Nisha
-
ఇండియాలోని టాప్ యూట్యూబర్లలో ఒకరామె..జస్ట్ పాక నైపుణ్యంతో ఏకంగా..!
యూట్యూబ్ అంటే కొందరికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టే వేదిక. మరికొందరికి అదొక సరదా కాలక్షేపం. అయితే కొంతమంది మాత్రం దీంతో మంచి పేరు తోపాటు కోట్లు ఆర్జించి మిలియనీర్లుగా మారారు. అచ్చం అలానే మంచి నేమ్, డబ్బు సంపాదించి స్టార్ యూట్యూబర్‌గా ఎదిగింది 65 ఏళ్ల మహిళ. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు సరదాగా మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానెల్ విలియన్లమంది ఫాలోవవర్లు, లక్షల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక యూట్యూబర్లలో ఒకరిగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎవరామె..? ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..!ఆమె పేరు నిషా మధులిక. 2009లో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భారతీయ శైలి వంటకాలకు ఫేమస్. ఆమెకు చిన్న వయసు నుంచి వివిధ వంటకాలపై ఉన్న ఆసక్తితో రకరకాల రెసిపీలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో దాదాపు రెండు వేలకు పైగా వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 14.5 మంది మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఆరోగ్యకరమైన వంటకాలతో ప్రతి ఇల్లు ఐక్యతతో సంతోషభరితంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని అంటోంది నిషా. ఆమెకు ఈ యూట్యూబ్ తోపాటు ఫేస్బుక్లో 5.7 మిలియన్లు, ఇన్‌స్టాలో 3.41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషా నేపథ్యం..నిషా ఆగస్టు 24, 1959న ఉత్తరప్రదేశ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ తదనంతరం.. కొన్నాళ్లు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లితో నోయిడాకు వెళ్లిపోయింది. అక్కడ తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇక ఆ బాధ్యతలు తీరి ఒంటరితనం వేధించడంతో.. చిన్ననాటి వంటకాల ఆసక్తితో ఆ లోటుని భర్తి చేసింది. ఆ ఇష్టంతోనే యూట్యూబ్ ఛానెల్లో అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి.. విశేష జనాదరణ సంపాదించుకుంది. ఒకరకంగా ఆ అభిరుచి ఆమెకు మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాయి. రెస్ట్ తీసుకునే వయసులో కాలక్షేపం కోసం మొదలు పెట్టి.. దేశంలోనే టాప్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు నవంబర్ 2017లో సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్‌గా గౌరవాన్ని పొందింది. జస్ట్ తన పాకనైపుణ్యాలతో ఏకంగా రూ. 43 కోట్ల నికర విలువతో భారీ సంపాదనను ఆర్జిస్తోంది నిషా. అంతేగాదు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న టాటా ట్రస్ట్‌ల ప్రాజెక్ట్ డ్రూవ్తో సహా అనేక ఇతర ప్రయత్నాలకు తన వంతు సహాయసహకారాలు అందించి సేవదృక్పథంలో కూడా మేటి అనిపించుకుంది. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
ఓ ఆత్మ ప్రతీకారం
వీర్, శ్రీ హర్ష, నిషా, ఖుషి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో కేవీ పాపారావు నిర్మించిన ‘చండిక’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఓ ఆత్మ ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని కొత్తగా చూపించాం. ఈ చిత్రంలో నిర్మాత గురురాజ్ ఓ కీలక పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు నేనే కథ రాశాను’’ అన్నారు చిత్రనిర్మాత కేవీ పాపారావు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ విన్, కెమెరా: నగేశ్. -
వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ 'నిషా జగ్తియాని'?
ప్రపంచవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో,భారతదేశంతో 2300 స్టోర్లను కలిగిన ల్యాండ్‌మార్క్ కంపెనీ వారసురాలు & ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన 'నిషా జగ్తియాని' (Nisha Jagtiani) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయుల వ్యాపారవేత్తలలో ఒకరైన 'మిక్కీ జగ్తియాని' కుమార్తె 'నిషా జగ్తియాని'. ఈమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకుంది. ఆ తరువాత హార్డ్‌వేర్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఇది మాత్రమే కాకుండా దుబాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్‌కు బోర్డు సభ్యురాలు కూడా. మిక్కీ జగ్తియాని విషయానికి వస్తే.. ఈయన టాక్సీ డ్రైవర్‌గా, హోటల్ క్లీనర్‌గా కెరీర్ ప్రారంభించాడు. 1973లో మిక్కీ బహ్రెయిన్‌లో బేబీ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించి తరువాత అనతి కాలంలో బిలియనీర్ వ్యాపారవేత్తగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మిక్కీ జగ్తియాని మరణానంతరం ఆయన భార్య రేణుక ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓగా ఉన్నారు. కాగా వీరి కుమార్తె నిషా జగ్తియాని కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్ ట్రెంట్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఇదీ చదవండి: 300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు! ల్యాండ్‌మార్క్ గ్రూప్ దుస్తులు, చెప్పులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కాస్మొటిక్, కాస్మొటిక్ ప్రొడక్స్ట్ వంటి వాటిని విక్రయిస్తోంది. అంతే కాకుండా ఈ సంస్థ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి.. తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. నిషా జగ్తియాని ప్రస్తుతం 9.5 బిలియన్ డాలర్లు లేదా రూ. 78,000 కోట్లకంటే ఎక్కువ సంపద కలిగి ల్యాండ్‌మార్క్ గ్రూప్ బోర్డులో ఒక్కరుగా ఉన్నారు. అంతే కాకుండా గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్స్, కమ్యూనికేషన్ అండ్ సిఎస్ఆర్ హెడ్‌గా ఉన్నారు. -
రంగస్థలం ఏడు ప్రపంచాలు
అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్ పంత్ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్ నిషా... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది గౌర్ పంత్. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్ ‘శాంతినికేతన్’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ. భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్ వితౌట్ మెన్’ పేరుతో ఇంగ్లీష్‌లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది. ‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్‌తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి. బిన్ను నుంచి నసీమ్ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్ బాలక్రిష్ణన్ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను. బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు. ‘బిన్ను’ నాటకంలో... -
న్యాయం కోసం రణం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాధితుల న్యాయపోరాటం, పోరాటం చేసే క్రమంలో పడుతున్న కష్టాలు... అయినప్పటికీ వెనకడుగు వేయని పట్టుదలకు ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ అద్దం పడుతుంది. ఝార్ఖండ్‌లోని ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిషా పహుజా తీసిన ఈ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచిపామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) వరకు ‘బెస్ట్ డాక్యుమెంటరీ’గా ప్రశంసలు అందుకుంటూనే ఉంది... పదమూడు సంవత్సరాల తన కూతురిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు రంజిత్ అనే రైతు. పోలీసుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక చుట్టాలు, పక్కాలు, గ్రామస్థుల విషయానికి వస్తే...‘జరిగిందేదో జరిగింది. పోయేది మీ కుటుంబ పరువే. కేసు వెనక్కి తీసుకోండి’‘మీ సంగతి ఏమిటోగానీ మన కులం పరువు పోయేట్లు ఉంది. కేసు వెనక్కి తీసుకోండి’‘మన జాగ్రత్తలో మనం ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయి. వారిని మనం ఏం చేయలేము. కేసు వెనక్కి తీసుకోండి’ఎవరు ఎలా స్పందించినా, ఆ స్పందనలో చివర గట్టిగా వినిపించే మాట... కేసు వెనక్కి తీసుకోండి. అయితే రంజిత్ వీరి ఉచిత సలహాలను పట్టించుకోలేదు. పోరాటదారిని వదలలేదు. ఈలోపు బెదిరింపులు పెరిగాయి. ‘కేసు ఉపసంహరించుకుంటావా లేదా?’ అని గ్రామస్థులనుంచి ఒత్తిడి పెరిగింది. రంజిత్ చేస్తున్న న్యాయపోరాటానికి శ్రీజన ఫౌండేషన్ అండగా నిలిచింది. మహిళల హక్కుల గురించి పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ ఇది. స్థూలంగా చెప్పాలంటే ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ కథ ఇది.అయితే ఇది కాల్పనిక కథ కాదు.ఝార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల సమాహారం.డైరెక్టర్, రైటర్ నిషా పహుజా ‘టు కిల్ ఏ టైగర్’ రూపకర్త.కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపుపొందిన నిషా దిల్లీలో పుట్టింది. కెనడాలోని టోరంటోలో పెరిగింది. చిన్నవయసులోనే తల్లిదండ్రులతోపాటు కెనడాకు వెళ్లిన నిషా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. బాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగింది.‘యూనివర్శిటీ ఆఫ్ టోరంటో’లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్న నిషా రకరకాల సామాజిక ఉద్యమాల్లోపాల్గొంటోంది. డాక్యుమెంటరీ రీసెర్చర్‌గా పేరు తెచ్చుకుంది.కాలేజీ రోజుల నుంచే నిషాకు రచన, దర్శకత్వం అనేవి ఇష్టమైన సబ్జెక్ట్‌లు. కెరీర్ ప్రారంభంలో రీసెర్చర్‌గా కెనడియన్ ఫిల్మ్‌మేకర్స్ జాన్ వాకర్, అల్ కజిమ్లతో కలిసి పనిచేసిన నిషా చిత్ర నిర్మాణంపై కొంత అవగాహన, అనుభవం వచ్చాక డైరెక్టర్‌గా అడుగులు వేసింది. తక్కువ కాలంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమర్షియల్ డైరెక్టర్‌గా రాణించాలనేది ఆమె కల కాదు. వాస్తవ సంఘటనలనే చిత్రాలుగా తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘చిత్రం ఎంత వాస్తవికంగా ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవుతారు’ అంటుంది నిషా. 2012లో వచ్చిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ ఆమెలో రచన, దర్శకప్రతిభను ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసింది. భారతీయ సమాజానికి చెందిన అమ్మాయిల జీవితంలో సంక్లిష్టతలు, వైరుధ్యాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడంతోపాటు ఎంతో చర్చను రేకెత్తించింది. ఇక ‘టు కిల్ ఏ టైగర్’ విషయానికి వస్తే మొదట ఈ చిత్రాన్ని తీయాలనుకోలేదు నిషా. ఝార్ఖండ్‌లోని ఒక స్వచ్ఛందసంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి చిత్రం చేయాలని రంగంలోకి దిగినప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన గురించి విన్నది. బాధితురాలు, ఆమె తండ్రితో మాట్లాడింది. మొదట తాను తీస్తున్న చిత్రంలో భాగంగానే బాధితురాలి గురించి చెప్పా లనుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ఈ సంఘటననే చిత్రంగా తీయాలని నిర్ణయించుకుంది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ నుంచి (హాట్ డాక్స్) కెనడియన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ వరకు ఎక్కడో ఒకచోట ‘టు కిల్ ఏ టైగర్’ గురించి ప్రస్తావన, ప్రశంస వినిపిస్తూనే ఉంది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంది. -
మొన్న ఓటమి.. నిన్న విజయం.. ఈ సారి మనదే ‘షూటౌట్’!
FIH Pro League- భువనేశ్వర్: శనివారం ఓటమికి కారణమైన ‘షూటౌట్’ ఆదివారం వచ్చేసరికి విజయాన్నందించింది! ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని చిత్తు చేసింది. తొలి మ్యాచ్ తరహాలోనే నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ముందుగా మ్యాచ్ 29వ నిమిషంలో జర్మనీ తరఫున ఫెలీషియా వీడర్మన్ గోల్ సాధించగా... 40వ నిమిషంలో నిషా గోల్ సాధించి భారత్‌ను బరిలో నిలిపింది. షూటౌట్లో భారత్ మూడు ప్రయత్నాల్లోనూ బంతి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫలం కాగా... జర్మనీని మన గోల్ కీపర్ సవిత సమర్థంగా అడ్డుకుంది. షూటౌట్లో భారత్ తరఫున కుమారి సంగీత, టెటె సలీమా, సోనిక గోల్స్ సాధించారు. తాజా గెలుపుతో భారత్ ఖాతా లో 2 పాయింట్లు చేరాయి. ప్రొ లీగ్‌లో భాగంగా భారత్ తమ తర్వాతి పోరులో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై తలపడుతుంది. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు
‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్‌లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్‌తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు. ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది. టైలర్ కూతురు హర్యానాలోని సోనిపట్‌లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్ వర్శి టైలర్. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్‌గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది. నిషా వర్శి తల్లిదండ్రులు ఎన్నో అడ్డంకులు క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్‌లో ఆడుతున్న నేహా గోయల్ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది. తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్‌కు చెప్పి లెగ్గింగ్స్ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్‌లో కూడా లెగ్గింగ్స్తోనే ఆడింది. కొనసాగిన అపనమ్మకం 2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్ టీమ్‌లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన. కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్‌లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్ చేసింది. అవును.. ఆడపిల్లే గొప్ప ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా. -
ఎడారిలో పచ్చదనం
కరోనా ప్రపంచాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసింది. చదువు, ఆట, పాట అన్నీ ఆ గోడల మధ్యనే. కంప్యూటర్ స్క్రీన్ మీద పాఠాలు నేర్చుకోవడంతో సరిపెట్టడం కాదు. ఇంకేదో చేయాలి. ఏదైనా చేయడానికి కావల్సినంత ఖాళీ సమయం కూడా ఇదే అనుకుంది పదిహేడేళ్ల నిషా పాఠక్. పాఠక్ ఏం చేసిందంటే... నిషా పాఠక్‌ది రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్‌నగరం, ప్లస్‌టూ చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల తర్వాత మిగిలిన సమయం మొత్తం చెట్ల మధ్య గడపడం అలవాటు చేసుకుంది. టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప పండించి ఇంటి దగ్గరలో నివసించే పేదవాళ్లకు పంచింది. ఆ తర్వాత వాళ్లకు కూడా పండించడం నేర్పించింది. వాళ్ల కోసం ఇంటి ఆవరణలో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ఎక్కువ ఖర్చు లేకుండా వారం– పది రోజుల్లో పంటకొచ్చే పాలకూర, మెంతికూర, ఆవ ఆకు వంటివి పండించడంలో శిక్షణనిస్తోంది. ఎండాకాలంలో జైపూర్ నేలలో పండించడానికి సాధ్యంకాని ఆకు కూరలను ఆమె పాలప్యాకెట్లలో తక్కువ నీటితో పండిస్తోంది. ఆమె ప్రయత్నం సక్సెస్ అయింది. ఇలా పెంచుతోంది! పాలపాకెట్‌ను శుభ్రం చేసి ఆరబెట్టి, అడుగున చిన్న రంధ్రాలు ముప్పావు వంతు ప్యాకెట్‌ను ఆర్గానిక్ పాట్ మిక్చర్ (సేంద్రియ ఎరువుతో కూడిన మట్టి)తో నింపుతోంది. మెంతులు, ఆవాలను రాత్రంతా నానబెట్టి ఒక్కో ప్యాకెట్లో ఒక టీ స్పూన్ గింజలను పలుచగా చల్లుతోంది. గింజల మీద గుప్పెడు మట్టిని ఒక పొరలాగ పరిచి నీటిని చిలకరిస్తోంది. వారం రోజులకు ఆకు కూరలు కోతకు వస్తాయి. పై పొర మట్టిని తొలగించి మళ్లీ గింజలను చల్లుకోవడమే. తాజా ఆకుకూరల రుచి ఎరుగని ఎడారి ప్రాంతంలో నిషా పాఠక్ అనుసరించిన మైక్రోగ్రీన్ ఫార్మింగ్‌కి అభిమానులు, అనుచరులు పెరిగిపోతున్నారు. ఆమె పేదవాళ్ల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను బంధువులు, స్నేహితులు ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు. -
ఓటు వేయండి.. కిరీటం గెలుస్తా
పంజగుట్ట: కర్ణాటక, బీదర్ జిల్లాల్లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌కు పోటీ పడుతోంది. యూట్యూబ్‌లో ఓటు వేసి తనను గెలిపిస్తే టైటిల్ తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆమే నిషా తాలంపల్లి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన వివరాలు వెల్లడించింది. బీదర్ జిల్లాలోని దుమున్‌సూర్ గ్రామానికి చెందిన నిషా తాలంపల్లి తల్లి బిందుమతి గృహిణి, తండ్రి శ్రీనివాస్ వ్యవసాయం చేస్తాడని, ప్రముఖ సినీనటి ప్రియాంకా చోప్రాను ఆదర్శంగా తీసుకుని మోడలింగ్‌లోకి వచ్చానని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో పలు పోటీల్లో విజేతగా నిలిచినట్టు వివరించింది. తాను నవంబర్ 18న ఇండోనేసియాలోని రాజధాని జకర్తాలో జరిగే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఫైనల్స్‌కి సిద్ధమవుతున్నానని, దేశవ్యాప్తంగా 9 వేల దరఖాస్తులు రాగా వాటి నుంచి 30 మందిని ఎంపిక చేశారని, తాను అందులో చోటు దక్కించుకున్నానని వివరించింది. ఈ పోటీలో గెలిచేందుకు తనకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మద్దతు తప్పనిసరిగా పేర్కొంది. యూట్యూబ్, గూగుల్‌లో తన పేరు టైప్ చేసి లైక్ కొడితే పాయింట్లు వస్తాయని, ఒక్కో పాయింట్ తనను కిరీటం వైపు తీసుకెళుతుందని వివరించింది. ఈ సమావేశంలో నిషా తండ్రి శ్రీనివాస్ తాలంపల్లి, శ్రేయోభిలాసులు బాసు హిలాల్‌పూర్, రామకృష్ణారెడ్డి, ధర్మేందర్ పూజారి, అనిల్ పాటిల్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియా లవ్‌స్టోరీ
కరణ్, అమృత, నిషా, దివ్య, ప్రీతి ముఖ్య తారలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ గొంటి నిర్మించిన చిత్రం ‘బెస్ట్ లవర్స్’. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ పోస్టర్స్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలశ్రీనివాస యాదవ్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో సాగే అందమైన లవ్‌స్టోరీ ఇది. సినిమా బాగా వచ్చింది. ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సినిమా తీశాం. అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి ఫీల్ ఇచ్చే లవ్‌స్టోరీ చేశాం’’అన్నారు నిర్మాత. ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. శ్రీకరణ్ చక్కగా చేశాడు. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అట్లూరి రామకృష్ణ, సాయి వెంకట్, తదితరులు పాల్గొన్నారు. -
పూస పూసలో ప్రేమ
ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఒక్కోలా వ్యక్తపరుస్తారు. బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ మాత్రం పూసల్లో ప్రేమను చూపించారు. విషయం ఏంటంటే... తన దత్తపుత్రిక నిషా కోసం ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వదలుచుకున్నారు సన్నీ లియోన్. చిన్న చిన్న పూసలతో ఒక ఆర్ట్‌ని డిజైన్ చేయడం మొదలెట్టారు. 2017 అక్టోబర్‌లో మొదలెట్టిన ఈ ఆర్ట్ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి సన్నీకి సుమారు ఏడు నెలలకుపైగా పట్టిందట. ఒక్కో పూసను తన చేత్తోనే బోర్డ్‌పై అంటిస్తూ 12 రామచిలుకలు వరుసగా కూర్చున్న ఫొటోను తయారు చేశారు సన్నీ లియోన్. కంప్లీట్ అయిన ఆర్ట్‌వర్క్ ఫొటోను షేర్ చేస్తూ ‘‘నిషా కోసం పూసలతో ఓ ఆర్ట్ వర్క్ చేయాలనుకున్నాను. లాస్ట్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసిన ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను రీసెంట్గా కంప్లీట్ చేశాను. కొన్ని వేల పూసలని నేనే స్వయంగా అంటించాను’’ అన్నారు. కుమార్తె నిషాని ఉద్దేశించి... ‘ఈ బొమ్మలో ప్రతి పూస అంటిస్తున్నప్పుడు నీ గురించే ఆలోచించాను. నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను’’ అని పేర్కొనారు సన్నీ లియోన్. ఆర్ట్ స్టార్టింగ్ ఫైనల్ ఆర్ట్ -
స్టార్ హీరోయిన్‌కు ప్రమోషన్..!
సాక్షి, ముంబై: టాలీవుడ్ అందాల హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ప్రమోషన్ వస్తోందిట. అవును..త్వరలోనే ఆమె పెద్దమ్మ కాబోతోంది. కాజల్ అగర్వాల్ చెల్లెలు మరో హీరోయిన్ నిషా అగర్వాల్ తల్లి కాబోతోంది. తాను తల్లి కాబోతున్న గుడ్ న్యూస్‌ను నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన నిషా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. దీంతో ముంబైకి చెందిన ఒక బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కాజల్ ఫ్యామిలీ కూడా ధ్రువీకరించింది. కాగా టాలీవుడ్ హీరో రానాకు కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో దర్శకుడు తేజ సారధ్యంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ టాక్ తెచ్చుకోగా.. మరో రెండురోజుల్లో నాన్ అలయిత్తాల్ పేరుతో కోలీవుడ్ లో కూడా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. మరోవైపు ముంబైలో జరుగనున్న రివర్స్ ర్యాలీలో వీరిద్దరూ పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీకి మద్దతు తెలిపాల్సిందిగా కోరుతూ అక్కా చెల్లెళ్లిద్దరూ (కాజల్ అండ్ నిషా) ట్విట్టర్లో ఒక వీడీయోను షేర్ చేశారు. .@MsKajalAggarwal & her sister are here at Worli Stadium supporting #MumbaiRally Where are you? pic.twitter.com/EcHdLtq0Nu — Rally For Rivers (@rallyforrivers) September 18, 2017 There is so much goodness in this world! Thank you so much! -
తాత - మనవళ్ల కథ
‘‘శ్రీరామరక్ష’ చిత్రం టీజర్ చూస్తుంటే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూస్తున్నప్పటి ఫీలింగ్ కలిగింది. టైటిల్ చక్కగా ఉంది. అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్‌కు శ్రీరాముని ఆశీస్సులుండాలి’’ అని హీరో సునీల్ అన్నారు. రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి ముఖ్య పాత్రల్లో రాము దర్శకత్వంలో వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై ప్రభాత్ వర్మ నిర్మించిన చిత్రం ‘శ్రీరామ రక్ష’. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్‌బాబు, ఓ పాటను సునీల్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తాత- మనవడి బంధం ఇందులో హైలెట్. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి. రంగరాజు. -
మిస్ ఫర్ఫెక్ట్ ఆంధ్రాగా నిషా
-
ప్రేమజంట ఆత్మహత్య
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ శివారు గంగారం గ్రామంలో ప్రేమికుల జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. భద్రాచలంలోని ముదిరాజ్ బజార్‌కు చెందిన రొయ్యల జగదీష్ (19) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణానికే చెందిన నైషా (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ నెల 4న సాయంత్రం నైషా ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. రెండు రోజులైనా నైషా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సోమవారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గంగారం ఊరి శివారులో చీరతో ఒకే ఉరికి వేలాడుతున్నజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మురళి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. మృత దేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉండటంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన రాత్రే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దయనీయ స్థితిలో.. నాటి కథానాయిక
సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్ తదితరులతో సినిమాలు చేసిన నటి నిషా మరణపుటంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమె దుఃస్థితి తెలిసి తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. కమలహాసన్ సరసన ‘టిక్ టిక్ టిక్’, రజనీకాంత్‌తో ‘రాఘవేంద్ర’ చిత్రాల్లో నిషా నటించారు. కల్యాణ ఆగాదిగళ్, మయిలుక్కు మూణుకాల్ తదితర చిత్రాల్లో కథానాయకిగా చేశారామె. నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా అనారోగ్యంతో బాధపడుతోందంటూ ఇటీవలే వెబ్సైట్లలో ప్రచారం జరగడంతో పాటు, ఈ వార్తను అనేక తమిళ పత్రికలు కూడా ప్రచురించాయి. ఎముకల గూడులా మారిన దేహంతో నాబూర్ దర్గా సమీపంలో వారం రోజుల పాటు అనాథగా పడి వున్న నిషాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దయనీయ పరిస్థితి చూసి జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యులైన న్యాయమూర్తి మురుగేశన్ మనసు కకావికల మైంది. వెంటనే ఆయన నిషా సంరక్షణ బాధ్యతలను తీసుకుని ఆమెకు వెంటనే వైద్యం అందించాలని నాగపట్టణం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించి, ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య
లండన్: ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ఫోర్డ్ నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి జితేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇరుగుపోరుగు వారు వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జితేంద్ర నివాసానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జితేంద్ర ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలు అన్వేషించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇరుగుపోరుగు వారిని విచారిస్తున్నారు. -
వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. తుకారంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శ్యామ్ కథనం ప్రకారం... నిషా, కిషన్ అలియాస్ సమీర్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిషా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. వీరిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివాసముంటున్నారు. నిషా ప్రస్తుతం గర్భవతి. భర్త వేధింపులు భరించలేక నిషా గతంలో ఆత్మహత్యాయత్నం చేసింది. విషం తాగిన ఆమెకు సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడింది. ఇంత జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం వేధిస్తూనే ఉన్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నిషా బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమలో ఓడిన స్త్రీ
ప్రేమలో ఓడిన ఒక స్త్రీ ఏం చేసిందనేదే కాదలిక్కు కన్నిల్లై చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు, నటుడు జై ఆకాష్ తెలిపారు. ఈయన కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని ఎం ఎం ఎం క్రియేషన్స్ సంస్థ, జై బాలాజి మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలీషా దాస్, నిషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో వై.ఇందు, లలిత్య, ప్రభాకరన్, శ్రీరమ్య తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శక , నటుడు జై ఆకాష్ మాట్లాడుతూ, 17 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు జీవితంలో ప్రేమ పోరాటం చేసిన ఒక స్త్రీ ఇతివృత్తమే కాదలుక్కు కన్నిల్లై చిత్ర కథ అని చెప్పారు. ఒక వ్యక్తిని ప్రేమించి అతని ద్వారా తన జీవితాన్ని కోల్పోయిన ఆ స్త్రీ ఏమి చేసిందనే పలు ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారం ఈ చిత్రం అని పేర్కొన్నారు. తాను ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తున్నట్లు తెలిపారు. యుకె మురళి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది.