నాలుగేళ్లలో స్టార్ హెల్త్ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు వ్యాపారం సాధించాలని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియం రూ. 1,352 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1,655 కోట్లు నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ గురువారమిక్కడ తెలిపారు.
రెండు రాష్ట్రాల్లో గత అయిదేళ్లలో రూ. 3,330 కోట్ల క్లెయిమ్స్ చెల్లించామని, ప్రస్తుతం 100 శాఖలు, 1,350 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం రూ. 15,284 కోట్ల వ్యాపారం సాధించగా, ఈసారి సుమారు రూ. 18,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సనత్ కుమార్ చెప్పారు. ఇంటి వద్దే వైద్య సేవలు పొందే విధంగా హోమ్ హెల్త్‌కేర్, టెలిమెడిసిన్ వంటి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో హోమ్ హెల్త్‌కేర్ సేవలు ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్ తదితర 8 నగరాల్లో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment