రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం | 'Air India Day' tomorrow; tickets to be offered for Rs 100 for five days | Sakshi
Sakshi News home page

రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం

Published Wed, Aug 27 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం

రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ రూ.100కే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఇండియా ఆఫర్‌ను ప్రకటించింది.  ఎయిర్ ఇండియా డే సందర్భంగా ఈ పరిమితి కాల ఆఫర్‌ను ఇస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 2007, ఆగస్టు 27న ఎయిర్ ఇండియా విలీనమైంది. దీంతో ఆగస్టు 27ను ఎయిర్ ఇండియా దినోత్సవంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని ఎయిర్ ఇండియా జరుపుకోవడం ఇదే మొదటిసారి.

 ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులిస్తామని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎయిర్ ఇండియా ఆఫర్‌లో భాగంగా రూ.100కే (ఇంధన సర్‌చార్జీ, సంబంధిత పన్నులు. ఫీజులు) విమాన టికెట్లను ఆఫర్ చేస్తారు. వీటిని ఈ నెల 27(నేటి) నుంచి 31 వరకూ మాత్రమే బుక్ చేయాలని, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement