bank lending
-
పరిశ్రమలకు రెట్టింపు బ్యాంకు రుణాలు
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది. జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది. -
రుణాల్లో వృద్ధి 16.28 శాతం
ముంబై: బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి వేగాన్ని అందుకుంది. సెప్టెంబర్ 23తో ముగిసిన రెండు వారాల్లో బ్యాంకుల రుణాల్లో వృద్ధి 16.28 శాతానికి చేరుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఆహారేతర రుణాలు రూ.130 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 24 నాటికి ఈ రుణాలు రూ.111.85 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్ 23 నాటికి రెండు వారాల్లో డిపాజిట్ల పరంగా 9 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం డిపాజిట్లు రూ.174.54లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి రూ.160 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాల్లో వృద్ధి, ఇతర మార్గాల నుంచి రుణ గ్రహీతలు బ్యాంకులవైపు మళ్లడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల స్థిరమైన వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయి. 2021–22 మొత్తం ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణాలు 8.59 శాతం పెరగ్గా, డిపాజిట్లలో 8.94 శాతం వృద్ధి నమోదైంది. -
రైతు కష్టార్జితం..బ్యాంకు పాలు!
సాక్షి, కర్నూలు : ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరెడ్డి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామం. 2016 రబీలో పండించిన శనగలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 110 క్వింటాళ్లకు పైగా (178 బస్తాలు) దిగుబడిని అదే గ్రామంలోని జై కిసాన్ గోదాములో నిల్వ చేశాడు. ఈ శనగలపై కర్నూలు వెంకటరమణ కాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖ నుంచి 2017 ఏప్రిల్ 4న రూ.4.29 లక్షలు రుణం తీసుకున్నాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో అవి గోదాములోనే ఉండిపోయాయి. అప్పు కట్టలేదని రైతుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు లారీతో వచ్చి శనగ బస్తాలను ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లవద్దని వెంకటేశ్వరరెడ్డి ప్రాధేయపడినా వారు వినుకోలేదు. గోదాముల్లోని రైతుల శనగలను తరలించడం, వేలం వేయడం చేయరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది వరకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అయినా, కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు దౌర్జన్యంగా శనగలు ఎత్తుకెళ్లడంతో బాధిత రైతు సోమవారం కలెక్టర్ జి.వీరపాండియన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఎల్డీఎంను పిలిచి సదరు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మొవ్వు విరిగిన కొబ్బరి రైతు
వేలాది ఎకరాల్లో కూలిన చెట్లు కోత దశలో అరటిగెలలు నేలపాలు మామిడి, జీడి తోటలకు నష్టం యలమంచిలి/నక్కపల్లి: ప్రకృతి దాడితో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. హుదూద్ దెబ్బకు కొబ్బరి,అరటి,మామిడి ,జీడి రైతులు కుదేలయ్యారు. ఆదివారం నాటి ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. యలమంచిలి, నక్కపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో చెట్లు కళ్లముందే చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. పంటచేతికొచ్చే సమయంలో అరటి తోటలు నేలకూలడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. భారీ వర్షాలు, తుపానులప్పుడు వరికి నష్టం వాటిల్లేది. ఇప్పుడు నష్టం ఉద్యానవన రైతుల వంతయింది. పంటపొలాల్లో ఎక్కడ చూసినా వర్షపునీరే కన్పిస్తోంది. నేలకొరిగిన చెరకు తోటలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చెరకు సాగు కలిసిరాక నష్టాలు చవిచూస్తున్న రైతులకు తుపాను రూపంలో మరింత నష్టం చేకూరినట్టయింది. నేలకొరిగిన చెరకును ఎత్తికట్టడం తమకు ఆర్థికంగా మరింత భారమవుతుందని యలమంచిలి ప్రాంతానికి చెందిన రైతులు వాపోతున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా అరటితోటలు నేలమట్టమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. జీడి, మామిడి తోటలు సైతం మొదళ్లకు విరిగిపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నక్కపల్లి మండలంలో వేలాది కొబ్బరిచెట్లు నేలకూలిపోయాయి. సుమారు 5వేల ఎకరాల్లో తోటలకు తీవ్రనష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. కొన్ని చోట్ల వేళ్లతో కుప్పకూలిపోగా,మరికొన్నిచోట్ల మొవ్వుతోసహా నేలరాలిపోయాయి. ఈ చెట్లు ఎందుకూ పనిరాని పరిస్థితి. ఈదురుగాలలకు టన్నులకొద్దీ కొబ్బరికాయలు నేలరాలిపోయాయి. ఇక మామిడి తోటల్లో మధ్యకు నరికినట్టుగా చెట్లు విరిగిపోయాయి. జీడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లింది. 3వేల ఎకరాలకు పైగా మామిడి,2వేల ఎకరాలకు పైగా జీడి తోటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎన్ నర్సాపురంలో కర్రినానాజీకి చెందిన 3 ఎకరాల అరటితోట పూర్తిగా ధ్వంసమైంది. మరో వారం రోజుల్లో అరటిగెలలు కోసి మార్కెట్కు తరలిద్దామని భావిస్తున్న తరుణంలో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ మూడెకరాల తోటకు సుమారు రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టానని నానాజీ వాపోయాడు. కరంటు లేని సమయంలో జనరేటర్ పెట్టి నీటిని సరఫరా చేశానని ఆశించిన స్థాయిలో పంటపండిందని సంబరపడుతున్న తరుణంలో ఈదురుగాలులు తోటమొత్తాన్ని నాశనం చేశాయని కన్నీళ్లపర్యంతమయ్యాడు. దేవవరం,డొంకాడ,జగన్నాధపురం,సీతానగరం,రమణయ్యపేట,దోసలపాడు,కాగిత, చందనాడ, వేంపాడు, తదితరప్రాంతాల్లో పత్తి, బత్తాయి,కంది, చెరకు, అరటి పంటలకు భారీనష్టం కలిగింది. వేలాది ఎకరాల్లో నష్టం వందలాది ఎకరాల్లో అరటి, వేలాది ఎకరాల్లో కొబ్బరి,మామిడితోటలు నేలకూలిపోయాయి. రూ.లక్షల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈనష్టాన్నుంచి కోలుకోవాలంటే మరో రెండేళ్లు పడుతుంది. ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులుచేసి పెట్టుబడులు పెట్టాం. రుణమాఫీచేయకపోగా,కనీసం రుణాలు కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుచేస్తే ప్రకృతి పగబట్టి సర్వనాశనం చేసింది. - కర్రినానాజీ, రాజబాబు,శంకర్, రైతులు