పాపను బ్యాగ్లో దాచి.. విమానంలో తీసుకెళ్లింది | Woman hides four-year-old child in bag on flight from Istanbul to Paris | Sakshi
Sakshi News home page

పాపను బ్యాగ్లో దాచి.. విమానంలో తీసుకెళ్లింది

Published Thu, Mar 10 2016 10:49 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

పాపను బ్యాగ్లో దాచి.. విమానంలో తీసుకెళ్లింది - Sakshi

పాపను బ్యాగ్లో దాచి.. విమానంలో తీసుకెళ్లింది

నాలుగేళ్ల బాలికను టికెట్ లేకుండా విమానంలో తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించి ఓ మహిళ దొరికిపోయింది. ఆమె చిన్నారి కనబడకుండా బ్యాగ్లో దాచిపెట్టి ఇస్తాంబుల్ (టర్కీ) నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్కు విమానంలో తీసుకెళ్లింది. అయితే విమానంలో తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించారు.  

సంబంధిత మహిళను ఫ్రాన్స్ దేశస్థురాలిగా గుర్తించారు. హైతీకి చెందిన బాలికను దత్తత తీసుకునేందుకు తీసుకెళ్తోంది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టినా బ్యాగ్లోపల పాపను దాచిన విషయాన్ని గుర్తించలేకపోయారు. తనిఖీల నుంచి తప్పించుకున్న ఆ మహిళ విమానంలో పాపను తన కాళ్ల వద్ద ఉంచి దుప్పటి కప్పింది. కాగా ఆ బాలికను టాయ్లెట్కు తీసుకెళ్లే సమయంలో ఇతర ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి తెలియజేశారు. ఫ్రాన్స్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ఆ మహిళను, పాపను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement