సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం | Denial of service tax NTR Trust | Sakshi
Sakshi News home page

సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం

Published Thu, Apr 23 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం

సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం

  • ఈ సంస్థకు ట్రస్టీలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్
  • నాలుగేళ్లకు పైగా సేవా పన్ను చెల్లించని వైనం
  • ...........శ్రీరంగం కామేష్
    తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కన్నేసింది. ఆ ట్రస్ట్ పన్ను ఎగవేసినట్టుగా గుర్తిం చింది. నాలుగేళ్ళకు పైగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి సేవల పన్ను చెల్లించకుండా వ్యవహారాలు నడిపిన వైనంపై సదరు విభాగానికి ఉప్పందించింది. తాజాగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం.. ఆ ట్రస్ట్‌కు తుది తాఖీదులు జారీ చేసింది.  
    టీడీపీ నుంచి అద్దె వసూలు చేస్తున్న ట్రస్ట్
    1997లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు లోకే శ్‌తో పాటు డాక్టర్ వి.జయరామిరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్ట్ ఆధీనంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (బంజారాహిల్స్)ను వీరే నిర్వహిస్తున్నారు. ఇందులోని 35 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2009లో నెలకు రూ.10.5 లక్షల చొప్పున టీడీపీకి అద్దెకు ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు తమ స్థలాలు, భవనాలను అద్దెకు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు.. అద్దెకు ఉంటున్న వారి నుంచి నిర్ణీత అద్దెతో పాటు అదనంగా 12.36 శాతం (ఈ బడ్జెట్‌లో దీన్ని 14 శాతానికి పెంచారు) చొప్పున సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేసి.. ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎకై్సజ్‌కు చెల్లించాలి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అలా చేయకుండా 2014 వరకు కార్యకలాపాలు సాగించింది.


    ఈడీ దర్యాప్తులో వెలుగులోకి: గత సాధారణ ఎన్నికల అనంతరం.. టీడీపీకి వచ్చిన విరాళాలు, ఆ పార్టీ చేసిన ఖర్చులపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో టీడీపీ-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య ఉన్న అద్దె చెల్లింపు ఒప్పందం, ట్రస్ట్ సేవా పన్ను చెల్లించకపోవడం వెలుగులోకి వచ్చా యి. ఈ విషయాన్ని ఈడీ జాయింట్ డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 23న సర్వీస్ ట్యాక్స్ విభాగానికి రహస్య లేఖ (ఎఫ్ నెం. టి-3/44/హెచ్‌జెడ్0/2011/2350) ద్వారా తెలియజేశారు. దీం తో సర్వీస్ ట్యాక్స్ విభాగం గత ఏడాది అక్టోబర్‌లో ట్రస్టీలకు నోటీసు జారీ చేసింది. దీంతో.. అద్దె స్వీకరిస్తున్నప్పటికీ అప్పటివరకు సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేసుకోని ట్రస్ట్.. వెనువెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసింది.
    అరెస్టు తప్పించుకునేందుకు
    ట్రస్ట్ ప్రతినిధులు సదరు డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించినప్పుడు అద్దె ఒప్పంద పత్రం లో ఎక్కడా సర్వీస్ ట్యాక్స్ ప్రస్తావన లేకపోవడం, ఒప్పందం కమ్ వాల్యూ (చెల్లించిన అద్దెలోనే సేవల పన్ను కూడా కలిపి ఉండటం) విధానంలో ఉందని నిర్ధారించిన అధికారులు.. అద్దె ద్వారా వచ్చే ఆదాయం లో 10.3 శాతం (కమ్ వాల్యూ విధానంలో 12.36% కాకుండా 10.3% వసూలు చేస్తారు) చొప్పున సేవా పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ విధంగా 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ.70 లక్షల వరకు కట్టాలని మరో నోటీసు జారీ చేశారు. రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసే అధికారం ఉంటుందని తెలుసుకున్న ట్రస్టీలు.. వెంటనే రూ.30 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ట్రస్ట్ నుంచి స్పందన లేకపోవడంతో సర్వీస్ ట్యా క్స్ అధికారులు.. ఇటీవల తుది తాఖీదులు సైతం జారీ చేశారు. సరైన స్పందన రానిపక్షంలో ట్రస్ట్ భవన్‌పై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement