అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
Published Sat, Aug 5 2017 10:12 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ జూలైలో గణనీయమైన ఉద్యోగ వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్ అంచనాలకుమించి నమోదైంది. దీంతో నిరుద్యోగం రేటు 16 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది.
కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2లోల 9 వేల మేర పెరిగింది. ఇది 180,000 ఉండనుందని మార్కెట్ అంచనాను అధిగమించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మే నెలలో 145,000 గా కొత్త ఉద్యోగుల సంఖ్య జూన్ నెలలో 2, 31,000 కు చేరుకుది. మొత్తంగా ఈ రెండు నెలలో ఉద్యోగ లాభాలు గతంలో నివేదించిన దానికంటే 2,000 కన్నా అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు జూన్‌నెలలో నమోదైన 4.4 శాతం నుంచి 4.3 శాతానికి దిగి వచ్చింది. జూలైలో, సగటు గంట ఆదాయాలు జూన్‌లోని 0.2 శాతం కంటే వేగంగా 0.3 శాతం వృద్ధితో 26.36 డాలర్లకు పెరిగింది. మరోవైపు ఫెడరల్ రిజర్వు రానున్న సెప్టెంబర్‌లో 4.5 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్ షీట్ను తగ్గించడానికి తన ప్రణాళికల రచిస్తోంది. దీనికి ఉద్యోగ వృద్ధి మార్గం సుగమం చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం డిసెంబరులో ఫెడరల్ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించనుదని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా ఫెడ్ తదుపరి విధానం సమావేశం సెప్టెంబరు 19-20 న జరగనుంది.
Advertisement