US Airstrikes
-
కాబూల్‌లో అల్‌ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్నాయి అమెరికా బలగాలు. ఎట్టకేలకు అతడు కాబూల్‌లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్‌కు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగిందో వివరించారు. 2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్‌ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికిరాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మకాం మార్చినట్లు తెలిసి అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్‌లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. అనంతరం జులై1న బైడెన్‌తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్‌కు బైడెన్‌కు వివరించారు. అల్‌ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు. ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు. క్షిపణులతో భీకర దాడి జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్‌లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38గంటల సమయంలో ఈ ఎటాక్ జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబసభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు. అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్‌దేనని సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఆయన కాబూల్‌లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు తెలుసన్నారు. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్‌ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు. చదవండి: అల్‌ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా -
కాబూల్ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు
-
సిరియాపై అమెరికా వైమానిక దాడులు
బాగ్దాద్: సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన ఇరాక్ మిలిటెంట్ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది. అయితే ఇరాక్ బలగాల అధికారి మాత్రం ఒక్కరే మరణించారని, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సైనిక చర్యలకు దిగడం ఇదే మొదటిసారి. సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కతాబ్ హెజ్బుల్లా గ్రూపుకి చెందిన స్థావరాలకు మారణాయుధాలను తీసుకువెళుతున్న మూడు లారీలు అమెరికా దాడుల్లో ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా బ్రిగేడ్స్ అని కూడా ఈ గ్రూపును పిలుస్తుంటారు. ఇరాక్‌లో అమెరికా బలగాలకు అండగా ఉంటాం : ఆస్టిన్ సిరియాలో వేటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగామో తమకు బాగా తెలుసునని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల్ని మరింతగా విస్తరించి పట్టు పెంచుకోవడం కోసం బైడెన్ ఈ దాడులకు ఆదేశాలివ్వలేదని, ఇరాక్‌లో అమెరికా బలగాలకు మద్దతుగా ఉండడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఆస్టిన్ స్పష్టం చేశారు. లెబనీస్ హెజ్బుల్లా ఉద్యమం నుంచి విడిపోయిన ఇరాకీ కతాబ్ గ్రూపు మిలిటెంట్లు గతంలో ఇరాక్‌లో అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పలు దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్యం చాలాసార్లు ఆరోపించింది. -
నిశ్శబ్దంగా చంపేశారు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకి పక్కలో బల్లెంలా మారిన జనరల్ సులేమానీని చంపేయడానికి పెంటగాన్ ప్రణాళిక ప్రకారం రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం ఏ మాత్రం చప్పుడు చేయకుండా శత్రువుని అంతం చేసే క్షిపణిని, ఎంతదూరమైనా ప్రయాణించే సత్తా కలిగిన డ్రోన్‌ని వినియోగించినట్టుగా అమెరికా, అరబ్ దేశాల ప్రధాన మీడియా కథనాలు రాస్తోంది. ఆపరేషన్‌పై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ అనేక విశ్లేషణలు బయటకొస్తున్నాయి. జనరల్ సులేమానీ ఇరాక్‌కు వచ్చినప్పుడు రక్షణపరంగా అంతగా జాగ్రత్తలు తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఆ ప్రాంతం అత్యంత సురక్షితమని ఆయన నమ్మేవారు. సరిగ్గా దానినే అమెరికా అనువుగా మార్చుకుంది. ఇజ్రాయెల్, అమెరికా నిఘా విభాగం సులేమానీ కదలికల్ని అనుక్షణం గమనిస్తూ ఆయన్ను ఇరాక్‌లో ఉన్నప్పుడే చంపేయాలని వ్యూహం పన్నింది. అమెరికా తన వద్ద ఉన్న అత్యంత భయంకరమైన డ్రోన్‌ను ముందుగానే కువైట్‌కు పంపింది. సులేమానీ బాగ్దాద్‌కు వస్తున్న విషయాన్ని తెలుసుకుని ఈ డ్రోన్‌ని బాగ్దాద్ గగనతలానికి తరలించింది. ఇరాక్‌లో మిగిలిన ప్రాంతంలో విధ్వంసం జరగకూడదన్న ఉద్దేశంతో విమానా శ్రయం వద్దే డ్రోన్ దాడికి ట్రంప్ ఆదేశించినట్టుగా కథనాలు వచ్చాయి. సైలెంట్ కిల్లర్ ఆర్9ఎక్స్ డ్రోన్ సాయంతో ప్రయోగించే క్షిపణి హెల్ఫైర్ ఆర్9ఎక్స్. ఉగ్రవాద సంస్థల నాయకుల్ని మట్టుబెట్టడానికే ఈ క్షిపణిని అమెరికా వినియోగిస్తోంది. ఈ క్షిపణికి కచ్చితత్వం చాలా ఎక్కువ. దీనికున్న ఆరు పాప్ అప్ బ్లేడ్స్ వల్ల క్షిపణి ప్రయోగం జరిగిన ప్రాంతంలోనే «విద్వంసం జరుగుతుంది. నిశ్శబ్దంగా పనిచేయడం దీని ప్రత్యేకత. అల్‌ఖాయిదా నేత అబు ఖయ్యార్ అల్ మస్రీని హతం చేయడానికి ఈ క్షిపణినే ప్రయోగించింది. ఆ డ్రోన్ అత్యంత భయంకరమైనది ఇక ఆపరేషన్‌లో అత్యంత భయంకరమైన డ్రోన్ యూఎస్ ఎంక్యూ–9 రీపర్ వినియోగించింది. ఈ డ్రోన్ గంటకి 480కి.మీ.వేగంతో ప్రయాణించగలదు. 1800కి.మీ. దూరం నుంచి లక్ష్యాలను ఛేదించగలదు. సుదూర ప్రాంతాల్లో ఏమున్నా పసిగట్టే సెన్సర్లు, వివిధ రకాలుగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ, కచ్చితత్వంతో లక్ష్యాలను తాకే ఆయుధాలు, ఒకేసారి బహుళ లక్ష్యాలను నిర్వహించే సామర్థ్యం ఈ డ్రోన్‌కి ఉంది. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లకు ఇది అనువైంది. -
కాళ్లు, చేతులు తీసేశారు.. కారణం తెలిస్తే షాక్
వాషింగ్టన్ : అమెరికా విస్కాన్సిన్కు చెందిన గ్రేగ్ మంటఫేల్(48) గత నెలలో ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే అతని రెండు చేతులను మోచేతుల వరకూ తొలగించారు. మోకాళ్ల కింద భాగాన్ని కూడా తొలగించారు. ఇంకా కొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాళ్లు, చేతులు తొలగించాల్సి వచ్చిందంటే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యే అయ్యుంటుంది అనుకుంటున్నారా.. అవును గ్రేగ్ ఒక అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకడానికి గల కారణం మాత్రం చాలా విచిత్రమైనది. అది ఏంటంటే కుక్క నాకడం వల్ల గ్రేగ్ పరిస్థితి ఇలా తయారయ్యింది. దాంతో లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు గ్రేగ్. వివరాల ప్రకారం.. గత నెలలో గ్రేగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది, ఫ్లూ లక్షణాలు అనుకోని సమీప ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ గ్రేగ్‌ను పరీక్షించిన వైద్యులు, అతను అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యం చేసి చేతులు, కాళ్లను మోచేతులు, మోకాలు వరకూ తొలగించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. అనంతరం ఆపరేషన్ చేసి గ్రేగ్ కాళ్లను, చేతులను తొలగించారు. అయినా వ్యాధి ఇంకా పూర్తిగా నయం కాలేదని , మరికొన్ని సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గ్రేగ్‌కు వచ్చిన అరుదైన వ్యాధి గురించి వైద్యులు ‘సాధరణంగా పిల్లులు, కుక్కల లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే దీని గురించి జంతు ప్రేమికులు భయపడాల్సిన పన్లేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి మీ పెంపుడు జంతువులను చూసి భయపడాల్సిన పన్లేదు. ఇంతకు ముందులానే మీ పెంపుడు జంతువులతో గడపోచ్చు’ అంటూ తెలిపారు. అయితే గ్రేగ్ వైద్య ఖర్చుల నిమిత్తం గోఫండ్‌మి పేజ్‌ను క్రియేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు అతని బంధువులు. -
అమెరికన్లకే ఉద్యోగాలు...!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలన్న విధానం విదేశీ విద్యార్థుల పాలిట పట్ల శాపంగా మారుతోంది. అమెరికా ఫస్ట్ అన్న తన నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో భాగంగా హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో మార్పు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్లతోనే అక్కడి ఉద్యోగాల భర్తీకి ఆ దేశ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ దాకా పరిశీలిస్తే... అమెరికా పౌరసత్వం లేదా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ‘వర్క్ ఆథరైజేషన్’ ఉన్న వారినే అక్కడి కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 19 శాతం పెరిగింది. వీసా నిబంధనల ప్రభావం కారణంగా అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విదేశీవిద్యార్థుల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రెండున్నర కోట్ల ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. 2017లో 55 శాతం అమెరికా కంపెనీలు విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. 2018లో అది 47 శాతానికి పడిపోయింది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతమున్న విధానం మేరకు సాంకేతిక, సైద్ధాంతిక నైపుణ్యమున్న వలసదారులు కాని వారిని (నాన్ ఇమ్మిగ్రెంట్స్) కూడా అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో తీసుకునేందుకు హెచ్ 1బీ కేటగిరి అనుమతిస్తోంది. ఇది మూడేళ్ల వరకు చెల్లుబాటు కావడంతో పాటు మళ్లీ పొడిగించేందుకు అవకాశాలుంటాయి. అయినప్పటికీ ఆయా రంగాల్లో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నట్టు వెల్లడైంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, వర్క్ పర్మిట్లు పొందుతున్న వారి సంఖ్య మాత్రం దిగజారినట్టు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,14,503 హెచ్ 1బీ వీసాలు అనుమతించగా, 2017లో అది 1,08,101కు పడిపోయింది. వీరిలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారి సంఖ్య 52,002 నుంచి 45,405కు తగ్గిపోయింది. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. 200717 మధ్య కాలంలో ఈ వీసాల కోసం అమెరికా పౌర, వలస సేవా సంస్థ (యూఎస్సీఐఎస్)కు 22 లక్షల మంది ఇండియన్లు దరఖాస్తు చేసుకోగా.. 3,01,000 మందితో చైనీయులు రెండోస్థానంలో నిలిచారు. -
యూఎస్ రియల్టీలో భారతీయులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ గ్రీన్‌కార్డ్ ఎందరో భారతీయుల కల. దాన్ని నెరవేర్చుకోవటానికి కొందరు సంపన్నులు ఈబీ–5 మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మార్గంలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించడం ద్వారా యూఎస్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడిదారు, ఆయన భార్య, పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. సాధారణంగా గ్రీన్కార్డ్కు 15–20 ఏళ్లు పడుతుంది. ఈబీ–5 ద్వారా 18 నెలల్లోపే కండిషనల్ గ్రీన్‌కార్డ్ పొందవచ్చు. భారత్ నుంచి ఈబీ–5 దరఖాస్తుదారుల్లో 60% మంది రియల్టీలో పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్నారని ‘కెన్ ఏమ్’ ఎంటర్ప్రైజెస్ ఇండియా, మిడిల్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ లోహియా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. న్యూయార్క్ కేంద్రంగా సేవలందిస్తున్న ‘కెన్ ఏమ్’ ఇమిగ్రేషన్ ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. వీసా నిబంధనలతో..: ట్రంప్ అధ్యక్షుడయ్యాక వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినమయ్యాయని, ఈ మధ్య వీసాల రెన్యువల్స్ తిరస్కరణ పెరిగిందని, దీంతో ఈబీ–5 వీసాలకు డిమాండ్ పెరిగిందని అభినవ్ వెల్లడించారు. ‘ఎంట్రప్రెన్యూర్స్, టెకీల నుంచి ఈ దరఖాస్తులు పెరుగుతున్నాయి. యూఎస్‌లో ఉన్నవారికి ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయటం చాలా సులువు. అయితే పెట్టుబడి మొత్తాన్ని 2018 సెప్టెంబరు నుంచి 9.25 లక్షలు లేదా 13 లక్షల డాలర్లు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్ నుంచి దరఖాస్తులు 80–90 శాతం తగ్గే అవకాశముంది. నిజానికి 5 లక్షల డాలర్లు చాలా తక్కువ. అదే ఆస్ట్రేలియాలో అయితే కనీసం 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి’ అని ఆయన వివరించారు. ఈ ఏడాది 700 దరఖాస్తులు.. గతేడాది భారత్ నుంచి 500 దాకా ఈబీ–5 దరఖాస్తులొచ్చాయని, ఈ ఏడాది 700 దరఖాస్తులొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు అభినవ్ చెప్పారు. చైనా, వియత్నాం తర్వాత అత్యధిక అప్లికేషన్లు భారత్ నుంచే వస్తున్నట్లు చెప్పారాయన. ఇక కెన్ ఏమ్ 2016లో 50, 2017లో 97 దరఖాస్తులను స్వీకరించింది. ఈ ఏడాది ఇది 200 రావచ్చని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి గత రెండేళ్లలో 10 అప్లికేషన్లను ప్రాసెస్ చేసింది. -
బిడ్డకు పాలిస్తూ ర్యాంప్‌పై నడిచిన మోడల్
‘బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తన చిన్నారి ఆకలి తీర్చడమే అమ్మకు ప్రధానం. తల్లి ఎక్కడ ఉన్న, ఏం చేస్తున్న ఆమె ఆలోచనలన్ని తన బిడ్డ చూట్టే తిరుగుతుంటాయి. పిల్లలు ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. అంతే ఇంక ఆ సమయంలో ఏం ఆలోచించదు. వెంటనే బిడ్డ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం చనుబాలు. కానీ నేటికి మన సమాజంలో మహిళలు బహిరంగంగా బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. కారణం చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించి. కేవలం ఈ కారణం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తల్లి అయిన తర్వాత కొన్నేళ్లపాటు ఉద్యోగాలు మానుకుంటున్నారు. ఈ విషయంలో విచక్షణ లేని పశుపక్ష్యాదులే మనిషి కంటే మేలు. బిడ్డ ఆకలి తీర్చడంలో వాటికున్న స్వతంత్రలో కనీసం ఒక్క శాతాన్ని కూడా సమాజం మన తల్లులకు ఇవ్వడంలేదు’. కానీ ఇప్పుడిప్పుడే మాతృమూర్తుల ఆలోచన ధోరణి మారుతుంది. ‘బిడ్డకు పాలు ఇవ్వడం నా ధర్మం. తల్లిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. దీనికి సమాజం గురించి పట్టించుకోనవసరం లేదు’ అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాక, భారత్ లాంటి సనాతన దేశాల్లో కూడా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. కొన్నాళ్ల క్రితమే ప్రముఖ కేరళ పత్రిక ‘మాతృభూమి’ తన గృహలక్ష్మి మ్యాగ్జైన్లో బిడ్డకు పాలు ఇస్తున్న మోడల్ ఫోటో ప్రచురించి ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మోడల్ బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేసి మాతృత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ స్లిమ్ షూట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామిలో నిర్వహించిన ఒక ర్యాంప్ షోలో పాల్గొంది. మోడల్ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. ర్యాంప్ వాక్ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. తల్లి కదా అందుకే బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్ధమైంది. ర్యాంప్‌వాక్ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మార్టినా. మార్టినా షేర్ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్నో పబ్లిసిటి స్టంట్లా భావించి విమర్శలు చేస్తున్నారు. అయితే తనను విమర్శించే వారికి చాలా గట్టిగానే సమాధానం చెప్పారు మార్టినా. ‘నేను ఈ రోజు చేసిన పని కావాలని, నలుగురి దృష్టిలో పడాలని చేసింది కాదు. నేను గత ఐదు నెలలుగా చేస్తున్న పనినే ఇప్పుడు చేశాను. రోజు నా బిడ్డకు నేను ఇదే సమయంలో పాలు ఇస్తాను. ఈ రోజు కాస్తా ఆలస్యం అయ్యేసరికి తను ఏడుస్తుంది. తన ఆకలి తీర్చడం కంటే మరేది నాకు ముఖ్యం కాదు. ఈ విషయం కేవలం తల్లికి మాత్రమే అర్ధమవుతుంది. నన్ను విమర్శించే ముందు ఈ విషయం గురించి మీ అమ్మను అడగండి. వారికి తెలుసు నేను చేసింది కరెక్టో, కాదో’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించారు. ఇప్పటికైతే అమెరికాలో బిడ్డలకు తల్లులు బహిరంగంగా పాలు ఇవ్వొచ్చు, కానీ రెస్టారెంట్లు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో మాత్రం కవర్ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. అమెరికా మహిళలు ఈ ఆదేశాలను తప్పు పడుతున్నారు. ‘మేము కవర్ చేసుకోవడం కాదు మీరు మీ బుద్ధిని సరి చేసుకోండి’ అంటూ విమర్శిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. -
అనాథ శిశువు అయ్యింది అమెరికా అమ్మాయి
శివాజీనగర(కర్ణాటక): ఏడాది కిందట చెత్తకుప్పలో అనాథ శిశువుగా దొరికిన అన్విత తొలి పుట్టినరోజు వేడుకలు శనివారం హాసన్‌లోని తవరు చారిటబుల్ ట్రస్ట్‌లో ఘనంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన దంపతులు ఈ శిశువును దత్తత తీసుకున్నారు. ఒక ఆడశిశువును హొళె నరసిపురలో కుప్పతొట్టిలో పడేసి వెళ్లిపోవడంతో చీమలు, ఉడుతలు కరవడంతో పసిగుడ్డు రోదిస్తుండగా, స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. తరువాత హాసన్ జిల్లా ఆసుపత్రికి చేర్చగా వైద్యుల చికిత్సలో ప్రాణాలతో బయటపడింది. త్వరలో అమెరికాకు హాసన్‌లో డాక్టర్ పాలాక్షప్ప నేతృత్వంలోని తవరు చారిటబల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన అన్వితా శనివారం తొలి పుట్టిన రోజును జరుపుకుంది. కలెక్టర్ రోహిణి సింధూరి ప్రత్యేకంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈసందర్భంగా అమెరికాకు చెందిన రెండు జంటలు ఇందులో పాల్గొన్నాయి. అన్వితతో పాటు మరొక చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. దీంతో అనాథ శిశువు అమెరికా అమ్మాయి అయ్యిందని పలువురు ఆనందం వ్యక్తంచేశారు. వీసా తదితరాలు కొన్ని రోజుల్లో పూర్తిచేసుకుని అన్వితను అమెరికాకు తీసుకెళ్తామని అమెరికన్ దంపతులు తెలిపారు. -
భారత్ నుంచి ఆ దేశానికే అత్యధిక వలసలు
సాక్షి, న్యూఢిల్లీ : నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం భారత్ నుంచి అమెరికా అత్యంత రద్దీ కలిగిన అంతర్జాతీయ వలస మార్గంగా ముందువరసలో నిలిచింది. కేవలం 2010 ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 లక్షల మంది నైపుణ్యం కలిగిన శ్రామికులు భారత్ నుంచి అమెరికా బాట పట్టారని వెల్లడైంది. ఇక ఫిలిప్పీన్స్ నుంచి కెనడా రూట్ తర్వాతి స్ధానంలో నిలవడం గమనార్హం. 2010లో ఫిలిప్పీన్స్ నుంచి కెనడాకు మూడు లక్షల మంది సిబ్బంది వలస బాట పట్టారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వీసా ఆంక్షలు, వలసలపై కఠిన నిబంధనలతో భారత్ నుంచి అమెరికాకు నైపుణ్యంతో కూడిన మానవ వనరుల వలసలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. -
అమెరికాలో వరంగల్ విద్యార్థిపై కాల్పులు
సాక్షి, వరంగల్/హైదరాబాద్: అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్(26) అనే విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం(అమెరికా కాలమానం ప్రకారం) మిస్సోరిలోని కాన్సస్ నగరంలో ఓ రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని శరత్‌ను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కొప్పు రామ్మోహన్, మాలతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు శరత్. కూతురు అక్షర. రామ్మోహన్ బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తుండగా, మాలతి పంచాయతీరాజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసిన రామ్మోహన్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఆయన తనయుడు శరత్ హైదరాబాద్‌లోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి.. మిస్సోరి యూనివర్సిటీలో ఎమ్మెస్ చదివేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. కాన్సస్‌లోని చార్లెట్ స్ట్రీట్ అపార్ట్మెంట్ 5303 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం అల్పాహారం కోసం శరత్ దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ‘‘ఇద్దరు స్నేహితులతో కలిసి శరత్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలో కొందరు దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్టు సమాచారం వచ్చింది. శరత్‌తో ఉన్న ఇద్దరు తప్పించుకున్నారు. శరత్ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వెనుక నుంచి కాల్పులు జరిపారు’’ అని రామ్మోహన్ తెలిపారు. అమెరికా నుంచి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు వివరించారు. పూర్తి సమాచారం అందించాలంటూ రామ్మోహన్ శనివారం డీజీపీని కలిశారు. - కొప్పు శరత్(ఫైల్) -
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
భారత్‌లో అత్యంత ప్రమాదకరస్థాయిలో మహిళల భద్రత
-
వాణిజ్య యుద్ధం కన్నా... డాలర్ కీలకం
అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 22వ తేదీతో ముగిసిన వారంలో 11 డాలర్లు తగ్గి 1,271 డాలర్ల వద్ద ముగిసింది. వరుసగా 2 వారాల్లో 23 డాలర్లు పతనమైంది. ఒకదశలో పసిడి ఆరు నెలల కనిష్ట స్థాయి 1,264 డాలర్లను కూడా చూడ్డం గమనార్హం. డాలర్ ఇండెక్స్ 11 నెలల కనిష్ట స్థాయి 95.16ను తాకడం దీనికి నేపథ్యం. వారాంతానికి డాలర్ తిరిగి వారం వారీగా 71 సెంట్ల నష్టంతో 94.19కి తిరిగి వచ్చిన నేపథ్యంలో పసిడి కూడా కొంత కోలుకుని 1,271 డాలర్ల వద్ద వారంలో ముగిసింది. వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా–చైనాల మధ్య తీవ్ర పరిస్థితులు ఈ వారంలోనే ఏర్పడ్డం ఇక్కడ కీలకాంశం. అయితే ఈ వాణిజ్య అనిశ్చితి పరిస్థితుల కన్నా, డాలర్ కదలికలపైనే పసిడి ఆధారపడినట్లు కనిపించింది. దీని ప్రకారం– డాలర్ ఇండెక్స్ తిరిగి బలోపేతమై 95 దాటితే పసిడి 1,250 డాలర్ల దిగువకు వచ్చే అవకాశం ఉందన్నది విశ్లేషణ. 1,280–1,270 డాలర్ల శ్రేణి మద్దతు స్థాయిని కోల్పోతే, మరింత అమ్మకాల ఒత్తిడితో పసిడి 1,240 డాలర్ల వరకూ పడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. దేశంలో భారీ పతనం... అంతర్జాతీయంగా పసిడి ధర పతనానికి తోడు, 22వ తేదీతో ముగిసిన వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడ్డ (0.61 పైసల లాభంతో 67.86 వద్ద ముగింపు) నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర భారీగా పడింది. ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర వారంలో రూ.400 తగ్గి రూ.30,610కి చేరింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత గల పసిడి ధరలు వారంలో రూ.630 చొప్పున తగ్గి రూ.30,620, రూ.30,400 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర భారీగా రూ.1,780 లాభపడి రూ.39,735కు పెరిగింది. -
అమెరికాకు షాక్ : దిగుమతి సుంకం పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: ట్రేడ్‌వార్‌తో ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్న అమెరికాకు షాకిచ్చేలా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికానుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. సుంకం పెంపు ఆగస్టు 4 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూనిమియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలను పెంచిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ముందు ప్రకటించినట్టుగా గాకుండా మొత్తం 29 వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్టు వెల్లడించింది. 800 సిసి పైన మోటారు బైక్‌లను మినహాయించి, ప్రస్తుతం 29 వస్తువులపై అదనపు కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్టు తెలిపింది. ఇందులో కొన్ని రకాల నట్స్, యాపిల్స్, ఇనుము, స్టీలు, అల్లోయ్ ఉత్పత్తులు, బోరిక్ యాసిడ్, బోల్టులు, నట్లు, స్క్కూలు తదితరాలు ఉన్నాయి. చిక్కుళ్లు, శనగల దిగమతిపై సుంకాన్ని 60శాతానికి పెంచింది. ఇతర గింజధాన్యాలపై 30 శాతానికి, బోరిక్‌యాసిక్, ఫౌండరీ మౌల్డ్స్ బైండర్ల 7.5 శాతం పెంచింది. రొయ్యలు ఇతర సీ ఫుడ్‌పై 15 శాతం సుంకం పెంచింది. ప్రపంచ వాణిజ్య సంస్థ డాక్యుమెంట్‌కు లోబడి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచే అధికారం ఉందని ఈ ఏడాది మే 18న భారత్ తెలియచేసింది. మార్చి 9న అమెరికా సుంకాలు పెంచడం వల్ల మన దేశానికి చెందిన స్టీలు ఎగుమతిదార్లపై రూ.1198.6 మిలియన్ డాలర్లు, అల్యూమినియం ఎగుమతిదార్లపై 42.4 మిలియన్ డాలర్ల ప్రభావం పడింది. అలాగే దీనివల్ల భారత్‌పై 241 మిలియన్ డాలర్ల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. కాగా ప్రతి ఏడాది 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2016-17లో భారత్ ఎగుమతులవిలువ 42.21 బిలియన్ డాలర్లుగాను, దిగుమతులు 22.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఎవరి వ్యూహాలు వారివి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ ఆశించిన ఫలితాలు సాధించి చరిత్ర సృష్టిస్తుందా ? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణ్వాయుధాల వినియోగం, వ్యాప్తి నిరోధం కోసం తాను ‘శాంతి యాత్ర’కు వెళుతున్నట్లు సింగపూర్‌కు బయలుదేరే ముందు ట్రంప్ ప్రకటించినా.. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరగనున్న ఈ సమావేశం దశ, దిశ ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇరువురు నేతల చంచల స్వభావాల్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భేటీ అనూహ్యంగా ముగుస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. నిజానికి శిఖరాగ్ర సమావేశాల కోసం ఎజెండాను ముందుగానే ఖరారుచేస్తారు. ఈ భేటీ కోసం రూపొందించిన ఎజెండాపై గోప్యత కొనసాగుతోంది. అణ్వస్త్రాల వ్యాప్తి, తయారీ నుంచి వైదొలిగేందుకు కిమ్ సానుకూలంగా స్పందిస్తారని అమెరికా ఆశిస్తోంది. దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ భేటీ దోహదపడుతుందని ఆ దేశం నమ్మకంతో ఉంది. ఆ దిశగా అగ్రరాజ్యానికి నమ్మకం కలిగించే చర్యల్ని ఉ.కొరియా ఇప్పటికే చేపట్టినా.. తన బలంగా చెప్పుకుంటున్న అణ్వాయుధాలను కిమ్ వదులుకుంటాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. స్నేహ సంబంధాలు చిగురిస్తాయా? బద్ద శత్రువులుగా ఉన్న అమెరికా–ఉత్తరకొరియాల మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ట్రంప్–కిమ్‌ల మధ్య మాటల యుద్ధంతో కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తమపై దాడికి పాల్పడితే అమెరికాపై అణ్వాస్త్రాల్ని ప్రయోగిస్తామంటూ కిమ్ హెచ్చరించగా.. ట్రంప్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, కిమ్‌లు పరస్పరం దూషణలకు దిగారు. అయితే తన ధోరణికి భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి కిమ్ శాంతి మంత్రం మొదలుపెట్టారు. ఇకపై దేశ ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పడంతో పాటు దక్షిణ కొరియాకు స్నేహ హస్తం అందించారు. స్వయంగా కొరియా సరిహద్దుల్లో ద.కొరియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ట్రంప్‌తో చర్చలకు ప్రతిపాదించడంతో పాటు తానే చొరవ తీసుకున్నాడు. ఒక దశలో ట్రంప్ అర్ధాంతరంగా చర్చల్ని రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించినా.. కిమ్ ఒక మెట్టు దిగొచ్చి ట్రంప్‌ను చర్చలకు ఒప్పించారు. ఇద్దరికీ సవాలే.. అమెరికాలో తన పట్టు నిలుపుకోవడంతో పాటు, ప్రపంచం దృష్టిలో సమర్థనేతగా గుర్తింపు పొందేందుకు ఈ భేటీని సువర్ణావకాశంగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఉత్తరకొరియాను దారికి తెచ్చిన నేతగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తున్నారు. చైనా, రష్యా ఆధిపత్యానికి చెక్‌పెట్టి ఆసియాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత చర్చలు ఉపయోగపడతాయనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమెరికా, ఇతర దేశాల ఆర్థిక,సైనిక ఆంక్షలతో దారుణంగా దెబ్బతిన్న తన దేశ పునర్నిర్మాణంతోపాటు.. ప్రపంచదేశాల్లో సానుకూల గుర్తింపు పొందేందుకు ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వేదికగా చేసుకోవాలని కిమ్ ఆశాభావంతో ఉన్నారు. ఈ చర్చల సందర్భంగా ట్రంప్ తన దుందుడుకు స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తారా? దౌత్యనీతిని ప్రదర్శించి పెద్దన్నపాత్రను పోషిస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది. కిమ్‌తో భేటీ ట్రంప్ సామర్థ్యానికి సవాల్‌గా నిలవనుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రెడీ టు ఫైట్
ఫస్ట్ అనేది ఏదైనా సాధారణంగా అది యు.ఎస్.లోనే జరుగుతుంటుంది. అయితే యు.ఎస్.లో స్టేట్ గవర్నర్‌గా ఇంతవరకూ ఒక నల్లజాతి మహిళ ఎన్నిక కాలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. స్టేసీ అబ్రహాం అనే నల్లజాతి మహిళ ఏడాది జార్జియా మధ్యంతర ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఆమె కనుక గెలిస్తే యు.ఎస్.లో తొలి నల్లజాతి మహిళా గవర్నర్ అవుతారు. స్టేసీ మాజీ న్యాయవాది, డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు. ప్రస్తుతం జార్జియా ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కనుక ఆమె తగినంత మెజారిటీ సంపాదిస్తే, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో గవర్నరుగా పోటీ చేయవచ్చు. ఇప్పటికే ఈమెకు హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్ వంటి మహిళా ఉద్దండులు మద్దతు ప్రకటించారు. యేల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టేసీ.. తనకు అవకాశం ఇస్తే జార్జియాలో మంచి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు, సగటు పౌరులకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యను, శిశు సంరక్షణ అందించేందుకు, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. విశేషం ఏంటంటే స్టేసీకి పోటీగా అదే పేరుగల స్టేసీ ఇవాన్స్ అదే డెమొక్రాటిక్ పార్టీ తరఫున నిలబడటం! ఇవాన్స్ అచ్చమైన అమెరికా అమ్మాయి. స్టేసీ అబ్రహాం ఆఫ్రో–అమెరికన్. చూడాలి జార్జియా ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారో. -
భారత్ కోసం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం
వాషింగ్టన్, అమెరికా : భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. రక్షణ రంగంలో కూడా భారత్ పటిష్టమవుతోంది. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. అమెరికా ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ‘పసిఫిక్ కమాండ్’ పేరును ‘యూఎస్-ఇండో కమాండ్’ గా మారుస్తున్నట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు అమెరికా ఇస్తున్నప్రాముఖ్యతకు ఈ పేరు దోహదం చేస్తుందని పెంటగాన్ అధికారులు తెలిపారు. "పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భాగస్వామ్య దేశాలతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం. ఈ పరిధిలోని దేశాల్లో మరింత స్థిరత్వం కోసం ఈ పేరు మార్పు దోహదపడుతుంది" అని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ వెల్లడించారు. భారత్‌కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, యుద్ధ నౌకలు కలిగి ఉన్న3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో నిఘా కాస్తోంది. ఈ కమాండ్‌కు ఇప్పటివరకూ అడ్మిరల్ హ్యారీ హారిస్ నేతృత్వం వహించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హ్యారీ హారిస్ దక్షిణ కొరియా రాయాబారిగా నియమించారు. దీంతో అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్ సన్ ఆ కమాండ్‌కు బాధ్యతలు వహించనున్నారు. -
కిమ్ జాంగ్‌కు సర్ప్రైజ్.. ఉత్కంఠ!
సియోల్: ఆది నిష్టూరమే మేలనిపించేలా.. శత్రువులుగా ఉన్నప్పటి కంటే, స్నేహితులుగా మారుదామనుకున్న తర్వాత కిమ్-ట్రంప్‌ల వైఖరి మరింత విసుగు కలిగించే రీతిలో క్షణక్షణానికి మారుతోంది. జూన్ 12న సింగపూర్‌లో జరగాల్సిన అమెరికా-ఉత్తరకొరియా దేశాధినేతల భేటీ యవ్వారం గంటకో మలుపు తిరుగుతోంది. ఒకసారి కిమ్ ‘అసలు చర్చలే లేవు’ అంటే.. ఇంకోసారి ట్రంప్ ‘ఠాట్ ఆయనతో నేను మాట్లాడబోను..’ అని ప్రకటిస్తారు. ఉద్రిక్తతను నివారించి, చర్చలు సజావుగా సాగేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చర్చల తేదీ(జూన్ 12) దగ్గర పడుతుండటంతో ఇక దక్షిణకొరియానే నేరుగా రంగంలోకి దిగింది. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ శనివారం అకస్మాత్తుగా ఉత్తరకొరియాకు వెళ్లి కిమ్ జాంగ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. సరిహద్దులోని పన్ముంజోమ్ గ్రామంలో ఇరు నేతలూ సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ మేరకు దక్షిణకొరియా అధ్యక్షుడి అధికారిక భవనం బ్లూ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చలకు కిమ్ ఒప్పుకున్నట్టేనా?: ఉత్తరకొరియాతో అమెరికా చర్చలకు సంబంధించి రోజురోజుకూ మారుతోన్న పరిణామాలపై కిమ్-మూన్‌లు చర్చించారని, భేషజాలకు పోకుండా చర్చలకు సిద్ధంకావాలని కిమ్‌కు మూన్ సూచించారని బ్లూహౌస్ పేర్కొంది. అయితే, ట్రంప్‌తో చర్చలకు కిమ్ ఒప్పుకున్నది లేనిది.. మూన్ రేపు(ఆదివారం) ఉదయం అధికారికంగా ప్రకటిస్తారని, అప్పటిదాకా ఉత్కంఠ తప్పదని దక్షిణకొరియా అధికారగణం పేర్కొంది. అమెరికాతో చర్చల అంశంతోపాటు రెండు కొరియా దేశాల మధ్య కొనసాగుతోన్న మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా కిమ్-మూన్‌లు భావిస్తున్నారని, ఆమేరకు అవసరమైన చర్యలను వేగవంతం చేశారని బ్లూహౌస్ తెలిపింది. (చూడండి: కిమ్‌కు ట్రంప్ కళ్లెం వేశారా?) (చదవండి: మరోసారి మాట మార్చిన ట్రంప్) -
శాంతి చర్చలకు గండి
సంఘర్షించుకుంటున్న రెండు దేశాల మధ్య చర్చ జరగాలంటే, శాంతి నెలకొనాలంటే ఆ వైరి పక్షాలు రెండూ పరస్పరం గౌరవించుకోవాలి. సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఒకపక్క చర్చలకు సిద్ధపడుతున్నట్టు కనబడుతూనే అవతలి పక్షాన్ని కించపరచడానికి లేదా దానిపై తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఏ ఒక్కరు ఉబలాట పడినా మొదటికే మోసం వస్తుంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సదవగాహన లోపించబట్టే...అమెరికా ఆధిపత్య ధోరణì ప్రదర్శించడం వల్లే వచ్చే నెల 12న ఆ రెండు దేశాల మధ్యా జరగాల్సిన చర్చలు కాస్తా రద్దయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు జరగడం సరికాదని భావిస్తున్నానని, భవిష్యత్తులో అవి జరిగే అవకాశం తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య ఏప్రిల్ నెలాఖరున శిఖరాగ్ర చర్చలు జరిగినప్పుడు ప్రపంచమంతా స్వాగతించింది. ఆ తర్వాత తాను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జూన్ 12న సింగపూర్‌లో సమావేశం కాబోతున్నట్టు ఉన్నట్టుండి ట్రంప్ ట్వీటర్ ద్వారా ప్రక టించినప్పుడు సైతం ఇది నిజమా, కలా అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే చర్చలకు అమెరికా వెళ్లేందుకు కిమ్ అంగీకరించరు. ఉత్తర కొరియా వచ్చేందుకు ట్రంప్ సిద్ధపడరు. రెండు దేశాల ప్రజా నీకంలోనూ అవతలివారిపై ఆ స్థాయిలో విద్వేషభావాలున్నాయి. పరస్పరం ఉండే అపనమ్మకాలు, భయాల సంగతలా ఉంచి... ఆ విద్వేషభావాలను కాదని నిర్ణయం తీసుకోవడం ఇద్దరికీ కష్టమే. ఇక కిమ్ పశ్చిమ దేశాల్లో చర్చలకు ఇష్టపడరు. వేరే దేశాల్లో ట్రంప్‌కు తగిన భద్రత కల్పించడం కష్టమని అమెరికా అభిప్రాయం. అందుకే చివరకు సింగపూర్‌లో చర్చలకు అంగీకారం కుదిరింది. అంతర్జాతీయ దౌత్యంలో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులూ ఉండరు. పరిస్థితులు, ప్రయోజనాలు ఎలాంటి అసాధ్యన్నయినా సుసాధ్యం చేస్తాయి. అందువల్లే ట్రంప్‌ను చర్చలకు ఆహ్వానిస్తూ కిమ్ ప్రకటించడం, దానికి ఆమోదం తెలుపుతూ రెండు నెలల్లో సమావేశమవుదామని ట్రంప్ జవాబివ్వడం చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ట్రంప్ సమావేశ స్థలిని, సమయాన్ని కూడా నిర్ణయించడంతో మరింత సంతోషపడ్డారు. ఈలోగా ‘ఆలూ లేదు, చూలూ లేదు...’ అన్నట్టు కొందరు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే, మరికొందరు ట్రంప్ దానికి అన్నివిధాలా అర్హుడంటూ వాదించారు. కానీ గాఢమైన శత్రుత్వం ఉన్న దేశాలు సమావేశమవుతామని ప్రకటించినంత మాత్రాన సరిపోదు. ఆ సమావేశానికి అవసరమైన ప్రాతిపదికలను సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఇరు దేశాల అధికారులూ సంప్రదింపులు ప్రారంభించాలి. చర్చనీయాంశాలను ఖరారు చేసుకోవాలి. కానీ ఇవేమీ జరగలేదు. కిమ్ ఎంతో నిజాయితీతో ఈ శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నారని మొదట్లో ప్రశంసించిన ట్రంప్ ఆ తర్వాత తన సహచరుల ద్వారా వేరే సంకేతాలు పంపారు. అణ్వాయుధాలన్నిటినీ ఏకపక్షంగా స్వాధీనం చేయడానికి కిమ్ సర్కారు అంగీకరించిందంటూ వారం క్రితం అమెరికా చెప్పడం ఉత్తర కొరియాకు ఆగ్రహం తెప్పించింది. ఇది నిజం కాదని ఆ దేశం ఖండించింది. కనీసం ఆ దశలోనైనా ఇరు దేశాలూ మాట్లాడుకుని అపోహలు తలెత్తకుండా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఈలోగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చేసిన ప్రకటన పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు ‘లిబియా నమూనా’ అత్యుత్తమమైనదని బోల్టన్ ప్రకటన సారాంశం. ‘లిబియాకు, ఆ దేశాధినేత గడాఫీకి పట్టిన గతిని చూసిన తర్వాతే మేం అణ్వాయుధాలు సమకూర్చుకోవాలని నిర్ణయిం చుకున్నాం. అటువంటప్పుడు ఆ నమూనా మాకెలా పనికొస్తుంద’ని ఉత్తర కొరియా ప్రశ్నించింది. అప్పటికైనా అమెరికా తెలివి తెచ్చుకుని ఉంటే వేరుగా ఉండేది. కానీ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సైతం అలాగే మాట్లాడారు. దాంతో ‘మైక్ పెన్స్ అజ్ఞాని, మూర్ఖుడు’ అంటూ ఉత్తర కొరియా ప్రత్యుత్తరమిచ్చింది. ఇప్పుడు చర్చలు రద్దు కావడానికి ట్రంప్ ఆ ప్రకటననే కారణంగా చూపు తున్నారు. చిత్తశుద్ధితో చర్చలకు సిద్ధపడిన దేశానికి లిబియాను గుర్తు చేయడం అజ్ఞానం కాక పోవచ్చుగానీ మూర్ఖత్వం. లిబియాలో అమెరికా, పశ్చిమ దేశాలు ఏమాత్రం నిజాయితీగా వ్యవ హరించలేదు. అణ్వస్త్ర కార్యక్రమాన్ని నిలిపేస్తే అన్నివిధాలా అండదండలు అందిస్తామని గడాఫీకి ఆ దేశాలు హామీ ఇచ్చాయి. వారిని నమ్మి 2003లో గడాఫీ ఆ కార్యక్రమాన్ని నిలిపేశారు. 2011లో పశ్చిమ దేశాల అండతో అక్కడ తిరుగుబాటు రాజుకుంది. అంతర్యుద్ధంలో నాటో దళాల అండతో తిరుగుబాటుదార్లు గడాఫీని హతమార్చారు. ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ అది సాధారణ స్థితికి చేరలేదు. అక్కడ అరాచకం తాండవిస్తోంది. నిత్యం కారు బాంబు పేలుళ్లతో, పరస్పర దాడులతో అది అట్టుడుకుతోంది. నిత్యం పదులకొద్దీమంది మరణిస్తున్నారు. లిబియాలో ఏం నిర్వాకం వెలగబెట్టారని అమెరికా ఈ సమయంలో ఉత్తర కొరియాకు దాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది? వర్తమాన లిబియా ఎలా ఉందో ప్రపంచమంతా గమనిస్తున్నా దాన్నొక ‘నమూనా’గా చెప్పడం అమెరికా అహంకార ధోరణికి నిదర్శనం. ఇది బెదిరించడం తప్ప మరేమీ కాదు. నిజానికి గడాఫీకి ఏం గతి పట్టిందో చూశాకే ఉత్తర కొరియా అణ్వస్త్రాల బాట పట్టింది. ఆ పరిస్థితులు రానివ్వబోమని ఉత్తర కొరియాకు గట్టి హామీ ఇచ్చి ప్రశాంతత చేకూర్చడానికి బదులు ఇష్టానుసారం మాట్లాడటం సబబేనా? ఒక అణ్వస్త్ర దేశంతో ఎలా వ్యవహరించాలో ట్రంప్‌కు ముందున్న ఒబామాకు కూడా అర్ధం కాలేదు. కనీసం ఆయన కయ్యానికి కాలుదువ్వలేదు. ట్రంప్ ఆమాత్రం తెలివైనా ప్రద ర్శించలేకపోతున్నారు.తన దగ్గర అణ్వస్త్రాలు పెట్టుకుని అణునిరాయుధీకరణ విషయంలో అందరికీ ఉపన్యాసాలివ్వడమే తప్పనుకుంటే, బెదిరించి దారికి తెచ్చుకుందామని భావించడం మరింత ఘోరం. బెదిరింపులు, హెచ్చరికలు సత్ఫలితాలనీయవు. ఇప్పటికైనా పరిణతితో ఆలో చించి తిరిగి సాధారణ పరిస్థితి ఏర్పడేలా చూడటం, శాంతి చర్చలకు అవసరమైన వాతావరణం ఏర్పర్చడం అమెరికా బాధ్యత. ఏదో ఒక సాకుతో చర్చల నుంచి వెనక్కు తగ్గితే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
మండుతున్న చమురు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరింత ఎగిశాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.15 శాతం బలపడి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ సైతం 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారం అమెరికాలో చమురు నిల్వలు 1.4 మిలియన్ బ్యారళ్లమేర క్షీణించినట్లు ఆ దేశ ఇంధన శాఖ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్ స్టాక్పైల్స్ సైతం 3.79 మిలియన్లు తగ్గిందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. వెనిజులా చమురు సరఫరాలు సైతం తగ్గడం దీనికి మరోకారణంగా మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరా తగ్గుముఖం పట్టడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడురోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. వరుసగా పెట్రోల్ , డీజిల్ ధరలు ఇప్పటికే కొత్త గరిష్టాలను తాకుతున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్-కిమ్ పంచాయితీ..భారత్ పెద్దరికం
ప్యోంగ్యాంగ్: అగ్రరాజ్యం అమెరికా, తూర్పుఆసియా దేశం ఉత్తరకొరియాల మధ్య పంచాయితీ తీర్చడానికి భారత్ పెద్దరికం వహించనుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈమేరకు బుధవారం ప్యోంగ్యాంగ్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చరిత్రాత్మక భేటీపై నీలినీడలు కమ్ముకున్నవేళ భారత మంత్రి పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సింగ్ ఎందుకు వెళ్ళారు?: అణ్వస్త్రాల నిరాయుధీకరణకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించిన కిమ్.. వైరిపక్షాలతో చర్చలకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించడం, జూన్ 12న సింగపూర్‌లో ట్రంప్-కిమ్ భేటీకి రంగం సిద్ధం కావడం తెలిసిందే. అంతలోనే అనూహ్యంగా ప్లేటు ఫిరాయించిన కిమ్.. సదరు చర్చలు ఏకపక్షంగా, కొరియాకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కీలక దశలో చర్చల ప్రక్రియను నిలిపేయడం సరికాదని నచ్చజెప్పేందుకే భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపు తీర్మానంపై భారత్ సైతం సంతకం చేసినప్పటికీ.. మిగతాదేశాల మాదిరి దౌత్యసంబంధాలను మాత్రం తెంచుకోలేదు. ప్యోంగ్యాంగ్లో ఇప్పటికీ భారత దౌత్యకార్యాలయం కొనసాగుతున్నది. 2015లో ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించారు కూడా. ఉత్తరకొరియాతో సుహృద్భావ సంబంధాల నేపథ్యంలోనే భారత్.. ‘ట్రంప్-కిమ్‌ల చర్చ’ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కిమ్‌తో మాట్లాడుతారా?: ప్యోంగ్యాంగ్కు వచ్చిన భారత మంత్రికి ఉత్తరకొరియా మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ట్రంప్-కిమ్‌ల భేటీకి మార్గం సుగమమం చేయాలన్న లక్ష్యంతోనే ఆయన కొరియా ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. అయితే, అధినేత కిమ్ జాంగ్‌తో వీకే సింగ్ మాట్లాడుతారా, లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
రహదారిపై కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
-
కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
వాషింగ్టన్ : జార్జియాలోని ఓ రహదారిపై అమెరికా సైనిక విమానం కుప్పకూలింది. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ విమానం అమెరికా వైమానిక దళంలో సేవలందించింది. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చిందని, దాన్ని స్టోర్ రూమ్‌కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం సవాన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 9 మంది మిలటరీ సిబ్బందితో టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఆ విమానం అగ్నిగుండం వలే నేలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు విమానం రోడ్డుపై పడిన సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. సీ-130 రకానికి చెందిన ఈ కార్గో విమానాన్ని ప్రస్తుతం ప్యూటో రికో ఎయిర్ నేషనల్ గార్డ్స్ వినియోగిస్తున్నారు. నేషనల్ గార్డ్స్ ప్రతినిధి పాల్ డాలెన్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన విమానం 50 ఏళ్ల క్రితం నాటిది అయినప్పటికీ, అది ప్రస్తుతం కండీషన్లోనే ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
బుష్ కుటుంబంలో విషాదం
మిడ్‌లాండ్(టెక్సాస్): అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) సతీమణి బార్బరా పియర్స్ బుష్(92) కన్నుమూశారు. వృద్ధాప్యంలోనూ చలాకీగా వ్యవహరించే ఆమె మంగళవారం ఇంట్లో ఉన్నప్పుడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని బుష్ కుటుంబ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. బార్బరా మరణంతో బుష్ కుటుంబంలో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల ప్రముఖులూ బుష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. 16 ఏళ్లకే ప్రేమ-పెళ్లి: 1925, జూన్ 8న మాన్‌హట్టన్‌లో జన్మించిన బార్బరా పియర్స్ ఆష్లే హాల్ స్కూల్లో గ్రాడ్యువేషన్ పూర్తిచేశారు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు జార్జ్ బుష్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టెక్సాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అనంతరకాలంలో బుష్ రాజకీయాల్లో ఎదిగి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారిలో జార్జ్ బుష్(జూనియర్) కూడా దేశాధ్యక్ష పదవి చేపట్టడం తెలిసిందే. ఫస్ట్‌లేడీగా ఉన్న రోజుల్లో అక్షరాస్యత వ్యాప్తి కోసం బార్బరా కృషిచేశారు. బార్బరా-బుష్ దంపతుల 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదురు సంతానం. 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. సీనియర్ బుష్ (93) సైతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. Statement by the Office of @GeorgeHWBush on the passing of Barbara Pierce Bush this evening at the age of 92. pic.twitter.com/c6JU0xy6Vc — Jim McGrath (@jgm41) 17 April 2018 3. President and Mrs. Bush were married for 73 years. pic.twitter.com/B5P3iOMGU2 — Yashar Ali 🐘 (@yashar) 17 April 2018 -
వైఎస్సార్సీపీకి యుఎస్ఏ ఎన్ఆర్ఐల సంఘీభావం
అమెరికా: ఏపీ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్పార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యుఎస్ఏ ఎన్ఆర్ఐలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ యుఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం అధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బేఏరియా, కాలిఫొర్నియాలో అనేక మంది తెలుగువారు, పార్టీ అభిమానులు కొవ్వుత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ మధులిక మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నిర్వర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేకహోదా ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి అనేక దీక్షలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్‌రెడ్డి పోరాటానికి మద్దతుగా అమెరికా వ్యాప్తంగా హార్ట్పోర్ట్ సిటి, ఫ్రిమౌంట్, డల్లాస్, ఫోరిడా, ఓర్లాండోతోపాటు అనేక నగరాల్లో ప్రదర్శనలు చేసినట్లు తెలిపారు. అమెరాకాలోని తెలుగువారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపి యుఎస్ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డి మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. హార్డ్‌ఫోర్ సిటిలో వైఎస్సాఆర్ సీపీ యుఎస్ఏ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రవీణ్, సహదేవా, హరిమోయ్యి, త్రిలోక్, విజయ్, కొండారెడ్డి, శివ, అమర్, రాఘవ, వెంకట్, నరేంద్ర అట్టునూరి, సుబ్బారెడ్డి భాస్కర్, లోకేష్, శ్రీధర్, రవి కర్రి, వైఎస్సార్సీపీ విధ్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు -
ట్రంప్ మరో ఎటాక్ : చైనా సీరియస్
ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. మరోసారి ట్రంప్, చైనాపై ఎటాక్ చేశారు. 50 బిలియన్ డాలర్ల(రూ.3,24,825 కోట్ల) విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లను విధించింది. వీటిలో హై-టెక్నాలజీ ఉత్పత్తుల నుంచి సెమీ కండక్టర్లు, లిథియం బ్యాటరీల వరకు ఉన్నాయి. మొత్తం 1300 రకాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు విధించింది. అమెరికా ఈ చర్యపై చైనా మండిపడింది. అమెరికా ఉత్పత్తులపై కూడా తాము ఇదే రకంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇటీవలే అమెరికా విధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా, చైనా అమెరికా గూడ్స్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. చైనాకి కౌంటర్‌గా ట్రంప్ మరోసారి మరికొన్ని ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు విధించారు. చైనా హానికరమైన చర్యలను, విధాలను తొలగిస్తున్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఆఫీసు పేర్కొంది. తమ మేథోసంపత్తి హక్కువ విధానాలను మారుస్తున్న 1300 ఉత్పత్తులను టార్గెట్ చేసి, ఈ టారిఫ్‌లను విధించామని ఆఫీసు తెలిపింది. అమెరికా ఆర్థికవ్యవస్థపై, వినియోగదారులపై ప్రభావం తగ్గించే పాలసీ ఆధారంగా అమెరికా ఈ ఉత్పత్తులను ఎంచుకుందని చెప్పింది. ఈ ప్రొడక్ట్‌లలో స్టీల్, టెలివిజన్ కాంపోనెంట్లు, మెడికల్ డివైజ్‌లు, డిష్వాషర్లు, స్నో బ్లోవర్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ నుంచి ఏవియేషన్, ఆటో పార్ట్‌ల వరకు అన్ని రంగాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు పడ్డాయి. అయితే తాజాగా అమెరికా విధించిన టారిఫ్‌లపై, చైనా ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటోదనని ఆసియన్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రస్తుతం విధించిన టారిఫ్‌లను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇంతే భారీ మొత్తంలో అమెరికా ఉత్పత్తులకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాక ఈ విషయాన్ని డబ్ల్యూటీఓ వద్దకు తీసుకెళ్లనున్నట్టు పేర్కొంది. -
పాక్ ప్రధాని తనిఖీపై అమెరికా వివరణ
న్యూ ఢిల్లీ : అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారనే వార్తలు, దానికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో తమ ప్రధాని పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని అమెరికాపై పాక్ గుర్రుగా ఉంది. అయితే తాము ఎందుకు అలా వ్యవహరించాల్సి వచ్చిందో అమెరికా అధికారులు గురువారం వెల్లడించారు. పాక్ ప్రధాని వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వచ్చారని, మిగిలిన ప్రయాణికుల మాదిరే ఆయన కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని..అందుకే తాము అబ్బాసీని కూడా తనిఖీ చేసామని, వ్యక్తిగత పర్యటనలు చేసేవారు ఎవరైనా ఇందుకు మినహాయింపు కాదని యూఎస్ డిప్యూటీ ప్రతినిధి అలెగ్జాండర్ మెక్లారెన్ మీడియాకు వెల్లడించారు. ఆయన పర్యటన అధికారిక పర్యటన అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు వేరుగా ఉండేవన్నారు. పాక్ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అబ్బాసీ అనారోగ్యంతో ఉన్న తన సోదరిని సందర్శించడానికి అమెరికా వెళ్లారు. -
ఫేస్‌బుక్‌పై ఎఫ్‌టీసీ విచారణ షురూ!
వాషింగ్టన్: ఫేస్బుక్ డేటా బ్రీచ్‌పై విచారణను యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టీసీ) ధృవీకరించింది. అమెరికా బ్రిటిష్ కంపెనీ కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో సంబంధాలు, 5కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఫేస్బుక్, గోప్యతా అభ్యాసాలపై విచారణ కొనసాగుతోందని బ్యూరో ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టింగ్ డైరెక్టర్ టామ్ పాల్ వెల్లడించారు. ఎఫ్‌టీసీ చట్ల నిబంధనల ఉల్లంఘనతోపాటు, వినియోగదారులకు హాని కలిగించే అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్బుక్ ప్రైవసీ ఆచరణపై తీవ్ర ఆందోళన రేపిన ఇటీవల ప్రెస్ నివేదికలను పరిశీలిస్తున్నామని, వినియోగదారుల ప్రైవసీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పాల్ చెప్పారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. మరోవైపు అమెరికాలోని 37 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు ఒక లేఖ రాశారు. కోట్లాది వినియోగదారుల డేటా లీక్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు. అనుమతి లేకుండా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్నిథర్డ్ పార్టీకు ఎలా అందిస్తారంటూ ఈ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోప్యతపై చేసిన వాగ్దానాలను భంగపరిచిన ఫేస్‌బుక్‌ను యూజర్లు ఇపుడు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. తమ నమ్మకం వమ్ము అయిందని పేర్కొన్నారు. వినియోగదారుల డేటాను తారుమారు చేయడంలో ఫేస్బుక్ పాత్రపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యూజెర్సీ అటార్నీ జనరల్ గుర్బీర్ ఎస్ గ్రేవల్ సహా 37మంది అటార్నీ జనరల్స్ స ఈ లేఖపై సంతకాలు చేశారు. కాగా అమెరికా ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్ తన ఖాతాదారుల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికాకు విక్రయించిందన్న వార్త ప్రకంపనలు పుట్టించింది. దీంతో తప్పు ఒప్పుకున్న ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ క్షమాపణ కోరడంతోపాటు, దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. అలాగే బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ప్రకటనల రూపంలో క్షమాపణలు కోరారు. యూజర్ల సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందనీ అది చేయలేకపోతే ఈ స్థానానికి అనర్హులమంటూ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే టాప్ టెక్ కంపనీలు ఫేస్బుక్ పేజీలను డిలీట్ చేయడంతో ఈ వివాదంలో యూజర్ల భద్రతపై ఆందోళన మరింత ముదురుతోంది. -
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్( ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. అణుసంబంధిత వ్యాపారం చేసే ఏడు సంస్థలపై అమెరికా నిషేదం విధించడంతో ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలనే పాక్ ఆశలు అడియాశలయ్యాయి. పాక్‌కు చెందిన ఈ సంస్థలు అణు సంబంధిత వ్యాపారం చేస్తూ అమెరికాకు నష్టం చేకూరుస్తాయనే నెపంతో నిషేదం విధించింది. ఉగ్ర కార్యకలాపాలపై నిఘా ఉంచే ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. భారత్‌తో సమానంగా ఎన్ఎస్జీలో సభ్యత్వం కావాలని పాక్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్‌కు ఈ విషయంలో అనేక దేశాల మద్దతు లభించింది. అలాగే క్షిపణి పరిఙ్ఞానం, వాసేనర్ ఒప్పందం, ఆస్ట్రేలియా గ్రూప్‌లో ఇప్పటికే భారత్‌కు సభ్యత్వం ఉంది. సాధారణంగా ఈ సభ్యత్వాలను ఎన్ఎస్జీకి ఎంట్రీగా భావిస్తారు. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలకు పాక్ సహాయపడిందనే వార్తలు రావడంతో ఎన్ఎస్జీలో చేరాలని భావిస్తోన్న పాకిస్తాన్ ఆకాంక్ష వెనుక సదుద్దేశం లేదని అమెరికా గ్రహించింది. తమ జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టే ఆస్కారం ఉందని బలంగా నమ్ముతూ ఈ ఏడు పాకిస్థాన్ సంస్థలపై నిషేధం విధించామని యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఈ జాబితాలో మొత్తం 23 సంస్థలను చేర్చినట్టు తెలిపింది. అయితే పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికే అమెరికా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్‌కి చెందిన ఓ పత్రిక పేర్కొంది. -
పెళ్లికి నిరాకరించిందని ఘాతుకం
సాన్ ఆంటోనియో : తాము తీసుకొచ్చిన సంబంధాన్ని కాదన్నందుకు కూతురి ముఖంపై కాగుతున్న నూనె పోసి దాడి చేసిన సంఘటనలో తల్లిదండ్రులను అరెస్టు చేసినట్టు సాన్ ఆంటోనియో పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఇరాక్‌కు చెందిన ఒక కుటుంబం రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వచ్చి సౌత్ టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. వారు తమ 16 సంవత్సరాల కూతురు వివాహాన్ని ఒక మధ్యవయస్కుడితో నిశ్చయించారు. అందుకు గాను అతడి వద్ద నుంచి 20 వేల అమెరికన్ డాలర్ల సొమ్ము కూడా తీసుకున్నారు. కానీ వారి కుమార్తె ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో కోపించిన తల్లిదండ్రులు బాలికను కొట్టి, ఆమె మీద వేడి వేడి నూనె పోశారు. తల్లిదండ్రుల చర్యలతో బయపడిన బాలిక ఇంటినుంచి పారిపోయింది. ఈ సంఘటన జనవరి 30న జరిగింది. ఇంటినుంచి పారిపోయిన ఆ బాలికను గుర్తించామని, ఆమెను తన ఐదుగురు తోబుట్టువులతో పాటు పిల్లల సంరక్షణ విభాగంలో ఉంచినట్లు పోలీసు అధికారి బెక్సార్ కౌంటి షేరిఫ్ జేవీయర్ సలజార్ వెల్లడించారు. బాలిక తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
7వారాల గరిష్టానికి చమురు ధర
సాక్షి,న్యూఢిల్లీ: అనూహ్యంగా చమురు మరోసారిపైకి ఎగబాకాయి. ముఖ్యంగా అంచనాలకు విరుద్ధంగా అమెరికా ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు బుధవారం మరోసారి వేడెక్కాయి. మంగళవారం పుంజుకున్న చమురు ధరలు మరింత ఎగిసి ఏడువారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. వాషింగ్టన్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కనిపిస్తోందనీ, ఇది ముడి చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీయనుందని డెన్మార్క్ సాక్సో బ్యాంక్ కమొడిటీ స్ట్రాటజిస్ట్ హెడ్ ఓలే హాన్సెన్ పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కూడా చమురు ధరలకు తోడ్పడుతున్నాయని విశ్లేషకుల అంచనా. యూఎస్ మార్కెట్ నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం బలపడి 65.39 డాలర్లను తాకగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.3 శాతం ఎగసి దాదాపు 70 డాలర్లకు చేరింది. వెరసి ఏడు వారాల గరిష్టానికి చమురు ధరలు చేరాయి. కాగా.. ప్రస్తుతం నైమెక్స్ 65.22 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బ్రెంట్ బ్యారల్ 69.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మార్చి 16తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 2.74 మిలి యన్ బ్యారళ్లమేర తగ్గినట్లు మంగళవారం అమెరికా ఇంధన శాఖ వెల్లడించింది. వాస్తవానికి 2.55 మిలియన్ బ్యారళ్లమేర నిల్వలు పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో 5మిలియన్ బ్యారళ్లమేర అంచనాలు తారుమారు కావడంతో చమురు ధరలు భారీగా పెరిగాయని నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామంటూ సౌదీ అరేబియా ప్రకటించడం, వెనిజులాలో చమురు ఉత్పత్తి గత నెలలో 1.54 మిలియన్ బ్యారళ్లమేర తగ్గడం వంటి అంశాలు సైతం ధరల మంట పుట్టించినట్లు నిపుణులు తెలియజేశారు. -
భారతీయుల జెనోమిక్స్ విశ్లేషణ
లండన్: మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యూఎస్, యూకేలకు చెందిన రెండు కంపెనీలు జతకట్టాయి. ఇందుకోసం అవి భారతీయుల జెనోమిక్స్ (మాలిక్యులర్ బయాలజీలో ఓ భాగం) సమాచారాన్ని వాడుకోనున్నాయి. అరుదైన రోగాలను అధునాతన పద్ధతుల ద్వారా గుర్తించి మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతో కేంబ్రిడ్జిలోని గ్లోబల్ జెనె కార్ప్ (జీజీసీ), న్యూయార్క్‌లోని రీజనరాన్ జెనెటిక్స్ సెంటర్ (ఆర్జీసీ)లు సంయుక్తంగా భారత్‌లో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతీయుల జెనోమిక్స్ సమాచారాన్ని విశ్లేషించి, వ్యాధులను గుర్తించేందుకు, చికిత్స అందించేందుకు మెరుగైన మార్గాలను కంపెనీలు సూచించనున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో జెనోమిక్స్ సమాచారాన్ని ఈ కంపెనీలు పరిశీలించనున్నాయి. ఈ ప్రాజెక్టుతో భారత్‌లో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తాయనీ, ఇటీవల ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకం వంటి లక్ష్యాలను సాధించడంలో జెనోమిక్స్ సమాచారం సాయపడుతుందని ఇన్వెస్ట్ ఇండియా అనే కంపెనీ సీఈవో చెప్పారు. ముంబై, అహ్మదాబాద్‌లలో జీజీసీకి మౌలిక వసతులను సమకూర్చే పనిని ఇన్వెస్ట్ ఇండియా చూసుకుంటోంది. -
అప్పుడు అమెరికా..ఇప్పుడు ఆస్ట్రేలియా..
ముంబై : అమెరికా అంటే ఒకప్పుడు ఉన్నత విద్యకు, ఉపాధి అవకాశాలకు కల్పతరువు వంటిది. ఉన్నత విద్య, ఉపాధి కోసం మనలో చాలా మంది అమెరికా వెళ్లాలని ఉవ్విళ్ళూరిన వారున్నారు. అప్పుడు అనుకున్నదే తడవుగా అమెరికా వెళ్లడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారాయి. ప్రస్తుతం అక్కడ వీసా నిబంధనలు, వలస విధానం ఎంత కఠినంగా మారాయో ఈసారి మన విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్యను చూస్తే అర్థం అవుతుంది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వేర్వేరు దేశాల వ్యక్తులకు జారీ చేసే వీసాల సంఖ్య 2016లో 5.02లక్షలు ఉండగా 2017, సెప్టెంబరు 30 నాటికి ఈ సంఖ్య 16శాతం తగ్గి 4.21లక్షలకు పడిపోయింది. 2016లో 65,257మంది భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేయగా 2017 నాటికి ఆ సంఖ్య 47,302కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా... 2017 సెప్టెంబర్ 30నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.93లక్షల మంది విద్యార్థులకు ఎఫ్1 కేటగిరికి సంబంధించిన వీసాలను, వారి కుటుంబ సభ్యులకు(జీవిత భాగస్వాములు, పిల్లలకు) ఎఫ్2 కేటగిరికి సంబంధించిన వీసాలను మంజూరు చేసింది. వీరిలో 68శాతం ఆసియా ఖండానికి చెందిన వారే ఉన్నారు. వారిలోనూ 40శాతం మంది భారత్, చైనాలకు చెందినవారు కావడం విశేషం. 2017లో 2.86లక్షల వీసాలను ఆసియా దేశాల వారికి జారీ చేశారు. 2016తో పోలిస్తే ఇది 20శాతం తగ్గింది. గతంలో.... ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు విద్యార్థులకు జారీ చేసే వీసాల సంఖ్య ఎక్కువగా ఉండేది. 2015లో ఈ సంఖ్య 6.50లక్షలు. గత సంవత్సరం నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్1-బీ దరఖాస్తుదారులు వర్క్ వీసా, అమెరికా పౌరసత్వం, వలస సేవల ప్రయోజనాలు పొందడం కఠినంగా మారింది. ప్రస్తుంతం వారికి చెల్లిస్తున్న వేతనాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అమెరికా వెళ్లలనుకునే ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం అక్కడ ఉద్యోగం చేయాలంటే ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించాలి అనే నిభందన ఉండటం . వీటన్నిటి ఫలితంగా ఇంతకాలం అమెరికా...అమెరికా అని పలవరించిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఆస్ట్రేలియా,కెనడా వైపు చూస్తున్నారు. -
ఆ వీడియోలో ఉన్నదదేనా.....?
వాషింగ్టన్ : గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు. ఒక వేళ ఉంటే...అనే ఊహకు రూపమిస్తూ ఎన్నో సినిమాలు, వార్తలు, వార్తాకథనాలు. చివరకు భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ గ్రహాంతర వాసుల గురించి మాట్లాడారు. గ్రహాంతర వాసులు ఉంటే వారు మనకంటే శక్తివంతులు,తెలివిగలవారై ఉంటారని చెప్పారు. గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. గ్రహాంతరవాసులను ఎవరు చూడలేదు కానీ ‘ఫ్లైయింగ్ సాసర్’ అని పిలిచే ‘యూఎఫ్ఓ’లను చూశామని చాలామంది చెప్పారు. వీటి ఫోటోలు కూడా పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఈ మధ్యే అమెరికా రక్షణ శాఖ వారు విడుదల చేసిన ఒక వీడియో. 35సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ఎఫ్/ఏ-18 సూపర్ హర్నెట్ మిలిటరీ జెట్ విమానం తూర్పు తీరం వెంట ఒక అసాధారణ వస్తువును కనుగొన్నది.అది చూడ్డానికి గుడ్డు ఆకారంలో ఉండి చాలావేగంతో ప్రయాణిస్తుంది. ఈ వింత వాహనాల గురించి తెలుసుకోవడానికి వీరు 2007 నుంచి 2012 వరకు ‘అడ్వాన్స్డ్ ఏవీయేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్’ అనే కార్యక్రమం ద్వారా ప్రయోగాలు చేశారు. గతంలో... 1947-1969 మధ్యకాలంలో దాదాపు 12వేల కంటే ఎక్కువ మంది వీటిని చూశామని చెప్పారు. కానీ ఎవ్వరూ నిరుపించలేకపోయారు. 2004లో అమెరికాకు చెందిన నావీ పైలెట్ కమాండర్ డెవిడ్ ఫ్రేవర్ తాను గతంలో ఎన్నడూ చూడని ఒక అరుదైన వస్తువు ఆకాశంలో విహరించడం చూశానని చెప్పారు. ఆ వస్తువు తన విమానం అంత పెద్దగా ఉండి అత్యధిక వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. 80,000 అడుగుల నుంచి 20,000 అడుగులు కిందకు ప్రయాణించిన ఆ వస్తువు అనంతరం కనిపించకుండా పోయిందని చెప్పారు. ఫ్రేవర్ మాట్లాడుతూ ఆ వస్తువు సమీపంలోకి వెళ్లినప్పుడు నా ముక్కును వెనక్కు నెట్టుతున్నట్లు అనిపించింది. అంత వేగంతో ప్రయాణించే వస్తువును నా జీవితంలో ఇంతవరకూ చూడలేదు అన్నారు. ఇన్నేళ్ల తర్వాత... మళ్లీ 13 సంవత్సారాల తర్వాత సరిగ్గా అలాంటి వస్తువునే స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ఎఫ్/ఏ-18 సూపర్ హర్నెట్ మిలిటరి జెట్ విమానం గుర్తించింది. ఈ వస్తువు కచ్చితంగా భూమికి సంబంధించినది మాత్రం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఆ వీడియోలో ఉన్నదదేనా.....?
-
ఆటా ఆధ్యర్యంలో విరాళల సేకరణ
అట్లాంట : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో విరాళల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్యతో పాలు పలువురి సింగర్స్ పాల్గొని ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఈవెంట్‌తో సుమారు రూ.1 కోటి 46 లక్షల విరాళాలు వచ్చాయని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలని నిర్వాహకులు తెలిపారు. తెలుగు ప్రజల సంక్షేమానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. -
41,806 డాలర్లు పలికిన అరుదైన చిత్రం
న్యూ ఢిల్లీ : మహాత్ముడి సంతకంతో ఉన్న అరుదైన చిత్రాన్ని అమెరికాలో వేలం వేశారు. వేలంలో ఈ ఫోటో 41,806 డాలర్లు (సుమారు రూ. 27లక్షలు) పలికింది. ఈ ఫొటోలో మహాత్మా గాంధీతో పాటు మదన్ మోహన్ మాలవ్య కూడా ఉన్నారు. ఫొటో మీద మహాత్ముడు ‘ఎంకే గాంధీ’ అని ఫౌంటెన్ పెన్‌తో సంతకం చేశారు. ఈ ఫోటో 1931 సెప్టెంబరులో లండన్‌లో రెండో సెషన్ భారత రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం తీసిందని బోస్టన్‌కు చెందిన ఆర్ ఆర్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్ స్టన్ వెల్లడించారు. భారత నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. 53,000 డాలర్లు పలికిన కారల్ మార్క్స్ ఉత్తరం ఇదే వేలంలో 19వ శతాబ్దానికి చెందిన కమ్యూనిస్టు, ఫిలాసఫర్ కారల్ మార్క్స్ రాసిన అరుదైన ఉత్తరాన్ని కూడా వేలం వేశారు. 1879, అక్టోబర్ 1న రాసిన ఈ ఉత్తరం 53 వేల డాలర్లు పలికింది. లండన్ నుంచి పంపించిన ఈ ఉత్తరంలో కారల్ మార్క్స్ తన పుస్తకం ‘రివిలేషన్స్’ను ఒక కాపీ పంపించమని రాడికల్ ఇంగ్లీష్ ఎడిటర్ కొల్లెట్ డబసన్ను కోరారు. -
కిమ్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్
వాషింగ్టన్ : అమెరికా, ఉత్తర కొరియా మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం సమసిపోయే సంకేతాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలకు మార్గం సుగమమైంది. ట్రంప్‌ని చర్చలకు ఆహ్వానిస్తూ గురువారం వైట్ హౌస్‌ని సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు కిమ్ పంపిన లేఖను అందజేశారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న చర్చల సారాంశాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ట్రంప్ ట్వీటర్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. కిమ్‌తో దక్షిణ కొరియా ప్రతినిధులు, అణు క్షిపణుల నియంత్రణకు జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ఇటీవల క్షిపణి పరీక్షలకు దూరంగా ఉండటాన్ని ఆయన స్వాగతించారు. ఒప్పందాలు కుదిరే వరకు ఇది ఇలాగే కొనసాగాలన్నారు. సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ట్రంప్, కిమ్‌ల మధ్య మేలో ముఖాముఖీ భేటీ జరిగే అవకాశం ఉంది. ప్రపంచానికి పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికాకు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొరకరాని కొయ్యలా తయారయిన విషయం తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్, కిమ్‌ల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. కిమ్ ఏ మాత్రం తగ్గకుండా తమ అణు క్షిపణులతో ప్రపంచానికే పెను సవాలు విసురుతూ వచ్చారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ శాంతి చర్చల ద్వారా వివాదానికి తెర దించాలని ఇరు దేశాలకు సూచించాయి. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి కిమ్ వైఖరిలో మార్పు చోటుచేసుకుంది. ఉప్పూనిప్పుగా ఉన్న ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు సడలాయి. ఇటీవలే పొరుగు దేశమైన దక్షిణ కొరియా అధికారులు చర్చల కోసం దశాబ్ధ కాలం తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే కిమ్ సోదరి దక్షిణ కొరియాలో జరిగిన ఒలంపిక్స్‌కి హాజరవ్వడంతో, చర్చలు సత్ఫాలితాలు ఇచ్చే సంకేతాలు వెలువడ్డాయి. Kim Jong Un talked about denuclearization with the South Korean Representatives, not just a freeze. Also, no missile testing by North Korea during this period of time. Great progress being made but sanctions will remain until an agreement is reached. Meeting being planned! — Donald J. Trump (@realDonaldTrump) March 9, 2018 -
ట్రంప్ నిర్ణయంతో తక్షణ ప్రమాదమేమీలేదు
సాక్షి, న్యూఢిల్లీ: స్టీల్ దిగుమతులపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. తక్షమే తమ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం వుండదని ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అమెరికాకు మన ఎగుమతులు కేవలం 2 శాతం మాత్రమేననీ, ప్రస్తుతానికి ఎలాంటి భారం పడదని ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ్ శర్మ చెప్పారు. అన్ని దేశాలు అమెరికా పద్ధతిని పాటిస్తే నిస్సందేహంగా అంతర్జాతీయ వాణిజ్య క్రమంలో తీవ్రప్రభావాన్ని చూపిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. చైనా ఐరన్ అండ్ స్టీల్ అసోసియేషన్ వైస్-సెక్రటరీ జనరల్ లి జిన్ చాంగ్ మాట్లాడుతూ, చైనాపై ప్రభావం పెద్దగా ఉండదన్నారు. కాగా అమెరికా ప్రభుత్వం స్థానికి ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీగా సుంకం విధించే యోచనలో ఉంది. చైనా, యూరోప్, పొరుగు దేశం కెనడా లాంటి ప్రధాన వాణిజ్య భాగస్వాముల స్టీల్ దిగుమతులపై భారీ సుంకం విధించనున్నామని ట్రంప్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా చైనాలాంటి దేశాలనుంచి గతకొన్ని దశాబ్దాలుగా అమెరికా స్టీల్ అల్యూమినియం కంపెనీలు అగౌరవానికి గురయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అందుకే దేశరక్షణ కోసం గొప్ప గొప్ప స్టీల్ మేకర్స్, అల్యూమినియం మేకర్స్ తయారు కావాలన్నారు. అమెరికాలో ఉక్కు , అల్యూమినియం పరిశ్రమలను పునర్నిర్మిం చాలని ట్రంప్ పేర్కొన్నారు. -
అమెరికాలోనూ ప్రత్యేక హోదా పోరు
-
చిరు, మహేష్ ‘మా’కు రెండు రెక్కలు..
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) భవనాలకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబుల పేర్లను పెట్టనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు. ఈ ఏడాదితో ‘మా’ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు ‘మా’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అమెరికాలో సెలబ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబులు ‘మా’ కు రెండు రెక్కలు అని కొనియాడారు. ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తోడుగా ఉన్నవారందరికి మా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ‘యూఎస్‌లో మా కార్యక్రమానికి చిరంజీవి పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేశారు. సైరా సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నప్పటికి ఆహ్వానించగానే ఏమి ఆలోచించకుండా వస్తానని చెప్పారు. మహేశ్ బాబు కూడా యూఎస్‌లో జరిగే మా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ ఇద్దరి హీరోలకు ‘మా’ ఎప్పటికి రుణపడి ఉంటుందని’ మా అధ్యక్షుడు అన్నారు. ‘మా’ ఉత్సవాలకు మద్దతుగా నిలిచిన సీనియర్ హీరోలు బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మిగిలిన హీరోలకు మా అధ్యక్షుడు శివాజీ రాజా కృతజ్ఞతలు చెప్పారు. -
ప్రైవేటుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)ను అమెరికా త్వరలోనే ప్రైవేటీకరించనుందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. భారీగా నిధులు వెచ్చించాల్సిరావడంతో ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతల నుంచి 2025 నాటికి అమెరికా తప్పుకోనుందని నాసాకు చెందిన పత్రాలను ఉటంకిస్తూ వెల్లడించింది. నాసా, రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ఐఎస్ఎస్ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో వాణిజ్య అవసరాలకు ఐఎస్ఎస్ను నాసా ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశముందని వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనంలో పేర్కొంది. ఐఎస్ఎస్ నిర్వహణకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.963.97 కోట్లు అవసరమవుతాయని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిందని పోస్ట్ తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి వీలుగా ఆయా సంస్థల నుంచి అభివృద్ధి ప్రణాళికల్ని, మార్కెట్ వ్యూహాలను నాసా కోరే అవకాశముందని వెల్లడించింది. 1998లో ఐఎస్ఎస్ను ప్రయోగించడంతో పాటు అభివృద్ది చేసేందుకు ఇప్పటివరకూ అమెరికా రూ.6.42 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)ను ఖర్చుచేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణకు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తంకావొచ్చని అభిప్రాయపడింది. -
అమెరికా వలస జీవితంలో ఉద్విగ్నక్షణాలు
డెట్రాయిట్ : దేశాల మధ్య గోడలు కడతానన్నాడు. అయితే ఆ గోడలు.. ప్రాంతాలనేకాదు మనుషుల్ని, వారి మధ్య పెనవేసుకున్న అనుబంధాల్ని కూడా విడదీస్తాయన్న సంగతి మర్చిపోయాడు. అవును. మనం మాట్లాడుతున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే. ఆయన ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో అమెరికాలో వసలదారులు ఎంతగా క్షోభపడుతున్నది ఈ ఒక్క కథనం చదివితే అవగతమవుతుంది.. ఆ వలసదారుడి పేరు జార్జి గార్సియా. వయసు 39. భార్యాపిల్లలతో డెట్రాయిట్(మిచిగాన్ రాష్ట్రం)లో ఆనందంగా గడిపేవాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి శాంతి కరువైంది.. ‘నువ్ పుట్టుకతో అమెరికన్వి కాదు కాబట్టి ఇక్కడినుంచి వెళ్లిపో’ అని అధికారులు జార్జిని ఆదేశించారు. తన భార్య జన్మతః అమెరికనే అని, ఇద్దరు పిల్లలున్నారని, చాలా ఏళ్ల నుంచి పన్నులు కడుతూ అమెరికా చట్టాలను గౌరవిస్తున్నానని జార్జి ఎంత వాదించినా అధికారులు వినిపించుకోలేదు. కనీసం నూతన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ ఆరైవల్స్ చట్టం(డీఏసీఏ) అమలులోకి వచ్చేంత వరకైనా ఆగమంటే ఆగలేదా అధికారులు! తీవ్రమైన నిర్బంధం నడుమ జార్జి గార్సియా జనవరి 15న స్వదేశమైన మెక్సికోకు పయనమయ్యాడు. ఆ రోజు..నల్లజాతీయులు,వలసదారుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్‌కింగ్ జయంతి కూడా! జార్జికి వీడ్కోలు చెప్పలేక, ఉండమనే అధికారంలేక.. ఎయిర్‌పోర్టులో ఆ కుటుంబం అనుభవించిన బాధ పలువురిని కంటతడిపెట్టించింది. జార్జి తన ఇద్దరు పిల్లలు, భార్యను గట్టిగా హత్తుకున్నాడు. ఇదే చివరిసారి అన్నట్లు వారి కళ్లలోకి చూశాడు. ‘పద పదా..’ అంటూ అధికారులు అతన్ని లోనికి తీసుకెళ్లారు. మాటరాని భాషలో భారంగా తన వారికి వీడ్కోలు ఇచ్చి అతను ముందుకు కదిలాడు... ట్రంప్ ఫర్మానా ప్రకారం మరో పది సంవత్సరాల దాకా జార్జి అమెరికాలో అడుగుపెట్టేవీలులేదు! ట్రంప్ వలస నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎయిర్‌పోర్టులో నిరసనలు జార్జి గార్సియా కుటుంబం(ఫైల్) -
9/11 ఉగ్రదాడి ; కుండబద్దలుకొట్టిన సౌదీ
న్యూయార్క్ : అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసి, అటుపై అనేక యుద్ధాలకు కారణమైన ‘సెప్టెంబర్ 11 ఉగ్రదాడి’కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదా ఉగ్రవాదులు జరిపిన దాడులతో తనకేమాత్రమూ సంబంధంలేదని సౌదీ అరేబియా తేల్చిచెప్పింది. 2001నాటి దాడుల్లో భాగం పంచుకున్న ఉగ్రవాదులకు నిధులు అందజేసినట్లు వచ్చిన ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని పేర్కొంది. మాన్‌హట్టన్ కోర్టులో గురువారం జరిగిన విచారణలో సౌదీ తరఫు న్యాయవాది మిచెల్ కెల్లాగ్ ఈ మేరకు వాదనలు వినిపించారు. మూలాలు సౌదీలోనే! : అల్‌కాయిదాకు సౌదీ అరేబియానుంచి పెద్ద మొత్తంలో నిధులు వెళ్లాయని, ఆ నిధులతోనే ఉగ్రవాదులు సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడ్డారని.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, సీఐఏ, 9/11కమిషన్, 9/11 రివ్యూ కమిషన్లు పలు రిపోర్టుల్లో పేర్కొన్నాయి. దాడుల్లో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదుల్లో అత్యధికులు సౌదీ జాతీయులేనన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు నిధులందించే వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చంటూ నాటి రిపబ్లికన్ ప్రభుత్వం ‘జస్టా’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ 9/11 సంబంధిత కేసుల్లో సౌదీని కూడా నిందితురాలిగా పేర్కొంటూ పలువురు బాధితులు కోర్టుల్లో దావాలు వేశారు. అది తప్పు.. ఒక్క ఆధారమూ లేదు: అమెరికా అధికారుల రిపోర్టుల్లోనూ సౌదీని నిందితురాలిగా పేర్కొనే ఏ ఒక్క ఆధారమూ లేదని న్యాయవాది మిచెల్కెల్లాంగ్ వాదించారు. ‘‘ఏవో కొన్ని ఊహాగానాలు, ముక్తాయింపుల ఆధారంగా నిందలు వేయడం సరికాదు. 9/11 దాడుల్లో సౌదీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలులేవు’’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం రిపబ్లిక్ ప్రభుత్వం చేసిన ‘జస్టా’ చట్టాన్ని 2016లో ఒబామా వీటో చేసిన సంగతి తెలిసిందే. సౌదీ తాజా వాదనలపై బాధితులు, అమెరికా ప్రభుత్వం స్పందించాల్సిఉంది. -
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 కాదు.. 51
కాలిఫోర్నియా : అమెరికాలో ఎక్కువ మంది నివసిస్తోన్న రాష్ట్రమైన కాలిఫోర్నియాను రెండు ముక్కలుగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంది. ‘న్యూ కాలిఫోర్నియా మూమెంట్’ పేరుతో విభజన కోసం పోరాడుతున్న ఉద్యమకారులు సోమవారం తమకు తామే కొత్త రాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు. ‘ఇవాళ్టి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 కాదు 51’ అంటూ నినాదాలు చేశారు. కొత్త రాష్ట్రం అవసరమేంటి? : ప్రస్తుతం కాలిఫోర్నియాలో నియంతృత్వ పాలన నడుస్తున్నదని ‘న్యూ కాలిఫోర్నియా’ మూమెంట్ ఆరోపిస్తోంది. ‘‘పన్ను వసూళ్ల తీరు, ప్రభుత్వ నియంత్రణలేమి, ఏక పార్టీ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గంలో సమస్యలను పరిష్కరిచలేం’ అని ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న టామ్ రీడ్ చెప్పుకొచ్చారు. తీర ప్రాంతాన్ని వదిలెయ్యండి : కాలిఫోర్నియా రాష్ట్రంలో మొత్తం 58 కౌంటీలు ఉన్నాయి. వాటిలో ఫసిపిక్ తీరాన్ని ఆనుకుని ఉండే కౌంటీలను.. మిగతా కౌంటీల నుంచి వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ‘న్యూ కాలిఫోర్నియా’ స్వీయ రాష్ట్ర ప్రకటనపై ఫెడరల్ అధికారులు, రాజకీయ పార్టీలు స్పందించాల్సి ఉంది. -
అమెరికాలో అకృత్యం : కన్నబిడ్డలు 13 మందిని..
కాలిఫోర్నియా : ఒక్కరుకాదు ఇద్దరు కాదు సొంతపిల్లలు 13 మందిని చైన్లు, తాళ్లతో కట్టేసి, తిండిపెడ్డకుండా నరకం చూపించారా తల్లిదండ్రులు! తిండిలేక చిక్కిపోయి, తీవ్రమైన దుర్గంధంలో పడిఉన్న వారిని ఎట్టకేలకు పోలీసులు కాపాడారు. అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ అకృత్యం కాలిఫోర్నియా రాష్ట్రం రివర్సైడ్ కంట్రీలోని పెర్రిస్ పట్టణంలో వెలుగుచూసింది. ఓ పాప తప్పించుకుని 911కు ఫోన్ చేయడంతో..: డేవిడ్ అలెన్ టర్ఫిన్ - ఆనా టర్ఫిన్ దంపతులకు 13 మంది సంతానం. వారంతా 2 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారు. పెర్రిస్ శివారులోని రెండస్తుల ఇంట్లో ఉంటున్నారు. అంతమంది పిల్లలున్న ఆ ఇంట్లో.. చాలా నెలలుగా అలికిడి లేకపోయినా చుట్టుపక్కలవారు అంతగా పట్టించుకోలేదు. చైన్లు, తాళ్లతో పిల్లలందరినీ మంచాలకు కట్టేసి, అలెన్-ఆనాలు కూడా లోపలే ఉండిపోయారు. బందీలుగా ఉన్న పిల్లల్లో ఓ పాప మొన్న ఆదివారం ఇంట్లో నుంచి తప్పించుకుని 911కు ఫోన్ చేసి విషయం చెప్పింది. నిమిషాల వ్యవధిలోనే పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దుర్భరస్థితిలో పడిఉన్నవారిలో ఎనిమిది మంది మైనర్లుకాగా, మిగిలిన ఏడుగురూ 18ఏళ్లుపైబడినవారే! బాధితులందరినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. తల్లిదండ్రుల్ని అరెస్టు చేసి పలుసెక్షన్లకింద కేసు నమోదుచేశారు. ఎందుకుచేశారిలా? : అలెన్-ఆనా దంపతులు సొంతపిల్లలనే ఎందుకు టార్చర్ పెట్టారనే కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. పిల్లలు ఇంకా షాక్‌లోనే ఉన్నారని, వారు కోలుకున్న తర్వాతే అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. పిల్లలు బందీలుగా ఉన్న ఇల్లు, ఇన్సెట్లో నిందితులు అలెన్,ఆనా -
అమెరికాకు గట్టి షాకిచ్చిన ఇండియా
జెనీవా : పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాగా తెరిచే భారత్.. సౌర శక్తి (సోలార్ ఎనర్జీ) విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అమెరికాలో తయారయ్యే సోలార్ సెల్స్, మాడ్యుల్స్ల దిగుమతిపై విధించిన ఆంక్షలు ముమ్మాటికి సరైనవేనని పేర్కొంది. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం ‘సౌరశక్తి ఉత్పత్తి పరికరాల సరఫరా’ ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించగా, అసలు తప్పు అమెరికాదేనని భారత్ వాదించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఈ మేరకు సోమవారం ఒక ప్రటకనలో ఈ వివరాలను పేర్కొంది. ఏమిటీ వివాదం? : కాలుష్యరహిత సంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2011లో సౌర విద్యుత్ విధానం(సోలార్ పవర్ పాలసీ)ని రూపొందించుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యురాలైన భారత్ ఆ సంస్థ నిబంధనల ప్రకారం అమెరికాకు చెందిన సోలార్ పరికరాల సంస్థల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. అయితే, విదేశీ కంపెనీల పోటీ ఎక్కువ కావడంతో దేశీయ సోలార్ ఎనర్జీ కంపెనీలు, పరికరాల తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో భారత ప్రభుత్వం.. ‘సోలార్ ప్యానెళ్లలోని మాడ్యుల్స్, సెల్స్‌లు ఇక్కడ తయారుచేసినవే అయి ఉండాలని’ నిబంధన తీసుకొచ్చింది. భారత్ నిబంధనను తప్పుపడుతూ 2013లో అమెరికా.. డబ్ల్యూటీవో ఆధ్వర్యంలోని వాణిజ్య కోర్టు(జెనీవా)ను ఆశ్రయించింది. సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాల్లో ఇరుదేశాలు తమతమ వాణిని వినిపించాయి. తాజాగా ‘నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ జరిమానా కట్టాలని’ అమెరికా మెలిక పెట్టింది. భారత్ వాదన : అమెరికా ఆరోపణలను తిప్పికొడుతూ భారత్ గట్టి వాదన వినిపించింది. ‘డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించే అధికారం మాకు ఉంది. అదేసమయంలో ఆంక్షల సాకు చెప్పి ఒప్పందాల నుంచి తప్పుకోవాలని చూస్తే అది అమెరికా తన పక్షపాతవైఖరిని బయటపెట్టుకున్నట్లవుతుంది. నిబంధనల విషయంలో మేం(భారత్) ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. కాబట్టి అమెరికా చెప్పేదాంట్లో విషయంలేదు’’ అని భారత్ పేర్కొంది. -
హెచ్–1బీ వీసాపై మరో బాంబ్!
-
కిమ్ జాంగ్ న్యూఇయర్ మెసేజ్
-
గగుర్పొడిచే రీతిలో కిమ్ న్యూఇయర్ మెసేజ్
పోంగ్యాంగ్ : అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన కిమ్ జాంగ్ ఉన్ కొత్త ఏడాదిని తనదైన స్టైల్లో జరుపుకొన్నారు. ఏ శక్తీ ఛేధించలేని అణ్వస్త్రదేశంగా ఉత్తరకొరియా మారాలంటూ ప్రజలకు సందేశమిచ్చారు. అదే సమయంలో శత్రుదేశాల ఒళ్లుగగుర్పొడిచేరీతిలో హెచ్చరికలు చేశారు. ‘‘నా టేబుల్‌పై ఎప్పుడూ ఒక బటన్ ఉంటుంది. నొక్కితే అంతా బుగ్గిపాలే. అది.. న్యూక్లియర్ వెపన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇక ముఖ్యమైన విషయం.. అణ్వస్త్రాల తయారీని మనం ఇంకా వేగవంతం చేయాలి. ఖండాంతర క్షిపణులను పెద్ద ఎత్తున మోహరింపజేయాలి. ప్రపంచంలోని ఏ శక్తీ మన(ఉత్తరకొరియా) జోలికి రాకుండా చూసుకోవాలి’’ అని కింమ్ జాంగ్ నూతన సంవత్సర సందేశంలో చెప్పారు. ప్రపంచ దేశాల అభ్యర్థనను, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పెడచెవినపెడుతూ ఉత్తరకొరియా తన అణ్వస్త్రాలను పెంపొందించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ దేశం గత ఏడాది అణుబాంబులతోపాటు హైడ్రోన్ బాంబును కూడా పరీక్షించింది. దారికి రాకుంటే యుద్ధం తప్పదన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొరియా ఇంకాస్త రెచ్చిపోయి ఆయుధసంపత్తిని కూడబెట్టుకుంటోంది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని కిమ్ దేశం స్పష్టం చేసింది. -
ట్రంప్ పరిపాలనకు ఊహించిన రేటింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై భారీ ఎత్తున అసమ్మతి వెల్లువెత్తింది. పదవి చేపట్టిన తొలినాళ్లలో ఆయనకు లభించిన మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రఖ్యాత సర్వే సంస్థ ‘రాస్మెస్సన్ రిపోర్ట్స్’.. ట్రంప్ తొలి ఏడాది పాలనపై నిర్వహించిన ఓటింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ మొదటి ఏడాది పనితీరుకు 53 శాతం అసమ్మతి రాగా, కేవలం 46 శాతం మాత్రమే ఆమోదం లభించింది. తన ఏడాది పాలనలో వీసా, వర్క్ పర్మిట్ల కోతలు మొదలు ఇస్లామిక్ దేశాలపై ఆంక్షలు, కొరియాతో యుద్ధ సన్నాహాలు లాంటి సంచలన నిర్ణయాలెన్నో ట్రంప్ తీసుకున్న సంగతి తెలిసిందే. 2017 జనవరి 20న ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు 56 శాతంగా ఉన్న అప్రూవల్ రేటింగ్.. క్రమంగా తగ్గుతూ ఆగస్టు నాటికి కనిష్టంగా 38 శాతానికి చేరింది. డిసెంబర్ 28 నాటికి ట్రంప్ పెర్మార్మెన్స్ అప్రూవల్ రేటింగ్ 46శాతంగా ఉందని రాస్మెన్సన్ సర్వేలో వెల్లడైంది. అమెరికా అధ్యక్ష సమకాలీన చరిత్రలో ఇంత తక్కువ రేటింగ్ పొందింది ట్రంప్ ఒక్కరేనని ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది. చైనా, కొరియాలపై మండిపాటు : కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాకు ఇప్పటికే లెక్కలేనన్ని హెచ్చరికలు చేసిన అమెరికా తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సమాజం అభ్యర్థనను పక్కనపెట్టి మరీ ఉత్తరకొరియాకు ఆయిల్ సరఫరా చేస్తోన్న చైనాపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘చైనా ఇంకా ఉత్తరకొరియాకు ఆయిల్ సరఫరా చేస్తుండటం బాధాకరం. ఇలాంటి చర్యలు.. స్నేహపూర్వక పరిష్కారాలకు విఘాతం కలిగిస్తాయి’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
షాకింగ్ : యజమానిని చంపేసిన పెంపుడు కుక్కలు
గూచ్‌లాండ్ : విశ్వాసానికి మారు పేరుగా చెప్పుకునే పెంపుడు కుక్కలే ఆ యజమానురాలి పాలిట క్రూరమృగాలయ్యాయి. అత్యంత దారుణంగా ఆమె పీకను కొరికేసి ప్రాణాలు తోడేశాయి. ఎన్నెన్నో కేసులు చేధించిన పోలీసులు సైతం బిత్తరపోయేలా చేసిన ఈ గటన అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని గూచ్లాండ్లో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. కుక్కలతో మార్నింగ్ వాక్కు వెళ్లి.. : బెతాని లిన్ స్టీఫెన్స్ అనే 22 ఏళ్ల యువతి.. గురువారం(డిసెంబర్ 14) ఉదయం పెంపుడు కుక్కలు రెండింటిని వాకింగ్‌కు తీసుకెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు తలా ఓ దిక్కుకు వెళ్లి గాలించారు. తర్వాతి రోజు (శుక్రవారం) ఉదయం.. ఇంటికీ కిలోమీటర్ దూరంలో కుక్కలను గుర్తించాడు బెతాని తండ్రి. ‘ కుక్కలు నిల్చున్న చోట ఏదో జంతువు పడిపోయి ఉన్నట్లు అనిపించింది. తీరా దగ్గరికి వెళ్లాక ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయా’ అని ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. పలు కోణాల్లో దర్యాప్తు : పిట్ బుల్ జాతికి చెందిన ఆ రెండు కుక్కలే బెతాని పీక కొరికి, ముఖాన్ని రక్కేసి చంపేశాయని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కుక్కల దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో మృతురాలి చేతులకు కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. నమ్మశక్యంకాని ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో పరిశీలన చేశారు. బెతానిని ఎవరైనా హత్యచేసి ఉంటారనిగానీ, లేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని, వైద్యులు నిర్ధారించినట్లు కుక్కలే ఆమెను కొరికి చంపేశాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని, ఇకపై చూడకూడదని అనుకుంటున్నట్లు దర్యాప్తు బృందంలోపి అధికారి ఒకరు అన్నారు. ఆ కుక్కలను చంపేయండి : తమ గారాలపట్టి బెతాని ప్రాణాలు పోవడానికి కారణమైన పెంపుడు కుక్కలను తక్షణమే అంతం చేయాలని ఆమె కుటుంబీకులు అధికారులను కోరారు. అయితే, బెతాని స్నేహితులు మాత్రం దర్యాప్తు ముగింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు కుక్కలూ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ బెతానికి అలవాటేనని, ఏనాడూ ఆమెకు హానిచెయ్యని జంతువులు.. ఇప్పుడు చంపేశాయంటే నమ్మశక్యంగా లేదని, కేసులో తేలాల్సిన విషయం ఇంకేదో ఉందని అంటున్నారు. బెతాని స్నేహితుల వాదనను దర్యాప్తు అధికారులు తోసిపుచ్చారు. -
హెచ్1 బీ ఉంటే చాలు.. ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు
వాషింగ్టన్: హెచ్1బీ వర్క్‌వీసాదారులకు శుభవార్త. వీటిని కలిగిఉన్నవారు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన ఐటీ వృత్తినిపుణులతోపాటు అగ్రరాజ్యం వచ్చినవారిలో అనేకమంది హెచ్1 బీ వీసా కోసం నానాతంటాలు పడుతుండడం తెలిసిందే. ఇదొక నాన్ ఇమిగ్రెంట్ వీసా. సాంకేతికపరంగా లేదా సైద్ధాంతికంగా నిపుణులైన విదేశీయులు ఈ వీసా కలిగిఉన్నట్టయితే అమెరికా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. భారత్, చైనా దేశాలకు చెందిన వేలాదిమందిని అమెరికా కంపెనీలు ఈ వీసా ప్రాతిపదికన ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నియమిస్తుండడం సర్వసాధారణం. ‘సాధారణంగా హెచ్1బీ వీసాదారులు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకునేందుకు వీలవుతుంది. అయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి అనుమతి పొందిఉండాలి’ అని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. అయితే ఉద్యోగి విధుల్లో చేరేముందు ఇందుకు సంబంధించి సంబంధిత సంస్థ యజమాని....యూఎస్‌సీఐఎస్‌కి 1–129 ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో సదరు ఉద్యోగి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇది కొత్త నిబంధన కాకపోయినప్పటికీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. విదేశాలనుంచి ఇక్కడికి రాదలుచుకున్నవారికి ఈ సంస్థ హెచ్1బీ వీసా దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి, ఖరారు చేస్తుంది. ఏటా 65 వేలమందికే... అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రతి ఏడాది 65 వేలమందికి మాత్రమే ఈ వీసాలను మంజూరు చేస్తుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు ఇందుకు అర్హులు. ఇక గ్రీన్‌కార్డులు కలిగిఉన్నవారిలో 85 శాతం మంది ఇప్పటికే ఇక్కడ స్థిరపడిపోయారు. ఈబీ5 వీసాల గడువు పొడగింపు అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త. ‘గోల్డెన్ వీసా’గా పరిగణించే ఈబీ5 వీసాల దరఖాస్తుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్1–బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ వీసా ప్రోగామ్‌ను 1990లో యూఎస్ కాంగ్రెస్ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్ యువతకు ఉపాధి కల్పించాలి. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని అనుకునేవారికి ఇది నిజంగానే బంగారం లాంటి అవకాశం. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్1–బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు. -
మరోసారి చంద్రుడిపైకి మనుషులు..
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష విధానం మళ్లీ మారిందా? దేశాధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంతకం చేసిన అమెరికా స్పేస్ పాలసీ మాత్రం ఇదే విషయాన్ని చెబుతోంది. అదేంటంటే... అమెరికా మళ్లీ చంద్రుడివైపే దృష్టిసారించింది. నూతన అంతరిక్ష విధానంపై సంతకం చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... అమెరికన్లను చంద్రుడి పైకి తీసుకెళ్లాలని నాసాను కోరారు. ఇప్పటికే నాసా భవిష్యత్తులో ప్రజలను మార్స్‌కు పంపే యోచనలో ఉంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్లను చంద్రుడిపైకి పంపితే ఆ ప్రయోగానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘ఈసారి చంద్రుడిపై అమెరికా జెండానే కాదు.. అమెరికన్ పాదాల అచ్చులుకూడా ఉండాలి. మార్స్ మిషన్‌కు సంబంధించి ఓ ఫౌండేషన్‌ను ప్రారంభిస్తాం.’ అని అన్నారు. 1960 నుంచి 1972ల మధ్యలో నిర్వహించిన అపోలో మిషన్లోభాగంగా ఆఖరిసారిగా అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లారు. ఆ తర్వాత అమెరికా అంతరిక్ష విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటికే.. అంటే 1969లోనే అమెరికన్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత హారిసన్ ష్మిట్ కూడా చంద్రుడిపై గడిపారు. దీంతో ఇదివరకే సాధించిన మిషన్లను మళ్లీ ప్రారంభిస్తే అందుకు చాలా ఖర్చవుతుందని భావించిన అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రాజెక్ట్‌ను రద్దు చేశారు. దీనికి బదులు 2030లోగా అమెరికన్లను మార్స్‌కు పంపే విషయంపై దృష్టిసారించేలా అంతరిక్ష విధానాన్ని రూపొందించారు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం మరోసారి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్ రంగాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని వైట్‌హౌస్ వెల్లడించింది. -
అమెరికా : న్యూయార్క్‌లో పేలుడు
న్యూయార్క్ : అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత మాన్‌హట్టన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 7:45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ సమీపంలోని పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద పేలుడు కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు న్యూయార్క్ మేయర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) ఇప్పటికే ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని, పోర్ట్ రవాణా కేంద్రంలోని ఏ, సీ, ఈ లైన్లను తాత్కాలికంగా మూసివేశారని అధికారులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రత ఎంత, ఎవరికైనా ప్రాణాపాయం కలిగిందా, గాయపడ్డారా, లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. ఒకటికాదు రెండు పేలుళ్లు! మాన్‌హట్టన్ పేలుడుకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టెర్మినల్‌లో బదిగిన తనకు రెండు సార్లు భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయని, ఆ సమయంలో హెడ్సెట్ పెట్టుకున్నప్పటికీ చెవులు ఘొల్లుమన్నాయని ఫ్రాన్సిస్కో అనే ప్రయాణికుడు తెలిపారు. పేలుడు ఉగ్రదాడా, లేక మరొకటా అన్నది మరికాసేపట్లోనే అధికారులు వెల్లడించనున్నారు.. సొంత ఊర్లో పేలుడుపై అధ్యక్షుడు ట్రంప్ ఆరా.. మాన్‌హట్టన్ బస్ టెర్మినల్ పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధికారులతో మాట్లాడారు. మాన్‌హట్టన్‌లో ఏం జరిగిందో, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఎన్‌వైపీడీ.. ప్రెసిడెంట్ ట్రంప్‌కు వివరించిందని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి తెలిపారు. ట్రంప్ సొంత ఊరు న్యూయార్క్ సిటీనే అన్న సంగతి తెలిసిందే. -
జెరూసలెం ఇజ్రాయెల్దేనా..?
జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న రాజధాని సమస్య విషయంలో ట్రంప్ నిర్ణయం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య సమస్యకు కారణాలు.. అమెరికా వైఖరి గురించిన కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.. చరిత్ర.. మధ్య ప్రాచ్య దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. దీనికి సమీపంలోనే పాలస్తీనా ఉంది. అయితే పాలస్తీనాకు స్వతంత్ర రాజ్యంగానే గుర్తింపు ఉంది. కానీ, పూర్తి స్థాయి దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించడం లేదు. ఇజ్రాయెల్‌లో 87 లక్షల వరకు జనాభా ఉంటారు. ఇక్కడ యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు, ఆర్మేనియన్లు ఉన్నారు. ఎక్కువగా యూదుల ఆధిపత్యం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ రాజధానిగా టెల్ అవీవ్ ఉండేది. ఇక పాలస్తీనా, జెరూసలెంను రాజధానిగా భావిస్తోంది. అయితే ఇది ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. పాలస్తీనా జనాభా దాదాపు 45 లక్షలకు పైగానే ఉంటుంది. అతి ప్రాచీన నగరం.. ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో జెరూసలెం ఒకటి. ఈ నగరాన్ని క్రైస్తవులు, యూదులు, ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వారు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలో ని హోలీ సిపల్చర్ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్‌తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. గాజా–వెస్ట్ బ్యాంక్ సమస్య.. పాలస్తీనా–ఇజ్రాయెల్‌ల మధ్య అనేక అంశాల్లో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య 1948, 1967ల్లో యుద్ధాలు కూడా జరిగాయి. 1967నాటి యుద్ధంలో పాలస్తీనా పరిధిలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజాలు ఇజ్రాయెల్ సొంతమయ్యాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్ ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీంతో ఇక్కడ జరిగే కార్యకలాపాల్ని, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్ని ఆ దేశం విజయవంతంగా అణచివేస్తోంది. పైగా ఇక్కడ క్రమంగా యూదుల సంఖ్య పెరుగుతోంది. కాగా, గాజా మాత్రం హమాస్ అనే ఇస్లామిక్ సంస్థ ఆధీనంలో ఉంది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను దక్కించుకునేందుకు జ్రాయెల్, పాలస్తీనాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండూ దేనికి దక్కితే, అది పెద్ద దేశమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి కష్టంగానే మారింది. ఇజ్రాయెల్ దేశంగా మారడం వెనుక.. ప్రపంచంలోనే యూదులు ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. అయితే 20వ శతాబ్దంలోపు యూదు మతం దాదాపు అంతరించి పోయే స్థితికి చేరింది. యూదులు యూరప్ సహా అనేక దేశాల్లో స్వల్ప సంఖ్యలో ఉన్నారు. అయితే వీరంతా, తమకు ఓ ప్రత్యేక దేశం ఉండాలని భావించారు. తమ మతానికి ప్రాధాన్యం ఉన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అలా యూదలందరి మదిలో మెదిలింది ఇజ్రాయెల్. పైగా అది వారి చారిత్రక నగరం. అయితే అప్పుడు అది పాలస్తీనాగా, బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండేది. 1896–1948 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదుల్లో 90 శాతం మంది ఇక్కడికి చేరారు. అప్పటికే అక్కడ అరబ్బులు అధికంగా ఉండేవారు. అంటే ముస్లింలు, క్రిస్టియన్లు పాలస్తీనాలో ఉన్నారు. కానీ యూదుల రాకతో, వీరి మధ్య తీవ్ర సంక్షోభం తలెత్తింది. దీంతో ఐక్యరాజ్య సమితి దీన్ని రెండు రాజ్యాలుగా విడగొట్టాలనుకుంది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, పాలస్తీనియన్లు అంగీకరించలేదు. పాలస్తీనాకు అరబ్బు రాజ్యాలైన ఈజిప్టు, జోర్డాన్, ఇరాక్, సిరియాలు మద్దతు తెలిపి, ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించాయి. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపొందింది. దీంతో పాలస్తీనా ఆధీనంలోని 77 శాతం భూమి ఇజ్రాయెల్ పరమైంది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించాయి. ఇదే సమయంలో జెరూసలెం నగరం కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి మారిపోయింది. జెరూసలెం వివాదం ఈ నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటి ఆధీనంలో ఉంది. కాగా ఇప్పటికే టెల్ అవీవ్ పట్టణం ఇజ్రాయెల్ రాజధానిగా ఉండేది. పాలస్తీనా మాత్రం జెరూసలేంను రాజధానిగా భావించింది. అయితే ఈ నగరం రెండు దేశాల మధ్య ఉండడంతో, దీని విషయంలో వివాదం కొనసాగుతోంది. నగరంలోని ఎక్కువ ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండగా, కొంత భాగం జోర్డాన్ పరిధిలో ఉంది. జెరూసలేంను తమ రాజధానిగా ప్రకటించాలని ఇజ్రాయెల్ కొన్నేళ్ల నుంచి కోరుతోంది. దీనికి ఇప్పుడు అమెరికా అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త సమస్యలు.. జెరూసలేం విషయంలో ట్రంప్ నిర్ణయంపై పాలస్తీనా, జెరూసలెంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న మధ్య ప్రాచ్య దేశాల్లో ట్రంప్ చర్య మరింత ఉద్రిక్తతలను తెస్తుందని అరబ్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే తమ నిర్ణయం ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు దోహదం చేస్తుందని, ఈ విషయంలో అమెరికా సాయపడుతుందని ట్రంప్ అన్నారు. అలాగే పాలస్తీనాకు కొంత నష్ట పరిహారం అందించడం, లేదా ఇజ్రాయెల్‌లోని కొంత భాగాన్ని అప్పగించడం వంటివి చేసే అవకాశాలున్నాయని నిపుణుల మాట. గాజా–వెస్ట్ బ్యాంక్ – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం : అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖను ట్రంప్ ఆదేశించారు. ‘జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఇదే సమయమని నేను నిర్ణయించాను’ అని ట్రంప్ అన్నారు. ఈ పనిని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ‘ఏదైనా చేయాలని (ఇజ్రాయెల్ అంశంలో) గత అధ్యక్షులు చెప్పేవారు. కానీ వారు చేసిందేమీ లేదు. వాళ్లకు ధైర్యం లేకనో, మనసు మార్చుకోవడం వల్లనో నేను చెప్పలేను’ అని ట్రంప్ అన్నారు. తాజా నిర్ణయంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీని ట్రంప్ నెరవేర్చినట్లైంది. కాగా, ట్రంప్ నిర్ణయంపై పలు అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ చర్యతో మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్యమం రావొచ్చని ఆ దేశాధినేతలు హెచ్చరించారు. ట్రంప్ మాట్లాడుతూ ‘జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం. గత ఏడు దశాబ్దాల్లో ఇజ్రాయెల్ ప్రజలు యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి జీవించే దేశాన్ని నిర్మించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా... ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు కూడా అమెరికా కట్టుబడి ఉంది’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముస్లింలను రెచ్చగొట్టే చర్య: సౌదీ సౌదీ రాజు సల్మాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్ సిసీలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను ట్రంప్ చర్య రెచ్చగొడుతుందనీ, ఇదొక అపాయకర చర్య అని సల్మాన్ అన్నారు. ట్రంప్ చర్య ‘తప్పు, చట్ట వ్యతిరేకం, అత్యంత ప్రమాదకరం, రెచ్చగొట్టేది’ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత.. ట్రంప్ నిర్ణయంపై పలు అరబ్ దేశాల అధినేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న మధ్య ప్రాచ్య దేశాల్లో ట్రంప్ చర్య మరింత ఉద్రిక్తతలను తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంపైనా దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జెరూసలేంపై నిర్ణయం తీసుకునే ముందు మధ్యప్రాచ్యంలోని దేశాధినేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్లతోపాటు జోర్డాన్, సౌదీ, ఈజిప్టు అధినేతలతోనూ చర్చించారు. జెరూసలెం.. మూడు మతాల పవిత్ర స్థలం జెరూసలెం మూడు మతాలకూ పవిత్ర స్థలం. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు ఈ నగరాన్ని పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వా రు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలోని హోలీ సిపల్చర్ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్‌తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే క్రీస్తుకు శిలువ వేశారని చెబుతారు. చర్చిలోని క్రీస్తు సమాధిని సందర్శించేందుకు లక్షలాది మంది క్రిస్టియన్లు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తుంటారు. పాత నగరంలోని అల్ అక్సా మసీదు.. ముస్లింలకు మూడో పవిత్ర స్థలం. మక్కా నుంచి మహ్మద్ ప్రవక్త ఇక్కడకు వచ్చి అందరి ప్రవక్తల తరపున ప్రార్థనలు చేసినట్లు ముస్లింలు భావిస్తారు. జెరూసెలంలోని వెస్ట్రన్ వాల్ యూదులకు పవిత్ర స్థలం. యూదులు ఉండే ప్రాంతంలో ఈ సున్నపురాయి గోడ ఉన్నది. భూగోళం ఇక్కడ నుంచే పుట్టిందని యూదులు భావిస్తారు. అబ్రహం కూడా తన కుమారుడు ఐజాక్‌ను త్యాగం చేయాలని చూసింది ఇక్కడేనట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు దీనిని దర్శించుకుంటారు. అమెరికా ప్రకటనకు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు -
అమెరికా - దక్షిణకొరియా యుద్ధవిన్యాసాలు
వాషింగ్టన్ : తరచూ అణుపరీక్షలతో ఇబ్బందిపెడుతున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా అమెరికా–దక్షిణ కొరియా సోమవారం కొరియా ద్వీపకల్పంలో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించాయి. వందలాది జెట్ విమానాలు ద్వీపకల్పంపై సోమవారం చక్కర్లు కొట్టాయి. తమ సామర్థ్యానికి ప్రత్యర్థికి చూపుతూ యుద్ధానికి రెచ్చగొట్టొద్దని చెప్పడానికి ఈ భారీ డ్రిల్‌ను అమెరికా –దక్షిణ కొరియాలు చేపట్టాయి. అంతేగాక ఈ విన్యాసాలకు ‘ఆపరేషన్ ఉత్తరకొరియా’ అని నామకరణం చేశాయి. గత నెల 29న అత్యంత శక్తిమంతమైన హస్వాంగ్ –15 అణ్వస్త్ర క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతంపైన ఉత్తరకొరియా అణుదాడి చేయగల సత్తాను సాధించింది. నాలుగు రోజులపాటు విన్యాసాలు అమెరికా సైనిక విన్యాసాల్లో రెండు డజన్ల స్టెల్త్ ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. అమెరికా లక్షల కోట్ల డాలర్లు పోసి అభివృద్ధి చేసిన ఎఫ్–35 విమానం కూడా డ్రిల్‌లో పాలుపంచుకుంది. మరో నాలుగు రోజుల పాటు ఈ డ్రిల్ కొనసాగనుంది. ఎఫ్–22 రాప్టర్ స్టెల్త్లు సహా మొత్తం 230 యుద్ధవిమానాలు విన్యాసాల్లో పాల్గొంటాయి. ఇరు దేశాలకు చెందిన వేల సంఖ్యలో వైమానిక సిబ్బంది కూడా డ్రిల్‌లో పాల్గొంటున్నట్లు దక్షిణకొరియా వైమానిక శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అమెరికా, ఉత్తరకొరియా దేశాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. ఇలాంటి పరీక్షలు ఆపకపోతే యుద్ధానికి దిగాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. రెచ్చగొడితే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారని ఉత్తరకొరియా కూడా ధీటుగా బదులిచ్చింది. -
డాక్టర్ రెడ్డీస్‌పై అమెరికాలో క్లాస్యాక్షన్ దావా
న్యూఢిల్లీ: దేశీ ఔషధ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌పై అమెరికాలో కొంతమంది ఇన్వెస్టర్లు దావా వేశారు. అమెరికా స్టాక్ మార్కెట్ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ తమపై న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో సెక్యూరిటీస్ క్లాస్ యాక్షన్ లా సూట్ దాఖలైందని కంపెనీ బుధవారం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. కార్పొరేట్ నాణ్యతా వ్యవస్థకు సంబంధించి తప్పుడు ప్రకటనలు, సమాచారాన్ని దాచిపెట్టడం వంటి చర్యలవల్ల షేరు ధర పతనమైందనేది ఇన్వెస్టర్ల ప్రధాన ఆరోపణ. దీనికి కారణమైన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో డాక్టర్ రెడ్డీస్ షేర్లను(ఏడీఆర్) కొనుగోలు చేసిన కొందరు ఇన్వెస్టర్ల తరఫున అక్కడి న్యాయ సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా, తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారౖమైనవని.. దీన్ని చట్టపరంగా తాము ఎదుర్కోనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మరోమారు స్పష్టం చేసింది. బుధవారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర బీఎస్ఈలో స్వల్పంగా 0.22 శాతం నష్టంతో రూ.2,283 వద్ద స్థిరపడింది. -
భారతీయ కంపెనీలతో అమెరికాలో లక్ష ఉద్యోగాలు
వాషింగ్టన్ : ఇంతకాలం తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ పలువురు అమెరికన్ అతివాదులు ఇండియన్లపై విద్వేష దాడులకు పాల్పడ్డారు. ఇంకా పాల్పడుతూనే ఉన్నారు. భారతీయ కంపెనీలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా పలు ఆంక్షలు విధించారు. కానీ అవన్నీ అపోహలేనని తేలిపోయింది. భారతీయ కంపెనీలు అమెరికాలోనూ ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తున్నాయి. అక్కడ భారతీయ సంస్థలు 1,13,000 ఉద్యోగాలు కల్పించినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్’ పేరిట ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)’ గతేడాది కాలానికి సంబంధించి ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత సంస్థలు అమెరికాలో భారీగా ఉద్యోగాలు కల్పించడంతోపాటు, మొత్తంగా 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగే కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా 147 మిలియన్ డాలర్ల నిధుల్ని కూడా మన సంస్థలు అందించాయి. అంతేకాదు, పరిశోధనలు, అభివృద్ధి కోసం 588 మిలియన్ డాలర్లు వెచ్చించాయి. దాదాపు వందకు పైగా భారత కంపెనీలు అమెరికా, అక్కడి సరిహద్దుల్లోని ప్యుర్టొరికో దీవిలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. దాదాపు 87 శాతం భారత సంస్థలు రానున్న ఐదేళ్లలో మరింత మంది స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థల్లో ఇండియన్ కంపెనీలు ముందంజలో ఉన్నాయని క్రిస్ వ్యాన్ అనే సెనేటర్ తెలిపారు. -
అమెరికాలో తెలుగువారి వనభోజన సందడి
-
నిత్యం 30 లక్షల మంది చేతుల్లో తుపాకులు
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది తమ వెంట తుపాకులు తీసుకెళ్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక నెలకోసారి ఇలా తుపాకులు తీసుకెళ్తున్న వారి సంఖ్య సుమారు 90 లక్షలని తెలిసింది. భద్రతా కారణాల రీత్యానే ఆయుధాలను వెంట ఉంచుకుంటున్నట్లు వారిలో చాలా మంది తెలిపారు. అమెరికాలో తుపాకుల వాడకంపై 20 ఏళ్లలో తొలిసారి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. వేర్వేరు రాష్ట్రాల్లో చట్టాలకు అనుగుణంగా తుపాకులను తీసుకెళ్తున్న ధోరణులను ఇందులో పరిశీలించారు. తుపాకులను వెంట తీసుకెళ్లే వారిలో ఎక్కువ మంది యువకులు, అందునా అధిక శాతం పురుషులేనని తేలింది. -
ఈ ఉద్యోగాలు చాలా వేగంగా కనుమరుగు..
అమెరికాలో రాబోయే దశబ్ద కాలంలో 12 రకాల ఉద్యోగాలు చాలా వేగంగా కనుమరగవతున్నట్లు ఆ దేశ లేబర్ స్టాటస్టిక్స్ బ్యూరో అధికారులు తెలిపారు. దీనికి కారణం పెరుగుతున్న సాంకేతికత బయటి దేశాలకు అవుట్ సోర్సింగ్ ఇవ్వడమేనన్నారు. ముఖ్యంగా బుక్ కీపింగ్, అకౌంటింగ్, ఆడిటింగ్ క్లర్క్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వంటి ఉద్యోగాలు 2014-2019 మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోనున్నట్లు అంచనా వేస్తూ ఓ రిపోర్టును విడుదల చేశారు. ఆ వివరాలు.. ♦ బయటి దేశాల అవుట్ సోర్సింగ్ కారణంగా అమెరికాలో కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ఏడాదికి 80 వేల డాలర్లు పొందే ప్రోగ్రామర్స్ 2014 వరకు దేశంలో 3 లక్షల 29 వేల మంది ఉన్నారు. 2024 వరకు ఈ సంఖ్య 8 శాతం తగ్గి 3లక్షల 2 వేలకు చేరనుంది. ♦ మోల్డింగ్, కోర్మేకింగ్, మెషిన్ సెట్టర్స్, ఆపరేటర్స్, టెండర్స్, మెటల్, ప్లాస్టిక్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ఈ రంగ కంపెనీలన్ని కంప్యూటర్ రోబట్లపై ఆధారపడుతుండటంతో 32 వేలమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోనున్నారు. ఈ రంగంలోని ఉద్యోగులు ఏడాదికి 29 వేల డాలర్లు వేతనంగా పొందుతుండగా.. 2014 లెక్కల ప్రకారం లక్షా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 2024 వరకు ఈ సంఖ్య 97 వేలకు పడిపోనుంది. ♦ స్విచ్ బోర్డు ఆపరేటర్స్, టెలీకాలర్స్ రంగంలో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ప్రస్తుతం లక్షా 12 వేల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతుండగా 2024 కల్లా ఈ సంఖ్య 76 వేలకు తగ్గనుంది. ♦ పోస్టల్ సర్వీస్ మెయిల్ సోర్టర్స్, ప్రాసెసర్స్, ప్రాసెసింగ్ మెషిన్ ఆపరేటర్స్ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్ మెయిల్ సోర్టింగ్ సాంకేతికతతో ప్రమాదంలో పడునున్నాయి. ఈ రంగంలోనికి ఉద్యోగులు ఏడాదికి 57 వేల డాలర్ల వేతనం పొందుతున్నారు. లక్షా 18 వేలమంది ఉపాధి పొందుతుండగా 2024 వరకు 78 వేలకు చేరనుంది. సుమారు ఈ రంగంలో 40 వేల ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ♦ టెల్లర్స్: బ్యాంకింగ్ రంగంలో లావాదేవీలకు బాధ్యత వహించే ఈ ఉద్యోగులు.. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ ఆప్‌ల రావడంతో అవకాశాలు కోల్పోతున్నారు. 2014లో ఈ రంగంలో ఉపాధి పొందేవారి సంఖ్య 5 లక్షల 21 వేలుగా ఉండగా 2024 కల్లా ఈ సంఖ్య 481 వేలకు పడిపోనుంది. ♦ గార్మెంట్స్, డెకరేట్, గార్మెంట్స్, నాన్ గార్మెంట్స్ ఉత్పత్తులను తయారు చేసే కుట్టు యంత్ర ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్, ఆటోమేషన్‌లతో ఉపాధి అవకాశాలు కోల్పోనున్నారు. 2014లో ఈ రంగంలో ఉపాధి పొందే సంఖ్య లక్షా 54 వేలుగా ఉండగా 27వేల ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ఇవే కాకుండా అసంఘటిత, అకౌంటింగ్, ఆహార సంబంధిత రంగాల్లో వేల ఉద్యోగాలు కోల్పోనున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. -
భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణులకు భారీ ఊరట లభించింది. ప్రీమియం హెచ్ 1 బీ వీసాల జారీపై (ప్రత్యేక ఫీజుతో ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్) అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం హెచ్ 1 బీ వీసాల జారీని పునరుద్ధరించేందుకు ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సుమారు 65వేలమంది భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. 2018 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను పునరుద్ధరించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాసెసింగ్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని హామీ ఇచ్చింది. అలాగే గరిష్ట పరిమితిని 65,000గా నిర్ణయించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 3నుంచి ప్రీమియం హెచ్ 1-బీ వీసా ప్రాసెసింగ్ ను ఆరు నెలల పాటు రద్దు చేసింది. భారీ డిమాండ్, రెగ్యులర్ వీసా ప్రాసెసింగ్ లో జాప్యం తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐరాసలో అమెరికా-చైనా యుద్ధం
- ఉత్తరకొరియా అణుపరీక్షలపై దద్దరిల్లిన భద్రతా మండలి - కిమ్ జోలికొస్తే ఊరుకోం: చైనా, రష్యా - అతను యుద్ధాన్ని కోరుకుంటున్నాడు: అమెరికా - భయంలేనివాడిని భరతం పట్టాల్సిందేనన్న నిక్కీ హేలీ న్యూయార్క్: అణుబాంబులు, హైడ్రోజన్ బాంబుల పరీక్షలతో ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ‘ఉత్తరకొరియా ప్రయోగాల’పై ఐక్యరాజ్యసమితిలో అమెరికా-చైనాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మాటలతో వినే రకం కాదని, యుద్ధాన్నే కోరుకుంటున్నాడని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. కాగా, అమెరికా వాదనను చైనా ప్రతినిధి లూజీ ఖండించారు. పరిస్థితి విషవలయంలా మారిందని, కిమ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. సోమవారం నాటి భేటీతో కలుపుకొని మొత్తం 10 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తరకొరియా అజెండాపై భేటీ అయింది. అమెరికా ఆంక్షలు ప్రతిపాదించిన అన్ని సందర్భాల్లోనూ ఆ తీర్మానాలను చైనా, రష్యాలు వీటో చేస్తూవస్తున్నాయి. ఇక మాకు ఓపిక లేదు: ఉత్తరకొరియా అణుపరీక్షలు, వాటికి దన్నుగా నిలుస్తోన్న చైనాపై అమెరికా రాయబారి నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కిమ్ జాంగ్ ఉన్ యుద్ధం కోసం యాచిస్తున్నారు(బెగ్గింగ్ ఫర్ వార్). ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నే ఉన్నారు. ఇప్పటికే ఆరు సార్లు అణుపరీక్షలు చేశారు. ఇప్పటికైనా మనం ‘అతణ్ని దారికి తేవాలనే’ ఆలోచన వీడుదాం. తీవ్ర చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం తీసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి.. అమెరికాపైకి, అమెరికన్లపైకి కొన్ని వందల బాంబులు గురిపెట్టి కూర్చుంది కొరియా. ఇలాంటి పరిస్థిలో మేం సహనంతో ఉండలేం. యుద్ధం మా వాంఛకాదు. కానీ మా భద్రత విషయంలో ఎంత దూరమైనా వెళతాం’’ అని నిక్కీ హేలీ అన్నారు. కొరియాపై యుద్ధాన్ని సహించం: అమెరికా వాదనను ఖండిస్తూ చైనా ప్రతినిధి లూజీ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితి విషవలయంలా మారింది. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, అణువ్యాప్తి తగ్గింపు విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేం ఉత్తరకొరియాను అభ్యర్థిస్తూనేఉన్నాం. అయితే, కొరియాను అణ్వాయుధాలు వదులుకోవాలని డిమాండ్ చేస్తోన్న అమెరికా తనకుతానుగా ఆ పని చేస్తోందా? అని ప్రశ్నించుకోవాలి. కొరియాపై ఆంక్షలను ఇంకా కఠినతరం చేయాలన్న ఆలోచననుగానీ, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న ప్రణాళికలనుగానీ చైనా, రష్యాలు ముమ్మాటికీ సమర్థించబోవు. కొరియా ద్వీపంలో శాంతి నెలకొనాల్సిందే. అది జరగాలంటే ముందుగా అమెరికా, దాని అనుబంధ దేశం దక్షిణకొరియాలు వెనక్కితగ్గాలి. ఉత్తరకొరియాను చుట్టుముట్టి భయపెట్టిస్తున్న తీరును మార్చుకోవాలి. మీరు గట్టిపడేకొద్దీ వాళ్లూ గట్టిపడతారు’’ అని లూజీ అన్నారు. వేరే దారి లేదు: ఐరాసా ఆంక్షలకు విరుద్ధంగా ఉత్తరకొరియాతో వాణిజ్యాన్ని సాగిస్తోన్న చైనా.. పరోక్షంగా కిమ్ తయారుచేస్తోన్న మిస్సైళ్లకు నిధులు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. కొరియా విషయంలో సాధ్యమైనన్ని శాంతియుత మార్గాలన్నీ విఫలమయ్యాయని, ఐరాస 10 సార్లు హెచ్చరించినా వారు వినిపించుకోవడం లేదని, కిమ్ లాంటి యుద్ధపిపాసిని అడ్డుకోవాలంటే తీవ్ర చర్యలకు ఉపక్రమించడం తప్ప వేరే దారి లేదని నిక్కీ హేలీ ముక్తాయింపునిచ్చారు. -
జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య
సాక్షి,వాషింగ్టన్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిక్కు యువకుణ్ని ఓ అమెరికన్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ దురదృష్టకర ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి గగన్‌దీప్ సింగ్ (22) హత్యకు గురికావడం విషాదాన్ని రేపింది. యూనివర్శిటీలో అడ్మిషన్ రాలేదన్న అక్కసుతో జాకబ్ కోలెమన్ (19) టాక్సీ డ్రైవర్, సిక్ విద్యార్థిని అనేకసార్లు పొడిచి హత్యచేశారని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సింగ్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేన్నారు.. ఈ క్రమంలో ఆగష్టు 28 న వాషింగ్టన్ లోని స్పోకేన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిందితుడు సింగ్ టాక్సీ ఎక్కాడు. ఇదాహోలోని బోనర్ కంట్రీలో తన స్నేహితుడు ఇంటికి వెళ్లమని కోరాడు. ఆకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు విచక్షణా రహితంగా దాడి చేయడంతో సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గోంజాగా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రయివేట్ కాథలిక్ యూనివర్శిటీలో ప్రవేశం లభించకపోవడంతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల కథనం. అయితే ఈ విషయాన్ని యూనివర్శిటీ ఖండించింది. అలాంటి అప్లికేషన్ ఏదీ తమ దగ్గరకు రాలేదనీ, విచారణకు సహకరిస్తున్నట్టు తెలిపింది. పంజాబ్‌లోని జంషెడ్పూర్కుచెందిన గగన్‌దీప్‌సింగ్ గా మృతుణ్ని గుర్తించారు. 2003నుంచిన ఆయన వాషింగ్టన్లో నివసిస్తున్నారు. మరోవపు జలంధర్ కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ రాజు మేనల్లుడు గగన్ సింగ్. ఈ హత్యపై ఆయన స్పందిస్తూ, తన మేనల్లుడు జాతి విద్వేషాలకు బలైయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై ట్రంప్ విధానాల ఫలితంగా జాతి విద్వేషాలకు బాధితులుగా భారతీయులు, ఆసియన్లు బాధితులుగా మారుతున్నారని మండిపడ్డారు. కాగా అమెరికాలో ఇటీవలి నెలల్లో అమెరికన్లు లభారతీయలును, సిక్కులను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆందోళన రేపుతోంది. జూలైలో కాలిఫోర్నియాలో ఒకే వారం లో రెండు వేర్వేరు సంఘటనలలో ఇద్దరు హత్యకు గురైన సంగతి తెలిసిందే. -
కోచ్‌కు 105 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో కాలిఫోర్నియా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాధమిక పాఠశాలలో ఏడుగురు చిన్నారి బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన కోచ్ రోనీ లీ రోమన్‌కు (44) కు ఏకంగా 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జిన్హువా వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం లాస్ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. రోమన్‌పై మైనర్ బాలికలను వేధించిన ఘటనలకు సంబంధించి మొత్తం 7కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. పాఠశాల ఆవరణలో ఆరుగురికిపైనా, ఏడవది బాధిత బాలిక ఇంట్లో జరిగిందని విచారణలో తేలింది. 8నుంచి 11సంవత్సరాల వయసున్న బాలికలపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జిల్లా అటార్నీ కార్యాలయం ప్రకారం కొలరావులోని కాహువేన్ ఎలిమెంటరీ స్కూల్లో, హాలీవుడ్‌లోని వైన్ ఎలిమెంటరీ పాఠశాలల్లో పనిచేసిన కాలంలో రోమన్ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 7న ప్రాసిక్యూషన్ అతణ్ని దోషిగా నిర్ధారించడంతోకోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
హెచ్-1బీ వీసాలతో ఏ దేశానికి లాభం?
హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్.. గత కొంతకాలంగా ఇటు భారత్‌కు, అటు అమెరికాకు వివాస్పదమైంది. ఈ వర్క్వీసాలపై వస్తూ తమ ఉద్యోగాలను భారతీయులు కొల్లగడుతున్నారని అమెరికా వాదిస్తుండగా.. భారత్ ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. అసలు ఈ వీసా ప్రొగ్రామ్ వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ఉండదు? అనుకుంటే. ఇరు దేశాలు ఈ వీసా ప్రొగ్రామ్ వల్ల లబ్ది పొందుతున్నారని తాజా నివేదికల్లో వెల్లడైంది. ది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ రీసెర్చర్లు చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. అటు అమెరికా, ఇటు భారత్ ఇరు దేశాలకు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఆర్థిక ప్రయోజాలను అందిస్తుందని చెప్పింది. అమెరికా వీసా ప్రొగ్రామ్ వల్ల ఇరు దేశాల ఆదాయాలు 17.3 బిలియన్ డాలర్లు పెరిగాయని, అంతేకాక అమెరికా, భారత్‌ల ఐటీ ఉత్పత్తి 2010లో 0.45 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ గౌరవ్ ఖన్నా, మిచిగాన్ యూనివర్సిటీ నికోలాస్ మోరాలెస్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రొగ్రామ్ వల్ల 2010లో అమెరికా ఉద్యోగుల సంపద 431 మిలియన్లకు పెరిగినట్టు కూడా తెలిపారు. ఇమ్మిగ్రేషన్తోనే ప్రతి దేశంలోని యావరేజ్ వర్కర్ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డారని అధ్యయనం తెలిపింది. అమెరికా స్థానిక వర్కర్లకు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఎక్కువ లబ్ది చేకూరుస్తుందని ఖన్నా చెప్పారు. '' అమెరికా కలను సాధించే క్రమంలో ఐటీ బూమ్, ఇతర పర్యవసనాలు'' అనే టైటిల్‌తో ఈ అధ్యయన రిపోర్టును రూపొందించారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌పై లోతైన విశ్లేషణ, 2000 కాలం నుంచి అమెరికా, భారత ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం వంటి విషయాలపై అధ్యయనం చేశారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం కల్పించడానికి కంపెనీలకు అనుమతి ఉంటుంది. దేశీయ ఐటీకి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న అమెరికాలో భారత కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌ను వాడుతూ విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా తక్కువ వేతనానికి భారతీయులను కంపెనీలు నియమించుకుంటూ...తమ ఉద్యోగాలకు గండికొడుతున్నాయని అమెరికా వాదిస్తోంది. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌పై అమెరికా కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తోంది. -
అమెరికాలో ఎయిరిండియా విమానానికి షాక్!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రయాణికులకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. షికాగో నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానాన్ని అమెరికా వైమానిక భద్రతా సంస్థ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్-ఎఫ్ఏఏ) అర్ధంతరంగా అడ్డుకుంది. ఎయిరిండియా విమానంలోని పలు సీట్లకు ట్యాగ్ నంబర్లు లేకపోవడంతో ఈ మేరకు షాక్ ఇచ్చింది. ఎయిరిండియా విమానం బోయింగ్-777 (వీటీ ఏఎల్కే)లో అనూహ్యంగా తనిఖీలు నిర్వహించిన ఎఫ్ఏఏ.. విమానంలోని పెద్దసంఖ్యలో సీటు బెల్టులకు టెక్నికల్ స్టాండర్డ్ ఆర్డర్ (టీఎస్వో) ట్యాగ్ లేనట్టు గుర్తించింది. ఇది భద్రతాపరమైన అంశం కాకపోయినప్పటికీ.. తప్పనిసరిగా టీఎస్వో ట్యాగ్ ఉండాల్సిందేనంటూ విమానాన్ని నిలిపేసింది. 342 సీట్లు కలిగిన ఈ విమానం ఫుల్‌గా బుక్ అయి.. ప్రయాణికులతో బయలుదేరడానికి సిద్ధమైన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉన్న ఎయిరిండియా విమానం బీ-777 నుంచి కొన్ని సీటుబెల్టులను డెల్టా విమానంలో షికాగోకు తెప్పించుకుంది. వీటిని ఇన్స్టాల్ చేసిన అనంతరం విమానం ఢిల్లీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఎఫ్ఏఏ తనిఖీల కారణంగా ఎనిమిది గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అమెరికా అధికారుల తీరుపై ఎయిరిండియా సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
వలసదారులకు ట్రంప్ షాక్!
ఐదేళ్ల వరకు సంక్షేమ పథకాలు ఆశించొద్దంటూ మెలిక వాషింగ్టన్: ప్రతిభ ఆధారిత వలస (ఇమ్మిగ్రేషన్) విధానానికి మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా విదేశీ వలసదారులకు షాక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వచ్చే వలసదారులు ఐదేళ్ల వరకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందబోరని ఆయన చెప్పారు. 'మా దేశానికి వచ్చినప్పుడు ఐదేళ్లపాటు మీరు సంక్షేమ పథకాలను పొందలేరు. గతంలోగా ఇప్పుడు అమెరికాలోకి రాగానే సంక్షేమ పథకాలను పొందలేరు' అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతివారం నిర్వహించే వెబ్, రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 'ఐదేళ్లపాటు మా సంక్షేమ పథకాలను అడగటం కానీ, వినియోగించుకోవడం కానీ చేయబోనని మీరు చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌లో చేసిన నా ప్రసంగంలో చెప్పినట్టు.. అమెరికా ఉన్నతంగా కలలు కంటోంది. సాహసోపేతంగా ముందుకు వెళుతోంది' అని ట్రంప్ అన్నారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ రూపొందించిన ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్) బిల్లుకు ట్రంప్ ఇటీవల మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి స్వస్తి పలికి.. ఇక నుంచి ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా కార్డులు జారీ చేయనుంది. ఇందుకోసం ఉద్దేశించిన 'రైజ్' బిల్లు ఆమోదాన్ని ప్రస్తావిస్తూ అమెరికా సరైన దిశలో సాగుతున్నదని ట్రంప్ అన్నారు. ఈ నూతన విధానం భారతీయులకు వరమేనని భావిస్తున్నా.. ట్రంప్ మాత్రం వలసదారులపై మరిన్ని ఆంక్షలు తప్పవంటూ సంకేతాలు ఇస్తున్నారు. -
అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ జూలైలో గణనీయమైన ఉద్యోగ వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్ అంచనాలకుమించి నమోదైంది. దీంతో నిరుద్యోగం రేటు 16 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2లోల 9 వేల మేర పెరిగింది. ఇది 180,000 ఉండనుందని మార్కెట్ అంచనాను అధిగమించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మే నెలలో 145,000 గా కొత్త ఉద్యోగుల సంఖ్య జూన్ నెలలో 2, 31,000 కు చేరుకుది. మొత్తంగా ఈ రెండు నెలలో ఉద్యోగ లాభాలు గతంలో నివేదించిన దానికంటే 2,000 కన్నా అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు జూన్నెలలో నమోదైన 4.4 శాతం నుంచి 4.3 శాతానికి దిగి వచ్చింది. జూలైలో, సగటు గంట ఆదాయాలు జూన్‌లోని 0.2 శాతం కంటే వేగంగా 0.3 శాతం వృద్ధితో 26.36 డాలర్లకు పెరిగింది. మరోవైపు ఫెడరల్ రిజర్వు రానున్న సెప్టెంబర్‌లో 4.5 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడానికి తన ప్రణాళికల రచిస్తోంది. దీనికి ఉద్యోగ వృద్ధి మార్గం సుగమం చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం డిసెంబరులో ఫెడరల్ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించనుదని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా ఫెడ్ తదుపరి విధానం సమావేశం సెప్టెంబరు 19-20 న జరగనుంది. -
డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చల్ని అమెరికా ప్రోత్సహిస్తుందని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రాస్ చెప్పారు. ఈ వివాదంలో అమెరికా ఎవరికి మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు నేరుగా సమస్య పరిష్కరించుకోవాలనే కోరుతున్నామని, ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి అభిప్రాయాలు లేవని రాస్ పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో భారత, చైనాలు సైన్యాన్ని మోహరించడంతో గత నెలరోజుల నుంచి ఉద్రిక్తత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ట్రై జంక్షన్ ప్రాంతంలో భూటాన్ సరిహద్దులో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్ తన సైన్యాన్ని మోహరించింది. మరోవైపు జులై 27–28 తేదీల్లో చైనాలో జరిగే బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏ అధినేతల భేటీ కోసం భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఈ పర్యటనలో ఆయన చర్చించే అవకాశముంది. దోవల్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఉపయోగపడుతుందని చైనా విశ్లేషకుడు మా జిలాయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్జియామెన్‌లో నగరంలో జరిగే బ్రిక్స్ అధినేతలు సదస్సుకు సన్నాహకంగా ఎన్ఎస్ఏ అధినేతల భేటీ నిర్వహిస్తున్నారు. -
చైనా, అమెరికా.. మీ పని మీరు చూసుకోండి!
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై పరిష్కారం కోసం మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) జోక్యం అవసరమంటూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరుఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. కశ్మీర్ అంశంపై అమెరికా జోక్యం చేసుకుంటే.. మరో సిరియా, అఫ్ఘానిస్థాన్‌లా కశ్మీర్ మారుతుందని ఆమె అన్నారు. 'చైనా, అమెరికా తమ పని తాము చూసుకోవాలి. అఫ్ఘాన్నిస్థాన్, సిరియా, ఇరాక్ ఇలా వారు జోక్యం చోటా ఏమైందా మనందరికీ తెలిసిందే' అని ఆమె పేర్కొన్నారు. అసలు సిరియా, అఫ్ఘన్‌లో పరిస్థితి ఎలా ఉందో ఫరుఖ్ అబ్దుల్లాకు తెలుసా? అంటూ ఆమె ప్రశ్నించారు. భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్యచర్చల ద్వారానే కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. -
యూఎస్ నుంచి పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
యూఎస్ నుంచి పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని అమెరికా మిలిటరీ సంస్థ పెంటగాన్ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైనందున ఇక మిలిటరీ రియంబర్స్మెంట్కింద 2016 సంవత్సరానికి ఎలాంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాట్టిస్ తెలిపారు. పాక్‌లోని అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని అమెరికా అధికారులు చెప్పారు. 'పాకిస్థాన్ ప్రభుత్వానికి మేం 2016కుగానూ నిధులు మంజూరు చేయలేం. ఎందుకంటే హక్కానీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పాక్ వ్యవహరించినట్లుగానీ, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకున్నట్లుగానీ పాక్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్న మా దేశ ప్రతినిధి జిమ్ మాట్టిస్ ధ్రువీకరించనందున ఈ నిర్ణయం తీసుకున్నాం' అని పెంటగాన్ అధికారిక ప్రతినిధి ఆడం స్టంప్ విలేకరులకు చెప్పారు. -
'ఉత్తర కొరియా' వెళ్లకుండా యూఎస్ బ్యాన్!
బీజింగ్: తమ దేశ పౌరులను ఇక ఉత్తర కొరియాకు వెళ్లనివ్వకూడదని అమెరికా నిర్ణయించుకుంది. ఉత్తర కొరియా విధించిన జైలు శిక్ష కారణంగా తమ దేశ పర్యాటకుడు ఒట్టో వాంబియర్ మృతి చెందిన నేపథ్యంలో మరికొద్ది వారాల్లోనే తమ దేశ పౌరులెవరనీ కూడా ఉత్తర కొరియాకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చైనాకు చెందిన ఓ ట్రావెల్ సంస్థ, కొరియాకు చెందిన ట్రావెల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నెల (జూలై) 27 నుంచి ఈ బ్యాన్‌ను అమెరికా అమలు చేస్తుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం ఉత్తర కొరియాకు వెళ్లిన, వెళుతున్న అమెరికా వారి పాస్‌పోర్టులను 30 రోజుల వరకే అనుమతి ఉంటుందట. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తుందని ఆ సంస్థలు వెల్లడించాయి. 'అమెరికా ప్రభుత్వం నుంచి మాకు ఇప్పుడే సమచారం అందింది. అమెరికా పౌరులను ఇక ఎంతో కాలము ఉత్తర కొరియా వెళ్లేందుకు అనుమతించడం కుదరదు. అలా వెళ్లిన వారి పాస్‌పోర్ట్‌లు 30 రోజుల విలువలేనివిగా మారిపోతాయి' అని చైనాకు చెందిన ట్రావెలింగ్ సంస్థ యంగ్ పయనీర్ టూర్స్ తెలిపింది. అయితే, అమెరికాకు చెందిన ఏ విభాగం ఈ ప్రకటన చేసిందనే విషయాన్ని మాత్రం తెలపలేదు. -
2వేల మందిని పైగా నియమించుకుంటాం..
న్యూయార్క్ : డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ అమెరికన్లకు భారీగా ఉద్యోగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో దేశీయ సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహింద్రా కూడా ఈ ఏడాది అమెరికాలో 2,200 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. గతేడాది కూడా ఈ కంపెనీ ఇంతేమొత్తంలో ఉద్యోగులను నియమించుకుంది. తమ దేశంలో ఉద్యోగాలను సృష్టించాలని ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో టెక్ మహింద్రా ఈ నియామకాల ప్లాన్‌ను ప్రకటించినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఈ కంపెనీకి అమెరికాలో 6000 మంది ఉద్యోగులుండగా.. 400 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు. గత నాలుగేళ్లుగా కూడా ఈ కంపెనీ నియామకాలు కాలేజీల నుంచే జరుగుతున్నాయి. ''గతేడాది తాము సుమారు 2,200 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. ఈ ఏడాది కూడా అంతేమొత్తంలో నియమించుకోవాలని చూస్తున్నాం'' అని టెక్ మహింద్రా అధ్యక్షుడు, స్ట్రాటజిక్ వెర్టికల్స్ లక్ష్మణన్ చిదంబరం చెప్పారు. అమెరికాలో నియామకాలకు ప్రధాన కారణంగా.. ఆ దేశ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు అందాయని, అమెరికాలో ఉద్యోగాలు కల్పించడంలో తాము అతిపెద్ద పాత్ర పోషించాలని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్ మహింద్రాకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికాలో మొత్తం 28 నగరాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అంతేకాక 16 డెవలప్మెంట్ సెంటర్లను కలిగిఉంది. ప్రపంచవ్యాప్తగా ఈ కంపెనీకి 1.17 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఐటీ కంపెనీలు ఇటీవల అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో తీవ్ర కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొంటున్నాయి. వ్యాపార వాతావరణంలోను, వర్క్ పర్మిట్లోనూ ఆ దేశాలు పరిమితులు విధిస్తున్నాయి.. కాగ, కంపెనీలు కూడా భారత్‌లో ఉద్యోగాల కోత విధించి, అమెరికాలో భారీగా నియామకాల ప్రక్రియకు తెరలేపినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ రిపోర్టులను టెక్ దిగ్గజాలు ఖండిస్తున్నాయి. -
పాక్‌కు గడ్డుకాలం.. బ్రేక్ వేసిన యూఎస్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు ఇక అమెరికా నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవ్వనున్నాయి. ఉగ్రవాదం అణిచివేసే పేరుతో ఇబ్బడిముబ్బడిగా సహాయ నిధులు తెచ్చుకుంటున్న పాకిస్థాన్‌కు అమెరికా బ్రేక్ వేసింది. ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ జాతీయ రక్షణ అధికారిక చట్టానికి తాజాగా మూడు సవరణలు తీసుకొచ్చి ఆమోదించారు. దీని ప్రకారం గతంలో మాదిరిగా పాక్ తమ రక్షణ పేరిట నిధులను ఇష్టం వచ్చినట్లు తెచ్చుకునే వీలుండదు. తాము ఉగ్రవాదులను ఎంత మేరకు కట్టడి చేశామనే విషయాన్ని, ఏ ప్రాంతాలను ఉగ్రవాద రహిత ప్రాంతాలుగా మార్చామనే విషయాన్ని అమెరికాకు నివేదిక రూపంలో పాకిస్థాన్ ఇవ్వాలి. ఆ నివేదిక పరిశీలించి నమ్మితేనే పాక్‌కు అమెరికా నిధుల సహాయం చేస్తుంది. జాతీయ రక్షణ సంస్థ చట్టం ప్రకారం 2018కిగాను 651 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ దానిని ఏ విధంగా ఖర్చు చేయాలనే విషయంపై మూడు సవరణలు తీసుకొచ్చి లోయర్ హౌజ్ ఆఫ్‌ది కాంగ్రెస్‌లో ప్రవేశ పెట్టి మూజువాణి ఓటుతో శుక్రవారం సాయంత్రం ఆమోదించారు. ఈ సందర్భంగా విదేశాంగ వ్యవహారాలకు చెందిన కమిటీ సభ్యుడు పో మాట్లాడుతూ.. 'రక్షణ సహాయం పేరిట పాకిస్థాన్ ఇప్పటి వరకు అదనంగా పొందుతున్న నిధుల వరదకు అడ్డుకట్ట వేసే క్రమంలో తొలి అడుగు ముందుకు పడింది. ఇక నుంచి పాక్ ఎలాంటి సహాయం చేయాలన్నా ముందు వారు ఉగ్రవాదం అణిచివేసేందుకు ఏమేం చేశారో చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత సహాయం చేసే విషయం ఆలోచిస్తాం' అని తెలిపారు. వాస్తవానికి పాక్‌కు అమెరికా నుంచి పెద్ద మొత్తంలోనే సహాయం అందుతుంటుంది. అయితే, వీటిని ఉగ్రవాదం అణిచివేసేందుకు కాకుండా పాక్ వాటిని మరింత ప్రోత్సహించేందుకు వాడుతుందని భారత్‌తో సహా పలు దేశాలు అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.