July
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లు 30 లక్షలు అప్..
న్యూఢిల్లీ: జూలైలో మొబైల్ టారిఫ్‌లను పెంచిన ప్రభావం ప్రైవేట్ రంగ టెల్కోలపై కనిపించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన జూలై గణాంకాల ప్రకారం బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 29.4 లక్షల మేర పెరిగింది. ఎయిర్టెల్ సబ్ర్‌స్కయిబర్స్ 16.9 లక్షలు, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 14.1 లక్షలు, రిలయన్స్ జియో యూజర్లు 7.58 లక్షల మంది తగ్గారు. దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్ నాటి 120.56 కోట్ల నుంచి జూలైలో స్వల్పంగా క్షీణించి 120.51 కోట్లకు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర టెలికం సర్కిల్స్‌లో మొబైల్ కనెక్షన్లు తగ్గాయి. జూలై తొలి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సుమారు 10–27 శాతం శ్రేణిలో టారిఫ్‌లను పెంచడం తెలిసిందే. -
పరిశ్రమలకు రెట్టింపు బ్యాంకు రుణాలు
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్‌లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది. జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది. -
రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు
న్యూఢిల్లీ: రష్యా నుంచి జూలై నెలలో 2.8 బిలియన్ డాలర్ల చమురు భారత్‌కు దిగుమతి అయింది. రష్యా చమురు ఎగుమతులు చైనా తర్వాత భారత్‌కే ఎక్కువగా వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనా అగ్ర స్థానంలో ఉంది. ఇక గత నెలలో భారత్‌కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు దూరం కావడం తెలిసిందే. దీంతో మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకే చమురును రష్యా అందిస్తుండడంతో, భారత్ దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం లోపే ఉండేది. అది ఇప్పుడు 40 శాతానికి పెగిపోయింది. రష్యా నుంచి చమురు ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళుతుంటే, 37 శాతం భారత్‌కు, యూరప్‌కు 7 శాతం, టరీ్కకి 6 శాతం చొప్పున సరఫరా అవుతున్నాయి. ఈ వివరాలను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లియర్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. బొగ్గుకు సైతం డిమాండ్.. ఇక రష్యా నుంచి బొగ్గు దిగుమతులకు సైతం చైనా, భారత్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2022 డిసెంబర్ 5 నుంచి 2024 జూలై వరకు రష్యా బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనాయే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అత్యధికంగా 18 శాతం బొగ్గు భారత్‌కు దిగుమతి అయింది. టరీ్కకి 10 శాతం, దక్షిణ కొరియాకి 10 శాతం, తైవాన్‌కు 5 శాతం చొప్పున రష్యా నుంచి బొగ్గు ఎగమతులు నమోదయ్యాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతుండడం తెలిసిందే. జూలై నెలలో 19.4 మిలియన్ టన్నుల చమురు దిగుమతుల కోసం భారత్ 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సీఆర్ఈఏ నివేదిక ప్రకారం రష్యా సముద్ర చమురు ఎగుమతుల్లో 36 శాతమే ట్యాంకర్ల ద్వారా జరిగింది. పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితి వీటికి వర్తించింది. ఇది కాకుండా మిగిలిన చమురు అంతా షాడో ట్యాంకర్ల ద్వారా రష్యా సరఫరా చేసింది. ఇవి అనధికారికం కనుక ధరల పరిమితి పరిధిలోకి రావు. మరీ ముఖ్యంగా విలువ పరంగా చూస్తే జూలై నెలలో 81 శాతం రష్యా చమురు సరఫరా షాడో ట్యాంకర్ల రూపంలోనే జరిగినట్టు సీఆర్ఈఏ నివేదిక వెల్లడించింది. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల పాటు సానుకూల గణాంకాలు నమోదు చేసిన ఎగుమతులు జూలైలో 1.2 శాతం క్షీణించాయి. 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్, వెండి, ఎల్రక్టానిక్ గూడ్స్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. మొత్తం మీద జూలైలో వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్‌లో ఇది 21 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది జూలైలో 19.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో ముడి చమురు దిగుమతులు 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 439 శాతం ఎగిసి 165.74 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్ల ఎగుమతుల (ఉత్పత్తులు, సరీ్వసులు) స్థాయిని ఈసారి అధిగమించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 22 శాతం క్షీణించడం కూడా ఎక్స్‌పోర్ట్స్ తగ్గుదలకు కారణమని వివరించారు. ధరలు పడిపోవడం, దేశీయంగా వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల జూలైలో పెట్రోలియం ఎగుమతులు తగ్గినట్లు సునీల్ వివరించారు. ఆఫ్రికా తదితర మార్కెట్లకి కూడా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రవాణా రేట్లు భారీగా పెరిగిపోవడం, కమోడిటీల ధరలు తగ్గడం, కంటైనర్ల కొరత వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ చెప్పారు. వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. → జూలైలో బియ్యం, జీడిపప్పు, నూనె గింజలు, మెరైన్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు, కాటన్ యార్న్ ఎగుమతులు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. → ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 37 శాతం, 8 శాతం, సుమారు 4 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → చైనా నుంచి దిగుమతులు 13 శాతం పెరిగి 10.28 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేíÙయా తదితర దేశాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాలకు మాత్రం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు 3 శాతం పెరిగి 6.55 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతులు 1 శాతం పెరిగి 3.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూలై వ్యవధిలో.. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై వ్యవధిలో ఎగుమతులు 4% పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు సుమారు 8% వృద్ధి చెంది దాదాపు 230 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సరుకులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 75.15 బిలియన్ డాలర్ల నుంచి 85.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు సేవల ఎగుమతుల విలువ 107 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు పెరిగింది. → అమెరికాకు ఎగుమతులు 9 శాతం పెరిగి 27.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు సుమారు 7 శాతం పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి 12.2 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు నమోదైంది. అటు రష్యా నుంచి దిగుమతులు జూలైలో 23 శాతం పెరిగి 5.41 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 20 శాతం వృద్ధి చెంది 23.77 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. -
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
హైదరాబాద్‌లో నియామకాల జోరు
ముంబై: జూలైలో కార్యాలయ ఉద్యోగుల నియామకాల పరంగా హైదరాబాద్‌లో మంచి వృద్ధి నమోదైంది. ఒకటికి మించిన రంగాల్లో నియామకాలు జూలైలో గణనీయంగా పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా జూలైలో నియామకాలు 12 శాతం పెరిగినట్టు ప్రకటించింది. మొత్తం 2,877 జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్లు (ఉద్యోగులు కావాలంటూ జారీ చేసే ప్రకటనలు) వచ్చినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జూలై నెలలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నియామకాల ధోరణిని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో 26 శాతం మేర నియామకాలు పెరిగాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో 23 శాతం అధికంగా ఉద్యోగాల భర్తీ నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే జూలైలో ఐటీ నియామకాలు 17 శాతం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఏఐ–ఎంఎల్ విభాగంలో 47 శాతం మేర నియామకాలు పెరిగాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యధికంగా 39 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత జామ్‌నగర్‌లో 38 శాతం, బరోడాలో 25 శాతం మేర నియామకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జోరు హైదరాబాద్‌లో హాస్పిటాలిటీ (ఆతిథ్య పరిశ్రమ) రంగంలో నియామకాలు 76 శాతం పెరిగాయి. ఆ తర్వాత బీమా రంగంలో 71 శాతం, బీపీవో రంగంలో 52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 44 శాతం చొప్పున జూలైలో నియామకాలు పెరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది. విజయవాడలో 13 శాతం, విశాఖపట్నంలో 14 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘12 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశాజనకం. ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల పరంగా సానుకూల వృద్ధి మొదటిసారి నమోదైంది. దేశ కార్యాలయ ఉద్యోగ మార్కెట్లో పురోగమనాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. -
ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?
ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.జూలైలో ప్రధాన తొలగింపులు ఇవేమసాచుసెట్స్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్టెక్ దిగ్గజం అన్కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్ఎఫ్ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
జులైలో ప్రధాని రష్యా టూర్..!
న్యూఢిల్లీ: జులైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మోదీ చివరిసారిగా 2019లో రష్యాలో పర్యటించారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన రష్యాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన ఒక రోజు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. పర్యటన వివరాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మోదీ పర్యటన కోసం రష్యాలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన తేదీ ఖరారైన తర్వాత ఇరు దేశాలు దీనిపై అదికారిక పర్యటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవలే మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇటలీకి వెళ్లొచ్చారు. -
ఈ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసా?
Bank Holidays in July 2024: జూలై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ జాబితాను సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వారాంతపు సెలవుల ఆధారంగా బ్యాంకులు ఈ సెలవులను నిర్ణయిస్తాయి.దేశంలోని అన్ని బ్యాంకులు, శాఖల్లో సాధారణ వారాంతపు సెలవులు వర్తిస్తాయి. అన్ని ఆదివారాలతో పాటు పండుగలు, జాతీయ సెలవు దినాలు, రెండు, నాలుగో శనివారాలు వంటి వారాంతపు సెలవులు ఈ జాబితాలో ఉన్నాయి.జులై సెలవుల జాబితా ఇదే..» జూలై 3 బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు» జులై 6 ఎం.హెచ్.ఐ.పి డే సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు» జులై 7 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 8 కాంగ్ (రథజాత్ర) సందర్భంగా ఇంఫాల్‌లో సెలవు» జులై 9 ద్రుప్కా షిజి సందర్భంగా గ్యాంగ్ టక్లో సెలవు » జులై 13 రెండో శనివారం దేశం అంతటా సెలవు» జులై 14 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 16 హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లో సెలవు» జులై 17 మొహర్రం/అషూరా/యు తిరోత్ సింగ్ డే సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సెలవు» జులై 21 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 27 నాల్గవ శనివారం దేశం అంతటా సెలవు» జులై 28 ఆదివారం దేశం అంతటా సెలవుఈ సెలవులను బ్యాంకుల భౌతిక శాఖలలో పాటిస్తారు. అయితే ఈ సెలవు రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకంగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవల ద్వారా కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్‌కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు. -
జూలై–సెప్టెంబర్‌కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
ఇంజినీరింగ్ ఎగుమతుల్లో క్షీణత
కోల్‌కతా: ఇంజనీరింగ్ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 123.65 మిలియన్ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది. ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000 -
జూలైలో కార్పొరేట్ డీల్స్ 3.1 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్ థార్న్టన్ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్ డాలర్ల కార్పొరేట్ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్ డీల్స్‌పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్ డీల్స్ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్ సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ముఖ్య డీల్స్.. ► 29 డీల్స్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రూట్ మొబైల్లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్ డాలర్లతో ప్రాక్సిమస్ ఓపల్ కుదుర్చుకున్న డీల్ అతిపెద్దదిగా ఉంది. ► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్ 176 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. ► నాలుగు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) విలువ 668 మిలియన్ డాలర్లుగా ఉంది. -
జూలైలో ఎగుమతులు 16% డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. నాలుగు నెలల్లోనూ.. ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
టమాట భగ్గు:15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం
Retail inflation at 15 month high in July వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా టమాట ధరలు భగ్గుమనడంతోపాటు పాటు ఇతర కూరగాయల ధర సెగతో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎగబాకిందని , ఈ ఒత్తిడిమరి కొంతకాలం కొనసాగ వచ్చని భావిస్తున్నారు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 4.87 శాతం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం జూలైలో 11.51శాతానికి పెరిగింది, అయితే ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్రవ్యోల్బణం 10.57శాతానికి పెరిగింది. కూరగాయల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ప్రతి ద్రవ్యోల్బణం -0.93శాతం నుండి గత నెలలో 37.34శాతాకి పెరిగింది. (SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!) వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. జులైలో ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమేనని డేటా పేర్కొంది. 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది. -
రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూలై నెలలోనూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే నెలవారీ పెట్టుబడులు రూ.15,245 కోట్లకు చేరాయి. ఒక నెలలో సిప్ పెట్టుబడుల పరంగా ఇదే గరిష్ట రికార్డు కావడం గమనార్హం. జూన్ నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,734 కోట్లుగా ఉన్నాయి. సిప్ పెట్టుబడులు 2022 అక్టోబర్ నుంచి ప్రతి నెలా రూ.13వేల కోట్లకు పైనే వస్తున్నాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి జూలై నెలలో మొత్తం మీద రూ.7,626 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో వచి్చన పెట్టుబడులతో పోల్చిచూస్తే 12 శాతం తగ్గాయి. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. జూలై నెలలో ఈక్విటీ, డెట్ ఇలా అన్ని విభాగాలు కలసి మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.82,046 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బలపడుతున్న సిప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈక్విటీల్లోకి సిప్ రూపంలో రూ.58,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్ రూ.1.56 లక్షల కోట్లను సిప్ రూపంలో ఆకర్షించాయి. సిప్ అనేది ప్రతీ నెలా పెట్టుబడులు పెట్టుకు నే సాధనం. దీనివల్ల మార్కెట్లలో ఉండే అస్థిరతల రిస్క్ కొనుగోలుపై తగ్గుతుంది. ఈ సానుకూలతలను అర్థం చేసుకుంటున్న ఇన్వెస్టర్లు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు ఈక్విటీల్లోకి 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు వస్తున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే జూన్ నెలలో ఈక్విటీ పథకాలు రూ.8,637 కోట్లను ఆకర్షించగా, జూలైలో రూ.7,626 కోట్లకు తగ్గాయి. జూలై నెలలో ఐదు నూతన పథకాలు ప్రారంభం కాగా, వీటి వరకే రూ.3,011 కోట్లు సమీకరించాయి. లార్జ్‌క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీక్యాప్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లోని పథకాలు పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ ఫండ్స్ ► స్మాల్‌క్యాప్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,171 కోట్లు వచ్చాయి. గడిచిన నాలుగు నెలలుగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి ఇతర పథకాలతో పోలిస్తే అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ నుంచి రూ.1,880 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గడిచిన మూడు నెలలుగా లార్జ్‌క్యాప్ పథకాలు పెట్టుబడులను కోల్పోతున్నాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగం నుంచి రూ.1,067 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ విభాగం గడిచిన నాలుగు నెలలుగా పెట్టుబడులను కోల్పోతోంది. ► ఈఎల్ఎస్ఎస్ విభాగం నుంచి రూ.592 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.932 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,327 కోట్లు, మిడ్క్యాప్ఫండ్స్ రూ.1,623 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ రూ.342 కోట్లు, వ్యాల్యూఫండ్స్ రూ.703 కోట్లు, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,429 కోట్ల చొప్పున పెట్టుబడులను రాబట్టాయి. డెట్ ఫండ్స్ ► డెట్ ఫండ్స్‌లోకి రూ.61,440 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఈ విభాగం నుంచి నికరంగా రూ.14,135 కోట్లకు బయటకు వెళ్లడం గమనార్హం. ► అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.51,938 కోట్లు వచ్చాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.8,608 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.7,027 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.2,865 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,000 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ► ఓవర్ నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.10,746 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ నుంచి రూ.1,309 కోట్లను ఉపసంహరించుకున్నారు. లాభాల స్వీకరణ.. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో అన్ని విభాగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలలో అన్నింటికంటే సిప్ పనితీరు గొప్పగా ఉంది. 33 లక్షల నూతన సిప్ ఖాతాలు నమోదయ్యాయి’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. అయితే జూన్‌తో పోలిస్తే జూలై నెలలో ఈక్విటీల్లోకి నికర పెట్టుబడులు తగ్గడానికి లాభాల స్వీకరణే కారణమై ఉండొచ్చని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కొందరు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి కూడా అనుసరించి ఉండొచ్చన్నారు. -
వాహన విక్రయాల్లో 10 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్‌లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
జీఎస్టీ వసూళ్ల ఉత్సాహం
న్యూఢిల్లీ: ఎగవేత నిరోధక చర్యలు, అధిక వినియోగదారుల వ్యయాల ఫలితంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచి్చన తర్వాత, నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లను అధిగమించడం వరుసగా ఇది ఐదవ నెల. ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం వసూళ్ల తీరును క్లుప్తంగా పరిశీలిస్తే.. ► మొత్తం వసూళ్లు రూ.1,65,105 కోట్లు ► సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.29,773 కోట్లు. ► ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.37,623 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.41,239 కోట్ల వసూళ్లుసహా) ► సెస్ రూ.11,779 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.840 కోట్ల వసూళ్లుసహా) ఆర్థిక సంవత్సరంలో తీరిది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్లలో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు చొప్పున ఖజానాకు జమయ్యాయి. -
పెట్రోల్‌కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్‌తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్‌ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్‌లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
విజృంభిస్తున్న డెంగ్యూ.. వచ్చే నెలలో మరింత వ్యాప్తి..
ఢిల్లీ: దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఒక్క జులై నెలలోనే దాదాపు 121 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఎడతెరిపిన లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరదల కారణంగానే డెంగ్యూ వ్యాపిస్తోందని వైద్యులు తెలిపారు. ఆగష్టు నెలలో డెంగ్యూతో పాటు మలేరియా, చికన్ గున్యా వంటి ఇతర వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జులై వరకు మొత్తం 243 డెంగ్యూ కేసులు నమోదైతే.. ఒక్క జులై నెలలోనే దాదాపు సగంపైనే కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇటీవల నగరంలో 72 మలేరియా కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. జులై చివరి వారంలోనే 34 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్‌కి 20 షాంపిల్స్ పంపించగా.. అందులో 19 కేసులు టైప్ 2 డెంగ్యూగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం తగ్గకపోవడం, శరీరంపై ఎర్రని చారలు, ప్లేట్లెట్స్ తగ్గడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వెన్ను నొప్పులు ఉంటాయని వైద్యులు సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. రానున్న వర్షాకాలం కావునా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా బంపర్ లిస్టింగ్ సాధించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్ఈసీ లిమిటెడ్ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్స్ చూడండి!
భారతదేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తన థార్ 4x4, బొలెరో, బొలెరో నియో, మరాజో, ఎక్స్యువి300 వంటి కార్ల మీద డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?) మారుతి సుజుకి విషయానికి వస్తే.. కంపెనీ ఈ నెలలో నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ. 64,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్ మీద కూడా కంపెనీ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించవచ్చు. -
హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవులు 8 రోజులే..
వివిధ సెలవుల కారణంగా 2023 జూలైలో హైదరాబాద్‌లోని బ్యాంకులు ఎనిమిది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జూలై నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ మొత్తం 15 రోజులూ సెలవులు ఉండవు. హైదరాబాద్‌లో ఉండే బ్యాంకులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, అదనంగా మొహర్రం కారణంగా జూలై 29 న పనిచేయవు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలను కొనసాగించవచ్చు. హైదరాబాద్‌లో బ్యాంకు సెలవులు జూలై 2: ఆదివారం జూలై 8: రెండో శనివారం జూలై 9 : ఆదివారం జూలై 16 : ఆదివారం జూలై 22 : నాలుగో శనివారం జూలై 23 : ఆదివారం జూలై 29: మొహర్రం జూలై 30: ఆదివారం ఇదీ చదవండి: July Deadlines: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ఓలా తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక సమాచారాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తమ తొలి ఎస్1 ఎయిర్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసింది!! భలే ఉన్నాయ్..ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయంటా సీఈవో ట్వీట్ చేశారు. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి భారీ నిధులను సేకరించింది. తాజాగా ప్రముఖ సావరిన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దీంతో కంపెపీ విలువ 6 బిలియన్ల డాలర్లకు చేరింది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) కాగా ఓలా ఎస్1 ఎయిర్‌ను గత ఏడాది లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో మూడు వేరియంట్లలో లభ్యం. దీని ధర బేస్ మోడల్ ధర రూ. 84,999గా ఉంది. మిడ్ వేరియంట్ ధర రూ. 99,999గాను, టాప్ వేరియంట్ ధర రూ.1,09,000 (ఎక్స్-షోరూమ్)గాను నిర్ణయించినసంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) Test drove the first S1 Air vehicles!! Loving them 🙂 Coming to you in July 😎💪🏼🛵 pic.twitter.com/wWnIAFYs62 — Bhavish Aggarwal (@bhash) May 23, 2023 -
భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2022 జూలైలో 3.8 శాతం తగ్గింది. 2021 జూలైలో 2.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే, తాజా సమీక్షా నెల జూలై ఈ పరిమాణం 2.45 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి దీనికి ప్రధాన కారణం. దేశ నెలవారీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి లక్ష్యం 2.59 మిలియన్ టన్నులకన్నా తక్కువ ఉత్పత్తి నమెదయినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. పశ్చిమ సముద్ర తీరంలో ఓఎన్జీసీ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల్లో సైతం ఉత్పత్తి 12.34 శాతం క్షీణించింది. వార్షిక అంచనాలు ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాలుగు నెలల కాలాన్ని పరిశీలిస్తే (2021-22 ఇదే కాలంతో పోల్చి) క్రూడ్ ఉత్పత్తి 9.96 మిలియన్ టన్నుల నుంచి స్వల్పంగా 9.91 మిలియన్ టన్నులకు తగ్గింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 29.7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి వరుసగా 39.8 మిలియన్ టన్నులు, 34 మిలియన్ టన్నులుగా నమోద వుతుందని అంచనావేస్తున్నట్లు చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవలే పేర్కొన్నారు. దేశం తన మొత్తం క్రూడ్ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. మిగిలిన 15 శాతం క్రూడ్‌ను భారత్ ఉత్పత్తి చేస్తుంది. చమురు శుద్ధికి దేశంలో 22 ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. అక్కడక్కడే సహజ వాయువు ఉత్పత్తి కాగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి జూలైలో దాదాపు అక్కడక్కడే 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా (బీసీఎం) ఉంది. అయితే నాలుగు నెలల కాలంలో మాత్రం ఉత్పత్తి 3.4 శాతం పెరిగి 11.43 బీసీఎంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముంబై సముద్రతీరంలోని డామన్ క్షేత్రంలో తక్కువ గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఓఎన్జీసీ గ్యాస్ ఉత్పత్తి జూలైలో దాదాపు 4 శాతం క్షీణించింది. -
రెండేళ్ల కనిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పీనోట్ల పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. జులైకల్లా వీటి విలువ రూ. 75,725 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్ చివరికల్లా రూ. 80,092 కోట్లకు చేరిన పీనోట్ పెట్టుబడులు 20 నెలల కనిష్టానికి చేరాయి. తదుపరి జులైకల్లా రూ. 75,725 కోట్లకు వెనకడుగు వేశాయి. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడులు క్షీణించాయి. ఇంతక్రితం 2020 అక్టోబర్‌లో మాత్రమే వీటి విలువ ఈ స్థాయిలో అంటే రూ. 78,686 కోట్లను తాకాయి. (కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు) పీనోట్ జారీ ఇలా పీనోట్లుగా పిలిచే పార్టిసిపేటరీ నోట్లను దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) జారీ చేస్తుంటారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాని విదేశీ సంస్థలు దేశీయంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే ఇందుకు తగిన పరిశీలన ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో జూన్ చివరికల్లా పీనోట్ పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. రూ. 75,725 కోట్లకు పరిమితమయ్యాయి. యూఎస్ ఫెడ్ కఠిన పరపతి విధానాల నేపథ్యంలో 10ఏళ్ల బాండ్ల ఈల్డ్స్ బలపడుతున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు ఆనంద్ రాఠీ షేర్స్, శాంక్టమ్ వెల్త్ తదితర సంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. (అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!) ఈక్విటీలే అధికం జూన్‌కల్లా నమోదైన పీనోట్ పెట్టుబడుల్లో రూ. 66,050 కోట్లు ఈక్విటీలకు చేరగా.. రుణ సెక్యూరిటీలకు రూ. 9,592 కోట్లు లభించాయి. ఇక హైబ్రిడ్ సెక్యూరిటీలలో కేవలం రూ. 82 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. జూన్‌కల్లా నమోదైన రూ. 80,092 కోట్లలో ఈక్విటీలకు రూ. 70,644 కోట్లు చేరగా.. డెట్ విభాగంలో రూ. 9,355 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. వరుసగా 9 నెలల అమ్మకాల తదుపరి తిరిగి ఈ జులైలో ఎఫ్‌పీఐలు నికర పెట్టుబడిదారులుగా నిలవడం గమనార్హం! ఈ బాటలో ఆగస్టులోనూ ఈక్విటీలపట్ల అత్యధిక పెట్టుబడులకు మక్కువ చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 జులై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం (ఆగస్ట్ 3) ప్రకటించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్‌స్టో, శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ఫ్రాన్స్ యువ చిచ్చరపిడుగు గుస్తావ్ మెక్కియోన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్ రేణుకా సింగ్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు ఎమ్మా లాంబ్, నతాలీ సీవర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచిన బెయిర్‌స్టో తన కెరీర్ బెస్ట్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. జులై నెల నామినీస్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106, 114*) బాదిన బెయిర్‌స్టో.. ఆ ప్రదర్శన ఆధారంగానే ఈ జాబితాలో చోటు దక్కించకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 63 పరుగులు చేసిన అతను.. ఆతర్వాత జరిగిన తొలి టీ20లో 53 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఇక లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జులై నెలలో తానాడినడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచాడు. ఆసీస్‌పై 6/118, 6/59.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లో 5/82, 4/135, రెండో టెస్ట్‌లో 3/80, 5/117 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గుస్తావ్ మెక్కియోన్ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ యువ బ్యాటర్ టీ20ల్లో వరుసగా రెండు విధ్వంసకర సెంచరీలతో (109, 101) ప్లేయర్ ఆఫ్ ద మంత్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల కేటగిరీలో రేణుకా సింగ్ ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్ల ప్రదర్శనతో.. లాంబ్ 3 మ్యాచ్‌ల్లో 102, 67, 65 అదిరిపోయే ప్రదర్శనతో.. సీవర్ వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. చదవండి: భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్ ఎప్పుడంటే..? -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
జులైలో తిరుమల శ్రీవారికి అత్యధిక హుండీ ఆదాయం
-
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్‌కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
గాల్లో తేలినట్టుందే! రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, స్టాక్‌మార్కెట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. లైసెన్స్ పొందిన ఆకాశ ఎయిర్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో ఆకాశ ఎయిర్ ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్ కొత్త యాజమాన్యం తిరిగి సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తరవాత ఫైయింగ్ లైసెన్స్ పొందిన రెండో ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఈ మేరకు సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ముఖ్యమైన మైలు రాయిని సాధించాం అంటూ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) రావడంపై సంతో షాన్ని ప్రకటించింది. విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటూ ట్వీట్ చేసింది. ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల ద్వారా సేవలను అందించనుంది. We are pleased to announce the receipt of our Air Operator Certificate (AOC). This is a significant milestone, enabling us to open our flights for sale and leading to the start of commercial operations. — Akasa Air (@AkasaAir) July 7, 2022 -
పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త..
చండీగఢ్: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనందించింది. జూలై 1నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. ఈనెల 16న పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమమై దీనిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఇప్పుడు మీరు అయిదేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు.. పంజాబ్ ప్రజలు రేపు పెద్ద ప్రకటన వినబోతున్నారు’’ అని ఆప్ ట్వీట్ చేసింది. అయితే ఢిల్లీలోని ఆప్ సర్కార్ కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆప్ ఇచ్చిన హామీల్లో.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇచ్చిన హామీని నెలబెట్టుకుంది ఆప్ సర్కార్. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తోంది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 92 చోట్ల విజయకేతనాన్ని ఎగరవేసింది. చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు -
జూలైలో జియో జూమ్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్ లీడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది. అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్లెస్ కనెక్షన్ల మార్కెట్లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్‌టెల్‌కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది. 120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్లెస్ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల మార్కెట్లో టాప్ 5 సరీ్వస్ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్ సంస్థలు టాప్ 5లో ఉన్నాయి. -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 15 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో కొత్త సభ్యుల నమోదు జూన్‌తో పోలిస్తే జులైలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్‌లో ఈ సంఖ్య 11.16 లక్షలుగా ఉండగా జులైలో 14.65 లక్షలుగా నమోదైంది. వీరిలో 9.02 లక్షల మంది తొలిసారిగా చేరిన వారు. ఇక మిగతా వారు గతంలో ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగి..మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరడం ద్వారా తిరిగి సభ్యత్వం పొందారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్‌వో సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నాలుగు నెలలుగా చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌లో కొత్త సభ్యుల నమోదు నికరంగా 8.9 లక్షలుగా ఉండగా, మే నెలలో 6.57 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్ మధ్య నుంచి కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో కొత్తగా లాక్డౌన్ విధించాల్సి రావడం కాస్త ప్రతికూల ప్రభావం చూపింది. -
జూలైలో ఊపందుకున్న ఎకానమీ: ఇక్రా
ముంబై: భారత్ ఎకానమీ జూలైలో భారీగా రికవరీ అయినట్లు రేటింగ్ సంస్థ– ఇక్రా పేర్కొంది. సెకండ్‌వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలు క్రమంగా సడలించడం దీనికి కారణమని వివరించింది. పారిశ్రామిక, సేవల రంగాలు, రవాణా, టోల్ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. 13 నాన్–ఫైనాన్షియల్ ఇండికేటర్లను చూస్తే, అందులో 10 సానుకూల ఫలితాలను ఇచ్చాయని వివరించింది. జీఎస్టీ ఈ–వే బిల్లులు, ఇంధన వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి, వెహికిల్ రిజిస్ట్రేషన్, దేశీయ పాసింజర్ ట్రాఫిక్ వంట విభాగాలు 2021 జూన్‌తో పోల్చితే 2021 జూలైలో గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపింది. ఇదే వరవడి కొనసాగవచ్చని పేర్కొంది. -
టోకు ధరల స్పీడ్ 11.16 శాతం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 11.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 11.16 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ధరల స్పీడ్ రెండంకెలపైనే కొనసాగుతోంది. అయితే జూన్‌తో పోల్చితే టోకు ద్రవ్యోల్బణం తగ్గడమే కొంతలో కొంత ఊరట. ఏప్రిల్ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్ (12.07 శాతం)లలో కూడా టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగింది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి (లో బేస్ ఎఫెక్ట్) ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 జూలైని తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతం. అక్టోబర్ వరకూ టోకు ధరల తీవ్రతపై లో బేస్ ఎఫెక్ట్ ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ టోకు ద్రవ్యోల్బణం తగ్గు తూ వస్తోంది. జూలైలో అసలు ఈ విభాగంలో ద్రవ్యోల్బణం యథాతథంగా కొనసాగింది. జూన్‌లో ఇది 3.09%. ఉల్లి ధరలు మాత్రం జూలైలో 72.01% పెరిగాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు జూన్‌లో 36.34% ఉంటే, జూలైలో 40.28 శాతంగా ఉంది. ► సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం టోకు ధరల పెరుగుదల జూలైలో 11.20 శాతం. జూన్‌లో ఇది 10.88%. -
‘అబ్బా.. ఏం ఉక్కపోత’.. ఇదో వరల్డ్ రికార్డ్ మరి!
మబ్బు పట్టిన వాతావరణం ఉన్నా.. అధిక వేడి, ఉక్కపోతతో ‘ఇది అసలు వానాకాలమేనా?’ అనే అనుమానం చాలామందికి కలిగించింది జులై నెల. ఇక ఆగస్టు లోనూ ఇదే తీరు కొనసాగుతున్నా.. అక్కడక్కడ చిరు జల్లులు- ఓ మోస్తరు వానలు, ఎక్కడో దగ్గర భారీ వర్షాలు.. తప్పించి పెద్దగా సీజన్ ప్రభావం కనిపించడం లేదు. దీంతో ఈసారి ఆగష్టు నాటికే అధిక వర్షాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయన్న భారత వాతావరణ శాఖ జోస్యం తప్పినట్లే అయ్యింది!!. ఇక ఈ భూమ్మీద ఇప్పుటిదాకా నమోదుకానీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈసారే నమోదు అయ్యాయి మరి!. యూఎస్ నేషనల్ ఓషనిక్ అండ్ ఎట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ), యూరోపియన్ కాపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీసెస్, యూఎన్ క్లైమేట్ సైన్స్ రిపోర్ట్.. ఈ మూడూ కూడా స్వల్ఫ తేడాలతో జులై నెలను ‘హాటెస్ట్ మంత్’గా ప్రకటించాయి. గత వంద సంవత్సరాల్లో ఈ సీజన్లో ఈ జులైను ఉక్కపోత నెలగా అభివర్ణించాయి. సాధారణంగా పశ్చిమ దేశాల్లో ఈ సీజన్ సమ్మర్.. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాకాల సీజన్ కొనసాగుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా వర్షాభావ ప్రాంతాల్లోనూ వాతావరణం ప్రజలకు ముచ్చెమటలు పోయిస్తోంది. వేడి ప్రభావంతో శీతల గాలుల ప్రభావమూ తగ్గడం ఈసారి విశేషం. చదవండి: కలిసి కదిలితేనే భూరక్ష ‘‘ఇదో కొత్త రికార్డు. ఓవైపు అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు, కార్చిచ్చు ప్రమాదాలు.. మరోవైపు కుంభవృష్టితో వరదలు, భూతాపం-వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని ఎన్ఓఏఏ ప్రతినిధి స్పినార్డ్ వెల్లడించాడు. 142 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని ఈసారి రికార్డును లెక్కగట్టారు. సముద్ర ఉపరితల వాతావరణంపై 0.93 సెంటీగ్రేడ్ పెరుగుదల వల్ల 50 డిగ్రీల సెల్సియస్ కన్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈసారి జూన్ చివర్లోనూ చాలా దేశాల్లో(ఉదాహరణకు పాకిస్థాన్) నమోదు అయ్యాయని ఆయన వివరించాడు. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని ఇప్పటికే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్‌క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) హెచ్చరికలు జారీ చేసింది కూడా. పర్యావరణ సంరక్షణను ప్రభుత్వాలు, సంబంధిత ఆర్గనైజేషన్లే నిర్వర్తించాలన్న రూల్ ఏం లేదు. సాధారణ పౌరులుగా బాధ్యతతో వ్యవహరిస్తే.. వాతావరణ ప్రతికూల మార్పులను కొంతలో కొంత తగ్గించవచ్చనేది పర్యావరణ నిపుణుల మాట. ►ఆహార వృథాను అరికట్టడం ►కొంచెం కష్టంగా అనిపించినా.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని నెమ్మదిగా తగ్గించడం. ►అవసరమైతే ఇంధన వనరుల విషయంలో ప్రత్యామ్నాయాలకు జై కొట్టడం ►ఎనర్జీ(ఇంట్లో కరెంట్) పొదుపుగా వాడడం ►చెట్ల సంరక్షణ.. మొక్కల పెంపకం -
కట్టడిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో అదుపులోనికి వచ్చింది. 5.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూలైలో పోల్చితే 2021 జూలైలో రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.59 శాతం పెరిగిందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు–రెపోకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (ఆర్బీఐకి) ప్రకారం 2 నుంచి 6శాతం శ్రేణిలో ఉండాలి. అయితే మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలుగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.15 శాతం ఉంటే, జూలైలో 3.96 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల చూస్తే జూన్‌లో 0.7 శాతం తగ్గితే, జూలైలో ఈ తగ్గుదల ఏకంగా 7.75 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు ఇదే కాలంలో 10.01% నుంచి 9.04%కి దిగివచ్చాయి. అయితే మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆయిల్ ఫ్యాట్స్ ధరలు 32.53% పెరిగాయి. అయితే జూలైలో ఈ పెరుగుదల రేటు 35%గా ఉంది. -
అమ్మకాల జోరు, ఏ వాహనాల్ని ఎక్కువగా కొన్నారంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలైలో వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం విక్రయాలు అధికమై 15,56,777 యూనిట్లు నమోదయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. ప్రయాణికుల వాహనాలు 63 శాతం పెరిగి 2,61,744 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 28 శాతం అధికమై 11,32,611, వాణిజ్య వాహనాలు రెండున్నరెట్లు ఎగసి 52,130 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 82,388 యూనిట్లుగా ఉంది. సెమికండక్టర్ల కొరత ప్రయాణికుల వాహన విభాగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. -
5 ఏరియాలు టాప్, మరో ఆరు ఏరియాల్లో వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్‌లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
మూడో నెలా ‘సేవలు’ పేలవం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్‌వేవ్ నేపథ్యంలో సేవల రంగం వరుసగా మూడవనెల జూలైలోనూ క్షీణతలోనే ఉంది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 45.4గా నమోదయ్యింది. జూన్‌లో ఇది 41.2 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటేనే దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సేవల రంగంలో వ్యాపార క్రియాశీలత, కొత్త ఆర్డర్లు, ఉపాధి కల్పన మరింత భారీగా పడిపోయినట్లు నెలవారీ సర్వే వెల్లడించినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. రాబోయే ఏడాది ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమలు నిరాశాజనకంగా ఉండడం మరో అంశం. ఈ తరహా నిరాశావాద ధోరణి ఏడాదిలో ఇదే తొలిసారి. మహమ్మారి కనుమరుగవడంపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు జూలైలో వ్యాపార విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు డీ లిమా పేర్కొన్నారు. ఈ రంగంలో వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ ఉపాధి అవకాశాలు క్షీణతలోనే ఉన్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా సేవల రంగానిదే. సేవలు, తయారీ కలిపినా మైనస్సే... మరోవైపు సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ వరుసగా మూడవనెలా క్షీణతలోనే కొనసాగింది. జూన్‌లో 43.1 వద్ద ఇండెక్స్ ఉంటే, జూలైలో 49.2 వద్దకు చేరింది. ఇండెక్స్ కొంత పెరగడమే ఇక్కడ ఊరట. 50కి పైన సూచీ వస్తేనే కాంపోజిట్ ఇండెక్స్ వృద్ధిలోకి మారినట్లు భావించాల్సి ఉంటుంది. ముడి పదార్థాల ధరల తీవ్రత సూచీలపై పడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. జూలైలో ఒక్క తయారీ రంగం మాత్రం క్షీణత నుంచి బయటపడ్డం కొంతలో కొంత ఊరటనిస్తున్న అంశం. జూన్‌లో 48.1 వద్ద క్షీణతలో ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 55.3 వృద్ధిలోకి మారింది. వరుసగా 36 నెలలు 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ పీఎంఐ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి 2020 ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చి, అదే జోరును కొనసాగించింది. అయితే సెకండ్‌వేవ్ ప్రభావంతో జూన్‌లో తిరిగి క్షీణతలోకి జారింది. -
జూలైలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశ ఎగుమతులు
న్యూఢిల్లీ: గత నెల జూలైలో భారత్ రికార్డు స్థాయిలో 35.2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది కీలక పాశ్చాత్య మార్కెట్లలో వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం. దీంతో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాథమిక డేటాలో మర్కండైజింగ్ దిగుమతులు కూడా $46.4 బిలియన్ల వరకు పెరిగాయి. ఇది చరిత్రలో రెండవ అత్యధికం. ఇక వాణిజ్య లోటు $11.2 బిలియన్లకు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం దేశాల ఎగుమతుల విలువ భారీగా పెరగగా, మలేషియా, ఇరాన్, టాంజానియాల ఎగుమతులు అత్యధికంగా క్షీణించాయి. అదేవిధంగా యుఎఇ, ఇరాక్, స్విట్జర్లాండ్ దేశాల దిగుమతులలో విలువ భారీగా పెరిగితే.. ఫ్రాన్స్, జర్మనీ, కజకస్తాన్ దిగుమతులు క్షీణించాయి. జూలైలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలను ఎక్కువగా ఎగుమతి జరిగాయి. ఇక అగ్ర దిగుమతి వస్తువులలో ముడి చమురు, బంగారం, విలువైన రాళ్ళు, వంట నూనెలు ఉన్నాయి. జూలై 2021లో భారతదేశం మర్కండైజింగ్ ఎగుమతుల విలువ 35.17 బిలియన్ డాలర్లు, గత ఏడాది జూలై కంటే ఈ ఏడాది జూలై నెలలో ఎగుమతుల విలువ 34% పెరిగాయి. 'ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దార్శనికత ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది' అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి 500 బిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల మర్కండైజింగ్ ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. "కాబట్టి, రాబోయే ఆరు సంవత్సరాలలో సేవల ఎగుమతులు $500 బిలియన్లు, మర్కండైజింగ్ ఎగుమతులు $1 ట్రిలియన్లు ఉంటాయి. వార్షిక $1.5 ట్రిలియన్ల మొత్తం ఎగుమతులతో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం గణనీయమైన వాటాను కలిగి ఉంటుంది" అని వాణిజ్య కార్యదర్శి బి.వి.ఆర్. సుబ్రమణియన్ గత నెలలో తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) గత వారం 2021 ప్రపంచ వృద్ధి అంచనాలో ఎటువంటి మార్పులు చేయకుండా 6% శాతం వద్దే ఉంచింది. ఇక మనదేశ వృద్ది అంచనాను ఐఎంఎఫ్ ఏప్రిల్ లో అంచనా వేసిన 12.5% నుంచి 9.5% తగ్గించింది. -
టాప్‌గేర్‌లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జులైకి సంబంధించి వస్తు సేవల పన్ను ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021 జులై నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వసూళ్లు ఇలా జులైకి సంబంధించి మొత్తం 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అవగా ఇందులో సీజీఎస్టీ 22.19 వేల కోట్లు, ఎస్జీఎస్టీ 28.53 వేల కోట్లుగా ఉన్నాయి. ఇక దిగుమతులకు సంబంధించి ఐజీఎస్టీ రూ. 57.86 వేల కోట్లు వసూలు అయినట్టు మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2020 జులైలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు రూ.2,138 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ 2,730 కోట్లు వచ్చాయి. తెలంగాణకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ.2,876 కోట్ల నుంచి రూ. 3,610 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరగగా ఏపీలో 28 శాతం పెరిగాయి. కరోనా తగ్గడంతో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్డడంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు ఆర్థిక మంత్రి. గత రెండు నెలలుగా ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనమని ఆర్థికక శాఖ పేర్కొంది. అంతకు ముందు కోవిడ్ కారణంగా మే, జూన్లలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. -
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అయితే ఇవి పంపండి
National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్‌డెస్క్: గత వేసవి ఆరంభం... బెంగాల్ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు. అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే, వేల ఏళ్ల క్రితమే క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. జులై 22న ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహ హస్తం భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ప్రతీ ఏడు భారత్, పాక్ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన ఫామ్‌హౌజ్‌లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు. మామిడి @ 1000 మామిడి పళ్లకు ఉన్న డిమాండ్ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన నూర్జహాన్ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్. విటమిన్ సీ కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. లో షుగర్ మ్యాంగో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అల్లాహార్‌లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. నూజివీడు స్పెషల్ నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చళ్లు చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్ అయిపోయింది. -
నిన్న వడ్డీ రేట్ల కోత.. రేపు సర్వీస్ ఛార్జీల పెంపు..
న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్‌స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వడ్డీ తగ్గింపు దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది. ‘డోర్‌స్టెప్’కు సర్వీస్ ఛార్జీ పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది. -
OnePlus Nord 2: త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2
వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక టీజర్లో ధృవీకరించింది. వన్‌ప్లస్ నార్డ్ 2పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. తాజాగా కంపెనీ నార్డ్ 2 గురించి అధికారిక వివరాలను టీజ్ చేసింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం.. ఈ నెల చివరి వారంలో రావచ్చని సమాచారం. భారతీయ కస్టమర్ల కోసం వన్‌ప్లస్, మీడియాటెక్ తో జతకట్టినట్లు కంపెనీ తెలిపింది. మీడియా టెక్ ప్రాసెసర్ తో వచ్చిన మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ గా వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ నిలవనుంది. గతంలో వన్‌ప్లస్ ఏ మోడల్లో వాడని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీని దీనిలో ఉపయోగించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2లో AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్‌ను చేర్చనుంది. కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు అదే బ్రైట్ నెస్, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. 5జీ కనెక్టివిటీ సపోర్ట్‌తో వచ్చే వన్‌ప్లస్ నార్డ్ 2లో 6.43 అంగుళాల డిస్ప్లే తీసుకు రానున్నారు. ఈ డిస్ప్లే ఓఎల్‌ఇడీ టెక్నాలజీ, ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇక, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చే అవకాశం ఉంది. -
జులై మూడోవారంలో ప్రారంభంకానున్న లష్కర్ బోనాలు
-
జూలైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటరీ్మడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలను రెండుసార్లు నిర్వహించనుంది. మొదటి పరీక్షలను జూలైలో నిర్వహించి ఆగస్టులో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో పరీక్షల నిర్వహణపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్‌కు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్రానికి లేఖ రాశారు. పరీక్షలను జూలై మధ్యలో నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే ముద్రించినందున పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అయితే ప్రశ్నపత్రంలో ఇచి్చన మొత్తం ప్రశ్నల్లో 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తామన్నారు. ఆ మార్కులను రెట్టింపు చేసి 100 శాతంగా పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు కుదిస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేరు వేరు సెట్ల ప్రశ్నపత్రాలతో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా, ఇతరత్రా కారణాలతో ఈ పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మూడో సెట్ ప్రశ్నపత్రంతో తర్వాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత మేర భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు జూలైలో నిర్వహిస్తారని.. పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘సాక్షి’గురువారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర, ఒకేషనల్ ప్రథమ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ తేదీలను కనీసం 15 రోజుల ముందు చెబుతామని వివరించారు. చదవండి: డబుల్ హ్యాపీ.. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చదవండి: తక్షణమే ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు -
జూలై 4 కల్లా అమెరికాలో సాధారణ స్థితి
వాషింగ్టన్: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4 నాటికి కోవిడ్ మహమ్మారి నుంచి దేశం విముక్తి కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజుకల్లా అమెరికా సాధారణ స్థితికి చేరుకోవాలని జో బైడెన్ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని వయోజనులందరూ మే 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్‌కి అర్హులని ఆయన ప్రకటించారు. జనవరి 20 న అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత జో బైడెన్ తొలిసారి చేసిన ప్రైమ్ టైమ్ ప్రసంగంలో దేశాన్ని కోవిడ్ రహితంగా మార్చేందుకు ప్రణాళికను ప్రకటించారు. అందులో భాగంగానే మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేశారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజీపై బైడెన్ సంతకం చేశారు. ఈ జూలై నాలుగు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం మాత్రమే కాదని, ఇది కరోనా నుంచి విముక్తిదినం కూడానని ప్రకటించారు. కోవిడ్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో మహమ్మారిగా ప్రకటించి ఏడాది అయ్యింది. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నామని బైడెన్ చెప్పారు. అమెరికాలో 527,000 మంది కోవిడ్‌తో మరణించారన్నారు. ఈ సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారికన్నా, రెండో ప్రపంచయుద్ధంలో చనిపోయిన వారికన్నా, వియత్నాం వార్‌లో మృత్యువాత పడిన వారికన్నా ఎక్కువని బైడెన్ చెప్పారు. అధికారం చేపట్టిన తొలి వందరోజుల్లో 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేయడమే తన లక్ష్యమని బైడెన్ చెప్పారు. ‘‘అయితే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, దాన్ని దాటేయబోతున్నాం. వంద రోజులు కాదు, 60 రోజుల్లోనే 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ని అందించనున్నాం’’అని జో బైడెన్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వాధికారులు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్తయారీదారులతో కలిసి పనిచేస్తూ, ఈ సురక్షితమైన మూడు కంపెనీల నుంచి లక్షలాది వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేస్తోందని చెప్పారు. మే1 నుంచి వయోజనులందరికీ వ్యాక్సినేషన్, ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలి లాంటి సమాచారం కోసం కొత్త వెబ్సైట్ల ఆవిష్కరణ, సురక్షితమైన వాతావరణంలో బడులు తెరవడం ప్రాధామ్యాలని బైడెన్ చెప్పారు. పూర్తిస్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ అయ్యే వరకు ప్రజలు ఏం చేయాలనే విషయాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను ఇస్తుందని చెప్పారు. ఆసియా అమెరికన్లపై దాడులు దుర్మార్గం కోవిడ్ మహమ్మారి కాలంలో ఆసియా ఆమెరికన్ల్ల పై దాడులు ఆపివేయాలని బైడెన్ వ్యాఖ్యానించారు. 2020 మార్చి 19 నుంచి, డిసెంబర్ 31 వరకు కోవిడ్ సమయంలో 2,800 ఆసియా అమెరికన్ల పట్ల విద్వేష పూరిత ఘటనలు నమోదయ్యాయి. ఇది ఘోరమైన విషయమని, తోటి అమెరికన్ల ప్రాణాలను కాపాడేందుకు ముందు వరుసలో ఉండి వారు పోరాడుతున్నారని బైడెన్ అన్నారు. బైడెన్ వ్యాఖ్యలపట్ల భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్ఓ ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. -
బాగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో 35 శాతం తగ్గినట్టు రియల్ ఎస్టేట్ రంగ సమాచార విశ్లేషణా సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ తెలిపింది. ఈ కాలంలో 50,983 యూనిట్లు (ఇల్లు/ఫ్లాట్) అమ్ముడు పోయినట్టు ఈ సంస్థ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది. కానీ అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్ల సంఖ్య 78,472గా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెలో మార్కెట్లలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో నమోదైన విక్రయాలు 24,936 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రెట్టింపయ్యాయని ఈ సంస్థ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు వార్షికంగా చూస్తే 46% తగ్గి 29,520 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గత వారం ఓ నివేదికను విడుదల చేసిన విషయం గమనార్హం. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొంత మేర కోలుకుంటోంది. సెప్టెంబర్ త్రైమాసికంతో చాలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పలు పథకాలు, ఆఫర్ల మద్దతుతో డెవలపర్లు తమ నిల్వలను గణనీయంగా తగ్గించుకోగలరు. పండుగల సీజన్లోకి ప్రవేశించాము. ఆఫర్లు, తగ్గింపులు, ఆకర్షణీయమైన చెల్లింపుల పథకాల మద్దతుతో ఈ రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాము’’ అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజా తెలిపారు. (చదవండి: ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!) -
31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. -
జూలై 27 నాటికి ‘రఫేల్’ రాక!
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల సరఫరా త్వరలో మొదలు కానుంది. తొలి దశలో భాగంగా జూలై 27 నాటికి ఆరు రఫేల్ యుద్ధవిమానాలు అందనున్నాయని భారత వాయుసేన వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచేదేనని ఆ వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత వ్యూహాత్మక వాయుసేన స్థావరంగా భావించే అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో రఫేల్ యుద్ధవిమానాలు ఉంటాయని సమాచారం. భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చినట్లు సమాచారం. రఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. యూరోపియన్ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ తయారు చేసే మిటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణితోపాటు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు రఫేల్‌లోని ముఖ్యమైన ఆయుధాలు. దీంతోపాటు ఇజ్రాయెల్ తయారీ హెల్మెట్లు, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లోబ్యాండ్ జామర్లు, పది గంటల ఫ్లయిట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివి భారత్ కోసం ప్రత్యేకంగా చేర్చారు. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ ఇప్పటికే పైలెట్ల శిక్షణ మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసింది. తొలి దఫా సరఫరా కానున్న యుద్ధ విమానాలు అంబాలా కేంద్రంగా పనిచేయనుండగా రెండో దఫా సరఫరా అయ్యేవాటిని పశ్చిమ బెంగాల్‌లోని హసిమార వైమానిక కేంద్రంలో ఉంచేందుకు రూ.400 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా ఆరు శిక్షణ విమానాలు. -
‘కేబుల్ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం. వీటితో పాటు సైబర్ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి కూడా.. ఇక తాజాగా ఈ వరుసలో చేరనున్నది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ప్రారంభానికి ముందే ఎంతగానో ప్రచారమైన దుర్గం చెరువు కేబుల్ వంతెన.. ప్రారంభానంతరం పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన.. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ రెండ్రోజుల్లో వంతెన పైకి వాహనాలకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. వచ్చే నెలాఖరులో ప్రారంభం.. బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఇది ప్రారంభమయ్యాక ఆ సొగసులకు పర్యాటకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని అంటున్నారు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను కాలినడకన మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతి స్తారని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు ప్రకృతిని, ప్రశాంతతను ఆస్వాదించాలనే కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాహ నాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇక, ప్రత్యేక తరహా లైటింగ్ సిస్టంతో కేబుల్ బ్రిడ్జి రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మనుంది. వివిధ బొమ్మలు వెలుతుర్లో కనువిందు చేయనున్నాయి. దుర్గంచెరువులోని నీళ్లూ మిలమిలా మెరవనున్నాయి. ఈ బ్రిడ్జి ప్రారంభంలోగా జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనుల పూర్తికీ జీహెచ్ఎంసీ శ్రమిస్తోంది. ► ఐటీ శాఖ నిర్వహిస్తున్న ఈ–ప్రొక్యూర్మెంట్ విభాగం ద్వారా సుమారు రూ.1,20,434 అంచనా వ్యయం కలిగిన 1,55,182 టెండర్లను నిర్వహించారు. ఈ గణాంకాలతో టెండర్ల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ► టెక్నాలజీ ఎంపవరింగ్ గరŠల్స్ పేరుతో 560 మంది స్త్రీలకు డిజిటల్ లిటరసీ నైపుణ్యాన్ని అందించింది. ► కరోనా రోగుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్‌ను టీ–వర్క్స్ తయారుచేసింది. ► తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తెలుగు వికీపీడియా రూపకల్పనకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌తో కలిసి పనిచేస్తోంది. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం ఉన్న లక్ష వ్యాసాలను 30 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ► తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర నిర్వహించి 120 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను గుర్తించారు. ► నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘టీ–వ్యాలెట్’యాప్‌ను 11 లక్షల మంది వినియోగదారులు క్రియాశీలంగా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ.6,795 కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరిగాయి. ► ఐటీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ఇప్పటికే నాలుగేళ్లను పూర్తి చేసుకుంది. ఫేస్బుక్, యూటీసీ, బోయింగ్ వంటి కంపెనీలతో కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నది. ► తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా 3.50 లక్షల మంది నిరుద్యోగ యువతకు, 1,500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 40కిపైగా కార్పొరేట్ కంపెనీలతో 4,500 మంది విద్యార్థులకు టాస్క్ ద్వారా ఉద్యోగావకాశాలు లభించాయి. ► దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 6 శాతం. 250కిపైగా కంపెనీలు రాష్ట్రంలో లక్షా 16 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. ► 2019లో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం రూ.7,337 కోట్ల పెట్టుబడులను తెచ్చింది. స్కైవర్త్ గ్రూప్, ఇన్నోలియా ఎనర్జీ వంటి భారీ పెట్టుబడులతో పాటు ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ► మైక్రాన్ తన ఉద్యోగులను 700 నుంచి 2,000 పెంచింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో వన్ ప్లస్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నది. -
20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు, ఆయా విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 20 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు ప్రారం భమయ్యాక నవంబర్/ డిసెంబర్లో నిర్వహిం చుకోవాలని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను యూనివర్సిటీలకు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే వర్సిటీలు వాటిని తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, బోర్డు ఆఫ్ స్టడీస్‌లో ఆమోదం తీసుకొని అమలు చేయాలని వెల్లడించారు. మార్గదర్శకాలివే.. ► పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించాలి. అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని మార్పు చేయాలి. వీటి రూపకల్పన ఆయా యూనివర్సిటీలే చేసుకోవాలి. ► బ్యాక్‌లాగ్‌లతో సహా అన్ని యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 20వ తేదీ నుంచి నిర్వహించుకోవాలి. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు తెరిచాక నవంబర్, డిసెంబర్లో ఒక సెమిస్టర్ తర్వాత మరో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలి. బ్యాక్‌లాగ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మిగతా సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలి. ► సంప్రదాయ డిగ్రీల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలి. ఒక సెషన్లో బీకాం విద్యార్థుల్లో సగం మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇతర కోర్సుల (బీఏ, బీఎస్సీ) సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. మరొక సెషన్లో ఆయా కోర్సుల్లో మిగిలిన సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. ఈ కోర్సుల ప్రాక్టికల్స్ నిర్వహణను సంబంధిత కాలేజీలకు వదిలేయాలి. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను సంబంధిత ప్రిన్సిపాళ్లే నియమించుకుంటారు. ► ప్రాజెక్టులు, వైవా, సెమినార్స్ వంటికి ఆన్లైన్లోనే నిర్వహించాలి. పీహెచ్డీ విద్యార్థులకు సంబంధించి సెమినార్లు, వైవా విషయంలో యూజీసీ నిబంధనలను అమలు చేయాలి. ఆన్లైన్లోనే నిర్వహించాలి. -
దశల వారీగా పాఠశాలలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశల వారీగా స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిస్థితిని బట్టి జూలై 1 నుంచి లేదా 15 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అధికా రులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడే స్కూళ్ల ప్రారంభంపై పెద్దగా నిర్ణయాలు లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఒకవేళ కరోనా అదుపులోకి వస్తే జూలైలో ప్రారంభించాలని, అప్పుడు మొదట 7, 8, 9, 10 తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనకు వచ్చారు. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. టీచర్లను మాత్రం పాఠశాలల పునఃప్రారంభ దినమైన జూన్ 12 నుంచే వచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీచర్లంతా గ్రామ పంచా యతీల సమన్వయంతో పాఠశాలలను శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్ చేయించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల నుంచి నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలన్న అంశంపైనా చర్చించారు. ఎక్కువుంటే షిఫ్ట్ పద్ధతిలో.. పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్ పద్ధతుల్లో కొనసాగించాలని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇది అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, డిజిటల్ తరగతులు, కేబుల్ టీవీ ద్వారా తరగతుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వాస్తవానికి ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కానే కాదని పేర్కొన్నా.. ఉన్నత తరగతులకు ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ప్రత్యక్ష బోధన లేకుంటే ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, భౌతిక దూరం పాటించడం గ్రామీణ పాఠశాలల్లో పెద్దగా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కరోనా అదుపులోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపైనా విద్యా శాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరో 10–15 రోజుల తర్వాత కరోనా పరిస్థితిని చూసి మళ్లీ సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోగా అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతోనూ ఓసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై 15 నుంచి ఇంటర్ తరగతులు ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్ విద్యా కార్యక్రమాలపైనా బోర్డు అధికారులు మంత్రికి నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే ఇంటర్లో సిలబస్ తగ్గించొద్దని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే సిలబస్ అలాగే ఉండాలని, అవసరమైతే నష్టపోయిన పని దినాలను ఆన్లైన్ బోధన ద్వారా సర్దుబాటు చేయాలని సూచించారు. భేటీలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్య సీనియర్ అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
శ్రీరాముడికి జలాభిషేకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద పూర్తి ఆయకట్టు సాగులోకి తెచ్చేలా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. ఎస్సారెస్పీ కింద నిర్ణయించిన పూర్తి ఆయకట్టుకు నీరివ్వడంతో పాటే ప్రతి చెరువును నింపి నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు జూలై నుంచి నీరు విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల మేరకు కాళేశ్వరం ద్వారా నీటిని ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం ఆయకట్టుకు నీరు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గతేడాది వానాకాల సీజన్లో పుష్కలంగా వర్షాలు కురవడంతో నీటి వినియోగం పెద్దగా అవసరం లేక పోయింది. అదే యాసంగి సీజన్లో మాత్రం స్టేజ్–1 కింద 9.50 లక్షల ఎకరాలు, స్టేజ్–2 కింద 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. దీనికోసం మొత్తంగా 90 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇందులో 25 నుంచి 30 టీఎంసీల నీరు కాళేశ్వరం ద్వారా తరలించిన నీటి వాటా ఉంది. అయితే ఈ ఏడాది స్టేజ్–1, 2ల కింద ఉన్న మొత్తం ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు జూలై ఒకటి నుంచే నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులోకి ఆగస్టు నుంచి అధిక ప్రవాహాలుంటాయి. గత పదేళ్ల ప్రవాహాల లెక్కలు తీసుకుంటే జూన్, జూలైలో వచ్చిన ప్రవాహాలు సగటున 10 నుంచి 15 టీఎంసీల మేర ఉండగా, ఆగస్టులో 50 నుంచి 60 టీఎంసీలుంది. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎస్సారెస్పీలో 30 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఇందులో 10 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి మిగతా 20 టీఎంసీల నీటిని జూలై నుంచే సాగుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్ఫా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్‌మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్‌మఠ్, గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. వస్తే వరద.. లేదంటే ఎత్తిపోత ఆగస్టులో ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేసుకుంటూ, ప్రవాహాలు ఉంటే ఆ నీటితో, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీలో భాగంగా ఉండే లోయర్ మానేరు కింద 5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే నీటిని తరలించనున్నారు. ఇక్కడి నుంచే స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లా వరకున్న 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఇక ఎల్ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడితే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి తరలించి, ఆయకట్టుకు నీరివ్వనున్నారు. ఇప్పటికే పునరుజ్జీవ పథకం పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా కనీసంగా 200 టీఎంసీల ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్సారెస్పీ నీటితో పాటే కాళేశ్వరం నీటిని కలిపి మొత్తంగా 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వరద కాల్వ కింద 49, ఎస్సారెస్పీ కింద 900 చెరువులు, కాళేశ్వరం కింద మరో 1,200 చెరువులున్నాయి. ఆరునూరైనా ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ప్రతి చెరువునూ నింపడం లక్ష్యంగా సాగు నీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఇదే అంశమై సోమవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
ఆస్ట్రియా రేసుతో ఆరంభం!
పారిస్: ఫార్ములావన్ (ఎఫ్1) అభిమానులకు శుభవార్త. కరోనా మహమ్మారితో వాయిదా పడిన 2020 ఫార్ములావన్ సీజన్ జూలై నెలలో ఆరంభం కానుంది. జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో తాజా సీజన్‌ను ఆరంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ సోమవారం ప్రకటించారు. జూలై–ఆగస్టు నెలల్లో యూరప్‌లో రేసులను నిర్వహించి... అనంతరం ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పూర్తి చేసి డిసెంబర్లో మధ్య ఆసియాలో సీజన్‌ను ముగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది కనీసం 15 రేసులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు∙ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రిని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దాంతో ఈ ఏడాది రద్దయిన మూడో గ్రాండ్‌ప్రి జాబితాలో ఫ్రాన్స్ చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, మొనాకో రేసులు రద్దవగా... మరో ఏడు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రేక్షకులు లేకుండానే ఈసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. -
జూలై వరకు బ్యాడ్మింటన్ టోర్నీల్లేవు: బీడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో... జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), థాయ్‌లాండ్ ఓపెన్ (జూన్ 9–14), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 16–21), రష్యా ఓపెన్ (జూలై 7–12) ఉన్నాయి. షూటింగ్ వరల్డ్‌కప్‌లు కూడా... మరోవైపు మే నెలలో భారత్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య తెలిపింది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) రిటైల్ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది ఇదేనెల్లో నమోదైన 14,03,382 యూనిట్లతో పోల్చితే 5 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం తగ్గిపోయాయి. గతనెల్లో 23,118 యూనిట్ల సేల్స్ నమోదుకాగా, గతేడాది జూలైలో 26,815 యూనిట్లు అమ్ముడైయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 55,850 యూనిట్లు కాగా, గతేడాది జూలైతో పోల్చితే 3 శాతం పెరిగి 54,250 యూనిట్లుగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,54,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదేనెల్లో 17,59,219 యూనిట్ల విక్రయాలు జరగ్గా ఈసారి 6 శాతం క్షీణించాయి. ఈ సందర్భంగా ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ.. ‘అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగానే ఉన్నందున డిమాండ్ తగ్గిపోయింది. పీవీ సగటు ఇన్వెంటరీ ప్రస్తుతం 25–30 రోజులుగా ఉంది. వాణిజ్య వాహన సగటు ఇన్వెంటరీ ఏకంగా 55–60 రోజులుగా కొనసాగుతోంది’ అని వివరించారు. -
రికార్డు సృష్టించిన జూలై
ఇప్పుడైతే శాంతించాయి గానీ.. రెండు నెలల కింద ఎండలు మండిపోయిన విషయం మనకు తెలిసిందే.. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఎన్నడూ లేని స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూరప్, అమెరికాతో పాటు భూ ఉత్తరార్ధ గోళంలోని అనేక దేశాల్లో వడగాడ్పులు ప్రజలను ఠారెత్తించాయి. ఈ ఏడాది తొలి 6 నెలల ఉష్ణోగ్రత రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. జూలైలో భూమి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉన్న ట్లు స్పష్టం చేసింది. 20వ శతాబ్దం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీ సెల్సియస్ ఉండగా.. జూలై ఉష్ణోగ్రత 16.75 డిగ్రీలుగా నమోదైంది. మూడేళ్ల కింద అంటే 2016లో సుమారు 16 నెలల పాటు రికార్డు స్థాయి ఉష్ణో గ్రతలు నమోదైన తర్వాత అంతటి ఉష్ణోగ్రత లు నమోదు కావడం ఇదే తొలిసారి. 1998 తర్వాత జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతూ వస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
టోకు ధరలు దిగొచ్చాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో కేవలం 1.08 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో సూచీలోని వస్తువుల బాస్కెట్ మొత్తం ధర కేవలం 1.08 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 25 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2017జూన్‌లో 0.9 శాతం) టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార వస్తువుల ధరలు అదుపులోఉండడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.27 శాతం అయితే, ఈ ఏడాది జూన్‌లో ఈ రేటు 2.02 శాతంగా ఉంది. -
ఎగుమతులు పెరిగాయ్... దిగుమతులు తగ్గాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్ డాలర్లు. కాగా అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ► అయితే రత్నాలు, ఆభరణాలు (–6.82 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (–5%) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి. ► పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 22.15% క్షీణించి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తొలి నాలుగు నెలల్లో నీరసం 2019 ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2019 జూన్‌లో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎగుమతులపై ప్రతికూల అవుట్‌లుక్‌ను ఇచ్చింది. 2019లో కేవలం 2.6 శాతంగా గ్లోబల్ ట్రేడ్ నమోదవుతుందని నివేదిక తెలిపింది. అంతక్రితం అంచనాకన్నా ఇది ఒకశాతం తక్కువ. అంతర్జాతీయ ప్రతికూలత ఎనిమిది నెలల తర్వాత జూన్‌లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, జీఎస్టీ తక్షణ రిఫండ్ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి. – శరద్ కుమార్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రూపాయి క్షీణత ప్రభావమే.. జూన్ నెలలో క్షీణత బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్ -
స్వల్పంగా తగ్గిన డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత సూచీ( డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జూలైనెలలో దిగి వచ్చింది. జూన్ లో నాలుగేళ్ల గరిష్టాన్ని తాకిన డబ్ల్యుపీఐ స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో 5.09శాతంగా నమోదైంది. కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గు ముఖంపట్టడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో (2017 జూలైలో) ద్రవ్యోల్బణం రేటు 1.88 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలకుగాను 4.17 శాతంగా నమోదైంది. ఇది 9నెలల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. కూరగాయలు, పళ్ల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. 2018 జూన్‌లో కూరగాయల ధరలు 7.8 శాతం పెరగ్గా, జూలైలో 2.19 శాతం క్షీణించాయి. -
స్వల్పంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి,న్యూఢిల్లీ: జూలై నెలలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టీ) వసూళ్లు స్వల్ప వృద్ధిని నమోదు చేసాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత నెలలో 96,483 కోట్ల రూపాయలుతో పోలిస్తే రూ. 873 కోట్ల మేర పెరిగాయి. అంచనాలకనుగుణంగానే ఈ మాసంలో 95,610 కోట్ల రూపాయలు వసూలైనాయి. సెంట్రల్ జీఎస్టీ రూ. 15,877 కోట్లు, రాష్ట్ర జిఎస్టీ రూ. 22,293 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ రూ. 49,951 కోట్లు (దిగుమతులపై సేకరించిన 24,852 కోట్ల రూపాయలు) సెస్ రూ. 8,362 కోట్ల రూపాయలు (దిగుమతులపై రూ .794 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే జూలై 31, 2018 వరకు జూలై నెలలో మొత్తం గరిష్ఠంగా 3 లక్షల రిటర్న్స్ దాఖలుకాగా 66 లక్షల రూపాయలు వసూలైనాయి. -
జూలై 26 లేదా 27న అమీర్‌పేట్ టు ఎల్బీనగర్
-
ఈ నెల 27న ఆకాశంలో అద్భుతం
-
బిగ్ స్క్రీన్, మాసివ్ బ్యాటరీ : బడ్జెట్ ధర
సాక్షి,ముంబై: మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ చేయనుంది. మోటో ఈ5ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేయనుంది. అనంతరం మోటోఈ5ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ట్విటర్లో వరుసగా టీజర్లు వదులుతోంది. పాక్డ్ విత్ మాసివ్ బ్యాటరీ, బహుమతులూ అంటూ ఊరిస్తోంది. మోటో ఈ4 ప్లస్ సక్సెసర్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 10వేల రూపాయలుగా నిర్ణయించవచ్చని సమాచారం. జూలై మాసంలోనే లాంచ్ కానుందని భావిస్తున్న ఈ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు ఇలా ఉన్నాయి: మోటో ఈ5ప్లస్ ఫీచర్లు 6.6 అంగుళాల డిస్ ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 720x1440పిక్సెల్స్‌రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ సెల్ఫీకెమెరా 12ఎంపీ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ Love watching what you love, all day, every day!? Tell us which of these situations best describes you by sharing a screenshot with #helloentertainment. Stand a chance to win the soon to be launched #motoe5plus, packed with a massive battery! ( T&C - https://t.co/gvLvh3ESo6 ) pic.twitter.com/HFoSte6Qrb — Motorola India (@motorolaindia) June 30, 2018 BIG battery. BIG screen. For BIG entertainment. The #motoe5plus is on its way. Get set to say #helloentertainment! Stay tuned. pic.twitter.com/eGKxElhLmY — Motorola India (@motorolaindia) June 29, 2018 -
టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం
న్యూఢిల్లీ: జూలై నెలకు సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) ఆందోళనకరంగా నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఇది 1.88శాతంగా నిలిచింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ ఇయర్‌తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) జులై 2017 నాటికి 0.88 శాతం నుంచి 1.88 శాతానికి పెరిగింది.ఆహార ధరలు బాగా ప్రియంకావడంతో టోకు ధరల సూచీ కూడా భారీగా పెరిగింది. జూన్ నెలలో ఇది. 0.9శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 2.15 శాతానికి ఎగిసింది. గత నెలలో-3.4 శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ మంత్ ఆన్‌మంత్ 6.2 శాతానికి ఎగిసింది. ఆ హారేతర వస్తువుల ద్రవ్బోల్బణం-6.32శాతంగా. గత నెలలో ఇది 5.15 శాతం. కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా ఎగిసింది. 21.95 శాతంతో ఆందోళనకర నెంబర్స్‌ను రికార్డ్ చేసింది. గత నెల ఇది 21.16 శాతంగా నమోదైంది. ప్రధానంగా టమాటా ధరలు దీన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టుల అంచనా. ఫ్యూయల్ అండ్ పవర్ 4.37 శాతంగా నిలిచింది. ఫుడ్ ఇండెక్స్ ఆధారంగా ప్రైమరీ ఆర్టికల్ గ్రూపు , ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు జూలై నెలలో 1.25 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. దీంతో వచ్చే ఆర్బీఐ రివ్యూలో వడ్డీ రేట్లకోత తప్పదనే అంచనాలను మార్కెట్ వర్గాలు వ్యక్తం చేశాయి. -
అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ జూలైలో గణనీయమైన ఉద్యోగ వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్ అంచనాలకుమించి నమోదైంది. దీంతో నిరుద్యోగం రేటు 16 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2లోల 9 వేల మేర పెరిగింది. ఇది 180,000 ఉండనుందని మార్కెట్ అంచనాను అధిగమించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మే నెలలో 145,000 గా కొత్త ఉద్యోగుల సంఖ్య జూన్ నెలలో 2, 31,000 కు చేరుకుది. మొత్తంగా ఈ రెండు నెలలో ఉద్యోగ లాభాలు గతంలో నివేదించిన దానికంటే 2,000 కన్నా అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు జూన్నెలలో నమోదైన 4.4 శాతం నుంచి 4.3 శాతానికి దిగి వచ్చింది. జూలైలో, సగటు గంట ఆదాయాలు జూన్‌లోని 0.2 శాతం కంటే వేగంగా 0.3 శాతం వృద్ధితో 26.36 డాలర్లకు పెరిగింది. మరోవైపు ఫెడరల్ రిజర్వు రానున్న సెప్టెంబర్‌లో 4.5 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడానికి తన ప్రణాళికల రచిస్తోంది. దీనికి ఉద్యోగ వృద్ధి మార్గం సుగమం చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం డిసెంబరులో ఫెడరల్ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించనుదని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా ఫెడ్ తదుపరి విధానం సమావేశం సెప్టెంబరు 19-20 న జరగనుంది. -
ఎయిర్ ఇండియా ఉద్యోగుల జీతాలు?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవైపు అప్పుల భారంతో కునరిల్లుతున్న సంస్థను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సంక్షోభంలో ఉన్న సంస్థ ఖర్చులు తగ్గించుకునేందుకు అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీంతో వేలమంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. జూలై నెలలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు జీతాలు చెల్లింపును ఆలస్యం చేసిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. వీటిని వచ్చే వారం చెల్లించే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. అయితే ఈ ఆలస్యానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగాఎలాంటి ప్రకటన రాలేదని ఆయన చెప్పారు. దీంతో ఇప్పటికే ప్రయివేటైజేషన్‌కు వ్యతిరేకంగా, ఉద్యోగభద్రతపై ఆందోళనలో పడిన ఉద్యోగులు ఇపుడు మరింత కలవర పడుతున్నారు. ఎయిర్ఇండియాలో సుమారు 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా మునుపటి యుపిఎ ప్రభుత్వం 2012లో పది సంవత్సరాల కాల వ్యవధిలో రూ.30 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అందించింది. రూ. 50,000 కోట్ల రుణ భారంతో ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ఇటీవల కేంద్ర క్యాబినెట్ సూత్ర ప్రాయ అంగీకారం చెప్పింది. సంస్థలోని పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటు చేసిన మంత్రత్వి కమిటీ తీవ్రంగా పని చేస్తోంది. అటు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో, టాటా గ్రూప్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఈ నెలకు ఇంతే..!
► ఆగస్టులో విస్తారంగా వర్షాలు ► జిల్లాను పూర్తిస్థాయిలో తాకని నైరుతి రుతుపవనాలు ► గాలిలో పెరిగిన తేమ శాతం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆనందపడిన రైతాంగం గత కొద్దిరోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు వస్తున్నా.. చినుకు జాడ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. నైరుతి రుతు పవనాలు పూర్తిస్థాయిలో జిల్లాలో విస్తరించకపోవడంతోనే భారీ వర్షాలు కురవడం లేదనే అభిప్రాయం వాతావరణ శాఖ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. నైరుతి రుతు పవనాలు ఉత్తరాది వైపు పయనించడంతో శ్రీకాకుళం జిల్లాలో సరైన వర్షాలు కురవడం లేదని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం భూవిజ్ఞానం సీనియర్ శాస్త్రవేత్త జె.జగన్నాథం అభిప్రాయపడ్డారు. ఈ నెలలో చెదురుమదురు వర్షాలే ఉంటాయని.. ఆగస్టు నెలలో మాత్రం విస్తారంగా వానలు కురుస్తాయని చెప్పారు. ఆమదాలవలస రూరల్: వాన దేవుడు ముఖం చాటేశాడు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూలై నెలలో వర్షపాతం లోటు సగం కంటే ఎక్కువగా ఉంది. ఉత్తరాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కోస్తాంధ్రాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థతి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడ మేఘాలు ఉంటే ఆ ప్రాంతంలోనే వర్షం పడుతోంది తప్ప.. జిల్లా అంతటా వర్షాలు పడటం లేదు. దీనికి ప్రధాన కారణం నైరుతి రుతు పవనాలు ఉత్తరాది వైపు పయనించడమే కారణమని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం భూవిజ్ఞానం సీనియర్ శాస్త్రవేత్త జె.జగన్నాథం అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూన్ నెలలో 160 మి.మీ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది జూన్ నెలలో కేవలం 80 మి.మీ వర్షపాతం జిల్లాలో నమోదు అయిందని పేర్కొన్నారు. అలాగే జూలై నెలలో 230 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 50 శాతం మాత్రమే నమోదైందని వివరించారు. వాతావరణంలోనే మార్పులే కారణం వర్షం ముఖం చాటేయడానికి వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమని జగన్నాథం చెప్పారు. వాతావరణం కాలుష్యం కావడంతో దీని ప్రభావం వర్షాలపై పడుతోందన్నారు. నైరుతి రుతుపవనాల కదలిక బాగానే ఉన్నా.. అవి జిల్లాను తాకకుండా పోతున్నాయన్నారు. కేరళను తాకి శ్రీలంక, బంగ్లాదేశ్, హిమలయాల మీదుగా ఉత్తరాఖండ్ వైపు పయనిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో అటవీ సంపద అధికంగా ఉండటంతో పవనాలు అటువైపు పయనించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. జిల్లాలో అటవీ సంపద తక్కువగా ఉన్నందున రుతు పవనాలు రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. చిరాకు కలిగిస్తున్న వాతావరణం గత కొద్ది రోజులుగా ఉన్న వాతావరణం జనానికి చిరాకు తెప్పిస్తోంది. ఉష్టోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ అది తాత్కాలికమేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. నైరుతి రుతు పవనాలు జిల్లాను పూర్తిస్ధాయిలో తాకే వరకు ఎండ తీవ్రత కూడా ఉంటుందంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందంటున్నారు. జిల్లాలో సగటు ఉష్టోగ్రత 36 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జూలై నెలలో భారీ వర్షాలు పడటానికి అవకాశం లేదనే చెప్పాలి. జిల్లాలో పూర్తిస్థాయిలో వర్షం కురవాలంటే ఆగస్టు 4వ తేదీ వరకు ఆగాల్సిందే. వాతావరణంలో పెరిగిన తేమ శాతం వాతావరణంలో 20 రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం 65–70 మధ్య నమోదవుతుంది. ఉష్టోగ్రతలు కూడా 36 డిగ్రీలు దాటుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమ శాతం 75–85 మధ్య ఉంటుంది. దీనివల్ల రాత్రి ఉష్టోగ్రతలు 26 డిగ్రీల పైనే నమోదువుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రజలు ఉక్కపోతకు గురై నీరసించి కంటిమీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం జూలై నెలలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు కలవర పడుతున్నారు. పంటలపై ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మెట్ట భూముల్లో సాగు చేస్తున్న పంటలకు వర్షాలు లేని కారణంగా తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పోటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటిలో పిచికారి చేసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు మరో నెల రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చి రుతుపవనాలు పూర్తిస్థాయిలో జిల్లాను తాకుతాయి. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. జూలై నెలలో మాత్రం అంతగా వర్షాలు కురవడానికి అవకాశం లేదు. జిల్లాలో అటవీ శాతం తగ్గడం వలన ఇలాంటి మార్పులు వస్తున్నాయి. అందుకే గోగు పంట సాగు విస్తృతంగా చేపట్టాలి. ఈ సాగు వలన వర్షాలు కూడా సమయానికి కురిసే అవకాశం ఉంటుంది. ఎకరా గోగు పంట సాగు 10 ఎకరాల అటవీ సంపదతో సమానం. పచ్చదనాన్ని విపరీతంగా పెంచితేనే జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంది. లేకుంటే వాతావరణంలో ఇలాంటి మార్పులు తప్పవు. – జె.జగన్నాథం, భూ విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనాస్థానం -
మోదీ ఇజ్రాయెల్ వెళ్తే.. ఎందుకంత ప్రాధాన్యం?
-
సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు కౌన్సిల్ ఆమోదం
ముంబై: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులో మరో కీలక అంకం ముగిసింది. జీఎస్టీ కౌన్సిల్ 11వ కీలకమైన చట్టాలను ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఈ కౌన్సిల్ శనివారం ముంబై నిర్వహించిన ఉమ్మడి నియంత్రణపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశలో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ముఖ్యంగా సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి చట్టాలకు ఆమోదం లభించింది. ఈ చట్టాలకు సంబంధించి తుది ఆమోదాన్ని తదుపరి సమావేశంలో సాధించనున్నామని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. జీఎస్టీ అమలుకు ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల సాధికారతకు కేంద్రం అంగీకారం తెలపడంతో చిన్న వ్యాపారాలకు భారీ ఊతం లభించింది. పన్ను పరిధులకు సంబంధించిన ఫిట్మెంట్ అంశాలపై తదుపరి సమావేశంలో కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన 26 పాయింట్లకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు అంచెల పన్నుల విధానాన్ని ఆమోదం లభించింది. అలాగే కనీస పన్నురేటు 5 శాతంగా మధ్యస్థంగా 12-18శాతంగాను, అత్యధికంగా 28శాతంగా ఉండనున్నాయి.దీంతో ఇప్పటికే పరోక్ష పన్ను సంస్కరణలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న భిన్నాభిప్రాయాలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) జులైనుంచి అమలు మరింత ఖాయమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను శాఖ ఉద్యోగులకు సమాన అధికారులు ఉండనున్నాయి. వీటిని త్వరలోనే పార్లమెంటు ఆమోదంకోసం ఉంచుతుంది. కౌన్సిల్ తదుపరి సమావేశం మార్చి 16 జరగనుంది. ఈ సమావేశంలో మిగిలిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. కొత్త పరోక్ష పన్నుల చట్టం కింద రూ. 50 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన హోటల్స్ కనీస పన్ను స్లాబ్ 5 శాతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాతిపదికన ఉంటుంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచించినప్పటికీ పన్ను అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరక పోవడంతో జులై 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
జూలైలో విమాన ప్రయాణికుల రద్దీ 26% వృద్ధి
ఇది రికార్డు స్థాయి... న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ జూలైలో 26 శాతం వృద్ధి చెందింది. రెండంకెల వృద్ధి నమోదుకావడం ఇది వరుసగా 24వ సారి. ప్రయాణికుల పెరుగుదలకు తక్కువ టికెట్ ధరలు కారణంగా ఉన్నాయి. దేశీ విమానయాన కంపెనీలు జూలైలో 85.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో అవి చేరవేసిన ప్రయాణికులు సంఖ్య 67.62 లక్షలు. ఇదివరకు ప్రయాణికుల రద్దీ వృద్ధి గరిష్ట స్థాయి 25%గా ఉండేది. ఇప్పుడు ఆ రద్దీ వృద్ధి 26 శాతమనే కొత్త గరిష్ట స్థాయికి చేరింది. దేశీ విమానయాన సంస్థలు ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 561 లక్షల మందిని గమ్యాలకు చేరిస్తే.. గతేడాది ఇదే సమయంలో 456 లక్షల మందిని గమ్యాలకు అంటే 23 శాతం వృద్ధి . టాప్‌లో ఇండిగో: మార్కెట్ వాటా పరంగా చేస్తే ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జూన్‌లో 37.9%గా ఉన్న దీని మార్కెట్ వాటా జూలైకి 39.8%కి చేరింది. ఇక దీని తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్వేస్ (16.3%), ఎయిర్ ఇండియా (14.8 శాతం), స్పైస్‌జెట్ (11.7 శాతం) ఉన్నాయి. -
భూమిపై అత్యంత వేడి నెలగా జూలై
మియామి: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూలై నెల కొత్త రికార్డు సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే ఈ జూలై నెలలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) ప్రకటించింది. నాసా తాజాగా వెల్లడించిన వాతావరణ సమాచారాన్ని విశ్లేషించాక ఎన్ఓఏఏ తన నెలవారీ నివేదికను విడుదలచేసింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఉష్ణోగ్రత 0.11 డిగ్రీలు ఎక్కువ. శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రతీ నెల భూమిపై ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. -
ప్రాజెక్టులకు జలకళ
– జీడీపీ జూలైలో నిండడం ఇదే తొలిసారి – నేడో, రేపో గేట్లెత్తి హంద్రీ నదికిS విడుదల – జిల్లావ్యాప్తంగా 90 శాతం చెరువులకు నీరు – శ్రీశైలంలో నీటి చేరికకు రెట్టింపు మొత్తంలో అవుట్ ఫ్లో – నీటిమట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవాకు విడుదల కర్నూలు సిటీ: జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు దానిపై ఆధారపడిన వెలుగోడు, ఆవుకు అలగనూరు రిజర్వాయర్లు మినహా జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్ చెరువులు జలంతో తొణికిసలాడుతున్నాయి. హంద్రీనదిపై 1979లో నిర్మించిన గాజులదిన్నె (సంజీవయ్య సాగర్) ప్రాజెక్టు జూలై చివరి నాటికి పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ఇదే మొదటిసారిగా ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. తుంగభద్రపై కర్నూలు మండలం సుంకేసుల వద్ద నిర్మించిన కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ ఇప్పటీకే పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కేసీ కాల్వకు 2 వేల క్యుసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. 37 ఏళ్లలో మొదటి సారి...! జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గ్రామాలకు తాగు,సాగునీటి కోసం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద హంద్రీనదిపై గాజులదిన్నె ప్రాజెక్టుకు 1971లో పునాదులు వేసి 1979 నాటికి పూర్తి చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు, నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు. గోనెగండ్ల, కోడుమూరు, క్రిష్ణగిరి, దేవనకొండ మండలాలకు చెందిన 21 గ్రామాల పరిధిలోని 24,372 ఎకరాలకు జీడీపీ నీరే ఆధారం. నిర్మించింది మొదలు ఈ రోజు వరకు తీసుకుంటే జూలై నెలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో నేడో, రేపో ప్రాజెక్టు గేట్లు పైకెత్తి హంద్రీనదికి విడుదల చేసేందుకు అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నారు. నదీతీర గ్రామాల వారిని అప్రమత్తం చేసేందుకు పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. చెరువుల ఆయకట్టుకు జలజీవాలు.. మైనర్ ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల కింద 634 చెరువులుండగా వాటి పరిధిలో 80,226 ఎకరాల స్థీరికరించిన ఆయకట్టుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల బనగానపల్లె, డోన్ నియోజకవర్గాలు మినహా 90 శాతం చెరువులు పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరాయి. ఫలితంగా ఆయా చెరువుల కింద ఆయకట్టు భూముల్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లోను మించి అవుట్ ఫ్లో.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలంకు ఇన్‌ఫ్లో, అంతకు మించి ఆవుట్ ఫ్లో కొనసాగుతోంది. కష్ణా నది ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా కుడి, ఎడమ పవర్ హౌస్‌ల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువన ఉన్న సాగర్‌కు 32 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 824.60 అడుగుల నీటిమట్టం వద్ద 44.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి మట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు పంపింగ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
రాయికోడ్ మండలంలో 205 మి.మీ వర్షపాతం
రాయికోడ్ : మండలంలో జూలై నెలలో 205 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి 225 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్‌లో నిరాశ పరిచిన వర్షాలు జూలైలో ఊరటనిచ్చాయి. జూన్ నెలలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 133 మిల్లీమీటర్లు కురిసింది. జూలై 6న 24 మిల్లీమీటర్లు, 21న 30 మిల్లీమీటర్లు, 22న 80 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మండలంలో విస్తారంగా కురిసిన వర్షాలతో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. పంటపొలాలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని హస్నాబాద్ చెరువు పొంగిపొర్లుతోంది. రెండేళ్లుగా సరైన వర్షాలు లేక కరువును చవిచూసిన జనం చెరువులు నిండటంతో వాటిని వీక్షించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టులోనూ ఆశించన మేర వర్షాలు కురిసి తమ అంచనాలకు తగ్గట్టుగా పంటల దిగుబడులు రావాలని ఆశిస్తున్నారు. మండలంలో అత్యధికంగా ఈ ఏడాది 7,500 హెక్టార్లలె పత్తి పంటను సాగు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 14 వేల మంది రైతుల్లో 10 వేల మంది పత్తి సాగు చేశారు. 5 వేల మంది రైతులు 4,500 హెక్టార్లలో సోయాబీన్, కంది, పెసర, మినుము, జొన్న తదితర పంటలను సాగు చేశారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు రాయల్ గా
ముంబై: మోటార్ బైక్స్ దిగ్గజం ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల్లో భారీ పెరుగుదలను నమోదు చేసింది. జూలై నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 31 శాతం పెరిగాయి. సుమారు 53,378 యూనిట్లను సేల్ చేసింది. ఎగుమతులు కూడా 40 శాతం పెరిగి 1250 యూనిట్లకు చేరాయి. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ మేకర్ ఐషర్ మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. బీఎస్ఈలో 1 శాతం పెరిగి రూ. 22,661 వద్ద ట్రేడవుతోంది. 350 సీసీ ఇంజీన్ సెగ్మెంట్ లో 32 శాతం పెరిగి 5,727 యూనిట్లను విక్రయించింది. కాగా గతేడాది(2015) జూలైలో 40,760 వాహనాలను విక్రయించగా ఎగుమతులు 893 యూనిట్లు మాత్రమే. -
విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. అయితే జూన్‌లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్‌లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి. -
‘ఆగస్టు’ పైనే ఆశలు
కలవరపెడుతున్న ఖరీఫ్ కురవని భారీ వర్షాలు ఇప్పటికీ నమోదుకాని సాధారణ వర్షపాతం జిల్లాలో 4.34 హెక్టార్లలో పంటల సాగు విస్తీర్ణం వర్షాలు కురవకపోతే ఆగమే అంటున్న రైతులు జోగిపేట: రైతులను ఖరీఫ్ సీజన్ కలవరపెడుతోంది. జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో చెప్పుదగ్గరీతిలో వర్షాలు కురవనేలేదనే చెప్పవచ్చు. రైతులు ఆగస్టులో కురిసే వర్షాలపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. సరైన వర్షాలు పడగానే రైతులు నాట్లు వేయాలని, మరికొందరు విత్తిన పంటలను కాపాడుకోవాలని, ఇంకొందరు భూమి దున్ని విత్తనాలు విత్తాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వరుణదేవుడిపై ఆశతో పత్తి పంటలు వేసుకోవడం, వరినాట్లు వేసుకోవడం అక్కడక్కడా జరిగింది. అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మండలాల్లో వరినారు మళ్లు సిద్ధం ఉంచుకున్నారు. గత ఖరీఫ్‌లో రైతులు 4.15 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేయగా వీటిలో 79వేల హెక్టార్ల వరకు వరి, చెరకు, పంటలు సాగు చేయగా, 3.35 లక్షల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్న పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేశారు. ఈ ఏడాది 4.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలో గత సంవత్సరం ఖరీఫ్‌లో జూన్ మాసంలో 44.4 మిమీ, జూలైలో 108 ఎంఎం, ఈ సంవత్సరం ఖరీఫ్‌లో జూన్‌లో 137.7 మి.మీ, జూలైలో 206.6 మి.మీ సాధారణ వర్షపాతం నమోదయ్యింది. రైతులకు పంపిణీ చేసిన విత్తనాలు ప్రభుత్వం వివిధ పంటలకు సంబంధించి రైతులకు విత్తనాలను పంపిణీ చేసింది. 41,390 క్వింటాళ్ల వరి, 23,164 క్వింటాళ్ల మొక్కజొన్న, 12,804 క్వింటాళ్ల జొన్న, 489 క్వింటాళ్ల సజ్జలు, 2,402 క్వింటాళ్ల కంది, 3,771 క్వింటాళ్ల పెసర, 2,417 క్వింటాళ్ల మినుము, 19,898 క్వింటాళ్ల సోయాబిన్, 338 క్వింటాళ్ల వేరుశనగ, 43 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 47 క్వింటాళ్ల ఆముదం, 10.9 క్వింటాళ్ల నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు. అన్ని మండలాల్లోనూ అదే తీరు... జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఒక్కటి, రెండు మండలాలు మినహా మిగతా మండలాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు. వారం రోజుల క్రితం నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. జూన్ మాసం అటుంచి జూలైలో అప్పుడప్పుడు జిల్లాలోని నలువైపులా వర్షాలు కురిసినా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా కురవలేదని రైతుల అభిప్రాయం. పారిశ్రామిక ప్రాంతాల వైపు ఎక్కువగా వర్షం కురిసిందంటున్నారు. గ్రామాలల్లో కురిసిన వర్షాలు పంటలు విత్తే స్థాయిలో వానల్లేవనే చెప్పవచ్చు. ఇప్పటికి వరి సాగు ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులు పత్తి, సోయాబిన్ సాగు చేయవద్దని చెబుతున్నా ఇది వరకే పత్తి, కందులు వేసిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. గత ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో కూడా అనుకున్నంతగా వర్షాలు మోస్తారుగా కురిసాయి. ఖరీఫ్‌లో పంటల సాగు వివరాలు పంట విస్తీర్ణం ( హెక్టార్లలో) వరి 82206 చెరుకు 21532 జొన్న 10753 సజ్జలు 292 మొక్కజొన్న 113490 పెసర 24994 మినుము 13714 కంది 26678 ఇతర ధాన్యాలు 735 వేరుశనగ 38 పొద్దుతిరుగుడు 211 నువ్వులు 306 ఆముదం 303 పత్తి 122436 మిర్చి 652 ఉల్లి 269 సోయాబిన్ 15421 4.34.030 పంటలపై ఆశలు గల్లంతే... జిల్లాలో ప్రధానంగా పత్తి , వరి సాగు చేస్తుంటారు. 80 శాతానికి పైగా రైతులు వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. ఈ సారి వర్షాలు అంతగా కురవకపోవడంతో విత్తిన పంటలపై ఆశలు వదులు కుంటున్నారు. మొలకెత్తిన మొక్కలు అక్కడక్కడ ఎండిపోతున్నాయి. వీటిని రక్షించుకునేందుకు రైతులు ఆష్టకష్టాలు పడుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాల రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. నదిలోని నీటి మడుగులు ఎండిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 25 నుంచి 35 శాతం వరకు మాత్రమే వరినాట్లు వేసుకున్నట్లు సమాచారం. వర్షాలు కురిస్తేనే బతుకు ఆగస్టు నెలలోనైనా వర్షాలు కురిస్తేనే బతకగలుగుతాం. లేకుంటే అప్పుల పాలవుతాం. పత్తిపంటలు వేసి దేవుడి మీద భారం వేశాం. వరి నారు పెంచినా నాట్లు వేసుకునేందుకు ధైర్యం సరిపోతలేదు. ఆగస్టులో సమృద్ధిగా వర్షాలు కురిస్తే బాగుండు. శంకర్ , రైతు, కిచ్చన్నపల్లి వరుణుడి కరుణ కోసం... జూన్, జూలై మాసంలో సరిగ్గా వర్షాలు కురవలేదు. ఈ నెలలోనైనా వానలు పడకుంటా పత్తి పంట మొలకెత్తుడు కష్టమే. అప్పులు చేసి పంటలు పెట్టినం. అధికారులు చెప్పినా చాలా వరకు రైతులు వరుణుడు కరుణించకపోతాడా అని పత్తి పంటలు వేసుకున్నాం. బోర్లు ఉన్న వారే వరి నాట్లు వేసుకుంటున్నారు. వర్షంపై ఆధారపడి జీవించే మా లాంటి రైతుల పరిస్థితి కష్టంగా ఉంది. విఠల్, రైతు , రాంసానిపల్లి -
టారో : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. జీవితంలో కొత్త కొత్త పరిణామాలు మొదలవు తాయి. ఇంటా బయటా అంతా ఆనందంగా గడిచిపోతుంది. సంతోషానికి భంగం కలిగించే పరిసరాలకు దూరంగా ఉంటారు. చాలాకాలంగా దూరంగా ఉంటున్న స్నేహితుల్లో ఒకరిని కలుసుకుంటారు. రహస్యాలను దాచడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెడతారు. లక్కీ కలర్: నేరేడు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కొత్త దిశలో ముందుకు సాగుతారు. ఆత్మీయులకు భారంగా వీడ్కోలు పలుకుతారు. మనసుకు కష్టంగా అనిపించినా, ఇష్టమైన ప్రదేశాలను వదిలి వెళ్లక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి. ఇల్లు మారడం లేదా కార్యాల యాన్ని మార్చడం జరుగుతాయి. అనుకున్న లక్ష్యాలలో కొన్నింటిని సాధించలేకపోయినా, ఆనందంగానే ఉంటారు. లక్కీ కలర్: లేత పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇదివరకటి ఒత్తిళ్లు, చిరాకులు తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంటా, బయటా మార్పులను స్వాగతిస్తారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల తీరిక దొరకడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచన లను సానుకూల దృక్పథంతో అధిగమిస్తారు. ఇతరుల మేలు కోసం, లక్ష్య సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. లక్కీ కలర్: ముదురు నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) గడ్డుకాలం నుంచి గట్టెక్కి ఒడ్డున పడతారు. ఒక దురలవాటును వదులుకుంటారు. పరిస్థితులు మెల్లగా మెరుగుపడతాయి. దూర ప్రయాణాలకు వెళతారు. గట్టి పోటీతోనే ఘన విజయాలు సాధించగలమని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. దృక్పథాన్ని మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. లక్కీ కలర్: లేత నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) శక్తివంచన లేకుండా కృషి చేసి, వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రశాంతంగా, తృప్తిగా ఉంటారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత పరిణతితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు. లక్కీ కలర్: పసుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేయడంతో కాలాన్ని కొంత వృథా చేసుకుంటారు. సకాలంలోనే అప్రమత్తతతో పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన కాలం. ప్రేమించిన వ్యక్తులను కానుకల ద్వారా సంతోషపెడతారు. అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ధ్యానంలో గడుపుతారు. లక్కీ కలర్: ఊదా తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) గతానుభవాల దృష్ట్యా సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటారు. చిరకాల స్వప్నాలను నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు కలిసొస్తాయి. లక్ష్యసాధనలో నిర్భయంగా ముందంజ వేస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కాలం పెట్టే పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకునేందుకు అలుపెరుగని పోరాటం సాగిస్తారు. నిరాశ చెందాల్సిన పనిలేదు. విజయం చేరువలోనే ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మిత్రులు మీ సలహా కోరుకుంటారు. సహచరులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. లక్కీ కలర్: నలుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్వయం ప్రతిభతో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు సతమతం చేస్తాయి. వెన్నునొప్పి, కీళ్ల నొప్పుల వల్ల వైద్యుణ్ని సంప్రదించాల్సి రావచ్చు. పని ఒత్తిడిని అధిగమించడానికి విహార యాత్రలకు వెళతారు. కీలకమైన సమస్యల పరిష్కారానికి పెద్దల సలహా తీసుకుంటారు. లక్కీ కలర్: లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) సత్తా చాటుకోవడానికి తగిన అవకాశం అనుకోకుండా కలిసొస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగి ఆలోచనలను ఆచరణలో పెడతారు. పని ప్రదేశంలో సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యలు తీరిక లేకుండా చేస్తాయి. ఇతరులకు సలహాలు ఇస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో, విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఏళ్ల తరబడి నిరీక్షించిన అవకాశం కలిసొస్తుంది. ఆకాశమే హద్దుగా సృజనాత్మక సామర్థ్యంతో ముందుకు సాగుతారు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. మెరుగైన భవిష్యత్తుకు కొత్త దారులు తెరుచుకుంటాయి. అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి తీరిక లేకుండా తలమునకలవుతారు. లక్కీ కలర్: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో పాలు పంచుకుంటారు. చిరస్మరణీయమైన విజయాన్ని సాధిస్తారు. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది సానుకూల సమయం. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లక్కీ కలర్: లేత ఊదా - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు చికాకులు తొలగుతాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పసుపు, నేరేడు రంగులు, ఆదిత్య హృద యం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. లేత ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. కళాకారులకు అవార్డులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దొరుకుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. గులాబి, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పదు. కళాకారులకు నిరుత్సాహం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కీలక అంశాల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారుల యత్నాలలో పురోగతి. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
విస్తారంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. 45 మండలాల్లో 10 మి.మీ. పైగా నమోదు కావడం విశేషం. ఆదోనిలో అత్యధికంగా 59.4 మి.మీ., సంజామలలో 2.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. జిల్లా మొత్తంగా సగటున ఒకే రోజు 23.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూలై సాధారణ వర్షపాతం 117.2 మి.మీ. 114 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 20 అరకొర వర్షాలతో సరిపెట్టినా ఈ వారంలో సాధారణ స్థాయి మేరకు వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఉపశమనం పొందుతున్నారు. అయితే సంజామల, ఆళ్లగడ్డ, ఓర్వకల్, కల్లూరు, రుద్రవరం, గోస్పాడు, శ్రీశైలం తదితర మండలాల్లో అరకొర వర్షాలే గతయ్యాయి. కోసిగి 54.8, నందవరం 47, సి.బెళగల్ 45, డోన్ 44.2, నందికొట్కూరు 39.4, పగిడ్యాల 39.4, మిడుతూరు 37.2, ఓర్వకల్ 37.2, వెలుగోడు 36.8, హŸళగుంద 36.4, ఆత్మకూరు 36.2, క్రిష్ణగిరి 35.4, దొర్నిపాడు 34, ఆలూరు 33.4, ప్యాపిలి 32.6, హాలహర్వి 31.4, జూపాడుబంగ్లా 30.2 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. -
టారో : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండటానికి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రేమికులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అంతా సానుకూలంగానే గడుస్తుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు విసుగు కలిగించొచ్చు. అయితే, వాటిని మానుకోవద్దు. లక్కీ కలర్: బ్రౌన్ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) అనూహ్యమైన మార్పులు ఉంటాయి. భ్రమలను విడిచిపెట్టి జీవితంలో ఆచరణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. భావోద్వేగాలు తరచూ మారుతూ ఉండవచ్చు. ఈ విషయమై కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోగల భాగస్వామి తారసపడతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) గ్రహబలం అనుకూలంగా ఉంది. సంపద కలిసొస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఇతరుల విమర్శలపై వ్యతిరేకత పెంచుకోకండి. అపోహలకు లోను కాకుండా, ఎదుటివారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఇంట్లో జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పుష్కలంగా నీరు తాగండి. నీటి ద్వారానే ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఆలోచనల్లో గందరగోళం కారణంగా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. ఆఫీసులో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. లక్కీ కలర్: బ్రౌన్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమిస్తారు. పనికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీ ఆలోచనా సరళిలో పెను మార్పులకు కారణమవుతుంది. ప్రకృతిలో ఏకాంతంగా గడపడం ద్వారా కాస్త ఊరట పొందగలరు. మీ స్వస్థలంలో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ప్రేమికులకు అనుకూలమైన కాలం. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ఆలోచనలను తెలివిగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం అందకపోవచ్చు. అయినా క్రమశిక్షణ గల సైనికుడిలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరాశా నిస్పృహల నుంచి బయటపడటానికి ఆత్మీయులతో గడుపుతారు. లక్కీ కలర్: నాచురంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కొత్త పథకాలను ఆచరణలోకి తెస్తారు. మేధాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి, నిర్వేదానికి గురిచేస్తాయి. సానుకూల దృక్పథంతో నిర్వేదం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందచందాలపైన, అలంకరణలపైన శ్రద్ధ చూపుతారు. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: పొద్దుతిరుగుడు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆకర్షణ శక్తితో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు సానుకూలమైన కాలం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపుతో పాటు ప్రోత్సాహకరమైన ఫలితా లను అందుకుంటారు. ఇదివరకు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరికే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా అదృష్టం కలిసొస్తుంది. లక్కీ కలర్: నేరేడు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంటా బయటా అనుకోని మార్పులు తప్పకపోవచ్చు. కొత్త ఇంట్లోకి మారే అవకా శాలు ఉన్నాయి. మీరు చేరే కొత్త ప్రదేశం చుట్టూ ఆహ్లాదకరమైన ఆకుపచ్చని వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. సాటిలేని పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. సాహసకృత్యాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. స్వార్థాన్ని విడనాడితే మరింతగా సత్ఫలితాలను సాధించగలరు. ఆరోగ్యానికి, ఆర్థిక లాభాలకు నడుమ సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసభరితంగా సాగుతాయి. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఎటూ తేల్చుకోలేని అనిశ్చితిలో, గందరగోళంలో కొట్టుమిట్టాడుతారు. అంతులేని ఆలోచనల పరంపరను అదుపులో ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేస్తారు. ధ్యానం వల్ల కొంతవరకు ప్రశాంతత సాధిస్తారు. ప్రేమికులతో విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు అంచనాలకు మించిన సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. లక్కీ కలర్: నారింజ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఖర్చులు అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బంధుమిత్రులతో విందువినోదాల కోసం, విలాసాల కోసమే ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. సృజనాత్మకతతోను, పాలనా సామర్థ్యంతోను ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వారం ప్రారంభంలో కొంత నిరాశాజనకంగా ఉన్నా, పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. లక్కీ కలర్: వెండిరంగు -
వారఫలాలు : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బంధువులతో అకారణంగా వివాదాలు. కొన్ని ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. పసుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులకు యత్నకార్యసిద్ధి. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆదాయం పెరిగి రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలోనూ, కుటుంబంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభ సూచనలు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. తెలుపు, ఎరుపు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి చికాకులు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆదాయానికి మించి ఖర్చులు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు. ఆరోగ్య భంగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహన యోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. పసుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు ధ్యానం చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అనూహ్యంగా ఒక ఆహ్వానం అందుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు రాగలదు. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే సూచనలు. గులాబి, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యవిషయంలో కొంత శ్రద్ధ చూపండి. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. లేత ఆకుపచ్చ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంత కాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాసి ్తలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు తథ్యం. కళాకారులకు సత్కారాలు. గులాబి, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షా స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ప్రేమికులకు ‘అంతా ప్రేమమయం’ అన్నట్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులను మీ వాక్చాతుర్యంతో ఒప్పించడం ద్వారా మీరు అనుకున్న విధంగా పనులు జరిగేలా చేసుకుంటారు. ఇదివరకటి మీ ఆలోచనలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఉత్సాహంతో ఉరకలేస్తారు. పనుల్లో దూకుడు పెంచుతారు. వ్యక్తిగత, వృత్తిగత వ్యవహారాల్లో ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మనసు పెట్టి పనిచేసి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను అధిగమించి పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. పని ఒత్తిడిలో తీరిక లేకుండా గడుపుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 - జూన్ 20) సూర్యుడిలా స్వయంప్రకాశంతో రాణిస్తారు. మీ వెలుగులో ఇతరులకు దారి చూపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. ఇతరులకు కోరిన సాయం చేసి, సంతోషం కలిగిస్తారు. సానుకూల దృక్పథంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) జీవనశైలిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యోదయంలోని వెలుతురుకు ముందు చీకటిలా తెలియని భయాలు వెన్నాడుతాయి. అలాగని నిరాశ చెందనవసరం లేదు. ఈ వారంలోనే సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను సాధిస్తారు. ప్రేమలో పడతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) అభిమానుల వల్ల మీకు ప్రచారం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. మీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మీ గురించి వదంతులు మాట్లాడుకుంటారు. నిబ్బరంగా కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. మీ ఆకర్షణ శక్తి ఫలితంగా కొత్త ప్రేమ వ్యవహారాలు మొదలవుతాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వృత్తి, ఉద్యోగాల్లో శక్తిమంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. కెరీర్లో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారావకాశం ఒకటి ఊరించినట్టే ఊరించి చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాపల్యాలను అదుపులో ఉంచుకోవలసిన సమయం ఇది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ముదురు గోధుమరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మార్పులకు సిద్ధంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. అనుకోని కొన్ని పరిణామాలు మీ అంచనాల మేరకే జరిగి, ఇతరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వారాంతంలో మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. లక్కీ కలర్: నేరేడురంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. పాత లక్ష్యాల కోసం కొత్తగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సాధించిన విజయాల పట్ల ఎలాంటి గర్వం లేకుండా నిరాడంబరంగా ముందుకు సాగుతారు. అదృష్టం మీ వైపే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లక్కీ కలర్: నీలం ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సామాన్యంగా సాగుతున్న జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్టం అన్ని విధాలా కలిసొస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు తలపెట్టిన పనులను ప్రారంభించేలోగానే అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) శరీరాకృతిపై, అందచందాలపై అతిగా శ్రద్ధ చూపుతారు. ఇతరుల నుంచి మెప్పు ఆశిస్తారు. పొగడ్తల మాయలో పడి ఊహాలోకంలో విహరిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తి విడిపోయే పరిస్థితులు రావచ్చు. ఒంటరిగా ఉంటున్న వారు తగిన జంట కోసం వెదుకులాట సాగిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. లక్కీ కలర్: ఎరుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) విజయపథంలో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ అంకితభావం, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలను దక్కించుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా ఒక రంగంలో సాగిస్తున్న కృషి ఎట్టకేలకు సత్ఫలితాలనిస్తుంది. ఉత్తమమైన పనితీరుతో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన వాళ్లు మిమ్మల్ని పట్టించుకోవడం ప్రారంభిస్తారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) సాహసమే నా బాట అన్నట్లుగా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. ప్రమాదాలకు చేరువగా వెళతారు. తిరుగులేని సంకల్పబలంతో గొప్ప విజయాలు సాధిస్తారు. పూర్తి వ్యతిరేక మనస్తత్వం గల వ్యక్తితో ప్రేమలో పడతారు. తగిన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటారు. సానుకూల దృక్పథంతో సవాళ్లను స్వీకరిస్తారు. సమస్యలను తేలికగా అధిగమిస్తారు. లక్కీ కలర్: లేతనీలం - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు నిదానంగా కొనసాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. కాంట్రాక్టుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఆశించిన ఫలితాల కోసం అదనపు శ్రమ తప్పదు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త ప్రయత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఎరుపు, చాక్లెట్, నేరేడు, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన సమాచారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారులకు అధికలాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అందరిలోనూ గుర్తింపు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. లాభదాయకమైన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిరకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగవంతంగా ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయం అందుతుంది. ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయదర్శనాలు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన,కుటుంబసౌఖ్యం. అత్యంత విలువైన సమాచారం. పాతబాకీలు వసూలవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఎరుపు, నేరేడు రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. పొరపాట్లు సరిదిద్దుకుని పనుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో చిరకాలంగా సాగుతున్న ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. గులాబి, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనక దుర్గా స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్తకార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. నలుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఈవారం కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. పనిభారం పెరగవచ్చు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పట్టుదల పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. పసుపు, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) జీవితమే ఒక మిస్టరీ అన్నట్లుగా సాగుతుంది. ఏదీ నిశ్చితంగా ఉండదనే విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారంలో జీవిత భాగస్వామితో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. రహస్యాలు దాచినట్లయితే, సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వదంతులు కలవరపెడతాయి. వాటిని నమ్మకపోవడమే క్షేమం. లక్కీ కలర్: ఆకాశనీలం వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థైర్యం కోల్పోకుండా ఎదుర్కొంటారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. మీపై అసూయ పెంచుకున్న ఒక సహోద్యోగి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ప్రేమికుల మధ్య స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించిన సంఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వాములకు స్వేచ్ఛనివ్వడమే మేలనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. పని ప్రదేశంలో లేదా ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. ఈ మార్పుల ఫలితంగా మీరు కెరీర్లో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. లక్కీ కలర్: చాక్లెట్ రంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. మీ ఘనతకు గుర్తింపుగా సన్మాన సత్కారాలు అందుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించుకుంటారు. మృత్యుముఖం నుంచి తేలికగా బయటపడతారు. లక్కీ కలర్: గులాబి సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈ వారం మొత్తం ఒక పండుగలా సందడి సందడిగా గడిచిపోతుంది. బంధు మిత్రులు మీ చుట్టూ చేరడానికి ఆసక్తి చూపుతారు. మంచి చెడులను పట్టించుకోకుండా అన్ని పరిణామాలనూ ఆస్వాదిస్తారు. విహార యాత్రల కోసం దూరప్రయాణాలు చేస్తారు. ఈ వారంలో ఒక ఆసక్తికరమైన మనిషిని కలుసుకుంటారు. లక్కీ కలర్: బూడిద రంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సంతోషంగా ఉండాలని ఎంతగా అనుకుంటున్నా పరిస్థితులు సంతోషంగా ఉండనివ్వడం లేదనే భావనతో బాధపడతారు. సంతోషంగా ఉండాలా? లేక బాధపడాలా? అనేది మీ చేతుల్లోనే ఉంటుందని తెలుసుకుంటారు. పిల్లలపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఉన్నత విద్యావకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్: ఊదా తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) స్వయంకృషితో జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. అవరోధాలలోనే అవకాశాలను అందిపుచ్చు కుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న పొరపొచ్చాలు తలెత్తినా, చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు. లక్కీ కలర్: లేత ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. ప్రతి పనినీ చెదరని ఏకాగ్రతతో సంతోషంగా పూర్తి చేస్తారు. తీరిక వేళల్లో ధ్యానంలో గడుపుతారు. అనుకోకుండా ఒక అపరిచితుని ద్వారా సాయం అందుకుంటారు. అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. పని విషయంలో చివరి నిమిషంలో తలపెట్టిన మార్పులతో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఈ వారంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మీ ఆకాంక్షలు, లక్ష్యాల విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. ప్రతి నిమిషాన్నీ సంతోషభరితంగా గడిపేందుకు తాపత్రయ పడతారు. ఏదైనా ముఖ్యమైన సదస్సు లేదా సమావేశానికి ఆహ్వానాన్ని అందుకుంటారు. నాయకత్వ పటిమను చాటుకుంటారు. క్రమశిక్షణతో ఫలితాలు సాధిస్తారు. లక్కీ కలర్: ముదురు ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం అని గ్రహిస్తారు. సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. స్వేచ్ఛ కోసం తపిస్తారు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ధైర్యంగా ముందంజ వేస్తేనే సత్ఫలితాలను సాధించగలరు. ఇతరులతో ఘర్షణలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) విపత్కర పరిస్థితుల్లో మీ ధైర్యసాహసాలను నిరూపించుకుంటారు. మిమ్మల్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేని పరిస్థితులు ఉంటాయి. బంధు మిత్రులకు, సహోద్యోగులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. లక్కీ కలర్: లేత నారింజ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఏదీ ఎంపిక చేసుకోవాలనుకోవద్దు. ఎంపిక చేసుకున్న కొద్దీ మీ అవకాశాలు సన్నగిల్లిపోతాయి. పెట్టుబడుల విషయంలో కొద్ది నెలల కిందట తీసుకున్న నిర్ణయం వల్ల భారీ లాభాలు అందుకుంటారు. తలపెట్టిన ప్రతి పనిలోనూ అదృష్టం కలిసొస్తుంది. మితిమీరిన పనిభారంతో సతమతమవుతారు. ప్రేమ వ్యవహారాల్లో సమతుల్యతను పాటించాల్సి వస్తుంది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, ఆప్తులు చేదోడుగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యసమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. లేత పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో బంధువులతో ఒప్పందాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు పదవులపై కొత్త ఆశలు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు కొంత మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళాకారుల యత్నాలు నిరాశ పరుస్తాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న కార్యక్రమాలలో అవరోధాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తుల విషయంలో వివాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. సోదరులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. వాహన, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. గులాబి, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. లేతనీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. రాబడి కొంత పెరిగే అవకాశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రోత్సాహం. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుంచి ధనలాభ సూచనలు. ఇళ్లు, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నేరేడు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబపరంగా కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. భూ, వాహనయోగాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు. లేతనీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో కొద్దిపాటి మార్పులు. రాజకీయవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. గులాబి, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం..
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛైర్మన్ గా ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ జూలై 16న ముఖ్యమంత్రులతో సమావేశం కానునుంది. పాఠశాల విద్య, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ స్కీమ్, ఆధార్ కార్డ్, ఆర్థిక, సామాజిక అంశాల ప్రణాళికలపై ఈ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు కురిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ వేదికపై సమస్యలను చర్చించే అవకాశం ఉంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 11 వ సమావేశం జూలై 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాల్లో సమస్యలు, సంబంధాలు, భద్రత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అంశాలతోపాటు, పాఠశాల విద్య, ఆధార్ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత ఈ 11వ ముఖ్యమంత్రుల సమావేశం జరగడం విశేషం. కౌన్సిల్ కు ఛైర్మన్ గా ఉన్న ప్రధానమంత్రి మోదీ.. కేబినెట్ లోని ఆరుగురు మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కారీ, మనోహర్ పారికర్ ల ను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అంతేకాక మరో 11 మంది శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న మంత్రులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని సమస్యలతోపాటు, దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యలను చర్చిస్తారు. పదేళ్ళ క్రితం 2006 లో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. యూపీఏ ప్రభుత్వ పదేళ్ళ హయాంలో కేవలం రెండుసార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 అనంతరం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రూపాన్ని కొంతవరకూ మార్చింది. జూలై 16 నిర్వహించే 11వ సమావేశంలో అనేక సమస్యలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. -
టారో : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగుతారు. రోజువారీ జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకమైన ఆలోచనలతో జీవితంలో సుస్థిరత సాధిస్తారు. మనోధైర్యంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటుంటారు. ‘కష్టేఫలి’ సూత్రాన్ని ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: బంగారురంగు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇంటా బయటా శాంతిసామరస్యాల కోసం తగిన కార్యాచరణను ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారి శక్తియుక్తులు మరింతగా రాణించేలా వారికి సహాయ సహకారాలను అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వ్యక్తిగత జీవితంలో లోపాలను సరిదిద్దుకుంటారు. లక్కీ కలర్: నాచురంగు మిథునం (మే 21 - జూన్ 20) అప్రమత్తత వదులుకోకుండా విజయపథంలో దూసుకుపోతారు. గ్రహబలం అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు పొరపాటు చేసినా, దాని వల్ల కూడా మేలు పొందగలుగుతారు. క్రియాశీలంగా ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇతరుల నుంచి గౌరవం, ప్రేమాభిమానాలు పొందుతారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్కీ కలర్: గులాబి కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకుండా తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సంధించి విడిచిన బాణంలా లక్ష్యం వైపు దూసుకుపోతారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఆంతరంగికుల్లో ఒకరిని కలుసుకుంటారు. ఈ భేటీ మీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుంది. లక్కీ కలర్: ఊదా సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఎంచుకున్న ప్రతి అంశాన్నీ శ్రద్ధగా అధ్యయనం చేస్తారు. జ్ఞాన సముపార్జనను దినచర్యగా మార్చుకుంటారు. స్పెక్యులేషన్ ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా ఉండదు. సంప్రదాయ పద్ధతుల్లో పొదుపు చర్యలు చేపట్టడమే క్షేమం. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. విహారయాత్రల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పొదుపు చేసుకున్న డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు నడుమ కచ్చితమైన సమతుల్యతను పాటిస్తారు. పనిలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. సహోద్యోగులతో పోటీ పడాల్సి వస్తుంది. వివాదాలు తలకు చుట్టుకోకుండా మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: తెలుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు. గతంలో చవిచూసిన చేదు అనుభవాల వల్ల అభద్రతా భావానికి లోనవు తారు. శ్రద్ధాసక్తులతో పనిచేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విలాస వస్తువులను సేకరిస్తారు. షాపింగ్ వంటి కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతారు. అయితే, ఖర్చును అదుపు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: లేత నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఎలాంటి అవాంతరాలనైనా సునాయాసంగా ఎదుర్కొని నిలదొక్కుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యాపారంలో కొనసాగుతున్నట్లయితే మీ పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడిస్తాయి. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. లక్కీ కలర్: ముదురు నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సృజనాత్మక రంగంలో కొత్త అనుబంధం ఒకటి ఏర్పడుతుంది. కావలసినవన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత కఠినంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని, వాటి ద్వారా లబ్ధి పొందుతారు. విహార యాత్రల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చేరడానికి ఇది అనుకూలమైన కాలం. లక్కీ కలర్: ఇటుక రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) పనుల ఒత్తిడిలో ఊపిరి సలపకుండా ఉంటారు. ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. అయితే, పరిస్థితుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. ఆచి తూచి వ్యవహరించకుంటే ప్రేమికుల మధ్య మనస్పర్థలు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) గ్రహబలం అనుకూలంగా ఉండటంతో అన్ని విధాలా కలిసొచ్చే కాలం. వృత్తి ఉద్యోగాల్లో సృజనాత్మక శక్తితో, ప్రతిభా పాటవాలతో అందరినీ మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) అవరోధాలను అధిగమిస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషితో సంపాదనకు ప్రయత్నిస్తారు. పరిస్థితులు అంత అనుకూలంగా లేకున్నా, ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతారు. మీపై శ్రద్ధ తీసుకునే ఆత్మీయులు ఒకరు మీకు తగిన సలహాలు ఇచ్చి, సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఈ వారంలో దురలవాట్లకు దూరంగా ఉంటే క్షేమం. లక్కీ కలర్: నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని అర్చించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహన, గృహయోగాలు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారుల ఆశలు ఫలిస్తాయి. నీలం, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. అనుకున్న కార్యాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. ఆప్తులు కూడా మీపట్ల వ్యతిరేకత చూపుతారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. భూవివాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు. గులాబి, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనయోగం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అనుకున్న రాబడి లభించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కార్యజయం. ఆప్తులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనసౌఖ్యం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ సాహసోపేత నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు నెమ్మదిస్తాయి. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి విషయాలలో బంధువర్గంతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు నిరుత్సాహం. గులాబి, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత ్తహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సత్కారాలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. నలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అనారోగ్య సూచనలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగించవచ్చు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారుల యత్నాలలో ఆటంకాలు. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమ వుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు దక్కే సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. నలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు తథ్యం. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు కొంత తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పలుకుబడి కలిగినవారు పరిచయమై సహాయపడతారు. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూవివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు సన్మానయోగం. పసుపు, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. రాబడి అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రులతో కలహాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పట్టింది బంగారమే. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు రెండో వారం వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటు వ్యవహారాల కమిటీ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ నెల 29 న సమావేశమై షెడ్యూల్ ను ప్రకటించనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో పెండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి రాజ్యసభలో ప్రభుత్వ సభ్యుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం బలంగా కనిపించనుంది. జీఎస్టీ ఆమోదానికి అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఆమోదం తెలిపాయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జూలైలో టెన్త్ లాంగ్ మెమోలు
* వాటిపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణ * ఇంటర్మీడియెట్‌లోనూ అమలుపై దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు లాంగ్ మెమోలను (మార్కులతో కూడిన ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్) జూలై రెండో వారం చివర్లో అందించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల షార్ట్ మెమోల ముద్రణపై దృష్టిపెట్టింది. వచ్చే నెల మొదటి వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి స్కూళ్లకు మెమోలను పంపేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చిన (కాలేజీల్లో చేరేందుకు) మెమోల్లో పొరపాట్లు దొర్లితే సవరణకు గడువు ఇచ్చి దాన్ని రెండుసార్లు పొడిగించిం ది. గురువారంతో అది కూడా ముగిసింది. 400 మందికిపైగా విద్యార్థులు షార్ట్ మెమోల్లోని పేర్లలో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 5వేల మంది విద్యార్థుల మార్కుల సవరణ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. దీంతో త్వరలోనే లాంగ్ మెమో ల ముద్రణ ప్రారంభం కానుంది. ఈసారి విద్యార్థుల లాంగ్ మెమోల్లో ఆధార్ నంబ రును ముద్రించేందుకు చర్యలు చేపట్టింది. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు హాజరైన 5,21,271 మంది విద్యార్థుల్లో 4,90,985 మంది విద్యార్థులు ఆధార్ నంబ ర్లను ప్రభుత్వ పరీక్షల విభాగానికి సమర్పించడంతో వారి మెమోల్లో ఆధార్ నంబ ర్లను ముద్రించాలని నిర్ణయించింది. ఆధార్ సమర్పించని 30,586 మంది విద్యార్థుల్లో వీలైనంత మంది నుంచి నంబర్లను సేకరించేందుకు చర్యలు చేపడుతోంది. ఆధార్ నంబరు లేనివారికి మాత్రం మెమోల్లో ఆధార్ లేకుండానే ఇవ్వనుంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల మెమోల్లోనూ ఆధార్ నంబరును ముద్రిం చేందుకు కసరత్తు చేస్తోంది. 2017 మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల మెమోల్లోనూ ఆధార్ ముద్రించే వీలుంది. -
ఒకేరోజు 2 కోట్ల మొక్కలు..
పర్యావరణాన్ని సంరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా మహరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నం ప్రారంభించింది. జూలై 1న 450 జాతులకు చెందిన రెండు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రకటన చేసింది. తాము చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ లో ప్రజలంతా భాగస్వాములై, తమకిష్టమైన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది. ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు, వాతావరణాన్ని రక్షించే ప్రత్యేక కార్యక్రమాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపిన అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగన్ తివార్.. కార్యక్రమానికి ప్రధానమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో భాగంగా 450 జాతులకు చెందిన 2 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటుతున్నామని, ప్రజలంతా భాగస్వాములయ్యేందుకు వీలుగా వేదికను, సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. 2014 అక్టోబర్ లో తాను మంత్రి అయిన సందర్భంలో ప్రజలు తనకు ప్రశంసాపూర్వకంగా పూలదండలు, బొకేలు తెచ్చిచ్చారని, అలా డబ్బు వృధా చేసే బదులు వారంతా మొక్కలు ఇచ్చి ఉంటే బాగుండేదన్న తన భార్య సలహానే తాను ఈ కార్యక్రమం చేపట్టేందుకు మార్గమైందని ముంగన్ తివార్ తెలిపారు. కార్యక్రమం మొత్తాన్ని ప్రజల భాగస్వామ్యంతోనే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే మొక్కలను పాతేందుకు 1.75 కోట్ల గుంతలను తీసి సిద్ధం చేశామన్నా ఆయన.. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో రెండు ప్రత్యేకమైన కారణాలున్నాయని, ముఖ్యంగా తమ సిబ్బంది తక్కువగా ఉండటం ఒకటైతే, వాతావరణ పరిరక్షణలో ప్రజలు తమతో కలసి పనిచేయాలన్నది రెండో ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని 36 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఓ లక్ష్యాన్నిసిద్ధం చేసిన అటవీశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు కూడ ఈ డ్రైవ్ లో చేరాలని కోరింది. దీనికి తోడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, పంతంజలి యోగ పీఠ్, రైల్వే కలసి డ్రైవ్ లో పాల్గొంటున్నట్లు తెలిపింది. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణా బాధ్యతలను చేపట్టేందుకు ఓ శాశ్వత కమిటీని కూడ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొక్కలు పాడైతే కమిటీదే బాధ్యత అని, వాటి శ్రద్ధ వహించేందుకు మహిళా స్వయం సహాయక బృందాలకు కూడ 70 శాతం బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నట్లు మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో మొక్కల పెరుగుదలను బట్టి కమిటీ సభ్యులకు చెల్లించే వేతనం ఉండాలని, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పర్ దేశీ సూచించారు. మూడు సంవత్సరాల్లో కనీసం 80 శాతం మొక్కలు పెరిగేట్లుగా ఉండాలని, వాటికి సంరక్షకులే జవాబుదారీగా ఉండాలని లేదంటే విషయాన్ని వారు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదని ప్రవీణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ సహకారంతో కరువు ప్రాంతమైన మారాఠ్వాడా లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని రక్షణ మంత్రిత్వ శాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. గ్రీన్ బెటాలియన్ పేరిట మొక్కలు నాటేందుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచి వారికి కేటాయిస్తామని తెలిపింది. -
కొలిక్కి రాని జీఎస్టీ చర్చలు
కోలకతా: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి రాష్ట్రాల ఆర్థికమంత్రులతో మంగళవారం జరిగిన భేటీ లో మరోసారి నిరాశ తప్పలేదు. వివాదస్పద బిల్లుపై ఏకాభిప్రాయం సాధనకు తంటాలు పడుతున్న జైట్లీ ఇవాల్టి సమావేశంలో కూడా ఏకాభిప్రాయాన్ని సాధించ లేకపోయారు. జీఎస్టీ బిల్లు కు రాష్ట్రాల ఏకాభిప్రాయ సాధనలో భాగంగా 22రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఏడు రాష్ట్రాల ప్రతినిధులతో జైట్లీ సమావేశమయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ సమావేశంలో ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీపై చర్చించారు. అన్ని రాష్ట్రాలు వాస్తవంగా జిఎస్టీ బిల్లును బలపరిచాయనీ, తమిళనాడు రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని జైట్లీ అన్నారు. రాజ్యంగ సవరణలతోపాటుగా రాష్ట్రాల మౌలిక మద్దతు కూడా అవసరమన్నారు. మరికొన్ని పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మళ్లీ భేటీ కానున్నట్టు జైట్లీ ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన జైట్లీ జీఎస్ టీ బిల్లు ఆమోదంపై ఆశావహ దృక్పథంతో ముందుకుపోతామని ఏప్రిల్ 1 గడువుపై ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య విరోధం, హాని కలిగించని రీతిలో రూపొందించేందుకు వీలుగా నిపుణులతో చర్చిస్తామన్నారు. ఇది వచ్చే ఆర్థిక మంత్రుల సమావేశానికి దోహదపడుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య శాంతియుతంగా , స్పష్టమైన విధానం రూపొందాలని జైట్లీ నొక్కి చెప్పారు. వస్తు సేవల బిల్లు(జీఎస్టీ)కు తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీకి తమిళనాడు మద్దతు తెలపకుండా కొన్ని రిజర్వేషన్లు కావాలని పట్టుబడుతోందని చెప్పారు. ఆ అంశాల్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పటికే లోక్ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. వర్షాకాల సమావేశాల్లో ఎగువ సభలోనూ ఈ బిల్లును పాస్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మరోవైపు సాధికారిక కమిటీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి,మిత్ మిత్రా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో కమిటీ సభ్యులు హాజరయ్యారని అమిత్ మిత్రా అన్నారు. మంత్రుల బాధ్యతాయుత పనితీరును కొనియాడారు. మళ్లీ ఈ సమావేశం జులై రెండో వారంలో ఉండొచ్చని అమిత్ తెలిపారు. 1947 స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఉన్న పాత పన్ను విధానాల్లో సంస్కరణల కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. -
ఫలితాలు ఇప్పుడే విడుదల చేయలేం
న్యూఢిల్లీ : ఓ వైపు యజమాని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగొట్టి తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు యూనిటైడ్ బేవరీస్ హోల్డింగ్ లిమిటెడ్(యూబీహెచ్ఎల్) ఆర్థిక సంవత్సర ఫలితాల విడుదల చేయలేమంటోంది. తమ గ్రూపు చైర్మన్ విజయ్ మాల్యా కేసుల నేపథ్యంలో ఫలితాల విడుదలకు తమకు జూలై వరకు గడువు కావాలని కోరుతోంది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆడిటడ్ ఫలితాలను మే 31న విడుదలచేయాల్సి ఉంది. యూబీహెచ్ఎల్ గ్రూప్ లో ఒకటైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగొట్టిన సంగతి తెలిసిందే. వీటికి చైర్మన్ గా ఉన్న విజయ్ మాల్యా తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే కన్సార్టియం అధినేతగా ఉన్న ఎస్ బీఐకు సెటిల్ మెంట్ ఆఫర్ ను విజయ్ మాల్యా ప్రకటించి, సుప్రీంకోర్టు ముందు ఉంచినట్టు తన లేఖలో పేర్కొంది. వాయిదాల రూపంలో రుణాలను చెల్లిస్తామని ప్రకటించిన ఈ సెటిల్ మెంట్ ఆఫర్ ను ఎస్ బీఐ తిరస్కరించింది. మొత్తం రుణాలను వెంటనే చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై ఏప్రిల్ 26న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యూనల్ కు ఈ కేసును బదలాయించింది. రెండు నెలల్లో ఈ సెటిల్ మెంట్ ఆఫర్ పై ట్రిబ్యునల్ తీర్పు ప్రకటించింది. దీనిపై మొదటి విచారణ జూన్ 2న జరుగనుంది. ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సర ఫలితాలను విడుదలచేయలేమని, 60రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తామని యూబీహెచ్ఎల్ అభ్యర్థిస్తోంది. అయితే సెబీ నిబంధనల మేరకు ప్రతి కంపెనీ ఆర్థికసంవత్సరం(మార్చి30కి) ముగిసిన 60రోజుల వ్యవధిలోనే వాటి ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది. -
పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ
ఏహై మొహబ్బత్ ఫేమ్ దివ్యాంకా త్రిపాఠీ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు తాజా వార్తలనుబట్టి తెలుస్తోంది. అయితే దివ్యాంకా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాసం కూడ అదే విషయాన్ని నిర్థారిస్తోంది. ఆమెకు చాలాకాలం పాటు బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నటుడు, ప్రియుడు శరద్ మల్హోత్రా తో విడిపోయిన తర్వాత కొంతకాలంపాటు తన సహ నటుడు వివేక్ దహియా తో దివ్యాంకా డేటింగ్ కొనసాగించింది. ఇప్పుడు అతడినే జూలై నెలలో వివాహం చేసుకునేందుకు ముందుగా హష్- హష్ వేడుకగా జరిపే నిశ్చితార్థ కార్యక్రమాన్ని కూడ నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుబ సభ్యుల అంగీకారంతో నిశ్చయమైన తమ వివాహానికి జూలై నెలలో తేదీని ఖరారు చేస్తారని దివ్యాంకా స్వయంగా పోస్టు చేసిన వ్యాసాన్ని బట్టి తెలుస్తోంది. వివేక్, దివ్యాంకాలు అమితమైన ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కూడ ఆమె పంచుకున్న ఆనందాన్నిబట్టి అర్థమౌతోంది. అయితే శరద్ మల్హోత్రాతో విడిపోయిన విషయం ప్రచార సాధనాల ఉచ్చులో పడలేదని చెప్తోంది. విడిపోవడం భవిష్యత్తులో తనకు మరింత ఆనందాన్ని కలిగించాలని కూడ దివ్యాంకా కోరుకుంటోంది. ఛండీగఢ్, లేదా భోపాల్ లలో వివాహ కార్యక్రమం జరగనున్నట్లు దివ్యాంకా పోస్టును బట్టి తెలుస్తోంది. వివేక్ స్వస్థలం చండీగఢ్ లో గాని, దివ్యాంక స్వస్థలం భోపాల్ లో గాని వివాహం జరిగిన అనంతరం ముంబైలో భారీ రిసెప్షన్ వేడుకను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. -
బాబోయ్ జూలై
మియామి: వాతావరణ కాలుష్యంతో భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. కర్బన్ ఉద్గారాలు, శిలాజ ఇంధనాల వాడకం అధికమవుతుండడంతో గ్లోబల్ వార్మింగ్ ఎగబాకుతోంది. ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరుతుండడంతో భూతాపం పెరుగుదలలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అత్యధిక భూతాపం నమోదైన మాసంగా జూలై తాజాగా రికార్డుకెక్కింది. భూతాపోన్నతి చరిత్రలో ఈ ఏడాది జూలై శిఖరస్థాయిలో నిలిచిందని అమెరికాలోని జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) వెల్లడించింది. 1880 నుంచి ఎన్ఓఏఏ భూతాపోన్నతి రికార్డులు సేకరిస్తోంది. శిలాజ ఇంధనాలను మండిచడమే భూతాపం పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వేడి నానాటికీ పెరుగుతోందని తమ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఎన్ఓఏఏ శాస్త్రవేత్త జాక్ క్రౌచ్ తెలిపారు. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. జూలైలో సముద్ర ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 16.61 సెల్సియస్ గా నమోదైందని, అంతకుమున్నడూ ఇంత ఎక్కువ స్థాయిలో భూతాపం నమోదు కాలేదని వెల్లడించారు. అంతకుముందు 1998, జూలైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20వ శతాబ్దం సరాసరితో పోలిస్తే 1.53 శాతం అధికంగా భూతాపం ఈ ఏడాది మొదటి 7 నెలల్లో నమోదైందని తెలిపారు. -
ఉపాధి పెంపునకు సవరణ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనాలను పెంచుతూ గతేడాది జూలైలో ఇచ్చిన ఉత్తర్వుల (జీవోఎంస్ 3)ను ప్రభుత్వం సవరించింది. వేతనాల పెంపు 2014 ఏప్రిల్ 1నుంచే అమల్లోకి రావాల్సి ఉన్నందున పాత ఉత్తర్వును సవరిస్తూ ప్రభుత్వం సోమవారం వేరొక ఉత్తర్వును జారీచేసింది. కూలీల రోజువారీ వేతనాన్ని రూ.169కి పెంచుతూ జారీచేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
భారత్‌లో యాపిల్ వాచ్ ఎంతో తెలుసా?
*ప్రారంభ రేటు రూ. 30,000 న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించిన స్మార్ట్ వాచీలు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుండటమే ఇందుకు కారణమని వారు తెలిపారు. ప్రాథమిక మోడల్ ధర భారత్‌లో రూ. 30,000 పైచిలుకు ఉండగలదని అంచనా. స్టీల్, అల్యూమినియం, పసిడి వేరియంట్స్‌తో యాపిల్ మూడు వాచీలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి ధరలు 349 డాలర్లు (సుమారు రూ. 21,800) నుంచి 17,000 డాలర్లు (దాదాపు రూ. 10.66 లక్షలు) దాకా ఉంటాయని కంపెనీ తెలిపింది. -
జూలైలో 35 టీఎంసీలు ఇస్తే రాజీనామా
సాక్షి ప్రతినిధి, కడప: అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిని కలవడానికి వెళుతున్న అఖిల పక్షాన్ని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వారు విలేకర్లతో మాట్లాడారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పి వెళ్లడం సులువేనని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారు.. ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది.. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుందామని పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్రస్థాయిలో పర్యటించాం. సిఎంకు నివేదించి ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన నిధులపై నివేదిక ఇవ్వాలని చూస్తే పోలీసులతో ఎమ్మెల్యేల్ని అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు లేకుండా ఇష్టానుసారం హామీలు గుప్పించడం సరైంది కాదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. మాటలు కాదు, చేతుల్లో అభివృద్ధి చూపించాలన్నారు. చెప్పింది చేసే ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే చెల్లిందన్నారు. ఆయన చేసిన పనులు అందుకు నిదర్శనమన్నారు. ధనయజ్ఞం అని మాట్లాడ్డం కాదని రూ.3800 కోట్లు జిఎన్ఎస్ఎస్ పనులు చేపట్టారని అవే పనులు చంద్రబాబు రూ.6వేల కోట్లతో చేసి చూపించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఉర్దూ యూనివర్శిటి ఏర్పాటు కడప, గుంటూరు, కర్నూల్ అంటూ ఎక్కడికక్కడ ప్రకటిస్తూ జిల్లాల మధ్య తగాదాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కలెక్టర్‌పై ఎమ్మెల్యేలు ధ్వజం... ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావాల్సిన ప్రజాప్రతినిధులుగా ఆహ్వానం పంపిన జిల్లా కలెక్టర్ పోలీసులతో అడ్డగించడం హక్కులకు భంగం కల్గించడమే అని ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. అందరూ ఆహ్వానితులేనంటూ ప్రకటించి ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన తమకు అవకాశం లేదు, ప్రజలు తిరస్కరించిన వారికి అవకాశం కల్పిస్తారా అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేశారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. జిల్లా ఎమ్మెల్యేలంటే చంద్రబాబుకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలనే తపనతో చంద్రబాబు మెలగాలని ఎమ్మెల్యేలు హితవు పలికారు. -
కనుల పండుగ!
‘జులాయి’ సినిమాతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న కాంబినేషన్ అల్లు అర్జున్, తివిక్రమ్. ‘జులాయి’ తర్వాత వీరిద్దరూ విడివిడిగా కూడా విజయాలను అందుకొని మంచి జోష్ మీదున్నారు. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ అంటూ... ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ ‘రేసుగుర్రం’లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘జులాయి’ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబర్లో పాటల్ని, పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. అదే నెలలో సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మళ్లీ ‘జులాయి’ కాంబినేషన్లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ నటన ఈ చిత్రానికి హైలైట్. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ ఇందులో కథానాయికలు. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆద్యంతం నిండుగా, కన్నుల పండువగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. సింధూతులాని, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.ప్రసాద్, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్. -
సూపర్ సండే
-
'సీఏ' కలను సాకారం చేసుకోండిలా..
-
వచ్చే నెలలో మోడీ జపాన్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటన ఖరారైంది. జూలైలో మోడీ జపాన్‌కు వెళ్లనున్నారు. ప్రధాని కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మోడీ తొలి విదేశీ పర్యటనకు ఈ నెలాఖరులో భూటన్ వెళ్లనున్నారు. ఇక సెప్టెంబర్ చివర్లో అమెరికాకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించగా.. మోడీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అమెరికాకు వెళ్లే ముందుగా మోడీ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. -
పచ్చ కరువు
మడకశిర/తాడిమర్రి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈసారి పచ్చకరువు ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్నా... దిగుబడి మాత్రం పడిపోయింది. దీంతో ఈసారీ కష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా మడకశిర, ధర్మవరం నియోజకవర్గాల రైతులు ప్రతియేటా వేరుశనగ పంటను సాగు చేస్తుంటారు. వీరి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా వేరుశనగపైనే ఆధారపడి ఉన్నాయి. ఈసారి ముంగారు వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడంతో వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గింది. మడకశిర నియోజకవర్గంలో ప్రతియేటా 50 వేల హెక్టార్లలో పంట వేస్తుండగా... ఈసారి మాత్రం 30 వేల హెక్టార్లకే పరిమితమైంది. నియోజకవర్గంలో మే మొదటి, రెండవ వారంలో ఓ మోస్తరుగా వర్షాలు పడడంతో ఈ మేరకైనా పంట సాగైంది. ఆ తర్వాత ఒకటిన్నర నెలపాటు వర్షాలు పూర్తిగా ఎత్తిపెట్టాయి. మళ్లీ జూలై చివరివారంలో కురిశాయి. అప్పుడు కొందరు రైతులు పంట వేసినా... చాలామంది మాత్రం వెనుకంజ వేశారు. దీంతో వేలాది ఎకరాలు బీడుపడ్డాయి. మే మాసంలో సాగైన వేరుశనగ పంట దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత వర్షాలు రాకపోవడంతో పంట ఎదుగుదల లేక, దిగుబడి పడిపోయింది. చెట్టుకు ఐదారు కాయలు కూడా లేవు. ఈ చెట్లను నెల రోజుల్లోపు తొలగించడానికిరైతులు సమాయత్తమవుతున్నారు. ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టామని, దిగుబడి చూస్తే రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతమున్న కాయలు విత్తనానికి కూడా పనికిరావని చెబుతున్నారు. జూలైలో సాగు చేసిన పంట పరిస్థితీ ఇలాగే ఉంది. పెట్టుబడి కూడా గిట్టుబాటు కాదు వేరుశనగ పంట దిగుబడి అంతంతమాత్రమే. చెట్టుకు నాలుగైదు కాయలు కూడా లేవు. పెట్టుబడి కూడా దక్కే అవకాశం లేదు. ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు పెట్టాం. రూ.10 వేలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. - వెంకటరమణప్ప, రైతు, మడకశిర -
పరిశ్రమలు.. నవ్వాయ్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలో అనూహ్యంగా మెరుగుపడింది. సంబంధిత సూచీ (ఐఐపీ) 2.6 శాతం వృద్ధి సాధించింది. వృద్ధి రేటు క్షీణించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేటు పెరగడం విశేషం. అంతకుముందు రెండు నెలల్లో అంటే మే, జూన్లలో ఈ సూచీలో అసలు వృద్ధిచెందకపోగా, క్షీణత (మేలో -2.8 శాతం, జూన్‌లో 1.8 శాతం) నమోదయ్యింది. గత ఏడాది జూలైలో కూడా ఈ రేటు -0.1 శాతం పడిపోయింది. తయారీ, విద్యుత్ రంగాల మెరుగైన పనితీరు 2013 జూలైలో మొత్తం సూచీకి సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర గణాంకాల సంస్థ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 జూలైతో పోలిస్తే 2013 ఇదే నెలలో పలు కీలక రంగాలు ముందడుగు వేశాయి. కీలక రంగాల పరుగు తయారీ: మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి 3 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది అసలు వృద్ధి లేకపోగా తటస్థంగా నిలిచింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో 11 సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. విద్యుత్: వృద్ధి రేటు 2.8 శాతం నుంచి 5.2 శాతానికి ఎగసింది. మైనింగ్: ఈ రంగంలో వృద్ధిలేకపోగా మైనస్‌లోనే కొనసాగుతోంది. అయితే క్షీణత రేటు -3.5% నుంచి -2.3%కి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచిక అయిన భారీ యంత్రపరికరాల విభాగం క్షీణబాట నుంచి వృద్ధి బాటకు మళ్లి 15.6 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతం క్షీణతలో ఉంది. వినియోగ వస్తువులు: ఈ విభాగం వృద్ధి నుంచి క్షీణతలోకి జారింది. 0.7% వృద్ధి నుంచి -0.9 శాతం కిందకు దిగింది. నాలుగు నెలల్లో చూస్తే నిరాశే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఐఐపీ మైనస్‌లోనే వుంది. -0.2 శాతం నమోదయ్యింది. తయారీ రంగాన్ని తీసుకుంటే క్షీణత -0.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది. విద్యుత్ రంగం వృద్ధి 5.5 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఇక మైనింగ్ రంగం -3.5 శాతం నుంచి -2.3 క్షీణతను నమోదు చేసుకుంది. జూలై నెల మంచి పనితీరువల్ల క్యాపిటల్ గూడ్స్ విభాగం -16.8 శాతం నుంచి 1.8 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువుల విభాగంలో ఉత్పత్తి క్షీణించి -2%గా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ముందుంది మంచికాలం: ప్రభుత్వం తాజా గణాంకాల పట్ల ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో వృద్ధి మరింత పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మొదటి త్రైమాసికంలో ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలిపారు. జూన్ క్వార్టర్లో ఈ పరిమాణం 22 శాతం వృద్ధితో 5.39 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు వెల్లడించారు. మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు పారిశ్రామిక వృద్ధి రేటు మరింత పెరగడానికి విధాన నిర్ణేతలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. వడ్డీరేట్ల తగ్గింపు, ఇండస్ట్రియల్ క్యారిడార్ల వంటి భారీ ప్రాజెక్టుల సత్వర అమలు తదితర సాకారాత్మక చర్యల ద్వారా వృద్ధి వేగం పుంజుకుంటుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ పేర్కొన్నారు. వినియోగ వస్తువుల రంగం వంటి కీలక విభాగాలు పుంజుకోడానికి వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించాల్సి ఉంటుందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత గణాంకాలను చూసి, రికవరీ ప్రారంభమైందని అప్పుడే చెప్పడం సాధ్యంకాదని కూడా ఆయన విశ్లేషించారు. -
జూలై నాటికి రూ.166కోట్ల నష్టం
మంచిర్యాల అర్బన్/రెబ్బెన(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది.. దీంతో సింగరే ణి వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం జూలై నాటికే కంపెనీకి రూ.166 కోట్ల నష్టం వాటిల్లిందని డెరైక్టర్(పీఅండ్‌పీ) మనోహర్‌రావు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి వెనుకబాటును అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు ఆయన సోమవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, గోలేటి, రెబ్బెన ప్రారంతాల్లోని పర్యటించారు. ఆయా ఏరియాల మేనేజర్లు, ఇతర అధికారుల తో చర్చలు జరిపి పలు సూచనలు చేశా రు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించటంలో ఓసీపీలు వెనుకబడటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్రా జెక్టుల్లో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి కి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూ చించారు. క్వారీల్లోకి చేరే వర్షపు నీటిని ఎప్పటికప్పుడూ అధిక సామర్థ్యం కలిగి న మోటర్ల సహాయంతో బయటికి పం పాలని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలతో పాటు, కార్మిక శక్తిని సక్రమంగా వినియోగించుకుని ఉత్పత్తి ప్రక్రియ కొనసాగిం చాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలంలో ఉత్పత్తిని వేగవం తం చేయాలన్నారు. డెరైక్టర్ వెంట ఏరియా జనరల్ మేనేజర్ జనగాం నాగ య్య, ప్రాజెక్టు అధికారులు కొండయ్య, సంజీవరెడ్డి, ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాస్‌రావు, ఏజీఎం ఈఅండ్ఎం నిర్మల్ కుమార్, డీజీఎం వర్క్‌షాప్ నీలకంఠేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఉత్పత్తిలో జాతీయ రికార్డు సీసీసీలోని గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్కే న్యూటెక్ గనిలో ఒక్క రోజు లోనే షాట్‌వాల్ యంత్రం ద్వారా 2400 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జాతీ య స్థాయి రికార్డు అని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం భూ సేకరణ త్వరితగతిన చేపడతామని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమిం చడానికి రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం నాగేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జూలై నాటికి రూ.166కోట్ల నష్టం
మంచిర్యాల అర్బన్/రెబ్బెన(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది.. దీంతో సింగరే ణి వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం జూలై నాటికే కంపెనీకి రూ.166 కోట్ల నష్టం వాటిల్లిందని డెరైక్టర్(పీఅండ్‌పీ) మనోహర్‌రావు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి వెనుకబాటును అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు ఆయన సోమవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, గోలేటి, రెబ్బెన ప్రారంతాల్లోని పర్యటించారు. ఆయా ఏరియాల మేనేజర్లు, ఇతర అధికారుల తో చర్చలు జరిపి పలు సూచనలు చేశా రు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించటంలో ఓసీపీలు వెనుకబడటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్రా జెక్టుల్లో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి కి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూ చించారు. క్వారీల్లోకి చేరే వర్షపు నీటిని ఎప్పటికప్పుడూ అధిక సామర్థ్యం కలిగి న మోటర్ల సహాయంతో బయటికి పం పాలని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలతో పాటు, కార్మిక శక్తిని సక్రమంగా వినియోగించుకుని ఉత్పత్తి ప్రక్రియ కొనసాగిం చాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలంలో ఉత్పత్తిని వేగవం తం చేయాలన్నారు. డెరైక్టర్ వెంట ఏరియా జనరల్ మేనేజర్ జనగాం నాగ య్య, ప్రాజెక్టు అధికారులు కొండయ్య, సంజీవరెడ్డి, ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాస్‌రావు, ఏజీఎం ఈఅండ్ఎం నిర్మల్ కుమార్, డీజీఎం వర్క్‌షాప్ నీలకంఠేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఉత్పత్తిలో జాతీయ రికార్డు సీసీసీలోని గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్కే న్యూటెక్ గనిలో ఒక్క రోజు లోనే షాట్‌వాల్ యంత్రం ద్వారా 2400 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జాతీ య స్థాయి రికార్డు అని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం భూ సేకరణ త్వరితగతిన చేపడతామని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమిం చడానికి రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం నాగేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కొత్తగా 15 లక్షల మంది జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలైలో 14.9 లక్షల మంది కొత్త జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 67.26 కోట్లకు పెరిగిందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర వివరాలు.., జూలైలో ఎయిర్‌సెల్‌కు అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా లభించిన 7.55 లక్షల మందితో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.17 కోట్లకు పెరిగింది. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్‌కు 4.76 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.13 కోట్లకు చేరింది. కంపెనీ మార్కెట్ వాటా 28.45 శాతానికి పెరిగింది. 3 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 12.52 కోట్లకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 18.62 శాతంగా ఉంది. మొబైల్ వ్యాస్ మార్కెట్ ః రూ.29,900 కోట్లు ఈ ఏడాది చివరికి మొబైల్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మార్కెట్ 15% వృద్ధితో రూ.29,900 కోట్లకు చేరుతుందని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2012లో ఎంవ్యాస్ మార్కెట్ రూ.26,000 కోట్లుగా ఉంది. ఈ ఏడాది కన్సూమర్ సెగ్మెంట్ మార్కెట్ రూ.29,300 కోట్లకు, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ మార్కెట్ రూ.600 కోట్లకు పెరుగుతుంది. -
భూగర్భ జలమట్టాల్లో భారీ పెరుగుదల
సాక్షి, సంగారెడ్డి: పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. రెండు నెలలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు భారీ వృద్ధిని సాధించినట్లు భూగర్భ జల శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. గత ఏడాది జూలైలో భూ ఉపరితలానికి 20.37 మీటర్లు దిగువన నమోదైన జిల్లా సగటు భూగర్భ జల మట్టం.. ఈ ఏడాది జూలై నాటికి 5.10 మీటర్ల మేర వృద్ధి సాధించింది. అదే విధంగా గత ఏడాది జూన్‌లో 23.79 మీటర్లు నమోదైన భూగర్భ జల మట్టం ఈ ఏడాది జూన్‌లో 19.53 మీటర్లకు ఎగబాకింది. ఈ సీజన్లో వర్షపాతం 18 మండలాల్లో సాధారణానికి మిం చిపోగా 20 మండలాల్లో సాధారణానికి చేరుకుంది. మిగలిన 13 మండలాల్లో వర్షపాతం ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోయినా.. ఎక్కడా వర్షభావం మాత్రం నెలకొనలేదు. వాగులు, వంకలపై నిర్మించిన చెక్ డ్యాంలు, వాటర్‌షెడ్ ట్యాంకులకు జలకళ వచ్చింది. భూగర్భ జలాల వృద్ధి చెందడంతో వ్యవసాయ బావులు నిండు కుండళ్లా కళకళలాడుతున్నాయి. మరికొన్ని చోట్లలో బావుల నుంచి నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి. ఉబికివస్తున్న జలాలు... మనూరు మండలం పసుపులపాడులో వ్యవసాయ బావి పొంగింది. ఆ గ్రామంలో భూ గర్భ జలాలు భూ ఉపరితలానికి 0.45 మీటర్లు లోతుకే లభ్యమవుతున్నాయి. రేగోడ్ మం డలం టి.లింగంపల్లిలో 0.80 మీటర్లు, వెల్దుర్తి మండలం కుకునూరులో 1.50 మీటర్లు, ఝరాసంఘంలో 4.20 మీటర్లు, పెద్ద శంకరంపేటలో 5.20 మీటర్లు, చిన్న శంకరంపేట మండలం గవ్వపేటలో 5.59 మీటర్లు, పాపన్నపేటలో 6.17 మీటర్లు, శివ్వంపేటలో 6.64 మీటర్లు, వర్గల్ మండలం మజీద్‌పల్లిలో 8.09 మీటర్లు, సిద్దిపేటలో 8.74 మీటర్లు దిగువన భూగర్భజలాల మట్టం నమోదైంది. భూ గర్భ జల మట్టాలు అత్యంత దిగువన నమోదైన ప్రాంతాలను పరిశీలిస్తే..గజ్వేల్‌లో 33.60 మీటర్లు, ములుగులో 32.60 మీటర్లు లోతున భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. విషమం నుంచి ఉపశమనం ఓ ప్రాంతంలో భూగర్భ జలాల లభ్యత, విని యోగం ఆధారంగా భూగర్భ జలాల పరిస్థితిని నిర్ధారిస్తారు. వినియోగం అధికమైతే ఆ ప్రాం తాలను అతి విషమం, విషమ పరిస్థితిలో ఉన్న ట్లు ప్రకటించి అక్కడ కొత్తగా బోరుబావుల తవ్వకాలపై నిషేధాన్ని అమలుచేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వి నీటిని తోడేస్తుండటంతో వేసవికాలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో పడిపోతున్నాయి. కురిసిన వర్షాల వల్ల ఇలాం టి ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాల స్థితి గతులు మెరుగయ్యాయి. మనూరు మండలం పసుపులపాడు, ఝరాసంఘం, పాపన్నపేట, తూప్రాన్ ప్రాంతాలు ఈ కోవకు వస్తాయి.