యూట్యూబ్ అంటే కొందరికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టే వేదిక. మరికొందరికి అదొక సరదా కాలక్షేపం. అయితే కొంతమంది మాత్రం దీంతో మంచి పేరు తోపాటు కోట్లు ఆర్జించి మిలియనీర్‌లుగా మారారు. అచ్చం అలానే మంచి నేమ్, డబ్బు సంపాదించి స్టార్ యూట్యూబర్‌గా ఎదిగింది 65 ఏళ్ల మహిళ. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు సరదాగా మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానెల్ విలియన్లమంది ఫాలోవవర్లు, లక్షల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక యూట్యూబర్‌లలో ఒకరిగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎవరామె..? ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..!
ఆమె పేరు నిషా మధులిక. 2009లో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భారతీయ శైలి వంటకాలకు ఫేమస్. ఆమెకు చిన్న వయసు నుంచి వివిధ వంటకాలపై ఉన్న ఆసక్తితో రకరకాల రెసిపీలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో దాదాపు రెండు వేలకు పైగా వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 14.5 మంది మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఆరోగ్యకరమైన వంటకాలతో ప్రతి ఇల్లు ఐక్యతతో సంతోషభరితంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని అంటోంది నిషా. ఆమెకు ఈ యూట్యూబ్ తోపాటు ఫేస్‌బుక్‌లో 5.7 మిలియన్లు, ఇన్‌స్టాలో 3.41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
నిషా నేపథ్యం..
నిషా ఆగస్టు 24, 1959న ఉత్తరప్రదేశ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ తదనంతరం.. కొన్నాళ్లు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లితో నోయిడాకు వెళ్లిపోయింది. అక్కడ తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇక ఆ బాధ్యతలు తీరి ఒంటరితనం వేధించడంతో.. చిన్ననాటి వంటకాల ఆసక్తితో ఆ లోటుని భర్తి చేసింది. ఆ ఇష్టంతోనే యూట్యూబ్ ఛానెల్‌లో అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి.. విశేష జనాదరణ సంపాదించుకుంది. ఒకరకంగా ఆ అభిరుచి ఆమెకు మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాయి.
రెస్ట్ తీసుకునే వయసులో కాలక్షేపం కోసం మొదలు పెట్టి.. దేశంలోనే టాప్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు నవంబర్ 2017లో సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్‌గా గౌరవాన్ని పొందింది. జస్ట్ తన పాకనైపుణ్యాలతో ఏకంగా రూ. 43 కోట్ల నికర విలువతో భారీ సంపాదనను ఆర్జిస్తోంది నిషా. అంతేగాదు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న టాటా ట్రస్ట్‌ల ప్రాజెక్ట్ డ్రూవ్‌తో సహా అనేక ఇతర ప్రయత్నాలకు తన వంతు సహాయసహకారాలు అందించి సేవదృక్పథంలో కూడా మేటి అనిపించుకుంది.
(చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!)
Comments
Please login to add a commentAdd a comment