arbitration
-
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో సారథ్యానికి సమయమిదే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంపొందించడంలో భారతదేశం ముందుండాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘చట్టాల పట్ల గౌరవం నిజాయతీని, స్థిరతను ప్రోత్సహిస్తుంది, ఆర్థిక వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. హక్కులకు రక్షణ చేకూరి, ఒప్పందాలు అమలయి, వివాదాలు సమర్ధవంతంగా పరిష్కారమయ్యే ఇటువంటి వ్యవస్థలో పెట్టుబడి దారులు ముందుకొచ్చి వృద్ధికి అనుకూలమైన వాతా వరణం నెలకొంటుంది’అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, చట్టపాలనపై శుక్రవారం జరిగిన సదస్సులో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. చట్టబద్ధ పాలనతో విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం పెరగడంతోపాటు అంతర్జాతీయంగా పోటీపడే వాతా వరణం దేశంలో నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా, అటార్నీ జనరల్ వెంకటరమణి, సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. -
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
బాల్కో లిస్టింగ్‌పై ప్రభుత్వ దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ సంస్థ భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. అంతేకాకుండా సంస్థ ప్రమోటర్ గ్రూప్ వేదాంతా చేపట్టిన ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరింప చేయాలని చూస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు వీలుగా వేదాంతాతో గనుల శాఖ, దీపమ్ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. మిగిలిన వాటా విషయంలో అధిక విలువ వివాదంపై 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల్కో ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. కాగా.. బాల్కో ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు చేపట్టినట్లు పాండే వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించనున్నట్లు తెలియజేశారు. కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయాలంటే ఆర్బిట్రేషన్ కేసును వెనక్కి తీసుకోవలసి ఉన్నట్లు వివరించారు. ఇందుకు ప్రమోటర్లు ఒప్పుకుంటే పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు ప్రారంభిస్తామని తెలియజేశారు. వాటా విక్రయం ఇలా 2001లో ప్రభుత్వం మెటల్ పీఎస్‌యూ.. బాల్కోలో 51 శాతం వాటాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ స్టెరిలైట్ ఇందుకు రూ. 551 కోట్లు వెచ్చించింది. మిగిలిన 49 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఒప్పందంలోని కాల్ ఆప్షన్ ప్రకారం 2004లో స్టెరిలైట్ మిగిలిన 49 శాతం వాటా కోసం ప్రభుత్వానికి రూ. 1,099 కోట్లు ఆఫర్ చేసింది. అయితే వాటా విలువ అంతకంటే అధికమని కాగ్ నివేదిక పేర్కొనడంతో ప్రభుత్వం ఆఫర్‌ను తిరస్కరించింది. దీంతో 2009లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బాల్కో ఆర్బిట్రేషన్ అంశం హిందుస్తాన్ జింక్ కేసు(2009)ను పోలి ఉన్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 2021 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఓపెన్ మార్కెట్ విక్రయానికి ప్రభుత్వాన్ని అనుమతించింది. తద్వారా 29.5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కింది. 2022లో ప్రమోటర్ సంస్థ వేదాంతా ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరించడంతో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో వాటాను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. -
మధ్యవర్తిత్వంతో కోర్టులపై భారం తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వ్యవస్థపై అది భరించే శక్తికి మించి ఒత్తిడి పెంచితే ఆ వ్యవస్థ దెబ్బతింటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ భారాన్ని తగ్గించడం ‘మధ్యవర్తిత్వం’తోనే సాధ్యమని తెలిపారు. ఇంట్లోని చిన్నచిన్న తగాదాలు కూడా కోర్టుకు చేరడంతో పెండింగ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి కేసులన్నీ మధ్యవర్తిత్వంతోనే పరిష్కారం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ–మీడియేషన్ రైటింగ్స్ (ఈఎండబ్ల్యూ) ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈఎండబ్ల్యూ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. ‘అత్తాకోడలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు.. ఇలా చిన్నచిన్న వివాదాలను ఇంటి స్థాయిలోనో లేదా గ్రామ స్థాయిలోనో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వంతో పరిష్కరించే ఏర్పాట్లు జరగాలి. పేదలకు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే ఆర్థిక స్తోమత తక్కువ. అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులు ముందుకురావాలి’అని తమిళిసై పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భరించే శక్తికి మించి న్యాయవ్యవస్థ భారం మోస్తోందని చెప్పారు. గతంలో గ్రామీణ స్థాయిలో, కుటుంబాల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, సత్వర న్యాయం అందుతుందన్నారు. కోర్టు తీర్పు తర్వాత సదరు పార్టీల మధ్య బంధం ఉండకపోవచ్చని, అదే మధ్యవర్తిత్వ పరిష్కారంలో వారి అంగీకారంతోపాటు బంధం బలహీనపడదని చెప్పారు. మీడియేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని, అది పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు పార్టీలకు సమ న్యాయం.. కోర్టుల్లో వివాదాల పరిష్కారంతో పోలిస్తే మధ్యవర్తిత్వ పరిష్కారం అన్నివిధాలా ఉత్తమమైనదని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంలో పార్టీలు ఇద్దరూ సఫలీకృతం అవుతారని, ఇద్దరికీ సమ న్యాయం అందుతుందని చెప్పారు. ఇంట్లో, ఊరిలో, సమాజంలో మధ్యవర్తులు ఉండి ఎక్కడికక్కడే సమస్యలకు చెక్ పెడితే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు. ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న కోవిడ్ సమయంలో ఈఎండబ్ల్యూ ఊపిరిపోసుకుందని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష కోర్టులు లేని సమయంలో కక్షిదారులకు సేవలందించిందని, ఇలా మూడేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం కోసం.. మధ్యవర్తిత్వం చేత.. మీడియేటర్లే నిర్వహిస్తున్న కార్యక్రమం ఈఎండబ్ల్యూ అని మీడియేషన్ ట్రైనర్ పుష్ప్ గుప్తా అన్నారు. అనంతరం మీడియేషన్ ట్రైనర్ థన్కచన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సైనిక బలగాల ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ రాజేంద్ర మీనన్, పలు రాష్ట్రాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈఎండబ్ల్యూ తెలంగాణ కో–ఆర్డినేటర్ మంజీరా వెంకటేశ్, కేఎస్ శర్మ, చిత్రా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి. -
కళానిధి మారన్-స్పైస్‌జెట్: సుప్రీం కీలక ఆదేశం
న్యూఢిల్లీ: కళానిధి మారన్-స్పైస్‌జెట్ కేసులో ఇచ్చిన ఆర్బిట్రల్ అవార్డ్ అమలు దిశగా సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.270 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెంటనే నగదుగా మార్చుకుని, ఆ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.పెండింగ్‌లో ఉన్న రూ.578 కోట్లకు గాను ఇప్పటికే రూ. 308 కోట్ల నగదు చెల్లించామని స్పైస్‌జెట్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బిట్రల్ అవార్డులో రూ.75 కోట్లను మూడు నెలల్లోగా కళానిధి మారన్, కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిక్రీ హోల్డర్‌కు ఇప్పటికే రూ.308 కోట్లను స్పైస్ జెట్ చెల్లించగా, బ్యాంక్ గ్యారంటీగా ఉన్న రూ.275 కోట్లను వెనక్కి తీసుకుని చెల్లించేయాలని ధర్మాసనం సూచించింది. స్పైస్ జెట్‌కు, మాజీ ప్రమోటర్ అయిన కళానిధి మా రన్, కల్ ఎయిర్వేస్ మధ్య షేర్ల బదిలీ వివాదం కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. రూ.243 కోట్లను వడ్డీ కింద డిపాజిట్ చేయాలని స్పైస్‌జెట్‌ను 2020 నవంబర్ 2 ఆదేశించడం తెలిసిందే. (ఇదీ చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్ ) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 270 కోట్లు వెంటనే చెల్లిస్తామని,అయితే కోర్టు ఆదేశాల మేరకు వడ్డీ కింద అదనంగా రూ. 75 కోట్లు మూడు నెలల్లో అందిస్తానమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుది పరిష్కార దిశగా ఇది తుది అడుగు అని తాము భావిస్తున్నామని స్పైస్‌జెట్ పేర్కొంది. -
ఢిల్లీ హైకోర్టులో ‘ఫ్యూచర్’కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ముందు అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభించిన మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) చర్యలను రద్దు చేయాలంటూ ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్) చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్‌లో మొదట దాఖలు చేసిన క్లెయిమ్ స్టేట్మెంట్ (ఎస్ఓసీ)కి అనుబంధంగా అమెజాన్ చేసిన అభ్యర్థనను అనుమతించే మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ప్రత్యేక ఉత్తర్వును సవాలు చేస్తూ ఎఫ్‌సీపీఎల్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా హైకోర్టు న్యాయమూర్తి సీ హరి శంకర్ కొట్టివేశారు. రాజ్యాంగంలోని 227 అధికరణ ప్రకారం ఆర్ర్బిట్రల్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం కుదరదని న్యాయమూర్తి 47 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అయితే ఆయా పార్టీల మధ్య వివాదాల విషయంలో మెరిట్స్‌పై కోర్టు ఎటువంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయబోదని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తు చేశారు. -
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హెచ్ఐసీసీలో మీడియేషన్, ఆర్బిట్రేషన్‌పై జరిగిన సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పరిశ్రమల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వాలు ముఖ్యమన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌కు హైదరాబాద్ అనుకూలమని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారం సత్వరమే జరగాలన్నారు. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల ద్వారా సమయం వృధా అవుతోందన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: Omicron: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు ‘లార్డ్ కృష్ణ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీలు సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్‌వన్‌గా ఉంది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని’’ సీజేఐ అన్నారు. త్వరలో శాశ్వత భవనం: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు. -
నిర్మాణ రంగానికి కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్యను నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఆర్బిట్రేషన్ పక్రియలో నిలిచిపోయిన మొత్తంలో 75 శాతం ఈ రంగానికి అందుబాటులోకి వచ్చే విధంగా నిబంధనల రూపకల్పన చేసింది. దీనిప్రకారం, కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డును (తీర్పు)ను ఒక మంత్రిత్వ శాఖ దాని విభాగం అప్పీలేట్ కోర్టులో సవాలు చేసిన సందర్భంలో అవార్డు ప్రకారం ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతం కాంట్రాక్టర్‌కు ఇకపై లభ్యమయ్యే అవకాశం ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు... నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ మేరకు ఇప్పటికే నిర్దేశాలు ఉన్నాయి. 2019 నవంబర్‌లో కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటూ, ఆర్బిట్రేషన్ అవార్డును ఏదైన ప్రభుత్వ రంగ సంస్థ సవాలు చేసిన సందర్భంలో ‘బ్యాంక్ గ్యారెంటీ’పై కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతాన్ని చెల్లించాలని చెల్లించాలని నిర్దేశించింది. ఇప్పుడు ఈ నిబంధనను మంత్రిత్వశాఖలకూ వర్తింపజేస్తూ నిబంధనలు రూపొందించింది. ఇందుకు సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ రూల్ (జీఎఫ్ఆర్)లో 227ఏ కొత్త రూల్‌ను జోడిస్తున్నట్లు వ్యయ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ‘మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ మధ్యవర్తిత్వ అవార్డ్‌ను సవాలు చేసిన సందర్భాలలో, ఆర్బిట్రల్ అవార్డ్ మొత్తాన్ని చెల్లించనట్లయితే, అవార్డ్‌లో 75 శాతాన్ని కాంట్రాక్టర్/రాయితీదారుకు బ్యాంక్ గ్యారెంటీపై మంత్రిత్వశాఖ /డిపార్ట్మెంట్ చెల్లించాలి‘అని తన తాజా ఉత్తర్వుల్లో కేంద్ర వ్యయ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు పరిశీలిస్తే... బ్యాంక్ గ్యారెంటీ ఆర్బిట్రల్ తీర్పులో పేర్కొన్న 75 శాతానికి మాత్రమే వర్తిస్తుంది. తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పేర్కొన్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఏర్పడినట్లయితే, మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్కు చెల్లించాల్సిన వడ్డీకి ఇది వర్తించబోదు. చెల్లింపులు ఎస్క్రో ఖాతాలోకి జరుగుతాయి. అయితే అంది వచ్చిన డబ్బు వినియోగంలో ముందుగా రుణదాతల బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చెల్లింపుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఉపయోగించాలి లేదా పరస్పరం అంగీకరించిన, నిర్ణయించుకున్న అదే మంత్రిత్వ శాఖ/ డిపార్ట్మెంట్ ఇతర ప్రాజెక్ట్‌ల పూర్తికి కూడా ఉపయోగించవచ్చు. రుణదాతల బకాయిల పరిష్కారం, అటుపై మంత్రిత్వశాఖ/డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌ల పూర్తి తర్వాత ఎస్క్రో ఖాతాలో మిగిలి ఉన్న ఏదైనా బ్యాలెన్స్‌ను లీడ్ బ్యాంకర్, మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ ముందస్తు అనుమతితో కాంట్రాక్టర్/రాయితీదారు వినియోగించుకోవచ్చు. నిలిపివేసిన ఏదైనా డబ్బు లేదా ఇతర మొత్తాలను కూడా బ్యాంక్ గ్యారెంటీపై కాంట్రాక్టర్‌కు విడుదల చేయవచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకుని ఆర్బిట్రల్ తీర్పును, దానిపై ఏదైనా అప్పీల్‌ను పరిష్కరించుకోడానికి (కొట్టివేయించడానికి) తగిన నిర్ణయాన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకోవచ్చు. ఆర్బిట్రల్ అవార్డు అప్పీల్స్, ఆయా ఆంశాల పెండింగ్ సందర్భాల్లో కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడంలేదు. సంబంధిత న్యాయ ప్రక్రియ ముగింపునకు సంవత్సరాలు పడుతున్న నేపథ్యం లో కేంద్రం ఈ చర్యలపై దృష్టి సారించింది. -
ఇది చరిత్రాత్మక ఘట్టం: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
ఈ కేంద్రం ఏర్పాటు నా చిరకాల స్వప్నం.. ఇంత త్వరగా సాకారమవుతుందనుకోలేదు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు శుభపరిణామం ఇకపై వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారం అవుతాయి హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయి సాక్షి, హైదరాబాద్: ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఓ చరిత్రాత్మక ఘట్టం. ఈ కేంద్రం దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి నివాసంలో శుక్రవారం జరిగిన అంత ర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం నా చిరకాల స్వప్నం. ఆ స్వప్నం ఇంత త్వరగా సాకారమవుతుందని అనుకోలేదు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్‌లో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రతిపాదన తెలియజేశా. ఆయన వెంటనే స్పందించారు. మూడు నెలల్లోపే నా స్వప్నం సాకారం చేసేందుకు అడుగులు పడ్డాయి. ఇందుకు సీఎం కేసీఆర్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ట్రస్ట్‌డీడ్‌పై జస్టిస్ రమణ, ట్రస్ట్ లైఫ్ మెంబర్లు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లి, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోరు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. వివాదం లేని వాతావరణం... ‘‘పెట్టుబడిదారులు వివాదాలకు ఆస్కారం లేని వాతావరణాన్ని కోరుకుంటారు. ఏదైనా వివాదం వచ్చినా సత్వరం పరిష్కరించుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం దేశంలో అలాంటి వాతావరణం లేదు. వివాదాల పరిష్కారానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 2015లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని పెట్టుబడులు ఆహ్వానించేందుకు జపాన్, కొరియాకు పంపింది. ఆ బృందంలో నేనూ ఒకర్ని. ఆయా దేశాల్లో విస్తృతంగా పర్యటించి 8 ప్రదేశాల్లో పెట్టుబడిదారులతో చర్చలు జరిపాం. మీ దేశంలో వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందని వారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడ్డాం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారమవుతాయి. దీంతో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఈ కేంద్రాన్ని ప్రోత్సహించండి. తద్వారా హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. సంస్కరణలకు పీవీ బీజం వేశారు... ‘‘దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజం వేశారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆయన ప్రయత్నించగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ చట్టానికి రూపకల్పన జరిగింది. 1996లో ఆర్టిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. 1926లో పారిస్‌లో మొదటి ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభమైంది. ఇటీవల దుబాయ్‌లో కూడా ఓ కేంద్రం ప్రారంభమైంది. షామీర్పేటలోని నేషనల్ లా యూనివర్శిటీ (నల్సార్) సమీపంలో 2003లో 10 ఎకరాల భూమి, రూ. 25 కోట్లను ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రతివాదన ముందుకు వెళ్లలేదు. ఆ భూమి ఇప్పటికీ హైకోర్టు అధీనంలో ఉంది. దాన్ని వెనక్కు తీసుకొని ఫైనాన్స్ డిస్ట్రిక్ సమీపంలో ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు సూచిస్తున్నా. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు వస్తాయి... ఈ కేంద్రం ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రంలో న్యాయవ్యవస్థ నుంచే కాకుండా వివిధ రంగాల్లోని నిపుణులైన ఆర్బిట్రేటర్స్ ఉంటారని, ఈ కేంద్రం రాష్ట్రానికే కాకుండా దేశానికే మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ సంయుక్తంగా ప్రయత్నించి ఈ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తెలుగువారైన ముగ్గురు న్యాయమూర్తులు కొలుగుదీరిన వేళ దేశంలోనే ఈ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అదృష్టమని, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని, ఈ సెంటర్ ఫలవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్ జగన్నాథరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు
న్యూఢిల్లీ: వివాదాలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఉత్తమమైన మార్గమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. రాబోయే రోజుల్లోనూ మధ్యవర్తిత్వం పాత్ర మరింత పెరగడం ఖాయమని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు (మీడియేటర్స్) గురువారం నిర్వహించిన ఇంటర్నేషనల్ వర్చువల్ మీడియేషన్ సమ్మర్ స్కూల్–2021 కార్యక్రమం ‘నివారణ్’లో జస్టిస్ రమణ మాట్లాడారు. బ్రిటిష్ పాలకులు ఆధునిక భారత న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేయడమే కాకుండా, గొడవలను పరిష్కరించుకోవాలన్నా, న్యాయం పొందాలన్నా నల్ల కోట్లు, గౌన్లు, కోర్టుల్లో సుదీర్ఘ వాదోపవాదాలు అవసరమన్న అపోహను సైతం వారే సృష్టించారని పేర్కొన్నారు. అలాంటి అపోహలు, అభిప్రాయాలను దూరం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. చాలామంది కక్షిదారులు న్యాయం పొందే విషయంలో సామాజికంగా, ఆర్థికంగా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. వివాదాల పరిష్కారానికి సరళమైన మార్గాన్ని వారు కోరుకుంటున్నారని తెలిపారు. -
కెయిర్న్ వివాదం: భారత్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను వివాదంలో భారత ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. బ్రిటిష్ ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీ సంస్థ వివాదంలో భారత్ కు అంతర్జాతీయ కోర్టు రూ. 8 వేల కోట్ల జరిమానాను విధించింది. కెయిర్న్ ఎనర్జీకి సంబంధించిన రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం(ఆర్బిట్రేషన్) కెయిర్న్ ఎనర్జీ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు పన్నులను చెల్లించాల్సిన అవసరంలేదంటూ దీంతో తాజా ఆదేశాలు జారీ చేసింది. పన్ను వివాదం కేసుల్లో అంతర్జాతీయ కోర్టులో భారత్ ఇటీవలి కాలంలో ఇది రెండవ ఎదురుదెబ్బ. ఈ ఏడాది సెప్టెంబరులో సెప్టెంబరులో వోడాఫోన్ గ్రూప్ భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసులో విజయం సాధించిన తరువాత ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. యుకే-ఇండియా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ప్రకారం కైర్న్‌కు భారత్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, భారత్ ఆపేసిన పన్ను రిటర్న్ రీఫండ్, డివిడెండ్లతో పాటు పన్ను వసూళ్ల కోసం విక్రయించిన షేర్ల సొమ్ముకు వడ్డీతో సహా రూ. 8,000 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. కాగా దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కెయిన్ సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా భారత్ వ్యవహరించినట్లు కోర్టు ఆరోపించింది. కెయిన్ ట్యాక్స్ వివాదం కేవలం పన్ను వివాదం మాత్రమే కాదు అని, అది పన్ను పెట్టుబడికి సంబంధించిన వివాదమని వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలోనే ఈ కేసు తమ పరిధిలోకి వస్తుందని హేగ్ కోర్టు వెల్లడించింది. -
వివాదంలో రిలయన్స్ - ఫ్యూచర్స్ డీల్
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్ గ్రూప్ అసెట్ల విక్రయ అంశం వివాదానికి దారి తీసింది. ఫ్యూచర్ గ్రూప్ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమైనదంటూ అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్)ను ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకు గాను ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపింది. ‘కాంట్రాక్టు ప్రకారం మా హక్కులు కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున వివరాలను వెల్లడించలేం’ అని అమెజాన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి అసెట్స్ విక్రయానికి సంబంధించి ఇతర వ్యాపార సంస్థలతో పాటు అమెజాన్‌కు కూడా ఫ్యూచర్ గ్రూప్ ఆఫర్ ఇచ్చిందని, అది తిరస్కరించిన తర్వాతే రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నాయి. పైగా ఎఫ్‌డీఐ నిబంధనలు, ఫ్యూచర్ గ్రూప్‌లో తదుపరి పెట్టుబడులు పెట్టే హక్కులు మూడేళ్ల తర్వాతే అమెజాన్‌కు దఖలు పడనుండటం కూడా ఫ్యూచర్ సంస్థల్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రతిబంధకాలని వివరించాయి. వివరాల్లోకి వెడితే.. అమెజాన్ డాట్‌కామ్ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్ కూపన్స్‌లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లో ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారాలు లభిస్తాయి. మరోవైపు, తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాలను రిలయన్స్‌కి విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఈ ఏడాది ఆగస్టులో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే రూ. 37,700 కోట్ల పెట్టుబడులు సమీకరించి దూసుకెడుతున్న తరుణంలో ఫ్యూచర్-అమెజాన్ మధ్య వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వ్యాజ్యాలకు ముందే మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ: వ్యాజ్యం దాఖలు కంటే ముందే మధ్యవర్తిత్వం జరిగేలా ‘తప్పనిసరి మధ్యవర్తిత్వ చట్టం’ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. ‘ప్రపంచీకరణలో మధ్యవర్తిత్వ పాత్ర’ అన్న అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సు మూడవ ఎడిషన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యాజ్యం దాఖలుకు ముందే మధ్యవర్తిత్వం జరిగితే కోర్టు తీర్పుల నాణ్యత పెరుగుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన ‘ఆర్బిట్రరీ బార్’ భారత్‌లో తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి అనుభవంతో పాటు విషయ పరిజ్ఞానం కలిగిన లాయర్లు అవసరమవుతారని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యం, కామర్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిలో మధ్యవర్తిత్వం మౌలిక అంశమని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వాణిజ్యం జరుగుతున్న ఈ రోజుల్లో మధ్యవర్తిత్వం అత్యవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం కంటే రాజీ కుదర్చడం ఇంకా ఉత్తమమైనదని చెప్పారు. వాణిజ్య న్యాయస్థాన కోర్టుల చట్టం కూడా మధ్యవర్తిత్వం గురించి, సెటిల్మెంట్ గురించి చెప్పిందన్నారు. -
2జీ స్కామ్ తీర్పు: ఆర్బిట్రేషన్ల వరద?
2జి స్పెక్ట్రమ్ కేసులో మొత్తం 17 మంది నిందితులను ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఆర్బిట్రేషన్ల వరద పోటెత్తునుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెలికాం తప్పుడు విధానాలతో నష్టపోయినందుకుగాను ఆయా కంపెనీలు భారీ ఎత్తున నష్టపరిహారం కోరనున్నారని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా లూప్ టెలికాం, రష్యాకు చెందిన సిస్టెమా, టెలినార్ లాంటి ఆపరేటర్లు తమ వ్యూహాలను మార్చనున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ విషయంలో దేశీయ ఆపరేటర్ వీడియోకాన్ నష్టాన్ని పూడ్చుకునే పనిలో వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు 2జీ స్కాంపై తాజా తీర్పుతో భారత టెలికాం రంగానికి చెందిన విదేశీ కంపెనీలకు ఇది తలుపులు తెరిచిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసిన 122 లైసెన్సుల రద్దు చేసిన సంస్థలు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని, వీటిని పునఃప్రారంభించడానికి లేదా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరవచ్చని అశిష్ భాన్ అభిప్రాయపడ్డారు. సిస్టెమా, టెలినార్పై విచారణ జరపలేదు. ఒక వేళ వారు మారిషస్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే .. వారికిది మంచి అవకాశమని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. అలాగే పటియాల హౌస్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేయాలన్న ఈడీ, సిబిఐ నిర్ణయం ప్రస్తుత పరిస్థితిని పెద్దగా మార్చలేదని చెప్పారు. ఈ కేసులో ఎటువంటి నేరారోపణ లేదని నిరూపించడానికి ప్రత్యేక సిబిఐ కోర్టుకు ఏడు సంవత్సరాలు పట్టింది. ప్రత్యేక సిబిఐ కోర్టు పరిశీలించిన సాక్షాధారాల్లో లొసుగులను హైకోర్టు గుర్తించకపోతే, హైకోర్టు జోక్యం సులభం కాదని బన్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే వీడియోకాన్ ప్రభుత్వాన్నిసవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి తప్పులేకుండానే తాము రూ.25 వేలకోట్లను నష్టపోయామని వాదిస్తోంది. తాజా తీర్పుతో ప్రభుత్వంనుంచి పరిహారాన్ని కోరేందుకు మరింత బలం చేకూరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2015 లో టెలికాం ట్రిబ్యునల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. రూ.10వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌పై నిస్సాన్ రూ. 5 వేల కోట్ల దావా
న్యూఢిల్లీ: రాయితీలు బకాయిపడిందంటూ భారత్‌కు వ్యతిరేకంగా జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ తాజాగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. ప్లాంటు పెడితే ఇస్తామన్న ప్రోత్సాహకాలు, పరిహారాలు, వడ్డీ వ్యయాలూ అన్నీ కలిపి దాదాపు రూ.5,000 కోట్ల మేర బకాయి ఉండిపోయాయని, వీటిని తక్షణం చెల్లించేలా చూడాలంటే వివాద పరిష్కారం కోసం కంపెనీ ఆర్బిట్రేషన్ చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ బకాయిలపై కంపెనీ గతేడాదే ప్రధాని నరేంద్ర మోదీకి లీగల్ నోటీసు కూడా పంపింది. కంపెనీ వర్గాలు ఈ అంశాలను ఖండించకపోవడం ఆర్బిట్రేషన్ చర్యల వార్తలకు ఊతమిచ్చినట్లయింది. వివరాల్లోకి వెడితే.. తమిళనాడులో ఏర్పాటు చేసిన తయారీ ప్లాంటుపై నిస్సాన్ ఇప్పటిదాకా దాదాపు రూ.6,100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్లాంటుకి ఏటా 4.8 లక్షల కార్ల తయారీ సామర్థ్యం ఉంది. ప్లాంటు ఏర్పాటు కోసం అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం నిస్సాన్‌కి పలు ప్రోత్సాహకాలతో పాటు పన్నులపరమైన రాయితీలు కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. అయితే, 2015లో అందజేయాల్సిన రాయితీలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో నిస్సాన్ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది. సమస్య పరిష్కారానికే మొగ్గు..: తమిళనాడు ప్రభుత్వం బకాయిపడిన రాయితీల చెల్లింపు వివాద పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని నిస్సాన్ పేర్కొంది. ప్రతిష్టాత్మక మేకిన్ ఇండియా కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములుగా ఉన్నామని.. భారత్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40,000 పైగా ఉద్యోగాల కల్పన చేశామని సంస్థ ప్రతినిధి తెలిపారు. దాదాపు బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులతో తమిళనాడు ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పాటు అందించామని వివరించారు. -
రిలయన్స్–ఓఎన్జీసీ వివాదంలో ఆర్బిట్రేటర్ ఎంపిక
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్యాస్ వెలికితీసిన వివాదంపై ఏర్పాటైన త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్ ప్రిసైడింగ్ జడ్జిగా సింగపూర్‌కి చెందిన ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ లారెన్స్ బూ నియమితులయ్యారు. మిగతా ఇద్దరు ఆర్బిట్రేటర్లు ఇందుకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర చమురు శాఖ వర్గాలు తెలిపాయి. పొరుగునే ఉన్న ఓఎన్జీసీ క్షేత్రానికి చెందిన గ్యాస్‌ను ఆర్ఐఎల్ దాదాపు ఏడేళ్ల పాటు కేజీ–డీ6లోని తమ క్షేత్ర బావుల నుంచి వెలికితీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి గాను మొత్తం 1.55 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు నికో, బీపీలకు చమురు శాఖ నోటీసులిచ్చింది. దీనిపై నవంబర్ 11న ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్ నోటీసు ఇచ్చింది. తమ ఆర్బిట్రేటర్‌గా బ్రిటన్ హైకోర్టు న్యాయమూర్తి బెర్నార్డ్ ఎడర్ను ప్రతిపాదించింది. -
ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ వివాదంలో ఆర్బిట్రేటర్ నియామకం
న్యూఢిల్లీ: గ్యాస్ వెలికితీతపై ఓఎన్జీసీ–రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నెలకొన్న వివాద పరిష్కార ఆర్బిట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తమ తరఫు ఆర్బిట్రేటర్‌గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్ సింఘ్వీ పేరును ప్రతిపాదించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ ఇప్పటికే తమ తరఫు ఆర్బిట్రేటర్‌గా బ్రిటన్ హైకోర్టు జడ్జి బెర్నార్డ్ ఎడర్ పేరు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. త్రిసభ్య ప్యానెల్లో సభ్యులైన ఈ ఇద్దరు ఇక.. ప్రిసైడింగ్ జడ్జి ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేజీ–డీ6 బ్లాక్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. పొరుగునే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ క్షేత్రం నుంచి ఏడేళ్లుగా దాదాపు 338.332 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్ (ఎంబీటీయూ) వెలికితీసిందంటూ నవంబర్ 3న చమురు శాఖ ఆర్ఐఎల్కు నోటీసులు ఇచ్చింది. ఈ గ్యాస్‌కు సంబంధించి మొత్తం 1.55 బిలియన్ డాలర్లు కట్టాలంటూ ఆదేశించింది. వాస్తవానికి ఆర్‌ఐఎల్‌పై ఓఎన్జీసీ స్వయంగా దావా వేసినప్పటికీ .. సహజ వనరులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి గనుక పరిహారం కేంద్రానికే చెందాలంటూ మాజీ జస్టిస్ ఏపీ షా కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలోనే చమురు శాఖ ఆర్ఐఎల్కు నోటీసులిచ్చింది.