జూలై నెలలో నమోదు
వ్యవసాయం, అనుబంధానికి 18%
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్‌లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి.
ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్‌బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్‌టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది.
జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment