తున్న ముస్లిం దంపతులపై సమితి కార్యకర్తలు దాడి చేసి ఘోరంగా అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని హర్డా జిల్లాలో ఖిర్కియా రైల్వే స్టేషన్లో ఈనెల 13న ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మహమ్మద్ హుస్సేన్ (43), అతని భార్య నసీమ్ బానో (38) కుషినగర్ ఎక్స్‌ప్రెస్ లో తమ సొంత గ్రామం హర్దాకి బయలుదేరారు. ఇంతలో కొంతమంది కార్యకర్తలు రైల్లోకి చొరబడి ఈ దంపతుల బ్యాగులను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. దీన్నిఅడ్డుకున్న నజీమాను నెట్టేశారు. ఆవుమాంసం వున్న బ్యాగ్ ఏదంటూ గలాటా సృష్టించారు. అక్రమంగా గోమాంసం తీసుకెడుతున్నావంటూ ఆరోపించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన తోటి ప్రయాణికులు కూడా అడ్డుకున్నారు. దీంతో వారు మరింత రెచ్చిపోయి ఆ దంపతులను చావ బాదారు. వారి బ్యాగులను విసిరి పారేశారు. చివరికి రైల్వే పోలీస్ ను కూడా తోసేసి బీభత్సం సృష్టించారు. ఒక నల్లబ్యాగును దొరకబుచ్చుకుని అందులో గో మాంసం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు హుస్సేన్ కూడా తమ బంధువులకు సమాచారం అందించాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఖిర్కియా రేల్వే స్టేషన్ లో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. సుమారు పదిహేనుమంది ప్లాట్ ఫాం దగ్గరకు చేరుకోని సమితి సభ్యులను ప్రశ్నించడంతో ఘర్షణ వాతారణం నెలకొంది. దీంతో రంగంలోకి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం బ్యాగును ల్యాబ్ కు పంపారు. అయితే సదరు బ్యాగులో గో మాంసం లేదని పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ముస్లిం జంట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజపుత్, సంతోష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని, మరో అయిదుగురి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు గుర్తు తెలియని బ్యాగ్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. తన భార్యను విచక్షణా రహితంగా కొట్టుకుంటూ తోసేసారని, అడ్డుకున్న తనపై దాడిచేశారని మొహమ్మద్ వాపోయాడు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నాడు. వారు చెపుతున్న బ్యాగు తమది కాదని హుస్సేన వాదిస్తున్నాడు. కాగా బీఫ్ తింటున్నాడనే ఆరోపణలతో ఓ ముస్లింవ్యక్తిని కొట్టి చంపిన 'దాద్రి' ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. -
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
-
బ్యాగ్ లో యువతి మృతదేహం
హైదరాబాద్ : లింగంపల్లి రైల్వేస్టేషన్లో గురువారం దారుణం వెలుగుచూసింది. రైల్లోని బోగీలో వదిలేసి ఉన్న ఓ బ్యాగ్‌ను రైల్వే పోలీసులు తెరచి చూడగా గుర్తుతెలియని యువతి ( సుమారు 20 సంవత్సరాలు) మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ
రూ.1.25 కోట్లు విలువ ఉండొచ్చని అంచనా నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని ‘భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్’లో ఉద్యోగం చేస్తున్న ఎం.సెంథిల్, మహీందర్ సుమారు 14 కేజీల నగలను విక్రయించేందుకు ఈనెల 23న హైదరాబాద్ వచ్చారు. 24న దాదాపు 5 కేజీల నగలను విక్రయించి అదేరోజు రాత్రి మిగిలిన ఆభరణాలను రెండు బ్యాగుల్లో భద్రపరచుకుని కేశినేని బస్సులో చెన్నైకి బయలుదేరారు. గురువారం ఉదయం నాయుడుపేట సమీపంలో టిఫిన్ కోసం బస్సు ఆపారు. ఈ క్రమంలో బస్సు ముందు ఓ కారు వచ్చి నిలబడటం.. అక్కడి నుంచి ఓ వ్యక్తి హడావుడిగా వెళుతుండటాన్ని బస్సు డ్రైవర్ గమనించి అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అగంతకుడు డ్రైవర్‌ను తోసేసి కారులో చెన్నై వైపు పారిపోయాడు. ఇంతలో సెంథిల్, మహీందర్ తమ బంగారు నగల బ్యాగుల్లో ఒకటి కనిపించట్లేదని డ్రైవర్‌కు చెప్పారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. -
నిజాయితీకి అభినందనలు
మహానందిలో బ్యాగ్‌ను మరిచి వెళ్లిన భక్తులు అందులో రూ. 39 వేలు, ఏటీఎం కార్డులు పాదరక్షల కౌంటర్ యజమానికి దొరికిన బ్యాగ్ నాలుగు రోజుల తర్వాత బాధితులకు అప్పగింత మహానంది : వంద రూపాయలు దొరికితే పక్కోడికి తెలియకుండా జేబులో వేసుకునే రోజులివి. నాలుగురోజుల క్రితం దొరికిన రూ. 39వేల నగదు, విలువైన కార్డులతో దొరికిన బ్యాగును నిజాయితీతో ఓ వ్యక్తి బాధితులకు అప్పగించాడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన నరసింహ, మంజుల దంపతులు ఈ నెల 4న గురువారం మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడిని దర్శించుకున్న అనంతరం వారు ఇక్కడి నుంచి అదే రోజు రాత్రికి తిరుపతికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక ఓ బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. బ్యాగులో రూ. 39వేల నగదు, విలువైన ఏటీఎం కార్డులు, ఇతర పత్రాలు ఉన్నాయి. వారి కుమార్తె ఇంటర్నెట్లో మహానంది సమాచారాన్ని తెలుసుకుని దేవస్థానం కార్యాలయం ఫోన్ నంబరుకు కాల్ చేసి వివరాలు చెప్పారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ ఓంకారం వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ మల్లయ్య మైక్‌లో అనౌన్స్ చేశారు. అప్పటికే పాదరక్షల కౌంటరు యజమాని కుమార్‌కు ఆ బ్యాగు దొరకడంతో సమాచారం తెలుసుకుని ఆలయ అధికారులకు అందించాడు. వారు బాధితులకు ఫోన్ ద్వారా బ్యాగ్ దొరికిన విషయం చెప్పడంతో వారు ఆనందించారు. ఆదివారం మహానందికి వచ్చి బ్యాగు, నగదును తీసుకున్నారు. దేవస్థానం అన్నదానం ఇన్చార్జ్ సుబ్బారెడ్డి, ప్రసాదాల ఇన్చార్జ్ బీకే స్వామిరెడ్డి, హోంగార్డులు రామచంద్రారెడ్డి, మధు, బాధితులు నిజాయితీగా బ్యాగ్‌ను అప్పగించిన కుమార్‌ను శాలువాతో సత్కరించారు. -
ఈ బ్యాగ్ ఖరీదు కోటిన్నర
న్యూయార్క్: అరుదైన మొసలి చర్మంతో 18 క్యారెట్ల బంగారం, వజ్రాలతో తయారు చేసిన బటన్లు అమర్చి అందంగా డిజైన్ చేసిన గులాబీ రంగు హ్యాండ్ బ్యాగ్ సోమవారం న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌజ్‌లో ఏకంగా 1.46 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలను అభిమానులుగా కలిగిన ప్రపంచ ప్రసిద్ధ లెథర్ బ్యాగుల కంపెనీ హెర్మెస్ ఈ బ్యాగ్‌ను డిజైన్ చేసింది. హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ ట్యాగ్‌తో విడుదల చేసిన ఈ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొనుగోలు చేశారని, ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బ్యాగ్ అని క్రిస్టీ వేలం నిర్వాహకులు తెలిపారు. గతంలో హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ 1.29 కోట్లకు అమ్ముడు పోయిందని, ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టామని హెర్మెస్ కంపెనీ వర్గాలు తెలియజేశాయి. నల్ల రంగులో ఉన్న మరో బిర్కిన్ బ్యాగ్‌ను త్వరలో విడుదల చేయబోతున్నామని, అది ఇంతకన్న ఎక్కువ ధర పలుకుతుందని భావిస్తున్నామని ఆ వర్గాలు చెప్పాయి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన బిర్కిన్ ట్యాగ్ బ్యాగ్‌లకు ఎంతో గిరాకీ ఉంది. ఈ బ్యాగ్‌ల కోసం కొన్నేళ్లపాటు నిరీక్షించే వినియోగదారులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన హెర్మెస్ కంపెనీ 1984లో అప్పటికి పాపులరైన ప్రముఖ ఫ్రెంచ్ నటి, సింగర్ జాన్ బెర్కిన్ పేరిట హ్యాండ్ బ్యాగ్ సిరీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ఈ బ్యాగ్‌లను ఎగబడి కొంటున్నారు. ప్రముఖ మోడల్, సింగర్, డిజైనర్ విక్టోరియా బెకమ్ వద్ద ఈ బ్రాండ్ బ్యాగులు దాదాపు వంద ఉన్నాయట. కిమ్ కర్దాషియన్, హైదీ క్లమ్ లాంటి సెలబ్రిటీలు కూడా హెర్మెస్ బిర్కిన్ బ్యాగులే కొంటారు. -
తిరుమలలో బుల్లెట్ల కలకలం!
-
గోనెసంచిలో మృతదేహం
రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రష్యా కళాకారిణి బ్యాగ్ మాయం
గచ్చిబౌలి: రష్యాకు చెందిన కూచిపూడి కళాకారిణి బ్యాగ్ మాయమైంది. నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రష్యాకు చెందిన అలీఫా కుచ్తోవా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వచ్చారు. బ్యాగ్‌ను స్టేడియంలోని మేకప్ రూమ్‌లో పెట్టి నాట్యం చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30కి వేదికపైకి వెళ్లారు. నాట్య ప్రదర్శన ముగించుకొని మేకప్ రూమ్‌కి వెళ్లి చూడగా బ్యాగ్ కనిపించ లేదు. బ్యాగులో పాస్పోర్టుతో పాటు డబ్బులు, పలు గుర్తింపు కార్డులున్నాయని బాధితురాలు తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కన్నీరుపెట్టుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.