creates
-
రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు!
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు తరచుగా డ్యాన్స్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను పబ్లిక్‌గా రికార్డ్ చేస్తూ, హాట్ టాపిక్‌గా మారారు. ఇటువంటి వీడియోలకు లెక్కలేనన్ని వీక్షణలు, లైక్‌లు దక్కినప్పటికీ, అవి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదేకోవలో మతపరమైన ప్రదేశాలలో డ్యాన్స్ రీల్స్ చేయడం ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుంది. అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద ఒక మహిళ రీల్స్ కోసం నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. పింక్ సల్వార్ సూట్ ధరించిన ఈ మహిళ ‘జీవన్ మే జానే జానా’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సరయూలో పవిత్ర స్నానం చేసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో ఘాట్‌కి వస్తుంటారు. ఈ వీడియోను చూసిన చాలామంది పవిత్ర స్థలాన్ని అగౌరవపరిచిన మహిళపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అయోధ్య పోలీసులు ఆమెపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. #अयोध्या :राम की पैड़ी में रील बनाते एक महिला का वीडियो हुआ वायरल पानी के अंदर फिल्मी गाने पर ठुमका लगाते ... हमारे धार्मिक स्थलों के लिए क्या समझ के रखा है नाचने वाले लोगों ने pic.twitter.com/6q4zYANM3f — Vikram Singh Parmar (@vikram_rajaB) October 10, 2023 కొన్ని నెలల క్రితం సరయూ నది ఘాట్‌పై ఒక యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆమె నదిలో ‘పానీమే ఆగ్ లగానీ హై’పాటకు ఆ డ్యాన్స్ చేస్తుండగా ఇతరులు ఆమెను అలా చూస్తూనే ఉండిపోయారు. ఈ వీడియో తమ మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉందని, ప్రార్థనా స్థలాల్లో ఇలాంటి నృత్యాలు చేయకూడదని పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా కొంత కాలంగా మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేసే ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి చేష్టలు ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదకరంగానూ మారుతున్నాయి. ఇది కూడా చదవండి: శాంతియుత దేశం ఏది? అశాంతికి నిలయమెక్కడ? భారత్ పరిస్థితేంటి? प्रभारी निरीक्षक को0 अयोध्या को आवश्यक जांच एंव कार्यवाही हेतु निर्देशित किया गया। — AYODHYA POLICE (@ayodhya_police) October 10, 2023 -
China: భవిష్యత్ యుద్ధాల్లో ఇక విధ్వంసమే..!
ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది. అత్యంత శక్తివంతమైన లేజర్లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు. హై గ్రేడ్ లేజర్ సిస్టమ్‌లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్ లేజర్లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్లు సూపర్ సోనిక్ మిసైల్లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు. లేజర్ అనేది కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది. ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్ -
కాంగ్రెస్ లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం
-
అల్లూరి జిల్లా: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్
అక్క కోసం ఓ తమ్ముడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఏకంగా బండిని బ్యాటరీతో నడిచేలా తయారు చేశాడు. ఇంకేంముంది.! అక్క తక్కువ ఖర్చుతో బ్యాటరీ స్కూటర్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతోంది. తమ్ముడు కృషిని అక్కతో పాటు ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నారు. సాక్షి, అల్లూరి జిల్లా: జిల్లాలోని రాజవొమ్మంగికి చెందిన సామన సురేష్ స్థానికంగా ఎలక్ట్రీషియన్. ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మోటారు ఏ విధంగా పని పని చేస్తుంది? బ్యాటరీ పనితనం తదితర అంశాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. కాగా.. రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సురేష్ అక్క వెంకటలక్ష్మి బ్రాంచ్ పోస్ట్ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఆమె రోజూ స్కూటర్‌పై విధులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో.. పెట్రోల్ ధరలు పెరగడం, ఒకటి రెండు సార్లు ఆమె తన భర్తను పెట్రోల్ కోసం డబ్బులు అడగటం సురేష్ చెవిన పడింది. పెట్రోల్‌తో నడిచే ఆ స్కూటర్ మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్లే వస్తోంది. కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చవుతోంది. రోజూ 12 కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేందుకు సుమారు రూ.96 అవసరం. ఇలా నెలకు రూ.2,880 ఖర్చవుతోంది. ఆమె చేసేది చిన్న ఉద్యోగం. అందులో సగం జీతం పెట్రోలు ఖర్చులకే పోతుండటంతో సురేష్ ఆలోచనలో పడ్డాడు. అప్పటికే.. సురేష్ బ్యాటరీతో నడిచే ఓ సైకిల్ తయారు చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అక్కను సైకిల్‌పై పోస్టాఫీసుకు వెళ్లమనడం ఇష్టం లేక.. ఆమె ఉపయోగించే స్కూటర్‌కే బ్యాటరీలు అమర్చే పనిలో పడ్డాడు. మెదడుకు పదును పెట్టి దాదాపు రెండు వారాలు కష్టపడ్డాడు. అతని కృషి ఫలించింది. స్కూటర్‌ను ఇటు పెట్రోల్‌తో.. అలాగే బ్యాటరీతోనూ నడిచేలా తయారు చేశాడు. సురేష్ తెలివితేటలకు ఆమె మురిసిపోయారు. రయ్ రయ్‌మంటూ రోడ్లపై పరుగులు తీస్తున్న స్కూటర్‌తో మరింత అనుబంధం పెంచుకున్నారు. సెల్‌ఫోన్‌కు మాదిరిగానే బ్యాటరీ చార్జ్ చేస్తే సరిపోతుండటంతో వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడిక బండిలో పెట్రోలు ఉందా లేదా చూడనవసరం లేకుండా ఝామ్మని ఆఫీసుకు దూసుకెళ్లిపోతున్నారు. 3 గంటలు చార్జ్ చేస్తే 60 కి.మీ. వెళ్లొచ్చు పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌ను బ్యాటరీతో కూడా నడిచేదిగా తయారు చేసేందుకు తనకు రూ. 28,000 ఖర్చయిందని సురేష్ తెలిపారు. మూడు 12 ఓల్ట్స్ బ్యాటరీలతో తయారు చేసిన ఈ స్కూటర్‌కు మూడు గంటల పాటు చార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పైకి పెట్రోల్ స్కూటర్ మాదిరిగా ఉన్న బ్యాటరీ స్కూటర్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదీ చదవండి: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి.. -
టీనేజర్లకోసం ఫేస్బుక్ కొత్త యాప్ ‘టాక్’
న్యూయార్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టీనేజర్లను దృష్టిలో పెట్టుకుని ‘టాక్’ అనే కొత్త యాప్‌ను పరిచయం చేయనుంది. లైంగిక వేధింపులకు, దోపిడీకి గురయ్యే యువకులను రక్షించే ఉద్దేశంతో ఫేస్బుక్ ఈ కొత్త మెసేజింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించనుందని తాజాగా నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని పర్యవేక్షించటానికి అనుమతినిస్తుందని ఒక రిపోర్టు నివేదించింది. ఈ టాక్ ఖాతాల సెర్చింగ్‌కు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. కేవలం టాక్ యూజర్లకు మాత్రమే. తద్వారా టీనేజర్లనే టార్గెట్‌గా ఎంచుకునే అపరచిత ఇంటర్నెట్ యూజర్లను ఇది నిరోధిస్తుందని కంపెనీ భావిస్తోందట. అంతేకాదు రక్షణాత్మకంగా ఉండటంతో ఎక్కువమంది తల్లిదండ్రులు దీనివైపు మొగ్గచూపుతారనేది సంస్థ ప్లాన్. వెబ్సైట్ సమాచారం ప్రకారం ఫేస్బుక్ మెయిన్ మెసెంజర్ యాప్ లో ఒక సాఫ్ట్వేర్ కోడ్‌ను జత చేసింది. దీని ప్రకారం తల్లిదండ్రులు తమపిల్లల కాంటాక్ట్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని చెప్పింది. ఈ టాక్ యాప్‌ద్వారా పిల్లల సంభాషణలను మీరు పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపింది. అయితే ఇది కూడా 13సం.రాల అంతకుపైబడిన వయసున్న టీనేజర్లకు మాత్రమే పరమితం కానున్నట్టు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీనేజర్ల తల్లిదండ్రులకు ఊరటనివ్వనుంది. తమ పిల్లల ఆన్లైన్ స్వేచ్ఛను పర్యవేక్షించడానికి ఉపయోగ పడనుంది. అలాగే ఎవరితో మాట్లాడుతున్నారో.. అనే ఆందోళన, భయాలనుంచి దూరం చేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఫేస్బుక్ అధికారింగా స్పందించాల్సి ఉంది. -
హోండా ఇండియా వరల్డ్ రికార్డ్ అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ) అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఒక్క 2017-17 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పోటీలో ధీటుగా నిలబడింది. ఒక్క ఈ సంవత్సరంలో హోండా 50 లక్షల టు వీలర్స్ అమ్మకాలతో భారీ గ్రోత్ సాధించి ఆల్ టైం రికార్డ్‌ను తాకింది. మొత్తం అమ్మకాలు 12శాతం ఎగిసి 5,008,103 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. గత ఏడాది 4,483,462 వాహనాల అమ్మకాలతో పోలిస్తే డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసినట్టు సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ వెల్లడించారు. ఇదే కాలానికి మొత్తం పరిశ్రమం 5 శాతం వృద్ధిని సాధిస్తే హోండా ఇండియా మాత్రం రెట్టింపు సాధించింది. మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చారిత్రాత్మక అమ్మకాలగో కొత్త రికార్డులు సృష్టించినట్టు సింగ తెలిపారు. ముఖ్యంగా 7వ వేతన సంఘం సిఫారసులు, మంచి వాతావరణ సంకేతాలు తమకు బూస్ట్ ఇచ్చినట్టు చెప్పారు. 2017-18 మరో ముఖ్యమైన సంవత్సరంగా నిలవునుందన్నారు. 5 మిలియన్ అమ్మకాలతో మైలురాయిని అధిగమించినందుకు తమ వినియోగదారులు ధన్యవాదాలు తెలిపారు. అయితే ద్విచక్ర వాహనాల పరిశ్రమ కేవలం 5 శాతం పురోగమించిందన్నారు. ఈ నేపథ్యంలో తమబ్రాండ్ను వినియోగదారులు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆటోమేటిక్ స్కూటర్ అమ్మకాలు తొలిసారి 30 లక్షల మార్క్ ను దాటాయి. 16 శాతం వృద్ధితో 3,351,604 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది వీటి సంఖ్య 2,892,480 మాత్రమే. -
పాకిస్థాన్ జెండా కలకలం!
నలందః బీహార్ లో పాకిస్థాన్ జెండాను ఎగురవేయడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గం నలంద జిల్లాలోని ఓ ఇంటిపై రెపరెపలాడుతున్న పాక్ జెండా స్థానికంగా ఆందోళనను కలిగించింది. ఓ వ్యక్తి ఇంటిపై ఎగురుతున్న జెండాను చూసిన స్థానికులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులనుంచీ జెండాను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్ నలంద జిల్లా ఖరాదీ కాలనీలోని ఓ ఇంటిపై పాక్ జెండా ఎగరడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తన ఇంటిపై ఎగురవేసిన పాకిస్థాన్ ఫ్లాగ్ చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చేలోపే సమాచారం అందుకున్నస్థానిక ప్రైవేట్ ఛానల్స్ అన్వరుల్ ఇంటిపై నెలవంక ఉన్న ఆకుపచ్చ జెండా ఎగరడాన్ని ప్రసారం చేశాయి. ఛానల్స్ లో సైతం ఆకుపచ్చ జెండా ప్రసారం కావడంతో విషయాన్ని తెలుసుకున్న ఎస్డీఓ సుధీర్ కుమార్, డిఎస్పీ మొహ్మద్ సైఫుర్ రెహ్మాన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే కుటుంబ సభ్యులు జెండాను తొలగిచడంతో వారి ఇంట్లో సోదాలు జరిపి కుటుంబ సభ్యులనుంచీ జెండాను స్వాధీనం చేసుకున్నారు.అయితే తన ఇంటిపై జెండాను ఎగురవేసిన నిందితుడు అన్వరుల్ హక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపి, నిజంగా ఆ జెండా పాకిప్థాన్ జాతీయ పతాకమా కాదా అన్నవివరాలను సేకరిస్తామని ఎస్డీవో సుధీర్ కుమార్ తెలిపారు. అయితే మొహర్రం సందర్భంలో తమ ఇంటిపై ఈ జెండాను ఐదేళ్ళుగా ఎగురవేస్తున్నట్లు అన్వరుల్ హక్ కుమార్తె షబానా తెలిపింది. అన్వరుల్ హక్ ప్రత్యేక వేడుకలకు, వివాహాల సందర్భాల్లోనూ టెంట్లు, ఫర్నిచర్ సప్లై చేసే వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితుడు.. ప్రస్తుతం పరారీలో ఉన్న హక్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం గాని, ఇతరులెవర్నీ అరెస్టు చేయడం గానీ జరగలేదని ఎస్డీవో వెల్లడించారు. ఇదిలా ఉంటే... ఛానల్స్ లో వార్త ప్రసారం అవ్వడమే తడవుగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే ఈ సంఘటనపై ఆరా తీసి, దోషులను శిక్షించాలని సీనియర్ బీజేపీ నాయకుడు సీపీ ఠాకూర్ డిమాండ్ చేశారు. బీహార్ ను మరో జమ్మూ కాశ్మీర్ లా మార్చే ప్రయత్నం చేయొద్దని, బీహార్ లో ఇటువంటి జాతి వ్యతిరేక చర్యలకు కేంద్రం వెంటనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. -
360 డిగ్రీల్లో తిరిగే కొత్త కారు
కారు కొనాలనుకున్నవారు... ముందుగా దానికున్న విశిష్ట లక్షణాలను గమనిస్తారు. ముఖ్యంగా అందులోని ఆధునిక పరిజ్ఞానానికీ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వాహన ప్రేమికులంతా ఇష్టపడే విధంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తరకం కారును సృష్టించాడు. ప్రధానంగా 360 డిగ్రీల్లో చక్రాలు ఏ దిశకైనా తిరిగేలా ఏర్పాటు చేసి, తక్కువ స్థలంలో కూడా కారు అన్నివైపులకూ తిరిగేలా రూపొందించాడు. లండన్ కు చెందిన విలియం లిడ్డియార్డ్.. నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనాల్లో వినియోగించే వోమిని డైరెక్షనల్ చక్రాలను పెట్టి, తయారు చేసిన ఆ కారు.. 360 డిగ్రీల్లో ఎటుపక్కకైనా సులభంగా తిరిగేట్టు ఏర్పాటు చేశాడు. అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినపుడు సైతం ఇబ్బంది పడకుండా పక్కకు జరిపేందుకు వీలుగా కారు వీల్స్ ను రూపొందించాడు. సాధారణ కార్లకు వినియోగించే చక్రాల్లా కాకుండా... తాను వినియోగించిన చక్రాలు ఏ దిశకైనా తిరుగుతాయని, బోల్ట్ ఆన్ ఆప్లికేషన్ ను వినియోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు లిడ్డియార్డ్ చెప్తున్నాడు. పాత టయోటా కారుకు తాను రూపొందించి కొత్తరకం వీల్స్ ను పెట్టి, ట్రయల్ రన్ వేసిన అతడు.. ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి, అందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు. సాధారణ కారుకు వేగంలోనూ, పనిచేసే తీరులోనూ ఏమాత్రం తీసిపోదని, అంతకంటే ఎక్కువ నియంత్రణా సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని చెప్తున్నాడు. విలియమ్స్ కొత్త ప్రయోగం.. ఇప్పుడు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. అతడు పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షలమంది వరకూ తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని, తన నూతన ఆవిష్కరణ 'లిడ్డర్డ్ వీల్స్' కు సోషల్ మీడియా సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. తన కొత్త సృష్టిని ఏదైనా కంపెనీ ప్రోత్సహిస్గే వారితో కలసి అభివృద్ధి పరిచి, కొత్తరకం కారును మార్కెట్లోకి తేవాలని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లో ప్రవేశ పెడితే తన వీల్స్ కు ఎంతో డిమాండ్ వస్తుందని ధీమాగా చెప్తున్నాడు. -
చరిత్ర సృష్టించిన ’బాహుబలి’ కలెక్షన్స్
-
కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కాకముట్టై
-
షర్మిల ప్రపంచ రికార్డు
-
బలపడీన అల్పపీడనం