attempt to murder
-
యువతిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది అరెస్ట్
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై హత్యా యత్యానికి పాల్పడిన పేమోన్మాదిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం కడపలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వేముల మండలానికి చెందిన కుళ్లాయప్ప కొంతకాలంగా యువతి వెంట పడుతున్నాడు.ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపాయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వేముల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే గ్రామస్తులు తనను కొట్టి చంపుతారేమోనని భయపడిన నిందితుడు గ్రామ సమీపాన గల కొండల్లో ఉండి చనిపోవాలనుకుని కత్తితో చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళుతుండగా పోలీసుల చేతికి చిక్కాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్టు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వివరించారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగుడితోపాటు సహకరించిన ముఠా, కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దాడికి పాల్పడినట్లు గుర్తించిన అనుమానితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఉండటం గమనార్హం. హత్యాయత్నం వెనుక కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. అనుమానితులు, తెర వెనుక పాత్రధారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు. నేరాన్ని రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించి క్రోడీకరించారు. సాంకేతికపరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించే అవకాశాలున్నాయి. 60 మందికిపైగా విచారణ ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడిందీ నిర్ధారించారు. పదునైన రాయితో దాడి చేసింది ఎవరు? దుండగుడికి సహకారం అందించింది ఎవరు? అనే కీలక అంశాలను రాబట్టారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తును పోలీసులు తుది అంకానికి తెచ్చారు. దాదాపు 60 మందికిపైగా అనుమానితులను విచారించి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. కుట్ర కోణంపై ముమ్మర దర్యాప్తు ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణంపై విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. దుండగుడికి సహకరించినవారితోపాటు ఆ దిశగా ప్రోత్సహించిన కీలక నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ క్రియాశీలక నేత కావడం గమనార్హం. టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించడంతో సంచలన అంశాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో సెంట్రల్ నేత తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో సరిపోల్చి నిర్ధారించుకుంటున్నారు. అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్ర కోణం వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి చర్యలు చేపట్టాలన్నది పోలీసుల ఉద్దేశం. దాంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. దాడికి పాల్పడిన విధానం, అనుమానితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారాన్ని విజయవాడ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాలపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలను సంతృప్తికరంగా నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక వ్యవహారాలను పూర్తి చేసి కేసులో కీలక వివరాలను నేడు వెల్లడించవచ్చని భావిస్తున్నారు. -
లక్షద్వీప్ ఎంపీపై వేటు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది . ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్‌లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. -
Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి
సాక్షి, వికారాబాద్: కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రిని ప్రశ్నించినందుకు కొడుకునే హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మోమిన్‌పేట మండల పరిధిలో ఎన్కతల గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్కతలకు చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు. వారికి వెంకటేశం, కృష్ణ ఇద్దరు కుమారులు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. భార్య గోవిందమ్మ కుమారులను చేరదీసి ఉన్న ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూమిని అమ్ముదామని ఇంట్లో గొడవ పడుతుండేవాడు. అవసరం లేనిది భూమి అమ్మడం దేనికని కుమారులిద్దరూ అడ్డుపడుతున్నారు. ఈ నెల 24న ఉదయం పెద్ద కుమారుడు వెంకటేశం భోజనం చేసే సమయంలో అన్నంలో తండ్రి విషం కలిపాడు. తెలుసుకోకుండా భోజనం చేసిన వెంకటేశం అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్నంలో విషం కలిపారని తెలపడంతో తల్లి గోవిందమ్మ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు చదవండి: అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్‌లో ఆందోళన -
‘సాక్షి’ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుల హత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల సాక్షి రిపోర్టర్ కమలాపురం పోశెట్టిపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేశారు. శనివారం మండలంలోని కొత్తపల్లిలో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతుబంధు సంబురాల కార్యక్రమం కవరేజ్ నిమిత్తం ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వల్లభాపూర్ గ్రామ సమీపంలో రెండు బైక్‌లపై, మంకీ క్యాప్‌లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. సమీపంలోని పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలు పరుగున రావడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పోశెట్టిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మాక్లూర్ సొసైటీలో చోటుచేసుకున్న రూ.30 లక్షల అక్రమాలపై పోశెట్టి ఇటీవల వార్తలు రాశారు. అలాగే, గత శుక్రవారం మెట్పల్లిలో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో విఠల్‌రావు మాట్లాడుతూ.. సోయిలేని ప్రజాప్రతినిధి అంటూ ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త రాయడంతోపాటు గతంలో సొసైటీలో అక్రమాల గురించి రాసినందుకు మాక్లూర్ సొసైటీ చైర్మన్ కొడుకు గోపు రంజిత్, నందిపేట మండలం లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ సూత్రధారులుగా ఈ హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోశెట్టి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఖబడ్దార్ జీవన్‌రెడ్డి: విరాహత్ రిపోర్టర్‌పై హత్యాయత్నాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాల చిట్టాను వెలికితీస్తామంటూ ఖబడ్దార్ అని హెచ్చరించారు. క్షమించరాని నేరం: ప్రవీణ్‌కుమార్ (బీఎస్పీ) పోశెట్టిపై హత్యాయత్నాన్ని బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖండించారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చిన గిరిజన విలేకరిపై దాడి చేయడం క్షమించరాని నేరమన్నారు. -
భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో?
టెక్కలి రూరల్: భర్త, పిల్లలను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం జరిగింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందనే కోపంతో ఆమెతో సహజీవనం చేస్తున్న మృగాడే విచక్షణ రహితంగా కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొరిగిపేట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం గంగాధరపేట గ్రామానికి చెందిన కొప్పల కమలకు 2005లో అదే గ్రామానికి చెందిన సింగుమహాంతి భుజంగరావుతో వివాహం జరిగింది. వీరు హైదరాబాద్‌లో పనులు చేసుకుని జీవించేవారు. వీరికి ఇద్దరు కుమారులు చరణ్, హరవర్ధన్ ఉన్నారు. అయితే పెళ్లికి ముందు నుంచే కమలకు టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రైల్వే గేట్మెన్ సంపతిరావు దేవరాజుతో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త, పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది. దేవరాజుకు భార్య, పిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్టీఆర్ కాలనీ తొమ్మిదో లైన్లో అద్దె ఇంటిలో ఉంచాడు. అయితే తొమ్మిదేళ్లు అవుతున్నా కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. దీంతో కమల ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన దేవరాజు ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. శుక్రవారం రాత్రి కమల ఇంటికి వెళ్లి.. పెద్ద మనుషుల వద్ద సమస్యను పరిష్కరించుకుందామని నమ్మించి బైక్‌పై బొరిగిపేట గ్రామానికి తీసుకెళ్లాడు. నిన్ను చంపేస్తే గాని హాయిగా ఉండలేనంటూ ఇంట్లో నుంచి కత్తి తెచ్చే సరికి కమల భయంతో అక్కడ నుంచి పరుగులు తీసింది. దేవరాజు కూడా వెంబడించి గ్రామ సమీపంలో వంశధార కాలువ వద్ద కత్తితో ఆమెపై దాడి చేసి చేతులు, ఒంటిపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోయింది. కమల చనిపోయిందని భావించిన దేవరాజు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయానికి కోలుకున్న ఆమె పాల వ్యాన్‌లో సీతాపురం గ్రామానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 108కి ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహారాజ్ వైద్యపరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ ఆర్.నీలయ్య వివరాలు సేకరించారు. కమలను గాయపరిచిన వారిలో దేవరాజుతో పాటుగా మరో వ్యక్తి ఉన్నాడని బాధితురాలు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు దేవరాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నీలయ్య, ఎస్ఐ కామేశ్వరరావు తెలిపారు. -
కుట్ర భగ్నం: ఫ్యాక్షన్ మంటను చల్లార్చిన పోలీసులు
పత్తికొండ టౌన్ / తుగ్గలి: జిల్లా ఫ్యాక్షన్ జోన్ పోలీసులు ఓ వ్యక్తి హత్య కుట్రను భగ్నం చేశారు. తుగ్గలి మండల కడమకుంట్ల గ్రామానికి చెందిన ఊటకంటి అమరనాథరెడ్డిని హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు సుఫారీ ఇచ్చారు. పక్కా సమాచారంతో రెండురోజుల కిందట ఫ్యాక్షన్ జోన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం పత్తికొండ పోలీసు స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. 1998లో కడమకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు ఊటకంటి లక్ష్మీకాంతరెడ్డి, విశ్వనాథశర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో హనిమిరెడ్డితో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది. ఈ హత్యలకు ప్రతీకారంగా 2011లో పగిడిరాయి కొత్తూరు సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద హనిమిరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీ అయినా పాతకక్షలు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో ఆరు నెలల కిందట లక్ష్మీకాంతరెడ్డి కుమారుడు రాంభూపాల్‌రెడ్డిపై హనిమిరెడ్డి కుమారుడు అమరనాథరెడ్డి పత్తికొండ సమీపంలో జీపుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడని పత్తికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనల నేపథ్యంలో అమరనాథ్‌రెడ్డిని అంతమొందించేందుకు ప్రత్యర్థులు కుట్రపన్ని చివరకు పోలీసులకు చిక్కారు. రూ. 4 లక్షలకు సుఫారీ.. అమరనాథ్‌రెడ్డిని హత్య చేసేందుకు హనిమిరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడమకుంట్ల బొగ్గుల సుధాకర్‌తో పాటు సురేష్, సోమశేఖరరాజు కుట్ర పన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకలపెంటకు చెందిన ఎద్దుల వీరాంజినేయులుతో రూ. 4 లక్షలకు సుఫారీ మాట్లాడారు. ఈ మేరకు రూ. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. కాగా నెలలు గడుస్తున్నా పని పూర్తిచేయక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వీరాంజినేయులుపై సుధాకర్ ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం నిఘా వర్గాలకు తెలియడంతో ఫ్యాక్షన్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నెల 31వ తేదీన వీరాంజినేయులతో పాటు సుధాకర్, సురేశ్, సోమశేఖరరాజును అదుపులోకి విచారణ చేశారు. సోమవారం నిందితులను పత్తికొండ కోర్టులో హాజరు పరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సోమ్లానాయక్, జొన్నగిరి ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్న కడమకుంట్ల గ్రామంలో ఈ ఘటన అలజడి రేపింది. -
తల్లీ, కూతుళ్లపై హత్యాయత్నం
తూర్పుగోదావరి,కాకినాడ సిటీ: కాకినాడ ఏటిమొగలో మంగళవారం ఉదయం తల్లి, కుమార్తెలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. ఎవరు ఎందుకు వీరిపై హత్యాయత్నానికి ప్రయత్నించారనే విషయాలు తెలియరాలేదు. దీనిపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో కంబాల కామేశ్వరి, కంబాల వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. తన భార్య, కుమార్తెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని కంబాల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై దాడి చేసేందుకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోర్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
లంకె బిందెల కోసం నరబలికి యత్నం?
ఆధునికత ఎంతో అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా పల్లె జనాలను మూఢనమ్మకాలు వెంటాడుతున్నాయి. లేని వాటి కోసం మనిషి చేసే ప్రయత్నంలో వారికి వారే నాశనం అవుతున్నారు. నర బలి ఇస్తే లంకె బిందెలు దొరుకుతాయని నమ్మి అన్నెం పున్నెం ఎరుగని మూగ మహిళను హతమార్చేందుకు సిద్ధపడ్డారు. సాక్షి, శ్రీరంగరాజపురం: లంకె బిందెల కోసం మూగ మహిళను బలి ఇచ్చేందుకు యత్నించిన సంఘటన మండలంలోని వడ్డికండ్రిగ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు కొందరు వ్యక్తులు లంకె బిందెల వేటలో పడ్డారు. ఈ నేపథ్యంలో సరోజమ్మ అనే మూగ మహిళను బలి ఇచ్చి పూడ్చేందుకు సిద్ధపడ్డారు. గత శుక్రవారం సమీపంలోని పెద్ద చెరువులో గుంతను తవ్వారు. (పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య) గ్రామానికి చెందిన తల్లీకొడుకు సహకారంతో సరోజనమ్మను పూడ్చేందుకు తీసుకెళ్లారు. తనకు ప్రమాదం వాటిల్లుతోందని అప్రమత్తమైన బాధితురాలు అక్కడ నుంచి తప్పించుకుంది. ఊర్లోకి వెళ్లి తన సైగల ద్వారా బంధువులకు విషయం తెలిపింది. తనను బలిచ్చేందుకు సిద్ధం చేసిన ప్రాంతాన్ని చూపించింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొందరు రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
రౌడీషీటర్ అకృత్యం.. మూడేళ్ల కొడుక్కి
కర్ణాటక, యశవంతపుర : దోపిడీ, దొంగతనాలు, హత్యాయత్నం కేసులో నిందితుడు చిన్నారి కొడుకు (3)కి మద్యం తాగించిన సంఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. మాగడిరోడ్డుకు చెందిన రౌడీషీటర్ కుమారేశ్కు కొంతకాలం కిందట పెళ్లయింది. వారికో కొడుకు పుట్టాడు. కుమారేశ్ రౌడీషీటర్ కావడం, తరచూ వేధిస్తుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి వద్ద ఉన్న కొడుకును ఇటీవల ఆమెకు తెలియకుండా కుమారేశ్ తీసుకెళ్లాడు. బిడ్డను అప్పగించాలని ఆమె కోరినా ఇవ్వలేదు. ఇటీవల ఇంట్లో స్నేహితులతో కలిసి అతడు మద్యం తాగుతూ, కొడుక్కి కూడా మందు పట్టించాడు. ఆ వైనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. భార్యపై ఉన్న కోపంతో అణ్యంపుణ్యం ఎరుగాని చిన్నారికీ మద్యం తాపిస్తున్న వీడియోను బంధువులతో పాటు భార్యకూ పంపాడు. భర్త దురాగతంపై ఆమె వనితా సహాయవాణి, పిల్లల సహాయవాణికీ ఫిర్యాదు చేయగా, స్పందించిన పోలీసులు చిన్నారినీ రక్షించి తల్లి చెంతకు చేర్చారు. మాగడి రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు కుమారేశ్ కోసం గాలిస్తున్నారు. -
పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోసి చంపేస్తా..
అమీర్‌పేట: కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త నుంచి విడిపోయి వేరు గా ఉంటున్న తనను వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి పదేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావ టంతో భర్త నుంచి విడిపోయి చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను చెన్నైలో, పిల్లలు మరోచోట ఉంటుండటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో పెయిడ్ గెస్ట్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో సుశాంక్ అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న సుశాంక్ తనను పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధిస్తున్నాడు. ఈ నెల 24న మాట్లాకుందామంటూ ఎస్ఆర్నగర్ సుప్రభాత్ హోటల్ వద్దకు ఆమెను పిలిపించాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తేవడంతో అందుకు నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన సుశాంక్ వెంట తెచ్చుకున్న ఎలక్ట్రికల్ పరికరంతో ఆమెపై దాడి చేశాడు. భయంతో పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని పగులగొట్టాడు. మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడు. వేధింపులు అధికం కావడంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుశాంక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మహిళా కౌన్సిలర్‌పై హత్యాయత్నం
తిరుత్తణి: అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్‌పై హత్యాయత్నానికి యత్నించిన నలుగురు యువకులను చితకబాది తిరువలంగాడు పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రి కలకలం రేపింది. తిరుత్తణి తాలూకాలోని తిరువలంగాడు మండల అన్నాడీఎంకే కౌన్సిలర్‌గా జీవా వివజయరాఘవన్ విజయం సాధించారు. యూనియన్ చైర్మన్ పదవికి ఆమె పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 11న యూనియన్ చైర్మన్ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో గ్రూపు రాజకీయాల కారణంగా చైర్మన్ ఎన్నికలకు కౌన్సిలర్లు దూరమయ్యారు.చైర్మన్ ఎంపికకు సంబంధించి రహస్య ఓటింగ్‌ను అధికారులు రద్దు చేశారు. ఆదివారం రాత్రి జీవా విజయరాఘవన్ స్వగ్రామం కుప్పంకండ్రిగ వద్ద ఉన్న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి నలుగురు యువకులు మారణాయుధాలతో గ్రామంలో ప్రవేశించి జీవా విజయరాఘవన్‌ను హతమార్చేందుకు యత్నించారు. స్థానికులు గుర్తించి వారిని రెడ్ హ్యేండడ్‌గా పట్టుకుని కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై యువకులకు దేహశుద్ధి చేసి తిరువలంగాడు పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందుతులది తిరువళ్లూరు పరిసర గ్రామాలకు చెందిన అబ్దుల్ రజాద్(19), అయ్యప్పన్(21), కుమార్(17), విష్ణు(19) గా గుర్తించారు. వారి వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు. జీవా విజయరాఘవన్ ఎవరు? అన్నాడీఎంకే తిరువళ్లూరు జిల్లా ఎంజీఆర్ విభాగం కన్వీనర్, అరక్కోణం మాజీ ఎంపీ హరి స్వయాన అన్న తమిళ భాష అభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయరాఘవన్ భార్య జీవా విజయరాఘవన్. తిరువలంగాడు మండలంలోని 12వ వార్డు యూనియన్ కౌన్సిలర్‌గా అన్నాడీఎంకే నుంచి పోటీ చేసి గెలుపొందారు. చైర్మన్ పదవికి యత్నిస్తున్నారు. అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న క్రమంలో 11న నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు పాల్గొనకపోవడంతో ఎన్నికలు రద్దు చేశారు. ఈ క్రమంలో జీవా విజయరాఘవన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. -
ప్రేమ పెళ్లి చేసుకుందని కుమార్తెపై..
చెన్నై, టీ.నగర్: కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి రాక్షసుడిగా మారాడు. కని పెంచిన కుమార్తెపై హత్యాయత్నం చేశాడు. అతన్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా, తిరుమంగళం సమీపం నాగయ్యపురానికి చెందిన వాలగురునాథన్ (55) ఎరువుల వ్యాపారి. ఇతని కుమార్తె సుష్మ (19). బీఎస్సీ మొదటి ఏడాది అర్ధంతరంగా నిలిపేసింది. పొరుగూరికి చెందిన రామర్ కుమారుడు శివశంకరన్ (23) బీఏ పట్టభద్రుడు. సుష్మ, శివశంకరన్ పాఠశాల స్థాయి నుంచి ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరువురూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇలావుండగా ఇరువురూ రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. దీంతో సుష్మ తండ్రి వాలగురునాథన్ ఆగ్రహించాడు. ఈ క్రమంలో ప్రేమజంట నాగయ్యపురం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. సుష్మ మేజర్ కావడంతో ఆమెను భర్తతో పంపేందుకు సమ్మతించారు. శివశంకరన్ వేరే కులానికి చెందినవాడని అతన్ని ఆంగీకరించబోమని సుష్మ తల్లిదండ్రులు చెప్పారు. కొత్తదంపతులు శివశంకరన్ సొంతవూరైన వాళవందాన్‌పురంలో నివశిస్తూ వచ్చారు. గర్భిణి అయిన సుష్మ మంగళవారం ఉదయం భర్త శివశంకరన్‌తో తిరుమంగళం సమీపంలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల కోసం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సుష్మ తండ్రి వాలగురునాథన్ అక్కడికి వెళ్లి కుమార్తెతో ప్రేమగా మాట్లాడుతూ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు విన్న భర్త శివశంకరన్ పరుగున వచ్చి కత్తి లాక్కుని భార్యను కాపాడాడు. సుష్మకు ప్రాథమిక చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్సల కోసం తిరుమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. భర్త శివశంకరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు వాలగురునాథన్‌ను అరెస్టు చేశారు. -
పెంపుడు కుక్కను కొట్టాడని..
బంజారాహిల్స్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కను కొట్టాడన్న కోపంతో ఓ కొబ్బరిబోండాల వ్యాపారి ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట సమీపంలోని మారుతీనగర్‌కు చెందిన శ్రీనివాస్ ఫిలింనగర్ రోడ్ నెంబర్–16లో కొబ్బరి బోండాలు విక్రయించేవాడు. అతడికి సంతానం లేకపోవడంతో ఓ వీధి కుక్కను చేరదీసి ‘సాయి’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజూ తనతో పాటు దుకాణానికి తీసుకొచ్చేవాడు. ఆదివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన చల్లా బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడు శ్రీనివాస్ కొబ్బరి బోండాల బండి పక్క నుంచి వెళుతుండగా కుక్క అతడి వెంటపడటంతో రాయితో కొట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ చేతిలో ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడి సోదరుడు చల్లా రాజ్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన పెంపుడు కుక్కపై అకారణంగా రాయితో దాడి చేసినందుకే తాను తిరిగి దాడి చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. -
ప్రియురాలి తండ్రిపై కత్తితో దాడి
తూర్పుగోదావరి, అనపర్తి: వివాహితతో ఏర్పడ్డ పరిచయం హత్యా యత్నానికి దారితీసింది. స్థానిక రైల్వే స్టేషన్లో మంగళవారం రాత్రి వివాహిత సీహెచ్ శేషారత్నంతో కలిసి ప్రియుడు కె.మణికంఠను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రి, బంధువుపై.. ప్రియుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం అనపర్తి పాతవూరికి చెందిన శేషారత్నం తన కుమార్తెను రోజూ పాఠశాల బస్సు ఎక్కించేందుకు వెళుతుంది. బస్సు క్లీనర్ మణికంఠరెడ్డితో పరిచయం పెంచుకున్న ఆమె ఇంటికి రప్పించుకుని అతనితో మాట్లాడుతుంటే.. ఆమెను కుటుంబ సభ్యులు మందలించారు. ప్రియుడి ఒత్తిడితో ఆమె పరారయ్యేందుకు స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అనుమానం వచ్చిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు, బంధువు కామేశ్వరరావుతో కలిసి వెతుకుతూ రైల్వే స్టేషనులో వారిని గమనించారు. ప్రియుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు వారిపై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో తండ్రి కంఠానికి, బంధువుకు ఎడమ చేతికి గాయాలయ్యాయి. వారిని కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. హత్యాయత్నానికి పాల్పడిన ప్రియుడు పోలీస్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లో జరగడంతో అనపర్తి పోలీసులు ఈ కేసును సామర్లకోట రైల్వే పోలీసులకు అప్పగించారు. సామర్లకోట జీఆర్పీ సిబ్బంది అతడిని సామర్లకోట తీసుకువెళ్లారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. -
వేధింపులపై వివాహిత ఫిర్యాదు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తనతో పాటు తన కుమార్తెను హతమార్చేందుకు అత్తమామలు, మరిది, తోటికోడలు, ఆడపడుచు యత్నించారని ఆరోపిస్తూ నెల్లి భాగ్యలక్ష్మి అనే మహిళ గాజు వాక పోలీసులను ఆశ్రయించింది. గాజు వాక డ్రైవర్స్ కాలనీ ఎల్బీ నగర్లో చోటు చేసుకున్న సంఘటనకు సంబం ధించి గాజువాక సీఐ కోరాడ రామారావు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మికి గాజు వాక ఎల్బీ నగర్‌కు చెందిన అవినాష్‌తో 2013లో వివాహం జరిగిం ది. ఆ సమయంలో అవినాష్ అమెరికాలో వెల్డర్‌గా పనిచేసేవాడు. అనంతరం నగరానికి వచ్చి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భాగ్యలక్ష్మి నిలదీసింది. అప్పుడు పొంతన లేని సమాధానం చెప్పిన అవినాష్ మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి భాగ్యలక్ష్మిని అత్తమామలతోపాటు ఆమె మరిది, తోటికోడలు, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ దాడి చేయడంతో బాధితురాలు భాగ్యలక్ష్మి గాయాలతో గాజువాక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన కుమార్తెను హతమార్చేందుకు యత్నిం చారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపా రు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
యువతిపై హత్యాయత్నం..
శృంగవరపుకోట రూరల్: మండలంలోని శివరామరాజుపేటలో ఎస్సీ యువతిపై ఆటో డ్రైవర్ బుధవారం హత్యాయత్నం చేశాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్.కోట ఎస్సై ఎస్.అమ్మినాయుడు, బాధిత యువతి జుంజూరు శిరీష (19) తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. జుంజూరు శిరీష స్వగ్రామం వేపాడ మండలంలోని ఆకుల సీతంపేట. ఈమె ప్రస్తుతం ఎస్.కోట పట్టణంలోని పుణ్యగిరి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీకాం చదువుతోంది. ఈమె తండ్రి శ్రీను చనిపోవటంతో తల్లితో కలిసి గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామంలో గల అమ్మమ్మ గారింట్లో ఉంటూ ఎస్.కోటలో చదువుకుంటోంది. అయితే వేపాడ మండలం ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన సుంకరి బంగారు బుల్లయ్య (ఆటో డ్రైవర్) సంవత్సర కాలంగా ప్రేమ పేరుతూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి, ఆమె తల్లి సూరీడమ్మ బుల్లయ్య తీరును ఆకులసీతంపేట పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మందలించారు. దీంతో బుల్లయ్య రెండు నెలలుగా వేధింపులు ఆపేశాడు. మంగళవారం సాయంత్రం బాధిత యువతి తల్లి సూరీడమ్మతో కలిసి ఎస్.కోటలో బ్యాంకు పని ముగించుకుని శివరామరాజుపేటలో ఉన్న మేనమామ తెరపల్లి గౌరినాయుడు ఇంటికి వెళ్లారు. అక్కడ బాధితురాలు శిరీష ఉండిపోగా ఆమె తల్లి సూరీడమ్మ మధుపాడలోని కన్నవారింటికి ఇంటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మేనమామ ఇంట్లో శిరీష టీవీ చూస్తుండగా... నిందితుడు బుల్లయ్య ఒక్కసారిగా ఇంటిలోకి చొరపడడంతో యువతి బయటకు పరుగు తీసేందుకు ప్రయత్నించింది. అయితే బుల్లయ్య వెంటనే ఆమె మెడ పట్టుకుని మంచంపై తోసి నన్ను పెళ్లి చేసుకుంటావా.. లేదా అని గద్దించడంతో శిరీష చేసుకోనని స్పష్టం చేసింది. వెంటనే నిందితుడి ఆమె చున్నీతో శిరీషను హత్య చేసుందుకు ప్రయత్నించాడు. నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో శిరీష చనిపోయిందని భావించి నిందితుడు పరారయ్యడు. ఇంతలో ఇంటికొచ్చిన గౌరినాయుడు రక్తంతో ఉన్న శిరీషను చూసి వెంటనే ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అమ్మినాయుడు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుల్లయ్యను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు వెళ్లాయని.. విజయనగరం డీఎస్పీ కేసు దర్యాప్తు చేస్తారని చెప్పారు. -
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై దాడికి యత్నం..
చంద్రగిరి: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం ముంగళిపట్టులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై దాడికి యత్నించిన పట్టాభినాయుడును పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చినట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. అలాగే దళితులపై దాడి చేసిన ఘటనలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎదుట హాజరు పరచి విచారణ అనంతరం రిమాండ్‌కు పంపించామన్నారు. -
టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం
బంజారాహిల్స్: నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత బి.హనుమంతుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12, ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న హనుమంతు ఇంటికి మంగళవారం ఉదయం సిరిసిల్లకు చెందిన అనిల్‌రెడ్డి, గోపాల్‌నాయక్, గీతారెడ్డితో పాటు మరో నలుగురు అపరిచితులు వచ్చి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కుని రూ.2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం అతడిని కారులో ఎక్కించుకొని సిరిసిల్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు అనిల్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని కోరాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక
-
రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన మధులికను మరో రెండు రోజుల పాటు ఐసీయూలోనే ఉంచనున్నారు. ఆమెకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కొబ్బరి బొండాల కత్తితో నరకడం వలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందించాలని భావించిన వైద్యులు.. ఆ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే జనరల్ వార్డ్‌కు షిష్ట్ చేసే అవకాశం ఉంది. (మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు) -
ప్రేమోన్మాదికి ఉరే సరైన శిక్ష
ముషీరాబాద్: బర్కత్‌పుర రత్ననగర్‌కాలనీలో మధులికపై దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌కు ఉరిశిక్షే సరైన మార్గమని ఆమె తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్ అలీని కోరారు. శుక్రవారం రాంనగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.శ్రీనివాస్‌రెడ్డి, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ దంపతులు గరిగంటి శ్రీదేవి, రమేశ్, కాచిగూడ కార్పొరేటర్ చైతన్య, ఎక్కాల కన్నా యాదవ్ లతో పాటు పలువురు మధులిక తల్లిదండ్రులను హోంమంత్రి నివాసానికి తీసుకెళ్లగా వారిని మహమూద్ అలీ పరామర్శించారు. ఈ సందర్భంగా తమ కూతురుపై దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని, తమ కూతురుకు జరిగిన ఘటన మరే యువతికి జరగకూడదని వేడుకున్నారు. దోషిని కఠినంగా శిక్షస్తామని హోంమంత్రి వారికి హామీ ఇచ్చారు. మధులిక ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నందున ఆమె తండ్రి రాములు వీఎస్టీలో కార్మికునిగా పనిచేస్తున్నందున వారి కుటుంబానికి కావాల్సిన ఇతర అవసరాలను వీఎస్టీ యూనియాన్ భరిస్తుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
ఎన్నాళ్లీ దారుణాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలు విషాదంగా మారుతున్నాయి. కాచిగూడలో బుధవారం చోటు చేసుకున్న మధులిక ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. మనిషికీ మనిషికీ మధ్య అనుబంధవారధిగా ఉండాల్సిన ప్రేమ ఇక్కడి ఆడపిల్లల జీవితాలను బలి తీసుకుంటుంది. ప్రేమ ముసుగులో మృగాళ్ల ఉన్మాదం రంకెలు వేస్తోంటే... అభంశుభం తెలియని ఎందరో అసువులు బాస్తున్నారు. ఓ జంట సహజీవనం చేయడానికి చట్టం ఎలాంటి అభ్యంతరం చెప్పదు. అయితే ఓ బాలికతో ఆమె ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిసినా... దాన్ని అత్యాచారంగానే పరిగణిస్తుంది. కామాంధుల చేతిలో పసి మొగ్గలు బలికాకుండా చూసేందుకు చేసిన కఠిన చట్టమిది. ప్రేమ పేరుతో రెచ్చిపోతున్న ఉన్మాదులు చేసే నేరాలపట్ల ఇదే తరహా స్పష్టమైన, కఠిన నిర్ణయాలు లేకపోవడంతో ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎందరో యువతులు, బాలికలు అకారణంగా బలవుతున్నారు. ఎందుకిలా..? పరిపక్వత లేని ప్రేమలే ఈ దారుణాలకు కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీవితం అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? అనేవి పూర్తిగా అవగతం కాని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పుట్టే ఆకర్షణే దారుణాలకు దారి తీస్తోంది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ–వ్యామోహంలో పడి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. ఆనక ఇద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని గుర్తించి జాగ్రత్తపడితే... రెండో వాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడమో... లేదంటే హత్యకు తెగబడటమో జరుగుతోంది. ఒక్కో సందర్భంలో బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దాడులకు పాల్పడి కటకటాల్లోకీ చేరి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆడపిల్లలపై ప్రేమ పేరుతో ఉన్మాదులు కత్తులతోనే, యాసిడ్‌తోనే దాడులకు తెగబడినప్పుడల్లా... ‘నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం’ అంటూ గంభీరంగా ప్రకటించే అధికార యంత్రాంగం, పాలకుల హామీలు ‘అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్న’ చందంగానే మారిపోయాయి. నగరంలోనే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ తరహా ఉదంతం ఒక్కటి జరిగితే చాలు పోలీసులు ‘అత్యంత అప్రమత్తం’ అవుతారు. పోకిరీలు, ప్రేమోన్మాదులను కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ఉదరగొడతారు. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేసినా... ఇది దర్యాప్తు పూర్తి చేసుకుని, న్యాయస్థానంలో విచారణ పూర్తయి, దోషులకు శిక్ష పడటం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఈలోపు బాధిత కుటుంబాల్లో ‘పోరాడే’ (ఆ)శక్తి సన్నగిల్లిపోతోంది. ఇవన్నీ ఈ ఉన్మాదులు రెచ్చిపోవడానికి కారణాలుగా మారుతున్నాయి. మరోవైపు చట్టాల్లోని లోసుగులూ నిందితుల్లో భయం లేకుండా చేస్తున్నాయి. అటకెక్కిన యువజన విధానం... సమాజంలో మహిళలకు గల సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన వి«ధానం. మహిళలపట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మ«ధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు చక్కని అవగాహన కల్పించడంలో కానీ, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో కానీ ప్రభుత్వాలు ఎంతటి ‘చిత్తశుద్ధిని’ చూపిస్తున్నాయో తెలుస్తూనే ఉంది. ఇకనైనా పాలకులకు పట్టేనా? అభంశుభం తెలియకుండానే మృత్యువుతో పోరాడుతున్న మధులిక ఉదంతమైనా యంత్రాంగాల కళ్లు తెరిపించాలి. దీన్ని ఓ గుణపాఠంగా తీసుకుని వీరి రక్షణకు నడుంబిగించాలి. జాతీయ యువజన విధానాన్ని అమలులో పెట్టడానికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి. చట్టాలకు పదును పెట్టడంతో పాటు మహిళలు, బాలికలపై జరిగే అకృత్యాలు, ఉన్మాదుల దాడులను తీవ్రంగా పరిగణించాలి. బాధితులకు కోర్టుల చుట్టూ తిరిగే బాధలు తప్పిస్తూ... ఈ కేసులపై తక్షణ విచారణ చేపట్టాలి. దీని కోసం తక్షణం సంస్కరణలు అనివార్యం. జ్యోతిర్మయి కేసులో బర్మింగ్‌హామ్ పోలీసులు చూపించిన చొరవను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అప్పటికి కానీ నగరంలో మరో మధులిక ఉదంతం చోటు చేసుకోకుండా ఉంటుంది. పెద్దల పర్యవేక్షణ కీలకం యుక్త వయస్సు వచ్చిన పిల్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తుంది. ఆ సమయంలో వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంత్రిక జీవితంలో కేవలం ఉన్నత కుటుంబాలకే కాదు... మధ్య తరగతి వారిలోనూ పిల్లలపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా పిల్లలకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చి పడుతోంది. దాంతో యుక్తవయస్సు రాగానే పెడదారులు పడుతున్నారు. ప్రేమ వ్యామోహంలో పడుతున్నారు. ఇవే సినిమా–టీవీల ప్రభావంతో ఒక్కోసారి హద్దులు దారుణాలకు దారి తీస్తున్నాయి. మరోపక్క విద్యాసంస్థలు, కాలేజీల యాజమాన్యాలకు విద్యార్థుల బాగోగులు పట్టించుకునే, వారికి జీవితం విలువ తెలియజెప్పే తీరిక లేకుండా పోయింది. అనునిత్యం వీరి దృష్టి అంతా పరీక్షలు, ర్యాంకుల పైనే. జీవిత ప్రస్థానంలో కీలకమైన యుక్తవయస్సులో యువతీయువకులపై పర్యవేక్షణకొరవడి దారితప్పుతున్నారు. – రాజశేఖర్, మానసిక నిపుణులు ‘మచ్చ’తునకలు.. ♦ రాజేంద్రనగర్ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదివే అనురాధపై యాసిడ్ దాడికి పాల్పడింది ఆమెకు సీనియరే. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ♦ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో భార్గవి యాదవ్ బలైంది. ప్రేమ పేరుతో ఆమెను అనునిత్యం వేధింపులకు గురిచేస్తున్న సంతోష్ ఒకరోజు రెచ్చిపోయాడు. కళాశాల నుంచి తిరిగి వస్తున్న భార్గవిని సరూర్‌నగర్‌లోని ఆమె ఇంటి సమీపంలోనే అత్యంత దారుణంగా హతమార్చాడు. ♦ కార్వాన్ ప్రాంతంలో వివాహిత రాణి వెంటపడిన కామాంధుడు కన్నయ్య సింగ్ ప్రేమ పేరుతో తీవ్రంగా వేధించాడు. ఎప్పటికీ ఆమె మాట వినట్లేదని క„ý కట్టి కత్తితో దాడి చేశాడు. ♦ స్వాతి అనే యువతిపై బంజారాహిల్స్ పరిధిలో ఓ ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ఆమె బంధువుతో సహా సజీవ దహనం చేయాలని ప్రయత్నించాడు. ♦ వర్థమాన నటి భార్గవిని ఉన్మాదిగా మారిన ప్రవీణ్‌కుమార్ హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ బాలానగర్ ప్రాంతంలో అరుణ అనే బాలికపై ఆమె సమీప బంధువు శివశంకర్‌రెడ్డి దాడి చేసి హత్య చేశాడు. ♦ మీర్‌పేటలో ఉన్న టీఆర్ఆర్ కాలేజీలో లావణ్య అనే విద్యార్థినిపై ఓ మృగాడు దాడి చేశాడు. -
ఆధార్ కార్డు ఇవ్వలేదని భార్యపై కత్తితో దాడి..
టీ.నగర్: ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన భర్త భార్యపై కత్తితో దాడి చేసి అనంతరం తానూ చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చెన్నై అరుంబాక్కంలో సోమవారం చోటుచేసుకుంది. అరుంబాక్కం తిరువీధియమ్మన్ ఆలయ వీధికి చెందిన రమేష్ (44), దేవి (36) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె కోవైలోని స్కూలులో చదువుతోంది. మరో కుమార్తె చెన్నైలోని స్కూలులో ఏడో తరగతి చదువుతోంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాల కారణంగా ఎనిమిదేళ్లుగా విడిగా జీవిస్తున్నారు. దీంతో రమేష్ మానసిక స్థితి దెబ్బతింది. అదే ప్రాంతంలోని అంబేడ్కర్ నగర్లో నివశిస్తున్నాడు. సోమవారం ఉదయం రమేష్ భార్యను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో భార్య వద్దనున్న ఆధార్ కార్డు ఇవ్వమని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన రమేష్ భార్యపై కత్తితో దాడి చేసి తరువాత చేయ్యి నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న అరుంబాక్కం పోలీసులు ఇరువురిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
చెవిరెడ్డి హత్యకు కుట్ర..!
తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు రెక్కీ జరిగింది. చిత్తూరుకు చెందిన పులివర్తి నాని అనుచరులు ఇద్దరు పట్టుబడ్డారని మీడియాలో రావడంతో తిరునగరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విష సంస్కృతి తిరుపతికి రాకూడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అసలెం జరిగిందంటే... రెండు నెలల క్రితమే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని వాహనాలను అద్దెకు తీసుకున్నారు. ఇదే అవకాశంగా చిత్తూరు చెందిన నాని అనుచరుడు నాగభూషణం తాను తిరుపతి వాడినని, తనకు బతుకుదెరువు చూపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డిని కోరారు. నెలరోజుల క్రితం ఎమ్మెల్యే వాహనాల శ్రేణిలో చేరాడు. 10 రోజుల తర్వాత తన స్నేహితుడు సిసింద్రీని డ్రైవర్‌గా చేర్చాడు. డ్రైవర్‌గా ఉంటునే ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే వివరాలను సేకరించడంతో పాటు ఇళ్లు, ఆఫీసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు చిత్తూరులోని పులివర్తి నాని అనుచరుడు రెడ్డెప్పకు చేరవేశాడు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేపై దాడి జరిగిన సమయంలో ఆయన ఒక్కడే వస్తున్నాడని, అనుచరులు లేరని వేదాంతపురంలోని నాని అనుచరులకు చేరవేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే గొడవ జరగడం, ఎమ్మెల్యే సృహ తప్పడం, ఆస్పత్రిపాలు కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వీడియో తీసి చిత్తూరుకు చేరవేశారు. బయట పడింది ఇలా.. ‘మీ దగ్గర చిత్తూరుకు చెందిన ఇద్దరు డ్రైవర్ల ముసుగులో నాని అనుచరులు ఉన్నారు. హత్యకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి..జాగ్రత్త అంటూ’ దాడి జరిగిన తర్వాత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఓ అజ్ఞాతవ్యక్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆరా తీసిన ఎమ్మెల్యేకు పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానంతో చిత్తూరు పంట్రాంపల్లికి చెందిన నాగభూషణం, సిసింద్రీల ఫోన్లను పరిశీలించారు. దీంతో సమాచారం చిత్తూరు చేరవేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మంగళవారం సాయంత్రం తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితులు నాగభూషణం, సిసింద్రీలు సుఫారీ గురించి వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున డీల్ కుదిరిందని, అందులో తనకు రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చారని నాగభూషణం తెలపగా, తనకు రూ.40 వేలు అడ్వాన్స్ ఇచ్చారని సిసింద్రీ మీడియాకు తెలిపారు. మొదటి దశలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ వెళ్తున్నారు? ఏ మార్గంలో వెళ్తున్నారు? వంటి సమాచారం చిత్తూరులోని నాని అనుచరుడు రెడ్డెప్పకు వాట్సాప్, ఫోన్ ద్వారా చేరవేస్తున్నట్లు చెప్పారు. సమయం చూసి రెండో దశ ఆదేశాలు ఇస్తామన్నారని, అందుకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో పులివర్తి నాని, గోపికి చెందిన గ్రానైట్, ఎర్రచందనం లారీలను పైలెట్‌గా వెళ్లి హైవే దాటించేవాళ్లమని, పోలీసులకు రూ.2వేలు, ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు హైవేలో ఉంటే నానితో ఫోన్లో మాట్లాడించి అకౌంట్ నెం బర్కు నగదును బదిలి చేయించేవాళ్లమన్నారు. చిత్తూరులో జాతర, వినాయకచవితి, గరుడవాహ నం ఉత్సవాల్లో పులివర్తి నాని, వసంత్, గోపి, రెడ్డెప్పకు బ్యానర్లు, కటౌట్లు కట్టేవాళ్లమన్నారు. ఇళ్లు ఇస్తాం...అప్పు తీరుస్తాం.. డీల్‌కు ఓకే అయితే మీకు ఏం కావాలన్నా చేస్తామని నాని అనుచరుడు రెడ్డెప్ప, కార్పొరేటర్ గోపి నిందితులకు ఆశ చూపించారు. రూ.15 లక్షలతో తనకు ఇళ్లు కట్టిస్తామన్నారని నాగభూషణం తెలపగా, రూ.15 లక్షలతో తనకు ఉన్న అప్పులు తీరుస్తామని చెప్పడంతో డీల్‌కు ఒప్పుకున్నట్లు సిసింద్రీ తెలిపారు. అనంతరం నిందితులను అర్బన్ ఎస్పీకి అప్పగించారు. ఎంఆర్‌పల్లి పోలీçసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుణ్యక్షేత్రం ప్రశాంతంగా ఉండాలి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇక్కడ భక్తిభావం ఉండాలే తప్ప, హత్య రాజకీయాలు, రెక్కీలు, దాడులు, దౌర్జన్యాలు ఉండకూడదన్నారు. ప్రజల కూడా వాటిని అంగీకరించరన్నారు. ఎవరైనా ప్రజా సమస్యలపైనే పోరాటాలు చేయాలన్నారు. -
కోడలిపై హత్యాయత్నం
శ్రీకాకుళం, బూర్జ: కోడలిపై మామ హత్యాయత్నం చేసిన ఘటన బూర్జ మండలం ఏపీపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుపేద చాకలి కులానికి చెందిన నవిరి రాజేశ్వరి, భర్త పారయ్య ఉపాధి కోసం కుటుంబంతో చెన్నై వెళ్లి సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10న స్వగ్రామమైన ఏపీపేట చేరుకున్నారు. పండగ అనంతరం తన కన్నవారింటికి వెళ్తామని భార్య, వెళ్లవద్దని భర్త గొడవపడ్డారు. ఇంతలో మద్యం మత్తులో ఉన్న పారయ్య తండ్రి రామారావు ఇద్దరిని ఓదార్చడంపోయి మరింత గొడవ చేశాడు. ఈ క్రమంలోనే కత్తితో రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ ఘటనలో గుండె, గొంతుపై బలమైన గాయాలు కావడంతో బాధితురాలిని వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ జి.భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తజంటపై హత్యాయత్నం
కృష్ణాజిల్లా, జి. కొండూరు (మైలవరం): ప్రేమ వివాహం చేసుకొన్న యువ జంటపై యువతి అన్నయ్యతో పాటు మరో ఐదుగురు కలిసి హత్యాయత్నం చేయబోయిన ఘటన జి. కొండూరు మండల పరిధిలోని తెల్లదేవరపాడు గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకొంది. బాధితుల వివరాల ప్రకారం... జి.కొండూరు మండల పరిధిలోని గంగినేని గ్రామానికి చెందిన పొదిలి బాలగిరీష్ 8 నెలల క్రితం బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్లో అకౌంటెంట్‌గా చేరాడు. బెంగళూరుకు చెందిన తన సహ ఉద్యోగి మానసతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం మానస కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న బాలగిరీష్.. మానసను తీసుకొని డిసెంబరు 15వ తేదీన ద్వారకాతిరుమల వచ్చి స్నేహితుల సహాయంతో వివాహం చేసుకొన్నాడు. అనంతరం తెల్లదేవరపాడులో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరిద్దరి పెళ్లైన వారం రోజుల తర్వాత మానస కుటుంబ సభ్యులు కర్ణాటక పోలీసులతో కలిసి గంగినేని వచ్చారు. కుటుంబ సభ్యులు మానసను తమతో రావాలని కోరారు. తల్లిందండ్రులతో వెళ్లేందుకు మానస నిరాకరించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు వెనుదిరిగి వెళ్లారు. అయితే మానస అన్నయ్య వినయ్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి జి. కొండూరు వచ్చాడు. మానసతో రెండు రోజులుగా ఫోన్లో మంచిగా మాట్లాడుతూ అడ్రస్ సేకరించాడు. తనతో వచ్చిన ఐదుగురు స్నేహితులతో కలిసి కారులో వచ్చిన వినయ్ బుధవారం ఉదయం తెల్లదేవరపాడులో మానస, బాలగిరీష్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. మానసను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టింది. అంతలోనే బయటకు వచ్చిన బాల గిరీష్‌పై వినయ్‌తో పాటు అతని స్నేహితులు వెంట తెచ్చిన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇంటి పక్కన వాళ్లు వచ్చి నిందితులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఇరుపక్షాలు రాజీకి రావడంతో జి. కొండూరు పోలీసులు నిందితులను బైండోవర్ చేసి వదిలేశారు. -
అడ్డుగా ఉన్నాడని... భర్తపై హత్యాయత్నం
కర్ణాటక, కృష్ణరాజపురం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ఓ మహిళ, ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తపై హత్యాయత్నం చేసిన ఘట న సోమవారం హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు... కూలిగా పనిచేస్తున్న నాగరాజు భార్య మమతతో కలిసి అరికెరెలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంటి యజమాని ప్రశాంత్‌తో మమతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం నాగరాజుకు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి పథకం వేసింది. మమత సూచన మేరకు ప్రశాంత్ తన సహచరులు అనిల్, జాకిర్, హరీశ్‌లతో కలసి గతనెల14న నాగరాజును హత్య చేయడానికి నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో వాటర్‌క్యాన్ సరఫరా చేసే వ్యక్తి అక్కడికి రావడంతో హత్యాయత్నాన్ని విరమించుకొని అనుమానం రాకుండా ఉండడానికి నాగరాజుపై దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న హుళిమావు పోలీసులు మమత ప్రవర్తనపై అనుమానించి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం మమతతో పాటు ప్రశాంత్ అతడి సహచరులను అరెస్ట్ చేశారు. -
వినియోగదారులుగా వచ్చి హత్యాయత్నం..
నాచారం: బ్యూటీపార్లర్‌కు వినియోగదారులుగా వచ్చి నిర్వాహకురాలిపై హత్యాయత్నం చేసి సొత్తు చోరీ చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఈ సంఘటన మల్కాజిగిరి సీసీఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి సీసీఎస్ డీసీపీ నాగరాజు ఆధ్వర్యంలో నాచారంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫిల్‌గూడలోని వైల్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే బిట్రా విష్ణుప్రియ (25), మౌలాలి షఫీనగర్‌కు చెందిన ముత్తిరాజు మౌనిక (21) ఇద్దరు టైలర్ పనిచేస్తుంటారు. దువ్వ వెంకటరత్నకుమారి (50) వైల్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో తన నివాసంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంటుంది. విష్ణుప్రియ తరచూ వెంకటరత్నకుమారి మేకప్ చేసుకోవడానికి వెళ్తుటుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఇతర వస్తువులను చూస్తూ ఉండేది. అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న విష్ణుప్రియ ఒంటరిగా ఉన్న వెంకటరత్నకుమారి ఇంట్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుంది. విష్ణుప్రియ, మౌనిక ఇద్దరు కలిసి డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేకప్ కోసం వెంకటరత్నకుమారి ఇంటికి వెళ్లారు. మౌనికకు మేకప్ చేసే సమయంలో విష్ణుప్రియ రోకలిబండతో వెంకటరత్నకుమారి తలపై గట్టిగా కొట్టింది. ఆమె కిందపడిపోగానే చార్జింగ్ వైర్‌తో గొంతుకు చుట్టి హత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి నోటి నుండి రక్తం రాగానే చనిపోయిందనుకొని ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, బంగారు గాజులు, ఐఫోన్, తీసుకొని పరారయ్యారు. కొంతసేపటి తర్వాత వెంకటరత్నకుమారి స్పృహలోకి వచ్చి తనపై జరిగిన దాడి గురించి నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు అందిన 24 గంటలలోపే నింధితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.1,56 లక్షల విలువ గల 18 తులాల బంగారం, ఒక ఐఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును తొందరగా చేదించిన సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య, కె.జగన్నాదరెడ్డి, పోలీసు బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ క్రైం ఎస్కె.సలీమా, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
గుంటూరు, తెనాలిరూరల్: మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడిపై మరో ప్రియుడు కత్తితో హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఆలూరు త్రివేణి భర్తతో విడిపోయి, మల్లెపాడు పరిధిలోని ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన గోపి అలియాస్ గాలి గోపితో కొంతకాలం సహజీవనం చేసింది. అనంతరం అతనితో విడిపోయి సుమారు ఏడాదిగా సాలిపేటకు చెందిన వెండి వస్తువుల తయారీ కార్మికుడు సూరేపల్లి శ్రీనివాసరావు అలియాస్ వాసుతో సహజీవనం చేస్తోంది. ద్వారకానగర్‌లోనే గది అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అవివాహితుడైన వాసు అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చి వెళుతుండే వాడు. గోపితో పరిచయాన్ని ఇటీవలి కాలంలో తిరిగి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి త్రివేణి వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు, త్రివేణి నడవడిక గురించి ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. త్రివేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీనివాసరావు తన స్నేహితుడు జిలానిని తోడుకు పిలిపించుకుని ఇద్దరూ కలసి త్రివేణి ఇంట్లో పడుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వీరు ఉన్న ఇంటికి వచ్చిన గోపి కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తలకు, ఎడమ బుగ్గపై తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో అడ్డుకోబోయిన జిలాని ఎడమ చేతి వేలికి గాయమైంది. శ్రీనివాసరావును ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమాచారమందుకున్న డీఎస్పీ మందపల్లి స్నేహిత, త్రీ టౌన్ ఎస్ఐ బొడ్డు అశోక్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రివేణితో ఘర్షణ పడ్డాడన్న కారణంగానే వాసుపై గోపి హత్యాయత్నం చేశాడని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమోన్మాది వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా ఆ మృగాడు వదలలేదు. ఇంటికి వచ్చి హత్యాయత్నానికి తెగబడ్డాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గాయపడిన యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రేమోన్మాది పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఈస్ట్: వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా వెంటాడి మరీ హత్యాయత్నానికి తెగబడ్డాడు ఓ ఉన్మాది. ప్రేమ ముసుగులో ఉన్మాదిగా మారి యువతిని కత్తితో పొడిచి తర్వాత తనను తాను గాయపరుచున్నాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. జొన్నలగడ్డలో నివసించే పుప్పాల సాంబయ్య, సామ్రాజ్యం దంపతుల మూడో కుమార్తె దివ్య డిగ్రీ పూర్తి చేసింది. గుంటూరు అరండల్‌పేటలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్ని నెలలు పనిచేసింది. అదే సమయంలో మాచర్లకు చెందిన బాలాజీనాయక్ అనే యువకుడు దివ్య వద్ద అసిస్టెంట్ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేశాడు. తనను ప్రేమించమంటూ వెంట పడ్డాడు. అతని వేధింపులకు భయపడిన దివ్య ఉద్యోగం మానేసి కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం దివ్య ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బాలాజీ నాయక్ ఆమె వద్దకు వచ్చాడు. తనను ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దివ్య నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. మళ్లీ పొడిచే ప్రయత్నం చేయగా దివ్య పెద్దగా కేకలు వేస్తూ చేతులు అడ్డం పెట్టడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దివ్య తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోవడంతో.. ఇంట్లో ఉన్న కుక్కర్ మూతతో బాలాజీనాయక్ తనను తాను తలపై కొట్టుకుని గాయపరుచుకున్నాడు. అలజడికి అక్కడికి చేరుకున్న స్థానికులు వారిద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. దివ్య ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నా, ప్రాణాపాయం లేదని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
అనంతపురం, ఆత్మకూరు: ఆస్తి కోసం కన్నతండ్రిపైనే హత్యాయత్నం చేసిన కుమారులు, కూతురి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణస్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనక శనివారం అడిగారు. ఆస్తి పంచడానికి నిరాకరించిన నారాయణస్వామికి కళ్లల్లోకి కారం కొట్టి, గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి అనంతపురంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు
అనంతపురం, ఉరవకొండ: వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిన భార్యపై ఉపాధ్యాయుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాకెట్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌరిశంకర్‌కు ఉరవకొండకు చెందిన సరస్వతితో 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. గౌరీశంకర్ మండలంలోనే పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో సహజీవనం కూడా చేస్తున్నాడు. దీనిపై నిలదీసిన భార్యను వేధించేవాడు. పెద్దలు జోక్యం చేసుకుని.. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని సూచించినా పద్ధతి మార్చుకోలేదు. ఎలాగైనా తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలని భావించిన సరస్వతి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఉపాధ్యాయ, మహిళా సంఘాల ప్రతినిధులతోపాటు రాజకీయ నాయకులను కలిసి గోడు వెల్లబోసుకుంది. విషయం తెలుసుకున్న గౌరీశంకర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సరస్వతిని ఇష్టానుసారంగా చితకబాదాడు. తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు ఉపాధ్యాయసంఘాల నాయకులతోపాటు జెడ్పీటీసీ తిప్పయ్య సహకారంతో శుక్రవారం రాత్రి ఉరవకొండ పోలీసుస్టేషన్లో ఎస్ఐ జనార్దన్‌నాయుడుకు ఫిర్యాదు చేసింది. -
వైఎస్సార్సీపీ నేత హత్యకు కుట్ర?
అనంతపురం సెంట్రల్: కనగానపల్లి మండలం సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ముత్యాలు అలియాస్ పైలెట్ ముత్యాలు హత్య కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజ్ఞాత వ్యక్తి అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టిం చేందుకు మంత్రి పరిటాల వర్గం హత్యా రాజకీయాలకు తెరలేపుతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్యకు కుట్ర జరిగినవిషయం కలకలం రేపుతోంది. కనగానపల్లి మండలం సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షుడు, కోనాపురం గ్రామానికి చెందిన ముత్యాలు హత్యకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి దుండగులను ఉసిగొల్పారు. దీని వెనుక మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, ఆమె సోదరుడు బాలాజీతో పాటు టీడీపీ నాయకులు రవీంద్ర, లవకుమార్‌లు ఉన్నట్లు ముత్యాలు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామంలో రెండు వారాల క్రితం టీడీపీ నాయకుని కుమార్తె అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుని కుమారునితో వెళ్లిపోయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లి రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పరువు హత్య చేయడానికి పథకం రచించారు. రెండు వారాల నుంచి గాలిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి సునీత సోదరుడు బాలాజీని ఆశ్రయించినట్లు సమాచారం. సదరు ప్రేమజంటకు వైఎస్సార్సీపీ నాయకుడు ముత్యాలు ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానించారు. దీంతో తొలుత ముత్యాలను హత్య చేస్తే వారే బయటకు వస్తారని భావించి అదే మండలానికి చెందిన పాత నేరస్తుడు, టీడీపీ నాయకునికి రూ.10 లక్షలు సుపారీ ఇచ్చినట్లు ముత్యాలుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్రమత్తం చేసిన అజ్ఞాత వ్యక్తి హత్యకు జరుగుతున్న కుట్రను ఓ అజ్ఞాత వ్యక్తి ముత్యాలుకు చేరవేశాడు. నిన్ను హత్య చేయాలనే కుట్ర జరుగుతోందని, బయటకు రావద్దని సూచించాడు. మరికొంత సమాచారం కూడా బాధితునికి చేరవేశాడు. అయితే సదరు అజ్ఞాత వ్యక్తి చెప్పిన విధంగానే ఈ నెల 27న కొంతమంది మారణాయుధాలతో పోలీసులకు పట్టుపబడినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు అనంతపురం పోలీసులే నిందితులను కస్టడీలో ఉంచుకొని విచారించినట్లు సమాచారం. అనంతరం కేసు బయటకు పొక్కకుండా ధర్మవరం పోలీసులకు అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. కేసును తప్పుదోవ పట్టించడానికి నేరుగా ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసులు ఈ హత్య కుట్ర సమాచారాన్ని బయటకు చెప్పడం లేదని సమాచారం. రక్షణ కల్పించండి నా హత్యకు కుట్ర జరిగింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్, బాలాజీ, టీడీపీ నాయకులు రవీంద్ర, లవకుమార్‌లు ఉన్నట్లు తెలిసింది. నాకు సంబంధం లేని కేసులోకి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా. కుట్ర ఉదంతాన్ని వివరించడంతో పాటు రక్షణ కల్పించాలని మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించా. – ముత్యాలు, వైఎస్సార్సీపీ నాయకుడు, కోనాపురం, కనగానపల్లి మండలం నేను సెలవులో ఉన్నా హత్యకు కుట్రపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను సెలవులో ఉన్నా. దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు కానీ, అనంతపురం నుంచి ఇక్కడికి తరలించినట్లు కానీ తెలియదు. – వెంకటరమణ, డీఎస్పీ, ధర్మవరం -
అత్తామామలపై హత్యాయత్నం
అనంతపురం ధర్మవరం అర్బన్: భూ తగాదాల నేపథ్యంలో అత్తమామలపై మేనల్లుడు కొడవలితో హత్యాయత్నం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లిలో నివాసముంటున్న దాసరి నారాయణస్వామి, అలివేలమ్మ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణస్వామి తండ్రి యల్లప్పకు ప్రభుత్వం కుణుతూరు పొలంలో 3.15ఎకరాల భూమి మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నారాయణస్వామి తన అక్క కపాడం సాలమ్మ కుమారుడు కపాడం శివయ్యకు రూ.2.80 లక్షలకు అమ్మాడు. కాగా నారాయణస్వామి బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని, అది వర్తించాక భూమిని రిజిష్టర్ చేయిస్తానని చెప్పగా శివయ్య అందుకు అంగీకరించాడు. అనంతరం వారి మధ్య మనస్పర్థలు రావడంతో శివయ్యకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఈ భూమి విషయంపై పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం ఉదయం దాసరి నారాయణస్వామి, భార్య అలివేలమ్మ తోటలో పాలు పితుకుతుండగా కపాడం శివయ్య కొడవలితో వెళ్లి అత్త దాసరి అలివేలమ్మపై దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గమనించిన నారాయణస్వామి అడ్డుపడగా అతనిపై కూడా దాడి చేశాడు. వారి కేకలు విన్న స్థానికులు అక్కడికి రాగానే శివయ్య పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి, అలివేలమ్మలను బంధువులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ తండ్రి అమానుషం
కర్నూలు ,ఆదోని: ఓ కసాయి కన్నతండ్రి అనుమానపు రాక్షసి ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎవరినో ప్రేమించిందనే కక్షతో కన్నకూతురు అంజలి (17)ని వెంటాడి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతోంది. శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి రంగమ్మ, మేనత్త లక్ష్మీ, సోదరులు కల్యాణ్, ఈశ్వర్, టూటౌన్ ఎస్ఐ మస్తాన్ వలీ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌లో నివాసముంటున్న అంజలికి శుక్రవారం సాయంత్రం ఫోన్ వచ్చింది. ఇంట్లోనే ఉన్న తండ్రి జహంగీర్ అలియాస్ జానీ ఫోన్ తీశాడు. ఓ వ్యక్తి హలో అనడంతో ఫోన్ కట్‌చేసి ఇంట్లోనే ఉన్న అంజలిని నిలదీశాడు. తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోతే ఎవరో అబ్బాయి ఫోన్ ఎందుకు చేశాడంటూ కర్రతో ఇష్టానుసారం కొట్టాడు. ఆ సమయంలో తల్లి రంగమ్మ, ముగ్గురు సోదరులు ఇంట్లో లేరు. దెబ్బలకు తాళలేక అంజలి శంకర్‌నగర్‌లో ఉన్న మేనమామ దుర్గ ఇంటికి వెళ్లింది. అయితే ఆయన లేడు. దీంతో మేనమామ భార్య లక్ష్మీతో జరిగిన విషయం చెప్పింది. తాను మాట్లాడతానంటూ ఆమె బాధితురాలిని ఓదార్చే యత్నం చేస్తుండగానే కత్తితో వెళ్లిన జానీ విచక్షణారహితంగా అంజలిని పొడిచాడు. అడ్డువచ్చిన లక్ష్మీని లాగేశాడు. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీధిలో ఉన్నవారంతా పరుగెత్తుకొచ్చి ఆమెను రక్షించారు. జనం రావడంతో జానీ పరారయ్యాడు. అప్పటికే ఆమె ఒంటిపై 12 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. ఒంటినిండా కత్తిపోట్లతో రక్తమోడిన అంజలి అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. తాగుడుకు బానిసైన తన భర్త జానీకి మానవత్వం లేదని, ఏ పాపం ఎరుగని కూతురుపైనే కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడంటూ భార్య రంగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. టూటౌన్ ఎస్ఐ మస్తాన్‌వలి ఆస్పత్రికి వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. బాధితురాలి తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. -
నడిరోడ్డుపై హత్యాయత్నం
సైదాబాద్: మొన్న ఎర్రగడ్డలో మాధవిపై దాడి చేసిన మనోహరాచారి... నిన్న అత్తాపూర్‌లో రమేష్‌ను నరికిచంపిన కిషన్, మల్లేష్... తాజాగా ఆదివారం రాత్రి సైదాబాద్‌లో ఆటోడ్రైవర్ అర్జున్‌పై హత్యాయత్నం... నగరంలో వరుసపెట్టి నడిరోడ్డుపై జరిగిన దారుణాలివి. పాత కక్షల నేపథ్యంలో ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గతంలో జరిగిన రెండు ఉదంతాల మాదిరిగానే అర్జున్ విషయంలోనూ స్థానికులు సరైన రీతిలో స్పందించకుండా చోద్యం చూశారు. ఈ ఘటన పూర్వాపరాలివీ... ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి గుడిసెల్లో నివసించే గోపి, మహేష్, సభావత్ లక్ష్మణ్, పవన్ ఫంక్షన్ హాళ్లలో క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. వారం రోజు క్రితం ఓ ఫంక్షన్ హాల్లో పని చేసిన వీరు అర్ధరాత్రి వేళ చంపాపేట్ నుంచి తమ ఇళ్లకు వెళ్లేందుకు మాదన్నపేటకు చెందిన అర్జున్ ఆటోను మాట్లాడుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కిరాయి విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. అర్జున్ ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నా ఆపై ఎవరికి వారు తమ తమ ఇళ్ళక వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి అర్జున్ ఓ ప్రయాణికుడిని భానునగర్‌లో దించేందుకు వెళుతుండగా భానునగర్ సమీపంలో వీరు నలుగురు డ్రైవింగ్ సీటులో ఉన్న అర్జున్ గుర్తించి ఆటోను ఆపారు. అతడిని ఆటోలోంచి బయటికి లాగి దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై పడేసి కాళ్ళు, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా సమీపంలో ఉన్న రాళ్లు తెచ్చి అర్జున్ తల, మెడ, వీపు భాగాల్లో ఒకరి తరా>్వత ఒకరు కొట్టారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోగా... రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులు చూస్తూ కూడా పట్టనట్లు వ్యవహరించారు. దాదాపు పది నిమిషాల పాటు అర్జున్‌పై దాడి జరుగుతున్నా ఎవరూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తీవ్రంగా గాయపడిన బాధితుడు తేరుకుని తానే ఫోన్ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చేవరకు రోడ్డు పైనే పడిపోయి ఉన్న అర్జున్ను కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపై సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం నలుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మోహన్‌రావు తెలిపారు. -
చిత్తూరులో వ్యక్తిపై హత్యాయత్నం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పూలమార్కెట్‌కు చెందిన మోహన్ అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. చవితిను పురస్కరించుకుని బజారువీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మోహన్ అతని అనుచరులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు రోడ్డులోని కట్టెలదొడ్డికి చెందిన శరవణ అనే వ్యక్తి ఊరేగింపులో పాల్గొని గొడవ చేశాడు. దీనిపై మోహన్, శరవణల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో శరవణ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని మోహన్ తలను నరకడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్కడే డ్యూటీలో ఉన్న సీఐ మోహన్‌ను పక్కకు తోసేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా శరవణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని మోహన్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు గాయపడ్డ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరుడు కావడంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. -
రాడ్లు, కత్తులతో బీభత్సం
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు తంగెళ్ళమూడి కబాడీగూడెంలో ఒక వ్యక్తిపై ఐదుగురు రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు. నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దాడికి తెగబడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. తలపై తీవ్ర గాయాలు కావటంతో వెంటనే బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సనిమిత్తం గుంటూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుడి బంధువులు, కుటుంబ సభ్యులు చేరటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కబాడీగూడెంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాం దోళనలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు తంగెళ్ళమూడి 50వ డివిజన్ కబాడీగూడెంకు చెందిన కాశీ సత్యనారాయణ అలియాస్ సతీష్, అలియాస్ కాశీ (28)పై గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతని ఇంటివద్దనే ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో తీవ్రంగా నరికారు. అక్కడే ఉన్న రాళ్ళతో తలపైనా, చాతీపైనా కొట్టటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సతీష్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తలపై కత్తులతో నరకటంతో తీవ్రంగా రక్తస్రావం కావటంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు. కాశీ సత్యనారాయణ అలియాస్ సతీష్‌పై పాతకక్షల నేపథ్యంలోనే హత్య చేసేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు. సతీష్‌పై కత్తులు, రాడ్లతో దాడి చేసిన వారిలో మున్నుల సీతయ్య, మున్నుల సాయి, మున్నుల శివ, మున్నుల మూర్తి, మున్నుల వెంకన్న అనే వ్యక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో రౌడీషీటర్ జొన్నకూటి రాటాలుతో గొడవలు జరగటం, కొంత వివాదం నేపథ్యంలో అదను కోసం వేచిఉన్నట్లు సమాచారం. దీంతో గురువారం ఉదయం నుంచి కొబ్బరి శివ, జొన్నకూటి రాటాలు సతీష్‌కు బాగా మద్యం తాగించారని తెలుస్తోంది. మద్యం సేవించి ఉన్న సతీష్‌పై దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వటంతో ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో హత్యాయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఏలూరు టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.కాశీ సత్యనారాయణపై హత్యాయత్నంతో కబాడీగూడెం ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇరు వర్గాలు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ కారే బాబూరావు పోలీసులను కోరారు. -
పాశవిక హత్యాయత్నం !
జిల్లాలోని హనుమాన్‌జంక్షన్‌లో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు, మెడ కోశాడు. కాళ్లను వైర్‌తో కట్టేసి ఊడిపోకుండా ట్యాగ్లు వేశాడు. ముఖాన్ని కవర్‌తో ముసుగు వేసి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వాళ్లకు కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. హనుమాన్‌జంక్షన్ రూరల్ : హనుమాన్ జంక్షన్లో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. కాళ్లు కట్టేసి, చేతులను కత్తితో అత్యంత క్రూరంగా నరికి వేయటం, ముఖానికి పూర్తిగా కవర్ చుట్టి వేసిన అఘాయిత్యం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇరుగుపొరుగు వాళ్లకు ఆమె కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పైశాచికంగా హత్యాయత్నం చేశారు. మహిళ శరీరంపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచి శాడిజాన్ని చూపించారు. హత్యాయత్నం చేసిన వారు పరారైన తర్వాత బాధితురాలు రక్తపు మడుగులో దాదాపు 36 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజమండ్రికి చెందిన పల్లె పద్మ, సూర్యనారాయణలకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉన్న వీరు ఆ తర్వాత జంక్షన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సూర్యనారాయణకు ఉద్యోగం రావటంతో ఇక్కడకు మకాం మార్చారు. పద్మ కూడా ఏలూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంది. అప్పటి వరకూ సాఫీగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో భర్తతో విభేదించిన పద్మ కొద్దికాలంగా ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్ అనే వ్యక్తితో సహ జీవనం చేస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్‌లో పద్మ బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా, నూతనకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో వీళిద్దరూ కలిసి అద్దెకు దిగారు. ఈ నెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గరే ఉంటున్న తన పెద్ద కూతురుతో ఫోన్లో పద్మ ఆ రాత్రే చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె తన తండ్రి సూర్యనారాయణకు విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు శనివారం ఉదయం వచ్చి తలుపులు తీయటంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. జంక్షన్ పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో పద్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికివేయటం, కాళ్లు రెండు వైర్‌తో కట్టేసి, మళ్లీ ఆ వైర్ ఊడిపోకుండా ట్యాగ్లు వేయటం, ముఖానికి కవర్‌తో ముసుగు వేయటం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల పైశాచికత్వాన్ని తెలియజేస్తున్నాయి. పద్మ పడి ఉన్న గదిలో ఇంజక్షన్లు, సిరంజన్‌లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశ్యంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా 24వ తేదీ ఉదయమే హత్యాయత్నం జరిగి ఉండవచ్చని ఘటనాస్థలిలో ఎండిపోయిన రక్తపు మరకలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ హత్యాయత్నంపై జంక్షన్ సీఐ వైవీవీఎల్. నాయుడు, ఎస్ఐ వి.సతీష్ ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పద్మతో కలిసి సహజీవనం చేస్తున్న ఏలూరుకు చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో ఆ అనుమానానికి మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ సహ జీవనం ప్రారంభించిన తర్వాత నూతనకుమార్ వ్యవహారంతో విసుగు చెందిన పద్మ గతంలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే నిందితుడిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
టిఫిన్ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం చిన్న వంతెన వద్ద గల ఆమని హోటల్ యాజమాని నల్లా సాయిబాబుపై ఓ వ్యక్తి రౌడీయిజం చేయడమే కాకుండా, హత్యాయత్నం చేశాడు. అమలాపురం ఉప్పరకాలనీకి చెందిన కోసూరి ప్రసాద్ అనే వ్యక్తి రోజూ ఆ హోటల్‌కు వచ్చి టిఫిన్లు తిని డబ్బులు ఇవ్వకుండా ఘరానాగా వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ప్రసాద్ హోటల్‌కు వచ్చి టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నప్పుడు హోటల్ యాజమాని సాయిబాబు డబ్బులు ఇవ్వమని అడిగారు. నేను లోకల్...నన్నే డబ్బులు అడుగుతావా? అంటూ రౌడీయిజం చేశాడు. అక్కడే ఉన్న స్థానిక మార్కెట్‌కు చెందిన అమలదాసు గోవిందు అతడిని వారించాడు. అయినా ప్రసాద్ హోటల్ యాజమానిని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి బ్లేడ్ తీసి సాయిబాబు పీక కోసేందుకు ప్రయత్నించాడు. సాయిబాబు త్రుటిలో తప్పించుకున్నా అతని ఎడమ బుగ్గ, పెదవి చీరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అలాతప్పించుకున్న సాయిబాబుపై బ్లేడ్‌తో దాడి చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తుండడంతో స్థానికులు అతడిని అదుపు చేశా రు. తీవ్ర రక్తస్రావం అదుతున్న సాయిబాబును తక్షణమే అత్యవర వైద్యం కోసం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడైన హోటల్ యాజమాని సాయిబాబు ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. కత్తులతోనే కాదు బ్లేడ్‌తో దాడి చేసినా రౌడీయిజం, హత్యాయత్నానికి పాల్పడినట్టేనని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు అన్నారు. ఎస్సై పి.విజయశంకర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
భర్తపై హత్యాయత్నం.. ఆపై ఆత్మహత్య
పశ్చిమగోదావరి, పాలకోడేరు: భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకుంది. అర్ధరాత్రి అతడు నిద్రపోతున్న వేళ కత్తితో దాడి చేసి పలుసార్లు పొడిచింది. భర్త మరణించాడని భావించి ఆపై ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి పాలకోడేరు మండలం గొరగనమూడిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గొరగనమూడిపాలెంకు చెందిన బొక్కా తులసి (55), బొక్కా సత్యనారాయణ (60) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో వివిధ చోట్ల స్థిరపడ్డారు. ఆ దంపతులు మాత్రం గొరగనమూడిపాలెంలో కాపురం ఉంటున్నారు. తులసికి ఎప్పటి నుంచో భర్త సత్యనారాయణపై అనుమానం ఉంది. తులసి కొన్నాళ్లుగా అల్సర్‌తో బాధపడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను భర్త పట్టించుకోవడం లేదని, ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సత్యనారాయణ నిద్రపోయిన తర్వాత కర్రతో అతడి తలపై మోది కత్తితో శరీరంపై పలుచోట్ల పొడిచేసింది. భర్త చనిపోయాడని భావించిన అనంతరం పక్కగదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సత్యనారాయణ తీవ్ర గాయాలతో రక్తమోడుతూ బయటకు వచ్చి పొరుగు వ్యక్తి సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. హత్యాయత్నం, ఆత్మహత్యపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంత వయసు వచ్చినా దాంపత్య జీవితంపై అవగాహన లేక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సైకాలజిస్ట్ డాక్టర్ బి.చలపతిరావు వ్యాఖ్యానించారు. -
కుటుంబ కలహాలతో సవతి తల్లిపై హత్యాయత్నం
నల్లబెల్లి జయశంకర్ జిల్లా : కుటుంబ కలహాలతో సవతి తల్లిపై కుమారుడు పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూర సాంబయ్య తన మొదటి భార్య 20 ఏళ్ల క్రితం చనిపోగా విజయను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు రాజుకుమార్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాజుకుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి కరెంట్ బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం కుటుంబంలో గొడవ జరగగా అతడు విజయ–సాంబయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. కాగా వారు పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఆగ్రహనికి గురైన రాజుకుమార్ ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి ఇంటి ముందున్న సవతితల్లిపై పోసి నిప్పంటిం చేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్‌కుమార్ ఇంటి ఆవరణలో ఉన్న తండ్రి ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దహనమైంది. దీంతో బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. -
కులాంతర వివాహం చేసుకుందని..
బెజ్జంకి(సిద్దిపేట): కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన చిట్టం పెల్లి మౌనిక 12 రోజుల క్రితం మండలంలోని తోటపల్లికి చెందిన తన డిగ్రీ క్లాస్మేట్ సొల్లు సాయిని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆపై తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం శనివారం బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు రావల్సిన మౌనికతో సోదరుడు నాగరాజు ఘర్షణ పడ్డాడు. పరువు తీస్తున్నావంటూ కత్తితో దాడికి పాల్పడటంతో ఆమె వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నాగరాజు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మౌనికను తాతయ్య, స్థానికులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ పిల్లలు హత్యాయత్నం చేశారట!
యోగీ ఆదిత్యనాథ్ పాలన ఉత్తర ప్రదేశ్ లో దళిత కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పట్టుమని పన్నెండేళ్ళు కూడా నిండని తమ పిల్లలు కేవలం దళితులు అయిన నేరానికి గత రెండు నెలలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారని దళిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టు చేసే ముందు నువ్వు చమర్‌వా? లేక జాతవా? అని ప్రశ్నించి మరీ అరెస్టు చేసినట్టు వారారోపిస్తున్నారు. ‘‘నా కొడుకు సచిన్. సెయింట్ దేవ్ఆశ్రమంలో చదువుకొంటున్నాడు. కోచింగ్ క్లాసుల గురించి తెలుసుకునేందుకు బయటకెళ్ళిన 15 ఏళ్ళ నా కొడుకుని పట్టుకుని జైల్లో పెట్టారు.’’సచిన్ తండ్రి 62 ఏళ్ళ ధర్మవీర్ సింఘ్ ఆవేదన ఇది. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసుల్లో ఎటువంటి విచారణ లేకుండా నేరుగా అరెస్టులు చేసే అధికారాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా దళిత సంఘాల నేతృత్వంలో ఏప్రిల్ 2 న ఇచ్చిన భారత్ బంద్ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చెలరేగిన హింసలో పన్నెండు పదమూడేళ్ళ బాలురు ముగ్గురిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పదిహేను సెక్షన్లకింద వివిధ నేరాలు మోపి, గత రెండు నెలలుగా అమాయకులైన వారిని అన్యాయంగా జైల్లో నిర్బంధించినట్టు ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. భారత్ బంద్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లలో హింస చెలరేగింది. అది పోలీస్ ఫైరింగ్‌కి దారితీసిన విషయం తెలిసిందే. మా పిల్లలు చేసిన నేరమల్లా దళితులుగా పుట్టడమే నంటాడు ధర్మవీర్. చదువుకొని మమ్మల్నాదరిస్తాడనుకుంటే ఇలా జైల్లో మగ్గిపోతున్నాడని ఆవేదన చెందుతున్నారు ధర్మవీర్, అతని భార్య రామేశ్వరి. బాలనేరస్తులకోసం కేటాయించిన జువైనల్ హోంలో కాకుండా మీరట్ జైల్లో పెద్ద పెద్ద నేరగాళ్ళ సరసన సచిన్‌ని ఉంచారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచిన్ ఆధార్‌కార్డుని, స్కూల్ స్టేట్మెంట్ని పోలీసులకు చూపించినా జువైనల్ హోంకి పంపేందుకు వాళ్ళు నిరాకరించారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలియాగరి, సరైకాజి దళితవాడల్లో కుటుంబాలను ఈ అరెస్టులు కలవరపెడుతున్నాయి. సరైకాజికి చెందిన రోష్ని కొడుకు పన్నెండేళ్ళ అజయ్‌ది కూడా ఇదే కథ. ఐదో తరగతి చదువుతున్న అజయ్‌ని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. ఏప్రిల్ 2వ తేదీన మందులు తెస్తానని తల్లికి చెప్పి వెళ్ళిన అజయ్ రెండు రోజులు ఏమయ్యాడో తెలియదు. వికలాంగురాలైన అజయ్ తల్లి రోష్ని చివరకు తన కొడుకు ఆచూకీ తెలుసుకుని జైలుకెళ్లింది. అజయ్‌ని సైతం అరెస్టు చేసే ముందు నువ్వు చమర్‌వా అని ప్రశ్నించినట్టు రోష్ని వివరించారు. 12 ఏళ్ళు కూడా నిండని నా కొడుకు ఇంత పెద్ద నేరాలకు ఎలా పాల్పడతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. చేయని నేరానికి చిన్న పిల్లలను అరెస్టు చేయడమే కాకుండా, వారిని కలవడానికెళ్ళిన వారిని కూడా జైల్లో పడేస్తామని బెదిరిస్తున్నట్టు ఆమె ఆరోపించారు. పై అధికారులనుంచి తమకు ఆదేశాల్లేవంటూ రెండు నెలలుగా చిన్నపిల్లలను వదలిపెట్టడంలేదన్నారామె. కలియాగరీ కి చెందిన 35 ఏళ్ళ సుందరి, నానక్ చంద్ల పన్నెండేళ్ళ కొడుకు అభిషేక్ ని సైతం ఏప్రిల్ 2వ తేదీన చౌదరి చరన్ సింఘ్ యూనివర్సిటీ దగ్గర మంచినీళ్ళు తాగుతున్నవాడిని తాగుతున్నట్టే అరెస్టు చేసారు. ఈ బాలుడిని కూడా అరెస్టు చేసే ముందు కులం గురించి ఆరాతీసారు. ప్రస్తుతం జువైనల్ జైల్లో పెట్టినా లాకప్‌లోనే తన కొడుకుని రోజూ కొట్టేవారనీ అభిషేక్ తల్లిదండ్రులు చెప్పారు. కులం అడిగి మరీ తనను అరెస్ట్ చేసినట్టు అభిషేక్ తల్లిదండ్రులకు వివరించాడు. ఐపిసి 147, 149, 332, సెక్షన్ 353, 336, 435, చివరికి హత్యాయత్నం 307, సెక్షన్ 395 దోపిడీ నేరం, శాంతిని భగ్నం చేసినవారిపై పెట్టే 504, సెక్షన్ 120(బి)కుట్ర, సెక్షన్ 427లకు తోడు తీవ్రమైన నేరారోపణలు సెక్షన్ 7, ఐపిసి 1932 యాక్టు, 1984(4) ప్రివెన్షన్ ఆఫ్ డామేజింగ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ లాంటి తీవ్రమైన నేరాలను ఈ ముగ్గురు మైనర్ బాలురపైనా మోపారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం వీరి వయస్సుని ఎక్కువగా చూపించి దాదాపు 15 రకాల సెక్షన్లకింద అందరిపైనా ఒకేరకమైన నేరాలను మోపడం ఈ కేసులోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోందని వీరి తరపు న్యాయవాది సతీష్‌కుమార్ వాదిస్తున్నారు. -
ఈ రోజు దొరికావు చంపుతాను
ప్రొద్దుటూరు క్రైం : అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కుమారుడు వైఎస్సార్సీపీ కార్యకర్తను చంపేందుకు పిడి బాకు తీసుకొని వెంటాడిన సంఘటన ఆదర్శ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదర్శకాలనీకి చెందిన తిరుపాలు కూలి పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు వీధిలో చాలా మంది వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఉన్న మనస్పర్థలను సాకుగా చూపి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కాకి తిరుపతమ్మ కుమారుడు సురేంద్ర వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవ పెట్టుకునేవాడు. తిరుపాలు, ప్రసాద్, పెంచలయ్యతో పాటు కొందరు యువకులు దారిలో నిల్చొని ఉన్నా ‘ నేను వస్తుంటే మీరు వెళ్లి పోవాలి.. లేదంటే చంపేస్తాను’ అని వారిని బూతులు తిడుతూ బెదిరించేవాడు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా సురేంద్ర అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే పిడి బాకు తీసి అతను చంపుతానని బెదిరించాడన్నారు. పండుగ రోజు కావడంతో ఆ రోజు వారు స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. అప్పటి నుంచి వీరు భయ పడుతూ తిరిగే వారు. ఈ క్రమంలో మంగళవారం ఆదర్శకాలనీ సమీపంలోని గవిని దగ్గర ఉండగా సురేంద్ర అక్కడికి వచ్చి ‘ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావ్.. ఈ రోజు దొరికావు చంపుతాను ’ అంటూ తన వద్ద ఉన్న పిడి బాకు తీసి పొడవడానికి ప్రయత్నించగా తిరుపాలు ప్రాణ భయంతో పరుగులు తీశాడు. అయినా అతను కొంత దూరం వెంబడించాడు. తమను టార్గెట్ చేసి చంపేందుకు కాచుకొని ఉన్న కాకి సురేంద్రపై తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని తిరుపాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టు టౌన్ పోలీసులు తెలిపారు. -
యోగా టీచర్ హత్య కేసు నిందితుడిపై హత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: యోగా టీచర్ హత్య కేసులో నిందితుడిపై హత్యాయత్నం జరిగింది. మర్రిపాలెం ‘వుడా’ లే అవుట్ లో శుక్రవారం అర్ధరాత్రి వెంకటరమణ అనే యోగ టీచర్‌ను ఇంట్లోనుంచి బయటకు పిలిచి నలుగురు దుండగులు రాడ్లతో కొట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడు కీలపర్తి వెంకట రమణపై ఆదివారం ఉదయం హత్యా యత్నం జరిగింది. కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను పోలీసులు కేజీజీహెచ్కు తరలించారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో..
సాక్షి, గుంటూరు: అనుమానం పెనుభూతమై తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసేందుకు యత్నించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రామాంజనేయలు, అరుణలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం!
భామిని: అధికార పార్టీ నాయకులు మరోసారి వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి చేశారు. తనపై హత్యాయత్నం చేశారని వైఎస్సార్సీపీ నాయకుడు అగతముడి శేషగిరి పోలీస్‌లకు సోమవారం ఫిర్యాదు చేశారు. శేషగిరి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కొరమలో టీడీపీ నాయకులు శేషగిరి, అతని భార్య విశాలాక్షిపై దాడి చేశారు. వీరు కొత్తూరు ఆస్పత్రిలో వైద్య సేవలు పొంది ఇంటికి చేరిన సమయంలో మరోసారి వీరిపై దాడి చేశారు. వీరిని మళ్లీ కొత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బత్తిలి ఏఎస్సై విశ్వనాథం కేసు నమోదు చేశారు. కాగా కొత్తూరు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు బత్తిలి సర్పంచ్ టింగ అన్నాజీరావు, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు అగతముడి రఘుపతి నాయుడు పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కొరమలో పోలీస్ పికెటింగ్ వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొరమలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పాతపట్నం సీఐ బి.వి.వి ప్రకాశరావు, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు ఆధ్వర్యంలో పహారా ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం
ఇద్దరి అరెస్ట్ కేకే.నగర్ : పాండిచ్చేరి తిరుభువనం సమీపంలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో చొరబడి హత్యకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుభువనం సమీపంలో కుచ్చిపాలయంకు చెందిన ముత్తువేల్ (40) తిరుభువనై డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సోమవారం ముత్తువేల్ ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు అతని ఇంట్లోకి చొరబడి హత్య చేయడానికి యత్నించారు. వారి నుంచి ముత్తువేల్ పారిపోవడానికి యత్నించగా అతడిని వారు వెంబడించారు. వారిని అడ్డుకోవడానికి సోదరి కుమారుడు సంతోష్‌ను ఆ యువకులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకుని తిరుభువనై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలిసి ముత్తువేల్ బంధువులు ఆందోళనకు దిగారు. తిరుభువనై పోలీసులు విచారణ జరిపారు. కదిరవన్ (23), కృపాకరన్ (23) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో ముత్తుపై హత్యాయత్నం చేసింది తామేనని నేరం అంగీకరించడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. -
లేడీ బాస్‌పై హత్యాయత్నం.. నిందితుడి అరెస్టు
తన మాజీ లేడీ బాస్‌ను గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ పన్వర్ అలియాస్ కల్లూ (27) అనే వ్యక్తి ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనర్ అయిన కావేరి లాల్ (27) వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె బోయ్‌ఫ్రెండుతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తీసేసిన తర్వాత కూడా అతడు నెల రోజుల జీతం ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. ఈనెల 14వ తేదీన కారు సరిగా పార్కింగ్ చేయాలన్న పేరుతో కావేరిలాల్ను పన్వర్ ఆమె ఇంటినుంచి బయటకు పిలిచి, తన బాకీ ఏమైందని అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మాక్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. అతడు ఎక్కడ ఉంటాడోనన్న అనుమానంతో పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించారు. చివరకు అతడి ఏటీఎం లావాదేవీలపై కూడా కన్నేసి ఉంచారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక నైట్ షెల్టర్‌లో ఉన్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేశారు. పన్వర్‌కు పెళ్లయ్యి, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. -
బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం
మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే డ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి చేశాడు. గ్యారంపల్లికి చెందిన రెడ్డి శేఖర్(30) సోమవారం మధ్యాహ్నం బస్టాండ్‌లో నిలబడి ఉండగా ఓ ఆగంతకుడు అతడిని కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. అక్కడున్న వారు కేకలు వేయటంతో ఆ వ్యక్తి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
కొడుకు కాదు.. కిరాతకుడు..
భార్యతో కలసి తల్లిదండ్రులను చంపేందుకు యత్నం.. నల్లబెల్లి(నర్సంపేట): తల్లిదండ్రుల నోట్లో బలవంతంగా గడ్డిమందు పోసి వారిని చంపేందుకు భార్యతో కలసి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. వారు పెనుగులాడడంతో బతికిబయటపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి శివారు గొల్లెపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గాధం కేతమ్మ–బొంద్యాలుకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తె భర్త కన్నుమూయగా.. ఆమెకు చెందిన నగలను కుమారుడు మహిపాల్ తీసుకున్నాడు. వాటిని ఫైనాన్స్‌లో కుదువపెట్టాడు. కుమార్తె తన నగలను అడిగినప్పుడల్లా తల్లిదండ్రులు మహిపాల్‌ను ప్రశ్నించేవారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న కొడుకు తన భార్య మానసతో కలిసి తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు పలుమార్లు గొడవ పడేవాడు. రెండు రోజుల క్రితం కూడా గొడవ జరగగా.. ఆదివారం వారు కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపం.. తరచూ నగలు అడుగుతున్నారని వారు రాత్రి పడుకున్న తర్వాత 11 గంటల సమయంలో మహిపాల్– మానసలు ఇంట్లోని గడ్డిమందును తల్లిదండ్రుల నోట్లో పోసేందుకు ప్రయత్నించారు. వారు పెనుగులాడడంతో దుస్తులపై పడింది. దీంతో వారు సోమవారం మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై మేరుగు రాజమౌళి వివరణ కోరగా గడ్డిమందు నోట్లో పోసి చంపేందుకు ప్రయత్నించారని గాధం కేతమ్మ–బొంద్యాలు ఫిర్యాదు చేశారని, ఇందులో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. -
తల్లి, కుమారుడిపై కత్తితో దాడి
-
తల్లి, కుమారుడిపై కత్తితో దాడి
విజయవాడ: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర సోమవారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా శంకర్ అనే వ్యక్తి వారిపై కత్తితో దాడి చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లీ,కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పద్మతో గతంలో శంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వీరిమధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, అవే హత్యాయత్నానికి దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
వృద్ధురాలిపై పేపర్ బోయ్ హత్యాయత్నం
వైఎస్సార్ జిల్లా: పొద్దున్నే పేపర్ వేయటానికి వచ్చిన ఓ యువకుడు ఒంటరిగా ఉన్న మహిళను దోచుకుని, చంపేందుకు యత్నించాడు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెండు కుళాయిల వీధిలో ఉండే సుబ్బయ్య ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి. ఆయన శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లగా భార్య సావిత్రమ్మ ఒంటరిగా ఉంది. అదే సమయంలో వచ్చిన పేపర్ బాయ్ డోర్ కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తెరిచిన సావిత్రమ్మను బెదిరించి ఇంట్లోకి ప్రవేశించాడు. భయకంపితురాలైన సావిత్రమ్మ గట్టిగా కేకలు వేసింది. అయితే, వెంట తెచ్చుకున్న కత్తితో సావిత్రమ్మను పొడిచి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.10వేల నగదును తీసుకున్నాడు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించి చంపుతానంటూ వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను అక్కడికి తీసుకువచ్చాడు. అయితే, గ్యాస్ లీక్ చేసి నిప్పుపెట్టేందుకు అవసరమైన అగ్గి పెట్టె దొరకలేదు. దీంతో సావిత్రమ్మను గది నుంచి వెలుపలికి తీసుకువచ్చి అగ్గిపెట్టె ఎక్కడుందో వెతకమని బెదిరించాడు. ఈ లోగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గ్రహించిన ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
సిగార్‌లో బాంబు పెట్టి..
ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికాకు వచ్చిన క్యాస్ట్రో పేలుడు పదార్థాలు నింపిన సిగార్‌ను తాగేలా చేయాలనేది సీఐఏ ప్లాన్. న్యూయార్క్ పోలీస్ చీఫ్‌ను ఈ మేరకు పురమారుుంచింది. అరుుతే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అంతకుముందు మరో కుట్ర చేసింది. బోటులిన్ అనే విషపూరిత రసాయం సిగార్లోకి ఇంజెక్ట్ చేసి.. అవి క్యూబా అధ్యక్షుడికి అందేలా చూడటానికి క్యాస్ట్రో సహాయక బృందంలోనే ఒకరిని కోవర్టుగా మార్చింది. సిగార్లలోకి విషపూరిత రసాయనాన్ని ఇంజెక్ట్ అరుుతే చేయగలిగారు. అరుుతే ప్లాన్ అమల్లోకి రాకముందే కోవర్టుగా మారిన వ్యక్తిని క్యాస్ట్రో బృందం నుంచి తొలగించారు. మిల్క్‌షేక్‌లో విషం కలిపి.. ఫిడేల్ క్యాస్ట్రోపై సీఐఏ జరిపిన హత్యాయత్నాల్లో అత్యంత దగ్గరగా వచ్చి విఫలమైంది ఇదే. క్యాస్ట్రోకు మిల్క్షేక్లంటే ఇష్టం. వాటిలో విషపు గుళికలు వేసి తుదముట్టించాలన్నది కుట్ర. 1963లో హవానాలో ఆయన బస చేసిన లిబ్రే హోటల్లోకి ఈ విషపు గుళికలను చేర్చారు. ఫ్రిజ్‌లో పెట్టి ఉంచారు. మిల్క్‌షేక్‌లో కలపడానికి సిద్ధమైన వెరుుటర్ ఫ్రిజ్ నుంచి వాటిని తీయడానికి ప్రయత్నించగా... గడ్డ కట్టి ఫ్రిజ్ లోపలి భాగానికి అతుక్కుపోరుు కనిపించారుు. గట్టిగా తీయడానికి ప్రయత్నించగా పగిలిపోయారుు. అలా ఆ ప్రయత్నం విఫలమైంది. వెంట్రుకలు ఊడేలా... ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం న్యూయార్క్‌కు వచ్చిన క్యాస్ట్రో బూట్లలో థాలియం సాల్ట్‌ను వేయాలనేది ప్లాన్. దాని ప్రభావానికి లోనైతే... ఒక్కసారిగా మనిషి శరీరంపైనున్న వెంట్రుకలన్నీ రాలిపోతారుు. గడ్డంతో గంభీరంగా కనిపించే క్యాస్ట్రో అసలు కేశాలు లేకుండా... నిస్సహాయుడిలా కనిపించేలా చేసి క్యూబాలో అతని ప్రతిష్టను దెబ్బతీయాలని, తిరుగుబాటు ప్రోత్సహించాలని అమెరికా కుట్ర పన్నింది. కానీ ఎప్పట్లాగే ఇదీ విఫలమైంది. బాల్‌పారుుంట్ పెన్‌తో గుచ్చి... 1963లో క్యాస్ట్రో పారిస్‌కు వెళ్లారు. అక్కడ అండర్‌కవర్ ఏజెంట్‌గా ఉన్న సీఐఏ వ్యక్తి క్యాస్ట్రో సమీపానికి వెళ్లి బాల్‌పారుుంట్ పెన్ను పోలిన సూది(నీడిల్)తో ఆయను గుచ్చాలనేది ప్లాన్. అసలు ఏదో గుచ్చుకుందనే విషయమే తెలియకుండా ఈ విషప్రయోగం జరిగిపోతుంది. ఈ కుట్ర బయటపడడంతో సీఐఏ ఏజెంట్ రొనాల్డో క్యూబెలా జైలు పాలయ్యాడు. బాస్కెట్ బాల్ ఆడుతూ... -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
టేకులపల్లి : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చబోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పంచాయతీలో జరిగింది. బిల్లుడు తండాకు చెందిన భూక్యా పంతు(80), అతని కొడుకు తార్యాకు ఆస్తి విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా తగాదా జరిగింది. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న తండ్రిపై తార్యా కత్తితో దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయం కావటంతో 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మద్యం మత్తులో హత్యాయత్నం
పరకాల : మద్య మత్తులో ఓ వ్యక్తి కల్లుగీసే కత్తితో మరో వ్యక్తిపై హత్యాయత్నం చేసి వీరంగం సృష్టించాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం పరకాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మామిడి శ్రీనివాస్‌గౌడ్, దొనికెన శ్రీనివాస్‌గౌడ్ గీత కార్మికులు. పట్టణ శివారులోని తాటివనంలో కల్లు తీస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక జయటాకీస్ రోడ్డులోని కల్లు మండువ వద్దకు మామిడి శ్రీనివాస్ కల్లు తీసుకొచ్చాడు. అదే సమయంలో పీకల్లోతు మద్యం సేవించి దొనికెన శ్రీనివాస్‌గౌడ్ అక్కడికి వచ్చాడు. వీరిద్దరికీ పేకాట విషయంలో పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో మామిడి శ్రీనివాస్ వద్ద ఉన్న కత్తిని దొనికెన శ్రీనివాస్ లాక్కుని దాడికి దిగారు. మామిడి శ్రీనివాస్ మెడపై నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. నడుం, చేతిపై గాయాలు చేస్తుండగా కల్లు తాగేందుకు వచ్చిన పట్టణానికి చెంది న దామ అయిలయ్య అడ్డుకోగా ఆయనపైనా రెండు చోట్ల కత్తితో పొడిచాడు. భయంతో మామిడి శ్రీనివాస్‌గౌడ్ పోలీసు స్టేషన్ వైపు పరుగుగెత్తగా అత డి వెనుకే దొనికెన శ్రీనివాస్ కత్తిపట్టుకొని పరుగెత్తాడు. కల్లు మండువ సమీపంలోనే కట్టింగ్ చేసుకోవడానికి సెలూన్ షాపు వచ్చిన మాజీ ఎంపీటీసీ మోడెం రామన్న దొనికెన శ్రీనివాస్‌ను ఆపే ప్రయత్నం చేయగా రామన్ననూ నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ ముందు నుంచే వెళ్లి ఆర్టీసీ బస్సులో పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు స్థానిక సివిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మామిడి శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సివిల్ ఆస్పత్రికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు శ్రీనివాస్‌గౌడ్ కోసం గాలిస్తున్నారు. -
యువతి గొంతుకోసిన గుర్తుతెలియని వ్యక్తి
గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి కావేరి(18) అనే యువతి గొంతు కోశాడు. ఈ ఘటనలో ఆమెకు గొంతుపై తీవ్రగాయం కావడంతో గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కావేరికి మూడు నెలల క్రితమే ఈశ్వరరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త బైక్ మెకానిక్. ప్రొద్దునే బైక్ గ్యారేజీకి భర్త వెళ్లటంతో ఇంట్లో ఒక్కటే ఉంది. ఇది గమనించిన దుండగుడు ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు అడిగాడు. నీళ్లు తీసుకురావడానికి కావేరి ఇంట్లోకి వెళ్లింది. ఆమెతో పాటే దుండగుడు లోపలికి వెళ్లి మెడలోని గొలుసును లాక్కెళ్లబోయాడు. కావేరి ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. గాయాలపాలైన కావేరిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని విశాఖ సౌత్‌జోన్ ఏసీపీ రామ్మోహన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాచారెడ్డిలో యువతిపై హత్యా యత్నం
మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది. గ్రామానికి చెందిన బాల లక్ష్మీ(16) అనే యువతికి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు క్రిమిసంహారక మందు తాగించి చంపాలని ప్రయత్నించారు. చికిత్సనిమిత్తం వెంటనే యువతిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాల లక్ష్మి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. యువతి స్పృహలోకి వస్తే గానీ పూర్తి వివరాలు తెలియవు. సదరు యువతి ఓ ఇంటర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తనయుడు
తాగిన మైకంలో తండ్రిపైనే కిరోసిన్ పోసి నిప్పంటించాడో ఓ తనయుడు. ఈ సంఘటన నెన్నెల మండలం కొత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్(70), లక్ష్మణ్(30)లు తండ్రీకొడుకులు. ఆరేళ్ల క్రితం తండ్రి శంకర్‌కు పక్షవాతం వచ్చింది. ఇన్నేళ్లయినా నీకు చావు రావడం లేదు, ఇంకెన్ని రోజులు నీకు సేవలు చేయాలని తండ్రిపై కిరోసిన్ పోసి తానూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. అనంతరం 108 వాహనంలో గాయపడిన ఇద్దర్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. -
నవ వధువుపై ఘాతుకం
వంగలమడుగు (అడ్డతీగల) : ఏజెన్సీలోని అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామంలో గురువారం నవ వధువుపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కత్తిపూడి గ్రామానికి చెందిన ప్రశాంతి(19)కి ఈ నెల 19న ఏలేశ్వరానికి చెందిన వడ్రంగి పనిచేసే అలుకోజి శివతో వివాహమైంది. కాగా గురువారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కుంటుండగా.. ఓ దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను తండ్రి కవులూరి చక్రం, భర్త శివ 108లో అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 80 శాతంపైగా శరీరం కాలిపోవడంతో అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయమూర్తికి సమాచారమిచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వంగలమడుగులో తన నానమ్మ ఉందని, తనకు అన్నీ నానమ్మే అని అల్లుడు శివ అనడంతో బుధవారం మధ్యాహ్నం అక్కడకు తీసుకువెళ్లామని తండ్రి చక్రం వివరించాడు. తనపై ఎవరో కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వేశారంటూ ప్రశాంతి తన వద్దకు వచ్చి పడిపోయిందని పేర్కొన్నాడు. బాధితురాలి నుంచి న్యాయమూర్తి సి.సురేష్ వాగ్మూలం నమోదు చేశారు. అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై టి.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య అందంగా లేదని..
♦ వేధింపులు..ఆపై హత్యాయత్నం ♦ భర్తతో పాటు బావ రిమాండు మోమిన్‌పేట: భార్యపై హత్యాయత్నం చేసిన భర్తతో పాటు ఆమె బావను పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఏవీ రంగా వివరాలు వెల్లడించారు. బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రభు(28) నాలుగు సంవత్సరాల క్రితం ధారూరు మండలం మున్నురుసోమారం అనుబంధ గ్రామమైన ధర్మపూర్ నివాసి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరి కాపురం కొన్నిరోజుల పాటు సజావుగానే సాగింది. భార్య అందంగా లేదని కొంతకాలంగా ప్రభు లక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె గతంలో రెండుసార్లు మిహ ళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువర్గాల పెద్దలు రాజీ కుదిర్చారు. భార్యను బాగా చూసుకుంటానని ప్రభు హామీ ఇచ్చాడు. దీంతో పోలీసులు దంపతులిద్దరికి కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా ప్రభు తీరు మారలేదు. ఈక్రమంలో తన అన్న ఎల్లయ్యతో కలిసి ఈనెల 18న ఇంట్లో ఎవరూలేని సమయంలో లక్ష్మిపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములిద్దరిని అరెస్టు చేసి గురువారం రిమాండుకు తరలించారు. సమావేశంలో బంట్వారం ఇన్చార్జి ఎస్ఐ నాగభూషణం తదితరులు ఉన్నారు. -
భార్యపై భర్త హత్యాయత్నం
పెద్ద అడిశరపల్లి : అనుమానం పెనుభూతమైంది.. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు.. బంధువుల ఇంటికి తీసుకెళ్తూ మార్గమధ్యలో బీరుసీసాతో గొంతుకోసి పోలీసులకు లొంగిపోయాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలో బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ పరిధి నక్కలగండితండాకు చెందిన సబావట్ శంకర్ హైదరాబాదులో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం చందంపేట మండలం కేతెపల్లికి చెందిన వినోదను రెండోపెళ్లి చేసుకున్నాడు. శంకర్ ఒక్కడే హైదరాబాద్‌లో ఉంటుండగా వినోద నక్కలగండితండాలోనే ఉంటోంది. అప్పుడప్పుడు శంకర్ వచ్చి వెళ్తుంటాడు. ఆరు నెలల క్రితం దంపతులకు కుమారుడు జన్మించాడు. బంధువు ఇంటికి వెళ్తూ.. శంకర్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే మంగళవారం దంపతులిద్దరూ తమ కుమారుడిని తీసుకుని పీఏపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామపంచాయతీ పరిధి మాదాలబండతండాలో నివాసముంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. కొండమల్లెపల్లిలో బస్సు ఎక్కి నల్లగొండ రోడ్డులో మైలాపురం సమీపంలో బస్‌స్టాప్ వద్ద దిగారు. అప్పటికే దంపతులిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మద్యం మత్తులో ఉన్న శంకర్ బీరుసీసాను పగులగొట్టి వినోద గొంతులో పొడిచాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. శంక ర్ తన ఆరునెలల కుమారుడిని ఎత్తుకుని రాత్రి పది గంటల ప్రాంతంలో గుడిపల్లి పోలీస్‌స్టేషన్ వచ్చి తన భార్యను హత్య చేసినట్టు చెప్పాడు. కాగా, కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చిన వినోద నేరుగా మాదాలబండతండాకు చేరుకుంది. జరిగిన విషయాన్ని వివరించడంతో ఆమెను దేవరకొండ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. బుధవారం వినోద తండ్రి వడ్త్యా పాండు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఏ.భోజ్యా తెలిపారు. మొదటి భార్యను కడతేర్చా.. పోలీసుల అదుపులో ఉన్న శంకర్ తనకు ఎనిమిదేళ్ల క్రితమే వివాహం జరిగిందని, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని చెప్పాడు. అనుమానంతోనే మొదటి భార్యను కూడా హత్య చేసినట్టు పోలీసులకు చెప్పాడు. అయితే మొదటి భార్య పేరు వివరాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
వీడుతున్న ముడులు!
♦ డాక్టర్ కాల్పుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు ♦ తెరపైకి కొత్త పేరు.. ప్రియాంక ♦ ఉదయ్‌కుమార్ తరఫున పలువురి నుంచి అప్పులు ♦ 3 నెలల క్రితమే సిగ్మా ఆసుపత్రిని లీజుకు తీసుకున్న శశి ♦ అక్కడ కూడా లావాదేవీలపై నడుస్తున్న వివాదం సాక్షి, హైదరాబాద్: డాక్టర్ కాల్పుల కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. హత్యాయత్నం, ఆత్మహత్య కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రధానంగా తమ అనుమానాల నివృత్తిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. శశికుమార్ సూసైడ్‌నోట్‌లో చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక అనే కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఉదయ్‌కుమార్ తరఫున పలువురు ఫైనాన్షియర్ల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిగ్మా ఆసుపత్రిలో రూ.1.3 కోట్ల వివాదం సూసైడ్‌నోట్‌లో శశికుమార్.. ఉదయ్, సాయిలతో పాటు కేకేరెడ్డి, రామారావు, ఓబుల్‌రెడ్డి, చిన్నారెడ్డి పేర్లను రాశారు. వారంతా తనను మోసం చేశారని, శిక్షపడేలా చూడాలన్నారు. దీంతో వీరికి లారెల్ ఆసుపత్రి వ్యవహారాలతో సంబంధం ఉందని అనుమానించిన పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రికి సంబంధించి మరో వివాదం ఉన్నట్లు బయటపడింది. దీన్ని మూడు నెలల క్రితం శశికుమార్ లీజుకు తీసుకున్నారు. కేకే రెడ్డిగా పిలిచే కృష్ణకిషోర్‌రెడ్డి ఈ ఆసుపత్రి మాజీ డెరైక్టర్. ఆయన వద్ద నుంచే శశి దీన్ని లీజుకు తీసుకున్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి వీరిద్దరి మధ్య రూ.1.3 కోట్లకు సంబంధించి వివాదం నడుస్తోంది. రామారావు ఈ ఆసుపత్రికి సీఈఓగా వ్యవహరించగా... చిన్నారెడ్డి ఆసుపత్రి బిల్డింగ్ యజమానిగా తేలింది. ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి శశికుమార్‌కు సహాయకుడి (పీఏ)గా పని చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురినీ విచారించిన పోలీసులు వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన ముగ్గురితోనూ శశికుమార్‌కు ఆర్థిక వివాదాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. మరోవైపు కారులో కాల్పులు జరిపిన వ్యక్తి.. వెనుక సీటులో కూర్చున్నట్లు ఇప్పటికే తేలింది. అయితే అక్కడ కూర్చున్నది శశికుమారా? సాయికుమారా? అన్నది తేల్చడానికి కాఫీ షాప్‌తో పాటు మరో రెండు ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. వీటి ఆధారంగా వెనుక సీటులో కూర్చున్నది శశిగా నిర్ధారించారు. కారు, బ్రీఫ్‌కేస్ శశి కుటుంబీకులకు అప్పగింత హిమాయత్‌నగర్‌లోని మినర్వా కాఫీ షాప్ వద్ద స్వాధీనం చేసుకున్న శశికుమార్ కారును.. నారాయణగూడ పోలీసులు గురువారం ఆయన కుటుంబీకులకు అప్పగించారు. కారుతోపాటు అందులోని బ్రీఫ్‌కేస్, చెక్కు పుస్తకాలు ఇతర వస్తువుల్ని అందజేశారు. అందులో లభించిన 14 తూటాలతోపాటు రివాల్వర్ లెసైన్సును సీజ్ చేశారు. ఉదయ్‌కుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన నుంచి మరోసారి పూర్తిస్థాయి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. లారెల్ ఆసుపత్రికి ఫైనాన్షియర్ల క్యూ మాదాపూర్‌లో లారెల్ ఆసుపత్రి ఏర్పాటుకు ముగ్గురు డాక్టర్లు రూ.15 కోట్లకు పైగా పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది. ఈ మొత్తంలో అత్యధికం వాటాదారులతో పాటు ఫైనాన్షియర్లకు చెందినదిగా సమాచారం. కాల్పుల వివాదం కాస్త సద్దుమణగటంతో గురువారం నంచి ఆసుపత్రికి పలువురు ఫైనాన్షియర్లు వచ్చి వెళ్తున్నారు. తమ పెట్టుబడికి సంబంధించి వాటా ఇస్తామన్నారని, ఇప్పుడు ఎవరు జవాబుదారీ అంటూ అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక అనే మరో పేరు వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌కుమార్‌కు స్నేహితురాలిగా చెప్పుకున్న ఈమె.. ఆయన తరఫున మధ్యవర్తిగా ఉండి పలువురు ఫైనాన్షియర్ల నుంచి భారీ మొత్తాలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ లభించట్లేదని, సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉందని ఓ ఫైనాన్షియర్ ఆరోపించారు. దీంతో ఆమె ఎవరనే అంశాన్నీ పోలీసులు పరిగణనలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది? డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగిన రోజు సోమవారం సాయంత్రం 6 గంటలకు చంద్రకళ శశికుమార్‌ను మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో వదిలి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాత్రి 9 గంటల సమయంలో ఫామ్‌హౌస్‌కు వచ్చి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 9 గంటల సమయంలో ఓ వాహనం ఫామ్‌హౌస్ వద్దకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. అయితే ఆ వాహనంలో చంద్రకళ వచ్చిందా? లేక మరెవరైనా వచ్చారా? అన్నది స్పష్టంగా తెలియదని పేర్కొంటున్నారు. కాల్చిన చప్పుడేమీ వినిపించలేదు: శంకరయ్య, ఫామ్‌హౌస్ వాచ్మెన్ ‘‘సోమవారం సాయంత్రం 6 గంటలకు చంద్రకళ మేడమ్, శశికుమార్ సార్ కార్లో వచ్చారు. వారు మామూలుగానే ఉన్నారు. ఎలాంటి ఆందోళన కనిపించలేదు. సార్ రాత్రి ఇక్కడే ఉంటారు.. భోజనం ఏర్పాటు చేయాలని మేడమ్ చెప్పింది. ఆమె కార్లోనే నక్కలపల్లి గ్రామం వరకు వెళ్లాను. మా ఇంట్లోనే బగారా అన్నం, చికెన్ కూర వండుకుని రాత్రి 8 గంటలకు తీసుకెళ్లాను. అప్పటికి సారు మందు తాగుతున్నాడు. చికెన్ తినమని ప్లేట్లో వేసి ఇచ్చాను. నేను మందు తాగి తింటాను.. నువ్వు వెళ్లి పడుకో అని సార్ చెప్పాడు. నేను గేటు దగ్గర ఉన్న గదిలో పడుకున్నాను. గన్‌తో కాల్చిన చప్పుడేమీ వినిపించలేదు. గతంలో శశికుమార్‌ను మేడమ్ ఎప్పుడూ ఫాంహౌస్‌కు తీసుకురాలేదు. ఇదే మొదటిసారి’’ -
సీపీఎం నేతలపై హత్యాయత్నం
గుంటూరు రూరల్ : అసైన్డ్ భూముల అక్రమ విక్రయాలను అడ్డుకున్నందుకు సీపీఎం నాయకులపై అధికార పార్టీకి చెందిన మంత్రి అనుచరులు గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామం పరిధిలోని సుందరయ్యనగర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. స్వర్ణభారతినగర్ నాలుగో లైనుకు చెందిన కామిశెట్టి ఆంజనేయులు (32) తాపీ పనిచేస్తూ సీపీఎమ్ లో సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంటాడు. సుందరయ్య కాలనీ, స్వర్ణభారతినగర్లకు చెందిన పాలక పార్టీ నాయకులు సుందరయ్య కాలనీలోని అసైన్డ్ భూములను అక్రమంగా అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు రెండుమూడుసార్లు స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నాడు. నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావుకు ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తులు మంత్రి అనుచరులు కావడంతో సీఐ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కాలనీ వాసులు, సీపీఎం నాయకులు గత నెల 20న అర్బన్ ఎస్పీకి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ కేసును నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావుకు అప్పగించి పరిస్థితిని విచారించి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. అయితే రౌడీషీటర్లు స్థానిక మంత్రితో పోలీసులకు చెప్పించుకుని ఫిర్యాదు చేసిన వారిపైనే బైండోవర్ కేసును పెట్టించారని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రౌడీషీటర్ షేక్ బాజీ తన స్నేహితులైన గూడవల్లి కోటేశ్వరరావు, ఖాజావలి, అబ్దుల్ రహమాన్, ఎమ్ మణికంఠలతో కలిసి మంగళవారం ఆంజనేయులు వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. ఆంజనేయులు అతని పక్కనే ఉన్న కనపాల సతీష్‌లపై గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు అక్కడికి చేరుకోవటంతో నిందితులు పారిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆంజనేయులుకు భార్య ముగ్గురు చిన్నారులున్నారని తండ్రి సాంబయ్య తెలిపాడు. రౌడీల ఆకృత్యాలకు అడ్డువస్తున్నాడని తన కొడుకును చంపేందుకు ప్రయత్నించారని వాపోయాడు. జీజీహెచ్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన బాధితులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు అక్రమంగా స్థలాలను విక్రయిస్తూ అడ్డువచ్చినవారిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నాయకులు గుంటూరు ప్రభుత్వాసుపత్రివద్ద ధర్నాకు దిగారు. నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని నాయకులకు సర్దిచెప్పి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గంటకుపైగా జరిగిన ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు తూర్పు, పశ్ఛిమ డీఎస్పీలు సంతోష్, సరిత ఆధ్వర్యంలో పోలీసు బలగాలు పెద్దఎత్తున జీజీహెచ్ వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. -
అనుమానంతో భార్య గొంతు కోసి పరారీ
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానాన్ని పెంచుకుని కిరాతకంగా గొంతుకోశాడు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డు శాంతినగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఒడిశా రాష్ట్రానికి చెందిన పుష్పలతను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. శాంతినగర్‌లో కాపురం పెట్టాడు. ఏమైందోగానీ మంగళవారం తెల్లవారుజామున పుష్పలత గొంతుకోసి అతడు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పలతను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న పుష్పలతకు ప్రాణం పోసేందుకు వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ కిరాతకానికి పాల్పడినట్టు స్థానికుల కథనం. -
సొసైటీ అధ్యక్షుడిపై హత్యాయత్నం
అంబాజీపేట :పాత కక్షల నేపథ్యంలో మండలంలోని చిరతపూడి సొసైటీ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటేశ్వరరావుపై సోమవారం హత్యాయత్నం జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనపై అమలాపురం సీఐ జి.దేవకుమార్ కథనం ప్రకారం.. చిరతపూడి సొసైటీ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటేశ్వరరావు సొసైటీలో విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఇసుకపూడి మోటారుసైకిల్‌పై వస్తున్నారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావును ఆటో వెంబడించింది. ఇసుకపూడి మలుపు వద్దకు వచ్చే సరికి ఆటో వెంకటేశ్వరరావును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. ఆటో నడుపుతున్న సాధనాల కుమార్ కత్తితో పడిపోయిన వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. వెంకటేశ్వరరావు కత్తిపోటును తప్పించుకునే యత్నంలో ఎడమచేతి చిటికిన వేలుకు తీవ్ర గాయమైంది. వెంకటేశ్వరరావు కుమార్‌తో పెనుగులాడుతూ కేకలు వేయడంతో నింది తుడు కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాది నెహ్రూ ఇంట్లో తలదాచుకున్నాడని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. కొంతకాలంగా నెహ్రూ వర్గానికి వెంకటేశ్వరరావు వర్గానికి పాతకక్షలు ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి సోమవారం ఇసుకపూడి వచ్చిన కుమార్ హత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. ఘటనా ప్రదేశాన్ని పరిశీలించామన్నారు. దాడికి ఉపయోగించిన ఆటో, కత్తితోపాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. పరారీలో నిందితుడు హత్యాయత్నానికి పాల్పడిన సాధనాల కుమార్ పరారీలో ఉన్నాడని సీఐ దేవకుమార్ తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నాయన్నారు. హత్యాయత్నానికి కారణాలు ఏమిటి, ఎంత మంది ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ వివరించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు ఈ నేపథ్యంలో ఇసుకపూడిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని సీఐ వివరించారు. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ పికెట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయినవిల్లి, అల్లవరం ఎస్సైలు, మరో ఆరుగురు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేశామన్నారు. -
ఆసుపత్రిలో భార్యపై హత్యాయత్నం
కృష్ణా: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న భార్యపై భర్త హత్యాయత్నానికి పూనుకున్నాడు. గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించగా భార్య కొమ్ము రాణి (22) కేకలు వేయడంతో భర్త రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఐదు రోజుల క్రితం భర్త వేధింపులు తాళలేక ,భార్య కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. (విజయవాడ) -
భర్తను కట్టేసి.. ఊపిరాడకుండా చేసి..!
నిద్రపోతున్న భర్తను కాళ్లు, చేతులు కట్టేసి ముఖం చుట్టూ పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడానికి ప్రయత్నించిందో మహిళ. అంతే కాదు, ఆ తర్వాత కట్టెతో కొట్టి, కొడవలితో దాడి కూడా చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్‌లో భర్త కన్నన్‌తో గొడవ జరగడంతో వంజియమ్మళ్ అనే మహిళ అతడిని హతమార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. భార్య తనను అశక్తుడిని చేసి చంపేస్తుండటంతో అతడు అరవసాగాడు. అతడి అరుపులు విన్న పిల్లలు లేచి, వాళ్లూ భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచి వెంటనే అక్కడకు చేరుకుని అతడిని కాపాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత వంజియమ్మాళ్ పోలీసుల వద్ద లొంగిపోయింది. తన భర్త పెట్టే చిత్రహింసలను భరించలేకే ఇలా చేసినట్లు ఆమె తెలిపింది. -
సోదరుడి కొడుకుపై హత్యాయత్నం
- క్వాలీస్‌తో బైకును ఢీకొన్న చిన్నాన్న - ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు - భూ తగాదాలే కారణం? - పరారీలో నిందితుడు - మొయినాబాద్ మండలం వీరన్నపేటలో ఘటన మొయినాబాద్: ఓ వ్యక్తి తన అన్న కొడుకుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. క్వాలీస్ వాహనంతో వెనకనుంచి బైక్‌ను ఢీకొట్టి హతమార్చేందుకు యత్నించాడు. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని వీరన్నపేటలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వీరన్నపేటకు చెందిన బట్టు దశరథ, విఠల్ సొంత అన్నదమ్ములు. వీరు మూడు నెలలుగా భూ వివాదమై గొడవపడుతున్నారు. ఈనేపథ్యంలో బట్టు దశరథ కొడుకు బట్టు రాజమల్లేష్‌పై విఠల్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపేందుకు పథకం వేశాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం వీరన్నపేట వద్ద తన సొంత క్వాలీస్ వాహనం రోడ్డుపక్కన నిలిపి మాటువేశాడు. మండలంలోని రెడ్డిపల్లిలో రాజమల్లేష్ ఓ ప్రైవేటు షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పనికోసం తన బైక్‌పై వరుసకు సోదరుడైన శ్రీశైలంను ఎక్కించుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. రోడ్డుపైకి వెళ్లగానే అప్పటికే మాటువేసి ఉన్న విఠల్ క్వాలీస్ వాహనంతో వెనకనుంచి వేగంగా రాజమల్లేష్ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో రాజమల్లేష్, శ్రీశైలం రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. రాజమల్లేష్ తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు వారిని చికిత్సకోసం స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు విఠల్ పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. రాజమల్లేష్, శ్రీశైలం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం.. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే రాజమల్లేష్‌పై హత్యాయత్నం జరిగిందని గ్రా మస్తులు ఆరోపిస్తున్నారు. మూడు నెల ల క్రితమే విఠల్, రాజమల్లేష్ గొడవపడ్డారు. ఈ వివాదం అప్పట్లో ఠాణా వర కు వెళ్లింది. విఠల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రాజమల్లేష్ పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. భూవి వాదం గురించి మీరే మాట్లాడుకోండని వదిలేయడంతోనే విఠల్ మరింత రెచ్చిపోయి హత్యాయత్నానికి పాల్పడ్డాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఘటన హత్యాయత్నం వరకు వచ్చి ఉండేది కాదని చెబుతున్నారు. -
కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం
-
కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం
విజయవాడ: చిట్టినగర్‌లో ఓ అత్త కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం చేసింది. బాధితురాలు చంద్రకళ కథనం ప్రకారం ఆమెకు చిన్న వయసులో 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పది ఏళ్ల వరకు భర్త ఆమెను బాగానే చూసుకున్నాడు. ఇటీవల ఆమె పిల్లలకు కుటుంబ ఆస్తి కలసి వచ్చింది. అప్పటి నుంచి భర్త, అత్త ఆమెను వేధించసాగారు. కొట్టడం, తిట్టడంతోపాటు ఆమెకు తిండి కూడా పెట్టడంలేదు. కొడుక్కి మరో పెళ్లి చేస్తానని అత్త కొడలిని బెదిరించడం మొదలు పెట్టింది. చివరకు కోడలి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించింది. దాంతో చంద్రకళ న్యాయం కోసం చిట్టినగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అత్తని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు కోర్టుల చుట్టూ తిరిగే శక్తిలేదని చెప్పింది. తన భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె పోలీసులను కోరుతోంది. -
శ్రీశాంత్‌పై జైల్లో హత్యాయత్నం!
మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై జైల్లో హత్యాయత్నం జరిగిందట! ఈ విషయాన్ని శ్రీశాంత్ బావ బాలకృష్ణన్ తెలిపారు. 2013 మే నెలలో తీహార్ జైల్లో 26 రోజులు గడిపిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడని ఆయన అన్నారు. జైలు ప్రాంగణంలో తాను నడిచి వెళ్తుండగా.. ఓ రౌడీ ఉన్నట్టుండి తన ముందుకు దూకాడని, పదునైన కత్తితో తనమీద దాడి చేశాడని చెప్పాడన్నారు. తనకు చేతిమీద గాయమైందని, తర్వాత ఆ రౌడీని జైలు సిబ్బంది తీసుకెళ్లారని బాలకృష్ణన్ అన్నారు. అయితే దీన్ని వివాదం చేయాలని తాము అనుకోవడం లేదని, అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని వివరించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 సంవత్సరంలో శ్రీశాంత్ ఔటయిన విషయం తెలిసిందే. తర్వాత ఇప్పుడు బెయిల్ మీద విడుదలై బయటే ఉన్నాడు. శ్రీశాంత్ మీద ఢిల్లీ పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీకోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే నెలలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. -
టీడీపీ వర్గీయుల హత్యాయత్నం
వైఎస్సార్ సీపీ నేతపై మారణాయుధాలతో పట్టపగలే దాడి మంత్రి యనమల సోదరుడు కృష్ణుడే చేయించారన్న బాధితుడు వెంకటరమణ తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మత్స్యకార సంఘం డెరైక్టర్ కోడా వెంకటరమణపై టీడీపీ వర్గీయులు ఆదివారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కక్షలతోనే జరిగిందని, రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల సోదరుడు, టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడే ఈ దాడి చేయించారని వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట రమణ.. తన స్వగ్రామం ఎల్లయ్యపేటకు సమీపంలో ఉన్న పొలానికి ఆదివారం ఉదయం వెళ్లి వస్తుండగా కోళ్లఫారం సమీపంలో గొల్ల ముసలయ్యపేటకు చెందిన టీడీపీ వర్గీయులు తాటిపర్తి దండియ్య, నేమాల సత్తిబాబు, కొత్తముసలయ్యపేటకు చెందిన తాటిపర్తి బాబూరావు, తాటిపర్తి యతిమాని మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన వెంకటరమణను సమీప పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు వచ్చి రక్షించారు. దుండగులు బాధితుని సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారు.కోలుకున్న వెంకట రమణ తన పై జరిగిన హత్యాయత్నంపై ఒంటిమామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకు పోలీసుల తాత్సారం వైఎస్సార్ సీపీ నేతపై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తాత్సారం చేశారు. దీంతో బాధితుడు వెంకటరమణ ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తెలిపారు. ఆయన ఇతర నేతలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మరోపక్క మత్స్యకారులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజా సీఐతో చర్చించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కోరారు. ఎమ్మెల్యే రాజా కూడా ఎస్పీతో మాట్లాడారు. హత్యాయత్నంపై కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి న్యాయం చే స్తామని సీఐ హామీ ఇవ్వడంతో అంతా శాంతించారు. -
పదవి కోసం హత్యాయత్నం
గురజాల : పదవి ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందనటానికి బుధవారం గురజాల మండలంలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. మార్కెట్ యార్డు డెరైక్టర్ పదవి కోసం తనతో పోటీపడుతున్న వ్యక్తిని అడ్డుతొలగించుకోవాలన్న దుర్బుద్ధి హత్యాయత్నానికి ఉసిగొల్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర జాల మండలం గంగవరం గ్రామానికి చలవాది గురువులును పిడుగురాళ్ల మార్కెట్ యార్డు డెరైక్టర్‌గా ప్రతిపాదిస్తూ ఒక పత్రికలో వార్త వెలువడింది. దీంతో పార్టీలో ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న తనకు మార్కెట్‌యార్డు డెరైక్టర్ పదవి దక్కదనే అక్కసుతో గురువులును పదవి నుంచి తప్పించాలని ఆశావహులు పథకం పన్నారు. అనుమానం రాకుండా కొద్ది రోజుల నుంచి అతడితో స్నేహం నటించారు. బుధవారం మధ్యాహ్నం గురువులు పొలంలో పురుగుమందు పిచికారీ చేసి ఇంటికి వెళ్లాడు. విషయం గ్రహించిన గ్రామస్తుడు ఓబయ్య మరో ఇద్దరితో కలిసి అతడి ఇంటికి వెళ్లాడు. వేట కొడవళ్లతో గురువులుపై కిరాతకంగా దాడి చేశారు. బాధితుడి తల్లి రాములమ్మ కేకలు వేయడంతో పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు 108 వాహనంలో గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. గురువులు భార్య వెంకటరావమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చీమకు కూడా హాని తలపెట్టని తన కొడుకుపై దాడి చేసేందుకు చేతులెలా వచ్చాయంటూ వైద్యశాల వద్ద తల్లి రాములమ్మ విలపించింది. నిందితుల వేటలో పోలీసులు.. గురువులును వేట కోడవళ్లతో నరికి, పరారైన నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వారు పులిపాడు మీదుగా ఆటోలో మిర్యాలగూడ వైపు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో క్లూస్‌టీంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
షాపూర్ నగర్ లో మహిళపై హత్యాయత్నం
హైదరాబాద్: నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. జీడిమెట్ల షాపూర్ నగర్ లో ఓ మహిళను హత్య చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకల సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న మహిళను కొందరు వ్యక్తులు గొంతుకోసి హతమార్చాలని ప్రయత్నించి పరారయ్యారు. దీంతో మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
కడప అగ్రికల్చర్/కమలాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం మండలం జీవంపేటకు చెందిన నేత పుత్తా దస్తగిరిరెడ్డిపై శుక్రవారం కొందరు వ్యక్తులు మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. అతని కాళ్లు, చేతులు విరిచేశారని బంధువులు తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా కూర్చోవడంతో అతనిపై కసి పెంచుకున్నట్లు బంధువులు తెలిపారు. దాడి జరిగింది ఇలా.. కమలాపురం వచ్చిన పుత్తా దస్తగిరిరెడ్డి తన పని ముగించుకుని మధ్యాహ్నం బైక్‌లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు అతని బైక్‌ను అడ్డగించారు. మారణాయుధాలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఘటనలో దస్తగిరిరెడ్డి కాళ్లు, చేతులు విరిచేశారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చనిపోయాడనుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఐదుగురిపై కేసు నమోదు పుత్తా దస్తగిరిరెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో టీడీపీకి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశామని కమలాపురం ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన బాధితుడిని మెరుగైన వైద్య కోసం కడప రిమ్స్‌కు తరలించామన్నారు. దాడి గర్హనీయం విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి జమ్మలమడుగు, కమలాపురం ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రవీంద్రనాథరెడ్డి జరిగిన సంఘటన గురించి బాధితుడి బంధువులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనను వారు ఖండించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇటువంటి సంఘటనలకు పాల్పడటంతో జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. నేతల పరామర్శ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న దస్తగిరిరెడ్డిని వైఎస్సార్ సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి, తురకపల్లె రాజశేఖరరెడ్డి, కొండారెడ్డి, ఎమ్మెల్యే ఆది సోదరులు శివనాథరెడ్డి, జయరామిరెడ్డి, వివిధ మండలాల నాయకులు పరామర్శించారు. దాడిని ఖండించారు. టీడీపీ నాయకులపైనే అనుమానం పుత్తా దస్తగిరిరెడ్డిపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ నాయకులపైనే బంధువులు అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏజెంటుగా కూర్చున్నప్పటి నుంచి పుత్తాపై వారు కసితో ఉన్నట్లు తెలిపారు. అదను కోసం వేచి ఉండి,ఇప్పుడు ఈ సంఘటనకు పాల్పడి ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అధికారం అండ చూసుకునే వారు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. -
షాద్ నగర్లో వ్యక్తిపై హత్యాయత్నం
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షకీల్, బిల్లాలపై హత్యాయత్నం కేసు కొట్టివేత
గుజరాత్ పోలీసుల మీద దాడికేసులో హైదరాబాద్ నగరానికి చెందిన మౌతసిన్ బిల్లా, షకీల్లపై కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. అయితే ఇదే కేసులో మరో ముగ్గురికి మాత్రం నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. బలియుద్దీన్, వలియుద్దీన్, షఫీద్ అనే ముగ్గురికి ఈ శిక్ష విధించారు. 2004 సంవత్సరంలో డీజీపీ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో.. గుజరాత్ పోలీసుల మీద హత్యాయత్నం చేశారంటూ మౌతసిన్ బిల్లా, షకీల్‌ల మీద కేసు నమోదైంది. 2004 సంవత్సరంలో గుజరాత్ హోం శాఖ మంత్రి హరేన్ పాండ్పయ హత్య కేసులో నసీరుద్దీన్ షాను గుజరాత్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. నసీరుద్దీన్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ డీజీపీ ఆఫీసు ముందు ఆందోళన కారులు ధర్నా చేసి.. గుజరాత్ పోలీసులు మీద దాడి చేశారు. దాంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా, మౌతసిన్ బిల్లా సోదరుడు సలీం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అటు మౌతసిన్ బిల్లా, షకీల్లపై హత్యాయత్నం కేసు నమోదు కాగా... గుజరాత్ పోలీసులపై హత్యకేసు నమోదైంది. రెండో కేసు విషయం ఏమైందీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
యువకుడిపై హత్యాయత్నం
అమలాపురం రూరల్ :యువకుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి రౌడీషీటర్‌తో పాటు నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రౌడీషీటరు పినిశెట్టి రవిరాజా, గుండుమోగుల రామాంజనేయులు వర్గాల మధ్య వివాదం ఉంది. రవిరాజా వర్గానికి చెందిన ఎండీ నబీపై గుండుమోగుల రామాంజనేయులు, పెనుమాల ప్రసాద్, దొంగ దుర్గాప్రసాద్, శిరంగు ఆంజనేయులు తదితరులు అమలాపురం రోహిణీ ఆస్పత్రి సమీపంలో బుధవారం ఉదయం కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నబీ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. అనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది దీపావళి రోజు ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నేపథ్యంలో రామాంజనేయులు వర్గానికి చెందిన కొలగాని నాయుడును హత్య చేసేందుకు గత నెలలో ఈదరపల్లి వద్ద రవిరాజా వర్గీయులు రెక్కీ నిర్వహించారు. అయితే నాయుడు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ నేపథ్యంలో నబీపై రామాంజనేయులు వర్గీయులు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రామాంజనేయులు, దుర్గా ప్రసాద్, అంజనేయులు, ప్రసాద్‌లపై హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
జంటపై ఆగంతకుల హత్యాయత్నం
కర్నూలు : కర్నూలు జిల్లా కౌతాలం మండలం మెగలినూరులో దారుణం జరిగింది. ఓ జంటపై ఆగంతకులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో అమరేష్ అనే వ్యక్తి మృతి చెందగా, శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమరేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
డీఎంకే నాయకులపై హత్యాయత్నం
ప్యారిస్: సేలంలో డీఎంకే నాయకులను హత్య చేసేందుకు వేచి ఉన్న కిరాయి ముఠా సహా ఏడుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సేలం కిచ్చిపాళయంకు చెందిన కేబుల్ శరవణన్ (36). డీఎంకే యువజన విభాగం నాయకుడు. ఇతని స్నేహితుడు చెల్లదురై (35). వీరిపై పలు కేసులు ఉన్నాయి. వీరి స్నేహితులు పేచ్చియమ్మ నగర్‌కు చెందిన శక్తి (25), ప్రదీప్ (32), అమ్మాపేట పాండియన్ (24), మణియనూర్ గోపినాథ్ (24), పన్నయపట్టి మణి, సెవ్వాపేటై శంకర్. ఈ క్రమంలో కేబుల్ శరవణన్, చెల్లదురై, అతని స్నేహితుల మధ్య పాత కక్షలున్నాయి. దీంతో వీరిద్దరిని హత్య చేసేందుకు అతని స్నేహితులు నిర్ణయించారు. ఇందు కోసం తిరునెల్వేలి సుత్తమల్లికి చెందిన సుందర్ (25), సుడలైకన్నన్ (23), సతీష్ (23)తో కూడిన కిరాయి ముఠాను సేలంకు తీసుకొచ్చారు. అనంతరం కిరాయి ముఠాతో కలిసి శక్తి, ప్రదీప్, పాండియన్, గోపినాథ్, మణి, శంకర్ చెల్లదురైను హత్య చేసేందుకు వెంబడించారు. వారి నుంచి చెల్లదురై తప్పించుకున్నారు. దీని గురించి కిచ్చిపాళయం పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో కిరాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసు కమిషనర్ ఎ.అమల్‌రాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ రాజా ఆధ్వర్యంలోని పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. సన్యాసి గుండు ప్రాంతంలో కిరాయి ముఠా దాగి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ దాగి ఉన్న శక్తి, ప్రదీప్, సుడలై కన్నన్, సతీష్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు వేట కత్తులు, రూ.2,820 నగదు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నెత్తిమేడు కరియ పెరుమాల్ కోయిల్ కరడు ప్రాంతంలో దాగి ఉన్న సుందరన్, పాండియన్, గోపినాథ్‌ను అరెస్టు చేశారు. వీరిని పట్టుకునే సమయంలో వారి కాళ్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. విచారణలో శక్తి, ప్రదీప్, మణి చెల్లదురై, కేబుల్ శరవణన్‌ను హత్య చేసేందుకు రూ.1.5 లక్ష ఇచ్చేవిధంగా తిరునెల్వేలికి చెందిన రౌడీలు సుందర్, సుడలై కన్నన్, సతీష్‌ను రప్పించినట్టు తెలిసింది. విచారణ తర్వాత నలుగురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
ఇసుక మాఫియా ఘాతుకం!
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. పూసపాటి రేగ మండలం కోనయ్యపాలెం గ్రామంలో ఘాతుకానికి పాల్పడ్డారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకున్న ఆర్ఐపై హత్యాయత్నం చేశారు. ఆర్ఐ మురళీ కృష్ణని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆర్ఐ తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు పారిపోయారు. ఆర్ఐని చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది నెలలుగా రెవెన్యూ సిబ్బంది ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాంతో వారు ఏకంగా ఆర్ఐపై హత్యాయత్నమే చేశారు. -
ఒకరినొకరు చంపుకోబోయి దొరికిపోయారు
హైదరాబాద్ : ఇద్దరు రౌడీషీటర్లు ఒకరినొకరు చంపుకునేందుకు కాపు కాశారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో పారిపోయేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ బి.రవీందర్ కథనం ప్రకారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే రౌడీ షీటర్ షేక్ సుల్తాన్‌కు లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్న మహ్మద్ నబీల మద్య పాత కక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరినొకరు చంపుకొనేందుకు కార్వాన్ పాకీజా హోటల్ వద్ద స్కెచ్ గీసుకున్నారు. సుల్తాన్...మహ్మద్ నబీలు పరస్పరం దాడి చేసుకుంటున్న సమయంలో టప్పాచబుత్ర పోలీసుల పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది. పోలీస్ సైరన్ విని ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దాంతో వారిద్దరిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. -
మహిళపై హత్యాయత్నం?
కొడవటిపూడిలో కలకలం ముగ్గురిని బంధించిన గ్రామస్తులు వీరిని ప్రోత్సహించారన్న ఆరోపణపై మరో మహిళ అరెస్టు పలు సెక్షన్ల కింద కేసుల నమోదు కోటవురట్ల : కొడవటిపూడిలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు కలక లం సృష్టించాయి. గ్రామస్తులు నిందితులను బంధించడంతో పోలీసులు వచ్చి వారిని విడిపించాలని ప్రయత్నించినా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం...మండలంలోని కొడవటిపూడిలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు మహిళలతోపాటు మరో వక్తి వ చ్చి తలుపు తట్టారు. సాయిలక్ష్మి తలుపు తెరవగానే ఇద్దరు మహిళలు ఆమె మెడకు చున్నీ విసిరి దగ్గరకు లాగారు. ఇంతలో సాయిలక్ష్మి ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆ ముగ్గురినీ పట్టుకుని రామాలయంలో బంధించారు. సమాచారం అందుకున్న కోటవురట్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురినీ విడిచిపెట్టాలని కోరినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో బుధవారం ఉదయం నర్సీపట్నం రూరల్ సీఐ దాశరథి, ఇద్దరు ఎస్‌లతో వచ్చి బందీల వివరాలను ఆరా తీశారు. వారిలో సంతాభక్తల అనూష (జంగారెడ్డిగూడెం), కర్రిఆనంద మోహనరావు (బిల్లనందూరు, కోటనందూరు మండలం), ఎం.అనూష (మల్లవల్లి, కృష్ణాజిల్లా) ఉండగా, వీరు ముగ్గు రూ పాయకరావుపేట జీఎస్ఎస్ సంస్థలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. నిందితులను పోలీసు స్టేషనుకు తీసుకెళ్తామంటూ జీపులో ఎక్కించేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గుర్తించిన ఆయన ఏఎస్పీ విశాల్‌గున్నికి సమాచారం అందించడంతో, ఆయన ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ వర్మ సహా మరో నలుగురు ఎస్ఐలు, పోలీసు బలగాలు గ్రామానికి తరలివచ్చారు. బందీలను విడిచిపెట్టేందుకు గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో గ్రామపెద్దలతో చర్చించారు. చివరకు బాధితురాలికి న్యాయం చేస్తామన్న హామీతో బందీలను పోలీసులకు అప్పగించారు. సీఐ దాశరథి మాట్లాడుతూ ముగ్గురిపైనా హత్యాయత్నం, అత్యాచార యత్నం, కిడ్నాప్ నేరాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. సాయం చేయాలని వచ్చాం: నిందితులు సాయిలక్ష్మిపై హత్యాయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనందమోహనరావు, ఎం. అనూష, ఎస్.అనూష మాత్రం, తాము పాయకరావుపేటలోని జీఎస్ఎస్ సంస్థలో పని చేస్తున్నామని, సాయిలక్ష్మికి సాయం చేయాలనే తలంపుతో ఆమె వద్దకు వస్తే తప్పుగా అర్థం చేసుకున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. ఆనందరావు అన్యాయం చేశాడంటూ సాయిలక్ష్మి పోలీ సులను ఆశ్రయించిన నేపథ్యంలో వివాదం పెద్దది కాకుండా చర్చించాలన్న ఉద్దేశంతో వచ్చామే తప్ప, ఉపాధి కోసం చిరు ఉద్యోగాలు చేసే తాము హత్యచేయాలని మాత్రం రాలేదని చెప్పారు. విచారణ అనంతరం ముగ్గురు నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనందరావు అక్క బావిశెట్టి లక్ష్మిని కూడా రప్పించి అరెస్టు చేసి కోటవురట్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు సాయిలక్ష్మికి, బావిశెట్టి ఆనందరావులకు వివాహం చేస్తామని సీఐ దాశరథి హామీ ఇచ్చారు. కేసు పరిష్కారం కోసం పోలీసులు జరిపిన చర్చల్లో ఎమ్మెల్యే అనిత భర్త శివ, సర్పం చ్ బాలేపల్లి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యుడుపైల రమేష్, లాలం కాశీనాయుడు పాల్గొన్నారు. తెర వెనుక కథ ఇదీ! సాయిలక్ష్మి, అదే గ్రామానికి చెందిన ఆనందరావు 2000లో ప్రేమించుకున్నారు. వారి వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 2003లో సాయిలక్ష్మి రాజమండ్రికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన వారం రోజుల్లోనే ప్రియుడు ఆనందరావు సాయిలక్ష్మిని తనవద్దకు తీసుకొచ్చేశా డు. అనంతరం సాయిలక్ష్మి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆనందరావు ఓ గుళ్లో తాళికట్టి, అదే గ్రామంలో కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు అ న్నిటిలో నూ ఓ కుటుంబంగానే నమోదైంది.అయితే ఇటీవల ‘నీకూ నాకూ ఏ సంబంధం లేద’ంటూ ఆనందరావు సాయిలక్ష్మిని తరిమేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆనందరావుకు అక్క అయిన బావిశెట్టి లక్ష్మి ఆమెకు సన్నిహితుడైన పాయకరావుపేట గ్రామ స్వరాజ్య సమితి(జీఎస్ఎస్) ప్రతినిధితో కలిసి తనపై పై ముగ్గురిని ఉసిగొల్పి హత్యాయత్నానికి ప్రయత్నించిందని బాధితురాలు సాయిలక్ష్మి పోలీసుల విచారణ సందర్భంగా ఆరోపించింది. -
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం
మునగాల :టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ వర్గీయులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన మునగాల మండల కేం ద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు కందిబండ సత్యనారాయణ రాత్రి పది గంటలకు ఇంట్లో ఉండగా, అతడి సోదరుడు ప్రభాకర్, తన మిత్రులు వారణాసి ప్రసాద్, దేవరం రామిరెడ్డిలతో ఇంటి ఎదుట మాట్లాడుతున్నా డు. ఈ క్రమంలో కాంగ్రెస్ మునగాల మండల అధ్యక్షుడు నల్లపాటి శ్రీనివాస్, తన అనుచరులు 50 మందితో కలిసి కర్రలు, రాళ్లతో వచ్చి దాడి చేశారు. ఒక్కసారిగా జరుగుతున్న దాడితో హతాశులైన ప్రభాకర్ అతడి స్నేహితులు అక్కడి నుంచి పరుగుతీశారు. కాంగ్రెస్ వర్గీయులు వారిని వెంబడించి మరీ దాడిచేశా రు. మరికొందరు సత్యనారాయణ ఇంటిపై రాళ్ల వర్షం కురి పిం చారు. తలుపులు పెట్టుకుని ఇంట్లో ఉన్న సత్యనారాయణ మేడపైకి వెళ్లి ఫోన్ ద్వార కోదాడ సీఐ, మునగాల ఎస్ఐలకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి రావడంతో కాంగ్రెస్ వర్గీయులు పరారయ్యా రు. ఈ దాడిలో ప్రభాకర్, అతడి స్నేహితుడు వారణాసి ప్రసాద్‌కు గాయాలయ్యాయి. కోర్టులో ఫిర్యాదు చేసినందుకే.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపాటి శ్రీనివాస్, ఆయ న భార్య ప్రమీల తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోటీచేసి విజయం సాధించారని కోర్టులో ఫిర్యాదు చేసినందుకే తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని కందిబండ సత్యనారాయ ణ ఆరోపించారు. కోర్టులో వారు అధికారులను తప్పుదోవ పట్టించారని నిరూపణ కావడంతో జీర్ణించుకోలేక తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో నల్లపాటి శ్రీనివాస్‌పై ఫిర్యాదు నల్లపాటి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి తమపై హత్యాయత్నం చేశాడని బాధితులు కందిబండ సత్యనారాయణ, చిల్లంచర్ల ప్రభాకర్, వారణాసి ప్రసాద్ శనివారం మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రా ణాలకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ డి.రామృష్ణారెడ్డి తెలిపారు. -
భర్తపై మారణాయుధాలతో భార్యలు దాడి
దొడ్డబళ్లాపురం : భూ వివాదం కారణంగా కట్టుకున్న భర్తపైనే ఇద్దరు భార్యలు మారణాయుధాలతో విరుచుకుపడిన సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని కుక్కలహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు నారాయణస్వామి (40) ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... కుక్కలహళ్లికి చెందిన నారాయణస్వామికి ఇద్దరు భార్యలు, యశోదమ్మ, గంగమ్మ. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి విషయంలో నారాయణస్వామి, అతడి అన్న నరసయ్యలకు వివాదం ఉంది. సోమవారం గ్రామ పెద్దలు భూ వివాదాన్ని పరిష్కరించారు. ఈ పరిష్కారం నారాయణస్వామి భార్యలకు నచ్చలేదు. పెద్దల తీర్పును అంగీకరించవద్దని భర్తకు ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యశోదమ్మ, గంగమ్మ మంగళవారం తెల్లవారు జామున నారాయణ స్వామితో గొడవపడి కళ్లల్లో కారం కొట్టి కొడవలితో దాడి చేశారు. ప్రతిఘటించే ప్రయత్నంలో నారాయణస్వామి చేతి వేళ్లు తెగిపోవడంతో పాటు ఛాతీపై కొడవలి దెబ్బలు పడ్డాయి. మర్మాంగంపై కూడా కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్కడి నుంచి తప్పించుకుని అన్న నరసయ్య ఇంటి వద్దకు చేరుకుని స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం నరసయ్య బాధితుడిని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి హొసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు. హత్యాయత్నం, భర్తపై హత్యాయత్నం, భార్యలు, కుక్కలహళ్లి, పోలీసులు, attempt to Murder, husband, wife, kukkalahalli, police -
ఎమ్మెల్యేపై హత్యాయత్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి : మానామధురై ఇండియన్ బ్యాంక్ ఏటీఎం సమీపంలోని ఒక జిరాక్స్ దుకాణం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే పిచ్చాపాటి మాట్లాడుతున్నా రు. అన్నాడీఎంకే దివంగత నేత దైవ సిగామణి కుమారుడు లోకేశ్వరన్ మరో ముగ్గురితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆక్రమణల తొలగింపులో తన ఇల్లును కోల్పోయామని, అక్కడ స్థ లం ఖాళీగా ఉన్నందున పట్టా ఇప్పించాలని లోకేశ్వరన్ కోరా రు. ఇందుకు ఎమ్మెల్యే సమ్మతించలేదు. క్రమేణా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా అప్పటికే వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో నలుగురు కలిసి ఎమ్మెల్యేపై దాడిచేశారు. విచక్షణారహితంగా ఆరుచోట్ల గాయూలయ్యూరు. ఎమ్మెల్యేపై దాడిని జిరాక్స్ దుకాణం యజమాని సోమనాథన్, అతని సోదరుడు ఆర్ముగం అడ్డుకోవడంతో వారిపైకూడా వేటు పడింది. ఎమ్మెల్యే పై హత్యాయత్నం జరిగినట్లు వేగంగా సమాచారం పాకడంతో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని రాస్తారోకో చేశారు. దుకాణాలపై రాళ్లురువ్వారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నగరంలో అంగళ్లు మూతపడ్డాయి. పోలీసులు ఆందోళనకారులను సమాధానపరిచి రాస్తారోకోను విరమింపజేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా. శివగంగై జిల్లా మానామధురై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుణశేఖరన్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. అదే నియోజకవర్గానికి పార్టీ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. మానామధురై పట్టణ పంచాయతీ అన్నాడీఎంకే అధ్యక్షునిగా దైవసిగామణి ఉండేవారు. వైగై ఆట్రుపాళయం సమీపంలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో నివసిచేవారు. అధికారంలో ఉండగానే ఆయన కన్నుమూయడంతో అతని కుమారులైన లోకేశ్వరన్, శబరి తమకు పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఆశించినది జరగలేదు. ఈ క్రమంలో గత ఏడాది మానామధురైలో ఆక్రమణ తొలగింపుల్లో వీరి ఇల్లు పోయింది. ఎమ్మెల్యే గుణశేఖరన్ ఈ విషయంలో వారికి సహకరించలేదు. ఇల్లును కోల్పోయిన ప్రాంతంలో ఇంటి స్థలం పట్టా ఇప్పించాలని ఎమ్మెల్యేను లోకేశ్వరన్ కోరారు. అయితే ఆయన వీరి మొరను పెద్దగా ఆలకించలేదు. దీంతో దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రత్యక్ష సాక్షులైన సోమనాథన్ ఇచ్చిన సమాచారం మేరకు అదే నగరానికి చెందిన శశికుమార్ (23), కార్తిక్ (20), మరో కార్తిక్ (23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు. గాయపడిన ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రి ఉదయకుమార్ పరామర్శించారు. -
భయపడ్డట్టుగానే...
హత్యకు గురైన‘కొనపురి’ భువనగిరి/వలిగొండ, న్యూస్‌లైన్, మావోయిస్టు అగ్రనేత సాంబశివుడి సోదరుడైన రాములు తన హత్యకు కుట్ర పన్నారని మొదటినుంచీ చెబుతున్నట్టుగానే జరిగిపోయింది. రాములు మావోయిస్టు దళంలో పనిచేసి లొంగిపోయారు. జిల్లాలోని ఆలేరు, కృష్ణపట్టి దళాల్లో పనిచేసిన ఆయనపై జిల్లాలో 9 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇతను 1998లో దళంలో చేరాడు. ఆలేరు, కనగల్లు దళాల్లో పనిచేశాడు. 2001 నుంచి 2002 వరకు కృష్ణపట్టి దళంలో, 2002 నుంచి 2003 వరకు స్పెషల్ గెరిల్లా కమాండర్‌గా పనిచేశాడు. 2001, 2003లో చందంపేట వద్ద మావోయిస్ట్‌లు నిర్వహించిన ట్రైయినింగ్ కాంపులలో పాల్గొన్నాడు. 2003లో ఎస్పీ సజ్జనార్ సమక్షంలో లొంగిపోయాడు. తిరిగి 2006లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో లొంగిపోయాడు. 2008లో టీఆర్ఎస్లో పార్టీలో చేరాడు. రాములపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా చాకచక్యంగా తప్పించుకున్నారు. దళసభ్యురాలినే వివాహం.. దళంలో ఉన్న సమయంలోనే చండూరు మండలం కొండాపురానికి చెందిన దళ సభ్యురాలు కవితను వివాహామాడాడు. ఆయనకు కూతురు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్తపేట సమీపంలో నివసిసిస్తున్నారు. భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆశించారు. అది దక్కుతుందో లేదోనని ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఆశించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మానుకున్నారు. రెండుసార్లు హత్యాయత్నం అయితే 2008 సంవత్సరంలో ఆయనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. ఆయన స్వగ్రామమైన వలింగొండ మండలం దాసిరెడ్డి గూడెంలో కోబ్రాల పేరుతో ఇంట్లో విషసర్పాలను వదిలారు. మరోసారి అన్నంలో విషం కలిపారు. రెండు సార్లు ఆయన బయటపడ్డారు. హైదాబాద్‌లో ఒకసారి, భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో బహింరంగ సభలో హత్యాయత్నానికి ప్రయత్నించారు. కోనపురి రామలు సోదరుడు మాజీమావోయిస్టు నేత, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివున్ని 2011లో మార్చిలో వలిగొండ మండలం గోకారం స్టేజేవద్ద కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనాటి నుంచి రాములు తనకు ప్రాణ హాని ఉందని చెబుతూ వచ్చారు. గ్రామంలో విషాదఛాయలు... రాములు హత్య సమాచారంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు హత్య జరిగిందన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గ్రామస్తులు తండోపతండాలుగా ఆ ఇంటికి వచ్చి సానుభూతి ప్రకటించారు. మండలకేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
పొలం తగాదా: ఇద్దరు అన్నలపై హత్యాయత్నం
ఖమ్మం: పొలం తగాదా ఇద్దరు సొదరులపై హత్యాయత్నానికి దారితీసింది. దమ్మపేట మండలం చలమప్పగూడెంలో పొలం విషయమై గొడవపడ్డారు. అది ఘర్షణకు దారి తీసింది. తమ్ముడు ఇద్దరు అన్నలను చంపడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. -
తండ్రీకొడుకులపై హత్యాయత్నం
కొత్తపేట, న్యూస్‌లైన్ :పాత కక్షల నేపథ్యంలో తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో హత్యాయత్నం చేసిన ఉదంతమిది. కొత్తపేట ఎస్సై ఎ.బాలాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం పలి వెల పెదపేటకు చెందిన సాదే నాగేశ్వరరావు, అతడి కుమారుడు రాజ్‌కుమార్ వ్య వసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి పై అదే గ్రామానికి చెందిన వస్కా వెంకన్నతో పాటు ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డా రు. ఇరువర్గాల మధ్య పాత గొడవలున్నా యి. మంగళవారం అర్ధరాత్రి నాగేశ్వరరావు ఇంటి ముందు రాజ్‌కుమార్, అతడి చెల్లెలు ముగ్గులు పెడుతున్నారు. అదే సమయంలో వస్కా వెంకన్న, అతడి వర్గీయులు అక్కడకు వెళ్లి వారి ముగ్గులను పాడు చేశారు. దీంతో సాదే నాగేశ్వరరావు, వస్కా వెంకన్న వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వెంకన్న వర్గీయులు కర్రలు, కత్తులతో నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌లపై విరుచుకుపడ్డారు. నాగేశ్వరరావుకు ఎడమ డొక్కలో, రాజ్‌కుమార్‌కు మూడు చోట్ల కత్తిపోట్లయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానికులు కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించగా ప్రా థమిక చికిత్స జరిపి ఉన్నత వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి రెండు కత్తులు, గొడ్డలి, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరా రీలో ఉన్నారు. సంఘటన స్థలాన్ని రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు పరి శీలించారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం జిల్లా ఎన్టీఆర్ సర్కిల్లో దారుణం
అనంతపురం: జిల్లాలోని ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు ప్రవీణ్ అనే వ్యక్తిని గొంతుకోసి పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో అచేతన స్థితిలో పడివున్న ప్రవీణ్ పరిస్థితి విషమించడంతో అతన్ని చికిత్స మేరకు స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బాలికను గర్భవతిని చేసి..
-
బాలికను గర్భవతిని చేసి, ఆపై హత్యాయత్నం
హైదరాబాద్: ఓ దుర్మార్గుడు బాలికను గర్భవతి చేసి, ఆ తరువాత ఆ బాలికను హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ దారుణం సికింద్రాబాద్‌లో జరిగింది. హత్యాయత్నం చేయడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
పాలల్లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం చేసిన భార్య
గుంటూరు: వైవాహిక జీవితంలో మనుసులు భారంగా మారుతున్న ఘటనలు రోజూ ఏదో మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భర్తకు పాలల్లో విషమిచ్చి హత్య చేసేందుకు యత్నించిందో భార్య. జిల్లాలోని పెద్దపలకలూరులో భర్తకు పాలల్లో విషం కలిపి ఇచ్చిన దారుణమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. భర్తను ఏదో రకంగా వదిలించుకోవాలని యత్నించిన భార్య చివరకు పాలల్లో విష ప్రయోగం చేసింది. గత కొన్ని రోజులుగా కుటుంబంలో చోటు చేసుకుంటున్న వివాదాలు కారణంగానే భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యానాంలో జీవిత ఖైదీపై హత్యాయత్నం
కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని యానాం సబ్‌జైలులోని ఒక జీవిత ఖైదీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం పుదుచ్చేరికి చెందిన 14 మంది దుండగులు పాండిచ్చేరికి చెందిన మణికంఠ అనే జీవిత ఖైదీని హత్య చేయాలన్న ఉద్దేశంతో ఈ తెల్లవారుజామున అక్రమంగా జైలులోకి ప్రవేశించారు. జైలు వెనుక భాగం నుంచి ప్రవేశించినవారు వార్డెన్‌ను తాళ్లతో బంధించారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యానాం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 13 మందిని అరెస్ట్ చేశారు. మరో కీలక నిందితుడు అశ్విన్ కోసం గాలిస్తున్నారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. అతనిని హతమార్చేందుకే వచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం. -
యానాంలో జీవిత ఖైదీపై హత్యాయత్నం
కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని యానాం సబ్‌జైలులోని ఒక జీవిత ఖైదీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం పుదుచ్చేరికి చెందిన 14 మంది దుండగులు పాండిచ్చేరికి చెందిన మణికంఠ అనే జీవిత ఖైదీని హత్య చేయాలన్న ఉద్దేశంతో ఈ తెల్లవారుజామున అక్రమంగా జైలులోకి ప్రవేశించారు. జైలు వెనుక భాగం నుంచి ప్రవేశించినవారు వార్డెన్‌ను తాళ్లతో బంధించారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యానాం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 13 మందిని అరెస్ట్ చేశారు. మరో కీలక నిందితుడు అశ్విన్ కోసం గాలిస్తున్నారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. అతనిని హతమార్చేందుకే వచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం. -
యానాంలో జీవిత ఖైదీపై హత్యాయత్నం
కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని యానాం సబ్‌జైలులోని ఒక జీవిత ఖైదీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం పుదుచ్చేరికి చెందిన 14 మంది దుండగులు పాండిచ్చేరికి చెందిన మణికంఠ అనే జీవిత ఖైదీని హత్య చేయాలన్న ఉద్దేశంతో ఈ తెల్లవారుజామున అక్రమంగా జైలులోకి ప్రవేశించారు. జైలు వెనుక భాగం నుంచి ప్రవేశించినవారు వార్డెన్‌ను తాళ్లతో బంధించారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యానాం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 13 మందిని అరెస్ట్ చేశారు. మరో కీలక నిందితుడు అశ్విన్ కోసం గాలిస్తున్నారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. అతనిని హతమార్చేందుకే వచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం.