దేశ రాజధానిలో మరో దారుణం | Woman Raped, Murdered and Stuffed in Bag | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో మరో దారుణం

Published Thu, Jan 21 2016 11:49 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

దేశ రాజధానిలో మరో దారుణం - Sakshi

దేశ రాజధానిలో మరో దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి  అనంతరం  ఒక బ్యాగులో కుక్కి పడేసిన కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  సందేహాస్పదంగా కనపించిన సంచిని పోలీసులు తనిఖీ చేసినపుడు విషయం బయటపడింది.

పోలీసులు అందించిన వివరాల ఢిల్లీలో మయూర్ విహార్  సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఇ-రిక్షాలో పడి ఉన్న బ్యాగు పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. దాన్ని పరిశీలించినపుడు డీ కంపోజ్ అయిన యువతి మృతదేహాన్ని గొన్నారు. అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేసి వుంటారని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటలు దాటి వుంటుదని భావిస్తున్నారు. మరోవైపు జీన్ ప్యాంట్, కుర్తా, మెడచుట్టు స్కార్ఫ్  ధరించి వున్న యువతికి సంబంధించి మరే సమాచారం అందుబాటులో లేదన్నారు. అత్యాచారం, హత్యకేసు నమోదు చేసిన పోలీసులు రిక్షా డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నామన్నారు.

అయితే ఈ హత్యకు తనకు ఏమీ సంబంధంలేదని ఇ-రిక్షా డ్రైవర్  చెబుతున్నాడు. ఒక వ్యక్తి మెట్రో రైల్వేస్టేషన్ కి  వెళ్లాలని ఆటోను కిరాయికి మాట్లాడుకొన్నాడు. తాను వెనకాలే బైక్ మీద వస్తానని చెప్పి ఉడాయించాడని  తెలిపాడు. అతని కోసం వెదుకుతున్న క్రమంలో పోలీసులు బ్యాగ్ను స్వాధీని చేసుకున్నారన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement