హైకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వ నివేదిక
హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు ప్రవేశం పొందే లోపే బ్యాంకు గ్యారెంటీ తీసుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో సవరించామని రాష్ర్ట ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. సవరణ ఉత్తర్వును పరిశీలించిన ధర్మాసనం విద్యార్థులకు బ్యాం కు గ్యారెంటీ సమర్పణకు వారం గడువిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యాంకు గ్యారెంటీ ప్రభుత్వ జీవో ను సవాల్ చేస్తూ కామినేని వైద్యకళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొ ందరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బీఎస్ ప్రసాద్ జీవో సవరణ వి వరాలను గురువారం ధర్మాసనానికి వెల్లడిం చారు. కాగా, బీ కేటగిరీ సీట్ల ఫీజు పెంచుతూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
నాలుగేళ్ల బ్యాంకు గ్యారెంటీ కుదించాం
Published Fri, Aug 28 2015 1:41 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement