వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య | Harassed by husband, Junior artist commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

Published Fri, Aug 22 2014 8:37 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య - Sakshi

వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. తుకారంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శ్యామ్ కథనం ప్రకారం... నిషా, కిషన్ అలియాస్ సమీర్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిషా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. వీరిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివాసముంటున్నారు. నిషా ప్రస్తుతం గర్భవతి.

భర్త వేధింపులు భరించలేక నిషా గతంలో ఆత్మహత్యాయత్నం చేసింది. విషం తాగిన ఆమెకు  సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడింది.  ఇంత జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం వేధిస్తూనే ఉన్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నిషా బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement