![Take BJP's 'Four Years of Modi Sarkar' report card - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/26/BJP-CORD.jpg.webp?itok=-7GMxf9g)
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ అధిష్టానం 15 రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ రంగాలకు చెందిన లక్షమంది ప్రముఖులను కలిసి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వం వహిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, పార్టీ ఆఫీసు బేరర్లు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు, మేథావులతో సదస్సులు, గ్రామసభలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment