
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది తమ వెంట తుపాకులు తీసుకెళ్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక నెలకోసారి ఇలా తుపాకులు తీసుకెళ్తున్న వారి సంఖ్య సుమారు 90 లక్షలని తెలిసింది. భద్రతా కారణాల రీత్యానే ఆయుధాలను వెంట ఉంచుకుంటున్నట్లు వారిలో చాలా మంది తెలిపారు.
అమెరికాలో తుపాకుల వాడకంపై 20 ఏళ్లలో తొలిసారి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. వేర్వేరు రాష్ట్రాల్లో చట్టాలకు అనుగుణంగా తుపాకులను తీసుకెళ్తున్న ధోరణులను ఇందులో పరిశీలించారు. తుపాకులను వెంట తీసుకెళ్లే వారిలో ఎక్కువ మంది యువకులు, అందునా అధిక శాతం పురుషులేనని తేలింది.