bank guarantee
-
బ్యాంక్ హామీని మినహాయించండి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ(ఎఫ్‌బీజీ) మినహాయించమంటూ టెలికం శాఖ(డాట్)ను అభ్యరి్థంచినట్లు తెలుస్తోంది. స్పెక్ట్రమ్ చెల్లింపులకుగాను 2025 సెపె్టంబర్లో అందించవలసిన రూ. 24,747 కోట్ల ఎఫ్బీజీని మినహాయించమని డాట్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ వేలం నిబంధనల ప్రకారం వార్షికంగా చెల్లించవలసిన మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) ఏడాది ముందుగానే సెక్యూరిటైజ్ చేయవలసి ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై వొడాఫోన్ ఐడియా స్పందించకపోవడం గమనార్హం! 2022కంటే ముందుగా నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కుగాను వీఐఎల్ చెల్లించవలసిన మొత్తమిది. అయితే 2022లో చెల్లింపులపై ప్రభు త్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా వీఐఎల్ నాలుగేళ్ల నిషేధాన్ని(మారటోరియం) వివియోగించుకుంది. ఫలితంగా 2016వరకూ నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులు 2025 అక్టోబర్– 2026 సెప్టెంబర్ మధ్యకాలంలో చేపట్టవలసి ఉంటుంది. మరోవైపు ఏజీఆర్ బకాయిల(చెల్లింపులు)పైనా మారటోరియాన్ని కంపెనీ వినియోగించుకుంది. ఇది 2026 మార్చిలో ముగియనుంది. దీంతో మారటోరియం ముగియడానికి కనీసం 13 నెలల ముందుగా వీఐఎల్ బ్యాంక్ గ్యారంటీలను సమరి్పంచవలసి ఉంటుంది. కాగా.. 2024 మార్చి31కల్లా కంపెనీ ప్రభుత్వానికి రూ. 2,03,430 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,33,110 కోట్లుకాగా.. ఏజీఆర్ బకాయిలు రూ. 70,320 కోట్లు! మారటోరియాన్ని అందుకున్న సమయంలో కంపెనీ రూ. 16,000 కోట్ల వడ్డీ చెల్లింపులను ఈక్విటీ జారీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్ చేసింది. తద్వారా కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించింది. తదుపరి కంపెనీ ఎఫ్‌పీవో ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించడంతో ప్రభుత్వ వాటా 23.8 శాతానికి పరిమితమైంది. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు ఫ్లాట్‌గా రూ. 16.62 వద్ద ముగిసింది. -
కళానిధి మారన్-స్పైస్‌జెట్: సుప్రీం కీలక ఆదేశం
న్యూఢిల్లీ: కళానిధి మారన్-స్పైస్‌జెట్ కేసులో ఇచ్చిన ఆర్బిట్రల్ అవార్డ్ అమలు దిశగా సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.270 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెంటనే నగదుగా మార్చుకుని, ఆ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.పెండింగ్‌లో ఉన్న రూ.578 కోట్లకు గాను ఇప్పటికే రూ. 308 కోట్ల నగదు చెల్లించామని స్పైస్‌జెట్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బిట్రల్ అవార్డులో రూ.75 కోట్లను మూడు నెలల్లోగా కళానిధి మారన్, కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిక్రీ హోల్డర్‌కు ఇప్పటికే రూ.308 కోట్లను స్పైస్ జెట్ చెల్లించగా, బ్యాంక్ గ్యారంటీగా ఉన్న రూ.275 కోట్లను వెనక్కి తీసుకుని చెల్లించేయాలని ధర్మాసనం సూచించింది. స్పైస్ జెట్‌కు, మాజీ ప్రమోటర్ అయిన కళానిధి మా రన్, కల్ ఎయిర్వేస్ మధ్య షేర్ల బదిలీ వివాదం కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. రూ.243 కోట్లను వడ్డీ కింద డిపాజిట్ చేయాలని స్పైస్‌జెట్‌ను 2020 నవంబర్ 2 ఆదేశించడం తెలిసిందే. (ఇదీ చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్ ) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 270 కోట్లు వెంటనే చెల్లిస్తామని,అయితే కోర్టు ఆదేశాల మేరకు వడ్డీ కింద అదనంగా రూ. 75 కోట్లు మూడు నెలల్లో అందిస్తానమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుది పరిష్కార దిశగా ఇది తుది అడుగు అని తాము భావిస్తున్నామని స్పైస్‌జెట్ పేర్కొంది. -
మనీ లాండరింగ్ కేసు: వివోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 945 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే రూ. 250 కోట్ల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆయా ఖాతాలను ఆపరేట్ చేసుకోవచ్చని తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు, బ్యాంకు ఖాతాల స్వాధీనంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి ఈడీ దాడులు, బ్యాంకు ఖాతాల సీజ్‌పై వివో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తే 2,826 కోట్ల రూపాయల నెలవారీ జీతాలు చెల్లించలేమని పేర్కొంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. వివో తరపున సీనియర్ న్యాయ వాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ బ్యాంకు ఖాతాలను సీజ్ వల్ల వివో కార్యకలాపాలు నిలిచి పోయాయని వాదించారు. కాగా పన్నులు ఎగవేసేందుకు దేశంలో ఆదాయాన్ని తక్కువ చూపించి కోట్ల రూపాయలను చైనాకు తరలించిందనే ఆరోపణలపై ఈడీ జూలై 5న దేశవ్యాప్తంగా వివో కార్యాలయాలపై విస్తృత దాడులు చేసింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.465 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరో రూ.73 లక్షల నగదు, రెండు కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసింది. భారత్‌లో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
టెల్కోలకు బ్యాంక్ గ్యారంటీ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ప్రకటించిన సంస్కరణలను కేంద్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తులో నిర్వహించబోయే స్పెక్ట్రం వేలం నిబంధనలను సడలిస్తూ టెలికం విభాగం (డాట్) సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం స్పెక్ట్రం వార్షిక చెల్లింపుల పూచీకత్తుకు సంబంధించి టెల్కోలు ఒక ఏడాది వాయిదా మొత్తానికి సరిపడేంత .. ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ (ఎఫ్‌బీజీ) ఇవ్వాలన్న నిబంధనను తొలగించింది. అలాగే సర్వీసుల విస్తరణ విషయంలో పనితీరు బ్యాంక్ గ్యారంటీ (పీబీజీ) సమర్పించాలన్న షరతును కూడా ఎత్తివేసింది. వేలంలో పాల్గొనే సంస్థలకు తగినంత ఆర్థిక స్థోమత ఉండేలా అర్హతా ప్రమాణాలను కూడా తగు రీతిలో సవరించనున్నట్లు టెలికం శాఖ పేర్కొంది. భవిష్యత్తులో స్పెక్ట్రంను 30 ఏళ్ల వ్యవధికి కేటాయించనున్నట్లు వివరించింది. గత విడతల్లో విక్రయించిన స్పెక్ట్రం కాలపరిమితిలో (20 ఏళ్లు) ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. 30 ఏళ్ల కాలపరిమితితో స్పెక్ట్రంను కేటాయించే విషయంలో ఆపరేటర్లు ముందుగా జరపాల్సిన చెల్లింపులు, ఇందుకోసం ఇవ్వతగిన మారటోరియం వ్యవధి, వాయిదాలు మొదలైన అంశాలపై తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను కోరినట్లు డాట్ పేర్కొంది. మరోవైపు, టెల్కోలు కనీసం 10 ఏళ్ల వ్యవధి తర్వాత తమ స్పెక్ట్రంను వాపసు చేయవచ్చని డాట్ తెలిపింది. అయితే, దీని గురించి ఏడాది ముందే తెలియజేయాల్సి ఉంటుందని, సరెండర్ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. సంస్కరణలతో టెల్కోలపై తగ్గనున్న భారం: సీవోఏఐ డీజీ కొచర్ టెలికం రంగంలో కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే స్పెక్ట్రం వేలానికి సంబంధించి ఎఫ్‌బీజీ, పీబీజీ నిబంధనలను తొలగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో ఆపరేటర్లపై ఆర్థిక భారం తగ్గగలదని కొచర్ పేర్కొన్నారు. టెలికం రంగంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడానికి ఇవి తోడ్పడగలవని ఆయన వివరించారు. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి పాటిల్ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
మరింత కష్టాల్లోకి అంబానీ : మునగడమా? ఈదడమా?
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ మరింత కష్టాల్లోకి కూరుకుపోతున్నారు. ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నోటీసులు జారీ చేసింది. రాబోయే స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద బ్యాంకు హామీలలో భాగంగా 774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే లైసెన్సు రద్దు చేస్తామని డీఓటీ హెచ్చరించింది. ఈ నెల చివరి వరకు వీటిని చెల్లించాలని ఆదేశించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు తన ఆస్తులు అమ్మి రుణాలు తీర్చుకోవాలని భావిస్తున్న అనిల్ అంబానీ కంపెనీకి, డీఓటీ ఈ నోటీసులు జారీచేయడం మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం అంబానీ పరిస్థితి సముద్రంలో మునగడమా? ఈదడమా? అనే రీతిలో ఉందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఉన్న రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు తన వైర్లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోకు విక్రయిస్తోంది. దీంతో రూ.18వేల కోట్ల మేర రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్జిస్తోంది. జూన్ చివరి వారంలోనే ఆర్‌కామ్‌కు డీఓటీ ఈ షోకాజు నోటీసు జారీచేసినట్టు తెలిసింది. ఈ నెల ప్రారంభంలోనే తాము నోటీసులు అందుకున్నామని, దానికి సమాధానం కూడా ఇచ్చినట్టు కంపెనీకి చెందిన అధికారులు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీల కింద రూ.774కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అయితే టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెట్ ట్రైబ్యునల్(టీడీశాట్) ఆదేశాల ప్రకారం బ్యాంక్ గ్యారెంటీల మొత్తాన్ని డీఓటీ తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే తాము బ్యాంక్ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే, డీఓటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా ఆర్‌కామ్ తన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఫండ్స్‌ను ఆర్‌కామ్ సమకూర్చుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలను నిర్దేశించిన సమయం లోపల చెల్లించకపోతే, కంపెనీని స్పెక్ట్రమ్ సేల్‌లో అనుమతించేందుకు డీఓటీ సమ్మతించకపోవచ్చని తెలుస్తోంది. దీంతో జియోతో డీల్ జాప్యమవుతుంది. ఒకవేళ అన్నట్టే లైసెన్స్‌లను రద్దు చేస్తే, లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా డీఓటీ హెచ్చరించినట్టు అవుతోంది. -
మార్కెట్ ఏజెంట్ల బ్యాంకు గ్యారెంటీల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కూరగాయలు, పండ్ల మార్కెట్లలో కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్, ట్రేడర్స్ లైసెన్సు రెన్యువల్ తదితరాల బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించి డిపాజిట్ల సొమ్ములో సవరణలు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ఏజెంట్లు, ట్రేడర్లకే సవరణ ఉత్తర్వులు అమలవుతాయి. టర్నోవర్ కోటి రూపాయల లోపున్న కూరగాయలు, పండ్ల కమీషన్ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్‌కు బ్యాంకు గ్యారంటీ రూ.3 లక్షలుండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటికి పైగా టర్నోవర్‌కు రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే, దాన్ని రూ.50 వేలకు తగ్గించారు. ఇక రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వారికి రూ.లక్ష గ్యారెంటీగా నిర్ణయించారు. ఇతర లైసెన్సుల రెన్యువల్‌కు... కూరగాయలు, పండ్లకు సంబంధించి కాకుండా ఇతర లైసెన్సుల రెన్యువల్‌కు రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండేది. దాన్ని రూ.50 వేలకు, కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.లక్ష, ఐదు కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారెంటీగా నిర్ధారించారు. ఇక పండ్లు, కూరగాయల ట్రేడ్ లైసెన్సు రెన్యువల్‌కు రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.లక్ష బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటి టర్నోవర్ ఉంటే రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.50 వేలకు కుదించారు. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ట్రేడర్ల గ్యారెంటీని రూ.లక్ష చేశారు. పండ్లు, కూరగాయలు కాకుండా ఇతర వాటి ట్రేడ్ లైసెన్సు రెన్యువల్స్‌కు కోటి టర్నోవర్ ఉంటే రూ.5 లక్షలకు బదులు రూ.50 వేలు, కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.10 లక్షలున్న బ్యాంకు గ్యారెంటీని రూ.లక్షకు కుదించారు. రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ కోరారు. ప్రాసెసింగ్ లైసెన్స్‌కు... ఇక ప్రాసెసింగ్ లైసెన్సుకు రూ.కోటి నుంచి అంతకుమించి టర్నోవర్ ఉంటే రూ.3 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని ఎంత టర్నోవర్ ఉన్నా రూ.50 వేలకు కుదించారు. వేర్‌హౌసింగ్ లైసెన్సుకు రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే రూ.50 వేలకు తగ్గించారు. మార్కెట్ నోటిఫికేషన్‌కు రూ.20 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. డైరెక్ట్ పర్చేజ్ సెంటర్ (డీపీసీ)కు రూ.10 లక్షల బ్యాంకు గ్యారెంటీని రూ.2 లక్షలకు కుదించారు. జాతీయ పొదుపు సర్టిఫికెట్లను కూడా బ్యాంకు గ్యారెంటీగా చూపొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పూచీకత్తు ఇవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ వ్యాపారులకు, ఏజెంట్లకు సర్కారు ముకుతాడు బిగించింది. ఆయా మార్కెట్ల టర్నోవర్‌ను బట్టి వ్యాపారులు, ఏజెంట్లు తప్పనిసరిగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకు గ్యారంటీ చూపాలని సర్కారు నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్కెటింగ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చట్టం అమలు మార్గదర్శకాలు, నిబంధనలపై నోటిఫికేషన్ జారీ చేసింది. డబ్బు ఎగ్గొడుతున్న వైనం.. ఇప్పటి వరకు ఏజెంట్లు, వ్యాపారులకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ ఉండేది కాదు. అయితే చాలాచోట్ల వ్యాపారులు, ఏజెంట్లు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొడుతున్నారు. ఇలాంటి పరిస్థితికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో బ్యాంకు గ్యారంటీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 10 వేల మంది వ్యాపారులు, 4,200 మంది ఏజెంట్లు కొత్తగా బ్యాంకు గ్యారంటీ చూపాల్సి ఉంది. వారికి మూడేళ్లకోసారి లైసెన్సులు జారీ చేస్తారు. మరిన్ని మార్గదర్శకాలు ♦ కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. అయితే రైతుతో కాంట్రాక్టు చేసుకునే స్పాన్సర్.. తప్పనిసరిగా పంట ఉత్పత్తి అంచనాలో 20 శాతం బ్యాంకు గ్యారంటీ చూపాలి. అప్పుడే అతన్ని కాంట్రాక్టు వ్యవసాయంలో భాగస్వామిని చేస్తారు. ♦ కొనుగోలుదారులకు ఒక ఫారం, కమీషన్‌దారులకు మరో ఫారం, గోదాములకు మరో ఫారం, ప్రాసెసింగ్ యూనిట్లకు ఒక ఫారం ద్వారా లైసెన్సులు జారీ చేస్తారు. కేటగిరీల వారీగా షరతులు విధించి లైసెన్సులు జారీ చేస్తారు. ♦రూలు 49–బి ద్వారా క్లియరింగ్, ఫార్వర్డింగ్ ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటు. అన్ని మార్కెట్లలో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. సరుకులను సులువుగా రవాణా చేసేందుకు అవకాశం కలుగుతుంది. ♦లైసెన్స్ సస్పెండ్ చేసే అధికారం డైరెక్టర్‌కు కల్పించారు. దీనివల్ల పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ♦కమీషన్ ఏజెంటు జారీ చేసే తక్‌పట్టీ మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ తక్‌పట్టీ ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. దీంతో తక్‌పట్టీ కోసం కమీషన్ ఏజెంటుపై రైతు ఆధారపడే పరిస్థితి పోతుంది. అనుమతిలేని చెల్లింపులను తక్‌పట్టీలో పొందుపరచకుండా నిషేధించే అవకాశముంది. ♦మార్కెట్ కమిటీ రికార్డుల్లో నమోదు ద్వారా రైతు సరుకుకు పూర్తి భద్రత కల్పించారు. ఇందుకోసం స్టోరేజీ స్లిప్‌ను ఆన్లైన్ మార్కెట్ ద్వారా రైతు పొందే అవకాశముంది. ♦మార్కెట్ చార్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లే నిర్ణయించే అధికారం కల్పించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటారు. ♦నెలవారీ కొనుగోలు నివేదికలను వ్యాపారులు ఇవ్వాలి. దీంతో పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. వ్యాపారులకు ఈ–ప్లాట్‌ఫాం ద్వారా పర్మిట్లు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో అక్రమ రవాణా తగ్గుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఎవరైనా సరే ధాన్యం, ఇతర పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతుల పంటను కొనుగోలు చేయాలి. ఇందులోకి రిలయన్స్ సహా ఆ స్థాయి కలిగిన సంస్థలను ఆహ్వానించాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అలాగే గోదాములు, వేర్ హౌజింగ్, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా మార్కెట్లుగా మార్చేందుకు వీలు కల్పించారు. కమీషన్ ఏజెంటు రైతుకు డబ్బు చెల్లించాకే వ్యాపారికి పంట అందజేయాలి. చెల్లింపుల వివరాలు తెలిపే రికార్డులను కమీషన్ ఏజెంటు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల రైతు అమ్మిన పంటకు తక్షణమే సొమ్ము చేతికి వస్తుంది. అలాగే ప్రైవేటు మార్కెట్లలో ఆన్లైన్ మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రూ.3 కోట్లతో వసతులు కల్పిస్తారు. మార్కెటింగ్ డైరెక్టర్ అనుమతించిన ప్రైవేటు మార్కెట్ లైసెన్సుదారులకు యూజర్ చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ప్రైవేటు మార్కెట్ లైసెన్సులు ప్రోత్సహించడంతోపాటు ఆన్ లైన్ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. తద్వారా ఈ–నామ్ పటిష్టమవుతుంది. -
మొబైల్ ఉత్పత్తి దారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: మొబైల్ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనివ్వనుంది. మొబైల్ విడిభాగాల దిగుమతులపై బ్యాంకు గ్యారంటీని ఉపసంహరించే వైపుగా ఆలోచిస్తోందట. ఈ మేరకు బ్యాంకు హామీ నిబంధనలను సరళతరం చేయనుందని అధికారిక వర్గాల సమాచారం. స్థానికంగా ఉత్పత్తిని ప్రోత్స హించే దిశగా ఈ చర్యలు తీసుకోనుంది. తద్వారా మొబైల్ హ్యాండ్సెట్ మేకర్స్ కొంత ఉపశమనం పొందనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ అంశంపై గత వారం ఉమ్మడి సమావేశం నిర్వహించారు. తమ పెట్టుబడులు మొత్తం బ్యాంక్ గ్యారంటీ కింద చిక్కుకుపోవడంపై మొబైల్ ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఐజీసీఆర్ (ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎట్ కాన్సెషనల్ రేట్) దృష్టికి వెడతామని హామీ పీఎంఏ వర్గాలు హామీ ఇచ్చాయి. కనీసం మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలకు ఈ హామీలను ఎత్తివేయాల్సిందిగా సూచిస్తామని తెలిపాయి. దేశంలో మొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆటంకాలపై పిరిశ్రమ పెద్దలు, అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిది పీటీఐకి వివరించారు. ఈ వార్తలపై సెల్యులర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మంహాంద్రో సంప్రదించగా పీఏంఓ కార్యాలయంపై మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ అధికారులకు, పరిశ్రమ ప్రతినిధులకు మధ్య సమన్వయంగా ఎలక్ట్రానిక్స్, ఐటిమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ 2019 నాటికి దేశంలో 500మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 40శాతం విజయం సాధించిందని పంకజ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మొబైల్ ఉత్పత్తిదారుల ఆదాయరక్షణతోపాటు, పరిశ్రమకు మార్గం మరింత సుగమవుతుందని వ్యాఖ్యానించారు. కాగా కంపెనీలు చెల్లిస్తున్న బ్యాంకు గ్యారంటీ నిధులు రూ. 29వేల కోట్లుగా ఉన్నాయి. -
బ్యాంక్ గ్యారెంటీ కుదరదు.. రూ. 4.75 కోట్లు కట్టాల్సిందే
న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో మరోసారి చుక్కెదురైంది. జరిమానాగా చెల్లించాల్సిన 4.75 కోట్ల రూపాయల మొత్తానికి నగదుకు బదులుగా బ్యాంక్ గ్యారెంటీ ఇస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తరపు న్యాయవాది చేసిన విన్నపాన్ని మంగళవారం ఎన్జీటీ తిరస్కరించింది. వారంలోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక ఇలాంటి ప్రతిపాదనతో అప్లికేషన్ వేసినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు ఐదు వేల రూపాయలను జరిమానా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ డబ్బును డిపాజిట్ చేయకపోవడాన్ని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ సారథ్యంలోని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ ఏడాది మార్చిలో మూడు రోజుల పాటు యమునా నది ఒడ్డున ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ వల్ల పర్యావరణ సమస్యలు వస్తాయని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతింటుదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన ఎన్జీటీ.. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టాలని ఆదేశిస్తూ, షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అప్పట్లో అనుమతి ఇచ్చింది. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని ఇంతవరకు జమ చేయలేదు. -
బ్యాంక్ గ్యారంటీ లేకుండా మైనార్టీలకు రుణాలు
సాక్షి,హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద నిరుద్యోగ మైనార్టీలకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ (పూచీకత్తు)లు లేకుండా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు హమీ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్ రోడ్‌లోని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుతెన్నులపై బ్యాంకర్లతో సమీక్షా సమావేశం జరిగింది. మైనార్టీ వర్గాలకు కేంద్ర శిశు పథకం కింద చిన్నతరహా వ్యాపారానికి రూ.50 వేల వరకు, కిశోర పథకం కింద మధ్యతరహా వ్యాపారానికి రూ.50 వేల నుంచి ఐదు లక్షల వరకు, తరుణ్ పథకం కింద పెద్ద పరిశ్రమల స్థాపన కోసం రూ.ఐదులక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అదేవిధంగా విదేశీ విద్యాభాసం కోసం ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా రూ.4 లక్షల వరకు ఇవ్వనున్నాయి. ఇద్దరి పూచీకత్తులపై రూ. 4 లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఇస్తాయి. రూ.7 లక్షలపైగా రుణాల కోసం మాత్రం తగిన గ్యారంటీ అవసరమని స్పష్టం చేశాయి. విద్యార్థుల కోసం జీరో ఖాతాల నిర్వహణకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాలు రాష్ట్రంలో మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల్లో ప్రోత్సహించేందుకు సెప్టెంబరులో జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, రుణ మేళాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. బ్యాంకింగ్ రుణాలపై ప్రత్యేక బుక్ లెట్ రూపొందించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని, లీడ్ బ్యాంక్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాని నిర్ణయించారు.రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులు గౌతమ్ జైన్, సర్దార్ సుర్జీత్ సింగ్, ఇటాలియా, వివిధ జాతీయ బ్యాంకుల డీజీఎం, ఏజీఎం, సీనియర్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల బ్యాంకు గ్యారెంటీ కుదించాం
హైకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వ నివేదిక హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు ప్రవేశం పొందే లోపే బ్యాంకు గ్యారెంటీ తీసుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో సవరించామని రాష్ర్ట ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. సవరణ ఉత్తర్వును పరిశీలించిన ధర్మాసనం విద్యార్థులకు బ్యాం కు గ్యారెంటీ సమర్పణకు వారం గడువిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు గ్యారెంటీ ప్రభుత్వ జీవో ను సవాల్ చేస్తూ కామినేని వైద్యకళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొ ందరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బీఎస్ ప్రసాద్ జీవో సవరణ వి వరాలను గురువారం ధర్మాసనానికి వెల్లడిం చారు. కాగా, బీ కేటగిరీ సీట్ల ఫీజు పెంచుతూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
బీ కేటగిరీ సీట్లకు ‘బ్యాంక్ గ్యారంటీ ఏడాదే’
నాలుగేళ్ల నుంచి ఏడాదికికుదిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో బీ కేటగిరీ వైద్య సీట్లు పొందిన విద్యార్థులకు ఊరట లభించింది. మొదటి ఏడాది ఫీజుతోపాటు ఎంబీబీఎస్‌కు నాలుగేళ్లు, బీడీఎస్‌కు మూడేళ్లు బ్యాంకు గ్యారంటీ చూపాలని ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు అనుగుణంగా గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో జీవో జారీ చేసింది. ఒక ఏడాదికి మాత్రమే గ్యారంటీ చూపితే సరిపోతుందని తాజా జీవోలో స్పష్టం చేసింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడం తెలిసిందే. దీంతో ఈ విషయంపై వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీ కేటగిరీ సీట్ల భర్తీ సందర్భంగా గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులు చేయాల్సిన అవసరముందని అధికారులు తెలపడంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అత్యవసరంగా ‘ఏడాదికే బ్యాంకు గ్యారంటీ’ని కుదిస్తూ సవరింపు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. దీంతో బుధవారం రాత్రి ‘ప్రతి ఏడూ వచ్చే ఏడాది ట్యూషన్ ఫీజును వైద్య కళాశాలలు బ్యాంకు గ్యారంటీగా స్వీకరించొచ్చు’ అని సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో 35 శాతం బీ కేటగిరీ సీట్లకు ప్రైవేటు యాజమాన్యాల నేతృత్వంలో కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వ డానికి గడువు విధించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీకి పెట్టిన గడువు తేదీని పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వారంలో సెలవులు ఉండటంతో బ్యాంకు గ్యారంటీ తీసుకోవడం కష్టమని అంటున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడతానని చెప్పారు. -
‘బ్యాంకు గ్యారంటీ’కి జీవోనా?
ప్రైవేట్ ఎంసెట్ వ్యవహారంపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగతా నాలుగేళ్లకూ ముందే బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు యాజమాన్యాలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘‘బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు ఇదేమైనా జాతీయ రహదారి నిర్మాణ పనుల వ్యవహారమా? ఇలాంటి జీవో ఇచ్చే అధికారం మీకెక్కడిది?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవోను సవాలు చేస్తూ కామినేని వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొందరు వేర్వేరుగా వేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇలా బ్యాంకు గ్యారంటీ తీసుకునే విధానం దేశంలో ఎక్కడా లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవీందర్ వాదించారు. విద్యార్థులు మధ్యలో మానేస్తే కాలేజీలు నష్టపోతాయని, అందుకే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ నిబంధన అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
‘నాలుగేళ్ల గ్యారంటీ’ తేలేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్లకు మొదటి ఏడాది ఫీజు చెల్లింపుతోపాటు మిగతా నాలుగేళ్లకూ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న యాజమాన్యాల వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమైంది. ఒక ఏడాదికే గ్యారంటీ తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ కోరుతుండగా... వైద్య కాలేజీల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు శుక్రవారం నుంచే ఈ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరగనుంది. కానీ ఇప్పటివరకు బ్యాంక్ గ్యారంటీపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి వారే.. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీ కేటగిరీలో 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 డెంటల్ సీట్లున్నాయి. వాటికి ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఎం-సెట్ నిర్వహించారు. ఎంబీబీఎస్‌కు ఏడాదికి రూ.9 లక్షల చొప్పున.. ఐదేళ్లకు రూ.45 లక్షలు ఫీజుగా చెల్లించాలి. అయితే కౌన్సెలింగ్‌లో సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి సంబంధించి రూ.9 లక్షలు చెల్లించడంతోపాటు మిగతా నాలుగేళ్లకు సంబంధించి కూడా రూ. 36 లక్షలకు బ్యాంకు గ్యారంటీ చూపించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిబంధన పెట్టాయి. నాలుగేళ్ల బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ.4 లక్షల ఫీజుతోపాటు.. మిగతా మూడేళ్లకు రూ.12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరుతున్నాయి. ఇలా బ్యాంకు గ్యారంటీలు కోరడం ఇంతవరకెప్పుడూ లేదు. విద్యార్థులు మధ్యలో వెళ్లిపోయినా, ఫెయిలైనా తమకు నష్టమని... అందుకే బ్యాంకు గ్యారంటీ కోరుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యార్థులు ఇవ్వలేకపోతే ప్రభుత్వమైనా కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని కోరుతున్నాయి. మొత్తం ఫీజును అడ్వాన్సుగానైనా చెల్లించాలని, లేదా బ్యాంకు గ్యారంటీ అయినా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందని... ఆ ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏడాది వరకు బ్యాంకు గ్యారంటీకి అంగీకరించేలా ప్రైవేటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నాయి. కాగా.. బీ కేటగిరీ సీట్ల ఫీజు పెంపు, నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ వ్యవహారంపై శుక్ర, శనివారాల్లో జరిగే కౌన్సెలింగ్ సందర్భంగా నిరసన వ్యక్తం చేసేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కౌన్సెలింగ్ వివరాలు కౌన్సెలింగ్: ఈ నెల 21, 22 తేదీల్లో స్థలం: పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ 21వ తేదీ: ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు - 1 నుంచి 500 ర్యాంకుల వరకు ఒంటి గంట నుంచి చివరి వరకు- 501 నుంచి 1000 ర్యాంకుల వరకు 22వ తేదీ: ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు - 1001 నుంచి 1600 ర్యాంకులు ఒంటి గంట నుంచి చివరి వరకు- 1601 నుంచి మిగిలిన ర్యాంకుల వరకు -
బ్యాంకు గ్యారంటీకి పట్టు!
కోర్సు ఫీజుకు సర్కారే కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని ప్రైవేట్ వైద్య కళాశాలల డిమాండ్ విద్యార్థులకు నరకం చూపిస్తున్న కాలేజీలు హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు తమ తీరు మార్చుకోవడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాలకు సాధ్యంకాని రీతిలో కోర్సు ఫీజు మొత్తానికి బ్యాంక్గ్యారంటీ కావాల్సిందేనని పట్టుపడుతున్నాయి. కోరుకున్న వారికి సీట్లు అమ్మేసుకొని ఇలా బ్యాంకు గ్యారంటీ పెట్టారనే ఆరోపణలున్నాయి. యాజమాన్యాల తీరుపై విద్యార్థులతోపాటు ప్రభుత్వం కూడా గుర్రుగా ఉంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ కేటగిరీలోని 35 శాతం యాజమాన్య కోటాలో 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 డెంటల్ సీట్లున్నాయి. వాటికి తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించిన సంగతి తె లిసిందే. ఈ నెల 21, 22 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి సంబంధించి రూ. 9 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన నాలుగేళ్లకు సంబంధించి 36 లక్షల బ్యాంకు గ్యారంటీ చూపాలని స్పష్టం చేశారు. అలాగే నాలుగేళ్ల బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ. 4 లక్షలు ఫీజు చెల్లించడంతోపాటు... మిగిలిన మూడేళ్ల ఫీజు రూ. 12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరారు. దీన్ని పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎంసెట్ అడ్మిషన్ కమిటీ సోమవారం సమావేశమైంది. విద్యార్థులు చదువు మానేసి మధ్యలో వెళ్లిపోతే తమకు నష్టం వస్తుందని, అందుకే నాలుగేళ్ల కోర్సు ఫీజుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలు పట్టుబట్టాయి. సమావేశం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పాపిరెడ్డి ఒక లేఖలో వివరించారు. ప్రైవేటు యాజమాన్యాల ఒంటెత్తు పోకడతో విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంక్ గ్యారంటీ కోసం అధిక వ డ్డీలకు అప్పులు చేస్తున్నారు. కొందరైతే తమ పిల్లల పెళ్లిళ్లకు సంపాదించుకున్న కొద్దిపాటి ఆస్తులను తాకట్టు పెడుతున్నారు.