రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక | Madhulika gets Treatment in ICU | Sakshi
Sakshi News home page

రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక

Published Sun, Feb 10 2019 5:51 PM | Last Updated on Sun, Feb 10 2019 7:18 PM

Madhulika gets Treatment in ICU - Sakshi

హైదరాబాద్‌: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన మధులికను మరో రెండు రోజుల పాటు ఐసీయూలోనే ఉంచనున్నారు. ఆమెకు ప‍్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కొబ్బరి బొండాల కత్తితో నరకడం వలన ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందించాలని భావించిన వైద్యులు.. ఆ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే జనరల్‌ వార్డ్‌కు షిష్ట్‌ చేసే అవకాశం ఉంది. (మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement