Air India Day
-
దుబాయ్ టికెట్ రూ.7,777కే
న్యూఢిల్లీ: దేశీ, విదేశీ రూట్లలో వచ్చే నెల నుంచి కొత్త విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం తెలిపింది. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ 1 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ముంబై– దుబాయ్– ముంబై మార్గంలో, జూన్ 2 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ఢిల్లీ–దుబాయ్–ఢిల్లీ మార్గంలో రెండు కొత్త బీ787 డ్రీమ్లైనర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది. ప్రమోషనల్ ధరలో భాగంగా 2019 జూలై 31 వరకు దుబాయ్‌కు ఒకవైపు ఎకానమీ క్లాస్ ధరను రూ7,777గా నిర్ణయించినట్లు తెలియజేసింది. దేశీయంగా ఢిల్లీ–భోపాల్–ఢిల్లీ రూట్లో వారానికి 14 విమాన సర్వీసుల నుంచి 20 విమాన సర్వీసులకు అదేవిధంగా ఢిల్లీ–రాయ్‌పూర్–ఢిల్లీ రూట్లో ఉన్న వారానికి 7 విమాన సర్వీసులను వారానికి 14 విమాన సర్వీసులకు పెంచామని తెలిపింది. -
రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ రూ.100కే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఇండియా ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ ఇండియా డే సందర్భంగా ఈ పరిమితి కాల ఆఫర్‌ను ఇస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 2007, ఆగస్టు 27న ఎయిర్ ఇండియా విలీనమైంది. దీంతో ఆగస్టు 27ను ఎయిర్ ఇండియా దినోత్సవంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని ఎయిర్ ఇండియా జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులిస్తామని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎయిర్ ఇండియా ఆఫర్లో భాగంగా రూ.100కే (ఇంధన సర్‌చార్జీ, సంబంధిత పన్నులు. ఫీజులు) విమాన టికెట్లను ఆఫర్ చేస్తారు. వీటిని ఈ నెల 27(నేటి) నుంచి 31 వరకూ మాత్రమే బుక్ చేయాలని, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.