function
-
గ్రాండ్‌గా బిగ్‌బాస్ మానస్ భార్య సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
Mahishivan: సీరియల్ నటి మహేశ్వరి కుమారుడి ఊయల ఫంక్షన్ (ఫోటోలు)
-
ఉగాది రోజు ఆట సందీప్- జ్యోతిరాజ్ నూతన గృహప్రవేశం (ఫొటోలు)
-
Amala Paul Baby Shower: గ్రాండ్‌గా హీరోయిన్ అమలాపాల్ సీమంతం ఫోటోలు వైరల్
-
Mahishivan: జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్.. ఏడ్చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’
దేశంలోని చాలా ప్రాంతాల్లో హోరెత్తించే పాటలకు నృత్యాలు లేకుండా వివాహాలు పూర్తికావు. పెళ్లిలో వధువు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక పెళ్లి కూతురే స్వయంగా నృత్యం చేస్తే, అతిథుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇటువంటి సమయంలో తమ ఇంటి అమ్మాయి వేరొకరి ఇంటికి వెళ్లిపోతున్నదనే బాధ ఆడపిల్ల తరపువారి ముఖాల్లో కనిపిస్తుంది. పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వధువు తన హల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో ఆమె, ఆమె తల్లి కూడా రోదిస్తుంటారు. అలా ఏడుస్తూనే పెళ్లికుమార్తె డాన్స్ చేస్తూ ఉంటుంది. దేశిమోజిటో అనే పేరుతో సోషల్‌మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వధువు డాన్స్ చేస్తూవుంటుంది. అక్కడే ఉన్న ఆమె బంధువులు ఆమె నృత్యాన్ని చూస్తుంటారు. ఇంతలో పెళ్లి కుమార్తె భావోద్వేగానికి లోనవుతోంది. కన్నీళ్లను నియంత్రించుకోలేకపోతుంది. పక్కనేవున్న తల్లి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతటి భావోద్వేగాల మధ్య కూడా వధువు ఆపకుండా తన నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ వీడియోకు 3.5 లక్షలకుపైగా వ్యూస్ దక్కాయి. యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి డ్రామాలు పెరిగిపోయాయని, అందుకే ఈ రోజుల్లో సినిమాలు ఆడడం లేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది బాలీవుడ్ అందించిన బహుమతి అని మరొక యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు.. Performance nahi rukni chahiye pic.twitter.com/JxNEEbbP4U — desi mojito 🇮🇳 (@desimojito) December 7, 2023 -
నటి సుమలత కుమారుడి సంగీత్ వేడుక (ఫొటోలు)
-
RRR: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన డీఓపీ సెంథిల్ కుమార్ (ఫొటోలు)
-
Poorna Latest Photos: కేరళ సంప్రదాయంలో పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్
-
ఘనంగా ‘స్వామిరారా’ నటి పూజా రామచంద్రన్ సీమంతం..ఫోటోలు వైరల్
-
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం ఫంక్షన్...ఫోటోలు వైరల్
-
మొదట మెకానిక్ కావాలనుకున్నాను.. కానీ : మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): తొలుత మెకానిక్ కావాలనుకున్నానని..అయితే ఫిజిక్స్ మాస్టార్‌ను చూసి ఉపాధ్యాయుడిగా మారాలనుకున్నానని మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. శనివారం రాత్రి కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బాల్యదశలో ఆలోచనాశక్తి వివిధ రకాలుగా ఉంటుందని.. చూసే ప్రతీ ప్రొఫెసన్‌లో తాముండాలని అనుకుంటారన్నారు. చిన్నారులకు గొప్ప వ్యక్తులు, విజేతలను ప్రత్యక్షంగా చూపించాలన్నారు. తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. బాల్యదశ నుంచి టాపర్‌గా ఉండడంతో డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా మారానన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీవెనతో రెండోసారి మంత్రిని అయ్యానని చెప్పారు. మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నారన్నారు. విశ్రాంత జడ్జిలు, డాక్టర్లను వేదికపైకి పిలిపించి ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు వెంకటదొర, రామ్మోహన దొర, మున్సిపల్ చైర్మన్ బి. గిరిబాబు, ఎంఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చదవండి: మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే! -
జీవితంలో రోజుకు ఒకసారైనా ఇలా చేయండి!!
పార్టీలు , పెళ్లిళ్లలో డీజేలు, డ్యాన్స్‌లు చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా మోహన భోగరాజు పాడిన బుల్లెట్ బండి పాటతో ఈ డ్యాన్స్‌లకు మరింత క్రేజ్ పెరిగింది. ఏ ఫంక్షన్లో చూసినా, ఏ మేరేజ్లో చూసినా పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం, అది ట్రెండింగ్‌లో నిలవడం సర్వ సాధారణంగా చూస్తున్నాం. తాజాగా ఒక పెళ్లిలో ఒక చిన్నారి డ్యాన్స్ ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 2011లో వచ్చిన తమిళ మూవీ మంబియట్టాన్ లోని ఈ పాటకు ఇద్దరు అబ్బాయిలతో కలసి ఒకచిన్నారి డ్యాన్స్ అదరగొట్టేసింది. తన స్టెప్పులతో అక్కడున్న వారందరలోనూ ఫుల్ ఎనర్జీ నింపేసింది. దీంతో తమన్ మేనియాకు ఫ్యాన్స్ మరోసారి మెస్మరైజ్ అయిపోతున్నారు. ఎంత యాక్టివ్‌గా డ్యాన్స్ చేసింది పాప అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. రోజుకు ఒక్కసారైనా ఇలాంటి స్టెప్స్ వేస్తే..చాలు.. ఒత్తిడి అంతా మాయం అంటూ కమెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి.. ఈ వీకెండ్మూడ్లో మీకు భలే ఎంటర్ టైన్మెంట్.. Damn that little girl🔥🔥 pic.twitter.com/r1MFxvGJ9Y — Miss Disappear! (@_SecretStalker_) March 24, 2022 -
పాపం కొత్త జంట.. ఆమె పాటకు సిగ్గుతో గోడకు అతుక్కుపోయారు!
‘వామ్మో ఇదేం పాటరా నాయానో జుట్టు పీక్కోవాలనిపిస్తోంది’ అని ఈ పెద్దావిడ పాడిన పాట విన్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఎందుకంటే కొత్తగా పెళ్లైన జంటకు స్వాగతం పలుకుతూ సరదాగా పాట పాడమని అడిగినందుకు వాళ్లకు చుక్కలు చూపించింది. ఆ కొత్త జంటను సిగ్గు, వికారంతో గోడకు అతుక్కు పోయేలా చేసింది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ’ అంటూ అదో రకమైన గొంతుకతో ఆ పాటను ఆ మహిళ ఖూనీ చేసింది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. అచ్చం నాలాగే ఉన్నాడు! ఆమె పాటకు కోరస్ కూడా ఇవ్వడంతో అక్కడ ఉన్నవారికి మూర్చ వచ్చినంత పనైంది. ఆమె స్వరం వింటూ ఏం చేయాలో పాలుపోక మనస్సు కకావికలమై బంధువులు పడిన అవస్థ వర్ణనాతీతం. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కొత్త కోడలికి ఇంతకు మించి స్వాగతం ఏముంటుంది. ఎవరినీ తొందరపడి పాడమని అడగకండి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: "నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!" -
బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు
-
నిర్మాత వి.దొరస్వామిరాజు బుక్ రిలీజ్ ఫంక్షన్ ఫోటోలు
-
సెయింట్ జాన్స్ స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
-
డీజే శబ్దాల మధ్య డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి
భీమదేవరపల్లి : స్నేహితుడి వివాహ వేడుకల్లో యువకులందరూ కలుసుకుని ఉత్సాహంగా గడిపారు. పెళ్లి ఊరేగింపులో డీజే శబ్దాల నడుమ డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రంగయపల్లికి చెందిన ఓ యువకుడి వివాహ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి డీజేతో ఊరేగింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆశాడపు రాజేష్(22) ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేపట్లోనే ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రి తరలించేలోపే మృతి చెందాడు. రాజేష్ డిగ్రీ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ కావాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ‘పోలీసు ఉద్యోగం సంపాదించి పోషిస్తావనుకుంటే మమ్ముల్ని విడిచి పోతున్నావా కొడుకా’.. అంటూ రాజేష్ తల్లిదండ్రులు లక్ష్మి, దశరథం రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్సై మురళీధర్ తెలిపారు. -
ప్లీనరీకి తరలిన టీఆర్ఎస్ నాయకులు
సంస్థాన్‌నారాయణపురం : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీకి మండల కేంద్రం నుంచి పలువురు టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బోల్ల శివశంకర్, పాశం ఉపేందర్‌రెడ్డి, చండూరు మార్కెట్ చైర్మన్ కరంటోతు జగ్రాంనాయక్, రాచకొండ రాజు, నలపరాజు రమేష్, కడ్తాల కృష్ణ, సుర్వి యాదయ్య, వీరమళ్ల వెంకటేష్, పందుల శంకరయ్య ఉన్నారు. మోత్కూరు : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీని శుక్రవారం మోత్కూరు నుంచి పలువురు నాయకులు తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొణతం యాకూబ్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నెబోయిన రమేష్, ఎంపీటీసీ జంగ శ్రీను, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోమల్లు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు బయ్యని పిచ్చయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బటి శైలజ, పట్టణ అధ్యక్షురాలు కట్ట ఇంద్రజ్యోతి, మార్కెట్ డైరెక్టర్ బొల్లపల్లి వెంకటయ్య, ఓయూ జేఏసీ నాయకులు మర్రి అనిల్, నాయకులు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ : హైదరాబాద్‌లోని కొంపెల్లిలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం భారీగా తరలి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ వెస్ చైర్మన్ చిరందాసు ధనుంజయ, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్, ముత్యాల భూపాల్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, గుండెబోయిన అయోధ్య, ముప్పిడి శ్రీనివాస్, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, కొత్త పర్వతాలు, జింకల కృష్ణ, సుర్వి మల్లేష్, ఎండి.బాబాషరీఫ్, వీరమళ్ల సత్తయ్య, డీఆర్. రాము, బొడిగె బాలకృష్ణ, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, శంకర్, ఖలీల్ ఉన్నారు. రామన్నపేట : హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీకి రామన్నపేట నుంచి పలువురు నాయకులు శుక్రవారం తరలివెళళ్లారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ప్లీనరీకి వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బందెల రాములు, బత్తుల కృష్ణగౌడ్, గంగుల కృష్ణారెడ్డి, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, ఆకవరపు మధుబాబు, ముక్కాముల దుర్గయ్య, రామిని రమేష్, గుత్తా నర్సిరెడ్డి, జెల్లా వెంకటేశం, ఎడ్ల మహేందర్‌రెడ్డి, నంద్యాల భిక్షంరెడ్డి, లక్ష్మణ్, ఎండీ నాజర్, పురుషోత్తంరెడ్డి ఉన్నారు. -
శుభకార్యానికి వెళ్తూ...అనంతలోకాలకు
- రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మెరుగుదొడ్డి(సి.బెళగల్): బంధువుల శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కోడుమూరు మండలం మెరుగుదొడ్డి గ్రామానికి కురువ తిమ్మప్ప(32) గ్రామం నుంచి తన భార్య తరఫు బంధువుల వివాహానికి కోసిగి మండలం దొడ్డిమేకల గ్రామానికి స్కూటర్‌పై బయలుదేరి వెళ్లాడు. ఎమ్మిగనూరు శివారులోని కోసిగి రోడ్డులో స్కూటర్ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇంటి నుంచి వివాహానికి వెళ్లేటప్పుడు గోనెగండ్ల మండలం ఎర్రకోట గ్రామంలో మరొక బంధువుల వివాహానికి తిమ్మప్ప తల్లి నాగమ్మను వదిలివెళ్లినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య మహలింగమ్మ, మతిస్థిమిం సరిగాలేని కుమారుడు మహేంద్ర ఉన్నారు. -
గోమాతకు సీమంతం
పుట్లూరు : పర్వదినాలతోపాటు, ప్రతి నిత్యం గోమాతను పూజిస్తారు. ఈ క్రమంలోనే పుట్లూరు మండలంల కేంద్రంలో బుధవారం రాత్రి గోమాతకు సీమంతం నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు గ్రామస్తులు. ముక్కోటి దేవతలు కొలువుదీరిన గోవుకు సీమంతం చేయడంతో గ్రామానికి, భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్పారు. దీంతో ఆవు యజమాని రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆవుకు ప్రత్యేక అలంకరణగావించారు. చీరె, పసుపు కుంకుమలు పెట్టి, మహిళలు సీమంతపు పాటలు పాడారు. కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒంగోలు జాతికి చెందిన ఈ ఆవు గతంలో అందాల పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు గెలుచుకుంది. -
అమిత్ షా సభలో రెచ్చిపోయిన పటేదార్లు
సూరత్ : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సభలో పటేదార్లు విరుచుకుపడ్డారు. విద్యా ఉద్యోగాల్లో తమకు కోటా కల్పించాలంటూ హార్థిక్ పటేల్ మద్దతు దారులు సభలోని కుర్చీలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని నేతృత్వంలో కొత్తగా ఎంపికైన పటేదారు మంత్రులను గౌరవించడానికి ఈ సభను ఏర్పాటుచేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేవలం బీజేపీ బలాన్ని చూపించడానికే కాక, పటేల్ కమ్యూనిటీతో మళ్లీ బీజేపీ కనెక్ట్ అవుతుందనే సంకేతాలతో ఈ భారీ సభను ఏర్పాటుచేశారు. కొంతమంది పటేదార్లు నేతలు కూడా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అమిత్ షా స్టేజ్ మీదకు వచ్చిన అనంతరం కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రసంగించే సమయంలో ఈ రగడ చెలరేగింది. హార్థిక్, హార్థిక్ అంటూ నినాదాలు చేస్తూ సభలో ఏర్పాటుచేసిన కుర్చీలను విరగొట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు 40 మంది పటేదార్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు నినదించిన హార్థిక్ పటేల్, పటేదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గతేడాది 40 రోజులు ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే. పటేదార్ల కమ్యూనిటీని హర్ట్ చేస్తే, ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. ఈ విషయంపై అమిత్ షాకు కూడా ఫేస్బుక్లో హార్థిక్ చాలెంజ్ చేశాడు. రిజర్వేషన్ల కోసం పటేల్ కమ్యూనిటీ చేస్తున్న ఆందోళనకు దూరంగా ఉండాలని, తాను చనిపోయేంత వరకు ఈ ఉద్యమం ఆగదని వ్యాఖ్యానించారు. -
మోహన్‌బాబు 40 సినీవసంతాల వేడుక
డాబాగార్డెన్స్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాధారణ వ్యక్తిగా ప్రవేశించి, క్రమశిక్షణ గల నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబు 40 సినీ వసంతాల వేడుక విశాఖలో జరగనుంది. వచ్చే నెల 17న కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండవగా నిర్వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శినీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించడానికి మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు మంగళవారం విచ్చేసి వేదికను పరిశీలించి ఖరారు చేశారు. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానుండడంతో బస ఏర్పాట్లపై మంచు విష్ణు సమీక్షించారు. -
జగన్ రాకతో సందడి
-
కారులో శవం...
పట్టుకోండి చూద్దాం హాల్లో టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతున్నాడు సందీప్. మధ్య మధ్యన ద్వారం వైపు చూస్తున్నాడు. అప్పుడప్పుడూ గడియారం వైపు చూస్తున్నాడు. భారంగా నిట్టూరుస్తున్నాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. పొద్దుననగా ఫంక్షన్‌కి వెళ్లింది కళ్యాణి. ఫంక్షన్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది. కానీ అయిదవుతున్నా రాలేదు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. అందుకే సందీప్‌కి టెన్షన్‌గా ఉంది. ‘‘కాఫీ ఇవ్వ మంటారా అయ్య గారూ’ అంది లోనికి వస్తూనే పనిమనిషి కాంతమ్మ. వద్దు అన్నట్టు తలూ పాడు. ‘‘కళ్యాణి జాడ తెలియడం లేదు కాంతమ్మా’’ అన్నాడు దిగులుగా. ‘‘ఏదో ఫంక్షన్‌కి వెళ్తాను అన్నారుగా బాబూ. అక్కడ్నుంచి ఇంకెక్కడికైనా వెళ్లారేమో’’ అంది కాంతమ్మ. ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టు కున్నాడు సందీప్. ఫంక్షన్‌కి కళ్యాణి అన్నయ్యవాళ్లు కూడా వెళ్లి ఉంటారు. వాళ్ల ఇల్లు అక్కడికి దగ్గరే. అందరూ కలిసి అక్కడికిగానీ వెళ్లారేమో అను కుంటూ సెల్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ అతడు డయల్ చేసేలోపే అది రింగ య్యింది. కొత్త నంబర్. తీసి హలో అన్నాడు. ‘‘సందీప్గారేనా మాట్లాడేది?’’ అంది అవతలి నుంచి ఓ మగమనిషి స్వరం. ‘‘అవును. మీరెవరు’’ అన్నాడు ఆతృతగా. ‘‘నేను కుకట్ పల్లి ఎస్సైని మాట్లాడుతున్నాను. మీ భార్యను ఎవరో హత్య చేశారు. మీరు వెంటనే రావాలి.’’ అవాక్కయిపోయాడు సందీప్. దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే ‘‘కళ్యాణీ’’ అంటూ బయటకు పరుగుదీశాడు. కుకట్‌పల్లికి కొన్ని కిలోమీటర్ల దూరంలో... ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉంది కారు. దానిలో డ్రైవింగ్ సీట్లో వెనక్కి వాలి ఉంది కళ్యాణి. ఎవరో దారుణంగా పీక కోసేశారు. ఛాతిలో కూడా కత్తిపోట్లు ఉన్నాయి. తట్టుకోలేక పోయాడు సందీప్. కళ్యాణీ అంటూ గుండెలవి సేలా ఏడుస్తుంటే పోలీసుల మనసులు సైతం కదిలిపోయాయి. అతి కష్టమ్మీద అతణ్ని ఊరుకో బెట్టగలిగారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, సందీప్‌ని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు. ‘‘మీకుగానీ మీ భార్యకిగానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా సందీప్‌గారూ?’’ ఎస్సై రవికిరణ్ అలా అడగ్గానే మరోసారి భోరుమన్నాడు సందీప్. ‘‘లేరు సర్. తనకైతే అస్సలు ఉండరు. ఎందుకంటే తను చాలా సాఫ్ట్. నాతో కూడా ఎప్పుడూ పోట్లాడదు. ఎంతో కూల్’’ అన్నాడు కళ్లొత్తుకుంటూ. ‘‘అంత కూల్‌గా ఉండే మనిషిని ఎవరు చంపుతారు సందీప్ గారూ? ఇది అనుకోకుండా జరిగినట్టు అనిపించడం లేదు. ఎవరో కావాలని కసితో చేసినట్టు అనిపిస్తోంది.’’ ‘‘ఒకవేళ దొంగలెవరైనా ఈ పని చేశారంటారా సర్. తన ఒంటిమీద నగలు కూడా మాయమయ్యాయి కదా?’’ అన్నాడు సందీప్ సాలోచనగా. ‘‘లేదు. ఇది కచ్చితంగా ఎవరో తెలిసినవారి పనే’’ అన్నాడు రవికిరణ్. ‘‘ఎందుకలా అంటున్నారు సర్?’’ అర్థం కాక అడిగాడు సందీప్. ‘‘ఎందుకంటే తన శవం దొరికిన ప్రదేశాన్ని చూశారుగా? మారుమూల ప్రాంతం. నిర్మానుష్యంగా ఉంది. ఫంక్షన్ నుంచి ఇంటికి రావాల్సిన మనిషి అలాంటి చోటికి ఎందుకెళ్తుంది? ఎవరో తీసుకెళ్లి ఉండాలి. అలా అని ఎవరు పడితే వాళ్లు తీసుకెళ్తే ఎందుకెళ్తుంది? తెలిసినవాళ్లు అయితేనే వెళ్తుంది. ఒకవేళ తనకి వేరే ఎవరితోనైనా...’’ ఇన్స్పెక్టర్ భావం అర్థమై అంతెత్తున లేచాడు సందీప్. ‘‘ఏం మాట్లాడుతున్నారు సర్? తన గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. నా కళ్యాణి నన్ను తప్ప ఎవరినీ ప్రేమించదు.’’ ‘‘కానీ మీరు మాత్రం వేరే వాళ్లని ప్రేమించ గలరు. పెళ్లి చేసుకోగలరు.’’ చివ్వున చూశాడు సందీప్. ఇన్స్పెక్టర్ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు. ‘‘ఏంటలా చూస్తున్నారు? మీరు డబ్బు కోసం వేరే అమ్మాయిని ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది మీ భార్యకి తెలిసి పోయింది. మీతో గొడవపడింది. మీరు మారి పోయినట్టు నటించారు. ఇక ఎప్పుడూ మోసం చేయను అని మాట కూడా ఇచ్చారు. ఆ నమ్మకమే ఆమె ప్రాణాలు తీసేసింది.’’ విస్తుపోయాడు సందీప్. ‘‘లేదు సర్, మీరు పొరపాటు పడుతున్నారు.’’ ‘‘నేను ఎంక్వయిరీ చేశాను మిస్టర్. మీ మధ్య జరిగిన గొడవ లన్నీ కళ్యాణి ఫ్రెండ్ చెప్పింది. ఫంక్షన్ అయ్యే టైమ్‌కి మీరు వెళ్లారు. ఎవరికీ కనిపించకుండా తనని తీసుకుని బయలుదేరారు. తనని చంపేసి, కారుతో సహా అక్కడ వదిలేశారు. మీ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే ఫంక్షన్ జరిగిన ప్రదేశంలో, శవం దొరికిన ప్రదేశంలో కూడా మీరు ఉన్నారని నిర్ధారణ య్యింది. కాబట్టి ఇక తప్పించుకోవాలని చూడకండి’’... చకచకా చెప్పాడు రవికిరణ్. ఇక వాదించలేదు సందీప్. ‘‘తను నా గురించి అందరికీ చెప్పి గొడవ పెడతానంది. అందుకే మారినట్టు నటించి నోరు నొక్కేశాను. కానీ తనంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను పావనిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కళ్యాణి ఉండగా అది సాధ్యం కాదు. అందుకే చంపే శాను. కానీ ఈ విషయం మీకెలా తెలిసింది సర్? అసలు నా మీద మీకు అనుమానం ఎలా కలిగింది?’’ అన్నాడు ఆశ్చర్యంగా. సందీప్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా... ‘‘కానిస్టేబుల్... సర్ని లోపలెయ్యి’’ అంటూ బయటికెళ్లిపోయాడు. పోనీ మీరు చెప్పండి. సందీపే హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు??? జవాబు: మీ భార్య హత్యకు గురయ్యింది, రమ్మని పిలవగానే సందీప్ ఎక్కడికి రావాలి అని అడగలేదు. ఫోన్ పెట్టేసి తిన్నగా స్పాట్‌కి వెళ్లిపోయాడు. దాంతో అతడి చరిత్ర మొత్తం బయటికి లాగాడు ఇన్స్పెక్టర్.