కొరుక్కుపేట: వాహనాల అతివేగానికి చెక్ పెట్టేందుకు లేజర్‌గన్స్ అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు నిబం ధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే జరిమానాలు భరించక తప్పదు. వాహనాల అతివేగాన్ని పసిగట్టేలా చెన్నై –బెంగళూరు జాతీయ రహదారిలో వినూత్న లేజర్ గన్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.12కోట్ల నిధులు మంజూరు చేసిం ది. అధికారులు మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా లేజర్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసిన లేజర్‌గన్స్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానాను తరువాత వచ్చే టోల్ ప్లాజాలోనే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాహనం ఫొటో, నంబర్ చిత్రాలను ఎవిడెన్స్‌గా చూపనున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చెన్నై –వేలూరు మధ్య జాతీయ రహదారిలో ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment