laser
-
Health: చీకటి పొర చీల్చండి..
మధ్య వయసు దాటాక చాలామందిలో కంటికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది క్యాటరాక్ట్. ఈ సమస్యనే వాడుకభాషలో కంటిలో వచ్చే తెల్లముత్యం అనీ, పువ్వు రావడం, పొర రావడం అని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మందిలో క్యాటరాక్ట్ వల్ల అంధత్వం వస్తోంది. ఇప్పటికీ మారుమూల గ్రామీణ ్రపాంతాల్లో మధ్యవయసులోనే అంధత్వానికి దారితీసే కారణాల్లో ఇదీ ఒకటి. దీనికి కారణాలూ, చికిత్స ఏమిటో తెలుసుకుందాం.సాధారణంగా వృద్ధాప్య దశలోనే వచ్చే ఈ క్యాటరాక్ట్...ఇటీవల చాలామందిలో చాలా చిన్నవయసులోనే వస్తోంది. అంధత్వానికి దారితీసే అంశాల్లో క్యాటరాక్ట్ కూడా ఒకటి అని తెలిసినప్పటికీ, సాధారణ శస్త్రచికిత్సతో దీన్ని సరిదిద్దడం సాధ్యమైనప్పటికీ మారుమూల పల్లెవాసుల్లో దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ దీని వల్ల అంధులయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని పూర్తిగా సరిదిద్ది, దీని ద్వారా వచ్చే అంధత్వాన్ని నివారించడం నూటికి నూరు పాళ్లు సాధ్యమే. అదెలాగో చూద్దాం.క్యాటరాక్ట్ అంటే ఏమిటి, అందుకు కారణాలు...కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ పారదర్శకంగా ఉన్నంతసేపే కాంతి నిరాటంకంగా లోపలికి ప్రవేశించి రెటీనా తెరను చేరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల లెన్స్ తన పారదర్శకత కోల్పోయే ప్రమాదముంది. అవి... పెరిగే వయసు, లేదా ఏదైనా ప్రమాదాలు వంటి కారణాలతో ఈ లెన్స్ క్రమంగా మసక మసకబారిపోతూ తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో లెన్స్ గుండా కాంతి సాఫీగా ప్రయణించడం సాధ్యం కాదు. ఫలితంగా క్రమంగా చూపు మసకబారుతుంది. ఈ కండిషన్‌నే క్యాటరాక్ట్ అంటారు.చికిత్స...క్యాటరాక్ట్ ఉన్నవారికి కంట్లో పారదర్శకత కోల్పోయిన లెన్స్‌ను తొలగించి, దాని స్థానంలో కృత్రిమ (ఆర్టిఫిషియల్) లెన్స్ (ఐఓఎల్ / ఇంట్రా ఆక్యులార్ లెన్స్)ను అమర్చడం ద్వారా చికిత్స చేసేవారు. అయితే గతంలో ఈ లెన్స్‌ను తొలగించేందుకు దాదాపు 13–14 ఎం.ఎం. మేరకు కోత పెట్టేవారు. తర్వాత ఈ గాయానికి కుట్లు వేసేవారు. కాల క్రమంలో శస్త్రచికిత్సల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అక్రిలిక్ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కృత్రిమ లెన్స్‌ను రూపొందించారు. పాత స్వాభావిక (నేచురల్) లెన్స్ స్థానంలో దీన్ని అమర్చుతారు. దీంతో ఆపరేషన్ తర్వాత కనుచూపు పూర్తిగా మెరుగవుతుంది.ఫ్యాకో ఎమల్సిఫికేషన్... (పీఈ):కాటరాక్ట్ చికిత్సలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అనేది ఒక ఆధునిక ప్రక్రియ. ఇందులో అల్ట్రా సౌండ్ ఎనర్జీ సహాయంతో లెన్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, చిన్న రంధ్రం ద్వారా క్యాటరాక్టస్ లెన్స్ (క్యాటరాక్ట్‌కు గురైన లెన్స్)ను తొలగిస్తారు. అదే చిన్న రంధ్రం ద్వారా ఫోల్డబుల్ అక్రిలిక్ ఇంట్రాక్యులార్ లెన్స్‌ను కంటిలోపల అమర్చుతారు. దీనికి కేవలం 2 – 3 ఎం.ఎం. గాటు సరిపోతుంది. కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. గాటు చిన్నది కావడం వల్ల గాయం మానేందుకు పట్టే సమయం కూడా తక్కువ. ఈ ప్రక్రియలో రిస్క్ కూడా చాలా తక్కువ. దీనిలో కన్ను ఎర్రబారడం, కళ్ల మంట చాలా తక్కువ. ఫలితంగా బాధితులు చాలా త్వరగా తమ వృత్తి, ఉద్యోగాలకు వెళ్లవచ్చు.ఫెమ్టో లేజర్ చికిత్స:త్యాధునికమైన ఫెమ్టో లేజర్ సాంకేతికత ఇప్పుడు క్యాటరాక్ట్‌కు మరో చికిత్స. ఇందులో కాటరాక్టస్ లెన్స్ తాలూకు పరిమాణం, మందం వంటి అంశాలను ఓసీటీ టెస్ట్ ద్వారా కొలిచి లేజర్ చికిత్స ద్వారా అవసరమైనంత పరిమాణంలో ముక్కలు చేసి ఆ మేరకే లెన్స్‌ను తొలగిస్తారు. కచ్చితత్వం, భద్రత... ఈ రెండూ ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తాయి.లెన్స్‌లలో మరెన్నో రకాలు...లెన్స్‌లలో మోనోఫోకల్, బైఫోకల్, ట్రైఫోకల్, టోరిక్ అనేవి కూడా కొత్తగా వచ్చాయి. ఇవి పేషెంట్ అవసరాలను బట్టి అమర్చుతారు.మత్తు అవసరం లేదు.. నొప్పీ ఉండదు..ఫ్యాకో చికిత్సలోనూ, లేజర్ చికిత్సలోనూ గతంలోలా పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేవలం లోకల్ అనస్థీషియాగా చుక్కల మందు వేసి వెంటనే చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాదు... గత ప్రక్రియలతో పోలిస్తే నొప్పి కూడా తక్కువే.కొనసాగుతున్న పరిశోధనలు...ఫ్యాకో ఎమల్సిఫికేషన్, ఫెమ్టో లేజర్ దగ్గరే పురోగతి ఆగిపోలేదు. మరింత నాణ్యమైన, సమర్థమైన కృత్రిమ లెన్స్‌ల కోసం కృషి కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ మరింత ఆధునికమైనవి.ఇవి చదవండి: డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ! -
‘లేజర్’తో యాంజియోప్లాస్టీ..!
కొన్నిసార్లు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడ్డప్పుడు బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ వంటి అనేక ప్రక్రియలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఇటీవల అనేకమంది గుండెజబ్బుల బాధితులను రక్షిస్తున్న సంగతులూ తెలిసినవే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియను లేజర్ సహాయంతో మరింత సురక్షితంగా చేయడం ద్వారా, మంచి ఫలితాలను సాధించవచ్చని తేలింది. గుండెజబ్బుల చికిత్సలో నూతన సాంకేతికతకూ, పురోగతికీ ప్రతీక అయిన ఈ సరికొత్త ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి తెలుసుకునే ముందు కరోనరీ యాంజియోప్లాస్టి అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులున్నప్పుడు, శస్త్రచికిత్స చేయకుండానే... చేతి లేదా కాలి దగ్గరున్న రక్తనాళం నుంచి చిన్న పైపుల్ని పంపి గుండె రక్తనాళాల వరకు చేరతారు. ఇక్కడ అడ్డంకులను తొలగించడం, నాళం సన్నబడ్డ లేదా అడ్డంకి ఉన్న చోట బెలూన్ను ఉబ్బించి, నాళాన్ని వెడల్పు చేసి, స్టెంట్ వేసి, రక్తం సాఫీగా ప్రవహింపజేసే ప్రక్రియనే ‘కరోనరీ యాంజియోప్లాస్టీ’ అంటారు. ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారంటే... రక్తనాళాల్లో అడ్డంకులు/బ్లాకులనేవి అక్కడ కొవ్వు పేరుకుపోవడంవల్ల ఏర్పడతాయి. యాంజియోప్లాస్టీలో... ముందుగా బ్లాక్ ఉన్న రక్తనాళంలోకి ఓ పైప్‌ను ప్రవేశపెడతారు. దీన్ని ‘గైడింగ్ క్యాథేటర్’ అంటారు. ఆ పైపులోంచి వెంట్రుక అంత సన్నటి తీగను... అడ్డంకిని సైతం దాటేలా... రక్తనాళం చివరివరకు పంపిస్తారు. ఈ సన్నటి తీగనే ‘గైడ్ వైర్’ అంటారు. ఒకసారి గైడ్ వైర్ అడ్డంకిని దాటి చివరి వరకు వెళ్లాక, గైడ్ వైర్ మీది నుంచి ఒక బెలూన్ని బ్లాక్ వరకు పంపిస్తారు. బ్లాక్‌ను దాటి వెళ్ళగానే, ఆ బెలూన్ని పెద్దగా ఉబ్బేలా చేస్తారు. ఒకసారి బెలూన్ సహాయంతో, రక్తనాళాన్ని తగినంతగా వెడల్పు చేశాక... ఆ బెలూన్ని వెనక్కి తీసుకువచ్చి, దాని స్థానంలో ఒక స్టెంట్ని ప్రవేశపెడతారు. స్టెంట్ అనేది లోహంతో తయారైన స్థూపాకారపు వల (జాలీ) వంటి పరికరం. ఇలా ఈ స్టెంట్‌ను... వేరొక బెలూన్ సహాయంతో బ్లాక్ ఉన్నచోట అమరుస్తారు. అలా అమర్చిన స్టెంట్ ని వేరొక బెలూన్‌తో బాగా ఎక్కువ ఒత్తిడితో రక్తనాళం గోడకు పూర్తిగా అనుకునేలా చూస్తారు. దీంతో యాంజియోప్లాస్టీ పూర్తవుతుంది. యాంజియోప్లాస్టీలో వచ్చే ఇబ్బందులు కొన్నిసార్లు యాంజియోప్లాస్టీని నిర్వహించే సమయంలో గైడ్ వైర్ బ్లాక్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోవచ్చు. ఒక్కో సారి... దాటి వెళ్ళినప్పటికీ, దానిమీది నుంచి బెలూన్ వెళ్లలేకపోవచ్చు. కొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల... బెలూన్‌తో ఉబ్బించే ప్రక్రియ చేసినప్పటికీ... ఆ బ్లాక్ తొలగకపోవచ్చు. ఇంకొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో రక్తం గడ్డకట్టడం వల్ల బెలూనింగ్ చేసినప్పుడు... ఆ రక్తం గడ్డలు నాళంలోనే మరోచోటికి వెళ్లి, రక్త ప్రవాహానికి అవరోధంగా మారవచ్చు. ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికి ఇప్పుడు లేజర్ ప్రక్రియని వాడుతున్నారు. అసలు లేజర్ అంటే ఏమిటి? ‘లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్’ అన్న పదాల సంక్షిప్త రూపమే ‘లేజర్’. దీని సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అందరికీ తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఇలా చెప్పవచ్చు. మామూలుగా కాంతి కిరణాలు నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌తో ప్రసరిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఒక క్రమబద్ధమైన ఏకరీతితో మరింత శక్తిమంతంగా ప్రసరింపజేసినప్పుడు వెలువడే కిరణాన్ని ‘లేజర్’ అనవచ్చు. శక్తిమంతమైన ఈ కాంతికిరణాల్ని (లేజర్లను) అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వైద్య చికిత్సల్లోనూ అనేక రకాలైన లేజర్లు వినియోగిస్తుంటారు. ఇలాంటి అనేక లేజర్లలో గుండె కోసం వాడే వాటిని ‘ఎగ్జిమర్ లేజర్’ అంటారు. లేజర్‌తో అడ్డంకుల తొలగింపు ఎలాగంటే...? లేజర్ కిరణాలు మన కణజాలాలని తాకినప్పుడు మూడు రకాల ఫలితాలు కనిపిస్తుంటాయి. అవి... ఫొటో కెమికల్, ఫొటో థర్మల్, ఫొటో కైనెటిక్ ఎఫెక్ట్స్. ఈ ప్రభావాల సహాయంతో అక్కడ పేరుకున్న వ్యర్థ కణజాలాన్ని (దాదాపుగా) ఆవిరైపోయేలా చేయవచ్చు. రక్త నాళంలోని అడ్డంకులనూ అదేవిధంగా ఆవిరైపోయేలా చేయడానికి లేజర్ సహాయం తీసుకుం టారు. ఏయే దశల్లో లేజర్‌ను ఎలా ఉపయోగిస్తారంటే... గైడ్ వైర్ మీదనుంచి బెలూన్ వెళ్లలేకపోయిన సందర్భాల్లో లేదా బెలూన్ ద్వారా బ్లాక్‌ను మార్చలేకపోయినప్పుడు. ∙రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిన బ్లాక్స్ ఉన్నప్పుడు, అవి మరోచోటికి చేరి మళ్లీ రక్తప్రవాహానికి అవరోధంగా మారకుండా చూడటానికి. గుండె రక్తనాళాల్లో సంపూర్ణంగా, చాలాకాలం నుంచి ఉండిపోయిన మొండి బ్లాక్‌లను తొలగించడానికి. ∙కాల్షియం అధికంగా ఉన్న గుండె రక్తనాళాల్లో బ్లాక్‌ని తొలగించడానికి. ఒకసారి వేసిన స్టెంట్లో మరోసారి అడ్డంకి బ్లాక్ ఏర్పడినప్పుడు రక్తనాళం మొదట్లో ఉన్న అడ్డంకులు, లేదా మరీ పొడవుగా ఉన్న అడ్డంకుల్ని అధిగమించేందుకు. ఇది యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయమా? సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో లేజర్ యాంజియోప్లాస్టీ అన్నది... సంప్రదాయ యాంజియోప్లాస్టీ కన్నా తక్కువ ఖర్చుతో రక్తనాళంలోని అడ్డంకుల్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్న అర్థం స్ఫురిస్తోంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. లేజర్ని యాంజియోప్లాస్టిలో ఒక అనుబంధ విధానంగా వాడుకోవచ్చుగానీ లేజర్ అనేదే ఆంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయం కాదు. బాధితులందరికీ ఈ లేజర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. లేజర్‌కు అయ్యే ఖర్చు ఎక్కువే కాబట్టి... కేసు తీవ్రతను బట్టి ఎవరికి అవసరం అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ణయించే అంశమిది. కేవలం చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది అవసరం పడవచ్చు. --డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?) -
China: భవిష్యత్ యుద్ధాల్లో ఇక విధ్వంసమే..!
ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది. అత్యంత శక్తివంతమైన లేజర్లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు. హై గ్రేడ్ లేజర్ సిస్టమ్‌లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్ లేజర్లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్లు సూపర్ సోనిక్ మిసైల్లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు. లేజర్ అనేది కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది. ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్ -
ప్రింటేసి.. తుడిచేసి.. ఒకే పేపర్‌పై మళ్లీ మళ్లీ ప్రింటింగ్!
సాధారణంగా ప్రింటర్లో ఏమైనా ప్రింట్ చేశామంటే.. ఆ కాగితాలను అవసరం ఉన్నంతసే పు ఉంచేయడం.. ఆ తర్వాత పడేయడమే.. కానీ కా గితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగితే!? ఈ ఐడియా చాలా బాగుంది కదా.. అటు పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ ఉంటుంది, ఇటు ఖర్చూ తగ్గుతుంది. పైగా తరచూ కాగితాలు తెచ్చుకోవడం దగ్గరి నుంచి వాటిని పడేయడం దా కా ఎంతో శ్రమ కూడా తప్పుతుంది. ఈ క్రమంలోనే రీప్ సంస్థ.. కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్’ను రూపొందించింది. అంటే ప్రింటర్ ఇంకును ముద్రిస్తే.. ఈ డీ ప్రింటర్ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలను ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్ సర్క్యులర్ ప్రింట్ (ఆర్సీపీ)’ అని పేరు పెట్టారు. ప్రత్యేకమైన పేపర్.. లేజర్ క్లీనర్‌తో.. డీప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే.. అందుకోసం కాస్త మార్పులు చేసిన ప్రత్యేకమైన పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ పేపర్‌ను ప్రింటర్లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ముద్రితం అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్ ఇంకును ఆవిరి చేసేస్తుంది. దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. అంటే కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది. -
చంద్రయాన్ 2 ద్వారా లేజర్ పరికరాలు
వాషింగ్టన్: భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్ 2’మిషన్ ద్వారా లేజర్ పరికరాలు పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ మిషన్‌ను లాంచ్ చేయనున్నారు. చంద్రయాన్2 ద్వారా భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితత్వంతో కొలిచే లేజర్ పరికరాలను పంపనున్నట్లు నాసా తెలిపింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల జరిగిన లూనార్ అండ్ ప్లానిటరీ సైన్స్ కాన్ఫెరెన్స్‌లో ఈ మేరకు వెల్లడించారు. ఏప్రిల్ 11న నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్లను చంద్రయాన్ 2 ద్వారా పంపనున్నట్లు తెలిపింది. ఇలాంటి ఐదు పరికరాలు ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉన్నా.. వాటిలో కొన్ని లోపాలు తలెత్తాయని ఇటలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ లేబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సైమన్ డెల్ యాగ్నెల్లో వెల్లడించారు. చంద్రుడిపై మెరుగైన పరిశోధనలకు ఈ రిఫ్లెక్టర్లు తోడ్పడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
లేజర్ వెలుగులతో పైలట్ షాక్!
శంషాబాద్: మరికొద్ది క్షణాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ చేయాల్సి ఉండగా.. రన్‌వే సమీపంలో ప్రసరిస్తున్న లేజర్ లైట్ల కారణంగా పైలట్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. దీంతో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అతడు అష్టకష్టాలు పడ్డాడు. సౌదీ నుంచి వచ్చిన ఆ విమానం రన్‌వేపై దిగబోతుండగా లేజర్ కిరణాలు అడ్డు తగిలాయి. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శంషాబాద్ మండల పరిధిలోని ఎయిర్‌పోర్టుకు ఆనుకుని ఉన్న రషీద్‌గూడ గ్రామ పరిధిలోని చెరువుకట్ట సమీపంలో ఓ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు స్నేహితులతో కలసి డీజేతో పాటు లేజర్ షాట్స్, లేజర్ లైట్ల వెలుగుల మధ్య పార్టీ చేసుకున్నారు. ఇదే సమయంలో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయబోతుండగా లేజర్ కిరణాల కారణంగా పైలట్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయమై ఆయన ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. 15 కి.మీ. పరిధిలో ఆంక్షలు.. ఎయిర్‌పోర్టు అధికారుల ఆదేశాలతో హెచ్ఎండీఏ, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. రషీద్‌గూడ సమీపంలోని చెరువుకట్ట వద్ద యువకులు పార్టీ చేసుకున్న విషయం తెలుసుకుని సోమవారం శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు చుట్టూ 15 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా లేజర్ షాట్స్, లేజర్ లైట్లను ఉపయోగించకూడదని, అలాగే బాణసంచా కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ పరిధిలోని అన్ని ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశారు. -
అతివేగానికి చెక్ పెట్టేలా లేజర్ గన్స్
కొరుక్కుపేట: వాహనాల అతివేగానికి చెక్ పెట్టేందుకు లేజర్‌గన్స్ అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు నిబం ధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే జరిమానాలు భరించక తప్పదు. వాహనాల అతివేగాన్ని పసిగట్టేలా చెన్నై –బెంగళూరు జాతీయ రహదారిలో వినూత్న లేజర్ గన్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.12కోట్ల నిధులు మంజూరు చేసిం ది. అధికారులు మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా లేజర్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసిన లేజర్‌గన్స్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానాను తరువాత వచ్చే టోల్ ప్లాజాలోనే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాహనం ఫొటో, నంబర్ చిత్రాలను ఎవిడెన్స్‌గా చూపనున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చెన్నై –వేలూరు మధ్య జాతీయ రహదారిలో ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
సౌరశక్తితో స్పీడ్ లేజర్ గన్స్
సాక్షి, హైదరాబాద్: సౌర శక్తితో వాహనాల వేగాన్ని కనిపెట్టే లేజర్ గన్స్‌ను ప్రయోగాత్మకంగా గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్పై రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గురువారం పరిశీలించారు. వాహనాలు ఎంత వేగంతో వెళ్లాలన్న నిర్దిష్టతను ఎల్ఈడీ స్క్రీన్‌లో ట్రాకింగ్ సిస్టమ్ చూపిస్తుందని, వాహనాలు వెళ్తున్న వేగాన్ని కచ్చితత్వంతో ఈ సోలార్ లేజర్ గన్స్ చూపించగలుగుతాయని కృష్ణప్రసాద్ తెలిపారు. తెలంగాణలో దాదాపు 500 లేజర్ గన్స్ అవస రం ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్ ఖర్చు రూ.10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. -
కిరణాభిషేకం
శ్రీశైలమహాక్షేత్రంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులు, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటిరోజు ట్రయల్ రన్‌గా వేసిన ఈ లేజర్‌షోలో డీఐజీ రమణకుమార్,హోంగార్డు కమాండెంటెంట్ చంద్రమౌళి, ఓఎస్డి సత్య ఏసుబాబు, సీసీఎస్ డీఎస్పీలు హుసేన్‌పీరా, హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ లేజర్‌షోలో భాగంగా ఓం నమః శివాయ పంచాక్షరి నామంతో పాటు వివిధ రకాలైన మృదంగ వాయిద్యాలతో శివునికి ఉన్న వివిధ రూపాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి సమాచారాన్ని వివరించారు. – శ్రీశైలం -
లేజర్ హెయిర్ రిమూవల్ తో సమస్యే..
చర్మ సౌందర్యం కోసం... ఫ్యాషన్ గా అందంగా కనిపించడం కోసం ఇటీవల అమ్మాయిలు లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేసుకోవడం మామూలైపోయింది. అయితే దాంతో ప్రమాదాలే ఎక్కువ అంటున్నారు ప్రముఖ నవలా రచయిత్రి మరియన్ కెఎస్. తాను అనుభవ పూర్వకంగా చెప్తున్నానని, లేజర్ హెయిర్ రిమూవల్ తో వచ్చే నొప్పి చావుకు అంచులుదాకా తీసుకెడుతుందని, ఒక్కోసారి ఆ నొప్పికి ఉపశమనంకోసం వాడే క్రీములవల్ల కూడ చనిపోయే ప్రమాదం ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నవలా రచయిత్రి అయిన మరియన్ కెఎస్... ఆక్స్ ఫర్డ్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా మాట్లాడుతూ... లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు గుడ్లు బయట పడేలా ఏడ్వాల్సి వస్తుందని, నొప్పితో చచ్చిపోవాల్సి వస్తుందని... ఇది నా కథ అని, దయచేసి మీరు దీని జోలికి వెళ్ళకండి అంటూ హెచ్చరించారు. అయితే తాను ఫెమినిస్టునే అయినా కాళ్ళపై తీవ్రంగా ఉండే జుట్టును తీయకుండా ఉండలేకపోయేదాన్నని, అందుకే నెలకోసారి వాక్సింగ్ తో కాళ్ళమీద జుట్టును తొలగించుకునే ప్రయత్నం చేసేదాన్నని చెప్పారు. ఆ నొప్పి తగ్గించుకునేందుకు ఎనస్థెటిక్ క్రీములు వాడానని, ఆ క్రీములవల్ల కూడ క్రమంగా ప్రాణ భయం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారని , అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుమతితో తప్పించి వాడకూడదని సౌందర్య ప్రేమికులకు ఆమె సలహా ఇస్తున్నారు. తాను చేసుకున్న మొదటి లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్ మెంట్ తర్వాత... 51 ఏళ్ళ ఐరిష్ నవలా రచయిత్రి తన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. తన అనుభవం సౌందర్య ప్రేమికులకు హెచ్చరికేనంటున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల వచ్చే నొప్పి అంతా ఇంతా కాదని, మొదటి ట్రీట్ మెంట్ తోనే తనకు జీవితానికి సరిపడే అనుభవం వచ్చిందన్నారు. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని, అయతే అటువంటి క్రీమ్ లు కూడ ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయని వైద్యులు చెప్తున్నారని అన్నారు. అయితే క్రీమ్ రాసిన తర్వాత గాని తనకు ఉపశమనం లభించడం లేదని, లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ లు కూడ అధికంగా వాడటం వల్ల 'ఎనస్థెటిక్ టాక్సిసిటీ' సంభవిస్తుందని, అది ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారన్నారు. -
‘లేజర్’ పద్ధతితో హరికేన్ల తీవ్రత అంచనా
వాషింగ్టన్: సముద్ర ఉపరితలంపై పరిస్థితులను లేజర్ కాంతిపుంజాలను పంపి పరిశీలించడం ద్వారా పెనుతుపాన్ల తీవ్రతను బాగా అంచనా వేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మియామీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా సముద్రం, వాతావరణం మధ్య సాంద్రతల తేడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తుపాన్ల తీవ్రత స్థిరంగా ఉంటుంది. అయితే తుపాన్ల సమయంలో సముద్ర ఉపరితలంపై నీరు, గాలులపై తాము గెడైడ్ లేజర్‌ను పంపే షాడో ఇమేజింగ్ పద్ధతిలో అధ్యయనం చేయగా.. ఉష్ణ మండలప్రాంత తుపానుల తీవ్రత వేగంగా మారిపోతుండటాన్ని అంచనా వేసినట్లు పరిశోధకులు తెలిపారు. సముద్ర ఉపరితలంపై ఒత్తిడి, హరికేన్ గాలుల వేగం వంటి వాటిని బట్టి హరికేన్ తీవ్రతను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
అన్ వాంటెడ్ చూపుల్ని దులిపేయండి
బిడ్డను చంకలో వేసుకుని నిలబడమనండి మగాళ్లను! బాబోయ్ చూడలేం. బైక్‌ని కిక్ కొట్టి రయ్యిన పోనివ్వమనండి ఆడవాళ్లను. అస్సలు చూడకుండా ఉండలేం! ఎందుకని? ఏంటో మరి! గాళ్స్... ప్యాంటు షర్టు వేసుకున్నా... లుంగీ ఎగ్గట్టి ‘బస్తీ మే సవాల్’ అన్నా... పాన్ నములుతూ ‘డాన్’ పాట ఎత్తుకున్నా... ఆఖరికి ఎన్ని మగవేషాలు వేసినా... అందంగానే ఉంటుంది. అపురూపంగానూ అనిపిస్తుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం... అమ్మాయిలు మగరాయుళ్లలా కాకుండా, మహరాణుల్లా ఉండాలనుకుంటారు! ఏమిటా ఒక్క విషయం. స్కిన్! మృదువైన, కోమలమైన తమ చర్మంపై వారు ఈగను కూడా వాలనివ్వరు. అలాంటిది... పదేపదే ‘అన్వాంటెడ్’ చూపులు వాలుతుంటే? నో ప్రాబ్లమ్. ఆ చూపుల్ని వెంట్రుకల్లా దులిపేసే మెథడ్స్ ఈవారం ‘ముస్తాబు’లో... తల మీద వెంట్రుకలు పెంచుకోవడానికన్నా, ఒంటిపై వెంట్రుకలను తొలగించుకోవడానికి చాలా మంది సౌందర్యశాలలకు వెళుతుంటారు. రోమాలను తొలగించుకోవడానికి ఎంతటి నొప్పి, మంటనైనా భరిస్తుం టారు. ఇప్పుడే కాదు అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రాచీనకాలం నుంచి మనవాళ్లు ఎన్నో పద్ధతులను అనుసరించేవారు. నలుగుపిండి నుంచి లేజర్ వరకు పురోగమించిన ఆ పరిణామక్రమం తీరుతెన్నులివి... నలుగు: స్నానం చేయడానికి ముందు శనగపిండి లేదా బియ్యప్పిండిని తడి చేసి ఒంటికి రాసుకొని, మర్దనా చేసేవారు. దీనివల్ల మురికితో పాటు కొంతవరకు రోమాలు ఊడి వచ్చేవి. ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ రోమాలను నలుగుపిండి పూర్తిగా తొలగించదు. అందుకే తాత్కాలికంగా రోమాలను తొలిగించేం దుకు ప్లక్కింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్.. వంటి ప్రక్రియలను వచ్చాయి. వ్యాక్సింగ్: సాధారణ వేడితో ఉన్న మైనాన్ని రోమాలు ఉన్న శరీర భాగంపై పూసి, మందపు వస్త్రాన్ని లేదా వ్యాక్స్ షీట్‌ను ఆ మైనంపై వేసి, అదిమి లాగడంతో వెంట్రుకలు ఊడి వచ్చేస్తా యి. వెంట్రుక పెరుగుదలను బట్టి ప్రతి 20, 30 రోజులకోసారి వ్యాక్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వెంట్రుక పెరుగుదల తగ్గినప్పటికీ నొప్పి, మంట, చర్మంపై చిన్న చిన్న కురుపులు, ర్యాష్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చూస్తుంటాం. పార్లర్స లో సరైన శుభ్రత పాటించకపోతే ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు. మార్కెట్లోని హెయిర్ రిమూవల్ క్రీమ్స్, లోషన్‌స వాడినా మళ్లీ మళ్లీ వచ్చే రోమాలు చికాకు పుట్టిస్తూనే ఉంటాయి. కొన్నాళ్లకు చర్మం గరుకుగానూ మారుతుంది. థ్రెడ్డింగ్: రెండు దారాల సాయంతో వెంట్రుకలను తొలగించే ప్రక్రియల థ్రెడ్డింగ్. దీని వల్ల చర్మంపై ర్యాష్, నొప్పి, మంట వస్తుంటుంది. థ్రెడ్‌తో లాగడం వల్ల సాగి, చర్మం వదులు అయ్యే అవకాశాలు అధికం. ఈ పద్ధతిని కనుబొమలు, గడ్డం, నుదురు, పెదవుల చుట్టూత అనుసరిస్తుంటారు. ఎలక్ట్రోలసిస్: ఈ పద్ధతిలో 30 నుంచి 40 సెషన్స్ పడతాయి. సన్నని నీడిల్ తో చేసే ఈ చికిత్సలో నొప్పి విపరీ తంగా ఉంటుంది. చర్మంపై మచ్చలు కూడా పడేవి. అందుకే ఈ పద్ధతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్: కాంతి కిరణాలతో ఫాలికల్ లోని వెంట్రుకను రిమూవ్ చేస్తారు. ఈ పద్ధతిని సరిగ్గా అనుసరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది మహిళల్లో పీసీఓడీ ఇతర గైనిక్ సమస్యలు ఎక్కువై హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వెంట్రుకల పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. వీరు ముందుగా డాక్టర్ సలహా తీసుకొని, చికిత్సలో తీసుకోవాలి. అంతర్గతంగా లేజర్ చికిత్స సాధ్యపడదు కాబట్టి ఈ చికిత్స పట్ల ఓపిక, జాగ్రత్తలు పాటించడం అవసరం. లేజర్‌కి ముందు... లేజర్ కన్సల్టెంట్‌ని సంప్రదించి, సలహా తీసుకోవాలి. బ్లీచింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్ పద్ధతులేవీ అనుసరించకూడదు. ఎండలో తిరగకపోవడం, వేడినీటితో స్నానం చేయకపోవడం, కెమికల్ క్రీములు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేజర్‌కి తర్వాత.. క్లినిక్‌లోనే ఐస్ కూలింగ్ ఇస్తారు. మెడికేటెడ్ క్రీమ్స్ వాడతారు. బయటకు వచ్చాక ఎండకు తిరగకూడదు. బ్లీచ్, ఇతర సౌందర్య లేపనాలను వాడకూడదు. ఎండకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ను వాడాలి. ఏడు రోజుల తర్వాత తమకు నప్పే బ్యూటీ క్రీములు వాడుకోవచ్చు. సాధారణ బ్యూటీ సెలూన్స్‌లో కన్నా సర్టిఫైడ్ కంపెనీస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి పరిష్కారం లభిస్తుంది. మగవారికైతే... ఎక్కువ సెషన్స్ అవ సరం పడతాయి. మగవారు ఎక్కు వగా బియార్డ్ షేప్, మోడల్స్ ఫుల్ బాడీ లేజర్ చికిత్స చేయించుకుంటారు. అప్పర్‌లిప్, చిన్ అంటూ విడి విడిగానూ, ఫుల్ బాడీ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. చికిత్స చేసే విధానం బట్టి ఖరీదు ఉంటుంది. శాశ్వత పరిష్కారం! అడ్వాన్స్డ్ లేజర్: లేజర్ వల్ల కెరటోసిస్ పైలారిస్ అని భుజాల మీద, తొడల మీద సన్నని కురుపుల్లాంటివి వస్తాయి. లేజర్ హై రిడక్షన్‌తో వీటినీ తగ్గించవచ్చు. రోమాల నివార ణకు శాశ్వత పరిష్కారం అడ్వాన్సడ్ లేజర్ చికిత్స. ‘డియోడ్ లేజర్’ అనే అడ్వాన్సడ్ ప్రక్రియలో నొప్పి, మంట ఉండదు. చర్మం గరుకుగా మారదు. నల్లబడదు. ఈ పద్ధతిలో కొందరికి రోమాల సంఖ్యను బట్టి 10 నుంచి 12 సెషన్స్ అవసరం పడతాయి. నిర్దేశిత సమయం ప్రకారం సెషన్స తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 16 ఏళ్ల వయసు నుంచీ ఈ చికిత్స చేయించు కోవచ్చు. ఏ ప్రక్రియలో అయినా వెంట్రుకను ఫాలికల్ నుంచి పూర్తిగా తొలగించడానికి ఒక్క సెషన్ సరిపోదు. మొదట నెలకు రెండు, తర్వాత వెంట్రుక పెరుగు దలను బట్టి ఆరు వారాలకు ఒక సెషన్ ఉంటుంది. సెషన్స పూర్తయిన తర్వాత మరో ఆరునెలలు మెయింటెనెన్స్ సెషన్ ఉంటుంది. లేజర్ సెషన్స్ పూర్తయ్యేసరికి 2-3 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్లీ లేజర్ అవసరం రాదు. వెంట్రుక వృద్ధి అయ్యే సమయం లో లేజర్‌ను ఉపయోగిస్తే హెయిర్ ఫాలికల్ లేజర్ లైట్‌ను అబ్జార్బ చేసుకుని, మంచి ఫలితాన్ని ఇస్తుంది. కంటికి లేజర్ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తపడతారు. అందు కని లేజర్ చికిత్సలో కనుబొమలను షేప్ చేయరు. వీటికి థ్రెడ్డింగ్ మాత్రమే పరిష్కారం. గతంలో ఛామనచాయగా ఉన్నవారికి కూడా లేజర్ చికిత్స చేసేవారు కాదు. ఇప్పుడు ఈ అడ్వాన్సడ్ పద్ధతి ద్వారా డార్క స్కిన్, పిగ్మెంటేషన్ ఉన్నవారికి కూడా చికిత్స చేయవచ్చు. అయితే శరీరం మీద వెంట్రుకలు తెల్లబడితే లేజర్ పనిచేయదు. అందుకే 40-45 ఏళ్లలోపు వయసున్న వారు ఈ చికిత్స చేయించుకోవడం మంచిది. - డా. షాను, డెర్మటాలజిస్ట్, కాయా స్కిన్ క్లినిక్ నలుగుపిండి మేలు... స్నానం చేసేముందు పసుపు, ఆవపిండి, ఉలవపిండి, కరక్కాయ పొడి, మంచి గంధం, మారేడు పత్రాల పొడి కలిపి ఉపయోగించాలి. ఈ పొడి కాస్త గరుకుగా ఉండాలి. లేదంటే దీంట్లో బియ్యప్పిండి, శనగపిండి కలుపుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా నువ్వులనూనె కలిపి రోమాలు ఉన్న చోట రాసి, రివర్స్ డెరైక్షలో మర్దనా చేయాలి. దీనివల్ల వెంట్రుక సులువుగా వచ్చేస్తుంది. నువ్వులనూనెకు బదులు ఆవుపాల మీగడ కూడా కలుపుకోవచ్చు. అయితే పిండి మరీ తడిగా కాకుండా పొడిగా, గరుకుగా ఉండాలి. పీసీఓడీ వంటి సమస్యల వల్ల స్త్రీలలో ఆండ్రోస్ హార్మోన్లు రిలీజ్ అయ్యి గడ్డాలు, మీసాలు వస్తుంటాయి. ఏ కారణం వల్ల అవాంఛిత రోమాలు వస్తున్నాయో తెలుసుకొని మందులు వాడాలి. కడుపులోకి అయితే... స్పూనుడు శతావరి చూర్ణాన్ని పావుకప్పు పాలలో కలిపి (చక్కెర కూడా కలుపుకోవచ్చు) ఉదయం సాయంత్రం తాగాలి. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వచ్చే అనర్థాలను ఈ చూర్ణం నివారిస్తుంది. - డా.వి.ఎల్.ఎన్.శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు