
‘వామ్మో ఇదేం పాటరా నాయానో జుట్టు పీక్కోవాలనిపిస్తోంది’ అని ఈ పెద్దావిడ పాడిన పాట విన్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఎందుకంటే కొత్తగా పెళ్లైన జంటకు స్వాగతం పలుకుతూ సరదాగా పాట పాడమని అడిగినందుకు వాళ్లకు చుక్కలు చూపించింది. ఆ కొత్త జంటను సిగ్గు, వికారంతో గోడకు అతుక్కు పోయేలా చేసింది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ’ అంటూ అదో రకమైన గొంతుకతో ఆ పాటను ఆ మహిళ ఖూనీ చేసింది.
చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. అచ్చం నాలాగే ఉన్నాడు!
ఆమె పాటకు కోరస్ కూడా ఇవ్వడంతో అక్కడ ఉన్నవారికి మూర్చ వచ్చినంత పనైంది. ఆమె స్వరం వింటూ ఏం చేయాలో పాలుపోక మనస్సు కకావికలమై బంధువులు పడిన అవస్థ వర్ణనాతీతం. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కొత్త కోడలికి ఇంతకు మించి స్వాగతం ఏముంటుంది. ఎవరినీ తొందరపడి పాడమని అడగకండి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment