న్యూఢిల్లీ: కళానిధి మారన్-స్పైస్‌జెట్ కేసులో ఇచ్చిన ఆర్బిట్రల్ అవార్డ్ అమలు దిశగా సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.270 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెంటనే నగదుగా మార్చుకుని, ఆ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కల్ ఎయిర్‌వేస్‌కు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.పెండింగ్‌లో ఉన్న రూ.578 కోట్లకు గాను ఇప్పటికే రూ. 308 కోట్ల నగదు చెల్లించామని స్పైస్‌జెట్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్బిట్రల్ అవార్డులో రూ.75 కోట్లను మూడు నెలల్లోగా కళానిధి మారన్, కల్ ఎయిర్‌వేస్‌కు చెల్లించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిక్రీ హోల్డర్‌కు ఇప్పటికే రూ.308 కోట్లను స్పైస్ జెట్ చెల్లించగా, బ్యాంక్ గ్యారంటీగా ఉన్న రూ.275 కోట్లను వెనక్కి తీసుకుని చెల్లించేయాలని ధర్మాసనం సూచించింది. స్పైస్ జెట్‌కు, మాజీ ప్రమోటర్ అయిన కళానిధి మా రన్, కల్ ఎయిర్‌వేస్ మధ్య షేర్ల బదిలీ వివాదం కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. రూ.243 కోట్లను వడ్డీ కింద డిపాజిట్ చేయాలని స్పైస్‌జెట్‌ను 2020 నవంబర్ 2 ఆదేశించడం తెలిసిందే.
(ఇదీ చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్ )
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 270 కోట్లు వెంటనే చెల్లిస్తామని,అయితే కోర్టు ఆదేశాల మేరకు వడ్డీ కింద అదనంగా రూ. 75 కోట్లు మూడు నెలల్లో అందిస్తానమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుది పరిష్కార దిశగా ఇది తుది అడుగు అని తాము భావిస్తున్నామని స్పైస్‌జెట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment