
విజయవాడలో మహిళపై హత్యాచారం!
విజయవాడ: విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీ క్రీడా మైదానంలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.