జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్‌ఏసీ చైర్మన్ శరత్‌బాబు
మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.
శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్‌ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment