ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది.
అత్యంత శక్తివంతమైన లేజర్‌లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్‌ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు.
హై గ్రేడ్ లేజర్ సిస్టమ్‌లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్ లేజర్‌లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్‌లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్‌లు సూపర్ సోనిక్ మిసైల్‌లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్‌లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు.
లేజర్ అనేది కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది.
ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
Comments
Please login to add a commentAdd a comment