Doubles
-
పరిశ్రమలకు రెట్టింపు బ్యాంకు రుణాలు
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్‌లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది. జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది. -
మథియాస్ బో గుడ్‌బై
పారిస్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ పదవి నుంచి మథియాస్ బో తప్పుకున్నాడు. సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీని గొప్పగా తీర్చిదిద్ది వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను పారిస్ ఒలింపిక్స్‌లో భారత ద్వయం వైఫల్యం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనతో వరుసగా ట్రోఫీలు నెగ్గి పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపిన సాతి్వక్–చిరాగ్ జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2012 లండన్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియాస్ భారత జట్టుకు నాలుగేళ్ల క్రితం డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌గా వచ్చాడు. ‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇకపై నేను భారత్‌లో గానీ, మరెక్కడా గానీ కోచింగ్ ఇవ్వబోవడం లేదు. చాలా సమయం బ్యాడ్మింటన్ కోర్టుల్లో తీవ్ర ఒత్తిడి మధ్య గడిపిన నేను బాగా అలసిపోయాను. నాకు అండగా నిలిచిన, ఎన్నో జ్ఞాపకాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మథియాస్ బో స్పష్టం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగి పతకం సాధించలేకపోయిన సాత్విక్ –చిరాగ్‌ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, భవిష్యత్తులో వారిద్దరు ఎన్నో విజయాలు సాధిస్తారని మథియాస్ ఆకాంక్షించాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల మథియాస్ ఈ ఏడాది మార్చిలోనే సినీ నటి తాప్సీని పెళ్లి చేసుకున్నాడు. -
International Cricket Council: టి20 ప్రపంచకప్ విజేతకు రూ.20.35 కోట్లు
న్యూయార్క్: అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత టి20 ప్రపంచకప్ విజేతకు ఈసారి గతం కంటే రెట్టింపు ప్రైజ్‌మనీ లభించనుంది. కప్ గెలిచిన జట్టుకు రూ. 20.35 కోట్లు (2.45 మిలియన్ అమెరికా డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 10.63 కోట్లు (1.28 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. సెమీఫైనల్స్‌తోనే ఆగిపోయిన ఇరుజట్లకు రూ. 6.54 కోట్లు (7,87,500 మిలియన్ డాలర్లు) చొప్పున ఇస్తారు. ఈనెల 29వ తేదీన ముగిసే ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.48 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు)గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇది గత 2022 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 46.53 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు)కి రెట్టింపు మొత్తం. ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌కు రూ. 13.29 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభించాయి. -
రూ.1.2 లక్షల కోట్లకు ఆయుర్వేద మార్కెట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రెట్టింపు స్థాయికి పైగా వృద్ధి చెందనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 57,450 కోట్లు) ఉన్న ఈ మార్కెట్ 16.27 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) చేరనుంది. స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లలో సహజసిద్ధ చికిత్సా విధానాలకు డిమాండ్ నెలకొనడం, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కొత్తగా ఈ విభాగంలోకి ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వస్తుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆయుర్వేద టెక్ స్టార్టప్ సంస్థ నిరోగ్‌స్ట్రీట్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2023 – 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ ఏటా 15 శాతం చొప్పున పెరగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. నివేదిక ప్రకారం ప్రోడక్ట్ విభాగం 16 శాతం, సర్వీసుల విభాగం 12.4 శాతం చొప్పున వృద్ధి చెందనున్నాయి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 7,500 పైచిలుకు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, జమ్మూ–కశీ్మర్, కేరళ ఈ జాబితాలో ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఆయుష్ (ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగం 24 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని నిరోగ్‌స్ట్రీట్ తెలిపింది. -
గడచిన పదేళ్లలో... గృహ వినియోగం రెండింతలు
న్యూఢిల్లీ: భారత్‌లో నెలవారీ తలసరి గృహ వినియోగం గడిచిన దశాబ్ద కాలంలో రెండింతలకు పైగా పెరిగినట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. 2011–12 నాటికి తలసరి వినియోగం రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి ఇది పట్టణ ప్రాంతాల్లో రూ.6,459కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం రూ.1,430 నుంచి రూ.3,773కు చేరింది. గృహ వినియోగ వ్యయంపై ఎన్ఎస్ఎస్వో 2022 ఆగస్ట్–2023 జూలై మధ్య జరిపిన సర్వే వివరాలను విడుదల చేసింది. ప్రతి వ్యక్తి సగటున చేసే గృహ వినియోగ ఖర్చును తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది. 2021–12 నాటి ధరల ప్రకారం చూస్తే.. సగటు ఎంపీసీఈ పట్టణ ప్రాంతాల్లో రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి రూ.3,510కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఎంపీసీఈ రూ.1,430 నుంచి రూ.2,008కి పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పట్టణ ప్రాంతాల నుంచి 1,55,014 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,06,732 గృహాల సగటు శాంపిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా ఎన్ఎస్ఎస్వో సేకరించింది. -
రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్ (బాడీ డబుల్స్)ను వినియోగిస్తున్నదంటూ సోషల్‌మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండించింది. క్రెమ్లిన్ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిపుణులు ఇంటర్నెట్లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్‌ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నారని , నాన్‌స్టాప్‌గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
యూఎస్ ఓపెన్ డబుల్స్ బరిలో సాకేత్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ ఏడాది నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లోనూ పోటీపడనున్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి 77వ ర్యాంకర్ సాకేత్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో బరిలోకి దిగాడు. యూఎస్ ఓపెన్‌లో మాత్రం యూకీతో కాకుండా కరత్సెవ్ (రష్యా)తో సాకేత్ జత కట్టాడు. బ్రెజిల్ ప్లేయర్ డెమోలైనర్తో కలిసి యూకీ ఆడనున్నాడు. 35 ఏళ్ల సాకేత్ 2016 యూఎస్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 7–5, 6–2తో టాలన్ గ్రీక్స్పూర్–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 2015 తర్వాత వింబుల్డన్ టోర్నీలో బోపన్న డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్ ఆన్స్ జబర్, ఎలీనా రిబాకినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరించనుంది. ట్యునిషియా క్రీడాకారిణి, ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆన్స్ జబర్ ధాటికి డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ ఆన్స్ జబర్ 6–7 (5/7), 6–4, 6–1తో రిబాకినాను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జబర్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచి విజయం దక్కించుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన జబర్ నెట్ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు రిబాకినా 22 సార్లు నెట్ వద్దకు వచ్చి 10 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గింది. 35 విన్నర్స్ కొట్టిన జబర్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రిబాకినా 20 అనవసర తప్పిదాలు చేసింది. సెమీస్‌కు చేరుకున్న సబలెంకా మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండోసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–2, 6–4తో 25వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెట్లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడినా ఆందోళన చెందకుండా పట్టుదలతో ఆడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్)తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్); ఆన్స్ జబర్‌తో సబలెంకా తలపడతారు. సెమీస్‌లో ప్రవేశించిన సబలెంకా, అల్కారాజ్ తొలిసారి సెమీస్‌లోకి అల్కరాజ్, మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 6–4, 1–6, 4–6, 7–6 (7/4), 6–1తో క్రిస్టోఫర్ యుబాంక్స్ (అమెరికా)పై, అల్కరాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్‌తో అల్కరాజ్ ఆడతారు. Welcome back to the semi-finals, @SabalenkaA 👏 The No.2 seed powerfully gets past Madison Keys in straight sets, 6-2, 6-4#Wimbledon pic.twitter.com/tPuQdJzmoc — Wimbledon (@Wimbledon) July 12, 2023 చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన #NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం -
అపూర్వ జోడీ... అద్భుత విజయం
సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి(భారత్) జోడి ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అపూర్వ విజయం సాధించింది. పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. జకార్తాలో జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలుపొందింది. భారత్ జోడీకి 92,500 డాలర్ల (రూ.75 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా, విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారుడు సాత్విక్‌తో పాటు చిరాగ్‌ను సీఎం జగన్ అభినందించారు. జకార్తా వేదికగా ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. గతంలో ఏ భారతీయ బ్యాడ్మింటన్ జోడీకి సాధ్యంకాని ఘనతను సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం సుసాధ్యం చేసి చూపించింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఈ భారత జంట తొలిసారి విజేతగా అవతరించింది. తద్వారా డబుల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన మొదటి జోడీగా కొత్త చరిత్ర సృష్టించింది. గత ఐదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో తమ విజయాలతో భారత డబుల్స్ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సాత్విక్–చిరాగ్ జోడీ తాజా గెలుపుతో తమ స్థాయిని మరింత ఎత్తుకు పెంచుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంటను ఓడించి సంచలనం సృష్టించిన సాత్విక్–చిరాగ్... ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జోడీని కూడా బోల్తా కొట్టించి ఔరా అనిపించింది. జకార్తా: నిరీక్షణ ముగిసింది. డబుల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖాతాలో తొలిసారి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ టైటిల్ చేరింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ మరోసారి భారత్‌కు కలిసొచ్చింది. గతంలో సైనా నెహ్వల్, కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలువగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. తమ కెరీర్లో ఫైనల్ చేరుకున్న తొలి సూపర్–1000 టోర్నీలోనే సాత్విక్–చిరాగ్ ద్వయం టైటిల్ సాధించడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌గా ఉన్న ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందు 2017 నుంచి ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్‌లకు ఎనిమిదిసార్లూ ఓటమి ఎదురుకాగా... తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి ఈ మలేసియా టాప్ జోడీపై గెలిచారు. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 92,500 డాలర్ల (రూ. 75 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జంటకు 43,750 డాలర్ల (రూ. 35 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పక్కా వ్యూహంతో... గతంలో మలేసియా జోడీ చేతిలో ఎదురైన ఎనిమిది పరాజయాలను విశ్లేషించి ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత జోడీ బరిలోకి దిగింది. ఎలా ఆడితే తమ ప్రత్యర్థి జంట ఆట కట్టించే అవకాశముందో అదే రకంగా సాత్విక్–చిరాగ్ ద్వయం ఆడింది. సుదీర్ఘ ర్యాలీలను ఆడుతూనూ పదునైన స్మాష్ షాట్లతో వాటికి ఫినిషింగ్ టచ్ ఇచ్చి సాత్విక్–చిరాగ్ సత్తా చాటుకున్నారు. తొలి గేమ్ ఆరంభంలో ఒకదశలో 3–7తో వెనుకబడిన సాత్విక్–చిరాగ్ నెమ్మదిగా తేరుకున్నారు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 9–7తో ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం మలేసియా జోడీ స్కోరును 9–9 వద్ద సమం చేసినా... సాత్విక్–చిరాగ్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి ప్రత్యర్థి జంటపై ఒత్తిడి పెంచి వరుసగా మూడు పాయింట్లతో 12–9తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు ఆ తర్వాత భారత జోడీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 8–7 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 11–7తో... ఆ తర్వాత స్కోరు 14–11 వద్ద ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 18–11తో ఆధిక్యాన్ని పెంచుకున్నారు. చివర్లో 20–14 వద్ద వరుసగా సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఆధిక్యం 20–18కి తగ్గడంతో ఒత్తిడికి లోనయ్యారు. అయితే మలేసియా జోడీ అనవసర తప్పిదంతో భారత జోడీకి ఒక పాయింట్ రావడంతో విజయం ఖాయమైంది. వరల్డ్ టూర్ టోర్నీలు అంటే... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్‌ను ఆరు స్థాయిలుగా విభజించారు. ఏడాదిలో నాలుగు సూపర్–1000 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 12 లక్షల 50వేల డాలర్లు), ఆరు సూపర్–750 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 8 లక్షల 50 వేల డాలర్లు), ఏడు సూపర్–500 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 4 లక్షల 20 వేల డాలర్లు)...11 సూపర్–300 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 2 లక్షల 10 వేల డాలర్లు) ఉంటాయి. వీటితోపాటు సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ (మొత్తం ప్రైజ్‌మనీ: 20 లక్షల డాలర్లు) కూడా జరుగుతుంది. దాంతోపాటు సూపర్–100 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 1 లక్ష డాలర్లు) కూడా నిర్వహిస్తారు. టోర్నీ స్థాయిని బట్టి ర్యాంకింగ్ పాయింట్లలో, ప్రైజ్‌మనీలో తేడా ఉంటుంది. సూపర్–1000 టోర్నీలలో అత్యధిక పాయింట్లు, అత్యధిక ప్రైజ్‌మనీ లభిస్తుంది. -
మూడేళ్లలో 50 వేల నియామకాలు, భారీ ప్రణాళికల్లో డెలాయిట్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సర్వీసుల్లో ఉన్న డెలాయిట్ గడిచిన మూడేళ్లలో భారత్‌లో 50వేల మందిని నియమించుకుంది. ఈ కాలంలో సిబ్బంది సంఖ్య రెండింతలైందని కంపెనీ తెలిపింది. విద్య, డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అవకాశాలకు మద్దతుగా వినూత్న విధానాలపై దృష్టి సారించి, భారత్‌లోని వ్యక్తులు, ఉత్పాదక సామర్థ్యాలలో పెట్టుబడిని కొనసాగించాలని సంస్థ యోచిస్తోంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో, కంపెనీ STEM, ఆవిష్కరణ, లీడర్ షిప్, డిజిటల్‌పై దృష్టి సారించి విస్తృత అవకాశాలను కొనసాగించాలని యోచిస్తోంది. డెలాయిట్ వరల్డ్‌క్లాస్, విద్య , నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 2030 నాటికి 100 మిలియన్ల మందిని ముఖ్యంగా భారతదేశంలో 50 మిలియన్ల మందిని (కోటి) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని పీటీఐ నివేదించిం -
ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గుర్‌గ్రామ్‌లో శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 2–6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (భారత్)–పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. -
సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా
భారత అమ్మాయిల జోడి 11 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం పని పట్టింది. ఈ టోర్నీ చరిత్రలో ఇన్నేళ్లయినా పురుషుల జోడీ వల్ల ఒక్క పతకం కూడా రాలేదు. ఇప్పుడా లోటు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ వల్ల తీరింది. చిరాగ్‌శెట్టితో జతకట్టిన తెలుగు తేజం తనకన్నా మెరుగైన రెండో ర్యాంకింగ్ జోడీని కంగు తినిపించాడు. సెమీస్ చేరడం ద్వారా సాత్విక్–చిరాగ్‌లకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. టోక్యో: మన షట్లర్లు దూసుకెళుతున్నారు. కామన్వెల్త్గేమ్స్, ఏషియాడ్, ఒలింపిక్స్, థామస్–ఉబెర్ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఇలా ఏ మెగా ఈవెంట్ అయినా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో అందని ద్రాక్షయిన పతకాన్ని ఇప్పుడు అందుకోనున్నారు. అంతర్జాతీయ సర్క్యూట్లో స్థిరంగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ఈ టోక్యో ఈవెంట్లో ఆ ఘనత సాధించారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ సెమీస్ చేరడంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు జంటపై భారత ద్వయం ఆటను చూస్తే పతకం రంగు మారినా ఆశ్చర్యం లేదు. అంతలా డిఫెండింగ్ చాంపియన్స్‌పై సత్తా చాటారు. రెండో గేమ్‌లో పుంజుకున్న స్థానిక మేటి ర్యాంకింగ్ జోడీని నిర్ణాయక గేమ్‌లో ఓడించి మరీ సెమీస్ చేరిన తీరు అద్భుతం! శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడి 24–22, 15–21, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకు, డిఫెండింగ్ చాంపియన్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంటను కంగుతినిపించింది. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ పోరాటంలో భారత జోడీదే పైచేయి అయ్యింది. తొలిగేమ్‌లో ఆరంభం నుంచే పట్టుబిగించిన సాత్విక్–చిరాగ్ 12–5తో జోరు పెంచారు.అయితే వరుసగా ఏడు పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ జంట 16–14తో పోటీలో పడింది. ఈ గేమ్ ఆఖరిదాకా పట్టుసడలించని పోరాటం చేసిన భారత జంటే గేమ్ గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్ షట్లర్లు భారత ఆటగాళ్లకు చెక్‌పెట్టారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్ జంటే అదరగొట్టింది. 16–9తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ అదే వేగంతో పాయింట్లను సాధిస్తూ మ్యాచ్‌ను గెలిచింది. మరో పురుషుల డబుల్స్ జోడీ ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిలకు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అర్జున్–ధ్రువ్ 8–21, 14–21తో మూడు సార్లు చాంపియన్లుగా నిలిచిన మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. భారత@13 డబుల్స్‌లో భారత్‌కిది రెండో పతకం. మహిళల డబుల్స్‌లో ఇదివరకే (2011లో) గుత్తాజ్వాల–అశ్విని పొన్నప్ప కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కిది 13వ పతకం. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం సహా ఐదు పతకాలు నెగ్గగా, సైనా రజత, కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), లక్ష్యసేన్ (కాంస్యం), సాయిప్రణీత్ (కాంస్యం), దిగ్గజం ప్రకాశ్ పదుకొనె (కాంస్యం) పతక విజేతలుగా నిలిచారు. -
రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని వ్యవసాయం, పశుసంవర్థక, ఆహార శుద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తేల్చిచెప్పింది. 2015–16 నుంచి 2018–19 మధ్యకాలంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పడిపోయిందని వెల్లడించింది. ఈ మేరకు స్థాయీ సంఘం తన నివేదికను గురువారం పార్లమెంట్‌కు అందజేసింది. ఇందుకు గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖకు సూచించింది. చాలా రాష్ట్రాల్లో రైతాంగం ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ చోద్యం చూస్తుండడం శోచనీయమని తప్పుపట్టింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను వ్యవసాయ శాఖ పూర్తిగా ఖర్చు చేయలేకపోతోందని ఆక్షేపించింది. దేశంలో ఆరు ‘ఎయిమ్స్’ల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం పట్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. భోపాల్, భువనేశ్వర్, జో«ద్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రిషికేశ్ ఎయిమ్స్‌ల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని వెల్లడించింది. -
మూడేళ్లలో రెట్టింపైన డీమ్యాట్ ఖాతాలు
ముంబై: డీమ్యాట్ ఖాతాలు 2019 మార్చి నుంచి 2021 నాటికి రెట్టింపైనట్టు సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి చెప్పారు. 2019 మార్చి నాటికి 3.6 కోట్లుగా ఉన్న ఖాతాలు 2021 నవంబర్ నాటికి 7.7 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. నిఫ్టీ ఇండెక్స్ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్యాగి మాట్లాడారు. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ధోరణుల మాదిరే భారత్‌లోనూ వ్యక్తిగత ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లలోకి రావడం గణనీయంగా పెరిగింది. 2019–20లో సగటున ప్రతీ నెలా 4 లక్షల చొప్పున డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021లో ఇది ప్రతీ నెలా 20 లక్షలకు పెరిగింది. 2021 నవంబర్‌లో ఇది 29 లక్షలకు చేరుకుంది’’అని వివరించారు. చక్కగా రూపొందించిన ఇండెక్స్ మార్కెట్ పనితీరును అంచనా వేయడంతోపాటు, పెట్టుబడులకు పోర్ట్ఫోలి యో మాదిరిగా పనిచేస్తుందన్నారు. -
రెండేళ్లలో 150 కోట్ల మందికి ఇంటర్నెట్
న్యూఢిల్లీ: రెండేళ్లలో దేశంలో ఇంటర్నెట్ యూజర్లు రెండింతలు కానున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ గ్రామీణ భారతాన్ని అనుసంధానించనుంది. దీంతో రెండేళ్లలో ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 150 కోట్లకు చేరనుంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్తో అనుసంధానించిన అతిపెద్ద దేశం భారత్. ఇంట్రానెట్ కారణంగా చైనా ఆ స్థాయిలో కనెక్ట్ కాలేదు. భారత్‌లో ప్రస్తుతం 80 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నడిపిస్తుంది. డేటా ప్రొటెక్షన్ బిల్లు డిసెంబర్‌లోగా రానుంది. నైతిక విలువలు, అలాంటి విషయాలు పట్టింపు లేని దేశాల నుండి కాకుండా భారతదేశం నుండి వచ్చే ఏఐ సాంకేతికతలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. డేటా గోప్యతను ప్రాథమిక హక్కుగా మనం పొందాము. చైనాలో అందుకు భిన్నం’ అని అసోచాం కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యానించారు. -
ఆ ఉద్యోగాలు కేవలం పురుషులకే అన్న అభిప్రాయానికి కాలం చెల్లింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 2014 నుంచి 2020 మధ్య మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపయ్యిందని అన్నారు. భవిష్యత్తులో కొత్త తరం పోలీస్ వ్యవస్థను వారే ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్యం, పోలీసు శాఖ కేవలం పురుషులకే అన్న పాతకాలపు అభిప్రాయానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. 2014లో దేశవ్యాప్తంగా 1.05 లక్షల మంది మహిళా పోలీసులు ఉండగా, 2020 నాటికి 2.15 లక్షలకు చేరినట్లు ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’ గణాంకాలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. గత ఏడేళ్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల్లోనూ మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. కఠినమైన శిక్షణ పొంది కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ యూనిట్లలో సైతం పనిచేసేందుకు యువతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇది మన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని వివరించారు. మహిళా పోలీసులు బాలికలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు 100 కోట్ల డోసుల కరోనా టీకా పంపిణీ పూర్తి కావడంతో దేశం కొత్త ఉత్సాహం, వేగంతో ముందుకు దూసుకెళుతోందని మోదీ అన్నారు. మనదేశం ఎప్పుడూ విశ్వశాంతి కోసం పాటుపాడుతూనే ఉందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని ప్రధాని ప్రజలను కోరారు. -
ఆర్ఆర్ఆర్లో పెట్టుబడులకు తొందరొద్దు
మన వెంచర్ పక్క నుంచే ఆర్ఆర్ఆర్ వెళుతుంది సార్. అటు పక్కన మనది వంద ఎకరాల్లో టౌన్షిప్ ప్రాజెక్ట్ వస్తుంది! ఆర్ఆర్ఆర్ పనులు మొదలైతే రేట్లు డబుల్ అవుతాయి మేడం. ఇప్పుడు కొంటేనే మంచి లాభం పొందొచ్చు!! రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఏజెంట్లు, డెవలపర్లకు విక్రయాల మంత్రదండంలా మారింది. ఆర్ఆర్ఆర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాత్రికి రాత్రే ధరలను రెండింతలు చేసేశారు. లేఅవుట్ ప్లాన్, అనుమతులు, అభివృద్ధి పనులు ఇవేవీ ఉండవు.. జస్ట్ ఆర్ఆర్ఆర్ పేరిట మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ప్లాట్లను విక్రయించేసి చేతులు దులుపుకుంటున్నారు డెవలపర్లు. సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శివార్లలో రియల్ ఎస్టేట్ రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఈ రింగ్ రోడ్డు వెళుతుండటంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 35–40 శాతం వరకు పెరిగాయి. శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కంటే ఎక్కువే ధరలు పెరిగాయని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. హైవే ఫేసింగ్ ఉన్న భూముల ధర ఎకరానికి రూ.2 కోట్లు, కాస్త లోపలికి ఉంటే రూ.1–1.5 కోట్ల వరకున్నాయి. ఆర్ఆర్ఆర్ వెళ్తుందని భావిస్తున్న భూముల్లో వ్యవసాయం దాదాపు నిలిచిపోయింది. ఏ జిల్లాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళుతుందో క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్దమయ్యాకనే అధికారికంగా ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ప్రకటనలతో రేట్లు జూమ్.. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్ఆర్ఆర్ చుట్టూ శా>టిలైట్ టౌన్‌షిప్పులు, లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటవుతాయంటే కాసింత అనుమానమే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఆరంభంలో ఇలాగే ఆనాటి ప్రభుత్వం శాటిలైట్ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ దాదాపు పదహారేళ్లు దాటినా వాటి ఊసేలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారి టౌన్‌షిప్పుల జీవోలను మార్చుతూ వచ్చాయే తప్ప.. ఇవి ఏర్పాటయ్యేందుకు ఎదురయ్యే వాస్తవిక సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. ఓఆర్ఆర్ శాటిలైట్ టౌన్‌షిప్పుల పరిస్థితి ఇలాగుంటే ఆర్ఆర్ఆర్ చుట్టూ డెవలప్ అయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించుకోవాలి. ఆర్ఆర్ఆర్ చుట్టూ పారిశ్రామిక వాడలు, ఐటీ సెంటర్లు, లాజిస్టిక్ పార్క్‌లు, ఫార్మా పరిశ్రమలు, రిక్రియేషన్ సదుపాయాలు, వాణిజ్య కట్టడాలు, షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లు వంటివి వాస్తవం కావటానికి ఇంకెంత కాలం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వ ప్రకటనల పుణ్యమా అంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ధరల్ని కృత్రిమంగా పెంచేస్తున్నారు. దీంతో భూసేకరణ జరపడం కష్టంగా మారుతుంది. ఓఆర్ఆర్ను చూసే నిర్ణయం.. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డునే క్షుణ్నంగా పరిశీలిస్తే.. గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకు సర్వీస్ రోడ్‌కి ఇరువైపులా కొన్ని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. మరోవైపు కొల్లూరు దాకా కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక కొల్లూరులో సర్వీస్ రోడ్డు లేనే లేదు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్‌కు వెళ్లాలంటే మట్టి రోడ్డు మీద ప్రయాణించాల్సిన దుస్థితి. 156 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు ఇరువైపులా కి.మీ చొప్పు న గ్రోత్ కారిడార్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అంటే 316 కి.మీ. మేర అభివృద్ధి పనులు, ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పశ్చిమ హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆదిభట్ల వద్ద టీసీఎస్, కాగ్నిజెంట్ వల్ల కొంత కదలికలు వచ్చినప్పటికీ.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోచారం వద్ద ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఏర్పడడంతో ఇక్కడ కొంత ఊపొచ్చింది. పటాన్చెరు వద్ద ప్లాస్టిక్ పరిశ్రమలు, బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్క్‌లు, బుద్వేల్‌లో ఐటీ పార్క్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా చూస్తే రాత్రికి రాత్రే ఆయా ప్రాం తాలలో భూముల ధరలు పెరిగాయే తప్ప ప్రకటించిన అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే.. గతంలో ప్రయాణ దూరాన్ని కి.మీ. చొప్పున చెప్పేవాళ్లం. కానీ, ఇప్పుడు సమయంలో చెబుతున్నాం. ఎందుకంటే ఓఆర్ఆర్, మెట్రోలతో ప్రయాణం సులువైంది కాబట్టి.. ప్రధాన నగరం నుంచి ఎన్ని కి.మీ. దూరంలో ఆర్ఆర్ఆర్ ఉంటుందనేది మ్యాటర్ కాదు. పట్టణీకరణ, వ్యాపార, ఉద్యోగ అవకాశాలతో నగరం శరవేగంగా అభివద్ధి చెందుతుంది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా సిటీ విస్తరణ జరగాల్సిందే. కాకపోతే ఆయా ప్రాంతాలలో ముందుగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే గ్రోత్ కారిడార్లలో కంపెనీలు, ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. ఫలానా ప్రాంతం మీదుగా ఆర్ఆర్ఆర్ రహదారి వెళుతుందంటూ ఏజెంట్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దు. విచక్షణతో కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి. – జే వెంకట్ రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ. (ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ) -
ఫేస్బుక్ ఇండియా లాభం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.1,277 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19)లో ఆర్జించిన ఆదాయం (రూ.893 కోట్లు)తో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని ఫేస్బుక్ ఇండియా తెలిపింది. నికర లాభం రూ.65 కోట్ల నుంచి రెట్టింపై (107 శాతం వృద్ధితో) రూ.136 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత కార్యకలాపాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. చిన్న, పెద్ద వ్యాపారాలు ఆర్థిక రికవరీ సాధించడంలో ఇతోధికంగా తోడ్పాటునందిస్తామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లను 250 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. కోటి మంది యాక్టివ్ అడ్వర్టైజర్లున్నారు. (శాంసంగ్ మేకిన్ ఇండియా ఉత్పత్తులు) -
డబుల్స్ వస్తే రూ.500 జరిమానా
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు పయనించేందుకు నిషేధం విధించారు. డబుల్స్‌తో చక్కర్లు కొడితే రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో ఓవర్ లోడింగ్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక లాక్‌డౌన్‌కాలంలోనూ రాష్ట్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మార్చి 24న లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదో విడతగా లాక్డౌన్ పొడిగింపు కొనసాగుతోంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల మినహా, తక్కిన అన్ని చోట్ల సడలింపులు ఎక్కువే. చెన్నైలో కేసులు అమాంతంగా పెరగుతుండడంతో టెన్షన్ తప్పడం లేదు. దీంతో ఇక్కడ ఆంక్షల్ని మరింత కఠినం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సడలింపు పుణ్యమాని, రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసి ఉన్నాయి. డబుల్స్, త్రిబుల్స్ అంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాళ్లు ఎక్కువగానే ఉన్నారు. అలాగే, కార్లలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు, ఆటోల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు పయనించేందుకు అవకాశం కల్పించినా, అంతకన్నా ఎక్కువగానే అనేక చోట్ల ప్రయాణిస్తున్నారు. ఇలా ఎక్కువమందితో పయనిస్తున్న వాహనాల భరతం పట్టేందుకు గురువారం నుంచి పోలీసులు దూకుడు పెంచనున్నారు.ద్విచక్ర వాహనల్లో ఒకరు మాత్రమే పయనించాలన్న ఆంక్షను విధించారు. డబుల్స్‌తో ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారికి రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో అధిక శాతం మంది ఉంటే, సంఖ్యను బట్టి తలా రూ. 500 జరిమానా వడ్డించబోతున్నారు. ఆటోలు, కార్లకు అనుమతి ఇచ్చినప్పుడు తమకు సైతం అనుమతి ఇవ్వాలని కోరుతూ షేర్ ఆటోడ్రైవర్లు మంగళవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది. ప్రమాదాలు.. లాక్డౌన్ అమల్లోకి వచ్చినా, నిబంధనల్ని ఉల్లంఘించి రోడ్డెక్కిన వాళ్లు ఎక్కువే. వీరిపై కేసులు వి«ధించినా, జరిమానాల వడ్డన మోగించినా ఏమాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఈ కాలంలోనూ ప్రమాదాలు తప్పలేదు. జవనరిలో రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 731 మంది, ఫిబ్రవరిలో 232 మంది, మార్చిలో 610 మంది మరణించారు. లాక్ అమల్లోకి వచ్చినానంతరం ఏప్రిల్‌లో 119 మంది, మేలో 143 మంది ప్రమాదాల్లో మరణించినట్టు గణాంకాలు తేల్చాయి. -
తొలి ‘సూపర్’ టైటిల్ వేటలో...
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం ఊరిస్తోంది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు నేటి నుంచి మొదలయ్యే కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలతోపాటు డబుల్స్ విభాగాల మ్యాచ్‌లు ఉన్నాయి. మెయిన్ ‘డ్రా’ సింగిల్స్ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో సింధు తలపడుతుంది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బీవెన్ జాంగ్‌పై అలవోకగా నెగ్గిన సింధు మరోసారి అలాంటి ఫలితమే పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడే చాన్స్ ఉంది. చైనా ఓపెన్‌లో చోచువోంగ్ చేతిలోనే సింధు ఓడింది. ఈ ఏడాదిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను మినహాయిస్తే సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో స్థానిక క్రీడాకారిణి కిమ్ గా యున్‌తో ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారం క్వార్టర్ ఫైనల్లో సైనాకు మూడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)... సింధుకు నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్.. క్వాలిఫయర్‌తో కశ్యప్ తలపడనున్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంట
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్‌లో సంచలన ప్రదర్శనతో డబుల్స్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ కెరీర్ బెస్టు ర్యాంక్‌కు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం ఏడు స్థానాలు పురోగతి సాధించి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. గతవారం థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా... ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా సాత్విక్ జంట చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరో భారత ద్వయం మను అత్రి–సుమీత్ రెడ్డి నిలకడగా 25వ స్థానంలోనే కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో పెద్దగా మార్పులేవీ జరగలేదు. కిడాంబి శ్రీకాంత్ 10, సమీర్ వర్మ 13, భమిడిపాటి సాయిప్రణీత్ 19, ప్రణయ్ 31, సౌరభ్ వర్మ 44వ ర్యాంక్‌ల్లోనే ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 5వ, సైనా నెహ్వాల్ 8వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకొని 23వ ర్యాంక్‌కు చేరింది. మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి– ప్రణవ్ చోప్రా జంట ఒక స్థానాన్ని కోల్పోయి 23వ ర్యాంక్‌లో నిలువగా, అశ్విని–సాత్విక్ జోడీ నాలుగు స్థానాల్ని కోల్పోయి 27వ ర్యాంక్‌కు పడిపోయింది. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడి
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది. సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించింది. హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా భారత టైటిల్ ఆశలను తమ భుజాలపై మోస్తూ వచ్చిన సాయిరాజ్ జోడి మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ 16వ ర్యాంక్ సాయిరాజ్ జోడి 22–20, 22–24, 21–9తో 19వ ర్యాంక్ కో సుంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జంటను చిత్తుచేసింది. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిరాజ్ జంట టైటిల్ కోసం జరిగే తుది పోరుకు అర్హత సాధించింది. -
ఫ్రెషర్స్‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ ఉద్యోగార్ధులుకు గుడ్ న్యూస్. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐటీ ఫ్రెషర్స్‌కు ఈ శుభవార్త అందించింది. లేటెస్ట్ నైపుణ్యాలున్న ఫ్రెష్ ఇంజనీర్లకు చెల్లించే ప్యాకేజీని రెట్టింపు చేసింది. డిజిటల్ రంగంలో నైపుణ్యాలు కలిగిన టెకీలకు ఇకపై టీసీఎస్ వార్షిక ప్రాతిపదిక 6.5 లక్షల రూపాయల జీతాన్ని చెల్లించనుంది. ఐటీ పరిశ్రమలో భారతీయ ఇంజనీర్ల ఎంట్రీ స్థాయి జీతం సంవత్సరానికి సుమారు 3.5 లక్షల రూపాయలు మాత్రమే. టీసీఎస్‌లో ఉద్యోగం పొందాలనుకునే ఇంజనీర్లు ఆన్లైన్ పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. సంస్థలో నియామక ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసిన టీసీఎస్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ప్రారంభించింది. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సంపాదించిన అనంతరం వీడియో లేదా ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరోవైపు టీసీఎస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఐఆన్(iON )పరీక్ష కోసం నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 24 రాష్ట్రాల్లోని వంద నగరాలనుంచి 2లక్షల 80వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. మెషీన్‌లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ప్లాట్‌ఫాంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన తాము ఇప్పటికే వెయ్యిమందిని ఎంపకి చేశామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి అజయ్ ముఖర్జీ ప్రకటించారు. అయితే ఇంకా ఎంతమందిని నియమించుకోనున్నారనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉండవచ్చని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్‌ను వెనక్కి నెట్టిన టీసీఎస్ ఈ రేసులో టాప్ కంపెనీగా నిలిచింది. 8 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ కంపెనీగా టీసీఎస్ అవతరించింది. ఆగస్టు 23న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును అధిగమించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం
పారిస్/రొనాల్డ్ గారోస్: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సంచలనం చోటు చేసుకుంది. ఉమెన్ డబుల్స్ విభాగం నుంచి విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలయ్యారు. చివరి సెట్‌ను విలియమ్స్ సోదరీమణులు చిత్తుగా కోల్పోవటం విశేషం. మొత్తం మూడు రౌండ్లలో 6-4, 6-7(4), 6-0 తేడాతో ఓడిపోయారు. నిర్ణయాత్మక రౌండ్లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేకపోయారు. కాగా, సెరెనా-వీనస్‌లు ఇప్పటిదాకా 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా సెరెనా, రష్యన్ టెన్నిస్ క్వీన్ మరియా షరపోవాతో తలపడనుంది. గతంలో వీరిద్దరి 18సార్లు తలపడగా, 16 సార్లు సెరెనా, 2 సార్లు షరపోవా నెగ్గారు. జకోవిచ్ ఖాతాలో మరో రికార్డు... పురుషుల విభాగంలో నోవాక్ జకోవిచ్(సెర్బియా).. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌కు ఇది క్లే మైదానంలో 200వ విజయం. జకోవిచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో కెచ్చినషియోతో తలపడనున్నాడు. -
డబుల్స్ సెమీస్‌లో సుమీత్ రెడ్డి జంట ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న తెలంగాణ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీస్‌లో ఓడిపోయాడు. శనివారం సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో సుమీత్–మను ద్వయం 17–21, 15–21తో బెర్రీ అంగ్రియవాన్–హర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన సుమీత్ జంటకు 2,100 డాలర్ల (రూ. లక్షా 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.