పాకిస్థాన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని అమెరికా మిలిటరీ సంస్థ పెంటగాన్ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైనందున ఇక మిలిటరీ రియంబర్స్‌మెంట్‌కింద 2016 సంవత్సరానికి ఎలాంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాట్టిస్ తెలిపారు.