guns
-
గన్స్@ వాట్సాప్
సాక్షి, అమరావతి: భారత్‌లో వాట్సాప్ గ్రూపుల ద్వారా తుపాకుల అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రముఖ సోషల్ మీడియా టూల్స్ పరిశోధక సంస్థ డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ పరిశోధనలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. దేశంలోని భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వాట్సాప్ గ్రూపుల్లోనే తుపాకుల విక్రయాలకు సంబంధించిన ప్రకటనలు పోస్టు చేస్తున్నారని తెలిపింది.గతంలో అక్రమ తుపాకులు కొనుగోలు చేయాలంటే ఉత్తరప్రదేశ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల విక్రేతలను లేదా వారి ఏజెంట్లను రహస్యంగా కలిసి ఆయుధాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే... కేవలం వాట్సాప్ ద్వారానే తాము కోరుకున్న అక్రమ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థల ద్వారా ఆ ఆయుధాలు డోర్ డెలివరీ అవుతున్నాయని డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. పరిశోధనలో వెల్లడైన అంశాలివీ...⇒ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కేంద్రంగా దేశవ్యాప్తంగా అక్రమ తుపాకుల వ్యాపారం జోరుగాసాగుతోంది. అక్రమ ఆయుధాల వ్యాపారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి మరీ తుపాకులు అమ్ముతున్నారు. తమవద్ద ఉన్న తుపాకులు, వాటి ధరలు, ఇతర వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు.⇒ 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య మన దేశంలో వాట్సాప్ చాటింగ్ ద్వారా అక్రమ తుపాకుల విక్రయాలకు సంబంధించిన 8 వేలకుపైగా ప్రకటనలు జారీ చేశారు. ⇒ ఏకంగా 234 వాట్సాప్ గ్రూపుల్లో అక్రమ తుపాకుల విక్రయాల వివరాలను పోస్టు చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులన్నీ బహిరంగంగానే అందరికీ అందుబాటులో ఉండటం గమనార్హం. ఒక్కో వాట్సాప్ గ్రూపులో వందలాది మంది సభ్యులు ఉన్నారు. ⇒ మన దేశంలో 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. దాంతో వ్యాపార, పారిశ్రామిక సంస్థలు వాట్సాప్‌ను తమ వ్యాపార విస్తరణకు వేదికగా చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారులు కూడా అదే రీతిలో వాట్సాప్ ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. నిషేధం ఉన్నా పట్టించుకోని ‘మెటా’'సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయుధాల వ్యాపారం భారత్‌లో నిషిద్ధం. కానీ.. ఈ విషయాన్ని మెటా సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. మెటా సంస్థే నిర్వహిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్రమ ఆయుధాల అమ్మకాల ప్రకటనలు జారీ చేసిన ఓ ముఠాను 2023లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా మెటా సంస్థ సరైన నియంత్రణ చర్యలు చేపట్టలేదు. 2022–2024లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో అక్రమ ఆయుధాల విక్రయాల ప్రకటనలను మెటా సంస్థ ఆమోదించడం అప్పట్లోనే తీవ్ర అలజడి సృష్టించింది. ప్రస్తుతం భారత్‌లోనూ మెటా సంస్థ నిర్వహిస్తున్న వాట్సాప్ ద్వారా పలు ముఠాలు అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.బిజినెస్ ఖాతాల ద్వారానే..అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తున్న ముఠాల వాట్సాప్ ప్రొఫైల్స్‌ను డిజిటల్ విట్నెస్ ల్యాబ్ విశ్లేషించింది. ఆ ముఠాలన్నీ బిజినెస్ ఖాతాల ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కస్టమర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆ ఖాతాలన్నీ అదనపు ఫీచర్లు కలిగి ఉన్నాయని కూడా గుర్తించింది. కోడ్ భాషలో అక్రమ ఆయుధాలను విక్రయిస్తున్నారని పేర్కొంది. 2022లో 1.04 లక్షల అక్రమ ఆయుధాల జప్తునేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1.04 లక్షల అక్రమ ఆయుధాలను పోలీసులు జప్తు చేశారు. పోలీసుల దృష్టికి రాని అక్రమ ఆయుధాలు అంతకుమించి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. అంటే దేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం ఎంతగా విస్తరించిందన్నది ఈ ఉదంతం వెల్లడిస్తోంది. మరోవైపు వాట్సాప్ ద్వారా తుపాకుల విక్రయాలకు ప్రకటనలు జారీ చేస్తుండటం అక్రమ ఆయుధాల ముఠాల బరితెగింపునకు నిదర్శనం. -
మోహన్ బాబు 24వరకు టైమ్ అడిగారు: రాచకొండ సీపీ
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలో తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిని మోహన్‌బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్‌పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సీపీ తాజాగా మీడియాతో మాట్లాడారు.'ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాము. చట్టప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ, డిసెంబర్ 24 వరకు టైమ్ అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదు.మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. కానీ, రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ ఇవ్వలేదు. మరోకసారి మోహన్‌బాబుకు నోటీసు ఇస్తాం. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము. ఒకవేళ మళ్లీ విచారణకు ఆయన రాకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సీపీ అన్నారు.లైసెన్స్డ్ గన్స్ సరెండర్ చేసిన మోహన్ బాబుమోహన్బాబు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్‌తో పాటు స్పానిష్ మెడ్ గన్ ఉంది. -
జేబులో తుపాకీ..‘యూఎస్’లో హాట్‌టాపిక్ ఇదే
అమెరికాలో గన్‌కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు సామాన్యులపైకి తుపాకులు ఎక్కుపెడుతుంటారు. వ్యక్తిగత, ఆర్థిక, విద్వేషం,జాాత్యహంకారం ఇలా కారణమేదైనా కావొచ్చు బహిరంగ ప్రదేశాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను అకారణంగా గాల్లో కలిపేస్తుంటారు. ఇలాంటి ఉన్మాద కాల్పులు అగ్రదేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి.సామాన్యుల మరణాలకు కారణమవుతున్న తుపాకులు దేశంలో అందరూ యథేచ్చగా వాడొచ్చా..వాటి విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ ఉండాలా వద్దా అనే చర్చ అమెరికాలో ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది హాట్‌టాపిక్‌గా మారింది. హారిస్ ఏమంటున్నారు..గన్ల విచ్చలవిడి అమ్మకాన్ని నిషేధించాలనే వాదనకు తన మద్దతుంటుందని అధ్యక్ష పోరులో తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఇప్పటికే స్పష్టం చేశారు.ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ట్రంప్ స్టాండ్ ఈ విషయంలో మరోలా ఉంది. వెనక్కు తగ్గని ట్రంప్..ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా తనపైనే కాల్పులు జరిగినా ట్రంప్ వెనక్కు తగ్గడం లేదు. తుపాకులు ఎవరికి పడితే వారికి అమ్మడాన్ని ఆయన మద్దతిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి బైడన్ హయాంలో గన్ల నియంత్రణపై తెచ్చిన చట్టాలేవైనా ఉంటే వాటిని తాను పవర్లోకి రాగానే రద్దు చేస్తానని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతిస్తున్న టెక్ బిలియనర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ గన్ కల్చర్‌పై ఒక ట్వీట్ చేశారు. మద్దతిస్తే 100 డాలర్లు.. ‘మస్క్’ వింత ఆఫర్ పెన్సిల్వేనియాలో ఓటర్‌గా నమోదై ఉండి వాక్స్వాతంత్రం, అందరూ తుపాకులు కలిగి ఉండడం అనే అంశాలకు మద్దతిస్తున్నవారందరికీ మస్క్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ అంశాలకు మద్దతుగా రూపొందించిన తమ పిటిషన్‌పై సంతకం పెడితే 100 డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. If you’re a registered Pennsylvania voter, you & whoever referred you will now get $100 for signing our petition in support of free speech & right to bear arms.Earn money for supporting something you already believe in!Offer valid until midnight on Monday.— Elon Musk (@elonmusk) October 18, 2024 గన్ కల్చర్ ఎఫెక్ట్.. అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలివీ..ఓక్లహామాలోని ఓక్లహామా నగరంలో ఇటీవల రెండురోజుల్లో వరుసగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.అలబామా రాష్ట్రం బర్మింగ్హమ్లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన బహిరంగ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. డజను మందికిపైగా గాయపడ్డారు.టెక్సాస్‌లోని అలెన్‌లో ఓ షాపింగ్ సెంటర్లో దుండగుడు జరిపిన బహిరంగ కాల్పుల్లో 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు.ఇదీ చదవండి: హారిస్ సారీలు..హామీలు -
మోదీ వాటర్ గన్లపై కాంగ్రెస్ ఆగ్రహం
హోలీ వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు కనిపిస్తున్నాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్లు విరివిగా విక్రయమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్‌పై బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లను వినియోగించరని స్పష్టం చేశారు. -
గన్స్ & కార్స్
సాక్షి, హైదరాబాద్: సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు. ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు .22 పిస్టల్ వారసత్వంగా రాగా.. యాకుత్‌పుర బరిలో ఉన్న జాఫర్ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్నగర్ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి టెక్సాస్ నుంచి టెస్లా, ల్యాండ్ రోవర్ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు. విదేశాల నుంచి గన్స్ దిగుమతి.. యాకుత్‌పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ మిరాజ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్ బ్రాండ్ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్ రివాల్వర్, .32 పిస్టల్ రాఫ్టర్ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్ కూడా ఉంది. మలక్‌పేట అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్ గన్లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ వాహనాలున్నాయి. బలాలకు షహనాజ్ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్వీ, టొయోటా ఫార్చ్యూనర్ కార్లున్నాయి. హరీశ్ వర్సెస్ రేవంత్.. రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్ ఉన్నాయి. రేవంత్ పేరు మీద సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్‌తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. ఎస్బీబీఎల్ పంప్ యాక్షన్ గన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్ సింగిల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (ఎస్బీబీఎల్) పంప్ యాక్షన్ గన్ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్‌సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్‌తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్ ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీ నుంచి.. గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి. ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్‌గా భావించే .22 పిస్టల్ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు. 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్ డబుల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (డీబీబీఎల్) గన్ కూడా ఉంది. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ కూడా అక్బరుద్దీన్ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్ఎక్స్ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. స్పోర్ట్స్ కారులో అజార్, టెస్లాలో శ్రీలత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్–వీ కార్లున్నాయి. హుజూర్నగర్ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి. రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి వద్ద 2021 మోడల్ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్ ల్యాండ్ రోవర్ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. లైసెన్స్డ్ తుపాకులు రద్దు!
యాదాద్రి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు (గన్స్) పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖుల నుంచి పోలీస్ శాఖ ఆయుధాలను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు వారందరికి నోటీసులు జారీచేసింది. నోటీసు అందిన వారం రోజుల్లోగా తమ వద్ద ఉన్న తుపాకులను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందజేయాలని స్పష్టం చేసింది. దీంతో లైసెన్స్డ్ తుపాకీలు కలిగిన వారంతా పోలీసు స్టేషన్ల బాటపట్టారు. ఉమ్మడి జిల్లాలో 455 మంది లైసెన్స్ తుపాకులు తీసుకున్న వారు ఉన్నారు. అందులో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులే. ఆ తరువాత బడా వ్యాపారులు ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలో 227 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, వారిలో దాదాపుగా ఇప్పటికే పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో 154 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, 110 మంది ఇప్పటికే తిరిగి అప్పగించారు. యాదాద్రి జిల్లాలో 74 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, వారిలో కొంతమంది తిరిగి అప్పగించారు. మిగతా వారు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర నాయకులు ఉన్నారు. తగ్గిన లైసెన్స్డ్ గన్లు నల్లగొండ జిల్లాలో గన్ కల్చర్ కొంత మేర తగ్గింది. గతంలో భారీ సంఖ్యలో వ్యక్తిగత తుపాకులు కలి గిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రాణ భయంతో వ్యక్తిగత భద్రత కోసం గన్ లైసెన్స్‌లను ఎక్కువ మంది తీసుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 వరకు వ్యక్తిగత ఆయుధాలను సమకూర్చుకోగా, ఇప్పుడు వారి సంఖ్య 455కు తగ్గిపోయింది. గత ఎన్నికల సమయంతో పోల్చితే సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు మినహా నల్లగొండలో ఈ ఐదేళ్లలో గన్ లైసెన్స్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. 2018 ఎన్నికల సమయంలో నల్లగొండలో 257 మంది లైసెన్స్డ్ గన్స్ కలిగిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 227కు తగ్గింది. దుర్వినియోగం చేయవద్దనే.. ఎన్నికల సమయంలో, సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు, ప్రతిపక్ష పార్టీలు తారసపడినప్పుడు వాటిని దుర్వినియోగం చేసే అవకాశాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధన తీసుకువచ్చింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎవరూ వ్యక్తిగతంగా భయబ్రాంతులకు గురిచేయకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న గన్లను పోలీసు స్టేషన్లలో అప్పగించేలా నిబంధన విధించింది. వీటికి మినహాయింపు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్న సమయంలో గన్స్ పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయడంలో కొన్ని విభాగాలను మినహాయించారు. ముఖ్యంగా బ్యాంకుల సెక్యూరిటీ, టోల్ ప్లాజాలు, క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్‌లో ఉన్న వాటిని డిపాజిట్ చేయడం నుంచి మినహాయించారు. -
తుపాకీతో.. కలకలం రేపిన ‘క్రెడాయ్’ అధ్యక్షుడు!
సాక్షి, వరంగల్: పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ విందులో ఈ నెల 15న గాల్లోకి కాల్పులు జరిపిన బిల్డర్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు పరకాల సీఐ జె.వెంకటరత్నం తెలిపారు. ఈ ఘటనపై గురువారం సదరు ఫంక్షన్ హాల్ వద్ద విచారణ చేపట్టారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజేశ్వర్‌రావుతోపాటు సిబ్బందిని విచారించారు. తనకు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో కొందరిని బెదిరించడంతోపాటు భయపెట్టడానికే తిరుపతిరెడ్డి తన వద్ద ఉన్న రివాల్వర్‌ను ప్రదర్శించి మద్యం మత్తులో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తేలిందని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురై వెళ్లిపోయారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిరెడ్డిని అరెస్ట్ చేసి పరకాల కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కాగా, పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత భద్రత పేరిట.. మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ వ్యక్తిగత భద్రత పేరిట గన్‌కల్చర్‌పై పలువురు ఆసక్తి చూపుతుండగా.. ఇప్పుడది భద్రత కంటే హోదా, ఫ్యాషన్‌గా మారిపోయింది. ఫలితంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౖపైవేట్ ‘గన్’లు గర్జిస్తున్నాయి. తాగిన మైకంలో మాటలు పెరిగి పట్టరాని ఆవేశంతో ‘ట్రిగ్గర్’ నొక్కుతున్న ఘటనలు వివాదాస్పదం అవుతున్నాయి. ‘క్రెడాయ్’ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బిల్డర్ ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి (సిద్ధార్థ తిరుపతిరెడ్డి) పరకాలలో ఆర్ఆర్ గార్డెన్లో ఓ దశ దినకర్మకు హాజరై తాగిన మత్తులో రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ నెల 15న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా.. గురువారం అతడిని పోలీసులు పరకాల కోర్టులో హాజరుపర్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కలకలం రేపుతున్న ‘తుపాకులు’.. హైదరాబాద్, ముంబై వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అక్రమంగా తుపాకులు కలిగి ఉండటం, బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం పాకాయనే చర్చ కొనసాగుతోంది. ఏదో సాకు చూపి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఎక్కువగా తుపాకీ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలో ఇలాంటివారే ఆయుధాల లైసెన్సులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మ రక్షణకు తీసుకున్న వీరిలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తేనే తప్ప తెలవడం లేదు. పరకాలలో కాల్పులు జరిపిన ఘటన కూడా ఐదు రోజుల తర్వాత వెలుగు చూసింది. ఆగని ఆగడాలు.. 2014 ఫిబ్రవరి ఆఖరు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 314 ఆయుధ లైసెన్స్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాంకులు, బ్యాంకుల వద్ద పనిచేసే వారి కోసం ఇచ్చినవి 74, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినవి 240 ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల కోటాలో తీసుకున్న వారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు. 2015 జనవరి 25న వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లా... వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా మారింది. 2016 అక్టోబర్ 11న జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో కమిషరేట్ పరిధి పెరిగింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలు కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 180 లైసెన్స్ తుపాకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లైసెన్స్‌లు పొందినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం, ఇతరులను బెదిరించడం, తాను ఆయుధం కలిగిఉన్నానని ఇతరులను ఆందోళనకు గురి చేసినా ఆ లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది. ఆత్మరక్షణ కోసం మినహా ఏ సందర్భంలోనూ ఆయుధం ప్రదర్శించినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు కఠినతరం చేసినా ఆగని ఆగడాలపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. తిరుపతిరెడ్డి గన్ లైసెన్స్‌పై ఆరా.. పరకాల ఆర్ఆర్ గార్డెన్స్‌లో క్రెడాయ్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత గాల్లోకి రివాల్వర్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు పరకాల పోలీసులతోపాటు స్పెషల్ బ్రాంచ్ అఽధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం లేనప్పటికీ.. తిరుపతిరెడ్డికి లైసెన్స్ ఇవ్వడంలో గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి బంధువు కావడమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుపాకీ లైసెన్స్ ఎప్పుడు జారీ అయ్యింది? సిఫారసు చేసిన అఽధికారి ఎవరు? నిజంగానే తిరుపతిరెడ్డి లైసెన్స్‌కు అర్హుడా? అనే అంశాలతోపాటు పలు కోణాల్లో విచారిస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. -
TS Crime News: ఉద్యోగానికి అడ్డొచ్చాడని.. కంట్రీమేడ్ పిస్టల్‌తో కాల్పుల కలకలం..!
హైదరాబాద్: వారిద్దరు ఓ హోటల్లో ఉన్నతోద్యోగులుగా పని చేస్తున్నారు. జీఎం పోస్టు వారి మధ్య చిచ్చు రేపింది. పని బాగా చేస్తుండటంతో ఒకరిని జీఎం పోస్టు వరించింది. పని తీరు సరిగా లేకపోవడంతో మరొకరి జీఎం ఊడింది. దీంతో సహనం కోల్పోయిన మాజీ జనరల్ మేనేజర్ కొత్త జీఎంతో గొడవకు దిగడంతో మేనేజ్మెంట్ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. తన ఉద్యోగం పోవడానికి అతడే కారణమని కక్ష పెంచుకున్న అతను రెక్కీ నిర్వహించి కంట్రీమేడ్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మాదాపూర్ డీసీపీ సందీప్ రావు కేసు వివరాలు వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన దేవేందర్ గయాన్(35) పదేళ్లుగా హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో పని చేస్తున్నాడు. 9 నెలలుగా మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే హోటల్లో కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌కు చెందిన రితీష్ నాయర్ జనరల్ మేనేజర్‌గా పని చేసేవాడు. దేవేందర్ పని తీరు నచ్చడంతో హోటల్ యాజమాన్యం రితీష్‌ను తొలగించి అతడి స్థానంలో దేవేందర్‌ను జనరల్ మేనేజర్‌గా నియమించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు నెల రోజుల క్రితం రితీష్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో దేవేందర్‌పై కక్ష పెంచుకున్న రితీష్ బీహార్ వెళ్లి కంట్రీమేడ్ పిస్టల్ కొనుగోలు చేసి తిరిగి నగరానికి వచ్చాడు. కొద్ది రోజులుగా దేవేందర్‌ను హత్య చేసేందుకు సందర్శిని ఎలైట్ హోటల్ వద్ద రెక్కీ నిర్వహించాడు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో సందర్శిని ఎలైట్ హోటల్ పార్కింగ్‌లో హెల్మెట్ ధరించి కాపు కాచాడు. రాత్రి 9.40 గంటల సమయంలో దేవేందర్ హోటల్ నుంచి బయటికి రాగానే రితీష్ నాయర్ అతడిపై కాల్పులు జరిపాడు. ఆరు రౌండ్లు కాల్పులు జరపగా ఐదు బుల్లెట్లు దేవేందర్ శరీరంలోకి చొచ్చుకెళ్లాయి, ఒక బుల్లెట్ మిస్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన అతడిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కేరళ వెళ్లేందుకు మెట్రో స్టేషన్ వేచి ఉన్న రితీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీహార్‌లో పిస్టల్ ఎక్కడ కొనుగోలు చేశాడు, అతని సహకరించిన వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంలోని ప్రపంచ టాప్ 10 డేంజరస్ గన్స్
-
వేదికపై వధూవరులు.. జస్ట్ మిస్ లేదంటే ఎంత ఘోరం జరిగేది!
పెళ్లి అనేది జీవితంలో జరిగే మరిచిపోలేని ఘటన. అందుకే వధూవరులు ఆ రోజు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటూ ఆ జ్ఞాపకాలును జీవితాంతం గుర్తుగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఇంకొంత మంది మరొ అడుగు ముందుకేసి వైరటీ ఫోటో షూట్లంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ ట్రెండ్ పాటించే వారి సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మహారాష్ట్రలో ఓ పెళ్లి జంట కూడా ఇలాగే ప్లాన్ చేసింది గానీ.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. తమ పెళ్లి రోజున ఓ వధూవరులు మండపంపై తుపాకీలు పట్టుకుని ఫోటోలకు పోజులిస్తూ ఉంటారు. వారి చేతిలో ఉన్న తుపాకీల నిప్పులు (ఫైర్ గన్) వెదజల్లుతూ ఉంది. ఇదిలా కొనసాగుతుండగా వధువు చేతిలో ఉన్న తుపాకి ప్రమాదవశాత్తు పేలుతుంది. భయంతో, ఆమె త్వరగా ఆయుధాన్ని పడవేసి దూరంగా వెళుతుంది. మంటలు అంటుకుంటాయనే భయంతో తన మెడలోని మాలను కూడా తొలగిస్తుంది. ప్రజలు ముందుకు వచ్చి ఆ వధువుకి సహాయం చేయడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు జస్ట్ మిస్ లేదంటే ఎంత ఘోరం జరిగేదని కామెంట్లు పెడుతున్నారు. Idk what's wrong with people these days they are treating wedding days more like parties and this is how they ruin their perfect day. 🤷♀️ pic.twitter.com/5o626gUTxY — Aditi. (@Sassy_Soul_) March 31, 2023 -
తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా
అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు ‘తుపాకుల’. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు.ఆ వంశీయులే కాకుండా.. వారి అల్లుళ్లు సైతం ఇవే వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశ సరిహద్దుల్లోని ప్రతి బెటాలియన్‌లో తారసపడతారు. ఇంటి పేరును ఆయుధంగా మార్చుకుని వందలాది మంది తుపాకులు చేతపట్టారు. ‘తుపాకుల’ వంశం వివరాలు, వీరి దేశభక్తిని తెలుసుకుందామా మరి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సముద్ర తీరప్రాంత గ్రామం కనపర్తి. దీనికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారు. కార్తవ రాయుడు పాలించిన గడ్డ ఇది. ముత్యాలు, వజ్రాలు, రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేవారని పూరీ్వకుల కథనం. ఇక్కడ పురావస్తు ఆనవాళ్లకు గుర్తుగా నంది విగ్రహాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై బ్రిటీష్ వాళ్ల కళ్లు పడ్డాయి. కనపర్తి, పెదగంజాం, దేవరంపాడు ప్రాంతాల్లో ఉప్పు పండించేవారు బ్రిటీష్ పాలకులు. బకింగ్ హాం కెనాల్ నుంచి ఉప్పును తమ దేశానికి తరలించే వారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఆ తర్వాత కనపర్తికి పక్కనే ఉన్న దేవరంపాడులో నిర్వహించిన ఉప్పు సత్రాగ్రహానికి మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు మద్దతు పలికారు కూడా. తమకు రక్షణగా ఉన్న బెటాలియన్లోకి, ఉప్పు పొలాల వద్ద రక్షణగా పనిచేసేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను గార్డులుగా నియమించుకున్నారు. వీరు దృఢంగా, భారీ కాయులుగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు. మరికొందర్ని బలవంతంగా బ్రిటీష్ మిలిటరీలోకి తీసుకెళ్లారు. బ్రిటీష్ హయాంలో కనపర్తిలో సాల్ట్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఉంది. ఆ సాల్ట్ కార్యాలయానికి ఎదురుగానే బ్రిటీష పోలీస్ క్వార్టర్స్ కూడా ఉండేవి. పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలమైపోయాయి. సాల్ట్ కార్యాలయం కూడా అవసాన దశకు చేరుకుంది. మిలిటరీ వాళ్లకు పెట్టింది పేరు కనపర్తి పెద్ద ఊరు కనపర్తి తోపు తొలుత మిలిటరీ, ఆ తర్వాత పోలీస్, కాలక్రమేణా ఇతర యూనిఫాం విభాగాల్లో సేవలు అందిస్తే.. కనపర్తి పెద్ద ఊరు మాత్రం మిలిటరీ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం 150 మందికిపైగా దేశ సేవలో పునీతులవుతున్నారంటే ఆ ఉద్యోగాలంటే ఎంత మక్కువో అర్థమవుతోంది. ఆ గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో కెపె్టన్లుగా పదవీ విరమణ చేసిన వారున్నారు. వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. పులుగు వెంకటేశ్వరరెడ్డి, కుక్కల వెంకటేశ్వరరెడ్డి కెపె్టన్లుగా పనిచేశారు. వారు కాలక్రమేణా వయస్సు రీత్యా మృతి చెందారు. ఇకపోతే 33 సంవత్సరాల పాటు సేవలందించిన కుక్కల శివారెడ్డి, సూరిబోయిన వెంకటప్పలనాయుడు కూడా కెపె్టన్లుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. మిలిటరీలో తొలి అడుగుతుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు 1930 సంవత్సరానికి ముందు తుపాకుల చెన్నయ్య మొదటిసారిగా బ్రిటీష్ మిలిటరీలోకి వెళ్లారు. వాళ్లు నలుగురు సోదరులు. వాళ్లందరూ కూడా మిలిటరీలో దేశానికి సేవచేసిన వారే. తర్వాత ఆయన సంతానం పెద చెన్నయ్య, సోమయ్య, బంగారయ్యలు పోలీసులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు నలుగురు సంతానంలో తుపాకుల సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, వీర రాఘవయ్యలు. వీళ్లందరూ కూడా పోలీసులే. ఈ నలుగురు సంతానంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు మొదలుకుని ఎనిమిది మంది వరకు పోలీసులుగా ప్రజలకు సేవలు అందించారు. ప్రతి ఇంట్లో పోలీసులే... కనపర్తి తోపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో పోలీసులే కనపడతారు. తుపాకులతో పాటు ఆవుల, బొజ్జా అనే ఇంటిపేరు వారు కూడా తుపాకుల వారితో పోటీ పడి మరీ పోలీసులతో పాటు ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఇలా యూనిఫాం విభాగాల్లోనే సేవలు అందించారు. కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్పీ వరకు అన్ని హోదాల్లో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో ఎనిమిది వందల గడపలు ఉంటే యూనిఫాం లేని ఇల్లు ఉండదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరంలోనైనా, ఏ జిల్లా కేంద్రంలోనైనా తుపాకుల ఇంటి పేరు ఉన్న వారు పోలీసు కొలువుల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా పోలీస్ విభాగంలో ఉత్సాహంగా చేరాం నేను చిన్నతనంలో ఊరికి మిలిటరీ, పోలీస్ డ్రెస్సులు వేసుకుని బంధువులు వస్తుండేవారు. అది చూసి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న ఆశ ఎక్కువగా ఉండేది. మా ముత్తాతలు మిలిటరీలో పనిచేశారు. ఆ తర్వాత మా తాతలు నలుగురు పోలీసులే. మా నాన్న వీరరాఘవయ్య పోలీస్ విభాగంలో పనిచేశారు. మా పెదనాన్నలు సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు కూడా పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా పెదనాన్నల కుమారులు, మా అన్నదమ్ములు పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. నేను ఎక్సైజ్ సెలక్షన్స్‌కు వెళ్లాను. మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ విభాగంలో ఏడాదిన్నర క్రితం ఎస్సైగా పదవీ విరమణ పొందాను. మా ఇంటి ఆడపిల్లల్ని అందరినీ పోలీస్ విభాగంలో పనిచేసిన వారికే ఇచ్చారు మా తల్లిదండ్రులు. అందరం సంతోషంగా ఉన్నాం. – తుపాకుల చెన్నకేశవరావు, రిటైర్డ్ ఎస్సై, ఎక్సైజ్ విభాగం ఏఎస్పీలుగా ముగ్గురు పదవీ విరమణ కనపర్తి గ్రామానికి చెందిన వారిలో ముగ్గురు ఏఎస్పీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారిలో తుపాకుల రామకృష్ణ ఏఎస్పీగా రిటైరై తెనాలిలో కుటుంబంతో స్థిరపడ్డారు. మరొకరు తుపాకుల వెంకటేశ్వరరావు ఏఎస్పీగా రిటైరై గుంటూరులో ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇంకొకరు ఆవుల సుబ్బారావు ఏఎస్పీగా రిటైరై కాకినాడలో స్థిరపడగా, తుపాకుల మురళీకృష్ణ డీవైఎస్పీగా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇక సీఐ, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటు పోలీస్, ఇటు ఎౖజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. యూనిఫాం విభాగాలు కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేసిన, చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆడపిల్లలను పోలీసులకే ఇచ్చి వివాహం మొదటి నుంచి తుపాకుల వంశీయులు మిలిటరీ, పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఇంటి ఆడపడుచులను కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారికే ఇచ్చి సంబంధాలు కలుపుకున్నారు. ఆ విధంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు యూనిఫాంలు ధరించే వారితో కలర్ఫుల్గా ఉండటాన్ని వారు కూడా స్వాగతించారు. మా వంశం మొత్తం మిలిటరీ, పోలీసులుగానే మా వంశం మొత్తం మిలిటరీ, పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా ముత్తాత కూడా మిలిటరీలో పనిచేశారని మా తాత చెప్పేవారు. మా తాత రాఘవయ్య బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. మా నాన్న కోటయ్య 1939లో బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్హతను బట్టి మిలిటరీలోకి, పోలీస్ విభాగంలోకి, ఎక్సైజ్ విభాగంలోకి వేరే ఇతర విభాగాల్లోకి పంపించారు. నేను పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 2010లో పదవీ విరమణ పొందాను. – బొజ్జా కృష్ణమూర్తి, రిటైర్డ్ ఏఎస్సై, పోలీస్ విభాగం -
Telangana: తుపాకులకు హోంశాఖ రెడ్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ రేంజ్, ఇతర అధికారులకు ఆయుధాలివ్వాలనే ప్రతిపాదనను గతంలోనే అటవీశాఖ నిశితంగా పరిశీలించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపుతో పాటు, తమ అవసరాలకు తగ్గట్టుగా ఏ రకమైన ఆయుధాలు కావాలి అన్న దానిపైనా అధ్యయనం జరిపారు. సెల్ప్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్) కోసం తయారీదారులను సంప్రదించే వరకు ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాక.. హోంశాఖ అభిప్రాయం కోసం పంపించారు. అయి తే హోంశాఖ ఇందుకు నిరాకరించినట్లు అటవీ అధికారవర్గాల సమాచారం. అటవీ ప్రాంతాల్లోని అధికారులకు ఆయు« దాలు అందజేస్తే అవి తీవ్రవాదులు, నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడే ప్రమాదముందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల సహకారం తీసుకోండి.. అటవీ అధికారులకు పోలీస్ స్టేషన్ మాదిరిగా ఒక స్టేషన్, ఆయుధాలు భద్రపరిచే ‘బెల్‌రూమ్’వంటివి లేకపోవడాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అదీగాక ఆయుధాలను ఉపయోగించడంలో అటవీ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడాన్ని కూడా హోంశాఖ ఎత్తిచూపినట్టు తెలుస్తోంది. ఏవైనా ఘటనలు జరిగితే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచిస్తూ ఈ ప్రతిపాదనను అటకెక్కించినట్లు సమాచారం. చదవండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?! -
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
బయటి వ్యక్తులు తుపాకులు, బాంబులతో దిగారు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ మంగళవారం చేపట్టిన 'నాబన్నా చలో(చలో సెక్రెటేరియేట్)' ర్యాలీలో తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం మమతా బెనర్జీ బుధవారం స్పందించారు. బీజేపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బెంగాల్లో హింస సృష్టించేందుకు కమలం పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తుపాకులు, బాంబులతో రాష్ట్రంలోకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కోల్‌కతా హౌరాలో పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయంపైనా మమత స్పందించారు. ఆందోళకారులు దారుణంగా దాడులు చేసినా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ గానీ, ఫైరింగ్ గానీ చేయలేదని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వివిధ ఘటనల్లో చాలా మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. రాజకీయాలు, సంఘ విద్రోహ శక్తులు ఒకే చోట ఇమడలేవని మమత అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే తమకెలాంటి ఇబ్బంది లేదని, కానీ ఆందోళనల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని మమత తేల్చిచెప్పారు. చదవండి:బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే -
45 తుపాకులతో విమానం దిగిన జంట.. అధికారుల షాక్
ఢిల్లీ: బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఆ పిస్తోళ్లు నకిలివా, నిజమైనవా అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అవి నిజమైన తుపాకులేనని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు జగ్జిత్ సింగ్, జస్విందర్ కౌర్‌లుగా గుర్తించారు అధికారులు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు. కాగా, వారిద్దరూ జూలై 10న వియాత్నం నుంచి భారత్‌కు వచ్చారు. జగ్జిత్ సింగ్ తీసుకొచ్చిన రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు లభించాయి. వాటిని అతడి సోదరుడు మంజిత్ సింగ్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జగ్జిత్ సింగ్ ఫ్రాన్స్‌లోని ప్యారీస్ నుంచి వియాత్నంకు వచ్చిన క్రమంలో ఆ ట్రాలీ బ్యాగులను మంజిత్ సింగ్‌కు ఇచ్చాడు. అందులోని మొత్తం 45 తుపాకుల విలువ సుమారు రూ.22,50,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలోనూ 25 తుపాకుల చేరవేత.. అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు. Delhi | An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns worth over Rs 22 lakh from two trolley bags seized. They admitted their previous indulgence in smuggling 25 pieces of guns having a value of over Rs 12 lakh: Commissioner of Customs, IGI Airport & General pic.twitter.com/TvjNbJt5yA — ANI (@ANI) July 13, 2022 ఇదీ చూడండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
సింగర్ సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వచ్చిన మరో వీడియో!
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ హత్య కేసులో అసలు నిందుతుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది నిందితులను కూడా అరెస్టు చేశారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ షార్ప్ షూటర్ల ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బస్ టెర్మినల్‌లో 18 ఏళ్ల అంకిత్ సిర్సా అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడు దోషిగా తేలిని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అంకిత్ సిర్సా మొబైల్‌ని స్కాన్ చేసి చూడగా....సిద్ధూని హత్య చేసి అనంతరం నిందితులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూ హత్యలో ఆ యువకుడే ప్రధాన షూటర్‌గా పోలీసులు తెలిపారు. అంతేకాదు అంకిత్ సిర్సానే గాయకుడు సిద్ధూ వద్దకు వెళ్లి నేరుగా అతనిపై ఆరు బుల్లెట్టు కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతని సహచరుడు సచిన్ వీరమణిని కూడా అరెస్టు చేశారు. #WATCH | In a viral video, Sidhu Moose Wala's murder accused Ankit Sirsa, Priyavrat, Kapil, Sachin Bhivani, & Deepak brandished guns in a vehicle pic.twitter.com/SYBy8lgyRd — ANI (@ANI) July 4, 2022 (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
ఘోస్ట్ గన్ చట్టం.. అయినా బైడెన్ వైఫల్యం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పాతుకుపోయిన గన్ కల్చర్ తీవ్రతను టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటన మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 2018లో ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్ డగ్లస్ హైస్కూల్ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు టెక్సాస్ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో ఇప్పటిదాకా 18 మంది చిన్నారులు, మరో ముగ్గురు మృతి చెందారు. పద్దెనిమిదేళ్ల నిందితుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశాయి భద్రతా దళాలు. క్వాడ్ సదస్సు నుంచి తిరిగి అమెరికాకు చేరుకోగానే.. ఈ చేదు వార్తను వినాల్సి వచ్చింది అధ్యక్షుడు జో బైడెన్. ఘటనపై టెక్సాస్ గవర్నర్ అబ్బట్ను వివరాలు అడిగి తెలుసుకుని.. సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఘటనకు సంతాపసూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం పాటించాలని కోరారు ఆయన. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాల అధినేతలు సైతం ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు ‘ఘోస్ట్ గన్’ కారణమని పోలీసులు గుర్తించారు. ఘోస్ట్ గన్స్ అంటే.. అక్రమ తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’గా పరిగణించొచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఘోస్ట్ గన్లకు లైసెన్స్ ఉండదు. అలాగే వాటికి సీరియల్ నెంబర్ ఉండవు. త్రీడీ ప్రింట్ ద్వారా కూడా వీటిని తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇల్లీగల్ కావడంతో.. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ, చట్టాల్లోని లొసుగులతో.. ఆన్లైన్లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను అమ్మేస్తున్నారు. ఉదాహరణకు.. తొమ్మిది ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టోల్కు సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసే వీలుండేది. అక్కడి రాష్ట్రాల(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా) స్థానిక చట్టాల దృష్ట్యా.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం స్వల్ప నుంచి కఠిన నేరంగా పరిగణించబడుతోంది. స్వల్పకాలిక నుంచి కఠిన జైలు శిక్ష, జరిమానా లేదంటే షూటింగ్ లైసెన్స్ రద్దు లాంటివి శిక్షలు అమలు అవుతున్నాయి. లెక్కకు మించి.. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్ గన్స్ దొరికాయి. అయితే దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఘోస్ట్గన్స్ కట్టడికి ఏప్రిల్‌లో ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఘోస్ట్ గన్స్ నిషేధ చట్టం కోసం ఏడాది సమయం తీసుకుని.. రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. విడి భాగాల కంపెనీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సాహసోపేతమైన అడుగు వేసింది బైడెన్ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం.. ఘోస్ట్ గన్స్ కలిగి ఉండడం కఠినాతికఠినమైన నేరంగా కిందకు వస్తుంది. అలాగే ఘోస్ట్ గన్స్ సరఫరా, విడిభాగాలను అందించే వాళ్లకు కూడా సమాన శిక్ష పడుతుంది. ఈ భయంతోఅయినా ఈ వ్యవహారానికి చెక్ పడుతుందని భావించారు. అయినప్పటికీ చట్టం అమలులో ఘోర వైఫ్యలాన్ని చవిచూస్తోంది బైడెన్ ప్రభుత్వం. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఘోస్ట్ గన్స్ వ్యవహారం బయటపడుతున్నాయి. యథేచ్చగా ఘోస్ట్ గన్స్ మార్కెట్లో ఇల్లీగల్‌గా అమ్ముడుపోతున్నాయి. -
ప్రియుడితో గొడవ.. ఎనిమిదో అంతస్థు నుంచి దూకేసింది
ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్‌వెస్ట్ వాషింగ్టన్‌లోని ఓ అపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఆ రాత్రి ఇద్దరూ గొడవపడి.. పరిస్థితి హత్య చేసే దాకా వెళ్లిందట. కాళ్లు, చేతులు కట్టేసి మరీ ఆమెను తుపాకీతో కాల్చే యత్నం చేశాడు దుండగుడు. అయితే.. చేతులు విడిపించుకున్న ఆమె కిటికీ గుండా ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మెట్రోపాలిటిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం.. నిందితుడిని కైలీ జమల్ పామర్గా గుర్తించి.. అరెస్ట్ చేశారు. దాడి, హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘోస్ట్ గన్ చట్టం తెచ్చినా.. అమెరికాలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం, ఇంట్లో తయారు చేయడం కఠిన నేరం. ఇలాంటి తుపాకుల్ని ఘోస్ట్ గన్లు అంటారు. అంటే లైసెన్స్ లేనివన్నమాట. దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఈమధ్యే ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టం తెచ్చిన వారం తిరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మనిషే.. కుక్కను కరిచాడు! -
సమగ్ర విచారణ జరుపుతున్నాం..
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘తుపాకులా.. పప్పుబెల్లాలా’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన కథనంపై పోలీస్ యంత్రాంగం స్పందించింది. తుపాకులు వేలం వేయడంలో అవకతవకలు జరిగిన విషయాన్ని పోలీసులు అంగీకరించారు. అంతర్గత తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం నిర్వహణ ప్రక్రియలో జరిగిన లోపాలు, సంబంధిత విభాగాల పోలీస్ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. విచారణలో బహిర్గతమయ్యే వాస్తవాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా శాఖాపరమైన చర్యలుంటాయని ఎస్పీ పేర్కొన్నారు. -
తుపాకులా.. పప్పుబెల్లాలా?!
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలీస్ కార్యాలయంలో దాచిన ఆయుధాలను పట్టుకుపోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 582 పైచిలుకు ఆయుధాలను పంచేసుకున్నారు. ఈ పనిచేసింది ఎవరో దొంగలు కాదు.. ఏకంగా పోలీసులే. పోలీస్ అధికారులు స్థాయిని బట్టి ఇది నీకు.. అది నాకు.. అన్నట్టుగా తలా ఒకటి తీసేసుకున్నారు. విషయం బయటపడకుండా అంతా పక్కాగా టెండర్లు పిలిచినట్టు ఓ నాటకానికి తెరతీసి రక్తి కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. 1969 నుంచి జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్ కార్యాలయం ఆర్మర్డ్ రిజర్వులో భద్రపరిచిన 582 ఆయుధాలను నామ్‌కే వాస్తేగా వేలం వేసి పోలీస్ అధికారులు పంచేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చట్ట విరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, అలాగే లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తుపాకులను తీసుకెళ్లకపోవడం.. వంటి వాటిని ఆర్మ్డ్ రిజర్వులో భద్రపరుస్తారు. డీజీ అనుమతితో వాటిని వేలం వేస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలంటే.. డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. డీజీ కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అనంతరం వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇవన్నీ జరిగాక సీల్డ్ కమ్ ఓపెన్ టెండర్లు పిలవాలి. ఆయుధాలు ఎన్ని వేలం వేస్తున్నారు.. వాటి ఖరీదు ఎంత.. అనేది నిర్ధారించాక, నిర్దేశించిన తేదీన వేలం వేయాలి. అలాగే వేలంలో అత్యధికంగా కోడ్ చేసిన ఆయుధాలు కొనుగోలు, విక్రయ లైసెన్స్ కలిగిన వారి టెండర్‌ను ఖరారు చేయాలి. ఆ వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. నిబంధనలకు పాతర నిబంధనలన్నింటికీ పోలీసులు పాతశారు. లైసెన్స్ ఉన్న ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారు. 17 చలానాలు తీయించి నామ్‌కే వాస్తేగా టెండర్లు వేయించారు. హైదరాబాద్ అబిడ్స్‌కు చెందిన రాజధాని ఆరŠమ్స్ మేనేజింగ్ పార్టనర్ అఫ్జల్ పేరుతో 2021 ఏప్రిల్‌లో టెండర్ ఖరారు చేశారు. టెండర్లో రూ.8 లక్షలు వచ్చినట్టుగా రికార్డు చేసి ఖజానాలో జమ చేశారు. అసలు టెండర్లు పిలవకుండానే, ఆయుధాలకు ధర నిర్ణయించకుండానే రూ.8 లక్షలకు ఖరారు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ విధంగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఖజానాకు కన్నం వేశారు. ఇందులో అప్పటి పోలీస్ అధికారులు చక్రం తిప్పి ఆయుధాలను సొంతం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పోలీసులు పంచేసుకున్న వాటిలో ఫిస్టళ్లు, రివాల్వర్లు, ఎస్బీబీఎల్(సింగిల్ బ్యారెల్ బీచ్‌లోడెడ్), డీబీబీఎల్ (డబుల్ బ్యారెల్ బీచ్‌లోడెడ్) తుపాకులు, కార్బన్.. ఇలా పలు రకాల ఆయుధాలున్నాయి. వీటిలో రష్యా, బ్రెజిల్, బెల్జియం, యూఎస్ దేశాల్లో తయారైన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలానే ఉన్నాయి. రూ.ఆరు లక్షలు, రూ.ఏడు లక్షల విలువైన ఆయుధాలూ కొన్ని ఉన్నాయి. అఫ్జల్‌తో మాట్లాడుకుని ఇవన్నీ కలిపి వేలం వేస్తున్నట్టు రికార్డులు సృష్టించి.. ఒక పోలీస్ అధికారి, స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఓ డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్.. ఇలా వివిధ స్థాయిల్లో పోలీసులు తమకు నచ్చినవి ఎత్తుకెళ్లిపోయారు. ఆ ఫిర్యాదుతో వెలుగులోకి.. గన్ లైసెన్సు రెన్యువల్ కోసం చేసుకున్న దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా తుపాకీ తిరిగి ఇవ్వడం లేదని అనపర్తికి చెందిన రెడ్డి అనే వ్యక్తి ఇటీవల జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బెల్జియానికి చెందిన అత్యంత ఖరీదైన తుపాకీ కోసం అతను పదే పదే అడగడంతో ప్రస్తుత జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆరా తీస్తే.. ఈ ఆయుధాల కుంభకోణం బయటపడింది. వాస్తవంగా ఆయుధాలకు వేలం వేసే ముందు సీజ్ చేసిన ఆయుధాలు, లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తుచేసుకున్న వారికి కూడా నోటీసులివ్వాలి. అలా ఎవరికీ నోటీసులిచ్చిన దాఖలాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చే దిశగా కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలతో కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదుతో ఆయుధాల మాయంపై కేసు నమోదైంది. లోతుగా విచారిస్తున్నాం.. ఆయుధాల టెండర్ల వ్యవహారం మా దృష్టికొచ్చింది. అన్ని విషయాలనూ లోతుగా విచారిస్తున్నాం. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ.. తూర్పుగోదావరి జిల్లా -
విజయవాడలో పోలీసు ఆయుధాల ప్రదర్శన
-
2.78 లక్షల అక్రమ గన్ లైసెన్స్‌లు!
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఆయుధాల అక్రమ లైసెన్స్‌ల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణను ముమ్మరం చేసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒకేరోజు 40 చోట్ల సోదాలు నిర్వహించింది. 2012 నుంచి 2016 దాకా ఐదేళ్లపాటు జమ్మూకశ్మీర్‌లో ఏకంగా 2.78 లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్‌లను స్థానికేతరులకు జారీ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని, అనర్హులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి లైసెన్స్‌లు పొందినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరీ, అనంతనాగ్, బారాముల్లా, ఢిల్లీలలో 40 చోట్ల సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్స్‌ల రాకెట్‌ను ఛేదించేందుకు కొందరు ఐఏఎస్‌లతోపాటు ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలు, 20 ఆయుధాల దుకాణాల్లో ఈ సోదాలు చేపట్టామని సీబీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి, మరో ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ ఆఫ్ యూటీ నీరజ్ కుమార్ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు సాగినట్లు తెలిపారు. స్థానికేతరులకు లైసెన్సులు రాజౌరీ జిల్లా మాజీ కలెక్టర్, రిటైర్డ్ అధికారి షబ్బీర్ అహ్మద్ భట్ నివాసంతోపాటు పూంచ్, కుప్వారా, బందీపురా, బారాముల్లా, రాంబన్ జిల్లాల్లో 2012–2016లో అదనపు మేజిస్ట్రేట్లుగా పని చేసిన ఆరుగురు అధికారుల ఇళ్లల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్సుల జారీలో అక్రమాలపై సీబీఐ 2018 అక్టోబర్ 16న రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2019 డిసెంబర్లో శ్రీనగర్, జమ్మూ, గుర్గావ్, నోయిడాలలో పలువురు అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లో పలు జిల్లాల్లో మేజిస్ట్రేట్లుగా పనిచేసిన అధికారులు ఆయుధాల లైసెన్సుల జారీలో పెద్ద ఎత్తున అవినీతి ఆక్రమాలకు పాల్పడినట్లు, అనర్హులకు వీటిని అందజేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. చాలామంది స్థానికంగా నివాసం ఉండకుండానే ఉన్నట్లు తప్పుడు పత్రాలు సమర్పించిన లైసెన్సులు పొందినట్లు తమ పరిశీలనలో తేలిందని, ఇందులో పలువురు ఆయుధ డీలర్ల పాత్ర ఉందని సీబీఐ ప్రతినిధి ఆర్.సి.జోషీ చెప్పారు. స్థానికేతరులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో 22 జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరిగాయన్నారు. అక్రమ లైసెన్సుల కుంభకోణాన్ని తొలుత 2017లో రాజస్తాన్ ఏటీఎస్ బహిర్గతం చేసింది. అప్పట్లో 50 మందిని అరెస్టు చేసింది. సైనిక సిబ్బంది పేరిట 3,000కు పైగా లైసెన్సులు జారీ చేశారని రాజస్తాన్ ఏటీఎస్ వెల్లడించింది. ఏటీఎస్ సేకరించిన ఆధారాలను బట్టి అప్పటి జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తా: షాహిద్ ఇక్బాల్ చౌదరి ఆయుధాల లైసెన్స్‌ల కేసులో తన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన మాట నిజమేనని షాహిద్ ఇక్బాల్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేసులో నేరారోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభించలేదని చెప్పారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 2012–2016 మధ్యకాలంలో ఉధంపూర్‌లో 36,000 లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,500 లైసెన్సులే జారీ అయ్యాయని స్పష్టం చేశారు. తన హయాంలో ఇచ్చిన లైసెన్స్‌లకు తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కంటే తానే తక్కువ లైసెన్స్‌లు జారీ చేశానని చెప్పారు. ఈ కేసు విషయంలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. తాను 2012–2016 మధ్య జమ్మూకశ్మీర్‌లోని రియాసీ, కథువా, ఉధంపూర్ జిల్లాల మేజిస్ట్రేట్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 2012–2016 మధ్యకాలంలో మొత్తం 56,000 ఆయుధ లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,720 లైసెన్సులు ఇచ్చారని, మొత్తం లైసెన్సుల్లో ఇవి 3 శాతమేనని పేర్కొన్నారు. -
డ్రగ్స్..గన్స్&సినిమా!
-
ఎవరు గన్మన్లు.. ఎవరు బౌన్సర్లు?
నల్లగొండ జిల్లాలో ఓ మాజీ జెడ్పీటీసీ ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకీని ఓ రియల్ఎస్టేట్ గొడవలో చూపించి ప్రత్యర్థులను బెదిరించి జైలు పాలయ్యాడు. ములుగు జిల్లాల్లో తన తండ్రికి కేటాయించినగన్మన్లను, బౌన్సర్లను చూపించి పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ నేత కుమారుడు. ఆత్మరక్షణ మాటున బెదిరింపులపర్వం సాగుతోంది. లైసెన్స్డ్ గన్ ‘గురి’తప్పింది. ప్రభుత్వం కేటాయించిన గన్మన్లను, లైసెన్స్డ్ తుపాకులను కొందరు మాజీ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో తుపాకులు, గన్మెన్లను చూపి తమ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంకొందరైతే ప్రైవేటు గన్మన్లను పోలీసులుగా చెప్పుకుంటూ ఎదుటివారిని భయపెడుతున్నారు. దీంతో గన్మన్లు, లైసెన్స్డ్ గన్స్, ప్రైవేటు బౌన్సర్ల విషయంలో కొందరు నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ నేత ప్రైవేటు వ్యవహారంలో లైసెన్స్డ్ గన్ చూపి బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎంతమందికి గన్‌మెన్ సౌకర్యం? రాష్ట్రంలో ఎవరెవరికి గన్‌మెన్ సౌకర్యం కల్పించారు? వారికి ఎంత వ్యయం అవుతుంది? ఈ సేవలు పొందుతున్నందుకు వారేమైనా రుసుము చెల్లిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన పోలీసుశాఖ ఆ వివరాలు సెక్షన్ 24 (4) ప్రకారం వెల్లడించలేమంటూ సమాధానం ఇచ్చింది. బౌన్సర్లను పోలీసులుగా.. ప్రాణ భయం ఉన్న పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు పోలీసుశాఖ గన్మన్లను కేటాయించింది. లైసెన్స్డ్ గన్స్ మంజూరు చేసింది. ఇంకొందరు తమ వెంట ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. వారినే పోలీసులుగా చూపిస్తూ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. హెయిర్ కటింగ్, సఫారీలు వేసుకోవడం, బాడీ లాంగ్వేజ్, నడుముకు తుపాకులు ఉండటంతో వీరు కూడా పోలీసులేనని జనాలు భ్రమపడిపోతున్నారు. స్పష్టత, పర్యవేక్షణ అవసరం.. ప్రభుత్వం ఎంతమందికి గన్మన్లతో రక్షణ కల్పించారన్న విషయం జిల్లాల వారీగా విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేటు బాడీగార్డులు, బౌన్సర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండాలని, వారి కదలికల సమాచారం సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఉండేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పారదర్శకత, పోలీసుల పర్యవేక్షణ పెరిగితే అమాయకులపై బెదిరింపులు అంతగా తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. -
న్యూస్ రక్షా గన్ధన్
వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా.. మహిళల కోసం గన్లు తయారు చేశారు! బుల్లెట్ సైజులో ఉండే లిప్‌స్టిక్‌లో కూడా ఆ గన్లను అమర్చవచ్చు. అంతేకాదు.. పర్సులో, షూస్‌లో కూడా అవి ఇమిడిపోతాయి. మహిళలు తమకు ప్రమాదం ఎదురవుతోందని గ్రహించిన వెంటనే వీటికి అమర్చిన బటన్‌ను నొక్కాలి. తక్షణం గన్ బయటికొస్తుంది. మొబైల్ ఫోన్ మర్చిపోయి బయటికెళ్లినా సరే... లిప్స్టిక్కున్న బటన్ నొక్కగానే బ్లూ టూత్‌తో అనుసంధానం అయి ఉన్న ఫోన్ నుంచి ఎమర్జెన్సీ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. పోలీసులు వచ్చేలోపు ఆ లిప్‌స్టిక్‌తోనే ఫైర్ చేసి సమస్యను చుట్టుపక్కల వారి దృష్టికి తీసుకెళ్లి సహాయం కోరవచ్చు.శ్యామ్ వారణాసిలోని అశోకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో ఉద్యోగి. అతడు రూపొందించిన ఈ గన్ పర్సు, గన్ లిప్‌స్టిక్, గన్ షూస్ అందరిలోనూ ఆసక్తిని కలగుజేస్తున్నాయి. ‘‘మహిళల మీద లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రక్షణసాధనాల అవసరం చాలా ఉంది’’ అన్నారు వీటిని పరిశీలించిన ప్రియాంక శర్మ అనే మహిళ. వార్తల్లో తరచు మహిళల మీద జరిగిన అత్యాచారాలే కనిపిస్తుండడంతో మనసు కదిలిపోతుండేదని, మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఏదైనా సాధనం చేతిలో ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో వీటిని తయారు చేశానని శ్యామ్ చెబుతున్నారు. ‘‘భారతీయ మహిళలకు మాత్రమే కాదు, వీటి అవసరం అన్ని దేశాల్లోనూ ఉంది’’ అని కూడా ఆయన అన్నారు. ఈ గన్ పర్సులు, గన్ లిప్‌స్టిక్‌లు, గన్ షూస్ మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం శ్యామ్ చౌరాసియా వీటికి పేటెంట్ పొందే పనిలో ఉన్నారు. -
గన్స్‌తో డ్యాన్స్ : విచారణకు ఆదేశం
హరిద్వార్ : చేతిలో గన్స్ పట్టుకుని ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులతో గన్స్ పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను పరిశీలిస్తే ఓ ఇంటిలో ఈ తతంగం సాగినట్టు తెలుస్తుండగా, ఇది ఎప్పుడు ఏ ప్రాంతంలో జరిగిందనేది తెలియరాలేదు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు..ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు సాగిస్తున్నామని హరిద్వార్ సర్కిల్ ఆఫీసర్ అభయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఘటన హరిద్వార్‌లో జరిగిందా లేక మరో ప్రాంతంలోనా అన్నది గుర్తిసామని తెలిపారు. ఈ ఏడాది జులైలో బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్ రెండు చేతులతో గన్స్‌ను చూపుతూ బాలీవుడ్ పాటకు నృత్యాలు చేసిన వీడియో వెల్లడవడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దర్యాప్తు అనంతరం ప్రణవ్ సింగ్ మూడు గన్ల లైసెన్స్‌లను రద్దు చేశారు. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్టు బీజేపీ ప్రకటించింది. -
రెండో ప్రపంచ యుద్ధం నాటి తుపాకులు లభ్యం
తూర్పుగోదావరి ,కాకినాడ క్రైం: కాకినాడ అశోక్‌నగర్‌లో అపార్టుమెంట్లు కట్టేందుకు తీస్తున్న పునాదుల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటివిగా భావిస్తున్న 10 తుపాకులు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో బ్రిటిషు మిలటరీ దళాలు కార్యక్రమాలు నిర్వహించేవని, అప్పట్లో ఈ ప్రాంతానికి మిలటరీ రోడ్డు అనే పేరు కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నానికి చెందిన కేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టుకు చెందిన వారు అశోక్‌నగర్‌లోని భాష్యం పాఠశాల ఎదురుగా ఉన్న ఎకరం స్థలంలో ఆదివారం అపార్టుమెంట్ల నిర్మాణానికి పునాదులు తవ్వుతున్నారు. ఏడు అడుగుల లోతులోఈ తుపాకులు బయట పడడంతో ప్రాజెక్టు మేనేజర్ స్వరూపరాజు ఈ విషయాన్ని టూటౌన్ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ఎ.నాగమురళి, ఏఆర్ డీఎస్పీ అప్పారావు, ఏఆర్ ఆర్ఐ ఈశ్వరరావు అక్కడకు వెళ్లి తుపాకులను పరిశీలించారు. ఇవి 1939–45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో వాటిన తుపాకులు అయి ఉంటాయని భావిస్తున్నారు. మార్–1303 వెపన్స్‌గా వీటిని గుర్తించారు. ఇవి పూర్తిగా తుప్పు పట్టి ఉన్నాయని, వీఆర్వో శ్రీనివాస్‌తో పంచనామా నిర్వహించామని సీఐ నాగమురళి సోమవారం విలేకర్లకు వివరించారు. 303 వెపన్స్ లభ్యంపై సీఆర్పీసీ 102 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీటిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. -
లాస్ ఏంజెల్స్‌లో భారీ గన్ డంప్
-
లాస్ ఏంజెల్స్‌లో భారీ గన్ డంప్
-
లైసెన్స్డ్ గన్స్ సరెండర్
ఆదిలాబాద్ అర్బన్: లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసు అధికారులు ఉమ్మడి జిల్లాలో లైసెన్స్డ్ గన్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండడంతో ఎన్నికల పరిణామాలపై ఎప్పటికప్పుడు నిఘాపెంచుతున్నారు. ఇందులో భాగంగానే లైసెన్స్డ్ ఆయుధాలను పలువురి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆయాపోలీస్‌స్టేషన్లలో, ఆయుధగారాల్లో ఈ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేయనున్నారు. ఆయుధాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. బ్యాంకుల వద్ద విధులు నిర్వర్తించే సెక్యూరిటీకి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకొని ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 376 స్వాధీనం లైసెన్స్డ్ ఆయుధాలను ఎక్కువ డబ్బు సంపాదించే వారు, ఇతరుల నుంచి ప్రాణహాని ఉన్న వ్యక్తులు, వ్యాపారులు, సెలబ్రిటీస్, హీరోలు, ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు ఆత్మరక్షణకోసం ఆయుధాలు ఉపయోగిస్తుంటారు. ఎన్నికల నిబంధనలు, చట్టం ప్రకారం లైసెన్స్డ్ ఆయుధాలను ఎన్నికల సమయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో మొత్తం 376 ఆయుధాలు సరెండర్ అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్‌లో కేవలం 17 ఆయుధాలు ఉండగా, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు కలుపుకొని 359 ఆయుధాలు ఉన్నాయి. లైసెన్స్ లేని ఆయుధాలను వినియోగించడం చట్టరీత్య నేరమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లైసెన్స్ పొందేందుకు జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)కు దరఖాస్తు చేసుకుంటారు. ఆయుధ లైసెన్స్ ఎందుకు అవసరమో దరఖాస్తులో వివరంగా తెలియజేయాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి విజ్ఞప్తి మేరకు జిల్లా మెజిస్ట్రేట్ దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. దరఖాస్తులో పేర్కొన్న విషయం విచారణలో సరైనదిగా తేలితే సదరు వ్యక్తికి లైసెన్స్ జారీ చేస్తారు. ఈ లైసెన్స్‌ను ఏటా జనవరిలో రెన్యూవల్ చేస్తారు. ఆదిలాబాద్‌లో 1,360 మంది బైండోవర్.. ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి గోడవలు సృష్టించే వారిని బైండోవర్ చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 1,360 మందిని బైండోవర్ చేశారు. వీరందరిని మండల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆయుధాల డిపాజిట్ ఇలా.. నిర్మల్‌టౌన్: ఎన్నికల సమయంలో లైసెన్స్డ్ గన్స్ ఉన్న వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన అనంతరం వారికి సంబంధిత పోలీస్ అధికారి రిసిప్ట్ అందిస్తారు. ఈ రిసిప్ట్‌ను సదరు వ్యక్తి తన వద్ద ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం రిసిప్ట్ ఆధారంగా ఎవరి లైసెన్స్డ్ గన్లను వారికి పోలీస్ అధికారులు అప్పగిస్తారు. డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ గన్లను భద్రత దృష్ట్యా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో భద్రత పరుస్తారు. -
ఔరా.. ఇంత నిర్లక్ష్యమా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దీపావళి తుపాకుల్లా అసలైన తుపాకీలను స్వేచ్ఛగా పట్టుకుని తిరిగే ఉత్తరాది రాష్ట్రాల సంప్రదాయం తమిళనాడులోనూ ప్రవేశించిందని మదురై హైకోర్టు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పిటిషనర్ వాదనకు బదులివ్వడంలో ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహించింది. వెంటనే బదులివ్వకుంటే సమన్లు జారీచేయక తప్పదని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. మదురై నాగనాకుళానికి చెందిన న్యాయవాది కార్మేగం మదురై హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ వేశారు. గత ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు చెన్నైకి వచ్చిన గుహవటి ఎక్స్‌ప్రెస్ రైలులో ఐదు నకిలీ తుపాకీలు, 20 తూటాలు, రూ.4లక్షల నకిలీనోట్లు దొరికాయి. ఈ కేసులో చెన్నై పెరంబూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా విచారించగా చెన్నై నమ్మాళ్వార్‌పేటకు చెందిన పరమేశ్వరన్ అనే పోలీసు అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధంగా తుపాకీలను అమ్మే ముఠాతో వీరిద్దరికీ సంబంధాలు ఉన్నట్లు బైటపడింది. పెద్ద సంఖ్యలో నకిలీ తుపాకీలు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిచ్చిన సమాచారం మూలంగా చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు నకిలీ తుపాకులను విక్రయించినట్లు తేలింది. కొన్నేళ్లుగా నకిలీ తుపాకులు విక్రయాలతోపాటు నకిలీ కరెన్సీ చలామణి కూడా జోరుగా సాగుతోంది. తమిళనాడు పోలీసుల స్థాయిలో విచారణ జరిపితే నేరస్తులంతా పట్టుబడే అవకాశం లేదు. ఇది దేశ రక్షణకు సంబంధించింది. అంతేగాక దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంలో అనేకులకు సంబంధాలు ఉండవచ్చు. ఈ కేసును నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు అప్పగించాలని న్యాయవాది కార్మేగం తన పిటిషన్లో పేర్కొన్నాడు. తమిళనాడులో నకిలీ తుపాకుల వినియోగం పెరిగిపోయిందని, కిరాయి రౌడీలు స్వేచ్ఛగా వాడుతున్నారని పిటిషనర్ అంటున్నాడు. దేశభద్రత చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు కేంద్రం కొంత గడువు కోరింది. ఈ పిటిషన్ న్యాయమూర్తులు కృపాకరన్, ఎస్ఎస్ సుందర్‌ల ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. వారు మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన నకిలీ తుపాకీల సంప్రదాయం దక్షిణాదిలోని తమిళనాడుకు కూడా పాకిందని, దీని వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో నెలకొని ఉన్న శాంతికి ముప్పువాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. ఈ పిటిషన్ దాఖలై ఏడాదైంది. కేంద్రం ఇంతవరకు బదులు పిటిషన్ దాఖలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. చివరిసారిగా కేంద్రానికి మరోసారి అవకాశం ఇస్తున్నాం. ఈలోగా ఎన్ఐఏ, సీబీఐ, హోంశాఖల తరఫున కేంద్రం బదులు పిటిషన్ దాఖలు చేయాలి. లేకుంటే సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీచేసి కోర్టుకు స్వయంగా హాజరుపర్చాల్సి వస్తుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. కేసును ఈనెల 22వ తేదీకి వాయిదావేశారు. -
ఏకే–47 రెడీ ఫర్ సేల్!
అక్కడ అన్ని రకాల మారణాయుధాలు దొరుకుతాయి. నాటు తుపాకీ నుంచి ఏకే–47 వరకు ఏది కావాలన్నా అమ్మకానికి రెడీ! అంతేనా.. అమ్మకం తర్వాత అవసరమైన రిపేర్లు, సర్వీసింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో ఇంటర్నేషనల్ తుపాకుల దుకాణం అనుకుంటున్నారా? కాదు.. ఇవన్నీ దొరికేది బిహార్‌లోని సీతా కుంద్‌గా పేరుగాంచిన ప్రాంతంలో. ఈ ప్రాంతానికి చెందిన మీర్జాపూర్– బర్దా గ్రామం అక్రమాయుధ మార్కెట్‌కు ప్రసిద్ధి. విదేశాల నుంచి ఆయుధాలు.. రెండువేల కుటుంబాలకు పైగా నివసిస్తున్న మీర్జాపూర్లో అన్నిరకాల ఆయుధాలు అమ్ముతున్నారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డిఫెన్స్ సర్వీసెస్‌తో పాటు టీచర్లుగానూ పనిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదనకు అవకాశం ఉండడంతో ఈ ఊర్లో ఎక్కువమంది అక్రమ ఆయుధాల వ్యాపారంలో భాగస్వాములవుతున్నారు. ఇక్కడి అక్రమాయుధ తయారీ పరిశ్రమలపై పోలీసులు తరచుగా దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్లలోని అంతర్జాతీయ ఆయుధాల పంపిణీదారులతో స్థానిక ఆయుధాల వ్యాపారుల సంబంధాలకు మాత్రం బ్రేక్ వేయలేకపోయారు. పోలీసుల దాడులు పెరగడంతో కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్, యూపీ, జార్ఖండ్‌కు మకాం మార్చారు. నక్సల్స్‌కు అమ్ముతున్నారు.. గత ఆగస్టు 29న మీర్జాపూర్–బర్దా వాసి ఇమ్రాన్ ఆలం నుంచి మూడు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్న సందర్భంగా జబల్పూర్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో ఉద్యోగులతో స్థానిక ఆయుధాల వ్యాపారులకున్న సంబంధాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లో జరిపిన దాడుల్లో 20 ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 22 అక్రమ ఆయుధవ్యాపారులను అరెస్ట్ చేసినపుడు తాము నిషేదిత ఆయుధాలను నక్సల్ చీలిక గ్రూపులు, నేరబృందాలు, చివరకు రాజకీయవేత్తలకు కూడా విక్రయించినట్లు తెలియజేశారు. యువకులకు పెళ్లిళ్లు కావట్లేదు.. ‘కొందరి వల్ల బర్దా పంచాయతీకి ఉన్న మంచిపేరు పోతోంది. కొన్ని కుటుంబాలు నిర్వహిస్తున్న అక్రమ ఆయుధాల వ్యాపారం వల్ల మాకు తీరని నష్టం జరుగుతోంది. ఈ గ్రామంలోని యువకులతో పెళ్లిళ్లు చేసేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లలో మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. నన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రెండ్రోజుల పాటు ప్రశ్నించారు’అని రాష్ట్రీయ జనతాదళ్ జిల్లా పరిషత్ సభ్యుడు మహ్మద్ పర్వేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఆలం జబల్పూర్ ఆయుధాల డిపో నుంచి పెద్దసంఖ్యలో ఏకే 47 ఆయుధాలు దొంగిలించాడు. ఈ ఊరిలోని ఒక బావి నుంచి 12 ఏకే 47 తుపాకులను ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ ఆయుధాల కేసులో అతడి కుటుంబానికి చెందిన ఆరుగురిని అరెస్ట్‌చేశారు. సంప్రదాయంగా ఆయుధాల తయారీ.. 1760 నుంచి 1764 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన బెంగాల్‌కు చెందిన మీర్ ఖాసిం అలీ అనే నవాబ్ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపించాడు. వందల కుటుంబాలు ఆయుధాల తయారీ పరిశ్రమలో నిమగ్నం కావడంతో తయారీ సంప్రదాయంగా కొనసాగింది. తుపాకీ మందులో ప్రధాన వనరు ‘పొటాషియం నైట్రేట్’ముంగేర్ ప్రాంతంలో అధికంగా లభ్యం కావడం కూడా ఈ పరిశ్రమ నిరాటంకంగా కొనసాగేందుకు ప్రధాన కారణంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. నేటికీ అక్కడ ‘తోప్ బజార్లు’, ‘బ్యారెల్ బజార్లు’అనే పేర్లతో మార్కెట్లు కొనసాగుతున్నాయంటే ఆయుధాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఎవరీ శివ?
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు తీసుకువచ్చి సిటీలో విక్రయించే ముఠాలు ఎన్నో ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ పోలీసులు తరచుగా ఇలాంటి గ్యాంగ్స్‌ను పట్టుకుంటూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆ మారణాయుధాలు విచ్చలవిడిగా లభిస్తూ ఉండటమే దీనికి కారణం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నగరానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి నాటు తుపాకీ, తూటాలు తీసుకుని పుణే చేరుకున్నాడు. అక్కడ ‘ఆసక్తి’ ఉన్న వారికి వీటిని విక్రయించడానికి ప్రయత్నాలు చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఫర్ఖానా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇక్కడి అధికారులు ఎవరీ శివ? అతడికి వ్యవహారాలు ఏంటి? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. నగరానికి చెందిన శివ కుమార్ కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రింటింగ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసినా సరైన ఉద్యోగం లభించలేదు. కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా వాటిలో వచ్చే జీతంతో బతుకీడ్చటం కష్టసాధ్యంగా మారింది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో అతడి దృష్టి మారణాయుధాల విక్రయంపై పడింది. ఇటీవల ఓ నాటు తుపాకీ, ఐదు తూటాలు సమీకరించుకున్న అతగాడు వీటిని ఎక్కువ మొత్తానికి అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. దీనికోసం ఖరీదు చేసే వారికి వెతుకుతూ పుణే చేరుకున్నాడు. ఫర్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న శివను అక్కడి పోలీసులు గత వారం వలపన్ని పట్టుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద తుపాకీ, తూటాలు లభించాయి. వీటి విలువ రూ.30 వేలు ఉంటుందని పోలీసులు నిర్థారించారు. అయితే శివకు ఈ తుపాకీ, తూటాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీటిని సిటీలో సమీకరించుకుని విక్రయించడానికి అక్కడకు తీసుకువెళ్లాడా? లేక మహారాష్ట్రలోనే తక్కువ ధరకు ఖరీదు చేసి ఎక్కువ రేటుకు విక్రయించాడా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
గుడిలోకి తుపాకులు, బూట్లతో వెళ్లొద్దు!
న్యూఢిల్లీ: ఒడిశాలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి పోలీసులు తుపాకులు, బూట్లతో ప్రవేశించరాదని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూరీ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 3న చెలరేగిన ఆందోళనపై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకూ 47 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. జగన్నాథ ఆలయానికి 500 మీటర్ల దూరంలోని పరిపాలన కార్యాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయనీ, ఆలయం లోపల ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. అయితే ఆలయం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఘర్షణ సందర్భంగా పోలీసులు ఆయుధాలు, బూట్లతో ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఇకపై అలా జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. జగన్నాథ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ శ్రీ జగన్నాథ సేన అనే సంస్థ ఇచ్చిన అక్టోబర్ 3న పన్నెండు గంటల బంద్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. -
మా స్కూల్లో కాల్పులు జరగొచ్చేమో!
ఆగంతకుల తుపాకి కాల్పులకు తాము బలయ్యే ప్రమాదముందని అత్యధిక అమెరికా టీనేజర్లు భయపడుతున్నారు. పాఠశాలల్లో కాల్పులకు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై ప్రఖ్యాత అమెరికా పరిశోధనా సంస్థ ప్యూ (పీఈడబ్ల్యూ) రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 57 శాతం పిల్లలు తాము చదువుకుంటున్న స్కూల్లోనే ఇలాంటి సంఘటన జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి విపత్తుపై ప్రతి నలుగురిలో ఒకరు బాగా ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో మైనారిటీలైన హిస్పానిక్(లాటినోలు), నల్లజాతి పిల్లలు ఇలాంటి కాల్పులు జరిగే అవకాశంపై అత్యధికంగా భయపడుతున్నారు. స్పానిష్ మూలాలున్న లాటినో పిల్లల్లో నాలుగింట మూడు వంతులు, నల్లజాతి టీనేజర్లలో 60 శాతం మంది తుపాకి కాల్పుల ప్రమాదంపై దిగులుపడుతున్నారు. ఫిబ్రవరి 14న ఫ్లారిడా రాష్ట్రంలోని పార్క్ లాండ్ స్కూల్లో పాత విద్యార్థి కాల్పుల్లో 17 మంది మరణించాక మార్చి 7ఏప్రిల్12 మధ్య 1317 ఏళ్ల వయసు అమెరికా పిల్లలు, అదే వయసు టీనేజర్ల తల్లిదండ్రులతో మాట్లాడి ప్యూ సంస్థ ఈ సర్వే జరిపించింది. తమ తరగతి గదుల్లో తుపాకితో దుండుగుడు వచ్చి కాల్పులు జరిపే అవకాశముందని తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో వారి పిల్లలు కూడా అంతగా ఆందోళన చెందుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. తుపాకి కాల్పుల ప్రమాదం తమ పిల్లలు చదివే స్కూళ్లలో ఉందని 63 శాతం తల్లిదండ్రులు చెప్పారు. టీచర్లకు గన్లు ఇవ్వద్దొంటున్న నల్లజాతి పిల్లలు! పార్క్‌లాండ్‌లోని మార్జరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తుపాకుల సంస్కృతిపై ఆవేశపూరిత చర్చ జరిగింది. దుండగుల కాల్పులకు విరుగుడుగా స్కూలు టీచర్లకే తుపాకులు ఇవ్వడం మేలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, పాఠశాల ఉపాధ్యాయులకు ఆయుధాలివ్వడాన్ని అత్యధిక టీనేజర్లు ముఖ్యంగా నల్లజాతి కుర్రాళ్లు వ్యతిరేకిస్తున్నారు. స్కూళ్లలో కాల్పుల ఘటనలు నివారించడానికి అత్యంత ప్రయోజనకరమైన చర్యలుమానసిక ఆరోగ్యంలేని వారికి తుపాకులు అందుబాటులో లేకుండా చేయడం, మానసిక ఆరోగ్య పరీక్షలు, చికిత్సల నాణ్యత మెరుగుపరచడమేనని ఈ సర్వేలో పాల్గొన్న పిల్లలు భావిస్తున్నారు. స్కూళ్లలో మెటల్ డిటెక్టర్లు అమర్చడం, ఒకేసారి ఎక్కువ మందిని చంపడానికి వాడే తుపాకులపై నిషేధం వల్ల ఎక్కువ ఫలితముంటుందని చెప్పుకోదగ్గ సంఖ్యలో టీనేజర్లుఅభిప్రాయపడ్డారు. పార్క్లాండ్కాల్పుల ఘటన తర్వాత మానసిక ఆరోగ్య సేవల విస్తరణ వంటి చర్యలకు వీలు కల్పిస్తూ ఫ్లారిడా ఓ చట్టం చేసింది. అయితే, ఏఆర్తరహా అసాల్ట్తుపాకులపై నిషేధం విధించలేదు. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి పాఠశాలల్లో భద్రతకు సంబంధించిన శిక్షణ పెంచడానికి ప్రాధాన్యమిస్తూ మార్చిలో అమెరికా కాంగ్రెస్ఓ బిల్లు ఆమోదించింది. - సాక్షి నాలెడ్జ్సెంటర్ -
టీచర్లకు తుపాకులు, శిక్షణ ఇవ్వాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా పాఠశాలల్లో తుపాకీ కాల్పుల ఘటనలను అరికట్టేందుకు కొంతమంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చి వారికి తుపాకులు కూడా అందజేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ సమస్యకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొంటుందని హామీనిచ్చారు. ఇటీవల ఫ్లోరిడాలోని మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో ఓ బహిష్కృత విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించడం తెలిసిందే. ఆ పాఠశాల విద్యార్థులు, చనిపోయిన వారి తల్లిదండ్రులతో కూడిన బృందం ట్రంప్‌ను కలిసింది. ఉపాధ్యాయులందరికీ తుపాకులు ఇవ్వాలని తానెప్పుడూ అనలేదనీ, కొంతమంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి మాత్రమే తుపాకులు ఇవ్వాలని అన్నానని ట్రంప్ వారికి వివరించారు. -
అమెరికాలో మనిషికో తుపాకి?
న్యూయార్క్, అమెరికా : అమెరికాలో మూకుమ్మడి హత్యాకాండ జరిగిన ప్రతిసారీ తుపాకుల అమ్మకం, లైసెన్సుల జారీపై చర్చ నడుస్తుంది. ఈ ఆయుధాల నియంత్రణకు కాంగ్రెస్‌లో బిల్లులు ప్రవేశపెడతారు. ఆత్మరక్షణకు గన్లు ఉండాలనే జనం వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తమ చేతుల్లోంచి తుపాకులు లాక్కోబోతోందంటూ గగ్గోలు పెడతారు. చర్చ ఆగిపోతుంది. బిల్లులు చట్టసభల ఆమోదం పొందకుండానే నిలిచిపోతాయి. మరే దేశంలో లేనంతగా అమెరికాలో తుపాకులతో జరిగే హింసలో ప్రజలు ప్రాణాలు విడుస్తూనే ఉంటారు. ఇదే తంతు కొన్నేళ్లుగా అగ్రరాజ్యంలో సాగుతోంది. ఎన్నికల రాజకీయాల్లో గన్ల నియంత్రణ ప్రధానాంశంగా ఉంటూనే ఉంది. తుపాకులతో సాగే సామూహిక హత్యలకు రాజకీయంగా పలుకుబడి ఉన్న అమెరికా జాతీయ రైఫిల్అసోసియేషన్(ఎన్ఆర్యే)ను మాత్రమే ఎక్కువ మంది నిందించడం కూడా ఆనవాయితీగా మారింది. అందుకే ఆధునిక ప్రపంచంలోని ఏ దేశమూ తుపాకి కాల్పులతో సాగే హింసలో అమెరికాకు దగ్గరలో లేదు. ఈ విషయంలో అవకాశాల స్వర్గం అన్ని పాశ్చాత్య దేశాలకు అందనంత దూరంలో ముందుంది. తుపాకి హత్యలు కెనడా కన్నా అమెరికాలో ఆరు రెట్లు ఎక్కువ! తుపాకి హత్యలు అమెరికాలో కెనడా కంటే ఆరు రెట్లు, స్వీడన్కన్నా ఏడు రెట్లు, జర్మనీతో పోల్చితే 11 రెట్లు ఎక్కువని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. అత్యధిక తుపాకి చావుల కారణంగా మొత్తం హత్యల విషయంలో అమెరికా ఇతర దేశాల కన్నా ముందుంది. 2012లో అభివృద్ధిచెందిన దేశాల్లో తుపాకులతో చేసిన హత్యలపై ఐరాస మానవాభివృద్ధి సూచీ గణాంకాలు కూడా అమెరికా ఆధిపత్యాన్నే సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, హాలండ్, స్వీడన్, ఫిన్లాండ్, ఐర్లండ్, కెనడా, లగ్జెంబర్గ్, బెల్జియం, స్విట్జర్లాండ్‌లు ఈ హత్యల్లో అమెరికా తర్వాత వరుసలో నిలుస్తాయి. 2012లో ప్రతి పది లక్షల మందికి అమెరికాలో 29.7 మంది తుపాకి కాల్పుల్లో మరణించారు. రెండో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌లో 7.7 మంది తుపాకి గుళ్లకు బలయ్యారు. ఈ 14 దేశాల జాబితాలోఏడో స్థానంలో ఉన్న ఫిన్లండ్‌లో 4.5 మంది, చివరి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో 1.4 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఇన్ని హత్యలకు పౌరుల చేతుల్లో ఉన్న తుపాకులే కారణం! చిన్నాపెద్దా తుపాకి హత్యలు అమెరికాలోనే అత్యధికంగా జరగడానికి ప్రధాన కారణం ప్రైవేటు వ్యక్తుల(పౌరుల) చేతుల్లో ఉన్నన్ని ఈ ఆయుధాలు మరే దేశంలోనూ లేవు. 2007లో ప్రతి వంద మంది పౌరుల దగ్గర సగటున 88.8 తుపాకులున్నాయి. అంటే వయోజనులకు సగటున ఒకటి కన్నా ఎక్కువ గన్లు ఉన్నట్టు భావించాలి. ఈ విషయంలో రెండోస్థానం అంతర్యుద్ధంతో కుదేలవుతున్న యెమెన్ది. ఈ అరబ్‌దేశంలో 100 మందికి 54.8 తుపాకులున్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికాది 4.43 శాతం కాగా, ప్రపంచంలోని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మొత్తం తుపాకుల్లో 42 శాతం అమెరికన్ల దగ్గరున్నాయి. వయసొచ్చిన ప్రతి అమెరికన్చేతిలో తుపాకి ఉందనుకోకూడదు. సంపద మాదిరిగానే తుపాకులు కూడా అత్యధిక శాతం కొందరి దగ్గరే కేంద్రీకృతమయి ఉన్నాయి. తుపాకులపై తెల్లవారికే ఎక్కువ మోజు! అనేక అమెరికా రాష్ట్రాల్లో 1618 ఏళ్లు నిండిన పౌరులందరూ రైఫిళ్లు, గన్లు కొనుక్కోవచ్చు. కాని, జనాభాలో అత్యధికశాతమున్న(దాదాపు 70 శాతం) శ్వేతజాతీయులే తుపాకులు కలిగి ఉండడానికి ఇష్టపడతారని అనేక సర్వేలు చెబుతున్నాయి. తెల్లజాతివారిలో కూడా మధ్య వయసు నుంచి వృద్ధుల దగ్గరే ఈ ఆయుధాలు ఎక్కువుంటాయి. ఇటీవలి కాలంలో యువకులకు తుపాకులపై మోజు బాగా తగ్గిపోయింది. నల్లజాతివారు, ముస్లింలు వంటి ఇతర శ్వేతేతర జాతులవారి దగ్గరుండే తుపాకుల సంఖ్య చాలా తక్కువ. బరాక్ఒబామా అధ్యక్షునిగా ఉన్న ఎనిమిదేళ్లలో సామూహిక హత్యాకాండలు ఎక్కువ జరిగాయి. ఆ రోజుల్లో తుపాకుల నియంత్రణకు డిమాండ్బాగా పెరిగింది. ఎక్కడ గన్ల కొనుగోలుపై ఆంక్షలు పెడతారనే భయంతో శ్వేతజాతీయులు భారీగా అప్పుడు తుపాకులు కొనుగోలు చేశారు. గన్ల నియంత్రణను వ్యతిరేకించే రిపబ్లికర్పార్టీ అభ్యర్థి డొనాల్డ్ట్రంప్అధ్యక్షుడయ్యాక తుపాకుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. తుపాకులు కలిగి ఉండే హక్కును కాపాడుకోవాలనే బలమైన కాంక్ష శ్వేత జాతీయుల్లో ఉన్నందునే తుపాకుల అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం కుదరడం లేదు. గన్లు కలిగి ఉండడం వ్యక్తిగత స్వాతంత్య్రంలో భాగమని మెజారిటీ ప్రజలు నమ్మినంత కాలం తుపాకుల నియంత్రణ జరగదని సామాజికవేత్తలు నమ్ముతున్నారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
అతివేగానికి చెక్ పెట్టేలా లేజర్ గన్స్
కొరుక్కుపేట: వాహనాల అతివేగానికి చెక్ పెట్టేందుకు లేజర్‌గన్స్ అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు నిబం ధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే జరిమానాలు భరించక తప్పదు. వాహనాల అతివేగాన్ని పసిగట్టేలా చెన్నై –బెంగళూరు జాతీయ రహదారిలో వినూత్న లేజర్ గన్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.12కోట్ల నిధులు మంజూరు చేసిం ది. అధికారులు మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా లేజర్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసిన లేజర్‌గన్స్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానాను తరువాత వచ్చే టోల్ ప్లాజాలోనే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాహనం ఫొటో, నంబర్ చిత్రాలను ఎవిడెన్స్‌గా చూపనున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చెన్నై –వేలూరు మధ్య జాతీయ రహదారిలో ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
నిత్యం 30 లక్షల మంది చేతుల్లో తుపాకులు
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది తమ వెంట తుపాకులు తీసుకెళ్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక నెలకోసారి ఇలా తుపాకులు తీసుకెళ్తున్న వారి సంఖ్య సుమారు 90 లక్షలని తెలిసింది. భద్రతా కారణాల రీత్యానే ఆయుధాలను వెంట ఉంచుకుంటున్నట్లు వారిలో చాలా మంది తెలిపారు. అమెరికాలో తుపాకుల వాడకంపై 20 ఏళ్లలో తొలిసారి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. వేర్వేరు రాష్ట్రాల్లో చట్టాలకు అనుగుణంగా తుపాకులను తీసుకెళ్తున్న ధోరణులను ఇందులో పరిశీలించారు. తుపాకులను వెంట తీసుకెళ్లే వారిలో ఎక్కువ మంది యువకులు, అందునా అధిక శాతం పురుషులేనని తేలింది. -
రాచకొండలో గన్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ సిటీ: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గన్స్ కలకలం చెలరేగింది. పలు ప్రాంతాల్లో గన్లతోపాటు బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గత కొంత కాలంలో నగరంలో గన్‌కల్చర్ పెరిగిపోయింది. యధేచ్ఛగా తుపాకులు, గన్నులను విక్రయిస్తున్నారు. ఈ దందాపై గత కొద్దిరోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి వద్ద గన్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో మూడు గన్స్, ఆరు బుల్లెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాలడుతున్న గ్యాంగులకు సరఫరా చేయడానికి ఈ గన్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
సౌరశక్తితో స్పీడ్ లేజర్ గన్స్
సాక్షి, హైదరాబాద్: సౌర శక్తితో వాహనాల వేగాన్ని కనిపెట్టే లేజర్ గన్స్‌ను ప్రయోగాత్మకంగా గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్పై రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గురువారం పరిశీలించారు. వాహనాలు ఎంత వేగంతో వెళ్లాలన్న నిర్దిష్టతను ఎల్ఈడీ స్క్రీన్‌లో ట్రాకింగ్ సిస్టమ్ చూపిస్తుందని, వాహనాలు వెళ్తున్న వేగాన్ని కచ్చితత్వంతో ఈ సోలార్ లేజర్ గన్స్ చూపించగలుగుతాయని కృష్ణప్రసాద్ తెలిపారు. తెలంగాణలో దాదాపు 500 లేజర్ గన్స్ అవస రం ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్ ఖర్చు రూ.10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. -
బాల్యం గాయం
-
మాసిపోని ‘గన్’కల్చర్
► హైదరాబాద్ ఉదంతంతో మళ్లీ వెలుగులోకి ► అనంతలో పేరు మోసిన ప్రొఫెషనల్ కిల్లర్స్ అనంతపురం: అనంతపురం జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్. పలు సినిమాల్లో కూడా భూతద్దంలో చూపించిన ఘటనలు.. గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ ముద్ర పడటానికి కారణంగా చెప్పవచ్చు. అయితే కాలం మారింది. ఫ్యాక్షన్ పూర్తిగా మాసిపోయిందని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ నేటికీ జిల్లాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తుపాకీలు వినియోగించడంలో పేరు మోసిన కిల్లర్స్ అనంతలో ఉన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా సుపారి ముఠా కోసం జిల్లా వైపు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ఉదంతంలో అనంతపురం జిల్లా పేరు ప్రస్ఫుటంగా వినిపించింది. ప్రజల్లో సానుభూతి, అప్పుల ఒత్తిళ్లు తగ్గించుకునేందుకు విక్రమ్‌గౌడ్ తనపై తానే ప్రమాదం లేకుండా కాల్పులు జరిపించుకోవాలని భావించాడు. ఇందుకోసం జిల్లాలోని కదిరికి చెందిన గోవిందరెడ్డిని సంప్రదించాడు. ఆయన ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్న నందకుమార్ అనే వ్యక్తిని కలిశాడు. ప్రాణపాయం లేకుండా విక్రమ్‌పై కాల్పులు జరిపేందుకు రూ.50 లక్షలకు సుపారి తీసుకున్నారు. తుపాకీల కోసం కదిరికి చెందిన షేక్ అహ్మద్, బాబుజాన్లను సంప్రదించి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి తుపాకీ తీసుకొచ్చారు. పథకం ప్రకారం విక్రమ్‌పై కాల్పులు జరిపారు. తొలుత తెలంగాణలో ఈ ఘటన కలకలం రేపినా చివరకు పోలీసులు అసలు విషయాన్ని నిగ్గు తేల్చి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఘటనలో కీలక నిందితులు జిల్లా వాసులు కావడం గమనార్హం. జిల్లాలో ఎవరు ఏం చేస్తున్నారు? వారి నేర చరిత్రలపై ఎప్పటికప్పుడు ఆరా తీయాల్సిన పోలీసు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు హైదరాబాద్ ఉదంతంతో వినిపిస్తున్నాయి. -
విద్యార్థులు గన్ తెచ్చుకోవచ్చు
షికాగో: తమ వెంట తుపాకులను రక్షణగా తెచ్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. అన్ని ప్రజా భవనాల్లోకి తుపాకీలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ నాలుగేళ్ల కిందట చట్టం చేసినప్పటికీ.. కాలేజీల్లోకి తీసుకెళ్లేందుకు తాజాగా అనుమతినిచ్చారు. ఇప్పటికే అర్కన్సాస్, జార్జియా సహా పలు రాష్ట్రాల విద్యార్థులు తమ వెంట తుపాకులు తెచ్చుకునేందుకు అనుమతులివ్వగా.. తాజాగా ఆ జాబితాలోకి కన్సాస్ రాష్ట్రం చేరింది. ఇక కాలిఫోర్నియా, దక్షిణ కరోలినా సహా మొత్తంగా 16 రాష్ట్రాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు తుపాకులు వెంట తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. మరోవైపు తుపాకీలను వెంట తెచ్చుకునే నిబంధన తీసుకురావడంతో కన్సాస్‌లోని వర్సిటీల్లో పనిచేసే కొంతమంది అధ్యాపకులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని స్థానిక టీవీ రిపోర్ట్ చేసింది. ‘నేను వేరే ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభించాను. తుపాకులు వెంట తెచ్చుకునే విద్యార్థులకు పాఠాలు బోధించలేను. ఎందుకంటే అదో పిచ్చిపని’ అని కన్సాస్ స్టేట్ వర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ నెల్ పేర్కొన్నారు. -
తుపాకులు అమ్మేందుకు వచ్చి...
⇒ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు ⇒ వారిలో ఒకరు మాజీ సైనికుడు పెద్దపల్లి రూరల్: సైనికుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం తుపాకీ విక్రయించేందుకు వచ్చి పెద్దపల్లి జిల్లా పోలీసులకు చిక్కాడు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ శుక్ర వా రం ఇక్కడ వివరాలను వెల్లడించారు. ప్రకా శం జిల్లా కంకిపాడుకు చెందిన చిలుకల రమణారెడ్డి ఆర్మీ ఉద్యోగి రిటైర్డ్ అయ్యాక మరికొందరితో కలసి మద్యం వ్యాపారం చేశాడు. ఆ సమయంలో విజయవాడకు చెందిన గొట్టేటి భరణికుమార్‌తో పరిచయ మేర్పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరి ద్దరు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఆయుధాల వ్యాపారం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బీహార్ వెళ్లి అక్కడ 7.2 పిస్టల్, 25 రౌండ్లు బుల్లెట్లను కొనుగోలు చేశారు. వాటిని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని ప్రాంతంలో అమ్మేందుకు వచ్చారు. పెద్దపల్లిలో విక్రయించాలని చూసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గోదావరిఖనిలో పరిచయ మున్న వారికి అమ్మేందుకు గురువారం ఆటోలో వెళ్తుండగా.. సమాచారమందుకున్న సీఐ మహేశ్, పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు శ్రీనివాస్, విజయేందర్ పెద్దపల్లి శివారులోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ దుగ్గల్ తెలిపారు. -
మానసిక రోగులకు తుపాకులు: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ వైపు దేశంలో విదేశీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే.. మానసిక రోగులు కూడా ఆయుధాలను కొనుక్కొవచ్చనే కొత్త రూల్‌ను పాస్ చేసినట్లు చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సారధ్యంలో మానసిక రోగులకు ఆయుధాల అమ్మకాన్ని నిషేధించారు. ఒబామా నిర్ణయాన్ని మార్చాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లు నిర్ణయం తీసుకున్నాయని ఇందుకు సంబంధించిన బిల్లు రెండు వారాల క్రితమే పాసయిందని నెల రోజుల పరిపాలనపై మాట్లాడుతూ వెల్లడించారు ట్రంప్. ట్రంప్ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది మానసిక రోగులకు ఆయుధాలు కొనుక్కునే అర్హత కలుగుతుంది. గతంలో వీరందరికి ఉన్న లైసన్లను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. 2012లో దాదాపు 20 పాఠశాల విద్యార్థులను ఓ మానసిక రోగి కాల్చి చంపిన తర్వాత ఒబామా మానసిక రోగులు ఆయుధాలు కలిగివుండటంపై నిషేధం తీసుకువచ్చారు. అమెరికాలో తాజాగా భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయి. ఓ మానసిక రోగి హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే మానసిక రోగులు ఆయుధాలు కలిగివుండొచ్చనే ఆర్డర్లను ట్రంప్ సర్కారు తీసుకురావడం ఆందోళన కలిగించే విషయమే. -
రెయిన్ గన్లతో రైతుల్లో ఆనందం
సామర్లకోట : రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెయిన్ గన్ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మండలం జి. మేడపాడులో మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పతో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో వర్మీ కంపోస్టు యూనిట్‌ను పరిశీలించారు. కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ కార్యాలయం, రోడ్లకు వారు శంకుస్థాపన లు చేశారు. సొసైటీ భవనం గోదాములను ప్రారంభించారు. సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజప్ప అధ్యక్షత వహించగా కేఈ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రెయిన్ గన్‌తో గంటకు 10 ఎకరాలు తడుస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో జిల్లాలో రైతులకు నీటిఎద్దడి ఏర్పడిన సమయంలో ఏలేరు ప్రాజెక్టుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత తహసీల్దార్లపై ఉందని, జాప్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేడపాడును ఓడీఎఫ్ గ్రామం ప్రకటించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాయలసీమ జిల్లాలో మేడపాడును ఆదర్శంగా తీసుకొని పని చేస్తామని తెలిపారు. చినరాజప్ప మాట్లాడుతూ పేదల కోసం వెయ్యి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యం రాజబ్బాయి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
క్యాంపస్‌లో తుపాకులకు అనుమతి!
చికాగో: యూనివర్సిటీల్లోకి తుపాకులను అనుమతిస్తూ టెక్సాస్ ప్రభుత్వం వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో క్యాంపస్‌లోకి తుపాకులను అనుమతిస్తోన్న ఎనిమిదో రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. 1966లో టెక్సాస్ యూనివర్సిటీలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన 50 ఏళ్ల తర్వాతా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. న్యాయవాదులతో పాటు యూనివర్సిటీకి చెందిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల శాంతికి విఘాతం కలుగుతుందన్నది వారి ఆందోళన. ఈ విషయంపై డల్లాస్‌కి చెందిన ప్రొఫెసర్ సీమా యాస్మీన్ మాట్లాడుతూ...‘నేను తుపాకులను అనుమతించడానికి భయపడట్లేదు, కానీ విద్యార్థుల మానసిక స్థితి, పరీక్షల ఒత్తిడిలాంటి అంశాలు ఎలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తాయో అన్నదే ఆందోళన కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. -
ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తుపాకుల
సీఎం చైర్మన్‌గా కమిటీ అందులో సభ్యుడిగా తుపాకుల 1983లో కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి.. సిద్దిపేట రూరల్: ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా సిద్దిపేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాల్‌రంగం నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన మండలంలో క్రియాశీల నాయకుడిగా పని చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యముంది. మూడు దశాబ్దాలకుపైగా కేసీఆర్‌తో ఉన్న అనుబంధతో రాజకీయం కొనసాగుతోంది. 1983లో కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. 1995 నుంచి 2001 వరకు పొన్నాల సర్పంచ్‌గా పని చేశారు. 1990 నుంచి 2006 వరకు పార్టీ మండల అధ్యక్షుడిగా పని చేశారు. 2006 నుంచి 2011 వరకు సిద్దిపేట జెడ్పీటీసీగా పని చేశారు. 2011 నుంచి టీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. రిజర్వేషన్ నేపథ్యంలో పొన్నాల సర్పంచ్‌గా తుపాకుల బాల్‌రంగం సతీమణి ఎల్లమ్మ రెండు దఫాలుగా సర్పంచ్‌గా పని చేశారు. తాజాగా ఆయన ఉపాధి హామీ మెంబర్‌గా నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ చైర్మన్‌గా ఉండే రాష్ట్ర కౌన్సిల్లో 15మంది సభ్యులుంటారు. అందులో కేటగిరీ2 విభాగంలో ఈయనకు అవకాశం లభించింది. ఉపాధిహామీ బలోపేతానికి కృషి ఉపాధిహామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాల్‌రంగం అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో జిల్లా నుంచి ఉపాధిహామీ రాష్ట్రకౌన్సిల్ మెంబర్‌గా ఎన్నుకున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతోపాటు పనుల రూపకల్పనలో క్రియాశీలకంగా పని చేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో కూలీల ఇబ్బందులను తొలగించడంతోపాటు ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధంగా చేసి, రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, మామిండ్ల ఉమారాణి ఐలయ్య, పయ్యావుల రాములు, పీఏసీఎస్ చైర్మన్ నల్ల నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు గంగపురం మహేష్, కదుర్ల బాలయ్య, బరిగెల నర్సింలు, నాయకులు గ్యార యాదగిరి, శ్రీనివాస్, భాస్కర్‌గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ స్మార్ట్ ఫోన్స్ కన్నా ఏకే 47 గన్సే చీప్
డర్రా అదమ్‌ఖేల్: అక్కడ తుపాకులు దొరుకుతాయి. చిన్నస్థాయి నుంచి ఏకే 47 తుపాకుల వరకు. ఎలా అంటే అలా.. ఎంతకంటే అంతకు.. ఓ రకంగా చెప్పాలంటే కూరగాయల మార్కెట్లో బేరమాడినట్లుగా ఆడి వాటిని సొంతం చేసుకోవచ్చు. వీటి ధర ఎంతో తెలుసా నేడు మనం కొనుగోలు చేస్తున్నా స్మార్ట్ ఫోన్స్ కంటే తక్కువ. అదే అక్కడ తుపాకుల ప్రత్యేకత. అయితే, అవన్నీ కూడా అక్కడే తయారయ్యేది. స్క్రాప్ మెటీరియల్ తో వాటిని తీర్చిదిద్దుతారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడని అనుకుంటున్నారా.. అదే డర్రా అదమ్‌ఖేల్. పాకిస్థాన్‌లోని ఓ మూరుమూల గిరిజన ప్రాంతం. పేరుకే గిరిజన ప్రాంతం అని చెప్పినా అదొక గన్స్ బ్లాక్ మార్కెట్ల పెద్ద అడ్డ. ప్రారంభకాలంలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా కాలక్రమంలో వాటికి ఉగ్రవాదుల అండదొరకడంతో ఆ గ్రామంలో వారంతా తుపాకుల తయారీపైనే పడ్డారు. చిన్న సైజు రైఫిల్స్ నుంచి ఏకే 47 వరకు సొంతంగా తయారు చేసి అమ్ముతుంటారు. ఇది పెషావర్ కు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న గిరిజన ప్రాంతం. ఆ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం కూడా ఇదే ఊరు. ఇక్కడ ఒక్క గన్సే కాదు.. నకిలీ సర్టిఫికెట్లు, మత్తు పదార్థాల రవాణా, డ్రగ్స్ డీలర్ షాపులు సమాజానికి ఏమేం పనికి రావో వాటన్నింటికి డర్రా పెద్ద ఆశ్రయం. దీనిపై ఎవరూ చర్యలు తీసుకోలేదా అంటే అలా జరగలేదు. ఎందుకంటే ఇది దాదాపుగా రెండు దశాబ్దాలుగా మనుగడ కొనసాగిస్తోంది. 1980లో ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించగా తొలిసారి ఉగ్రవాద సంస్థ ముజహిదీన్ ఇక్కడి నుంచి గన్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇది పూర్తి స్థాయిలో తాలిబన్ చేతిలోకి వెళ్లాక గన్స్ తయారీ ఎక్కువైంది. ఇక్కడ ఒక్కో తుపాకీ ఎంతకు లభిస్తుందో తెలుసా 67 డాలర్లు.. అంటే రూ.7 వేలు అన్నమాట. -
అంతు చిక్కని ‘అనంత’ టూర్!
► రెండు నెలల క్రితం అనంతపురం వెళ్లి వచ్చిన ఇద్దరు ముష్కరులు ► ఓ లాడ్జిలో ఐదు రోజుల పాటు అక్కడే మకాం ► ద్విచక్రవాహనంపై నాందేడ్ వెళ్లి తుపాకుల కొనుగోలు ► హవాలా మార్గం ద్వారా అజ్మీర్‌కు నగదు ► రంగంలోకి దిగిన ఏపీ అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో విధ్వం సానికి కుట్ర పన్నిన ఏయూటీ ముష్కరులు ఏపీకి వెళ్లడం మిస్టరీగా మారింది. ఈ ఉగ్రవాదుల్లో ఇద్దరు అనంతపురం వెళ్లి వచ్చారని తేలినా.. ఎందుకు వెళ్లారన్నది అంతు చిక్కట్లేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మాడ్యుల్ చీఫ్ ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు ఇద్దరు ముష్కరులు 2 నెలల క్రితం అనంతపురం వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో 5రోజులు బసచేసి వచ్చారు. ఆన్లైన్ ద్వారా తనను సంప్రదించిన షఫీ ఆర్మర్ ఇద్దరు వ్యక్తుల్ని అనంతపురం పంపాలని, తదుపరి విషయం మళ్లీ చెప్తానని స్పష్టం చేసినట్లు ఇబ్రహీం విచారణలో బయటపెట్టాడు. అతడు చెప్పిన ప్రకారం ఇద్దర్నీ పంపానని, ఐదు రోజుల తర్వాత మళ్లీ తనను ఆన్లైన్లోనే సంప్రదించిన ఆర్మర్ వారిని వెనక్కు పిలవాల్సిందిగా ఆదేశించడంతో అలా చేశానని చెప్పుకొచ్చాడు. అనంతపురంలో దాగి ఉన్న రహస్యం కేవలం ఆర్మర్‌కు మాత్రమే తెలుసని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ద్విచక్ర వాహనంపై వెళ్లి.. ఈ ముఠాకు చెందిన ముష్కరులు రెండు కంట్రీమేడ్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, తూటాలను మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు ఫహద్‌తో పాటు మరో ఉగ్రవాది హైదరాబాద్ నుంచి దాదాపు 280 కి.మీ. దూరంలో ఉన్న నాందేడ్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తుపాకులు, తూటాలు తీసుకుని ద్విచక్ర వాహనం పైనే తిరిగి వచ్చారు. మరోవైపు ఇబ్రహీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.15 లక్షల్ని షఫీ ఆర్మర్.. దుబాయ్‌లో ఉన్న యూసుఫ్ లేదా మరో సానుభూతిపరుడి ద్వారా హవాలా మార్గంలో పంపాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ మాడ్యూల్‌కు చెందిన ఓ ముష్కరుడు గతనెలలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లి వచ్చినట్లు సాంకేతిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అక్కడి హవాలా ఏజెంట్ ద్వారా ఈ నగదు అందినట్లు ఎన్ఐఏ అంచనా వేస్తోంది. ముష్కరుల్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనంతపురం టూర్‌తో పాటు అజ్మీర్ అంశాలను ఖరారు చేసుకోవడంతో పాటు నాందేడ్‌లో ఆయుధాలు విక్రయించిన వ్యక్తిని గుర్తించడానికి వారికి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లాలని అధికారులు నిర్ణయించారు. పేలుడు పదార్థాలు అందించడానికేనా? ఈ ముష్కరుల్ని ఆర్మర్ అనంతపురం పంపిం చింది పేలుడు పదార్థాలు అందించడానికా? అనే అనుమానాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 2007, 2013ల్లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ముష్కరులకు... పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కర్ణాటకలోని మంగుళూరు నుంచే అందింది. ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్‌కు ఐఎం క్యాడర్‌తో సంబంధాలు ఉండ టం, అతడిదీ కర్ణాటకలోని భత్కల్ ప్రాంతం కావడంతో పేలుడు పదార్థాల ‘మార్పిడి’ కోసమే అనంతపురాన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడకు కర్ణాకటకు చెందిన వ్యక్తి ద్వారా ఎక్స్‌ప్లోజివ్స్ పంపాలని భావించి ఉంటాడని, అయితే చివరి నిమిషంలో అది విరమించుకుని ఉంటాడని విశ్లేషిస్తున్నారు. రంగంలోకి ఏపీ టీమ్స్ ఏయూటీ మాడ్యుల్ అనంతపురంలో బస చేసిన విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పూర్వాపరాలు పరిశీలించేందుకు రంగంలోకి దిగాయి. గడిచిన ఏడాది కాలంలో ఉగ్రవాదులు అనంతపురం ప్రాంతాన్ని డెన్‌గా వినియోగించుకున్నట్లు బయటపడటం ఇది రెండోసారి కావడంతో ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో సూర్యాపేట సమీపంలోని జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో సిమికి చెందిన అస్లం, ఎజాజ్ మరణించారు. ఇదే మాడ్యుల్‌కు చెందిన అంజద్, మహబూబ్, సాలఖ్, జకీర్‌లను ఒడిశా పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. వీరి విచారణలోనూ అనంతపురం కోణం వెలుగులోకి వచ్చింది. తాము ఆ పట్టణంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసించామని చెప్పారు. ఇప్పుడు ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ సైతం అనంతపురం వెళ్లి వచ్చినట్లు బయటపడటంతో ఏపీ నిఘా వర్గాలు అప్రతమత్తమయ్యాయ. ముష్కరులకు ఎవరైనా స్థానిక సానుభూతిపరులు ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నాయి. -
టాయ్‌లెట్ కడితేనే తుపాకీ లైసెన్స్!
రాజ్‌గఢ్: తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇంట్లో మరుగుదొడ్డి (టాయ్‌లెట్) లేకున్నా తుపాకీ అవసరమా? అంటూ అతని దరఖాస్తును తిరస్కరించారు. ముందు ఇంట్లో టాయ్‌లెట్ నిర్మించి.. ఆ తర్వాతే తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీ లైసెన్స్ కోసం రూ. 50 వేలు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి మరుగుదొడ్డి కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయలేరా అని జిల్లా కలెక్టర్ తరుణ్ పిథోడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఇకపై ఎవరైనా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా వారింట్లో టాయిలెట్ ఉండాలని, అలా ఉంటేనే ఆ దరఖాస్తులను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. రాజ్ గఢ్ ప్రాంతంలో ఆయుధ లైసెన్స్ ను కలిగి ఉండటం గౌరవంగా భావిస్తున్నారు. ఇక్కడ ఏడాదికి 700 గన్ లైసెన్స్ దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. -
నంగునూరులో తుపాకుల కలకలం
రెండు తుపాకులు, తపంచా స్వాధీనం నంగునూరు: పోలీసుల తనిఖీలో రెండు తుపాకులు, తపంచా వెలుగుచూడటం మెదక్ జిల్లాలో కలకలం రేపింది. నంగునూరు మండలం రాంపూర్ క్రాస్‌రోడ్డులోని ఓ ఇంట్లో ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కూలిపనులకు వచ్చామని చెప్పి అద్దెకుదిగారు. శనివారం అర్ధరాత్రి ఏదో విషయమై గొడవకు దిగగా ఓ వ్యక్తికి తలపగిలి తీవ్ర గాయమైంది. పెట్రోలింగ్ సిబ్బందితో అక్కడికి రాగానే ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. కృష్ణకుమార్ అనే వ్యక్తి వద్ద తుపాకీ లభించింది. ఇంట్లో సోదాలు నిర్వహించగా మరో తుపాకీ, ఒక తపంచా, 14 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట, చిన్నకోడూర్ పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. -
పల్నాట.. ఉలికిపాటు
► మళ్లీ వార్తల్లోకి ఎక్కిన గుత్తికొండ ► వేమగిరిలో స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ ► ఆయుధాల విడిభాగాల తయారీ మిషన్లు, సామాగ్రి గుర్తింపు ► నాటు తుపాకులు, 600 బుల్లెట్లు స్వాధీనం ► దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసు యంత్రాంగం ► మావోల కదలికలపై బలపడుతున్న అనుమానాలు ► పల్నాడు ప్రాంతంలో సంచలనం పిడుగురాళ్ళ: గుత్తికొండ గ్రామం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొన్నేళ్లుగా కనుమరుగైన నక్సలిజం కదలికలు మళ్లీ మొదలైన జాడ కనిపిస్తోంది. మావోయిజానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే... అదే మావోయిజానికి బీటలు వారింది ఇక్కడే... పిడుగురాళ్ళ మండలంలోని ఈ గ్రామ సమీపంలోనే వేమగిరి అటవీ ప్రాంతంలో సోమవారం ఆయుధాలు తయారు చేసే మిషనరీతో పాటు పలు సామాగ్రి ఉన్న బాక్సులు లభ్యం కావడంతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ ఆయుధాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. నక్సలైట్లు వాడే ఆయుధాలను, తూటాలను తయారు చేసే మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న నలుగురైదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడు ప్రత్యేక వాహనాల్లో పిడుగురాళ్లకు తరలించారు. మిషనరీతోపాటు, నాటు తుపాకులు, 600 బుల్లెట్లు, తూటాలుతయారు చేసే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ మిషనరీ పవర్ స్ప్రేయర్లు తయారు చేసేదని తయారీదారులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నక్సలిజానికి పెట్టింది పేరు గుత్తికొండ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నక్సలైట్లు కీలక విభాగాల్లో పనిచేశారు. గతంలో గుత్తికొండ ప్రాంతంలో నక్సలైట్లు పలువురు రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను హత్య చేశారు. తదనంతర పరిణామాల్లో పోలీసులు మావోయిస్టులను అణచివేసే కార్యక్రమంలో భాగంగా నక్సలైట్ల ప్రభావం తగ్గింది. నక్సలైట్లు వారి సాధక బాధకాలు చర్చించుకునేందుకు పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామానికి వేదిక చేసుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నక్సల్స్ ఆయువు పట్టును ప్రభుత్వ ఇంటిలిజెన్సు వర్గాలు చేజిక్కించుకున్నాయి. ఈ బహిరంగ సభకు సంబంధించి ప్రభుత్వ ఇంటిలిజెన్సు వర్గాలు ఫొటోలు, వీడియోలు తీసి పక్కా సమాచారాన్ని సేకరించింది. దీంతో పోలీసులు నక్సలిజానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నక్సలిజం జాడ లేదు. ప్రస్తుతం గుత్తికొండ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం ఓ కన్నేసింది. అక్కడ ఎలాంటి కదలికలు ఉన్నా సునిశితంగా పరిశీలిస్తోంది. దీంతో సోమవారం పోలీసుల కూంబింగ్‌లో ఆయుధాల విడిభాగాలు తయారు చేసే మిషనరీ బయట పడటం పల్నాడులో చర్చనీయాంశమైంది. మళ్లీ పల్నాడులో ఇప్పుడిప్పుడే నక్సలైట్ల కదలికలు మొదలవుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. కూపీ లాగుతున్న పోలీసులు.. గతంలో గుత్తికొండ తరచూ వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలో తుపాకులు తయారు చేస్తున్న సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లారు. పవర్‌స్ప్రేయర్లు తయారు చేసే మిషన్లను తయారీదారులు చెబుతున్నప్పటికీ ఈ మిషన్లను ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఎందుకు పెట్టారు.. తపంచాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారా అనే కోణంటో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇవి నక్సలైట్ల ఉద్యమానికి సహకరించడానికా, లేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి రౌడీ మూకలు చేస్తున్న పనా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వర్సిటీలోకి తుపాకులు తేవచ్చు!
చికాగో: తరగతి గదికి వెళ్లే విద్యార్థులు పెన్నులు, పుస్తకాలు, ట్రెండు మారింది కాబట్టి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులు మాత్రం ఇక నుంచి తుపాకులు కూడా తరగతి గదిలోకి తీసుకెళ్లొచ్చు. ఈ మేరకు అక్కడి రాష్ట్ర చట్ట సభ సభ్యులు బిల్‌ను ఆమోదించారు. -
పువ్వులు, క్యాండిల్స్ కాపాడతాయట!
-
పువ్వులు, క్యాండిల్స్ కాపాడతాయట!
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్ లో ఐఎస్ ఎస్ సృష్టించిన దారుణ మారణహోమానికి ప్రపంచదేశాలు సైతం వణికిపోతున్న సంగతి తెలిసిందే. వాళ్లు ఎందుకు అంతమందిని చంపేశారంటూ పారిస్‌లో ఓ బాలుడు అమాయకంగా అడగడం, వాళ్ల నాన్న ఆ పిల్లవాడిని సముదాయించిన వైనం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ తండ్రీ కొడుకుల సంభాషణకు సంబంధించిన వీడియోను జెరెం ఇసాక్ రూసో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫ్రెంచ్ టీవీలో ప్రసారమైన ఈ వీడియోను ఇంగ్లీష్ టైటిల్స్ చేర్చి చాలా అద్భుతమైన, విలువైన సంభాషణ అంటూ ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. పువ్వులు, కాండిల్స్ మనల్ని రక్షిస్తాయా అంటూ.. బెదురు కళ్లతో అడుగుతూ చివరికి కన్విన్స్ అయ్యి చిరునవ్వులు చిందిస్తున్న ఈవీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. బటాక్లాన్ థియేటర్ కాల్పుల సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పిస్తున్న సందర్భంగా స్థానిక టీవీ చానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారి సంభాషణ క్లుప్తంగా ఇలా సాగుతుంది... 'వాళ్లు చాలా చెడ్డవాళ్లు. వాళ్ల దగ్గర తుపాకులు ఉన్నాయి.. మన్నల్ని చంపేస్తారు. 'లేదు ..పారిస్ మనది.. మనం ఎక్కడికీ పారిపోవాల్సి అవసరం లేదు.. వాళ్ల దగ్గర తుపాకులుంటే, మన దగ్గర పువ్వులు, క్యాండిల్స్ ఉన్నాయి.. క్యాండిల్స్, పువ్వులు, మనల్ని కాపాడతాయా.. ఇలా సాగుతుంది ఆ సంభాషణ. చివరికి పువ్వులతో ఆ బ్యాడ్ పీపుల్ని మనం ఎదుర్కోవచ్చని తండ్రి అనునయంగా చెప్పిన మాటలకు ఏంతో రిలాక్స్డ్ గా బాలుడు నవ్వులు చిందించడం నెటిజనులను ఆకర్షిస్తోంది. దీంతో లైక్ లు, షేర్ల వెల్లువ పొంగుతోంది. -
పోలీసుల దిమ్మ తిరిగింది..
దక్షిణ కరోలినా : మూడు రోజుల పాటు సోదాలు, ట్రాక్టర్ల కొద్దీ మారణాయుధాలు.. వేల సంఖ్యలో తుపాకీలు... ఇవీ ఓ నేరస్థుడి ఇంట్లో దొరికిన సరకు సరంజామా. అమెరికా పేజ్ల్యాండ్ సిటీకి చెందిన బ్రెంట్ నికోల్సన్ (51) కథ కమామిషు ఇది. మత్తుమందులు హెరాయిన్, ఒపియం అమ్ముతున్నట్టుగా అతనిపై అభియోగాలు ఉన్నాయి. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న బ్రెంట్ నికోల్సన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. దీని ఆధారంగా అతడి ఇంటిని సోదా చేయడానికి వెళ్లిన పోలీసులు దిమ్మ తిరిగింది. బాణాలు, మందుగుండు సామాగ్రి, ఎయిర్ కంప్రెషర్స్ ఇలా ఒకటా రెండు వేలకొద్దీ మారణాయుధాలు. వీటన్నింటినీ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా పదివేల తుపాకులు దొరికాయి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యారేజ్ నుంచి తీస్తున్న కొద్దీ ట్రాక్టర్లు నిండిపోయాయి. అయినా ఓ దశలో లెక్క చిక్కలేదు. అవి కూడా సరదాగా సేకరించినవో.. కొన్నవో కాదు సుమా. బ్రెంట్ నికోల్సన్ దొంగతనంగా ఎత్తుకొచ్చిన ఆయుధాలు. అక్కడా ఇక్కడ కొట్టేసినవన్నీ ఇంట్లో దాచుకున్నాడతను. ఆ ఇంట్లో సోదాలకు వెళ్లిన తాము తుపాకులు లెక్కపెట్టలేక సొమ్మసిల్లిపోయామని..తమ సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని పోలీసు అధికారి తెలిపారు. అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో వారు అన్వేషణ మొదలుపెట్టారు. పోలీసులు సుమారు మూడు రోజులు పాటు ఈ దాడులు కొనసాగించారు. దాడుల్లో ఆయుధాలతో పాటు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన సొత్తు విలువ ఏడు కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 150 రంపాలు, 300 మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
నాటుతుపాకుల కలకలం
పట్టపగలు ఓ ఆటోలో రహస్యంగా నాటు తుపాకుల రవాణా గుట్టురట్టు కావడం పాలకొండలో కలకలం రేపింది. ఏజెన్సీ ప్రాంతంనుంచే ఇవి రవాణా కావడం పోలీసుశాఖకు సవాల్‌గా మారింది. వన్యప్రాణుల వేటకోసం వినియోగిస్తున్నారా.. లేక ఇంకే అవసరానికా... అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ : ఒక ఆటోలో దర్జాగా ఎనిమిది నాటుతుపాకులు రవాణా జరుగు తూ పోలీసులకు పట్టుబడి న సంఘటన పాలకొండ పట్టణంలో చర్చనీయాంశమైంది. పోలీసు స్టేషన్ ముందు నుంచే వీటిని తరలించేసినా... ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే ఆటో ఓ వ్యక్తిని ఢీకొనడంతో వారు అందించిన సమాచారం మేరకు వెంబడించి పట్టుకోగా అందులో అసలు గుట్టు రట్టయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది కాలంగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వన్యప్రాణుల వేటనే కొందరు వృత్తిగా మలచుకుని జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి తాజాగా ఆటోలో ఎనిమిది తుపాకులు పెట్టి గొనె సంచులు కప్పారు. వెనుక భాగంలో రెండు చురకత్తులు, బియ్యం, ఉప్పు, ఉల్లిపాయలు ఇతర సామగ్రితోపాటు ఐదు రోజులకు సరిపడే దుస్తులు పట్టేలా ఐదు బ్యాగ్‌లు లభించాయి. ఆటో డ్రైవర్ పప్పల చంద్రశేఖర్ మద్యం మత్తులో ఉండి పోలీసులకు చిక్కగా మరో ఎనిమిది మంది పారిపోయినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఏజెన్సీలో అడవి పందులు, దున్నలు, జింకలను వేట సాగిస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. చంపిన జంతువుల చర్మం తొలగించి మాంసంగా మార్చేందుకు పదునైన చురకత్తులు వినియోగించవచ్చని భావిస్తున్నారు. అడవి పందులను హతమార్చేందుకేనా... పాలకొండ ప్రాంతంలో విరివిగా చెరకు పంటను సాగు చేస్తున్నారు. వాటిని అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈతమానుగూడకు చెందిన గిరిజనులను గోపాలపురం గ్రామంలో చెరకు పంటల్లో పడుతున్న అడవి పందులను హతమార్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో నాటు తుపాకులు, కత్తులు, నాటు బాంబులకు వినియోగించే మందుగుండు సామగ్రి వెలుగు చూడటంతో వన్యప్రాణులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న తీరు ఇట్టే అర్థమౌతోంది. సంబంధిత ఆటవీశాఖ అధికారులు కాని, పోలీసులు కాని దీనిపై దృష్టిసారించలేదు. దీనికి తోడు అటవీశాఖలో కొంత మంది సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న కృష్ణ జింకుల వేటసైతం సాగుతున్నట్టు తెలుస్తోంది. మాంసం ఏమి చేస్తున్నట్టు.. దట్టమైన ఆడవిలతోపాటు చెరుకు తోటల్లో వేట సజావుగా సాగుతోంది. వన్యప్రాణులను చంపి ఆ మాంసాన్ని ఎక్కడ విక్రయిస్తున్నారన్న దానిపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో మాంసం విక్రయాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అడవిలోనే మాంసాన్ని ప్యాక్ చేసి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారించి దర్యాప్తు జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. కాగా నాటుతుపాకుల స్వాధీనంపై డీఎస్పీ సిహెచ్.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రాధమికంగా అడవి పందుల వేట కోసమే వీటిని వినియోగించినట్టు నిర్థారణకు వచ్చామన్నారు. పారిపోయిన నిందితులను పట్టుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందున్నారు. హత్యలు, దోపిడీల కోసం వీటిని వినియోగించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. -
పిల్ల టెర్రరిస్టుల చేత.....
పాల్మిరా: వాళ్లంతా 12,13 ఏళ్ల ప్రాయం పిల్లలే. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం ఏమీ తెలియని అమాయక బాలలే. అయినా చేతుల్లో పిస్టళ్లు పట్టుకున్నారు. వాటిని ఎదురుగా కనిపిస్తున్న తలలకు గురిచేసి పెట్టారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఒన్, టూ, త్రీ.....అనగానే టపా..టపా మంటూ 25 తలలను పేల్చేశారు. చిట్లిన తలల నుంచి రక్తం విరజిమ్ముతుండగా ఆ తలలు మొండాలతో సహా నేలకొరిగాయి. సిరియా ఎడారి ప్రాంతంలోని పాల్మిరా వద్ద ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆంపి థియోటర్ వేదికపై చోటుచేసుకున్న దృశ్యమిది. ప్రేక్షకుల గ్యాలరీలో ప్రజలు కూర్చొని తాపీగా ఈ దృశ్యాన్ని తిలకించారు. అంతమాత్రాన ఇది నాటకంలోని సన్నివేశం ఎంతమాత్రం కాదు. ఇది పిల్లల చేత సిరియా సైనికులకు ఐఎస్ఐఎస్ టైర్రరిస్టుల ప్రత్యక్షంగా మరణశిక్ష అమలు చేయించిన తీరిది. తాజాగా జరిగిన ఈ సంఘటనను టైర్రరిస్టుల తీరిగ్గా చిత్రీకరించి, ఆ వీడియోను వెబ్సైట్లకు విడుదల చేశారు. సిరియా సైనికుల ఆధీనంలోవున్న పాల్మిరా పట్టణాన్ని గత మే 21వ తేదీన ఐఎస్ఐఎస్ టైర్రరిస్టుల స్వాధీనం చేసుకున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 మంది సైనికులు, వారి మద్దతుదారులను ఇలా బహిరంగంగా భయంకరంగా మరణ శిక్ష విధించారు. తమలో చేర్చుకోవడం కోసం ఇప్పటి వరకు దాదాపు 500 మంది పిల్లలను టైర్రరిస్టుల కిడ్నాప్ చేశారని, ఆ కిడ్నాప్ చేసిన వారి నుంచి ఆయుధ శిక్షణ తీసుకున్న 25 మంది పిల్లలను ఎంపిక చేసి, వారి చేత ఈ దారుణమారుణ కృత్యాన్ని చేయించారని మానవ హక్కుల సంఘాలు తెలియజేశాయి. తమ వద్ద బందీలుగావున్న మిగతా పిల్లలను కూడా టైర్రరిస్టుల బ్రెయిన్ వాష్ చేస్తుండవచ్చని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. -
నల్లగొండ జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. గత నెల 26న నకిరేకల్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినవారు ఉగ్రవాదులుగా నిర్థారించినట్లు తెలుస్తోంది. పానగల్లో తప్పించుకున్న ఇద్దరు యువకులు.. ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపినవారికి బహుమానం కూడా ప్రకటించారు. కాగా మే 26వ తేదీన నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు పిస్టల్‌తో హల్చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. దాంతో ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ ఇద్దరు యువకులు... దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
'స్కూళ్లలో గన్స్ ను అనుమతించాలి'
లాస్ ఏంజిల్స్: ముళ్లును ముళ్లుతోనే తీయాలంటున్నాడు నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, ఉద్యమకారుడు విన్స్ వాన్. విద్యా వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని ముష్కర మూకలు చేసే దాడులను తిప్పికొట్టాలంటే తరగతి గదుల్లోకి తుపాకీలను అనుమతించాల్సిన అవసరముందని ఈ 50 ఏళ్ల నటుడు అభిప్రాయపడ్డాడు. స్కూళ్లలో తుపాకీలను అనుమతిస్తే ఆ అమానుష చర్యల నుంచి విద్యార్థుల ప్రాణాలను కాపాడుకునే వీలుంటుందన్నాడు. కొంతమంది స్కూళ్లలో విధ్వంసం సృష్టించే క్రమంలో ఎంతోమంది అమాయక ప్రజలు బలి అవుతున్న విషయాన్ని గుర్తు చేశాడు. 'దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడతారు. ఆ సమయంలో స్కూళ్లలో గన్స్ ఉండవు. తరగతి గదుల్లో తుపాకులు అనుమతించరని ముష్కరులకు తెలుసు. భారీ ఎత్తున అమాయకులపై విరుచుకుపడతారు. ఆ దాడులను తిప్పి కొట్టడానికి గన్స్ ను స్కూళ్లలో అనుమతించడం ఒక్కటే సరైన మార్గం' అని విన్స్ వాన్ తెలిపాడు. మనం ఆయుధాలను చేతపట్టకుండా సమాజంలో హెచ్చు మీరుతున్న నేర ప్రవృత్తిని నిర్మూలించలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
తుపాకీతో ఇద్దరు యువకుల హల్ చల్
నల్లగొండ: ఇద్దరు యువకులు తుపాకీతో హల్ చల్ సృష్టించిన ఘటన జిల్లాలోని నకిరేకల్ లో మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో కలకలం రేపింది. బైక్ పై వచ్చిన ఆ యువకులు స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న ఐడీపార్టీ అధికారులు సంఘటాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు అపాచి బైక్( నెం ఏపీ 13, ఆర్ యూ 4379 )పై వచ్చినట్లు స్థానికులు అధికారులకు తెలిపారు. వారు హిందీలో మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ యువకులకు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు అనేకోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఐడీపార్టీ అధికారులను హైదరాబాద్ కు పిలిపించిన ఐజీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలిస్తాం: పద్మారావు
ఖమ్మం: తెలంగాణలోని ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గతంలో ఎక్సైజ్ శాఖకు తుపాకులు ఉండేవని, మద్య నిషేధ సమయంలో వాటిని ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తుపాకులను ఎక్సైజ్ శాఖకు ఇవ్వాల్సిన అవసరంపై ఆయా జిల్లాల అధికారులను నివేదికలు కోరామని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వీరికి తుపాకులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. -
ఆబ్కారీకి ఆయుధాలు
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ ప్రభుత్వం ఆబ్కారీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వనుంది. గుడుంబా, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆబ్కారీ శాఖ నుంచి వివరాలు కోరింది. ఈ మేరకు అధికారులు ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఎన్ని ఆయుధాలు అవసరం అనే నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. ఆయుధాలు ఎందుకు? జిల్లాలో గుడుంబా తయారీ, గంజాయి సాగు అధికంగా ఉంది. వీటిని అరికట్టడానికి ఆబ్కారీ అధికారులు వెళ్లినప్పుడు స్మగ్లర్లు దాడులు చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. చేతుల్లో ఆయుధాలు లేకపోవడంతో వారి దాడులను ఎదుర్కోవడం లేదు. ఆయుధాలు లేకపోవడంతో పోలీసుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. పోలీసులు విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పుడు స్మగ్లర్లు తప్పించుకు పోతున్నారు. పోలీసు శాఖపై ఆధారపడకుండా ఆబ్కారీ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లోనే.. జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక డిప్యూటీ కమిషనర్, ఇద్దరు ఎక్సైజ్ సూపరిటెం డెంట్లు, 11 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు 50 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లాలోని గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో చెన్నూరు, లక్సెట్టిపేట, ఉట్నూర్, ఇచ్చోడ, నిర్మల్, మంచిర్యాల స్టేషన్ల పరిధిలో గుడుంబా స్థావరాలు అధికంగా ఉంటాయి. ఈ స్టేషన్ల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అయితే ఈ స్టేషన్లో పరిధిలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి సాగు చేసేవారు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ఎక్సైజ్ అధికారులతోపాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. నివేదిక పంపాం.. - శివరాజు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గుడుంబా తయారీ నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి నివేదించాం. శాఖపరంగా అన్ని సమగ్ర వివరాలు అందజేశాం. ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసే సమయంలో పోలీసుల సహాయం తీసుకుంటున్నాం. దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇంక ఎలాంటి ఆదేశాలు రాలేదు. -
‘ఉగ్ర’ కలకలం
మదనపల్లెలో ముగ్గురుఅనుమానితుల అరెస్టు రెండు తుపాకులు, పిస్టోల్ స్వాధీనం నిందితులు ఉగ్రవాదులా.. కిడ్నాపర్లా? గతంలో తీవ్రాది ఖురేషి మకాం మదనపల్లె, న్యూస్‌లైన్: ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మదనపల్లెలో ఉగ్రవాద కలకలం రేగుతోంది. వారంరోజులు గా తిష్టవేసిన అనుమానితులు షబ్బీర్, పుజ్జు, హసన్ లను శుక్రవారం హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో పట్టణంలో కలకలం రేగింది. నిందితుల వద్ద తుపాకులు ఉండడంతో వారు ఉగ్రవాదులుగానీ.. దారిదోపిడీలకు పాల్పడే వారుగానీ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. పట్టణంలో స్పెషల్‌బ్రాంచి, ఇంటెలిజెన్స్ వంటి నిఘా వర్గాల పోలీసులు పనిచేస్తున్నా వారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కరుడుగట్టిన తీవ్రవాది మహ్మద్ ఖురేషి 2009లో మదనపల్లెలోని కురవంకలో ఉన్న ప్రియురాలికోసం వచ్చాడు. సుమారు నెలరోజుల పాటు మదనపల్లెలోనే మకాం వేసినా తీవ్రవాది జాడను నిఘావర్గాలు గుర్తించలేక పోయాయి. అప్పట్లో వన్‌టౌన్‌లో ఉన్న ఎస్ఐ మల్లికార్జునగుప్త వ్యభిచార గృహాలను తనిఖీ చేసే క్రమంలో ఖురేషి పట్టుబడ్డాడు. ఖురేషి తీవ్రవాది అని తెలియడంతో మదనపల్లెలో కలకలం రేగింది. మదనపల్లెలో తీవ్రవాది మకాం.. ఇక్కడి నుంచి కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నాడనే కథనాలు పత్రికల్లో రావడంతో సంచలనం రేగింది. అప్పట్లో పోలీసులు అప్రమత్తమై నిఘా వర్గాలను బలోపేతం చేశారు. అయితే కాలక్రమంలో ఆ నిఘావర్గాలు పూర్తిగా కనిపించకుండా పోయాయి. తర్వాత ఐదేళ్లకు మదనపల్లెలో జన సంచారం మధ్యే నలుగురు అనుమానిత తీవ్రవాదులు జీవనం చేస్తున్నా నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయి. శుక్రవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ చేసి అనుమానిత తీవ్రవాదులను అరెస్ట్ చేయడంతో మళ్లీ మదనపల్లెలో తీవ్రవాదుల కలకలం రేగింది. ఇరాని తెగకు చెందిన జాఫర్, షబ్బీర్, పుజ్జు, హసన్ అనే అనుమానిత తీవ్రవాదులు ప్రజల మధ్యనే తిరుగుతుండగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరిని పట్టుకునే క్రమంలో పోలీసులపైనే దుండగులు మారణాయుధాలతో తిరుగుబాటు చేసి, పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు సహకరించి పోలీసులకు పట్టిచ్చారు. మదనపల్లెలో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయనేందుకు ఈ రెండు సంఘటనలే ఉదాహరణలుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు అధికారులు నిఘావర్గాలను పటిష్టంచేసి తీవ్రవాద కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పెట్టి, ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంది. -
తుపాకులు సరెండర్ చేయండి
సైబరాబాద్ : ఎన్నికల కోడ్ సందర్భంగా తుపాకులను వెంటనే సరెండర్ చేయాలన్న పోలీసుల ఆదేశాలను ప్రముఖులు బేఖాతరు చేశారు. గడువు ముగిసినా ఇంకా చాలామంది తుపాకులను వారి వద్దే ఉంచుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు 102 మందికి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.గంగాధర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో తుపాకులను అప్పజెప్పాలని... లేకుంటే వాటి లెసైన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. 462 మందికి మినహాయింపు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 2099 మందికి తుపాకీ లైసన్స్ ఉన్నాయని జాయింట్ సీపీ చెప్పారు. వీరిలో 1535 మంది సరెండర్ చేయగా... 462 మందికి మినహాయింపు ఇచ్చామన్నారు. మినహాయింపు ఇచ్చిన వారిలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారులు ఉన్నారన్నారు. ఇంకా 102 మంది తుపాకులు అప్పజెప్పలేదన్నారు. మినహాయింపునివ్వండి... తుపాకులను సరెండర్ చేయకుండా తమవద్దే ఉంచుకొనేందుకు అనుమతినివ్వాలని ఆరుగురు వ్యాపారులు సైబరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసుకున్నారు. తమకున్న ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు జాయింట్ సీపీ తెలిపారు. వీరి విన్నపాన్ని పరిశీలించి... ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామన్నారు. వారు అనుమతిస్తే మినహాయింపు ఉంటుందన్నారు. -
మూడు నెలల్లో ఆయుధాలు
=అటవీ సిబ్బంది కోసం కొనుగోలుకు సిద్ధం =క్షేత్ర స్థాయి సిబ్బందికి 12 రకం బోర్ తుపాకులు =రేంజ్ స్థాయి అధికారులకు రివాల్వర్లు =ఆత్మరక్షణే లక్ష్యం కొయ్యూరు, న్యూస్‌లైన్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులపై ఘాతుకమైన దాడి చేయడంతో కదిలిన అటవీ శాఖ ఇప్పుడు ఆయుధాల సమీకరణ ధ్యేయంగా అడుగులు వేస్తోంది. అడవుల్లో విలువైన కలపను రక్షించడానికి క్షేత్ర స్థాయిలో గస్తీ తిరిగే అటవీ సిబ్బందికి రక్షణ కల్పించడానికి ఆయుధాలు సమకూర్చడమే మార్గమని నిర్ణయానికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నర్సీపట్నం అటవీ డివిజన్‌కు సంబంధించి ఏడు రేంజ్‌లలో నాలుగు రేంజ్‌లు సమస్యాత్మకమైనవి. ఈ ప్రాంతంలో కలప చోరులు తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందిపై దాడులు చేసే అవకాశం ఉంది. అలాగే తూర్పు కనుమల్లో రంగురాళ్లు కూడా విరివిగా ఉన్నాయి. క్వారీల వద్ద నిత్యం వందలాది మంది తవ్వకాలు జరుపుతారు.అలాంటి చోట్లకు ఆయుధాలు లేకుండా వెళ్తే దాడులు జరిగే అవకాశం ఉంది. దీంతో సాధ్యమైనంత వేగమే ఆయుధాలు అందించే ఏర్పాట్లలో ఉన్నతాధికారులు ఉన్నారు. దట్టమైన అడవులకు పేరుపడ్డ మధ్యప్రదేశ్‌లో కొన్ని చోట్ల అటవీ సిబ్బంది ఆయుధాలతో పని చేస్తున్నారు. అక్కడ సిబ్బంది అమెరికాలో తయారైన ఆయుధాలను వాడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం అనుసరించే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి 12 రకం బోర్ తుపాకులు, అధికారులకు రివాల్వర్లు అందజేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. అయితే ఎవరు ఆయుదాలను కొనుగోలు చేయాలన్న దానిపై కొంత సందిగ్దత ఉందన్నారు. మరో మూడు నుంచి నాలుగు నె లలలోపు అటవీ సిబ్బందికి ఆయుధాలు సరఫరా జరిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి తెలిపారు. ఆత్మ రక్షణ ముఖ్యం : అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నది దాడుల కోసం కాదని,ఆపదలో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం వాటిని వాడాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఏడు రేంజ్లో ఏడు బేస్ క్యాంప్‌లు, ఏడు స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఉన్నాయి. 2010 నుంచి అమలులోకి వచ్చిన కంపా పథకం ద్వారా వాటి నిర్వాహణకు నిధులు వస్తున్నాయి. ఈ డివిజన్లో దట్టమైన అడవి ప్రాంతంగా ఉన్న మర్రిపాకలు, సీలేరు రేంజ్‌లలో ఉన్న విలువైన కలపను రక్షించాల్సిన బాధ్యత ఉంది.మరోవైపు రంగురాళ్ల తవ్వకాల నిరోధానికి ప్రతిపాదించిన రెండు పోలీసు బృందాలను కూడా ప్రభుత్వం పంపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. -
అటవీ అధికారులకు త్వరలో తుపాకులు
రామాయంపేట, న్యూస్‌లైన్: అటవీ సంరక్షణ కోసం రేంజ్ అధికారులకు త్వరలో తుపాకులు పంపిణీ చేస్తున్నట్టు సామాజిక అడవుల నిజామాబాద్, మెదక్ జిల్లాల అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ బాబూరావు తెలిపారు. శుక్రవారం ఆయన రామాయంపేటకు వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి రేంజ్ కార్యాలయానికి ఆరు తుపాకుల చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. మెదక్ డివిజన్లో 22 శాతం భూమి కబ్జాలకు గురైందన్నారు. అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారెందరు? ఎన్ని ఎకరాలు ఆక్రమించారనే విషయంపై నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టామని, అక్రమాలకు చెక్ పెడతామన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అక్రమంగా అడవులను నరికి సాగు చేస్తున్న 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మెదక్- రామాయంపేట ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి అడవిలోంచి రోడ్డు వేయడం అనుమతి లేదన్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించామన్నారు. అలాగే వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. క్వార్టర్ నిర్మాణం కోసం భూమి పూజ రామాయంపేట అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ నిర్మాణం కోసం శుక్రవారం బాబురావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్వార్టర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 19 లక్షల రూపాయలు యంజూరు చేసిందన్నారు. త్వరలోనే భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ బాబూరావు, మెదక్ డీఎఫ్ఓ హరికుమార్, సబ్ డీఎఫ్ఓ సత్య నారాయణలను రామాయంపేట రేంజ్ ఆఫీసర్ మురళీధర్ పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామాయంపేట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ విద్యా సాగర్, రేంజ్ పరిధిలోని సెక్షన్, బీట్ ఆపీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రేంజ్ ఆఫీసర్ మురళీధర్ మాట్లాడుతూ రామాయంపేట రేంజ్ పరిధిలో 18 బీట్లు ఉన్నాయని తెలిపారు. ఏడుగురు బీట్ ఆపీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మెదక్ మండలం పాతూర్ సెక్షన్లో బీట్ ఆఫీసర్ లేరని తెలిపారు. రామాయంపేట రేంజ్ కార్యాలయానికి వాహనాన్ని మంజూరు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న బీట్లలో అధికారులను నియమించాలని ఆయన కోరారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు; 13 మందికి గాయాలు
షికాగో: వాషింగ్టన్ నేవీ యార్డు కాల్పుల ఘటన మరవక ముందే అమెరికాలో మళ్లీ తుపాకులు పేలాయి. షికాగో శివారు బ్యాక్ ఆఫ్ ద యార్డ్స్లోని కార్నెల్ స్క్వేర్ పార్కులో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మూడేళ్ల బాలుడు సహా 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన బాలుడితోపాటు మరో ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ఒక తూటా బాలుడి చెంపలోకి దూసుకెళ్లిందని అతని బంధువు చెప్పాడు. దుండుగులు ఓ కారులోంచి తనపై కాల్పులు జరపగా తప్పించుకున్నానని, తర్వాత వారు పార్కులోకి వెళ్లి కాల్పులు జరిపారని చెప్పాడు. పోలీసులు తక్షణమే పది అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.