రీల్స్‌ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! | Woman Creates Dance Reel at Ayodhya Saryu River | Sakshi
Sakshi News home page

రీల్స్‌ కోసం సరయూలో అశ్లీల నృత్యం..

Published Wed, Oct 11 2023 9:01 AM | Last Updated on Wed, Oct 11 2023 9:01 AM

Woman Creates Dance Reel at Ayodhya Saryu River - Sakshi

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు తరచుగా డ్యాన్స్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను పబ్లిక్‌గా రికార్డ్ చేస్తూ, హాట్‌ టాపిక్‌గా మారారు. ఇటువంటి వీడియోలకు లెక్కలేనన్ని వీక్షణలు, లైక్‌లు దక్కినప్పటికీ, అవి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.  

ఇదేకోవలో మతపరమైన ప్రదేశాలలో డ్యాన్స్ రీల్స్ చేయడం ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుంది. అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద ఒక మహిళ రీల్స్‌ కోసం నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. పింక్ సల్వార్ సూట్ ధరించిన ఈ మహిళ ‘జీవన్ మే జానే జానా’ అనే బాలీవుడ్ పాటకు  డ్యాన్స్ చేస్తూ కనిపించింది. 

సరయూలో పవిత్ర స్నానం చేసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో ఘాట్‌కి వస్తుంటారు. ఈ వీడియోను చూసిన చాలామంది పవిత్ర స్థలాన్ని అగౌరవపరిచిన మహిళపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అయోధ్య పోలీసులు ఆమెపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు  తెలిపారు. 
 

కొన్ని నెలల క్రితం సరయూ నది ఘాట్‌పై ఒక యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆమె నదిలో ‘పానీమే ఆగ్ లగానీ హై’పాటకు ఆ డ్యాన్స్ చేస్తుండగా ఇతరులు ఆమెను అలా చూస్తూనే ఉండిపోయారు. ఈ వీడియో తమ మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉందని, ప్రార్థనా స్థలాల్లో ఇలాంటి నృత్యాలు చేయకూడదని పలువురు నిరసన వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా కొంత కాలంగా మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేసే ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి చేష్టలు ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదకరంగానూ మారుతున్నాయి. 
ఇది కూడా చదవండి: శాంతియుత దేశం ఏది? అశాంతికి నిలయమెక్కడ? భారత్‌ పరిస్థితేంటి?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement