హైదరాబాద్‌కు పారిపోతూ పోలీసుల చేతికి చిక్కిన కుళ్లాయప్ప
వివరాలు వెల్లడించిన వైఎస్సార్ జిల్లా ఎస్పీ
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై హత్యా యత్యానికి పాల్పడిన పేమోన్మాదిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం కడపలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వేముల మండలానికి చెందిన కుళ్లాయప్ప కొంతకాలంగా యువతి వెంట పడుతున్నాడు.
ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపాయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వేముల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
అయితే గ్రామస్తులు తనను కొట్టి చంపుతారేమోనని భయపడిన నిందితుడు గ్రామ సమీపాన గల కొండల్లో ఉండి చనిపోవాలనుకుని కత్తితో చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళుతుండగా పోలీసుల చేతికి చిక్కాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్టు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment