four years
-
తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు వ్యాపారం సాధించాలని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియం రూ. 1,352 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1,655 కోట్లు నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ గురువారమిక్కడ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో గత అయిదేళ్లలో రూ. 3,330 కోట్ల క్లెయిమ్స్ చెల్లించామని, ప్రస్తుతం 100 శాఖలు, 1,350 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం రూ. 15,284 కోట్ల వ్యాపారం సాధించగా, ఈసారి సుమారు రూ. 18,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సనత్ కుమార్ చెప్పారు. ఇంటి వద్దే వైద్య సేవలు పొందే విధంగా హోమ్ హెల్త్‌కేర్, టెలిమెడిసిన్ వంటి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో హోమ్ హెల్త్‌కేర్ సేవలు ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్ తదితర 8 నగరాల్లో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. -
ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్‌తో.. నాలుగేళ్లకి ఇంటికి చేరిన మహిళ!
మహబూబ్‌నగర్: మతిస్థిమితం లేకుండా తిరుగుకుంటూ వెళ్లిన ఓ మహిళా నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరుకుంది. ఈ ఘటన మండలంలోని కానాయపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకుంట సరళమ్మ, కర్రెన్నల కుమార్తె వివాహిత గిరమ్మ మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతుండేది. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండేళ్లు వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు గిరమ్మను చేరదీశారు. మతిస్థిమితం నుంచి కోలుకునేవిధంగా చికిత్స అందించి గిరమ్మ నుంచి చిరునామా కనుకున్నారు. ఆదివారం శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చిన గిరమ్మను చూసిన కుటుంబ సభ్యులు ఆనందంలో ముగిగిపోయారు. ఫౌండేషన్ సభ్యుడు ప్రదీప్‌కుమార్‌కు గిరమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
లోతైన పరిజ్ఞానం.. తక్షణ ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ స్వరూపం క్రమంగా మారబోతోంది. ఇప్పటిలా మూడేళ్ళు కాకుండా, నాలుగేళ్ళ కాలపరిమితితో డిగ్రీ (యూజీ ఆనర్స్) ఉండనుంది. సాధారణ సంప్రదాయ కోర్సులు భవిష్యత్‌లో తెరమరుగయ్యే వీలుంది. బీఏ, బీకాం, బీఎస్సీ..లాంటివి ప్రత్యేకంగా ఉండకుండా వీటికి కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. లాంటి కోర్సులు జత కానున్నాయి. విద్యార్థికి లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కోర్సులు ఉండనున్నాయి. ఆర్ట్స్ విద్యారి్థకి కంప్యూటర్ పరిజ్ఞానం.. సైన్స్ విద్యార్థికి సామాజిక అవగాహన కోర్సుల వంటి మార్పులతో నాలుగేళ్ల డిగ్రీ ఉండనుంది. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను (కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే సిద్ధం చేసింది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ కోర్సులను పరిమితంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతం కానుండగా..రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు కూడా ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్స్ విధానం ఇక నుంచి డిగ్రీ పట్టాలు క్రెడిట్స్ ఆధారంగా ఉంటాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే యూజీ డిగ్రీకి అర్హులవుతారు. సబ్జెక్టులను బట్టి క్రెడిట్లు ఉంటాయి. కాగా విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాదిలో పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల కోర్సు చేస్తున్నవారికీ అవకాశం ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు బ్రిడ్జి కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. ఏడాది చదివితే సరి్టఫికెట్.. రెండేళ్లయితే డిప్లొమా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సు విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే ఆ మేరకు విద్యారి్థకి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. బోధనలోనూ మార్పులు.. ళీయూజీ ఆనర్స్‌ను మార్కెట్లో తక్షణ ఉపాధి లభించేలా, వైవిధ్యంగా నైపుణ్యాత్మకంగా అందించాలని నిర్ణయించారు. మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాష, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివి కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను చేర్చారు. లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యం ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా బోధన ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉండాలన్నదే సరికొత్త మార్పుల లక్ష్యం. భవిష్యత్‌లో ఇక నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులే ఉండే వీలుంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోనూ బోధన ప్రణాళిక, పరీక్ష విధానంపై మార్పులకు అధ్యయనాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆనర్స్ వైపే అందరిచూపు.. విద్యార్థులు డిగ్రీ విద్యలో మార్పు కోరుకుంటున్నారు. ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ప్రైవేటు కాలే జీలు కూడా విద్యార్థులు కోరుకుంటున్న ఆనర్స్ కోర్సులు అందించేందుకు యతి్నస్తున్నాయి. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. – ఎక్కల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి -
వైఎస్సార్సీపీ @ 4 ఇయర్స్.. భారీ ర్యాలీ (ఫొటోలు)
-
నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో విజయం సాధించి.. సంక్షేమ పాలనతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశంలో ఒంటరిగా పోటీచేసిన ఒక పార్టీ ఇంత భారీ విజయం సాధించడం అదే ప్రథమం. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సమాధి కడుతూ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు చారిత్రక తీర్పు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు.. ప్రజాసంకల్ప పాదయాత్రలో భవితపై భరోసా కల్పించిన సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టి.. నవశకాన్ని ఆవిష్కరించి నేటికి నాలుగేళ్లు. ఈ సందర్భంగా నాలుగేళ్ల పాలనపై సీఎం ట్వీట్ చేశారు. ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ల క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వ… — YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2023 -
కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది..
అల్లిపురం (విశాఖ దక్షిణ ): చనిపోయాడు అనుకున్న కొడుకు తిరిగి వస్తే ఆ ఆనందం వర్ణణాతీతం. అలాంటి అనుభవం ఒక తండ్రికి కలిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా గ్రామానికి చెందిన శ్యామ్‌రావ్ లోఖండే (38) మతిస్థిమితం లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేశాడు. అలా వచ్చిన వ్యక్తి నగరంలో తిరుగుతుండగా అతడిని భీమ్‌నగర్ ఏయూటీడీ, టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయ వసతి గృహం సిబ్బంది రక్షించి, మెంటల్ కేర్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందజేశారు. చదవండి: కన్నతల్లిని నమ్మించి.. 12 లక్షలు కాజేసి! చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరి 31న పూర్తి ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జి అయ్యాడు. దీంతో ఆయనకు భీమ్‌నగర్ షెల్టర్‌లో ఆశ్రయం కల్పించారు. అతని వివరాలు తెలుసుకున్న శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు స్వగ్రామం తీసుకెళ్లి తండ్రి ప్రవీణ్‌కు అప్పగించారు. చనిపోయాడనుకున్న శ్యామ్‌రావ్ తిరిగి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సు ఇకపై నాలుగేళ్లు ఉండనుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే దీనిని ప్రారంభించేలా వర్సిటీ అకడమిక్ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ మందిరంలో మంగళవారం అకడమిక్ సెనేట్ సమావేశమైంది. వైస్ చాన్స్‌లర్ కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి, సీడీసీ డీన్ సుందరకృష్ణ పాటు కమిటీలో 32 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 2021–22 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను సభ్యుల ముందు ఉంచారు. అదే విధంగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కార్యకలాపాలు, తదితర 50 అంశాలపై చర్చించి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విద్యా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ►నూతన విద్యా పాలసీకి అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటిలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు ఏళ్లు పూర్తయ్యాక పదినెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా సిలబస్‌ను రూపొందించనున్నారు. దీనిని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ►డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో బోధన, పరీక్షల నిర్వహణకు నిర్ణయించారు. ►డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరీక్షల నిర్వహణలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ►కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేలా అన్ని చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ పెంచ నున్నారు. ►నాలుగేళ్ల డిగ్రీతో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తప్పనిసరిగా పొందేలా బోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సెనేట్ సభ్యులు సూచించారు. ►అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జయశంకర్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించగా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి సెనేట్ అజెండా, వర్సిటీలో నూతన విద్యా విధానం అమలు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. -
ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్ర: సజ్జల
సాక్షి, తూర్పుగోదావరి: ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్రగాప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ వెనుకాడలేదని గుర్తుచేశారు. చదవండి: సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ ప్రజలు సీఎం వైఎస్ జగన్‌వైపే నిలిచారని సజ్జల అన్నారు. సంక్షేమాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్షానికి తెలిసిన రాజకీయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి నేటికి నాలుగేళ్లు పూర్తి అయింది. నవంబర్6, 2017న ఇడుపులపాయలో ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారు సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యారని పేర్కొన్నారు. అధికారం చేపట్టగాలనే సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ నడుంబిగించారని తెలిపారు. రూ.లక్షా 40 వేల కోట్లు పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. సాగునీటి సమస్యల లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. -
సీఎం జగన్ ప్రజాసంకల్పయాత్ర నాలుగేళ్ల పండగ
-
నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం సృష్టించిన చరిత్రాత్మక ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2021 చదవండి: మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం -
సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ
Updates: వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌దే: ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగిరి ఓం శక్తి సర్కిల్ నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత పడుతున్న కష్టాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని దృఢ సంకల్పంతో సంకల్ప పాదయాత్ర చేపట్టారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సర కాలంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతూ తానిచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్‌సైడ్‌గా సీఎం జగన్‌కు విజయాన్ని అందిస్తున్నారు. ఆనాడు సీఎం జగన్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు జగన్ వైపు నిలబడ్డారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాగ్దానాలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానిక వైఎస్సార్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి పాదయాత్రను ప్రారంభించారు. గుంటూరులో.. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు నగరపాలెంలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి హిమని సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో.. గూడూరులో జనహృదయనేత సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైఎస్సార్ విగ్రహం నుంచి సాదుపేట సెంటర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో.. సీఎం జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ 10 ఏళ్ల కష్టం ప్రజలందరికీ తెలుసు: భూమన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసికున్న సందర్భంగా వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తుడా సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహం వద్ద సర్వమత ప్రార్ధనలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తుడా వైఎస్సార్ సర్కిల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషా, కార్పొరేటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 ఏళ్లు పడ్డ కష్టం ప్రజలందరికీ తెలుసు. నాడు వైఎస్ పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో, అదే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు. చంద్రబాబు నిరంతరం దూషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయ్యింది. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌కే పట్టం కట్టారు. 3,648 కి.మీ ప్రజా సంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి: ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుంది. విపక్ష నేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా.. ప్రజాసంకల్పయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించాయి. విజయవాడలో.. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు ఈ సంబరాల్లో పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ భాగ్యలక్ష్మి పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. చిత్తూరు జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో వైఎస్ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, నేతలు పాలాభిషేకం చేశారు. ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎండనక వాననక వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోయిందని అంటున్నారు. వైఎస్సార్ జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేంపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుండి రాయచోటి బైపాస్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్ది, ఎంపీపీ గాయత్రి, కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నవంబర్ 6వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేడు (శనివారం) పాదయాత్రలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం పాదయాత్రతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని, కేక్ కటింగ్ చేయాలని ఆయన తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోనే 97 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ.. ఈనాటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కాగా, నవంబర్ 6, 2017న ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 134 నియోజకవర్గాల్లో 231 మండలాల్లో 2,516 గ్రామాల్లో కొనసాగింది. అడుగడుగున పేదల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ఆనాడే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అధికారం చేపట్టగానే యాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. -
భారత అథ్లెట్ గోమతిపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత గోమతి మరిముత్తు డోపీగా తేలింది. దీంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించినట్లు సోమవారం వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. తమిళనాడుకు చెందిన గోమతి నుంచి సేకరించిన నాలుగు నమూనాల్లోనూ నిషేధిత ఉత్ప్రేరకం ‘19 నార్ ఆండ్రోస్టెరోన్’ స్టెరాయిడ్ ఆనవాళ్లు ఉండటంతో... అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. 2019 మే 17 నుంచి 2023 మే 16 వరకు ఆమెపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ పేర్కొంది. 2019 దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 800 మీటర్ల పరుగును తన అత్యుత్తమ టైమింగ్‌తో (2ని: 2.70 సెకన్లు) పూర్తిచేసిన గోమతి విజేతగా నిలిచింది. ఈ క్రీడల సెలక్షన్స్ సందర్భంగా గతేడాది ఏప్రిల్‌లో, ఫెడరేషన్ కప్ సందర్భంగా పాటియాలాలో గోమతి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇవి పాజిటివ్‌గా రావడంతో ఆమె ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన పసిడి పతకాన్ని కూడా ఆమె కోల్పోనుంది. దీంతో పాటు ఆమె ఏఐయూకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జాతీయ డోపింగ్ టెస్టు ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో పరీక్షించిన తన నమూనాల పరిమాణంపై ఆమె సందేహాలు వ్యక్తం చేసింది. కానీ ఇవేవీ ఆమెను శిక్ష నుంచి తప్పించలేకపోయాయి. -
అథ్లెట్ జూమా ఖాతూన్‌పై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడటంతో భారత మహిళా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్‌పై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘డి హైడ్రోక్లోరోమిథైల్ టెస్టోస్టిరాన్’ వాడినట్లు తేలింది. 2018 జూన్‌లో గువాహటి వేదికగా జరిగిన అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జుమా 1500, 5000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. ఈ పోటీల సందర్భంగా ఆమె నుంచి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్) శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. అయితే అదే శాంపిల్‌ను ‘వాడా’ పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. జుమాపై నిషేధం ఈ ఏడాది విధించినా... ఈ నిషేధం మాత్రం 2018 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా 2018 జూన్ నుంచి నవంబర్ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్‌లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు. -
భారత షాట్‌పుట్ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత షాట్‌పుట్ క్రీడాకారుడు నవీన్ చికారాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ఇంటెగ్రిటీ విభాగం నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. 2018 జూలైలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నవీన్ విఫలమైనట్లు ఐఏఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో అతనిపై నిషేధం జూలై 27, 2018 నుంచి అమలులోకి వస్తుందంటూ ఐఏఏఎఫ్ తన తాజా ప్రకటనలో తెలిపింది. ‘నాడా’ అతని శాంపిల్స్‌ను సేకరించి కెనడాలోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు పంపగా... అక్కడ జరిపిన పరీక్షల్లో నవీన్ నిషేధిత ఉత్ప్రేరకం జీహెచ్‌ఆర్‌పీ–6 వాడినట్లు తేలింది. అనంతరం జీహెచ్‌ఆర్‌పీ–6 నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నట్లు తనకు అవగాహన లేదని నవీన్ వివరణ ఇచ్చాడు. 23 ఏళ్ల నవీన్ 2018 ఫెడరేషన్ కప్‌లో రజత పతకంతో పాటు... అదే ఏడాది జరిగిన అంతర్రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
అంతు చిక్కని వ్యాధితో నాలుగేళ్లుగా నరకయాతన
కందుకూరు అర్బన్: ఆడుతూ పాడుతూ అందరు పిల్లలతో కలిసి బడికి వెళ్లాల్సిన వయస్సులో నిత్యం చర్మం పగిలి, దురద, మంటతో ఆ బాలుడు నరక యాతన అనుభవిస్తున్నాడు. తోటి పిల్లలు దగ్గరకు రానివ్వక ఆ బాలుడు పడుతున్న మానసిక వేదన తల్లిదండ్రులతో పాటు చూసిన గ్రామస్తులను కలిచివేస్తోంది. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం ఎస్సీ కాలనీలోని లింగాబత్తిన మాల్యాద్రి, శ్రీలతలది రోజు కూలీ పనులకు వెళితే కానీ పూటగడవని పరిస్థితి. ఈ దంపతులకు మూడవ సంతానం జోష్‌కుమార్ 2015లో జన్మించాడు. గంటలోపే బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం మొత్తం పొరలు పొరలుగా ఊడి పోవడం ప్రారంభమైంది. ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి రాదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు వడ్డీకి అప్పుచేసి రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. ఇక చూపించే స్తోమత లేక బిడ్డను ఇంటి దగ్గర వదిలి కూలీనాలి చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చూపిస్తూ నెలకు రూ. 5వేల ఖర్చుతో మందులను వాడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. వేసవి వచ్చిందంటే నరకమే.. వేసవి కాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నట్లు బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒళ్లంతా చర్మం పగిలి రక్తం కారడం, దురద, భరించలేని మంటతో బాలుడు తట్టుకోలేక అల్లాడుతుంటే తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎండను తట్టుకునేందుకు ప్లాస్టిక్ టబ్‌లో నీళ్లుపోసి దాంట్లో ప్రతి అరగంటకు ఒకసారి కూర్చోబెడుతున్నారు. బైట ఉన్నంత సేపూ తడి బట్టలు కప్పితేనే ఉపశమనం. కూలి పనులకు వెళ్తేనే గానీ పూటగడవని పరిస్థితుల్లో పిల్లవాడిని కనిపెట్టుకొని ఒకరు ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా బడేవారిపాలెం వచ్చినప్పుడు పిల్లవాడి తల్లి జోష్‌కుమార్‌ను జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకొచ్చి తన కుమారుడి దీనగాథను వివరించి మెరుగైన వైద్యం అందించాలని కోరింది. అప్పట్లో కందుకూరులో జరిగిన బహిరంగ సభలో వింత వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిని చూశానని అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీలో ఇలాంటి వ్యాధులను కూడా చేరుస్తామని చెప్పారు. -
ఒలింపిక్స్ నుంచి రష్యాను గెంటేశారు
ప్రపంచ క్రీడల్లో అగ్రరాజ్యం అమెరికాకు పక్కలో బల్లెంలా నిలిచిన దేశం రష్యా. అయితే ‘డోపింగ్’ భూతం రష్యా కొంప ముంచింది. ఐదేళ్ల క్రితం ప్రపంచ క్రీడాలోకాన్ని నివ్వెరపరిచిన రష్యాలోని వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతం కథ ఇప్పుడు కంచికి చేరింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు కనబడకపోవడంతో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తీవ్రమైన చర్య తీసుకుంది. ఏకంగా నాలుగేళ్లపాటు అంతర్జాతీయ క్రీడలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ రష్యా దేశంపై ‘వాడా’ నిషేధం విధించింది. లుసానే (స్విట్జర్లాండ్): డోపింగ్ భూతం రష్యా పుట్టి ముంచేసింది. అంతర్జాతీయ క్రీడా సమాజం రష్యాను గెంటేసింది. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు దూరం చేసింది. దీంతో టోక్యో వేదికపై రష్యా జాతీయ పతాకం కనిపించదు. జాతీయ గీతం కూడా వినిపించదు. వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా... ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. సోమవారం జరిగిన ‘వాడా’ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో రష్యా క్రీడా సమాజం తీవ్రంగా నష్టపోనుంది. 2020 పారాలింపిక్స్, 2022 యూత్ ఒలింపిక్స్, 2022లో బీజింగ్ ఆతిథ్యమివ్వనున్న వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా జట్లేవీ బరిలోకి దిగవు. వచ్చే నాలుగేళ్లలో ఆ దేశం అంతర్జాతీయ క్రీడా పోటీల ఆతిథ్యానికి కూడా పనికిరాదు. ‘వారికి’ అవకాశం అయితే డోపింగ్ మచ్చలేని రష్యా క్రీడాకారులకు ‘వాడా’ కాస్త వెసులుబాటు ఇచ్చింది. వారు స్వతంత్ర హోదాలో (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పతాకం కింద) పాల్గొనవచ్చని తెలిపింది. స్వతంత్ర హోదాలో పాల్గొనే రష్యా అథ్లెట్లు పతకాలు గెలిచినా అవి రష్యా ఖాతాలోకి రావు. రష్యా జాతీయ పతాకం ఎగరదు, జాతీయ గీతం కూడా వినిపించదు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే కొన్ని యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ఫార్ములావన్ రేసు నిర్వహణకు మాత్రం మినహాయింపునిచ్చింది. 2020 యూరో టోర్నీ 12 దేశాల్లో జరగనుంది. రష్యా పేరు లేకుండా... ఒకవేళ ఖతర్‌లో జరిగే 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు రష్యా అర్హత సాధిస్తే పరిస్థితి ఏంటనే దానిపై ‘వాడా’ స్పష్టత ఇవ్వలేదు. యూరోప్‌కు సంబంధించి 2021లో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రధాన టోర్నీ కానందున క్వాలిఫయింగ్‌లో రష్యా పాల్గొనవచ్చని ‘వాడా’ తెలిపింది. ఒకవేళ రష్యా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తే ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)తో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ‘వాడా’ తెలిపింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆడేందుకు ఒకవేళ రష్యాకు అనుమతి ఇచ్చినా వారు రష్యా పేరును వాడే అవకాశం ఉండదని ‘వాడా’ వివరించింది. అసలేం జరిగిందంటే... రష్యా క్రీడల యంత్రాంగమంతా డోపింగ్‌లో భాగస్వామ్యమైందని జర్మన్ టీవీ చానెల్ ఓ డాక్యుమెంటరీని ఐదేళ్ల క్రితం 2014 డిసెంబర్ లో ప్రసారం చేసింది. ఇది అంతర్జాతీయ క్రీడాలోకాన్నే నిర్ఘాంతపరిచింది. ఎక్కడైనా... ఎప్పుడైనా... డోపింగ్‌లో ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఆటగాళ్లే దొరుకుతారు. మొత్తం దేశమే ఈ అవకతవకల జాడ్యంలో పట్టుపడటం ఏంటనే చర్చ లేవనెత్తింది. దీనిపై దర్యాప్తు చేసిన ‘వాడా’ 2011 నుంచి 2015 వరకు రష్యా వ్యవస్థీకృత డోపింగ్‌కు పాల్పడిందని 2016లో ప్రకటించింది. మాస్కోలోని ల్యాబోరేటరీలోని ఫలితాలన్నీ అసలైనవి కావని, అవన్నీ నకిలీవని విచారణలో తేలింది. ఆటగాళ్ల రక్త, మూత్ర నమూనాల్లో డోపీలనీ తేలినా... డేటా మొత్తం ఏమార్చిందని విస్తుగొలిపే విషయాన్నీ వెల్లడించింది. మొత్తం అధికార యంత్రాంగం ఈ పాపానికి పాల్పడినట్లు తేలడంతో రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ)పై, రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ)పై వేటు వేసింది. అప్పటినుంచి నిషేధం ఉచ్చు రష్యా మెడకు బిగుసుకుంది. కానీ వ్యక్తిగత క్రీడాంశాలపై కరుణ చూపింది. రష్యా ఆటగాళ్లను మెగా ఈవెంట్లలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గొడుగు కింద పాల్గొనేందుకు వెసులుబాటు ఇచ్చింది. అప్పీలుకు వెళ్లొచ్చు... నిషేధంపై అప్పీలుకు వెళ్లేందుకు ‘వాడా’ అవకాశమిచ్చింది. ‘స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు’లో సవాలు చేసేందుకు 21 రోజుల గడువిచ్చింది. ఏదేమైనా రష్యా అథ్లెట్లు మేటి ఈవెంట్లలో పాల్గొనేందుకు వెసులుబాటైతే ఉంది. కానీ... వారిపై ‘వాడా’ ‘స్కానింగ్’ తప్పనిసరిగా ఉంటుంది. అంటే ‘వాడా’ పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకోలేదని క్షుణ్ణంగా తేలిన అథ్లెట్లను, అది కూడా స్వతంత్రంగా పోటీపడేందుకు అవకాశం కల్పిస్తారు. క్రీడల్లో ఇది అతిపెద్ద డోపింగ్ కుంభకోణమని, ఈ అపరాధానికి శిక్షతో పాటు అంతర్జాతీయ సమాజానికి రష్యా క్షమాపణలు చెప్పాలని నార్వేకు చెందిన న్యాయకోవిదుడు లిండా హెలెలాండ్ తెలిపారు. ‘ఈ నిర్ణయంపై నాకు సంతోషం లేదు. కానీ తప్పదు. రష్యా యంత్రాంగం పరీక్షల తాలూకు డేటాను ‘వాడా’ కోరినపుడు ఆలస్యం చేయడంతోనే రష్యా కపటం బట్టబయలైంది’ అని అన్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని ఐఓసీ సిఫార్సు చేసింది. రష్యా అధికారులు, క్రీడాకారులకు ఈ చర్యలు చెంపపెట్టు కావాలని ఐఓసీ గట్టిగా కోరింది. కూర్చున్న కొమ్మనే నరుక్కుంది... తానెక్కిన కొమ్మను తానే నరికినట్లుగా రష్యా కపటానికి, మోసానికి రష్యానే బలైందని ‘వాడా’ అథ్లెట్ ప్యానెల్ తెలిపింది. ‘ఈ మొత్తం ఉదంతాన్ని రష్యానే సృష్టించింది. ప్రపంచాన్నే మోసం చేసింది. తద్వారా తమ అథ్లెట్ల బంగారు కలల్ని, ఉజ్వల భవిష్యత్తును రష్యానే నాశనం చేసింది’ అని వాడా ప్యానెల్ సమావేశానికి ముందే ప్రకటించింది. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) మాత్రం ‘వాడా’ చర్యలపై అసంతృప్తి వెళ్లగక్కింది. మొత్తం దేశాన్నే నిషేధించడం సహేతుకం కాదని... ఇది పూర్తిగా అశాస్త్రీయ విధానమని ఆర్ఓసీ అభిప్రాయపడింది. అలా మొదలై... ఇలా వెలియై... ►డిసెంబర్, 2014: రష్యా డోపింగ్‌పై జర్మన్ టీవీలో డాక్యుమెంటరీ ప్రసారం ►నవంబర్, 2015 రష్యా డోపింగ్ నిరోధక సంస్థపై ‘వాడా’,ఆటగాళ్లపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య వేటు. ►జూలై 18, 2016: 2011 నుంచి 2015 వరకు రష్యా వ్యవస్థీకృత డోపింగ్‌కు పాల్పడినట్లు ‘వాడా’ నివేదిక. ►ఆగస్టు, 2016 రియో ఒలింపిక్స్‌లో రష్యా జట్టులో 276 మంది అథ్లెట్లకు అవకాశం. 111 మంది తొలగింపు. ►డిసెంబర్, 2017 ఐఓసీ చర్యలు షురూ. ముందుగా రష్యా ఒలింపిక్ కమిటీపై వేటు. 43 మంది అథ్లెట్లపై జీవితకాల నిషేధం. సోచి వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా గెలిచిన 13 పతకాలు వాపస్. ►ఫిబ్రవరి, 2018 స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో నిషేధాలపై మొదలైన విచారణ. ప్యాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్‌లో 169 మంది రష్యన్లకు ఐఓసీ గ్రీన్‌సిగ్నల్. ►సెప్టెంబర్, 2018 మాస్కో ల్యాబోరేటరీ డేటా ఇచ్చేందుకు రష్యా డోపింగ్ నిరోధక సంస్థ అంగీకరించడంతో ఆ సంస్థపై నిషేధం ఎత్తివేత. ►జనవరి, 2019 ‘వాడా’కు మాస్కో ల్యాబోరేటరీ డేటా అందజేసిన రష్యా డోపింగ్ నిరోధక సంస్థ. ►సెప్టెంబర్, 2019 డేటా అందాకా కొత్తగా మళ్లీ ‘వాడా’ దర్యాప్తు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (దోహా)లో రష్యాపై నిషేధం కొనసాగింపు. ►నవంబర్ 25, 2019 నాలుగేళ్ల నిషేధం విధించాలంటూ ‘వాడా’ ప్యానెల్ సిఫారసు. ►డిసెంబర్ 9, 2019 రష్యాపై నిషేధం ఖరారు -
ఐదుగురు లిఫ్టర్లు డోపీలు
సాక్షి, భువనేశ్వర్: భారత వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టార్ లిఫ్టర్ రవి ‘ఒస్టారిన్’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది. విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది. -
కాలుష్యం తగ్గిస్తే మరో 4 ఏళ్ల ఆయుష్షు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను భారత్ అందుకోగలిగితే దేశ ప్రజల సగటు జీవితకాలాన్ని మరో నాలుగేళ్లు పెంచవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా దేశం ప్రతి ఏటా రూ.35 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు పేర్కొంది. ప్రజలు అనారోగ్యం బారిన పడి ఆయుర్దాయం తగ్గిపోతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కి చెందిన పరిశోధకులు ఓ నివేదిక సమర్పించారు. ఇందులో ఉద్గారాల పర్యవేక్షణకు ఆడిటర్ల నియామకం, కాలుష్యకారకాలపై ప్రజలకు సమాచారం ఇవ్వడం, అదనంగా విడుదలయ్యే ఉద్గారాలపై జరిమానా విధించటం, ఉద్గారాలపై ఎప్పటికప్పడు రెగ్యులేటర్లకు సమాచారం అందించటం, కాలుష్యాన్ని తగ్గించేందుకు యత్నించే పరిశ్రమలపై భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో 66 కోట్ల మంది అధిక కాలుష్య ప్రాంతాల్లోనివసిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. -
నాలుగేళ్ల నయవంచన : ఇసుక రీచ్‌లలో... ‘శాండ్’కేట్లు!
బాబు మాటలు : ‘‘ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ వ్యవహారంలో నాయకుల ప్రమేయం ఉండటానికి వీల్లేదు. ఏటా 600–700కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇస్తున్నాం. అక్రమాల్లో ఎవరి పాత్ర ఉన్నా వారిపై వేటు పడుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. ఎవరైనా అడ్డుకుంటే తిరగబడాలి’’.. అని ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. వాస్తవం : ఆచరణను మాత్రం మాటలను తుంగలో తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ రీచ్ చూసినా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ ఎక్కువగా జరుగుతోంది. సామాన్యులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే పరిస్థితి ఎక్కడాలేదు. అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. సాక్షి, అమరావతి : నాలుగేళ్ల టీడీపీ సర్కారు పాలనలో జరిగిన ఇసుక దందా విలువ అక్షరాలా రూ.8,600 కోట్లు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ విధంగా చెలరేగిపోతోందో ఇది చూస్తే తెలిసిపోతుంది. ఇసుక రేవు (రీచ్)లను కొందరు అధికార టీడీపీ నేతలు సొంత జాగీర్లలా మార్చుకుని అడ్డగోలుగా తోడేస్తున్నారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ అంతటా ఇదే పరిస్థితి. రెండేళ్లుగా ‘ఉచిత ఇసుక’ కాగితాలకే పరిమితమైంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని శాండ్ కమిటీలు నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక మాఫియా చెప్పిందే ధర. ఇక రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డూ అదుపులేదు. వారు చెప్పిందే శాసనం. తనిఖీలతో హుటాహుటిన క్రేన్ల తరలింపు ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో యంత్రాలతో జరుపుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలంటూ ఓ స్వచ్ఛంధ సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో వేసిన కేసు నేపథ్యంలో నిజనిర్ధారణ నివేదిక సమర్పణ కోసం ట్రైబ్యునల్ నియమించిన కమిటీ ప్రతినిధులు గుంటూరు జిల్లాలో పర్యటించారు. దీంతో ఇసుక మాఫియా గ్యాంగులు నదుల్లోని భారీ క్రేన్లను అక్కడ లేకుండా చేశారు. కమిటీ ప్రతినిధులు అటు పోగానే మళ్లీ ఎక్కడ క్రేన్లు అక్కడ అమర్చి యథాతథంగా దందా సాగిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 459 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చు. కానీ, ఇది ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక నింపుకోవాలంటే కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే..’ అంటూ మాఫియా గ్యాంగులు వసూళ్లు సాగిస్తున్నాయి. చీకట్లో విచ్చలవిడిగా తవ్వకాలు అలాగే, నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే అనుమతులున్నాయి. వీటికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరికరాలు అమర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే, జీపీఎస్ పరికరాలను పనిచేయకుండా చేసి రాత్రి వేళల్లో తోడేసి ప్రైవేట్‌గా అధిక రేట్లకు అమ్ముతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు కూడా తరలించడం ద్వారా వేల కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అనుచరులు ఏకంగా ఇసుక రీచ్‌కు అనధికారికంగా రహదారి వేయించి తన సొంత ఆస్తిలా నడుపుతున్నారంటే దోపిడీ ఎంత బహిరంగంగా సాగుతుందో అర్థమవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇలాగే నదిలో రెండు కిలోమీటర్ల పొడవునా అనుమతి లేకుండా రోడ్డు వేసేశారు. ఇదంతా అధికార పార్టీ పెద్దల వ్యవహారం కావడంతో అధికారులు కిక్కురుమనడంలేదు. రెండేళ్లలో రూ.5,000 కోట్లు దోపిడీ జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరలతో పోల్చితే దాదాపు అన్ని జిల్లాల్లో 50 నుంచి 100 శాతం అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్నారు. ఇది చాలదన్నట్లు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పెద్ద లారీ ఇసుకను రూ.50వేల నుంచి 60 వేల వరకూ విక్రయిస్తున్నారు. తద్వారా టీడీపీ ఇసుక మాఫియా గత రెండేళ్ల కాలంలో (2016 జూన్ నుంచి 2018 మే వరకూ) రూ.5,000 కోట్లకు పైగా దండుకుందని అనధికారిక అంచనా. అలాగే, డ్వాక్రా సంఘాలు ఇసుక రీచ్‌లను నిర్వహించిన కాలంలో (2014 నవంబరు నుంచి 2016 మార్చి వరకూ) టీడీపీ నేతలు రూ.3,600 వేల కోట్లకు పైగా దోచుకున్నారని అంచనా. ఆ కాలంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణావల్ల సర్కారు ఖజానాకు రూ.2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ప్రకటించడం గమనార్హం. పొంచివున్న పెను ముప్పు నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో ఎక్కువ లోతు వరకు ఇసుక తవ్వకాలు సాగుతుండటం ప్రమాదకరమని పర్యావరణవేత్తలతోపాటు భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని రీచ్‌లలో 2.82 కోట్ల క్యూబిక్ మీటర్ల (సుమారు 4.22 కోట్ల మెట్రిక్ టన్నుల) ఇసుకను ఏటా తవ్వుకోవచ్చని ప్రభుత్వం 2015లో అంచనా వేసింది. కానీ, 7 కోట్ల టన్నులకు పైగా తవ్వుతున్నారు. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదన్న నిబంధనను బేఖాతరు చేస్తూ 2 నుంచి 4 మీటర్ల లోతు వరకూ తవ్వేస్తున్నారు. దీనివల్ల పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో.. గుంటూరు జిల్లాలో నిబంధనలను ‘కృష్ణ’లో కలిపేసి నది మధ్యలో భారీ క్రేన్లు ఏర్పాటుచేసి డ్రెడ్జింగ్ ద్వారా బాగా లోతు వరకూ ఇసుక తోడేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి కనిపించడంలేదు. ఉత్తరాంధ్రకు నేనే మంత్రినని చెప్పుకునే ఒక నేత ఒడిశాకు ఇసుక అక్రమ తరలింపులు జరిపిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారు. గోదావరి జిల్లాలో ఒక మంత్రి అతిముఖ్యమైన రేవును సొంత నదిలా మార్చుకుని అనుచరులకు అప్పగించి వాటాలు మింగుతున్నారు. కర్నూలు జిల్లాలో మరో మంత్రి అనుచరులు ఏకంగా తుంగభద్రలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు నిర్మించారనే విషయం ఉన్నత న్యాయస్థానం వరకూ వెళ్లింది. కాగా, తవ్విన ఇసుకను 30 శాతానికిపైగా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తూ చెక్ పోస్టులను చెకింగ్ లేని పోస్టుల్లా మార్చేశారు. ఇలా గత రెండేళ్లలో టీడీపీ నేతలు ఇసుక మాఫియా ద్వారా దోచుకున్న సొమ్ము రూ.5,000 కోట్ల పైమాటేనని అనధికారిక అంచనా. అంతకుముందు.. డ్వాక్రా సంఘాల ముసుగులో రూ.3,600 కోట్లకు పైగా దోచుకున్నారు. మొత్తం మీద తెలుగుదేశం నాలుగేళ్ల పాలనలో టీడీపీ నేతలు ఇసుక ద్వారా దండుకున్న మొత్తం రూ. 8,600 కోట్ల పైమాటే. -
నాలుగేళ్ల చంద్రబాబు పాలన మోసం అంటున్న ప్రజలు
-
నాలుగేళ్ల నగుబాటు
యువతకు ఉద్యోగావకాశాల కల్పన ద్వారా దేశంలో నిరుద్యోగం పారదోలుతామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. దీనితో సహా పారిశ్రామిక, వ్యవసాయ, కార్మిక రంగాలకు, దళిత, బహుజన వర్గాలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు అన్నీ గుంటపూలు పూస్తున్నాయి. కానీ కుట్ర రాజకీయాల ద్వారా పేదరికాన్ని, దుర్భర దారిద్య్రాన్ని మరుగుపరిచేందుకు ప్రసిద్ధ సర్వే సంస్థల అంచనాలను కూడా పెట్టుబడి వ్యవస్థ (అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ) పాలకులు తారుమారు చేసే స్థితికి ఒడిగట్టడం కనిపిస్తున్నది. ఇందుకు ఉన్న ఉదాహరణలు ఒకటీ రెండూ కాదు. ‘చట్ట విరుద్ధంగా అపారమైన ధనరాశులను సంపాదించుకున్నవారు మాత్రమే అపవిత్ర కూటమిగా, అపవిత్ర కలయిక కోసం చేతులుకలుపుతున్నారు. కానీ ఒక్క బీజేపీకి మాత్రమే పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ దాకా దేశ వ్యాప్తంగా 1500 మంది లెజిస్లేటర్లున్నారు. గత నాలుగేళ్లుగా బీజేపీ మాత్రమే కేంద్రంలో అవినీతి రహిత ప్రభుత్వాన్నీ నిజాయితీగల పాలననూ అందించింది.’– నరేంద్ర మోదీ (నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 26న కటక్‌లో జరిగిన సమావేశంలో. అమిత్‌షా కూడా ఇలాంటి ప్రకటనే ఇచ్చారు) ‘దేశ ప్రజలకు ఇప్పుడు బీజేపీ (మోదీ) నాయకత్వం ఒక కొత్త తరహా అధికార ఉన్మత్త రూపాన్ని చూపిస్తున్నది. ఒక పద్ధతి ప్రకారమే నిరంతరం దాడులు జరుగుతున్నాయి. కనుకనే ప్రజలు నిరంతరం జాగరూకులై ఉండి పోరాడవలసిన సమయం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య సంబంధమైన బిల్లులపై నిర్ణయాధికారం రాజ్యసభకు లేకపోయినా సభ ప్రతిపత్తిని కాస్తా మోదీ ప్రభుత్వం దిగజార్చింది. చివరికి న్యాయవ్యవస్థ కూడా పలు ప్రకటనల ద్వారా, తీర్పుల ద్వారా ఆ వ్యవస్థపైన మన విశ్వాసాన్ని దిగజార్చింది. తీర్పుల విలువ పడిపోయింది. దీనికి కారణం– పాలకుల నుంచి పనిగట్టుకుని ఒక పద్ధతి ప్రకారం చేసే దాడులకు న్యాయ వ్యవస్థ గురికావడమే. ఈ దాడులను సహించడానికి పౌరులు అలవాటుపడేలా బీజేపీ ప్రభుత్వం చేస్తోంది’. – (హైదరాబాద్‌లో 25–5–18న జరిగిన తన నూతన గ్రంథ ఆవిష్కరణ సభలో బీజేపీ నేత, మాజీ మంత్రి, ప్రసిద్ధ పాత్రికేయుడు అరుణ్ శౌరి) అబద్ధాన్ని అదేపనిగా వల్లిస్తే ప్రజలు నమ్ముతారన్నది ఫాసిస్ట్ గోబెల్స్ వ్యూహం. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో బీజేపీ నేతలు ప్రారంభించిన ఊదర కూడా అలాంటిదే. అందులో వాస్తవం ఎంతో దేశ ప్రజలకు ప్రత్యక్షానుభవమే. ఏ రంగాన్ని చూసినా ఇంతే. ఆఖరికి ‘బీజేపీకి మాత్రమే 1,500 మంది చట్టసభల సభ్యులు ఉన్నారు’ అన్న మోదీ ప్రకటన కూడా పెద్ద అబద్ధం. ఇలాంటి గప్పాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు తేడా మాత్రం లేదు. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో విలువల కోసం దుర్భిణీ వేసి వెతుక్కోవడమే తప్ప ఫలితం ఉండదు. దేశవ్యాప్తంగా 1,500 మంది చట్టసభల సభ్యులు అంటూ ప్రధాని వినిపించిన మాటలోని తర్కాన్ని విడమరిచి చూడాల్సిందే. ఎందుకంటే అందులో కనిపించే వాస్తవం వేరు. 29 రాష్ట్రాలలోని పది శాసనసభలలో మాత్రమే బీజేపీకి ఆధిక్యత ఉంది. అసలు దేశంలో ఉన్న శాసనసభ స్థానాల సంఖ్య 4,139. ఇందులో బీజేపీకి దక్కినవి 1,516. నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాలలో దక్కినవి (గుజ రాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్) 950. సిక్కిం, మిజోరం, తమిళనాడు సభలలో సున్న. మిగిలినచోట్ల ఆ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయో చూడండి! శాసనసభ మొత్తం సీట్లు బీజేపీకి దక్కినవి ఆంధ్రప్రదేశ్ 175 4 తెలంగాణ 119 5 కేరళ 140 1 పంజాబ్ 117 3 ప. బెంగాల్ 294 3 ఢిల్లీ 70 3 ఒడిశా 147 10 నాగాలాండ్ 60 12 బీజేపీ భాగస్వామ్యం ఉన్న రాష్ట్రాలు మేఘాలయ 60 2 బిహార్ 243 53 జెకె 87 25 గోవా 40 13 అయినా కొంతమంది విర్రవీగుడికి కారణం కనిపించదు. ఇలాంటి ధోరణి గతంలో హిట్లర్ జర్మనీలో కూడా ఉండేది. అతడి అనుచరులు తమ బలాన్ని ప్రదర్శించడానికి అనుసరించిన మార్గాల్లో ఒకటి– కోట్ల మంది నిరుద్యోగ యువకుల అండదండలు ఉన్నాయని ప్రకటించడం. వారే తమ సైన్యమని చెప్పుకోవడం. ఇక్కడ బీజేపీలో చోటామోటా నేతలు కూడా తమ పార్టీకి 11 కోట్ల మంది సభ్యులు ఉన్నారని ప్రచారం చేయడం తెలిసిందే. యువతకు ఉద్యోగావకాశాల కల్పన ద్వారా దేశంలో నిరుద్యోగం పారదోలుతామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. దీనితో సహా పారిశ్రామిక, వ్యవసాయ, కార్మిక రంగాలకు, దళిత, బహుజన వర్గాలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు అన్నీ గుంటపూలు పూస్తున్నాయి. కానీ కుట్ర రాజకీయాల ద్వారా పేదరికాన్ని మరుగు పరిచేందుకు ప్రసిద్ధ సర్వే సంస్థల అంచనాలను కూడా పెట్టుబడి వ్యవస్థ (అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ)పాలకులు తారుమారు చేసే స్థితికి ఒడిగట్టడం కనిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణలు ఒకటీ అరా కాదు. అపార ధనరాశులు సంపాదించుకున్నవారంతా ప్రతిపక్షాలలోనే ఉన్నట్లు మోదీ చిత్రిస్తున్నారు. కానీ అనేక సాధికార సర్వేల ప్రకారం నేడు దేశంలో ధనిక పార్టీ బీజేపీ అని తేలింది. అంతేగాదు, ‘అవినీతిపరుల’ సంఖ్యలో బీజేపీ కాంగ్రెస్‌ను మించిపోయిందనీ, కాంగ్రెస్ పాలనలో మాదిరి నేటి బీజేపీ పాలనలో కూడా లెజిస్లేటర్లు (పార్లమెంటు/శాసనసభల్లో) ఎక్కువ సంఖ్యలోనే కేసులు ఎదుర్కొంటున్న అవి నీతిపరులున్నారనీ ‘ఏటీఆర్’ నివేదికలు వెల్ల డించాయి. అందుకనే ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, ఉదారవాద ప్రజాస్వామ్యవాది యాశ్చ మౌనిక్ మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రబ్బరులాగా ఎటుపడితే అటు సాగుతూ, ఆకర్షణీయంగా ఉండే ‘ప్రజల’నే పదాన్ని సృష్టించడానికీ ఆ పేరుతో మోసగించడానికీ పునాది ‘రాజు దైవాంశ సంభూతుడన్న’ సిద్ధాంతమేనని అంటారాయన. రబ్బరులాగా సాగే ఆ పదాన్ని ఆసరా చేసుకుని ‘జన సమ్మతమైన వ్యక్తి’ పేరుతో దూసుకువచ్చే నాయకులు కొందరుంటారని (‘ప్యూపుల్స్ వర్సెస్ డెమోక్రసీ’ గ్రంథంలో) కూడా ఆయన చెప్పారు. నాయకులు ఎంతటివారైనా ప్రజ లపై తమకుగల పరిమితాధికారానికీ, ప్రజలపట్ల జవాబుదారీ (పూచీ)తనానికీ మధ్య ఉండాల్సిన సమతుల్యతను తుంగలో తొక్కేస్తుంటారు. అలాంటివాళ్లు అల్లిన కట్టుకథే ‘పాపులిజం’ అని కూడా ఆయన అన్నాడు. దీనిని బట్టి బేరీజు వేసుకున్నప్పుడు ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజా బాహుళ్యం నడుం విరిచిన తొలి నిర్ణయమే ‘నోట్ల రద్దు’. కరెన్సీ చెలామణిని నిర్వహిస్తూ, శాసించే రిజర్వు బ్యాంకును సహితం పక్కన పెట్టేసి తీసుకున్న ఆ నిర్ణయం పార్లమెంటునూ, దేశ ప్రజలనూ చకితులను చేసింది. పాత, కొత్త గవర్నర్లు పెక్కుమంది మోదీ ప్రభుత్వ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలకుల అనాలోచిత చర్యల పర్యవసానాన్ని ముందే పసిగట్టిన నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజీనామా చెయ్యాల్సి వచ్చింది, తరువాత గుజరాత్‌నుంచి పట్టుకొచ్చిన ఊర్జిత్ పటేల్‌గానీ, ప్రధాని మోదీగానీ, చివరికి ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీగానీ పార్లమెంటరీ కమిటీ ముందుకు వచ్చి ఈ పరిణామానికి వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటూ వచ్చారు. ఇలా బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనూ తీసుకున్న నిర్ణయాలతో గ్రామీణ మధ్యతరగతి ప్రజలను, నిత్య వ్యవహారాలలో నగదు (క్యాష్) లావాదేవీలపై ఆధారపడే వ్యవసాయదారులను, చిన్న వ్యాపారులను నానా యాతనలకు గురిచేశారు. ఏటీఎంలు మూతపడ్డమే కాదు, అసలు పబ్లిక్ రంగ బ్యాంకులే ‘నో క్యాష్’ బోర్డులతో (నేటికీ) ‘స్వాగతం’ పలుకుతూనే ఉన్నాయి. ఇక జీఎస్టీ విధానంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడమేగాక, ద్రవ్య వ్యవహార లావాదేవీలను నియంత్రించి, విధాన నిర్ణయాలకు రూపకల్పన చేసే ఫైనాన్స్ కమిషన్ ప్రతిపత్తిని కూడా దిగజార్చేశారు. దేశీయ తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్) పరిశ్రమల్ని దేశీయంగానే ఉత్పత్తి ఇతోధికం చేసేందుకు (మేకిన్ ఇండియా) పథకాన్ని రూపొందించినట్టే రూపొం దించి, దేశవాళీ ఉత్పత్తులంటే అర్థం మన దేశంలోకి విదేశీ గుత్త పెట్టుబడి వర్గాలను ఆహ్వానించి వారిచేత ‘దేశీయ ఉత్పత్తులు’ నిర్వహించే పరాధార దుస్థితికి ‘ఆహ్వాన పత్రిక’గా మార్చారు. ప్రధానిగా తొలినాటి విదేశీ పర్యటనల్లోనే మోదీ పోర్చుగీస్ దోపిడీ వ్యాపారులైన అందరూ ‘వాస్కోడిగామాలై ఇండియాకు తరలి రమ్మని’ పిలుపిచ్చారని మరవరాదు. ఇక భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజ్యాంగం హామీపడిన మతాతీత సెక్యులర్ సోషలిస్టు, ప్రజాతంత్ర రిపబ్లిక్ ఎదుగుదలకు, దేశంలోని పౌరహక్కుల రక్షణకు పూచీ లేకుండా పోయింది. దళిత, జాతీయ మైనారిటీ బహుజనులపై ఏదో ఒక మిషపైన నిరంతర దాడులను, హత్యలను నర్మగర్భంగా ఆమోదించడమో, ఏమీ ఎరగనట్టు నటించడమో పాలకులకు అలవాటుగా మారడం, చివరికి ‘లవ్ జిహాద్’ ముసుగు కింది దౌర్జన్యకాండకు దిగడం– ఈ నాలుగేళ్లలోనే పరిపాటిగా మారడం గమనించాలి. ఇవన్నీ మనం సాకుతున్న పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు సహజ అవలక్షణాలని గుర్తించాలి. చివరికి సమాచార హక్కు చట్టాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం చెదలు పట్టిస్తోంది. ‘మంచి రోజులు రావడమంటే’ అర్థం (బ్రిటిష్ మాజీ ప్రధాని మాక్మిలన్ నినాదం ఇదే)– ఏమిటో ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక వేత్త సమీర్ అమీన్ ఇలా స్పష్టం చేశాడు. ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజలకు దుర్భరమైన దారిద్య్రాన్ని సృష్టించి పెట్టింది. అభివృద్ధి పేరిట ఇండియాలో జరిగే అభివృద్ధి– దేశంలోని కేవలం 15–20 శాతంమందికే పరిమితమవుతోంది, మిగతా 85 శాతం ప్రజా బాహుళ్యం దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నది!’’ - ఏబీకే ప్రసాద్(సీనియర్ సంపాదకులు) abkprasad2006@yahoo.co.in -
‘మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేదు’
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా ఆరోపించారు. మోదీ వైఫల్యాలపై శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలు పోయ్యాయని విమర్శించారు. బీజేపీ పాలనలో విద్యావిధానం పూర్తిగా కార్పొరేటికరణ అయిందన్నారు. విదేశాల్లో దాగిఉన్న నల్లధనం తీసుకువచ్చి జన్‌ధన్ ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన మోదీ నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పెట్రొల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ముడిచమురు చారెల్ ధర తక్కువగా ఉన్నా కూడా ప్రజల మీద భారం పెంచుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో ప్రజలకు భద్రత కరువైందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే దేశ భద్రతా బలగాల, పౌరుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. -
నాలుగేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ అధిష్టానం 15 రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ రంగాలకు చెందిన లక్షమంది ప్రముఖులను కలిసి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వం వహిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, పార్టీ ఆఫీసు బేరర్లు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు, మేథావులతో సదస్సులు, గ్రామసభలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. -
స్కూల్ గుమాస్తాకు నాలుగేళ్ల జైలు
తణుకు : ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజు మొత్తాన్ని సొంతానికి వాడుకున్న గుమాస్తాకు రెండు కేసుల్లో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తణుకు రెండో అదనపు జుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఇ.రాజేంద్రబాబు బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజినింగ్ అధికారి ఆర్.బెన్నిరాజు కథనం ప్రకారం.. తణుకు పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూలులో పని చేస్తున్న ఖండవల్లి విక్టర్‌బాబు 2012లో విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదు. దీనిపై పాఠశాల కరస్పాండెంట్ అరకుల మోహనరావు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఏఎస్సై జి.ప్రభువరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వాదోపవాదాల అనంతరం రెండుకేసుల్లో రెండేళ్లచొప్పున జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో ఆరునెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. -
మందుబాబులు రూ.8.2 కోట్లు ‘కట్టారు’
హైదరాబాద్ : వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ అత్యంత ప్రమాదకరంగా పరిణమించే మద్యం తాగి వాహనం నడపటం (డ్రంకన్ డ్రైవింగ్)పై ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించి బుధవారానికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ తనిఖీల్లో చిక్కిన మందుబాబులకు న్యాయస్థానం జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్షలు విధిస్తోంది. ఇప్పటి వరకు ‘నిషా’చరులు న్యాయస్థానానికి చెల్లించిన జరిమానా అక్షరాలా రూ.8,29,26,660. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములకు మంచి ఆల్కాహాల్ ఉంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీన్ని బ్లెడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. ఇందుకుగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన నిధులతో ఉపకరణాలు సమీకరించుకుని 2011 నవంబర్ 4 నుంచి వారంలో నాలుగు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి గత నెలాఖరు వరకు మొత్తం 54,658 మంది ట్రాఫిక్ పోలీసులకు చిక్కగా, వారిలో 5677 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయి. -
అమ్మకోసం..
తల్లికి అరుదైన క్యాన్సర్. చికిత్సలో ఉంది. ఆమె కోసం నాలుగేళ్ల పాప ఓ పాట పాడుతుంది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో తల్లి కోసం ఆ పాప నువ్వు బలం కోల్పోతే... నేనే నీ బలమౌతా... నీ పట్టు జారిపోతే... నేనే నిను ఒడిసి పట్టుకుంటా...అంటూ పాడుతూంటే ఆ తల్లి కళ్ళనుంచి నీళ్లు జలజల రాలాయి. ఆమె నోట అప్రయత్నంగా ఐ లవ్యూ అన్న మాట వెలువడింది. చూస్తున్న వారంతా గొంతు కలిపారు. అందరి కళ్లలోనూ కన్నీళ్లే... ఎప్పటిదో, ఎక్కడిదో తెలియదు కానీ, ఈ వీడియోను ఎలెన్ డీ జనరస్ షో వారి ఎలెన్ట్యూబ్ లో పెట్టగానే ఇరవై నాలుగు గంటల్లో కోటీ తొంభై లక్షల మంది చూశారు. వందలాది వెబ్ సైట్లు దీన్ని షేర్చేసుకున్నాయి. మనసు పొరల్లోని అతి సున్నిత భావాలను ఆవిష్కరించిన ఈ విడియోని మీరూ చూడండి. -
నాలుగేళ్లు చదివితే స్థానికులే!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపులో ‘స్థానికత’ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల (371డి) ప్రకారం వ్యవహరించాలని... విద్యార్థి చేరిన కోర్సుకు పూర్వం ఏడేళ్లలో నాలుగేళ్ల పాటు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతాన్నే ఆ విద్యార్థి స్థానికతగా నిర్ధారించాలనే భావనకు వచ్చింది. ఉదాహరణకు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీలో చేరడానికి ముందు కర్నూలులో లేదా విజయనగరం జిల్లాలో వరుసగా నాలుగేళ్ల పాటు చదివి ఉంటే వారిని అక్కడి స్థానికులుగానే పరిగణిస్తారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివితే వారిని ఇక్కడి స్థానికులుగా గుర్తిస్తారు. అయితే ఇది విద్యావకాశాల వరకే వర్తిస్తుందని, ఉద్యోగాలను పొందే విషయంలో మాత్రం వారిని స్థానికులుగా గుర్తించడానికి అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇతర నియమ, నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు. ఇక విభజనకు ముందు, తర్వాత ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో చదివితే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విభజన చట్టానికి అనుగుణంగా 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పలు అంశాల్లో స్పష్టత కరువు.. గత నాలుగేళ్లలో తెలంగాణ విద్యార్థులు ఏపీలోని చదువుకుని ఉంటే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఏవిధంగా చె ల్లించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు కర్నూలులో, ఖమ్మం జిల్లా విద్యార్థులు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో... ఇలా ఇతర జిల్లాల్లో చదువుకున్న విద్యార్థులు వేలసంఖ్యలోనే ఉన్నారు. వారికి ఫీజు చెల్లింపుపై త్వరలోనే ఆదేశాలు జారీచేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడేళ్లలో నాలుగేళ్లపాటు స్థానిక ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే స్థానిక విద్యార్థులుగా ‘ఫీజు’ వర్తిస్తుందని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమస్య తలెత్తింది. ఆ 26 కులాలకు 2014-15 నాటికే! తెలంగాణ ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో లేని 26 కులాలను (ఏపీలోని ఆయా జిల్లాలకు పరిమితమైన కులాలు) రాష్ట్ర బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. తూర్పుకాపు, కాళింగ, కొప్పుల వెలమ, శెట్టిబలిజ తదితర 26 కులాలకు చెందిన విద్యార్థులకు 2014-15కు సంబంధించిన ఫీజు బకాయిలను మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2014-15 వరకు పాత పథకాన్నే కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
నాలుగేళ్ల బ్యాంకు గ్యారెంటీ కుదించాం
హైకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వ నివేదిక హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు ప్రవేశం పొందే లోపే బ్యాంకు గ్యారెంటీ తీసుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో సవరించామని రాష్ర్ట ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. సవరణ ఉత్తర్వును పరిశీలించిన ధర్మాసనం విద్యార్థులకు బ్యాం కు గ్యారెంటీ సమర్పణకు వారం గడువిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు గ్యారెంటీ ప్రభుత్వ జీవో ను సవాల్ చేస్తూ కామినేని వైద్యకళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొ ందరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బీఎస్ ప్రసాద్ జీవో సవరణ వి వరాలను గురువారం ధర్మాసనానికి వెల్లడిం చారు. కాగా, బీ కేటగిరీ సీట్ల ఫీజు పెంచుతూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
ప్రియుడితో కలిసి నాలుగేళ్ల చిన్నారి హత్య
-
ట్రాక్టర్ బోల్తా: యువకుడి మృతి
తొండూరు: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ యువకుడు అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మృతి చెందాడు. పనికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ బడుగు జీవి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంద్రమైంది. పోలీసుల కథనం మేరకు.. మల్లేల గ్రామానికి చెందిన ఓతూరు మల్లికార్జున(25) ఏడాది నుంచి అత్తగారి ఊరైన తొండూరులో నివాసముంటున్నాడు. బుధవారం ఉదయాన్నే బూచుపల్లె గ్రామంలోని కొండ సమీపంలో ట్రాక్టర్లో బోలర్స్(కంకరరాళ్లు) నింపేందుకు కూలి పనులకు వెళ్లాడు. ట్రాక్టర్లో బోలర్స్ నింపాక ట్రాక్టర్ కొండపై నుంచి కిందకు దిగాక అందులో ఎక్కుదామని భావించి ట్రాక్టర్ ముందు నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో పక్కనే నడుచుకుంటూ వస్తున్న మల్లికార్జునపై ట్రాక్టర్ పడటంతో దాని కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అతను మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు.మృతుని తల్లి దస్తగిరమ్మ, తండ్రి ఓతూరు పీరాలతోపాటు భార్య సిద్ధేశ్వరి సంఘటన స్థలానికి వెళ్లి విగతజీవిలా పడి ఉన్న మల్లికార్జున మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వివాహమైన నాలుగేళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ వారు మృతదేహంపై పడి రోదిస్తుంటే చూపరుల హృదయం ద్రవించిపోయింది. రెండేళ్ల వయసున్న మృతుని కుమారుడు తన తండ్రికి ఏం జరిగిందో.. అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక అమాయకంగా చూస్తుంటూ ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కంట తడిపెట్టారు. ఈ సంఘటనపై హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. మల్లికార్జున మృతదేహానికి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పరామర్శ బూచుపల్లె కొండ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మల్లికార్జున మృతి చెందిన విషయం తెలుసుకున్న బూచుపల్లె, మల్లేల గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సురేష్‌రెడ్డి, బూచుపల్లె సర్పంచ్ వెంకటచలమారెడ్డి, మాజీ సర్పంచ్ గంగులయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లలో రెండు లక్షల ఇళ్లు
- 2న హైదరాబాద్‌లో లక్ష మందికి ఇళ్ల పట్టాలిస్తామన్న కేసీఆర్ హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లోని రెండు లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, దీన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో 125 చదరపు గజాల్లోపు ఇళ్లు నిర్మించుకున్న లక్ష మంది పేదలకు జూన్ 2న పట్టాలిస్తామని ప్రకటించారు. మరో 25వేల మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం చివరిరోజైన బుధవారం ఆయన పాత నగరంతో పాటు ఎల్బీనగర్, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్టీఆర్ నగర్లో జరిగిన బస్తీ సభలో మాట్లాడారు. నాంపల్లిలోని భీంరావుబాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తాము ఆందోళన చేపట్టినా వినకుండా పేదల నుంచి బలవంతంగా స్థలాలను లాక్కున్నారని.. ఆ స్థలంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ నాయకులను పిలిచి తానే స్వయంగా మాట్లాడతానని వారికి ఇంకో చోట జాగా ఇస్తానని చెప్పారు. ఈ విషయంలో అనవసరంగా బదనాం కావద్దని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గ్రేటర్ నగరం నలుమూలలకు వెళ్లి వచ్చిన 400 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. రాబోయే 45 రోజుల్లో చెత్త తరలించేందుకు 2500 ఆటో ట్రాలీలు, ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలను సమకూర్చుతామన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నెలలో ఒకరోజు అధికారులే బస్తీలకు వస్తారన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తామని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న పేదలకు 45 రోజుల్లో ఇళ్ల పట్టాలిస్తామని, రాబోయే ఆరు నెలల్లో ఇక్కడ వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తాం పాతబస్తీని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రిపిలుపునిచ్చారు. నూర్‌ఖాన్‌బజార్, డబీర్‌పురాలోని సయ్యద్ సాబ్ కా బాడ, చంచలగూడ, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నూర్‌ఖాన్‌బజార్‌లో రూ.12 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తామన్నారు. పెండింగ్ డ్రైనేజీ పనులకు రూ. 25 కోట్ల వరకు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో రెండు రోజుల పాటు పాతబస్తీలో విస్తృతంగా పర్యటించి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సైదాబాద్‌లోని ఎర్రగుంట శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిషన్ కాకతీయ కింద ఎర్రగుంట చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. చంచలగూడలోని పిల్లిగుడిసెల ప్రాంతంలో జీ+5 నిర్మాణానికి సంబంధిత అధికారులతో చర్చించారు. పాతబస్తీలో లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థల సేకరణ జరపాలని సూచించారు. కుర్మగూడాలో 224, రాజేంద్రనగర్ కిస్మత్‌పురాలో 228 ఇళ్లు, సయ్యద్‌సాబ్‌కా బాడాలో 48 ఇళ్లు పేదల కోసం నిర్మిస్తామని చెప్పారు. అనంతరం సరూర్‌నగర్ చెరువును పరిశీలించారు. ఇక్కడ నాలాల నుంచి వస్తున్న నీటిని మూసీలోకి మళ్లిస్తామన్నారు. ఇక నాచారం సింగం చెరువు తండాలో పర్యటించిన ఆయన నాలుగైదు నెలల్లో బస్తీవాసులు కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. చెత్తపై యుద్ధం చేద్దాం ‘హైదరాబాద్ నగరం పైన పటారం లోన లొటారం లెక్క ఉంది. ఏ బస్తీని చూసినా దుఃఖం, బాధ కలుగుతున్నాయి. నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయి. సికింద్రాబాద్‌లో మూడు రోజులు తిరిగిన. ఏ బస్తీకి వెళ్లినా అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో దుర్భరంగా బతుకుతున్నారు. ఈ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం బయలుదేరింది. అందరం కలసి చెత్తపై యుద్ధం చేయాలె. చెత్తాచెదారం వల్ల దోమలు వ్యాపిస్తాయని, వాటికి ధనికులు, పేదలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కుడతాయి. దోమను మించిన సోషలిస్టు లేదు’ అని కేసీఆర్ చమత్కరించారు. -
నాలుగేళ్లూ ‘స్వచ్ఛ హైదరాబాద్’
- ఇది మొక్కుబడి కార్యక్రమం కాదు: సీఎం కేసీఆర్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ మొక్కుబడి కార్యక్రమం కాదని, వచ్చే నాలుగేళ్ల పాటు దీనిని కొనసాగిస్తామని సీఎం కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని శుభారంభంగా ఆయన అభివర్ణించారు. తాను ప్యాట్రన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పార్సిగుట్టతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని సమూలంగా మారుస్తానన్నారు. సోమవారం కేసీఆర్ స్వచ్ఛ టీమ్ సభ్యులు, అధికారుల దృష్టికి వచ్చిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం మెట్టుగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో నిర్మాణాలకు ప్రణాళిక, పద్ధతి లేకుండాపోవడంతో ఖాళీస్థలం కనిపించడం లేదని, నాలాలు ప్రమాదకరంగా మారాయని, ఇందుకు గత పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యం.. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పెన్షన్లు, ఇళ్లు, బీడీ కార్మికులు, రహదారుల విస్తరణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ లైన్ల నిర్వహణ తదితర అంశాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. తొలుత పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నగరం అవతల ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇందుకుగానూ రెండు డబ్బాల విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆరు వారాల్లోగా వీటిని అందజేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. చెత్త తర లింపునకు ప్రస్తుతం ఉన్న రిక్షాలకుతోడు దాదాపు రెండు వేల ఆటో ట్రాలీలను స్థానికంగా ఉండే నిరుద్యోగులకు అందజేస్తామన్నారు. 150 నుంచి 200 లారీల వరకూ సమకూరుస్తామన్నారు. ఈ చెత్తను నగరం అవతల ఉండే ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలన్నారు. 45 రోజుల్లో ఈ వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పేదల వేదనలూ వినాలి.. బస్తీల్లోకి వెళ్లినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలను కూడా సేకరించాలని, వారికి ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం చేయిస్తామని, ఇప్పటికిప్పుడు 1,000-1,500 మందికి చికిత్స చేసేందుకు ఆస్పత్రులు సంసిద్ధత వ్యక్తం చేశాయని కేసీఆర్ చెప్పారు. కూరగాయలు, పండ్ల మార్కెట్ల వద్ద ఎక్కువగా చెత్త పేరుకుపోతున్నందున ఓ క్రమపద్ధతిని అవలంబించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సమీక్షలో మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో జాగ్రత్త స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొంటున్న ఉద్యోగులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. పగటి పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంటోందని.. అందువల్ల ఉదయం 10 గంటలలోపు విధులు నిర్వర్తించాలని.. సాయంత్రం 5 తర్వాత మళ్లీ బస్తీలకు వెళ్లాలని, మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలన్నారు. -
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
-
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
ఈ సంస్థకు ట్రస్టీలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్ నాలుగేళ్లకు పైగా సేవా పన్ను చెల్లించని వైనం ...........శ్రీరంగం కామేష్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కన్నేసింది. ఆ ట్రస్ట్ పన్ను ఎగవేసినట్టుగా గుర్తిం చింది. నాలుగేళ్ళకు పైగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి సేవల పన్ను చెల్లించకుండా వ్యవహారాలు నడిపిన వైనంపై సదరు విభాగానికి ఉప్పందించింది. తాజాగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం.. ఆ ట్రస్ట్‌కు తుది తాఖీదులు జారీ చేసింది. టీడీపీ నుంచి అద్దె వసూలు చేస్తున్న ట్రస్ట్ 1997లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు లోకే శ్తో పాటు డాక్టర్ వి.జయరామిరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్ట్ ఆధీనంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (బంజారాహిల్స్)ను వీరే నిర్వహిస్తున్నారు. ఇందులోని 35 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2009లో నెలకు రూ.10.5 లక్షల చొప్పున టీడీపీకి అద్దెకు ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు తమ స్థలాలు, భవనాలను అద్దెకు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు.. అద్దెకు ఉంటున్న వారి నుంచి నిర్ణీత అద్దెతో పాటు అదనంగా 12.36 శాతం (ఈ బడ్జెట్లో దీన్ని 14 శాతానికి పెంచారు) చొప్పున సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేసి.. ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎకై్సజ్‌కు చెల్లించాలి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అలా చేయకుండా 2014 వరకు కార్యకలాపాలు సాగించింది. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి: గత సాధారణ ఎన్నికల అనంతరం.. టీడీపీకి వచ్చిన విరాళాలు, ఆ పార్టీ చేసిన ఖర్చులపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో టీడీపీ-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య ఉన్న అద్దె చెల్లింపు ఒప్పందం, ట్రస్ట్ సేవా పన్ను చెల్లించకపోవడం వెలుగులోకి వచ్చా యి. ఈ విషయాన్ని ఈడీ జాయింట్ డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 23న సర్వీస్ ట్యాక్స్ విభాగానికి రహస్య లేఖ (ఎఫ్ నెం. టి-3/44/హెచ్‌జెడ్0/2011/2350) ద్వారా తెలియజేశారు. దీం తో సర్వీస్ ట్యాక్స్ విభాగం గత ఏడాది అక్టోబర్‌లో ట్రస్టీలకు నోటీసు జారీ చేసింది. దీంతో.. అద్దె స్వీకరిస్తున్నప్పటికీ అప్పటివరకు సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేసుకోని ట్రస్ట్.. వెనువెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసింది. అరెస్టు తప్పించుకునేందుకు ట్రస్ట్ ప్రతినిధులు సదరు డిపార్ట్మెంట్ను సంప్రదించినప్పుడు అద్దె ఒప్పంద పత్రం లో ఎక్కడా సర్వీస్ ట్యాక్స్ ప్రస్తావన లేకపోవడం, ఒప్పందం కమ్ వాల్యూ (చెల్లించిన అద్దెలోనే సేవల పన్ను కూడా కలిపి ఉండటం) విధానంలో ఉందని నిర్ధారించిన అధికారులు.. అద్దె ద్వారా వచ్చే ఆదాయం లో 10.3 శాతం (కమ్ వాల్యూ విధానంలో 12.36% కాకుండా 10.3% వసూలు చేస్తారు) చొప్పున సేవా పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ విధంగా 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ.70 లక్షల వరకు కట్టాలని మరో నోటీసు జారీ చేశారు. రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసే అధికారం ఉంటుందని తెలుసుకున్న ట్రస్టీలు.. వెంటనే రూ.30 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ట్రస్ట్ నుంచి స్పందన లేకపోవడంతో సర్వీస్ ట్యా క్స్ అధికారులు.. ఇటీవల తుది తాఖీదులు సైతం జారీ చేశారు. సరైన స్పందన రానిపక్షంలో ట్రస్ట్ భవన్‌పై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చెప్పినట్టు వినాల్సిందే!
అనంతపురం సెంట్రల్ : అధికారం ఉందన్న అహంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ అధికారులకు ఆర్డర్లు వేస్తున్నారు. వినడానికి ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వీరి వైఖరి వల్ల అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. వీటిని తాళలేక పలువురు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. మూడు, నాలుగేళ్లు సర్వీసు ఉండే ఎంపీడీఓలైతే ఇప్పుడే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. రాజకీయ నేతల నుంచి రక్షణ కల్పించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు అప్పట్లో తాము కోల్పోయిన ఆదాయాన్ని ఈ ఏడాదిలోనే తిరిగి సంపాదించుకోవాలనే తపనతో ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్యే గ్రూపు తగాదాలు ఏర్పడుతున్నాయి. గ్రూపుల మధ్యలో ఎంపీడీఓలు నలిగిపోతున్నారు. నేతలు చెబుతున్న అడ్డమైన పనులు చేయలేక కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. మరికొందరు ఈ ఉద్యోగమే వద్దురా బాబూ అంటూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు సిద్ధమవుతున్నారు. ఇదే కోవలో శింగనమల ఎంపీడీఓ లలితకుమారి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇసుక మాఫియా వేధింపుల నుంచి తనను రక్షించాలని ఆమె పలుమార్లు జెడ్పీ సీఈఓ రామచంద్రకు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో వీఆర్ఎస్కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం శింగనమల ఎంపీడీఓగా అక్కడే పనిచేస్తున్న ఈఓఆర్డీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. కూడేరు ఎంపీడీఓ నాగన్న కూడా స్థానిక టీడీపీ నాయకులతో ఇమడలేక పుట్లూరు మండలానికి బదిలీ చేయించుకున్నారు. కానీ కూడేరు ఎంపీడీఓగా పనిచేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అక్కడే ఉన్న ఈఓఆర్డీని బతిమాలినా ముందుకు రాలేదు. దీంతో ఆత్మకూరు ఈఓఆర్డీ దివాకర్‌బాబుకు బలవంతంగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన్ను స్వయాన జెడ్పీ డిప్యూటీ సీఈఓ తన వాహనంలో తీసుకెళ్లి.. ‘నీకు నేనున్నా. ఏమైనా కష్టమొస్తే నా వద్దకు రా..’అని భరోసా ఇచ్చి బలవంతంగా బాధ్యతలు తీసుకునేలా చేశారు. చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ మంజునాథరావు ఇప్పటికే సెలవుపై వెళ్లిపోయారు. కొత్తచెరువు ఎంపీడీఓ అమృతవాణి కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శెట్టూరు ఎంపీడీఓ కమలమ్మ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. రొద్దం ఎంపీడీఓ సోనీబాయి తమకు వద్దంటూ స్థానిక ప్రజాప్రతినిధులు జెడ్పీ చైర్మన్ చమన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో త్వరలో సెలవుపై వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదేబాటలో రాయదుర్గం ఎంపీడీఓ కూడా ఉన్నారు. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని అధికారులు వాపోతున్నారు. తమ సర్వీసులో ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదని వారంటున్నారు. ఈ ఐదేళ్లు తమకు ఎదురులేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి నుంచి ఎంపీడీఓలకు రక్షణ కల్పించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు గానీ, అసోసియేషన్ నాయకులు గానీ ఇంతవరకూ స్పందించిన పాపానపోలేదు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిందే ప్రజాప్రతినిధులకు ఎంపీడీఓలు గౌరవం ఇవ్వాల్సిందే. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే త న దృష్టికి తేవాలని స్వయాన చైర్మన్ చ మన్ సూచించారు. ఇన్నాళ్లూ స్పెషలాఫీసర్ల పాలన ఉండేది. ఇప్పుడు మండల పరిషత్‌లకు కార్యవర్గాలు ఏర్పడడంతో సమన్వయం చేసుకోలేక కొందరు ఎంపీడీఓలు ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే కొంతమంది దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్నారు. మరికొందరు వయోభారంతో ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకుంటున్నారు. - రామచంద్ర, సీఈఓ, జిల్లా పరిషత్ -
నాలుగేళ్ళుగా అదే నిరీక్షణ
-
ఆశాజనకంగా ఖరీఫ్
పాలమూరు, న్యూస్‌లైన్: నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువులో కొట్టుమిట్టాడుతున్న పాలమూరు జిల్లాపై ఈ ఏడాది వరుణుడు కరుణ చూపాడు. జిల్లాలో ఈ ఖరీఫ్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురియడంతో 93.9 శాతం విస్తీర్ణంలో పంటసాగు పూర్తయినట్లు తెలుస్తోంది. 7,07,850 హెక్టార్ల మేర పంటసాగు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనావేయగా.. ఇప్పటికే 6,64,690 హెక్టార్లలో వివిధ పంటల సాగు పూర్తయ్యింది. పత్తి, కంది, చెరకు, మొక్కజొన్న, ఉల్లి పంటలు అంచనాలకు మించి సాగు చేయగా, వరిపంట సాగు మాత్రం సగమే పూర్తయింది. జూన్ ప్రారంభం నుంచే నుంచే వర్షాలు పడుతుండటంతో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన పత్తి, మొక్క జొన్న, పప్పు దినుసులు, తదితర ఆరుతడి పంటలు పెరుగుతుండగా.. జిల్లాలోని అధిక మండలాల్లో వరినాట్లు మరింత వేగం పుంజుకుని ముమ్మరంగా సాగవుతున్నాయి. జిల్లాలో వరి 51,255లక్షల హెక్టార్ల మేర సాగయినట్లు సమాచారం. గత ఏడాది వర్షాలు సరిగా కురియకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, దీనికితోడు విద్యుత్‌కోతల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా మెట్ట పంటలపైనే ఆసక్తి చూపారు. అయితే ఇప్పటివరకు కురిసిన వర్షాల వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా మున్ముందు ఇదేవిధంగా వానలు కొనసాగితే నల్లరేగడి ప్రాంతాల్లోని పత్తి, మొక్కజొన్న తదితర మెట్ట పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. తేమ అధికంగా ఉన్న నేపథ్యంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కోసం రైతులు ఎగబడుతున్నారు. వర్షపాతం ఇలా.. జిల్లాలో జూన్ సాధారణ వర్షపాతం 71.2 మిల్లీమీటర్లు కాగా, 12 శాతం అధికంగా 80 మి.మీ వర్షం కురిసింది. జులైలో సాధారణ వర్షపాతం 146.6 మి.మీ కాగా 139.4 మి.మీ వర్షం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 34.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏదేమైనా నాలుగేళ్ల తర్వాత జూన్‌లో వర్షాలు కురవడం ప్రారంభమై కొనసాగుతూ వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.